ఇళయదళపతి చిత్రంలో రాధిక | Radhika Sarathkumar is the latest to join Vijay | Sakshi
Sakshi News home page

ఇళయదళపతి చిత్రంలో రాధిక

Published Mon, Mar 30 2015 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

ఇళయదళపతి చిత్రంలో రాధిక

ఇళయదళపతి చిత్రంలో రాధిక

 ఇళయదళపతి విజయ్ తదుపరి చిత్రంలో సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ఒక ముఖ్యపాత్ర పోషించడానికి సద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. రాధిక సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమలహాసన్, విజ యకాంత్ వంటి టాప్ హీరోలందరితోను నాయకిగా నటించారు. కార్తీ, విశాల్ లాంటి యువ నటుల చిత్రాల్లోనూ ముఖ్యపాత్రలు పోషించా రు. అయితే ఇప్పటి వరకు విజయ్ చిత్రంలో నటించలేదు. త్వరలో వీరి కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను నిర్మించనున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నాయకిగా నటించనున్నారు.
 
  వీరిద్దరు కలసి ఇంతకుముందు కత్తి వంటి సంచలన విజయం సాధించిన చిత్రంలో నటించారన్నది గమనార్హం. అదేవిధంగా విజయ్ హీరోగా ఇంతకుముందు కలైపులి ఎస్.థాను తుపాకీ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. అలాంటి సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుంది. రాజారాణి చిత్రంలో సక్సెస్ సాధించిన యువ దర్శకుడు అట్లి ఈక్రేజి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అలాంటి చిత్రంలో నటి రాధిక శరత్‌కుమార్ ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు అట్లి తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం పులి చిత్రంలో నటిస్తున్న విజయ్ తదుపరి చేసే చిత్రం ఇదే అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement