
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారంలో ఉన్నారనే కారణంగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు తాజాగా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓవరాక్షన్‌కు దిగారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఆయన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు చర్యలకు దిగారు. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేస్తానని వార్నింగ్ ఇవ్వడం తీవ్ర కలకలం సృష్టించింది. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఆరుగురు నేతల ఇళ్లను స్వయంగా తానే కూల్చివేస్తానని జేసీ ప్రభాకర్ హెచ్చరించారు. స్వయంగా ఆర్డీవో కేశవ్ నాయుడు ఎదుటే జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే, పోలీసుల వైఫల్యం వల్లే తాడిపత్రిలో రాళ్ల దాడి జరిగిందని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాను అంటూ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో, జేసీ వ్యాఖ్యలు, ఆయన తీరు తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతా జరిగినా పోలీసులు స్పందించకపోవడం విశేషం.

Comments
Please login to add a commentAdd a comment