నయనతార- కోలీవుడ్ హీరో ధనుశ్ మధ్య వివాదం కీలక మలుపు తిరిగింది. ధనుశ్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమాలోని ఓ క్లిప్‌ను అనుమతి లేకుండా వినియోగించారంటూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హీరోయిన్ నయనతారకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ నయన్‌కు నోటీసులిచ్చింది. ఈ వ్యవహరంలో మీ వైఖరి చెప్పాలంటూ నయన్ దంపతులతోపాటు నెట్‌ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది.
అసలేంటి వివాదం?
ఇటీవల నయనతార తన ప్రేమ పెళ్లిపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేసింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో రిలీజైన డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్‌ను ఉపయోగించారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్‌ను వినియోగించారంటూ ధనుశ్ టీమ్ రూ.10 కోట్లకు దావా వేసింది. ఆ తర్వాత నయనతార ఈ వివాదంపై బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment