హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత (Madhavi Latha) బోరున ఏడ్చేసింది. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఎంతో ప్రయత్నించా.. కానీ, నేనూ మనిషినే! నా ఆత్మగౌరవంపై జరిగిన దాడి.. నేను పడ్డ బాధను వర్ణించే పదాలు లేవు.
ఎవరో వస్తారని ఎదురుచూడలేదు!
ప్రతి క్షణం వేదన అనుభవిస్తున్నాను. కోపం, నిరాశ, ఆవేదన, దుఃఖం.. అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. ఎన్నోసార్లు ఎందరో నా ఆత్మవిశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నం చేశారు, పదే పదే ఇవే మాటలన్నారు. ఎవరో వస్తారని ఎప్పుడూ ఆశపడలేదు. సమాజం కోసం నేను సైతం అనుకున్నా.. నా పార్టీ (ప్రజల) కోసం, మహిళల కోసం, హిందూ ధర్మం కోసం మాత్రమే నిస్వార్థంగా నా వంతు నేను పోరాడుతున్నాను. ఎవరి దగ్గరా రూపాయి తీసుకున్నది లేదు.. ఎవరికీ ద్రోహం చేసిందీ లేదు.. మోసం చేసిందీ లేదు.
చదవండి: హీరో విశాల్‌కు ఏమైంది? ఎందుకిలా అయిపోయాడు?
నాపై కక్షతో..
కానీ కక్ష గట్టి మాటలంటూ ఉన్నారు. ఆడపిల్లగా ఎప్పుడూ సింపతీ గేమ్ ఆడలేదు. మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను ఉపయోగించలేదు. మగాడిలా పోరాడుతూనే ఉన్నాను. ఈ కష్టాలను అధిగమిస్తాను. నా ధైర్యాన్ని కోల్పోను. నాకు కుటుంబం, స్నేహితులతో పాటు అభిమానులు, సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు. నా బాధను మీతో పంచుకున్నందుకు క్షమించండి. మీ ప్రేమాభిమానం, ఆశీర్వాదాలు నాకు శక్తినిస్తాయి అని రాసుకొచ్చారు.
ఏం జరిగింది?
డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. జేసీ పార్కులో వేడుకలకు మహిళలు వెళ్లొద్దని సూచించారు. తిరుగుప్రయాణంలో అర్ధరాత్రివేళ ఏదైనా జరగడకూడనిది జరిగితే ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జేసీ మాధవీలతపై అసభ్య కామెంట్లు చేశారు. ఆమెను వ్యభిచారి అని వ్యాఖ్యానించారు. తెరపై కనిపించేవాళ్లంతా వ్యభిచారులే అనడం నీ కుసంస్కారానికి అద్దం పడుతోందని మాధవీలత ఫైర్ అయ్యారు. తర్వాత నోరు జారినందుకు జేసీ సారీ చెప్పారు. అయినా సరే మాధవీలతపై విమర్శల దాడి జరుగుతూనే ఉండటంతో తట్టుకోలేక ఇలా ఏడ్చేశారు.
సినిమా..
కాగా మాధవీలత.. నచ్చావులే సినిమాతో హీరోయిన్‌గా తెలుగుతెరకు పరిచయమైంది. తర్వాత ష్, స్నేహితుడా, ఉసురు, చూడాలని చెప్పాలని, అరవింద్ 2 వంటి చిత్రాల్లో నటించింది. ఆంబాల అనే మూవీతో తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. కానీ పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. చివరగా మధురై మణికురవర్ (2021) అనే తమిళ మూవీలో కనిపించింది.
చదవండి: సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా
Comments
Please login to add a commentAdd a comment