తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటోంది నయనతార. ధనుష్ విషయంలో తాను చేసిన పనిని సమర్థించుకుంటుంది. ఆయనతో మాట్లాడానికి చాలా ప్రయత్నించానని..కుదరకపోవడంతో లేఖ రాయాల్సి వచ్చిందని చెప్పింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యూమెంటరీ విషయంలో ధనుష్, నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో తన పర్మిషన్ తీసుకోకుండా ‘నానుమ్ రౌడీ దాన్’లోని సీన్‌ను వాడుకున్నారంటూ చిత్ర నిర్మాత ధనుష్ లీగల్ నోటీసులు పంపించాడు. మూడు సెకన్ల క్లిప్‌నకు రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నయనతార ధనుష్ క్యారెక్టర్‌ని తప్పుబడుతూ బహిరంగ లేఖను రాసింది. తాజాగా ఈ వివాదంపై నయనతార క్లారిటీ ఇచ్చింది. తాను లేఖను రాయడానికి గల కారణం ఏంటో తెలిపింది.
(చదవండి: ఇక్కడితో ఆపేయండి..లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తా.. సాయి పల్లవి మాస్ వార్నింగ్)
ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘ధనుష్ క్యారెక్టర్‌ని బయట ప్రపంచానికి తెలియజేయడానికే ఆ లేఖను రాశాను. ‘న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఎదుటి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే మనిషిని కాదు నేను. నా డ్యాక్యుమెంటరీ ఫిల్మ్ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారని చాలా మంది మాట్లాడుతుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు.
(చదవండి: పుష్పరాజ్ వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే రప్ఫాడించాడు!)
వీడియో క్లిప్స్‌కు సంబంధించిన ఎన్‌వోసీ కోసం ధనుష్‌ని కలిసేందుకు ప్రయత్నించాం. నేను, విఘ్నేష్ ఫోన్ చేశాం. కామన్ ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. కానీ ధనుష్ స్పందించలేదు. ఆయన మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియదు. ముందు నుంచి మేమిద్దరం ఏమీ శత్రువులం కాదు. ఆయన నాకు మంచి స్నేహితుడే. ఈ పదేళ్లలో ఏం జరిగిందో తెలియదు. ఆయనకు మాపై ఎందుకు కోపం వచ్చిందనే విషయం కూడా మాకు అర్థం కావడం లేదు. పక్కవాళ్ల మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకున్నారా? ఇలాంటివి క్లియర్ చేసుకునేందుకు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. అది కుదరలేదు’ అని నయనతార అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment