Ilayathalapathy Vijay
-
ఈ నటి చాలా లక్కీ అట..!
సాక్షి, చెన్నై: ముంబై ముద్దుగుమ్మ సాయేషా సైగల్ ఇళయదళపతి విజయ్‌తో జత కట్టనుంది. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్ సరసన నటించే అవకాశం వచ్చింది. విజయ్ తన 62వ చిత్రంలోనూ ఇద్దరు ముద్దుగుమ్మలట. తెరి సినిమాలో సమంత, ఎమీజాక్సన్లతో యువళగీతాలు పాడేశారు. మెర్శల్ చిత్రంలో ఏకంగా సమంత ,కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్‌లతో డ్యూయెట్లు పాడేశారు. ప్రస్తుతం తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్లో తుపాకీ, కత్తి చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌కు జంటగా నటి కీర్తిసురేశ్ ఎంపికయ్యారు. ఈ బ్యూటీతో సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలైంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఉంటుందన్న సమాచారాన్ని చిత్ర యూనిట్ ఆలస్యంగా వెల్లడించింది. వనమగన్ చిత్రంలో తన నటనలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి, డాన్స్‌తో దుమ్మురేపిన ముంబై చిన్నది సాయేషా సైగల్. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్‌తో నటించే అవకాశం తలుపు తట్టింది. ఇప్పటికే కార్తీ, విజయ్‌సేతుపతిల సరసన నటిస్తూ బిజీగా ఉన్న సాయేషాకు విజయ్‌తో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ బ్యూటీది చిత్రంలో చాలా ప్రాధ్యానత ఉన్న పాత్ర అని సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. -
సూపర్‌స్టార్, ఇలయదళపతి కలిసిన వేళ
తమిళసినిమా; స్టార్ నటు లు ఈ మధ్య అభిమానులకు స్వీట్ షాక్ ఇస్తున్నా రు. ఇటీవల తన చిరకాల మిత్రుడు కమలహాసన్‌ను కలవడానికి ఆయన కార్యాలయానికి వెళ్లి అందర్నీ ఆసక్తి గురి చేశారు రజనీ కాంత్. కాగా ఇళయదళపతి విజయ్ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిసి ఇరువురి అభిమానులకు ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 2.ఓ షూటింగ్ స్థానిక ఎంజీఆర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆవరణలో జరుగుతోంది. అదే విధంగా విజయ్ నటిస్తున్న తాజా చిత్రం భైరవా చివరి రోజు షూటింగ్ అదే ఇన్స్టిట్యూట్లో జరిగింది. చిత్ర షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టిన తరువాత సమీపంలో షూటింగ్లో ఉన్న సూపర్‌స్టార్‌ను విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. 10 నిమిషాల సేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. అయితే రజనీకాంత్ 2.ఓ చిత్ర గెటప్‌లో ఉండడం వల్ల విజయ్ ఆయనతో ఫొటో దిగలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
విజయ్‌కు గాలం వేస్తున్న యువనటి
విజయాలు ఎన్ని అందుకున్నా స్టార్డమ్ రావాలంటే స్టార్ హీరోలతో రొమాన్స్ చేయాల్సిందే. అదే తారక మంత్రం అని భావించిన వర్ధమాన నాయకి మంజిమామోహన్ ఆ ప్రయత్నాల్లో పడ్డట్టు కోడంబాక్కం వర్గాల మాట. మాలీవుడ్‌లో బాల తారగా పరిచయం అయిన, ఆ తరువాత కథానాయకిగా ఎదిగిన నటి మంజిమామోహన్. దర్శకుడు గౌతమ్ మీనన్ ద్వారా అచ్చయం ఎన్బదు మడమైయడా చిత్రంతో ఒకే సారి తమిళం, తెలుగు భాషలలో(తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో) పరిచయమైంది. ఈ చిత్రం రెండు భాషల్లోనూ ప్రేక్షకాదరణ పొందడంతో మంజిమామోహన్‌కు మంచి గుర్తింపే లభించింది. కాగా ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌ప్రభుకు జంటగా ముడిచూడ మన్నన్ చిత్రంలో నటిస్తోంది. తదుపరి గౌరవ్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇలా కోలీవుడ్‌లో పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో నటి కీర్తీసురేశ్‌కు పోటీగా మారాలన్న కోరుకుంటున్నట్లు సమాచారం. అంతే కాదు అందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. అందులో భాగంగా ప్రముఖ కథానాయకులతో నటించే అవకాశాల వేట మొదలెట్టినట్లు తెలిసింది. ఇటీవల ఒక భేటీలో తనకు నటుడు ఇళయదళపతి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనీ, తానాయన వీరాభిమానినని చెప్పి ఆయన దృష్టి తనపై పడే ప్రయత్నం చేసింది. అదే విధంగా ఆయనతో చిత్రం చేస్తున్న అట్లీ తదితర దర్శకులను కలిసి అవకాశాలు అడుగుతున్నారు. మరి ఈ మాలీవుడ్ భామ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే. -
సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఇళయదళపతి
సంచలన దర్శకుడు సెల్వరాఘవన్, ఇళయదళపతి విజయ్ కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుందా? దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. విజయ్ ప్రస్తుతం 60వ చిత్రం భైరవాలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. తదుపరి అట్లీ దర్శకత్వంలో శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.అదే విధంగా దర్శకుడు సెల్వరాఘవన్ ఎస్జే.సూర్య హీరోగా నెంజం మరప్పదిల్లై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఇళయదళపతి విజయ్ నటించనున్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. శివాజీగణేశన్ కుటుంబసభ్యులు వినాయక చవితిని విశేషంగా జరుపుకుంటారు. ఆ రోజు సన్నిహితులను అన్నైఇల్లం(శివాజీగణేశన్ నివాసం)కు ఆహ్వానించి విందునివ్వడం ఆనవాయితీ. అదే విధంగా ఈ వినాయక చవితి రోజున నటుడు విజయ్ ఆహ్వానించారని తెలిసింది. ఆయన శివాజీగణేశన్ అన్నై ఇల్లంలో జరిగిన వినాయకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారని సమాచారం. అయితే అప్పటికే దర్శకుడు సెల్వరాఘవన్ అన్నై ఇల్లంకు వచ్చారట. నటుడు ప్రభు విజయ్‌కి సెల్వరాఘవన్‌ను పరిచయం చేసి ఇద్దరినీ ఒక గదిలో కూర్చోపెట్టి దర్శకుడు కథ చెపుతారని అన్నారట. దీంతో సెల్లరాఘవన్ చెప్పిన కథ విజయ్‌కి బాగా నచ్చిందని, అయితే రెండో భాగంలో కొన్ని సూచనలను చెప్పి వాటిని డెవలప్ చేయమని చెప్పినట్లు సమాచారం. విజయ్,సెల్వరాఘవన్ కలిసినట్లు ఆయన తండ్రి కస్తూరిరాజా ధ్రువపరిచారు. దీంతో విజయ్ 62వ చిత్రాన్ని సెల్వరాఘవన్ దర్శకత్వంలో శివాజీ ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. -
తెరి కాంబినేషన్లో మరో చిత్రం
కబాలి చిత్రం ముందు వరకూ అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డుకెక్కిన చిత్రం తెరి. ఇళయదళపతి విజయ్ కాథానాయకుడిగా నటించిన ఆ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఆయన రెండో చిత్రం ఇది. సమంత, ఎమీజాక్సన్ నాయకిలుగా నటించిన తెరి చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు దర్శకుడు అట్లీ త్వరలోనే వెల్లడిస్తానని చెప్పి చాలా కాలమైంది. అప్పటి నుంచి నిరాధార ప్రచారాలు చాలానే జరిగాయి. తాజాగా అట్లీ కొత్త చిత్రం ఖరారయిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇదటుంచితే విజయ్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో సంఘమిత్ర అనే ఓ భారీ చారిత్రాత్మక కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ సన్నాహాలు చేసింది. ఆ చిత్ర కథ విజయ్‌కు నచ్చినా ఆ చిత్రంలో నటించడానికి కావలసిన కాల్షీట్స్ కేటాయించలేనని నిరాకరించినట్లు ప్రచారం జరిగింది. కాగా అదే సంస్థకు చిత్రం చేయడానికి విజయ్ సమ్మతించారన్నది తాజా సమాచారం. అయితే దీనికి సుందర్.సీ దర్శకుడు కాదు అట్లీ. అవును అట్లీ దర్శకత్వంలో మరోసారి నటించడానికి విజయ్ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం విజయా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న భైరవా చిత్రంలో నటిస్తున్న విజయ్ ఈ చిత్రాన్ని అక్టోబర్‌లోపు పూర్తి చేయాలని దర్శక నిర్మాతకు గడువు విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది విజయ్‌కు 60వ చిత్రం అన్న విషయం తెలిసిందే. అయితే అట్లీ విజయ్ 61వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారా? లేక ఆ తరువాత చిత్రం చేయనున్నారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సస్పెన్స్ వీడాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు. -
ఇళయదళపతి 60వ చిత్రం భైరవా!
ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ఏమిటన్నది ఇటు పరిశ్రమలోనూ అటు ఆయన అభిమానుల్లోనూ చాలా ఆసక్తి నెలకొంది. 59 చిత్రాలను పూర్తి చేసిన విజయ్ 60వ చిత్రం ఇది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ బ్యానర్ పై దివంగత ప్రఖ్యాత నిర్మాత బి.నాగిరెడ్డి ఆశీస్సులతో బి.వెంకటరాఘవరెడ్డి సమర్పణలో బి.భారతీరెడ్డి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు విజయ్‌తో అళగీయతమిళ్మగన్ చిత్రాన్ని తెరకెక్కించిన భరతన్ ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికి 70 శాతం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ చాలా గ్యాప్ తరువాత ద్విపాత్రాభినం చేస్తున్నట్లు తెలుస్తోంది. సంతోష్‌నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించకపోవడంతో రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దీంతో చిత్ర చిత్ర వర్గాలు వినాయకచవితి నాడు చిత్రం పేరును వెల్లడించనున్నట్లు ప్రకటించారు. అయితే ఒక్క రోజు ముందే చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్, విడుదల తేదీ లీక్ అయ్యి చిత్ర వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. విజయ్ జమిందారుల నాటి కోటు దుస్తులు ధరించి రిక్షాలో నిలబడిన ఫొటోతో కూడిన ఫస్ట్‌లుక్ మాత్రం ఆయన అభిమానుల్ని అలరిస్తోంది. ఇంతకూ ఈ చిత్రం పేరు ఏమిటన్నది చెప్పనేలేదు కదూ భైరవా. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండగ సందర్భంగా జనవరిలో విడుదల చేయనున్నట్లు ఆ పోస్టర్లో పేర్కొన్నారు. -
తెరి కాంబినేషన్లో మరో చిత్రం?
తెరి చిత్ర కాంబినేషన్లో మరో చిత్రం రూపొందనుందా? ఆ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. తెరి ఇళయదళపతి విజయ్ కేరీర్ తాజా బ్లాక్‌బస్టర్ చిత్రం. ఆయన 59వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఇప్పుడు రజనీకాంత్‌తో భారీ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కలైపులి ఎస్.థానునే తెరి చిత్ర నిర్మాత అన్న విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్లో మరో చిత్రం రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. తెరి చిత్రం తరువాత దర్శకుడు అట్లీ తదుపరి చిత్రానికి కథను తయారు చేసుకున్నారు. దీన్ని ఏ హీరోతో తెరకెక్కించేది త్వరలోనే వెల్లడిస్తానని తెరి చిత్ర మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో తెలిపారు. అయితే ఆ తరువాత అట్లీ చిత్ర హీరో విజయ్ అనీ, కాదు నటుడు సూర్య అనే అనధికార ప్రచారం చాలా జరిగింది. ఏ హీరోతో చిత్రం చేయాలన్న కన్ఫ్యూజన్లో అట్లీ ఉన్నారనే ప్రచారం మరో పక్క జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విజయ్ 61వ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించనున్నట్లు, దాన్ని తెరి చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థానునే నిర్మించడానికి రెడీ అయ్యారని కోలీవుడ్ వర్గాల ప్రచారం. రజనీకాంత్ హీరోగా నిర్మించిన కబాలి చిత్రం విడుదల అనంతరం నిర్మాత థాను విజయ్, అట్లీ కాంబినేషన్లో నిర్మించనున్న చిత్రం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ తను 60వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారన్నది గమనార్హం. భరతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. -
విజయ్‌తో రొమాన్స్‌కు కీర్తీ రెడీ
కాలేజ్ కుర్రాడిలా నటి కీర్తీసురేశ్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారట ఇళయదళపతి విజయ్. ఈయన నటిస్తున్న తాజా చిత్రాన్ని ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ విజయాప్రొడక్షన్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ 60వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి భరతన్ దర్శకుడు. ఇందులో విజయ్ ద్విపాత్రాభియనం చేస్తున్నారు. ఇంతకు ముందు ఇదే దర్శకుడి చిత్రం అళగీయ తమిళ్ మగన్ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారన్నది గమనార్హం. తాజా చిత్రం ఇంతకు ముందు ఎమ్జీఆర్ నటించిన ఎంగవీటి పిళ్లై చిత్రాన్ని మోడరేట్ చేసి రీమేక్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రం షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ పేరు నిర్ణయించని చిత్రం తదుపరి షూటింగ్‌కు చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ విజయ్ నటించే ఒక పాత్ర సన్నివేశాలనే చిత్రీకరించిన చిత్ర యూనిట్ ఇప్పుడు రెండో పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనుందట. ఈ పాత్రలో విజయ్ కళాశాల విద్యార్థిగా కనిపించనున్నారని తెలిసింది. ఈ పాత్ర కోసం తన శారీరక భాషను పూర్తిగా మార్చనున్నారట. అంతే కాదు 10 కిలోల బరువును తగ్గి చాలా యంగ్‌గా కొత్త గెటప్‌కు సిద్ధమవుతున్నారట. ఇంతకు ముందు తన చిత్రాల్లో గెటప్ కోసం పెద్దమార్పులు చేయని విజయ్ తాజా చిత్రం కోసం చాలా శ్రద్ధతీసుకుని నటిస్తున్నారని సమాచారం. ఈ పాత్రలో నటి కీర్తీసురేశ్‌తో రొమాన్స్ చేసే సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయంటున్నారు చిత్ర వర్గాలు. ఇందులో టాలీవుడ్ స్టార్ నటుడు జగపతిబాబు, సతీష్, డేనియల్ బాలాజీ, సుదన్సు పాండే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
తెరి సీక్వెల్ కథ రెడీ
తెరి చిత్రం రెండో భాగానికి కథ రెడీ అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు అట్లీ. ఇళయదళపతి విజయ్ నటించిన 59వ చిత్రం తెరి. సమంత,ఎమీజాక్సన్ కథానాయికలుగా నటించిన ఆ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మించారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం గురువారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు అట్లీ మాట్లాడుతూ మహిళల రక్షణ, చిన్నారులను బిచ్చకారుల్ని చేస్తున్న అంశాల ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రం తెరి అని తెలిపారు. ఇందులో విజయ్ పోలీసు అధికారిగా ఒక పాత్రను పోషించారన్నారు. దానితో పాటు ఇంకొన్ని పాత్రల్లో ఆయన్ని చూస్తారని, అయితే అ వి ఏమిటన్నది చిత్రం చూస్తే తెలుస్తుందని అన్నా రు. ఒక కుటుంబంలో అన్నయ్యగానీ తమ్ముడుగా నీ పోలీసు అధికారిగా ఉంటే వారు ఎలా భావి స్తారు, ఆ పోలీసు అధికారి ఇతరులను అ న్నయ్యలానో, తమ్ముడిలానో భావి స్తే ఆ భావన ఎలా ఉంటుందన్నది తెరి చిత్రం అన్నా రు. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చాలా నీట్‌గా కథకు ఎంత వరకు అవసరమో అంతే ఉంటాయన్నారు. అయితే ఆ యా క్షన్ సన్నివేశాల్లో విజయ్ చాలా రిస్క్ తీసుకుని న టించడం విశేషం అని పేర్కొన్నారు. తెరి చిత్రంలో ప్రముఖ దర్శకుడు మహేంద్రన్ అడగ్గానే అంగీకరించి నటించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. చిత్రంలోని మాటలను బాగున్నాయ ని మెచ్చుకుని తన చిత్రానికి సంభాషణలు రాయమని కోరారని, అది జరిగినా, లేకపోయినా ఆయ న ప్రశంసలను మర్చిపోలేనని అన్నారు. ఈ విషయంలో తనకు శంకర్ తరువాత మణిరత్నం, కే. భాగ్యరాజ్, హిందీ దర్శకుడు రాజ్‌కుమార్ హీర్వాణి గురువులని పేర్కొన్నారు. ఇక తెరి చిత్రంలో సమంత, ఎమీజాక్సన్ ఇద్దరు చాలా బాగా నటించారని చెప్పారు. వీరితో పాటు నటి మీనా కూరుతు నైనిక కీలక పాత్రను పోషిం చిందని చెప్పారు. ఇందులో విజయ్ కూతురు ది వ్య కూడా నటించిందని, ఆయన కొడుకు సంజ య్ నటించారా? అని అడుగుతున్నారని అది మా త్రం సస్పెన్స్ అని అన్నారు. అదే విధంగా తెరి చి త్రానికి సీక్వెల్ ఉంటుందా? అని అడుగుతున్నారనీ అందుకు కథ సిద్ధంగా ఉందనీ అన్నారు. అయితే తెరి చిత్రానికి ప్రేక్షకాదరణను బట్టి సీక్వెల్ చేయా లా? వద్దా అన్న నిర్ణయం ఉంటుందని తెలిపారు. తన తదుపరి చిత్రం గురించి అడుగుతున్నారని ప్ర స్తుతం తెరి చిత్ర సక్సెస్‌ను ఆస్వాదించాలని, అలాగే ఇటీవలే పెళ్లి చేసుకున్న తాను ఇంత వరకూ భార్యతో బయట ప్రపంచం చూడలేదన్నారు. ఈ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేయాలని అన్నారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌తో చిత్రం చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం గురించి అడగ్గా అ వన్నీ చర్చల్లో ఉన్నాయని బదులి చ్చారు. తెరి చిత్రంలో నటించడం మంచి అనుభవం అని చిత్ర విడుద ల కోసం ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నాననీ నటి ఎమీజాక్సన్ అన్నారు. హీరోయిన్ అయితే సంతోషమే తెరి చిత్రంలో కీలక పాత్ర ద్వారా బాల నటిగా పరిచయం అవుతున్న నటి మీనా కూతురు నైనిక అం దరికి థ్యాంక్స్ అంటూ ముచ్చటగా చెప్పింది. మీనా మాట్లాడుతూ తెరి చిత్రం ద్వారా తన కూతురు బాల నటిగా పరిచయం అవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్‌లో నైనిక హీరోయిన్ అవుతుందా? అన్న ప్రశ్నకు అది ఇప్పుడు చెప్పలేనని, అలా కథానాయకి అయితే తనకు సంతోషమేనపి మీనా అన్నారు. -
20న తెరి గీతావిష్కరణ
తెరి చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమం ఈ నెల 20న జరగనుందన్నది తాజా సమాచారం. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం తెరి. ఇది ఆయన 59వ చిత్రం. విజయ్‌కు జంటగా అందాల భామలు సమంత, ఎమీజాక్సన్ నటిస్తున్నారు. ప్రభు, రాధిక శరత్‌కుమార్, దర్శకుడు మహేంద్రన్, ముట్టై రాజేంద్రన్, విజయ్ కూతురు దివ్య, నటి మీనా కూతురు నైనిక తదితరులు ముఖ్య పాత్రలు ధరిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఈయనకు సంగీత దర్శకుడిగా 50వ చిత్రం కావడం మరో విశేషం. వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అట్లీ దర్శకుడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను ముమ్మరంగా జరుపుకుంటోంది. తెరి చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలోని రెండు సాంగ్స్ పల్లవులు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తూ విజయ్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్మాత ఈ నెల 20న భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. తెరి చిత్రాన్ని తమిళ ఉగాది సందర్భంగా ఏప్రిల్ 14న అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాత కలైపులి ఎస్.థాను సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. తెరి సరికొత్త రికార్డులు:సాధారణంగా భారీ చిత్రాల విడుదలకు రెండు రోజులు లేదా వారం రోజుల ముందు థియేటర్లలో అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తారు. అలాంటిది తెరి చిత్రానికి ఏకంగా నెల రోజుల ముందే ప్రీ బుకింగ్ ఆరంభం కావడం రికార్డే అవుతుంది. -
ఇళయదళపతి చిత్రంలో విలన్‌గా జగపతిబాబు
తమిళ నటులు తెలుగులో, తెలుగు నటులు తమిళంలో నటించడం కొత్తేమీకాదు. అయితే ఇక్కడి హీరోలు అక్కడ విలన్లుగా నటించడం కచ్చితంగా అరుదే. సీనియర్ నటుడు సత్యరాజ్, కన్నడ స్టార్ నటుడు సుదీప్ లాంటి కొందరు మాత్రమే పర భాషల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో జగపతిబాబు కూడా ఇదే బాట పట్టడం గమనార్హం. ఈయన ఇంతకు ముందు కుచేలన్ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆప్తమిత్రుడిగా నటించారు. ఆ తరువాత లింగా చిత్రంలో విలన్‌గా మారారు. ఇప్పుడు ఇళయదళపతికి ప్రతినాయకుడిగా మారనున్నారన్నది తాజా సమాచారం. తెరి చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ చిత్రంలో విజయ్ నటించనున్నారన్న విషయం తెలిసిందే. ఇది విజయ్‌కి 60వ చిత్రం అన్నది గమనార్హం. ఇంతకు ముందు గిల్లీ, వీరం చిత్రాలకు మాటలను,అళగియ తమిళ్ మగన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన భరతన్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యువ నటి కీర్తీసురేష్ విజయ్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఆయనకు ప్రతినాయకుడిగా నటించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.చిత్రం షూటింగ్ మే నెల తొలి వారంలో మొదలవుతుందని సమాచారం. -
విజయ్ 60వ చిత్రానికి దర్శకుడి ఖరారు
తమిళసినిమా : ఇళయదళపతి విజయ్ 59వ చిత్రాన్ని చేస్తున్నారు. దీనికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీలు సమంత, ఎమీజాక్సన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీ.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.ధాను నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఇంతకు ముందు కాక్కీ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నా తాజాగా తారుమారు అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. విజయ్ తదుపరి చిత్రం ఏమిటి? దర్శకుడెవరు అన్న విషయాలపై ఆసక్తి నెలకొంది. విజయ్ 60వ చిత్రం కావడంతో దీనికి దర్శకుడెవరన్న విషయంలోనూ పలువురి పేర్లు ప్రచారంలో ఉండటమే ఆసక్తి నెలకొనడానికి కారణం. దర్శకులు మోహన్‌రాజా, కార్తీక్ సుబ్బరాజ్, ఎస్జే.సూర్య, భరతన్, హరి విజయ్ కోసం కథలు తయారు చేసినట్లు తెలిసింది. చివరిగా తెలిసిందేమిటంటే వారిలో భరతన్ సిద్ధం చేసిన కథ ఇళయదళపతికి బాగా నచ్చిందని. దీంతో విజయ్ 60వ చిత్రానికి భరతన్ దర్శకత్వం వహించనున్నారన్నది తాజా సమాచారం. విషయం ఏమిటంటే విజయ్ భరతన్ కాంబినేషన్లో ఇంతకు ముందు అళగీయ తమిళ్‌మగన్ అనే చిత్రం రూపొందింది. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఆ చిత్రంలో శ్రీయ, నమిత నాయికలుగా నటించారు. ఈ తాజా చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ వారంలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు మొదలెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో షూటింగ్‌కు సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
విజయ్ 60వ చిత్రానికి దర్శకుడెవరు?
ఇళయదళపతి విజయ్ 60వ చిత్రానికి దర్శకుడెవరనే చర్చ కోలీవుడ్‌లో చాలా కాలంగానే సాగుతోంది. చాలామంది ప్రముఖ దర్శకుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి కూడా. విజయ్ 58వ చిత్రం పులి తన అభిమానుల్ని సంతృప్తి పరచలేకపోయింది. 59వ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో వి క్రియోషన్స్ పతాకంపై కలైపులి ఎస్.ధాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో సమంత, ఎమీజాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒళయదళపతి మరోసారి పోలీస్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రానికి కాక్కి అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కాగా విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఆయన 60వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కమర్శియల్ దర్శకుడిగా పేరొందిన హరి హ్యాండిల్ చేయనున్నారన్నది తాజా సమాచారం. ప్రశాంత్ మొదలు విక్రమ్, విశాల్, సూర్య, శింబు, భరత్ వరకూ పలువురు హీరోలతో చిత్రాలు చేసి కమర్శియల్ విజయాలను సాధించిన దర్శకుడు హరి ఒక్క సూర్యతోనే నాలుగు చిత్రాలు చేశారు. ఐదో చిత్రంగా సింగం-3ని త్వరలో సెట్ పైకి తీసుకెళ్లనున్నారు. కాగా తొలి సారిగా ఇళయదళపతితో ఆయన 60వ చిత్రానికి చేతులు కలపనున్నారన్నది గమనార్హం. ఈ బారీ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయ వాహిని నిర్మించనుందని సమాచారం. ఇక్కడో విషయం చెప్పాలి. ప్రశాంత్ హీరోగా హరి దర్శకత్వం వహించిన తమిళ్ చిత్రం విజయ్ నటించిన తమిళన్ చిత్రం అప్పట్లో ఒకే రోజు విడుదలయ్యి పోటీ పడ్డాయన్నది గమనార్హం. -
విజయ్ చిత్రానికి దర్శకుడెవరు?
ఇళయదళపతి విజయ్ 60వ చిత్రానికి రీచ్ అవుతున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడెవరన్నదే ఆసక్తిగా మారింది. విజయ్ కోసం ముగ్గురు దర్శకులు కథలు సిద్ధం చేస్తుండడం విశేషం.వారిలో ఇళయదళపతి ఎవరికి పచ్చజండా ఊపుతారన్నదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.విజయ్ తన 58వ చిత్రం పులిని పూర్తి చేశారు. హన్సిక, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించారు. కన్నడ సూపర్ స్టార్ సుధీప్ ప్రతినాయకుడిగా నటించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. కాగా విజయ్ 59వ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే మొదలయ్యాయి. సమంత,ఎమిజాక్సన్ నాయికలు. నటి సునైనా అతిథి పాత్రలో మెరవనుందట. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తదుపరి చిత్రమే విజయ్ 60 వ చిత్రం. ఈ చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగదాస్ కథను సిద్ధం చేస్తున్నారు. ఆయన ఇంతకు ముందు ఇళయదళపతికి తుపాకీ, కత్తి లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించారన్నది గమనార్హం.అలాగే నటుడు, దర్శకుడు శశికుమార్ విజయ్‌కి బ్రహ్మాండమైన కథను రెడీ చేశారని,ఆయనకు విజయ్ ఓకే చెప్పారని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో నట దర్శకుడు ఎస్జే.సూర్య పేరు తెరపైకు రావడం విశేషం.ఈయన విజయ్ ఇటీవల కలిసి కథా చర్చలు జరిపినట్లు,ఎస్జే.సూర్య చెప్పిన కథ విజయ్‌కు తెగ నచ్చేసినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ ముగ్గురిలో విజయ్ ఎవరికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారన్నదే ఆసక్తిగా మారింది. -
మరోసారి లాఠీ పట్టనున్న విజయ్
ఇళయ దళపతి విజయ్ మరోసారి లాఠీ చేత పట్టనున్నారు. ఇంతకుముందు ఆయన పోకిరి, జిల్లా చిత్రాల్లో పోలీసు అధికారిగా నటించారు. ఆ రెండు చిత్రాలు విజయం సాధించాయి. ముచ్చటగా మూడవసారి ఖాకీ దుస్తులు ధరించనున్నారు. విజయ్ ప్రస్తుతం పులి చిత్రంలో నటిస్తున్నారు. శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అతిలోకసుందరి శ్రీదేవి మహారాణిగా నటిస్తున్నారు. జానపదం మిళితమైన సాంఘిక చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. దీంతో విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. కలైపులి ఎస్.థామను నిర్మించనున్న ఈ భారీ చిత్రంలో నటి సమంత హీరోయిన్గా నటించనున్నారు. రాజారాణి చిత్రం ఫేమ్ అట్లి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో విజయ్ పోలీసు అధికారిగా నటించనున్నట్లు సమాచారం. చిత్ర షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. పోకిరి, జిల్లా చిత్రాల్లో విజయ్ పోలీసు అధికారిగా నటించిన సన్నివేశాలు తక్కువే. అయితే అట్లి దర్శకత్వం వహించనున్న చిత్రంలో పూర్తిగా పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అయితే లవ్, రొమాంటిక్ సన్నివేశాలు ప్రాముఖ్యత ఉంటుందట. -
ఇళయదళపతి చిత్రంలో రాధిక
ఇళయదళపతి విజయ్ తదుపరి చిత్రంలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ఒక ముఖ్యపాత్ర పోషించడానికి సద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. రాధిక సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్, విజ యకాంత్ వంటి టాప్ హీరోలందరితోను నాయకిగా నటించారు. కార్తీ, విశాల్ లాంటి యువ నటుల చిత్రాల్లోనూ ముఖ్యపాత్రలు పోషించా రు. అయితే ఇప్పటి వరకు విజయ్ చిత్రంలో నటించలేదు. త్వరలో వీరి కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను నిర్మించనున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నాయకిగా నటించనున్నారు. వీరిద్దరు కలసి ఇంతకుముందు కత్తి వంటి సంచలన విజయం సాధించిన చిత్రంలో నటించారన్నది గమనార్హం. అదేవిధంగా విజయ్ హీరోగా ఇంతకుముందు కలైపులి ఎస్.థాను తుపాకీ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. అలాంటి సక్సెస్ఫుల్ కాంబినేషన్లో మరో చిత్రం రూపొందనుంది. రాజారాణి చిత్రంలో సక్సెస్ సాధించిన యువ దర్శకుడు అట్లి ఈక్రేజి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అలాంటి చిత్రంలో నటి రాధిక శరత్‌కుమార్ ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అట్లి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం పులి చిత్రంలో నటిస్తున్న విజయ్ తదుపరి చేసే చిత్రం ఇదే అవుతోంది. -
విజయ్‌తో ఢీ
పట్రా చిత్రంతో అనూహ్యంగా సినీ రంగ ప్రవేశం చేసిన నటుడు శ్యామ్‌పాల్. ఈ చిత్రంలో ఈయన పండించిన విలనిజానికి పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారట. ఆ వివరాలను ఈ వర్ధమాన నటుడి మాటల్లోనే... ఇంజనీరింగ్ చదివిన నేను నా జీవితంలో ఎదుర్కొన్న ఒక సంఘటన కారణంగా న్యాయవాద పట్టా పొందాల్సి వచ్చింది. అయితే నాకిది ఫ్యాషనే. అదే విధంగా నేనొక బాక్సర్‌ను కూడా. ఇందుకు కారణం మాత్రం నాన్న స్టాలిన్పాల్నే. ఆయన పెద్ద బాక్సర్. నన్ను కూడా బాక్సర్ చేయాలన్నది ఆయన కోరిక. ఆ కారణంగా నిత్యం కఠిన శరీర వ్యాయామంతో బాక్సర్నయ్యాను. బాస్కెట్‌బాల్, వాలీబాల్ క్రీడల్లోనూ జాతీయ స్థాయిలో కప్‌లు గెలుచుకున్నాను. మాకు పాండిచ్చేరిలో నాలుగు కళాశాలలు, చెన్నైలో మరికొన్ని వ్యాపారాలు ఉన్నాయి. కళాశాల నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్న నాకు సినిమాలు చూసే అలవాటు ఉంది. ఎక్కువగా ఆంగ్ల చిత్రాలు చూస్తుంటాను. ఆ చిత్రాలను తమిళంలో తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు వస్తుంటాయి. అయితే సినిమాలో నటించాలనే ఆసక్తి మాత్రం లేదు. అలాంటిది ఒకసారి పట్రా చిత్ర దర్శకుడు జయందాన్ లొకేషన్ చూడటానికి పాండిచ్చేరిలోని మా కాలేజీకు వచ్చారు. అక్కడ నన్ను చూసి ఒక చిన్న పాత్ర ఉంది చేస్తారా? అని అడగారు. చిన్న పాత్రే కదా అని ఓకే అన్నాను. అయితే చిత్రం పూర్తి అయ్యే వరకు నా పాత్ర ఏమిటన్నది స్పష్టంగా వివరించలేదు. ఆయన చెప్పినట్టు చేశాను. పట్రా చిత్రం విడుదలైన తరువాత ప్రముఖ దర్శక నటుడు కె.భాగ్యరాజ్ లాంటి పలువురు అభినందిస్తుంటే సంతోషం పట్టలేకపోతున్నాను. ఎలాగు చిత్ర రంగ ప్రవేశం చేశాను కనుక ఇకపై ఇళయదళపతి విజయ్‌తో విలన్‌గా ఢీ కొనడానికైనా సిద్ధమే. మరో పక్క దర్శకుడు ఎ ఎల్ విజయ్‌తో కలసి షట్టర్ అనే చిత్రం కూడా నిర్మిస్తున్నాను అని శ్యామ్‌పాల్ చెప్పారు. -
ఇళయ దళపతికి గాలం
ఇళయ దళపతి విజయ్‌కి గాలం వేసే పనిలో పడింది కప్పల్ కథానాయికి సోనం బాజ్వా. దక్షిణాదిలో ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో రాణించాలని ఆకాంక్షించే ఉత్తరాది బ్యూటీస్ జాబితాలో చేరిందీ భామ. ఆమె మాట్లాడుతూ చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించానంది. అలా సినీ అవకాశాలు వరించినట్లు చెప్పింది. పంజాబిలో బెస్ట్ ఆఫ్ లక్, పంజాబ్ 1984 చిత్రంలో నాయికగా నటించానని పేర్కొంది. తర్వాత తమిళంలో కప్పల్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిం దని తెలిపింది. ఈ చిత్రంలో చాలా ఎంజాయ్ చేస్తూ నటించానని వెల్లడించింది. చిత్ర యూనిట్ సహకారం మరువలేనిదంది. కప్పల్ చిత్రంలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చిందని, ఇక్కడ తొలి చిత్రమే విజయం సాధించడం సంతోషంగా ఉందని పేర్కొంది. కోలీవుడ్‌లో విజయ్ సరసన నటించడానికి ఆశగా ఎదురుచూస్తున్నానని అసలు విషయం చెప్పింది. కప్పల్ చిత్రం తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయని, వాటి వివరాలు త్వరలోనే చెబుతానని తెలిపింది. -
కాక పుట్టిస్తున్న కత్తి
కత్తి చిత్రం కోలీవుడ్‌లో కాక పుట్టిస్తోందనే చెప్పాలి. ఇళయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రం కత్తి. ఏఆర్ మురుగదాస్, విజయ్ హీరోగా దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన తుపాకీ బాగా పేలింది. దీంతో కత్తి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో విజయ్ మంచివాడిగా, చెడ్డవాడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే విషయం తెలిసిందే. క్రేజీ బ్యూటీ సమంత నాయకి. నిల్నితిన్ ముఖేష్ సతీష్, తోటారాయ్ చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ పతాకంపై సుభాష్‌కరణ్, కరుణామూర్తిలు నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 22న తెరపైకి వస్తూ దీపావళికి సందడి చేయనుంది. అనిరుధ్ సంగీత బాణీలు అందించిన ఈ చిత్రం ఆడియో టీజర్ ఇంతకుముందే మార్కెట్లోకి విడుదలై మంచి స్పందన పొందాయి. ముఖ్యంగా హీరో విజయ్ పాడిన సెప్ఫా పుళ్ల పాట బాగా ప్రాచుర్యం పొందింది. కాగా చిత్రం మెయిన్ ట్రైలర్ శుక్రవారం సెన్సార్ జరుపుకుని శనివారం థియేటర్లో విడుదలైంది. ఇప్పటికే భారీ అంచనాలను నెలకొన్న కత్తిని అత్యధిక థియేటర్లలో విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క యూకే (యునెటెడ్ కింగ్డమ్)లోనే కత్తి చిత్రాన్ని 70 స్క్రీన్స్‌లో ప్రదర్శించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. విజయ్ గత చిత్రాల కంటే అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న చిత్రంగా కత్తి రికార్డు సృష్టించనుంది. -
కత్తి చిచ్చు
సాక్షి, చెన్నై: ఇళయదళపతి విజయ్ నటించిన కత్తి చిత్రం విడుదలలో చిచ్చు రాజుకుంది. తమిళ సంఘాలు ఆడియో విడుదలను అడ్డుకునేం దుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనతో విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్, సమంత జంటగా కత్తి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర నిర్మాత ల్లో ఒకరు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే బినామీ అన్న ప్రచారం రాష్ట్రంలో ఊపందుకుంది. ఈ వ్యవహారం కత్తి సినిమా విడుదలను ప్రశ్నార్థకం చేసే పరిస్థితులకు దారి తీస్తోంది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా కోర్టుల్లో తమిళ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే ఆ సంఘాలకు చేదు అనుభవం తప్పలేదు. మార్గం సుగమం కావడంతో దీపావళిని పురస్కరించుకుని చిత్రం విడుదలకు సన్నాహాలు ఆరంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో గురువారం కత్తి ఆడియో విడుదలకు నిర్ణయించారు. రాజా అన్నామలైపురంలోని ఓ హోటల్లో ఆడియో ఆవిష్కరణకు సర్వం సిద్ధం చేశారు. అయితే దీనిని అడ్డుకునేందుకు తమిళ సంఘాలు సిద్ధమయ్యాయి. రాజుకుంది : సద్ధుమణిగిందన్న వివాదం మళ్లీ రాజుకుంది. ఆడియో ఆవిష్కరణను అడ్డుకునేందుకు తమిళ సంఘాలు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆడియో ఆవిష్కరణ నిమిత్తం రాజా అన్నామలైపురం పరిసరాల్లో చిత్ర యూనిట్, విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలు, బ్యానర్లతో హోరెత్తించారు. సాయంత్రం మరి కాసేపట్లో ఆడియో విడుదల జరగనున్న సమయంలో తమిళ సంఘాలు రెచ్చిపోయాయి. ముందస్తుగా ఆ హోటల్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తమిళ సంఘాలు అటు వైపుగా రానీయకుండా కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అయినా కొందరు ఆందోళనకారులు పోలీసుల వలయాన్ని చేధిస్తూ తమ ప్రతాపాన్ని చూపించారను. ఆడియో విడుదలను అడ్డుకునే విధంగా ఆ హోటల్ వైపుగా చొచ్చుకెళ్లే యత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు అక్కడి ఫ్లెక్సీలు, బ్యానర్లను చించి, ధ్వంసం చేసి, తగులబెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు. చివరకు తమిళ సంఘాల నాయకులను అరెస్టు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. మళ్లీ అటువైపుగా ఆందోళనకారులు రాకుండా ఆ మార్గాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చివరకు గట్టి భద్రత నడుమ కత్తి ఆడియో ఆవిష్కరణ సజావుగా సాగింది. తమిళ సంఘాల తీరును విజయ్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కత్తి చిచ్చు ఎలాంటి పరిస్థితులకు దారి తీయనున్నదో వేచి చూడాల్సిందే. -
ఐరోపాలో ‘కత్తి’ గీతాలు
కత్తి చిత్ర గీతాలను ఐరోపాలో చిత్రీకరించనున్నారు. ఇళయదళపతి విజయ్ నాయకుడిగా, ప్రతినాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం కత్తి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చెన్నై చిన్నది సమంత నాయకి. చిత్ర షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 10వ తేదీకంతా టాకీ పార్టు పూర్తి అవుతుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. రెండు పాటల చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తి అవుతోంది. ఈ రెండు పాటలను ఐరోపా దేశాల్లో చిత్రీకరించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. దీంతో ఆగస్టు నెల చివరిలో విజయ్, సమంత, దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్తోపాటు చిత్ర యూనిట్ ఐరోపాకు పయనం కానుంది. ఈ రెండు పాటలను అక్కడి మూడు దేశాల్లో చిత్రీకరించడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. అనిరుధ్ సంగీతాన్ని చిత్రం అందిస్తున్నా ఈచిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. కత్తి చిత్రాన్ని దీపావళికి విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. -
ఇళయ దళపతి @40
ఇళయ దళపతి విజయ్ ఆదివారం 40వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఆయన అభిమానులు సంబరాల్లో మునిగారు. ఆదివారం పుట్టిన బిడ్డలకు బంగారు ఉంగరాలను తొడిగారు. దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ వారసుడిగా, ఒకప్పుడు బాలనటుడిగా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన విజయ్ ప్రస్తుతం ఇళయదళపతిగా అవతరించారు. రాష్ర్ట వ్యాప్తంగా అశేషాభిమాన లోకాన్ని కలిగి ఉన్నారు. ఈయన్ను కూడా రాజాకీయాల్లోకి దించేందుకు ఆయన అభిమానులు కుస్తీలు పడుతున్నారు. అయితే, రాజకీయాలకు దూరమన్న విజయ్ ఓ సేవా సంస్థతో ప్రజల్లోకి దూసుకెళ్తోన్నారు. పుట్టినరోజుకు ముందుగానే ఓరోజు సేవా కార్యక్రమాల్లో విజయ్ నిమగ్నం అవుతారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆయన 40వ వసంతంలోకి అడుగు పెట్టారు. విజయ్ బర్త్‌డేను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. విజయ్ ఇచ్చిన పిలుపుతో సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. 40 కిలోల కేక్‌లను కత్తిరించారు. పేదలకు సంక్షేమ పథకాల్ని పంపిణీ చేశారు. ఆలయాల్లో ఉదయాన్నే విజయ్ పేరిట పూజలు నిర్వహించారు. ఉత్తర చెన్నైకు చెందిన విజయ్ అభిమాన సంఘం నాయకుడు అబ్బులు నేతృత్వంలో కోడంబాక్కం, ట్రిప్లికేన్ ప్రసూతి ఆస్పత్రుల్లో జన్మించిన పిల్లలకు బంగారు ఉంగరాలు తొడిగారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మరో నాయకుడు కట్ పీస్ విజయ్ నేతృత్వంలో రాయపురంలో రక్తదాన శిబిరం, పేదలకు సంక్షేమాలు, వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. తిరువళ్లూరు ఉత్తర జిల్లా అభిమాన సంఘం నేతృత్వంలో అంబత్తూరులో భారీ వేడుకను ఏర్పాటు చేశారు. దక్షిణ చెన్నై సంఘం నేతృత్వంలో తిరువాన్మియూర్‌లో, కాంచీపురంలో ఈసీఆర్ శరణన్ నేతృత్వంలో రక్తదానం, అన్నదాతనం చేశారు. కత్తి ఫస్ట్‌లుక్ విడుదల తన బర్త్‌డేను పురస్కరించుకుని కత్తి సినిమా పోమోను విజయ్ విడుదల చేశారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, సమంత జంటగా కత్తి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విజయ్ ఆదివారం విడుదల చేశారు. చెన్నైలోని నేప్పియర్ వంతెన, వళ్లువర్ కోట్టం, కత్తి పారా జంక్షన్, సెంట్రల్ రైల్వే స్టేషన్, ఎల్ఐసీ భవనం, మౌంట్ రోడ్డును పేపర్ ప్రింట్ తరహాలో చూపిస్తూ, చివరకు వాటన్నీంటినీ ఏకం చేసి, అందులో నుంచి సీరియస్‌గా చూస్తున్న విజయ్ ముఖచిత్రం కన్పించేలా ఈ ప్రోమోను సిద్ధం చేశారు. భిన్నంగా రూపొందించిన ప్రోమోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. 40వ వసంతంలోకి అడుగు పెట్టిన విజయ్‌కు పలువురు మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. నటుడు జీవా, ఉదయనిధి స్టాలిన్ తదితరులు ఇందులో ఉన్నారు. విజయ్ బర్త్‌డే సందర్భంగా తాను తీసుకున్న ఫొటోను ఉదయనిధి స్టాలిన్ ట్విట్టర్లో పోస్టు చేశారు.