విజయ్ చిత్రానికి దర్శకుడెవరు? | ilayathalapathy vijay 60th film director ? | Sakshi
Sakshi News home page

విజయ్ చిత్రానికి దర్శకుడెవరు?

Published Sun, Jul 12 2015 8:49 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

విజయ్ చిత్రానికి దర్శకుడెవరు?

విజయ్ చిత్రానికి దర్శకుడెవరు?

ఇళయదళపతి విజయ్ 60వ చిత్రానికి రీచ్ అవుతున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడెవరన్నదే ఆసక్తిగా మారింది. విజయ్ కోసం ముగ్గురు దర్శకులు కథలు సిద్ధం చేస్తుండడం విశేషం.వారిలో ఇళయదళపతి ఎవరికి పచ్చజండా ఊపుతారన్నదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.విజయ్ తన 58వ చిత్రం పులిని పూర్తి చేశారు. హన్సిక, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించారు. కన్నడ సూపర్ స్టార్ సుధీప్ ప్రతినాయకుడిగా నటించారు.

షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. కాగా విజయ్ 59వ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే మొదలయ్యాయి. సమంత,ఎమిజాక్సన్ నాయికలు. నటి సునైనా అతిథి పాత్రలో మెరవనుందట. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్‌థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తదుపరి చిత్రమే విజయ్ 60 వ చిత్రం. ఈ చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కథను సిద్ధం చేస్తున్నారు.

ఆయన ఇంతకు ముందు ఇళయదళపతికి తుపాకీ, కత్తి లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించారన్నది గమనార్హం.అలాగే నటుడు, దర్శకుడు శశికుమార్ విజయ్‌కి బ్రహ్మాండమైన కథను రెడీ చేశారని,ఆయనకు విజయ్ ఓకే చెప్పారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో నట దర్శకుడు ఎస్‌జే.సూర్య పేరు తెరపైకు రావడం విశేషం.ఈయన విజయ్ ఇటీవల కలిసి కథా చర్చలు జరిపినట్లు,ఎస్‌జే.సూర్య చెప్పిన కథ విజయ్‌కు తెగ నచ్చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ ముగ్గురిలో విజయ్ ఎవరికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారన్నదే ఆసక్తిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement