JC prabhakar reddy
-
గాంధీనగర్ లో కాశీ మనోజ్ ను కిడ్నాప్ చేసిన దుండగులు
-
జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారుల ఫిర్యాదు
-
YSRCP నేత జావెద్ ఇంటి వద్ద జేసీ వర్గీయుల వీరంగం
-
జేసీ బ్రదర్స్ కి పెద్దారెడ్డి వార్నింగ్
-
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేతిరెడ్డి ఫైర్
సాక్షి,అనంతపురం:మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఈ మేరకు పెద్దారెడ్డి మంగళవారం(డిసెంబర్3)మీడియాతో మాట్లాడారు.‘జేసీ వర్గీయులు తాడిపత్రిలో విచ్చలవిడిగా మట్కా,పేకాట ఆడిస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలపై దాడులు తీవ్రమయ్యాయి. బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. నన్ను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నన్ను వెళ్లనీయకపోయినా పర్వాలేదు కానీ వైఎస్సార్సీపీ నేతలపై దాడులు ఆపాలి. అధికారంలో ఉన్నారని టీడీపీ ఏమి చేసినా చెల్లుతుందంటే చూస్తూ ఊరుకోం’అని పెద్దారెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: సోషల్‌మీడియా కార్యకర్తలకు ప్రాణహాని -
జేసీ గుండాయిజం.. భయపడేదేలే అంటున్న వైఎస్సార్సీపీ నేతలు
-
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు అనంత వెంకటరామిరెడ్డి కౌంటర్
-
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదు
-
జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి మధ్య బూడిద గొడవ
-
చంద్రబాబు వద్ద ‘బూడిద’ పంచాయితీలో ట్విస్ట్
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య బూడిద గొడవ చివరికి చంద్రబాబు వద్దకు చేరింది. ఆదినారాయణరెడ్డికి వ్యతిరేకంగా ఎస్పీకి జేసీ ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే. జేసీ లేఖ నేపథ్యంలో కూటమిలో ప్రకంపనలు సృష్టించగా.. పంచాయితీ తేల్చడానికి ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు పిలిపించారు. అయితే, చంద్రబాబుతో భేటీ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఆదినారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.‘‘వెట్ డ్రై యాష్ అనేది ఉచితం. పీఎంఈజీపీలో తీసుకుపోతామని అంటాం. ఈ మాత్రం దానికే జేసీ ప్రభాకర్‌రెడ్డి పెద్ద లేఖ రాశారు. లెటర్ రాసిన వాడు స్వయంగా రావాలి కదా? ఎందుకు రాలేదు. జ్వరమో.. ఇంకేదో నాకు తెలియదు...బీజేపీ, టీడీపీ సమస్య కాదు ఇది. స్థానికత సమస్య ఇక్కడ ఉంది. అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ తన ఏరియాలో ఉంది కనుక జెసీ ప్రభాకర్‌రెడ్డి అడుగుతున్నాడు. సీఎం నిర్ణయం తీసుకుంటారు. ఆయన చెప్పినట్లు వింటాం. జేసీ దివాకర్‌రెడ్డిది ఏమైనా రాజరికమా?. కాంగ్రెస్ నుంచి ఆయన టీడీపీకి వచ్చాడు.. నేను టీడీపీ నుంచి బీజేపీకి వచ్చా.. కూటమిలో ఉంటూ కూటమిని విమర్శించడం సరికాదు’’ అని ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: అటు ఆది.. ఇటు జేసీ ‘బూడిద’ రగడ! -
YSRCP నేత కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడికి టీడీపీ నేతల స్కెచ్
-
బూడిదపై చల్లారని రగడ
ఎర్రగుంట్ల/కొండాపురం: వైఎస్సార్ జిల్లాలోని డాక్టర్ ఎంవీఆర్‌ఆర్ ఆర్టీపీపీ నుంచి వెలువడుతున్న బూడిద (ఫ్లైయాష్) కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య రాజుకున్న రగడ చల్లారలేదు. ఆర్టీపీపీలో బుధవారం పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. కలమల్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ యామిని తెలిపారు. మరోవైపు.. తాడిపత్రి నుంచి బూడిద కోసం జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన ఆరు లారీలు వచ్చాయి. పోలీసులు వీటిని ఆర్టీపీపీ 600 మెగావాట్ల యూనిట్ వద్దే నిలిపేశారు. డ్రైవర్లను దించి లోడింగ్‌కు అనుమతిలేదని వారికి పోలీసులు తెలిపారు.సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద ఉత్కంఠ..మరోవైపు.. అనంతపురం, వైఎస్సార్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొండాపురం మండలంలోని తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్‌రెడ్డి మండలంలోని కె.సుగుమంచిపల్లె చెక్‌పోస్టు వద్ద బుధవారం వాహనాలు తనిఖీ చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆర్టీపీపీకి వస్తారేమోనని సాయంత్రం వరకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఆయన రాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.బకాయిలిచ్చి 50 శాతం వాటా కల్పించాలి.. ఆర్టీపీపీలో ఉన్న యాష్ పాండ్ నుంచి వస్తున్న బూడిద సరఫరాకు సంబంధించి తమకు రావాల్సిన బకాయిలను చెల్లించి, సరఫరాలో 50 శాతం వాటా కల్పించాలని ఎమ్మెల్యే అదినారాయణరెడ్డి అనుచరుడు సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. యాష్‌పాండ్‌లోని బూడిదను తాడిపత్రిలోని ఎల్ ఆండ్ టీ ఫ్యాక్టరీకి నేరుగా సరఫరా చేసేవాళ్లమన్నారు. అప్పుడు ఫ్యాక్టరీ వారు సకాలంలో బిల్లులు ఇచ్చేవారన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆ ఫ్యాక్టరీతో ఒప్పందం చేసుకోవడంతో ఆయనకు బూడిదను సరఫరా చేశామన్నారు. అయితే, ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదన్నారు. సుమారు రూ.80 లక్షలు బకాయిలు ఉన్నాయని, వెంటనే వాటిని చెల్లించాలని.. అలాగే సరఫరాలో 50 శాతం వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తమ ఎమ్మెల్యే అదినారాయణరెడ్డికి తెలియజేశామన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి లారీలకు లోడింగ్ చేయబోమని ఆయన తెగేసి చెప్పారు. -
జమ్మలమడుగులో టెన్షన్ టెన్షన్
-
జేసీ, ఆది వర్గాల మధ్య వార్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి వైఎస్సార్ జిల్లా: జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వార్ కొనసాగుతోంది. ఆర్టీపీపీ వద్దకు జేసీ వాహనాలను ఆది వర్గం అనుమతించడం లేదు. దీంతో తాడిపత్రి సిమెంట్ కంపెనీల వద్ద జమ్మలమడుగు వాహనాలను అడ్డగించారు. జమ్మలమడుగు వాహనాలకు లోడింగ్ చేయొద్దని జేసీ వర్గం హుకుం జారీ చేసింది. ఆర్టీపీపీ వద్ద జేసీ వాహనాలకు లోడింగ్ చేయొద్దని ఆది వర్గం చెబుతోంది. ఇరువురి నేతల మధ్యలో ట్రాన్స్పోర్ట్ యాజమానులు నలిగిపోతున్నారు. జిల్లా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీపీపీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.కాగా, అధికారం కోసం పరస్పరం సహకరించుకున్నా ఆదాయార్జనపై మాత్రం కూటమి పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. మొన్న ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన నిర్మాణ పనులపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి సవాల్ విసిరింది. ఫ్లైయాష్ రవాణా తమ కనుసన్నల్లోనే జరగాలంటూ ఇరు వర్గాలు ఆధిపత్య పోరుకు దిగాయి.తమ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డు కోవడంపై రగిలిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈసారి సహించేది లేదని.. తాను అదానీలా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కండ కలవాడిదే రాజ్యమన్నట్లుగా భూపేష్‌రెడ్డి వర్గీయులు అదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా ఎస్పీకి జేసీ లేఖ రాయడంతోపాటు స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం కూడా తాడిపత్రి నుంచి ఆర్టీపీపీ వరకు మూడు చోట్ల చెక్ పోస్టుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. -
ప్లై యాష్ కాంట్రాక్టుపై ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలు
-
అటు ఆది.. ఇటు జేసీ ‘బూడిద’ రగడ!
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం కోసం పరస్పరం సహకరించుకున్నా ఆదాయార్జనపై మాత్రం కూటమి పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. మొన్న ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన నిర్మాణ పనులపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం తాజాగా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి సవాల్ విసిరింది. ఫ్లైయాష్ రవాణా తమ కనుసన్నల్లోనే జరగాలంటూ ఇరు వర్గాలు ఆధిపత్య పోరుకు దిగాయి. తమ వాహనాలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం అడ్డు కోవడంపై రగిలిపోయిన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఈసారి సహించేది లేదని.. తాను అదానీలా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కండ కలవాడిదే రాజ్యమన్నట్లుగా భూపేష్‌రెడ్డి వర్గీయులు అదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈమేరకు జిల్లా ఎస్పీకి జేసీ లేఖ రాయడంతోపాటు స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం తాడిపత్రి నుంచి ఆర్టీపీపీ వరకు మూడు చోట్ల చెక్ పోస్టుల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.⇒ వైఎస్సార్ కడప జిల్లాలోని ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్) నుంచి నిత్యం 3,926 టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతుండగా 25 ప్రైవేట్ కంపెనీలు, 15 సిమెంటు పరిశ్రమలకు కేటాయిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలకు టన్ను రూ.550 చొప్పున, సిమెంట్ పరిశ్రమలకు టన్ను రూ.410 చొప్పున సరఫరా అవుతోంది. అయితే రవాణా మాత్రం కూటమి పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుంది. తాడిపత్రిలో ఉన్న ఎల్ అండ్ టీ సిమెంట్ పరిశ్రమకు జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన ట్యాంకర్లు ఫ్లైయాష్ సరఫరా చేస్తున్నాయి. అయితే సిమెంట్ పరిశ్రమలకు తామే ఫ్లైయాష్ సరఫరా చేస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. ఈ క్రమంలో తాడిపత్రికి కూడా సరఫరా చేసేందుకు సన్నాహాలు చేశారు. అందుకు అందుకు నిరాకరించిన జేసీ తమ లారీల ద్వారానే తరలిస్తామంటూ తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, జేసీ లారీలను నాలుగు రోజుల క్రితం అడ్డగించారు.⇒ ‘ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాష్ సరఫరాను అడ్డుకుంటే తాడిపత్రికి వాళ్ల లారీలు వచ్చి వెళ్తాయా? తమాషాలు చేస్తున్నారా? ఎలా అడ్డుకుంటారో చూద్దాం. నేనే వస్తున్నా...’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించడంతో అప్రమత్తమైన పోలీసులు కొండాపురం మండలం సుగమంచుపల్లె నుంచి కలమల్ల వరకూ మూడు చోట్లు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కలమల్ల ఆర్టీపీపీ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. జేసీ తన వాహనాలతో వస్తే అడ్డుకునేందుకు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం సిద్ధం కావడంతో ఉదయం ఉద్రిక్తత నెలకొంది.మొన్న రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌పై కూడా..అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్టు సివిల్ పనులను చేస్తున్న రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌పై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యులు తాజాగా దాడి చేయడం తెలిసిందే. కాంట్రాక్టు పనులన్నీ తామే చేస్తామని డిమాండ్ చేయడంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. తాజాగా ఫ్లైయాష్ సరఫరా విషయంలో రగడ మొదలైంది. ఆదాయ మార్గాలపై ఆదినారాయణరెడ్డి వర్గం కన్నేసినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఆర్టీపీపీ నుంచి సరఫరా చేసే ఫ్లైయాష్కు ప్రతి నెలా ఒక్కో లారీకి రూ.లక్ష కమీషన్ ముట్టజెప్పనున్నట్లు సమాచారం. ఎన్ని వాహనాలు తిరిగితే అంత కమీషన్ లభించనుంది. దీంతో రవాణాపై ఇరువర్గాలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదాయాన్ని వదులుకునేందుకు అటు జేసీ ప్రభాకరరెడ్డి, ఇటు ఆదినారాయణరెడ్డి వర్గం సిద్ధంగా లేదు.ఆర్టీపీపీలో పోలీసులకు సూచనలిస్తున్న పోలీసు అధికారులు అదానీలా ఊరుకోను– ఎస్పీకి జేసీ లేఖఆర్టీపీపీ నుంచి ఫ్లైయాష్ తరలించే తమ వాహనాలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు భూపేష్‌రెడ్డి అడ్డుకుంటే సహించేది లేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు కడప ఎస్పీకి మంగళవారం ఆయన లేఖ రాశారు. అక్టోబరు 15న ఆర్టీపీపీ వద్ద తమ వాహనాలను అడ్డుకోవడంపై ఎస్పీ, జమ్మలమడుగు ఎస్డీపీఓల దృష్టికి తెచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. భూపేష్‌రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో తాము ఈనెల 23న కడప నుంచి వచ్చే సిమెంటు, ఇసుక అక్రమ రవాణా వాహనాలను నిలిపి వేసినట్లు చెప్పారు. కడప ఎస్పీ విజ్ఞప్తి మేరకు ఆ రోజు వాటిని వదిలి వేశామన్నారు. ఈనెల 25 నుంచి ఫ్లైయాష్ లోడింగ్‌కు తమ వాహనాలను అనుమతిస్తామని తాడిపత్రి రూరల్ ఇన్స్పెక్టర్ హామీ ఇచ్చారన్నారు. అయినా కూడా ఒక రోజు అదనంగా గడువు ఇచ్చామన్నారు. బుధవారం నుంచి లోడింగ్‌కు తమ వాహనాలు ఆర్టీపీపీకి వెళతాయని, ఈ దఫా కూడా అడ్డుకుంటే తేలికగా తీసుకోబోమని స్పష్టం చేశారు. తాము రాత్రికి రాత్రే రాజకీయ నాయకులుగా అవతరించలేదన్నారు. తమ కుటుంబం 1932 నుంచి రాజకీయాల్లో కొనసాగుతోందన్నారు. కండ కలవాడిదే రాజ్యమన్నట్లుగా భూపేష్‌రెడ్డి వర్గీయులు అదానీ కంపెనీ ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారన్నారు. ఈ దఫా తాము కచ్చితంగా ప్రతిస్పందిస్తామని, ముందుగానే ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే బీజేపీలో చేరారని, వైఎస్సార్ సీపీ హయాంలో తనపై 95 అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. -
ఆటోలను నిషేధించాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి,అనంతపురం:ఆటోలపై టీడీపీ సీనియర్ నేత,తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆటోల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నిషేధించాలని జేసీ డిమాండ్ చేశారు.అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లిలో శనివారం(నవంబర్ 23) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందడంపై జేసీ స్పందించారు.‘ఆటోలను నిషేధించాలి. రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే. డ్రైవర్ పక్కన ముగ్గురేసి కూర్చోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.ఆటోల వల్లే ప్రతి నెలా 60 మంది చనిపోతున్నారు. తలగాసిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా సరిపోదు. ఒక్కో బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఈ విషయం చంద్రబాబునాయుడుకు అధికారులు చెప్పాలి’అని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: అసెంబ్లీలో ఆ విషయం మర్చిపోయావా.. అఖిలప్రియా.. -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
మద్యం షాపు నిర్వాహకులకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్
-
జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం షాపు నిర్వాహకులు తనకు 35 శాతం కమిషన్ ఇవ్వాలని హుకూం జారీ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో జరిగే పేకాట, జూద కేంద్రాల నుంచి 15 శాతం, మరో 20 శాతం పెట్టుబడి వాటాగా ఇవ్వాలని హెచ్చరించారు.కమిషన్ల రూపంలో వచ్చే డబ్బును తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తానన్న జేసీ.. తాడిపత్రి నియోజకవర్గంలో తన ప్రత్యర్థులు ఊరు విడిచి పోవాల్సిందేనని బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. జేసీ లిక్కర్ షాపు నిర్వహాకులకు, ప్రత్యర్థులకు బహిరంగంగా హెచ్చరికల జారీ చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. ఇలా తండ్రే కాదు ఆయన కుమారుడు సైతం అస్మిత్‌రెడ్డి సైతం వ్యహరిస్తున్నారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. మా రూటే సపరేటుఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు ఒకరకం.. తాడిపత్రి ఒక్కటీ మరో రకంగా మారింది. ‘మేమే రాజులం, మేమే మంత్రులం.. మేము రాసిందే రాజ్యాంగం’ అనే రీతిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపైనా, ప్రత్యర్థి పారీ్టలోని నాయకులపైనా దాడులు చేయడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు పెట్టిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇసుక అక్రమాలపై కావాలనే రాద్ధాంతం.. అధికారం చేతిలో ఉందికదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ‘25 మంది ఇసుక తోలేది మా వాళ్లే.. మీరందరూ ఇసుక తోలడం మానుకోండి. లేదా నాకు దూరమవుతారు’ అంటూ ఇటీవల ప్రభాకర్‌రెడ్డి వీడియో సందేశాలు విడుదల చేశారు. అయితే, జేసీ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే అందులో మరో కోణం అవగతమవుతుంది. తన వర్గం నాయకులు సాగిస్తున్న ఇసుక దందాను నిలిపివేయించి తానే సొంత వాహనాలతో ఇసుక అక్రమ రవాణా సాగించాలన్న మర్మం బయటపడుతుంది. జిల్లాల వారీగా చంద్రబాబు ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్టులు తయారు చేయిస్తోందన్న సమాచారం అందడంతోనే డ్రామాలు ఆడుతున్నారన్న విమర్శలు మరోవైపు వినిపిస్తున్నాయి. పోలీసుల్లో అసంతృప్తి.. తాడిపత్రి మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను ఇటీవల పోలీసులు పట్టుకోగా.. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వెంటనే సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి కేసులు కట్టాలంటూ దురుసుగా వ్యవహరించారు. ఎప్పుడు కేసులు కట్టాలో తనకు తెలుసునని సీఐ చెప్పగా.. ఆయనను ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో సీఐను వెనకేసుకు రావాల్సిన పోలీసు ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించి, సీఐతో ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పించారు. నిజాయితీగా పనిచేసే ఓ సీఐ పట్ల ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై పోలీసు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎస్పీ స్థాయి వ్యక్తి క్షమాపణలు చెప్పించడమేంటని కిందిస్థాయి పోలీసు అధికారులు వాపోతున్నారు. ఇదే క్రమంలో.. తాను ఏ తప్పూ చేయలేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే క్షమాపణలు చెప్పానని సీఐ పేర్కొనడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే రాకుండా అడ్డంకులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టకుండా దాడులు చేయిస్తున్నారంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి గూండాగిరీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇటీవల ఎన్నికల పోలింగ్ రోజు రాళ్లు రువ్వుకున్న ఘటనలో ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డిలు ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇద్దరికీ బెయిలొచ్చింది. కానీ పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లగా తన అనుచరులతో దాడులు చేయించారు. కందిగోపుల మురళి అనే వైఎస్సార్ సీపీ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. పనిచేయడానికి అధికారులే రావడం లేదు.. జేసీ కుటుంబం దెబ్బకు నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులే రావడం లేదంటే అతిశయోక్తి కాదు. తాడిపత్రి తహసీల్దార్‌గా వెళ్లిన ఈశ్వరమ్మ కొన్ని రోజులకే తానక్కడ పనిచేయలేనంటూ తిరిగి వచ్చేశారు. తాడిపత్రి టౌన్‌కు ఎస్ఐ ఉన్నా అటాచ్డ్ కింద పెదపప్పూరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రూరల్ పోలీసుస్టేషన్లో ఎస్ఐ లేరు. తమకు ఎప్పుడు బదిలీ వస్తే వెళ్లిపోదామా అన్న ఆలోచనలో రవాణా శాఖ సిబ్బంది ఉన్నారు. మైనింగ్, రెవెన్యూ, ఆరోగ్య.. ఇలా ఏ శాఖ అధికారులైనా తాడిపత్రిలో పనిచేసేందుకు జంకుతున్నారు. పోలీసులన్నా, అధికారులన్నా తన కింద గుమస్తాలే అన్న రీతిలో జేసీ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది: పెద్దారెడ్డి
సాక్షి, అనంతపురం: తనకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ ఎస్పీ జగదీష్ సహకారంతోనే జేసీ కుట్రలు చేస్తున్నారని.. ఎన్నికల పోలింగ్ నుంచి ఇప్పటిదాకా పలుసార్లు తానను చంపేందుకు జేసీ ప్రయత్నించారని పెద్దారెడ్డి అన్నారు.‘‘మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని 2006లో చంపారు. అదే పద్ధతిలో నన్ను హతమార్చేందుకు జేసీ కుట్రలు చేస్తున్నారు. జేసీ గూండాలకు ఎస్పీ జగదీష్ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. నాపై ఇప్పుడు మూడు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో సిట్ విచారణ చేసిన ఘటనలపై మళ్లీ కేసులు ఎందుకు నమోదు చేశారో ఎస్పీ జగదీష్ సమాధానం చెప్పాలి’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు.కాగా, యాడికి మండలంలో జేసీ ముఠా బరితెగించింది. స్థానికులను భయకంపితులను చేసింది. చంపుతామంటూ పలువురు వైఎస్సార్ సీపీ నేతలను బెదిరించడమే కాకుండా ఓ నాయకుడిని కిడ్నాప్ చేసింది. యాడికి మండలంలో త్వరలో 4 వైన్ షాపులు ఏర్పాటు కానున్నాయి. వాటికి సంబంధించి లైసెన్సుల కోసం యాడికి మండల కేంద్రం నుంచి ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్, వైఎస్సార్ సీపీ నాయకుడు బాలిరెడ్డి, రాయలచెరువు గ్రామానికి చెందిన జానా దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన ముఠాను ఉసిగొల్పారు.ఆయన ఆదేశాలతో గురువారం మధ్యాహ్నం టీడీపీ నేత, మాజీ ఎంపీపీ రంగయ్య, టీడీపీ మండల కన్వీనర్ రుద్మనాయుడు, పరిమి చరణ్ ఆధ్వర్యంలో వంద మందితో కూడిన పచ్చ ముఠా రంగంలోకి దిగింది. యాడికి మండలకేంద్రానికి చేరుకుని ఉప సర్పంచు కాసా చంద్రమోహన్ ఇంటి తాళాలను పగుల గొట్టింది. వైఎస్సార్ సీపీ నాయకుడు బాలిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఆయనతో పాటు కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది.ఇదీ చదవండి: మద్యం షాపులన్నీ నాకే కావాలి..!మద్యం షాపు కోసం చేసిన దరఖాస్తును విరమించుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఎంపీటీసీ సభ్యుడు రామ్మోహన్ ఓ టీ స్టాల్ వద్ద ఉన్నాడని తెలుసుకుని అక్కడికే వెళ్లింది. ‘ఒరేయ్ నీకు ఎన్ని గుండెల్రా.. మా ప్రభుత్వంలో మద్యం షాపుల కోసం టెండర్లు వేస్తావా.. వాటిని విరమించుకోకపోతే చంపుతాం’ అంటూ బెదిరించింది. టెండర్ రసీదులు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఇంటి వద్ద ఉన్నాయని చెబుతుండగానే స్కార్పియో వాహనంలో రామ్మోహన్‌ను పచ్చ నేతలు ఎక్కించుకెళ్లారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎంపీపీ బొంబాయి ఉమాదేవి విషయాన్ని తాడిపత్రి డీఎస్పీ, జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి తెలియజేశారు. ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన యాడికి సీఐ ఈరన్న తన సిబ్బందితో టీడీపీ శ్రేణులను వెంబడించారు. రాయలచెరువు వద్ద వారి వాహనాన్ని ఆపి రామ్మోహన్‌ను కాపాడారు. కాగా, రామ్మోహన్ కిడ్నాప్‌నకు గురయ్యారనే సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బొంబాయి రమేష్ నాయుడు ఇంటి వద్దకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. -
మద్యం షాపులన్నీ నాకే కావాలి..!
సాక్షి టాస్‌్కఫోర్స్, సాక్షి, రాజమహేంద్రవరం : ‘రేయ్..! ఇతరులు ఎవరైనా మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్నారో జాగ్రత్త..! ఊరుకునే ప్రసక్తే లేదు. అన్నీ నాకే కావాలి. నా మాట కాదని ఎవరన్నా దరఖాస్తు చేశారో వారి అంతు చూడండి..!’ అనుచర గణానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలివీ!! ఆయన కనుసైగ చేయడమే ఆలస్యం.. తాడిపత్రి నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకున్న ఓ వైఎస్సార్ సీపీ నేతను టీడీపీ శ్రేణులు కిడ్నాప్ చేయగా మరో నేత ఇంటిపై దాడికి తెగబడి బెదిరింపులకు దిగాయి. ఒకపక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇలా యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతుండగా మరోవైపు పోలీసుల ద్వారా సామ, దాన, దండోపాయాలను కూటమి ప్రభుత్వం ప్రయోగిస్తోంది. ‘‘అసలు మీరు ఈ టెండర్లు ఎందుకు వేస్తున్నట్లు? సరే టెండర్లు దక్కించుకున్నారే అనుకోండి. టీడీపీ నేతలను కాదని అసలు మద్యం దుకాణాలను మీరు నిర్వహించగలరా? అధిక రేట్లకు విక్రయిస్తున్నట్లు మీపై కేసులు నమోదవుతాయి. ఎక్సైజ్ దాడులూ జరుగుతాయి. ఏదో ఒక కేసు బుక్ చేసి మిమ్మల్ని మూసి వేయడం ఖాయం. ఇదంతా ఎందుకొచి్చన గొడవ? మద్యం టెండర్ల నుంచి మీకు మీరే మర్యాదగా తప్పుకోండి..!’’ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంటున్న ఇతర పార్టీల నేతలకు స్థానిక ఎస్సై, సీఐల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ఇదీ!! వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కిడ్నాప్ తాడిపత్రిలో 9 మద్యం షాపులు, రూరల్ పరిధిలో 3, యాడికిలో 4, పెద్దవడుగూరులో 3, పెద్దపప్పూరులో ఒక షాపు కలిసి మొత్తం 20 మద్యం దుకాణాలు తమ ఆదీనంలో ఉండాలని జేసీ ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వలస వెళ్లిన ఓ నేత 20 దుకాణాలకు దరఖాస్తు వేసేందుకు ప్రయత్నించగా ఆయన్ను విరమించుకునేలా చేసినట్లు తెలుస్తోంది. టెండర్లు వేసిన ఇతర నేతలపై జేసీ వర్గం దౌర్జన్యాలకు తెగబడింది. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ రామ్మోహన్‌ను స్కారి్పయోలో కిడ్నాప్ చేసి తరలించారు. ఎంపీపీ ఉమాదేవి ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తేవడంతో యాడికి సీఐ ఈరన్న టీడీపీ శ్రేణుల నుంచి రామ్మోహన్‌ను విడిపించి తీసుకొచ్చారు. యాడికిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసిన వైఎస్సార్ సీపీ నాయకుడు, యాడికి ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్ ఇంటి తాళాలను టీడీపీ మూకలు గురువారం పగులగొట్టి బెదిరింపులకు దిగాయి. వైఎస్సార్ సీపీకి చెందిన మరో నాయకుడు బాల్‌రెడ్డి ఇంటికి వెళ్లి దరఖాస్తు చేయవద్దని బెదిరించారు. దరఖాస్తుకు నేడే చివరి రోజు రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం గురువారం నాటికి 65,424 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,396 షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారం చివరి రోజు. ఈ నేపథ్యంలో దరఖాస్తులు 70 వేలు దాటవచ్చని ఎక్సైజ్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 12, 13వ తేదీల్లో దరఖాస్తులను పరిశీలించి 14న లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తారు. దరఖాస్తులకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో టీడీపీ సిండికేట్ బెదిరింపులు తీవ్రమయ్యాయి. టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న వ్యాపారులను టార్గెట్ చేసి నయాపైసా పెట్టుబడి పెట్టకుండా వాటా, గుడ్ విల్ ఇవ్వాలని హెచ్చరిస్తున్నారు. తమను కాదంటే వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ అల్టిమేటం జారీ చేస్తున్నారు. » రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపులు తట్టుకోలేక దరఖాస్తు చేసుకునేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. రూరల్ నియోజకవర్గంలో 11 షాపులకు గానూ బుధవారం వరకు 150 దరఖాస్తులే అందాయి. సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు ఇతరులను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. విద్యార్థి సంఘం నేతలను సైతం రంగంలోకి దించారు. నియోజకవర్గంలో 28 షాపులు ఉండగా బుధవారానికి 250 దరఖాస్తులు మాత్రమే అందాయి.» నిడదవోలులో గతంలో మద్యం వ్యాపారం చేసిన టీడీపీ సీనియర్ నేత తన అనుచరులతో టెండర్లు వేయిస్తున్నారు. మరోవైపు జనసేన నేతలు తమకూ షాపులు ఇవ్వాలంటున్నారు. మంత్రి కందుల దుర్గేష్ అనుచరులు 20 శాతం వాటా ఇవ్వాలని టెండర్లు వేసిన వ్యాపారులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. â రాజానగరం ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులతో నియోజకవర్గంలో 13 దుకాణాలకు 206 టెండర్లు దాఖలు కాగా వీరంతా దాదాపుగా కూటమి నేతలే కావడం గమనార్హం. » కొవ్వూరులో టీడీపీ సీనియర్ నేత అనుమతిస్తేనే టెండర్లు దాఖలవుతున్నాయి.మద్యంపై ‘రౌండ్ ఫిగర్’ బాదుడుఅదనపు ప్రివిలేజ్ ఫీజు పేరిట భారీ దోపిడీకి సిద్ధం» ‘‘మొత్తం రూ.3,850 అయింది. రౌండ్ ఫిగర్ చేస్తే రూ.5 వేలు అవుతుంది..!’’ ఖలేజా సినిమాలో హీరో డైలాగ్!! » ‘‘అదేంటీ.. రౌండ్ ఫిగర్ రూ.4 వేలు కదా..?’’ హీరోయిన్ సందేహం!! » ‘‘రూ.5 వేలులో ఎక్కువ సున్నాలున్నాయి కదా..! అందుకు..’’ హీరో సమర్థన !! అదే రౌండ్ ఫిగర్ సూత్రాన్ని సీఎం చంద్రబాబు సర్కారు తన విధానంగా చేసుకుంది. ఇప్పటికే టీడీపీ సిండికేట్ ద్వారా ప్రైవేట్ మద్యం దుకాణాలతో భారీ దోపిడీకి రంగం సిద్ధం చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా మరో ఎత్తుగడ వేసింది. మద్యం బాటిళ్ల ధరలను సమీపంలోని పదుల సంఖ్యకు చేరుస్తూ రౌండ్ ఫిగర్ చేయాలని నిర్ణయించింది. రూ.100 కంటే అధికంగా ఉన్న మద్యం బాటిళ్ల ధరలను తరువాత వచ్చే దశాంశ మానానికి మార్చి రౌండ్ ఫిగర్ చేసి ధర నిర్ణయిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకు ఉదాహరణను కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓ మద్యం బాటిల్ ధర రూ.150.50గా ఉంటే... ఆ బాటిల్ ధరను రూ.160గా నిర్ణయిస్తారు. బాటిల్ ధర రూ.272గా ఉంటే... దాన్ని రూ.280 చేస్తారు. ఈ దందాకు ‘అదనపు ప్రివిలేజ్ ఫీజు’ అని నామకరణం చేస్తూ ఎక్సైజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చిలక్కొట్టుడు కాదు.. భారీ బాదుడే ఇదేదో చిల్లర సమస్య లేకుండా చేసే చిలక్కొట్టుడు వ్యవహారం కానే కాదు! అదనపు ప్రివిలేజ్ ఫీజు ముసుగులో భారీ దోపిడీకి టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కాగా స్కెచ్ వేసింది. టీడీపీ హయాంలో 2018 నాటి లెక్కలనే పరిగణలోకి తీసుకుంటే.. ఆ ఏడాది 3.84 కోట్ల లిక్కర్ కేసులు, 2.77 కోట్ల బీరు కేసులు విక్రయించారు. కేసుకు 48 లిక్కర్ బాటిళ్ల చొప్పున మొత్తం 184.32 కోట్ల లిక్కర్ బాటిళ్లు... కేసుకు 12 బీరు బాటిళ్ల చొప్పున మొత్తం రూ.33.24 కోట్ల బీరు బాటిళ్లు విక్రయించారు.వాటిలో 90 శాతం బాటిళ్ల ధర రూ.100 కంటే అధికంగానే విక్రయించారు. ప్రస్తుతం 180 ఎంఎల్ చీప్ లిక్కర్‌ను రూ.99కి విక్రయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ ఒక్క కేటగిరీ మినహా మిగిలిన అన్ని బ్రాండ్ల ధర రూ.వంద కంటే అధికంగానే ఉంటుంది. ఆ ప్రకారం ఒక్కో బాటిల్‌పై రూ.2 నుంచి రూ.9 వరకు అదనంగా దోపిడీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుతంత్రం పన్నింది. ఆ లెక్కన ఏడాదికి ఎన్ని వేల కోట్ల దోపిడీకి పాల్పడతారన్నది అంచనాలకు అందడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వమా.. మజాకానా! -
జేసీ వర్గీయుల దాష్టీకం..లిక్కర్ షాపు కోసం కిడ్నాపులు
సాక్షి,అనంతపురం: ఏపీలో లిక్కర్ షాపుల కోసం టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను చేజిక్కించుకునేందుకు పచ్చనేతలు అక్రమాలకు తెర తీశారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్‌నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు ఏకంగా కిడ్నాప్‌లు చేసేందుకు తెగబడ్డారు. మద్యం దుకాణానికి దరఖాస్తు చేశాడన్న కోపంతో యాడికిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ రామ్మోహన్‌ను జేసీ వర్గీయులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు జేసీ వర్గీయుల చెర నుంచి ఎంపీటీసీ రామ్మోహన్‌ను విడిపించారు. టీడీపీ నేతల దాష్టీకంపై యాడికి వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న పాత మద్యం పాలసీని రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఏపీలో కొత మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మద్యంషాపులను ప్రైవేటు వారికి అప్పగించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ షాపులన్నీ ఎలాగోలా సిండికేట్లుగా మారి దక్కించుకోవాలని టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తుండడం గమనార్హం.ఇదీ చదవండి: కమీషన్లు..ముడుపులు.. దారి తప్పిన టీడీపీ -
మద్యం షాపులన్నీ మావే: ‘జేసీ’ బెదిరింపులు
సాక్షి,అనంతపురం:తాడిపత్రిలో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మద్యం మాఫియా గుట్టు బయటపడింది.మద్యం షాపులన్నీ మాకే కావాలని జేసీ వర్గీయులు అంటున్నారు. ఎవరైనా టెండర్లు వేస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు.తమ అనుమతి లేనిదే తాడిపత్రిలో ఎవరికీ రూములు అద్దెకు ఇవ్వొద్దని హెటల్ యజమానులకు టీడీపీ నేతలు అల్టిమేటం జారీ చేశారు.ఇంత జరుగుతున్నా తాడిపత్రిలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తుండటం గమనార్హం. మరోవైపు మద్యం షాపులకు దరఖాస్తుల గడువును టీడీపీ నేతల కోసమే పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నెల్లూరులో మద్యంషాపులన్నీ తమ సిండికేట్‌కే దక్కాలని మంత్రి నారాయణ మాట్లాడిన ఫోన్ సంభాషణ బయటపడిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తు గడువు పెంపు -
రావణ కాష్టం.. రాక్షసానందం!
‘మీరేంటో.. మీ విధానాలేంటో..’ అంటూ ఓ సినిమాలో రావు రమేష్ చెప్పిన డైలాగ్ వారికి బాగా సరిపోతుంది. నిత్యం వివాదాలకు వారే ఆజ్యం పోస్తూ చలికాచుకోవడం రివాజుగా మారింది. గత ఐదేళ్లూ ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించిన తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం జేసీ ఆగడాల కారణంగా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు ఒకరకం.. తాడిపత్రి ఒక్కటీ మరో రకంగా మారింది. ‘మేమే రాజులం, మేమే మంత్రులం.. మేము రాసిందే రాజ్యాంగం’ అనే రీతిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపైనా, ప్రత్యర్థి పారీ్టలోని నాయకులపైనా దాడులు చేయడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు పెట్టిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇసుక అక్రమాలపై కావాలనే రాద్ధాంతం.. అధికారం చేతిలో ఉందికదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ‘25 మంది ఇసుక తోలేది మా వాళ్లే.. మీరందరూ ఇసుక తోలడం మానుకోండి. లేదా నాకు దూరమవుతారు’ అంటూ ఇటీవల ప్రభాకర్‌రెడ్డి వీడియో సందేశాలు విడుదల చేశారు. అయితే, జేసీ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే అందులో మరో కోణం అవగతమవుతుంది. తన వర్గం నాయకులు సాగిస్తున్న ఇసుక దందాను నిలిపివేయించి తానే సొంత వాహనాలతో ఇసుక అక్రమ రవాణా సాగించాలన్న మర్మం బయటపడుతుంది. జిల్లాల వారీగా చంద్రబాబు ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్టులు తయారు చేయిస్తోందన్న సమాచారం అందడంతోనే డ్రామాలు ఆడుతున్నారన్న విమర్శలు మరోవైపు వినిపిస్తున్నాయి. పోలీసుల్లో అసంతృప్తి.. తాడిపత్రి మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను ఇటీవల పోలీసులు పట్టుకోగా.. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వెంటనే సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి కేసులు కట్టాలంటూ దురుసుగా వ్యవహరించారు. ఎప్పుడు కేసులు కట్టాలో తనకు తెలుసునని సీఐ చెప్పగా.. ఆయనను ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో సీఐను వెనకేసుకు రావాల్సిన పోలీసు ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించి, సీఐతో ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పించారు. నిజాయితీగా పనిచేసే ఓ సీఐ పట్ల ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై పోలీసు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎస్పీ స్థాయి వ్యక్తి క్షమాపణలు చెప్పించడమేంటని కిందిస్థాయి పోలీసు అధికారులు వాపోతున్నారు. ఇదే క్రమంలో.. తాను ఏ తప్పూ చేయలేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే క్షమాపణలు చెప్పానని సీఐ పేర్కొనడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే రాకుండా అడ్డంకులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టకుండా దాడులు చేయిస్తున్నారంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి గూండాగిరీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇటీవల ఎన్నికల పోలింగ్ రోజు రాళ్లు రువ్వుకున్న ఘటనలో ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డిలు ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇద్దరికీ బెయిలొచ్చింది. కానీ పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లగా తన అనుచరులతో దాడులు చేయించారు. కందిగోపుల మురళి అనే వైఎస్సార్ సీపీ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. పనిచేయడానికి అధికారులే రావడం లేదు.. జేసీ కుటుంబం దెబ్బకు నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులే రావడం లేదంటే అతిశయోక్తి కాదు. తాడిపత్రి తహసీల్దార్‌గా వెళ్లిన ఈశ్వరమ్మ కొన్ని రోజులకే తానక్కడ పనిచేయలేనంటూ తిరిగి వచ్చేశారు. తాడిపత్రి టౌన్‌కు ఎస్ఐ ఉన్నా అటాచ్డ్ కింద పెదపప్పూరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రూరల్ పోలీసుస్టేషన్లో ఎస్ఐ లేరు. తమకు ఎప్పుడు బదిలీ వస్తే వెళ్లిపోదామా అన్న ఆలోచనలో రవాణా శాఖ సిబ్బంది ఉన్నారు. మైనింగ్, రెవెన్యూ, ఆరోగ్య.. ఇలా ఏ శాఖ అధికారులైనా తాడిపత్రిలో పనిచేసేందుకు జంకుతున్నారు. పోలీసులన్నా, అధికారులన్నా తన కింద గుమస్తాలే అన్న రీతిలో జేసీ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు.