
ధనుశ్- నయనతార వ్యవహారం కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇటీవల విడుదలైన నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్‌లో మరింత చర్చకు దారితీసింది.
అయితే తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ స్పందించారు. నానుమ్ రౌడీ ధాన్‌లో కీలక పాత్ర పోషించిన రాధిక ధనుశ్ ప్రవర్తనపై మాట్లాడారు. ఈ మూవీ సెట్స్‌లో నయనతార, విఘ్నేష్ శివన్‌ల ప్రేమ వ్యవహారం గురించి తనతో చెప్పాడని తెలిపింది. ఆ మూవీ షూటింగ్ టైమ్‌లో ధనుశ్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడని వివరించింది. ధనుశ్ ఫోన్‌లో మాట్లాడుతూ అక్కా.. నీకు సిగ్గు లేదా? అని అడిగాడు. అతను ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. 'ఏం జరుగుతుందో నీకు తెలియదా?, 'విక్కీ, నయన్‌లు డేటింగ్ చేస్తున్నారని ధనుశ్ నాతో అన్నాడని తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో రాధిక వివరించింది. ఆ తర్వాత వెంటనే 'ఏం మాట్లాడుతున్నావ్.. నాకేమీ తెలీదు' అని షాకింగ్‌కు గురైనట్లు డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది.
కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
Comments
Please login to add a commentAdd a comment