తెరి కాంబినేషన్‌లో మరో చిత్రం? | Ilayathalapathy Vijay Atlee Kalaipuli S Thanu | Sakshi
Sakshi News home page

తెరి కాంబినేషన్‌లో మరో చిత్రం?

Published Fri, Jul 22 2016 1:55 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

తెరి కాంబినేషన్‌లో మరో చిత్రం?

తెరి కాంబినేషన్‌లో మరో చిత్రం?

 తెరి చిత్ర కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుందా? ఆ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. తెరి ఇళయదళపతి విజయ్ కేరీర్ తాజా బ్లాక్‌బస్టర్ చిత్రం. ఆయన 59వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఇప్పుడు రజనీకాంత్‌తో భారీ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కలైపులి ఎస్.థానునే తెరి చిత్ర నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం.
 
 తెరి చిత్రం తరువాత దర్శకుడు అట్లీ తదుపరి చిత్రానికి కథను తయారు చేసుకున్నారు. దీన్ని ఏ హీరోతో తెరకెక్కించేది త్వరలోనే వెల్లడిస్తానని తెరి చిత్ర మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలిపారు. అయితే ఆ తరువాత అట్లీ చిత్ర హీరో విజయ్ అనీ, కాదు నటుడు సూర్య అనే అనధికార ప్రచారం చాలా జరిగింది. ఏ హీరోతో చిత్రం చేయాలన్న కన్ఫ్యూజన్‌లో అట్లీ ఉన్నారనే ప్రచారం మరో పక్క జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా  విజయ్ 61వ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించనున్నట్లు, దాన్ని తెరి చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థానునే నిర్మించడానికి రెడీ అయ్యారని కోలీవుడ్ వర్గాల ప్రచారం.
 
 రజనీకాంత్ హీరోగా నిర్మించిన కబాలి చిత్రం విడుదల అనంతరం నిర్మాత థాను విజయ్, అట్లీ కాంబినేషన్‌లో నిర్మించనున్న చిత్రం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ తను 60వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారన్నది గమనార్హం. భరతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement