హీరోయిన్ నయనతార (Nayanthara) మరోసారి వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపించారు. హీరోయిన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పగతోనే నోటీసులు పంపాడన్న నయన్
కాగా తమ అనుమతి లేకుండా నానుమ్ రౌడీ దాన్ (నేనూ రౌడీనే) సినిమాలోని మూడు సెకన్ల క్లిప్స్‌ను తన డాక్యుమెంటరీ బియాండ్ ద ఫెయిరీ టేల్‌కు వాడుకున్నారంటూ ధనుష్ (Dhanush).. నయనతారకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే! తమపై కక్షగట్టే ధనుష్ నోటీసులు పంపించాడన్న నయనతార మరి ఇప్పుడెలా స్పందిస్తుందో చూడాలి!
వివాదం ఎలా మొదలైందంటే?
నయనతార జీవితంపై నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఇందుకుగానూ కొన్ని సినిమా క్లిప్స్ వాడుకున్నారు. అందులో భాగంగా నేనూ రౌడీనే చిత్రంలోని మూడు సెకన్ల సన్నివేశం ఉపయోగించుకున్నారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు కాగా ధనుష్ నిర్మాత. ఈ సినిమా చేస్తున్న సమయంలో విఘ్నేశ్- నయన్ లవ్‌లో పడ్డారు. చాలాకాలంపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022లో పెళ్లి చేసుకున్నారు.
(చదవండి: నేనూ మనిషినే.. ఏడ్చేసిన మాధవీలత)
ధనుష్‌పై నయనతార ఆగ్రహం
ఈ విశేషాలను తన డాక్యుమెంటరీలో పొందుపరిచారు. అయితే నేనూ రౌడీనే సినిమా క్లిప్స్ తన అనుమతి లేకుండా వాడేయడంతో ధనుష్ రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. దీనిపై నయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. తండ్రి, అన్నయ్య అండతో నువ్వు నటుడిగా ఎదిగావు. నేనూ ఏ బ్యాక్‌గ్రౌండ్‌లో లేకుండా ఈ సినీప్రపంచంలో పోరాడి ఈ స్థాయిలో ఉన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నాతోపాటు నా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
నా మనసు ముక్కలైంది
నీకు మాపై పగ ఉండొచ్చు. కానీ దానివల్ల ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డవారి జీవితాలపైనే అది ప్రభావం చూపిస్తుంది. నా ఇతర సినిమా క్లిప్స్ వాడాం.. కానీ ఎంతో ప్రత్యేకమైన నేనూ రౌడీనే చిత్ర సన్నివేశాలు మాత్రం ఉపయోగించలేకపోయాం. ఈ సినిమా పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్టవుతాయి. కానీ ఎన్నిసార్లు అభ్యర్థించినా నువ్వు వాటిని వాడుకోవడానికి వీల్లేదనడం నా మనసును ముక్కలు చేసింది. బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు.
ఇంత దిగజారుతావనుకోలేదు
కానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్లే మేం బాధపడాల్సి వస్తోంది. నేనూ రౌడీనే షూటింగ్ టైంలో మేం మా ఫోన్‌లో తీసుకున్న వీడియోని ట్రైలర్‌లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్‌లో ఉన్న వాళ్లందరి జీవితాల్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
చదవండి: నా కాపురంలో హన్సిక చిచ్చుపెడుతోంది.. పోలీసులకు నటి ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment