ketireddy peddareddy
-
చట్టం.. జేసీ చుట్టం!
తాడిపత్రిటౌన్: చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయితే తాడిపత్రిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చట్టం.. జేసీకి చుట్టం అన్న రీతిలో వ్యవహరిస్తోంది. కళ్లెదుటే నిందితులు కనిపిస్తున్నా పోలీసులు అరెస్టు చేయకుండా వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. అసలు విషయానికి వస్తే... సార్వత్రిక ఎన్నికల అనంతరం తాడిపత్రిలో రెండు రోజుల పాటు ఇరువర్గాల గొడవలు, అల్లర్ల ఘటనలకు సంబంధించి పోలీసులు ఏడు కేసుల్లో దాదాపు 520 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో 163 మందిని (టీడీపీకి చెందిన వారు 81 మంది, వైఎస్సార్సీపీకి చెందిన వారు 82 మంది) అరెస్టు చేశారు. ఆ సమయంలో మిగిలిన నిందితుల కోసం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పట్టడంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు గ్రామాలు వదిలి బయటప్రాంతాల్లో తలదాచుకున్నారు. గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయి బిక్కుబిక్కు మంటూ గడిపాయి. పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి పట్టణ వాసులు సైతం ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలు లేకుండా రహదారులనే దిగ్బంధించిన సంఘటనను ఎవ్వరూ మరచిపోలేరు.పోలీసుల తీరు వివాదాస్పదంఅల్లర్లు, గొడవల కేసుల్లో నిందితులగా ఉండి కనిపించకుండా పోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది ఎన్నికల ఫలితాల అనంతరం కళ్లెదుటే తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తమ మాట వినని పోలీసులను బదిలీలు చేయిస్తారని, వీఆర్‌కు పంపుతారేమోనని పోలీసులే టీడీపీ నాయకులను చూసి జంకుతున్నారు. నిందితులను చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇదే విషయమై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా సాక్షిగా చెబుతున్నా పోలీసులు ఏమాత్రమూ స్పందించడం లేదు. గత బుధవారం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట తలపెట్టిన ధర్నాకు అల్లర్ల కేసుల్లో ఉన్న నిందితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారన్న విషయం తాడిపత్రిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల విధ్వంసం
తాడిపత్రి అర్బన్: చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం జరిగిన అల్లర్ల అనంతరం పోలీసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోని గదులకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఎవరూ ఊహించని రీతిలో పోలీసులు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ నిద్రిస్తున్న పని మనుషులను నిద్రలేపి ఇంటి తలుపులు తీయాలని బలవంతం చేశారు. తమ వద్ద తాళాలు లేవని చెప్పడంతో పోలీసులు అక్కడే ఉన్న వంట చేసే కబ్గిరి(పెద్ద పొడవైన గరిటె)తో ఇంటి తలుపులను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కంప్యూటర్లను పగులగొట్టి హార్డ్ డిస్క్‌లను మాయం చేశారు. కాన్ఫరెన్స్ హాలు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి అక్కడున్న ఫ్యాన్, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులుపోలింగ్ రోజు నుంచి తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అదనపు ఎస్పీ రామకృష్ణ టీడీపీ గూండాలను రెచ్చగొడుతూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా ఎదుట మండిపడ్డారు. పోలింగ్ రోజున కూడా టీడీపీ నేతల వైపు వారు కన్నెత్తి చూడకుండా వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి వందలాది మంది అనుచరులను వెంటేసుకుని రోడ్లపై హల్చల్ చేసినా వారించలేదు. ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డి తన వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకుని తిరిగినా పోలీసులు ప్రశ్నించలేదు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి లక్ష్యంగా టీడీపీ అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నా ఆయన ఇంటి ముందు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. మంగళవారం ఘర్షణల అనంతరం డీఐజీతో సహా రాయలసీమ జిల్లాల నుంచి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తాడిపత్రికి చేరుకున్నాయి. కానీ ఎమ్మెల్యే ఇంటి ముందు మాత్రం నామమాత్రపు బందోబస్తు ఏర్పాటు చేసి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం వద్ద మాత్రం పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేశారు. అంతేగాకుండా సోమ, మంగళవారాల్లో జరిగిన దాడులతో ఎటువంటి సంబంధం లేని వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. వారిని మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండానే పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరికొందరిని కౌన్సెలింగ్ పేరిట ఇష్టారాజ్యంగా కొడుతున్నట్లు సమాచారం. తాడిపత్రి పోలీసుల ఏకపక్ష వైఖరి, తన ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.మీడియాపై ఎస్పీ ఆంక్షలుతాడిపత్రిలో వరుసగా జరుగుతున్న సంఘటనలకు సంబంధించి న్యూస్ కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిథులపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. గొడవలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చిత్రీకరించకూడదని సాక్షాత్తు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆంక్షలు విధించడం గమనార్హం. ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాస సమీపంలో అదనపు ఎస్పీ రామకృష్ణతో బందోబస్తుపై ఆయన సమీక్షిస్తుండగా ఫొటోలు తీస్తున్న ఓ విలేకరిపై ఆయన చిందులు తొక్కారు. సెల్ ఫోన్ తీసుకోండంటూ అక్కడే ఉన్న తన గన్మన్లను ఆదేశించారు. -
ప్రగతి సాధకుడికా? అభివృద్ధి నిరోధకుడికా?
తాడిపత్రి రూరల్: పోలింగ్‌కు 48గంటల సమయం మాత్రమే ఉన్న ప్రస్తుత తరుణంలో తాడిపత్రి ప్రగతికి బాటలు వేసిన తనకా? లేకపోతే అభివృద్ధిని అడుగడునా అడ్డుకున్న టీడీపీకా? ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మరో ఐదేళ్ల తాడిపత్రి భవిష్యత్తు ఓటర్లపై ఆధారపడి ఉందన్నారు. ఓటు వేసే సమయంలో ఏ మాత్రం పొరపాటు చేసిన దాని ప్రభావం సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, తాడిపత్రి అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. తాడిపత్రిలో అభివృద్ధి, ప్రశాంతతకు పెద్దపీట వేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాటలు విని ఆ పార్టీకి ఓటు వేస్తే అరాచకాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం, మట్కా, పేకాట, అసాంఘిక శక్తులకు ఊతమిస్తూ అభివృద్ధి నిరోధకులుగా మారే ప్రమాదముందన్నారు. 40 ఏళ్లుగా జేసీ కుటుంబ ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా ఎదురైన పరిస్థితులను తాడిపత్రి ప్రజలు కళ్లారా చూశారన్నారు. జేసీ అరాచకాలకు చరమగీతం పాడుతూ 2019 ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, దీంతో ప్రజలు ఆశించినట్లుగానే తాడిపత్రి ప్రాంతంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించానన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ అందజేశామన్నారు. ఎలాంటి వివక్ష చూపకుండా ప్రాధాన్యత క్రమంలో ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన కన్యకాపరమేశ్వరీ ఆలయం వద్ద జేసీ కట్టించిన యూరినల్స్‌ను తొలగించి, వారి ఆత్మాభిమాన్ని నిలబెట్టానన్నారు. ఎన్నో ఏళ్లుగా ఏటా డిసెంబర్ నుంచి నెలన్నర పాటు మాలధారులకు అయ్యప్పస్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జేసీ అడ్డుకుంటే, ఎమ్మెల్యేగా తాను గెలిచిన తర్వాత పునరుద్ధరించానన్నారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుపై వేసే ప్రతి ఓటూ నేరుగా వైఎస్ జగన్‌కు చేరి అభివృద్ధికి, సంక్షేమానికి బాటలు వేస్తాయన్నారు. -
తాడిపత్రిలో ఎగిరేది మన జెండానే
-
జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం
-
'అధిష్టానం ఆదేశిస్తే బాబుపై పోటీకి సై!' : ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనంతపురం: వైఎస్సార్సీపీ అధిష్టానం నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. అవసరమైతే కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయాలని ఆదేశిస్తే శిరసావహిస్తానని స్పష్టం చేశారు. గురువారం అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దవడుగూరులో బుధవారం జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలు ఖండించారు. తాను దొంగను కాదని, రైతు బిడ్డనని.. జేసీ కుటుంబంలా అవినీతి, అక్రమాలు చేసి డబ్బు పోగు చేసుకోలేదన్నారు. పెద్దవడుగూరులో రైతులు నష్టపోతే ప్రభుత్వం ద్వారా పరిహారం వచ్చేలా చేశానన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయం తన రక్తంలోనే లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో జేసీ కుటుంబం రాజకీయ లబ్ది కోసం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. గతంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసిన పనులు, తాను అధికారంలో ఉన్న ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిపై ఎప్పుడు బహిరంగ చర్చ పెట్టినా తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. మిడ్ పెన్నార్ డ్యాం ద్వారా రెండు పంటలకు నీరిచ్చిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదన్నారు. తాడిపత్రిలో ఈ సారి ఎన్నికల బరిలో ఎవరు నిలబడాలనే అంశంపై జేసీ కుటుంబసభ్యుల మధ్యే సందిగ్ధత నెలకొందని, మధ్యలో కాలవ శ్రీనివాసులు సమీప బంధువు దూరి పరిస్థితిని మరింత జఠిలం చేశారన్నారు. తాడిపత్రిలో ఎవరు పోటీచేసిన గెలుపు వైఎస్సార్‌సీపీదేనన్నారు. ఇవి చదవండి: ఏపీ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం.. నేడు, రేపు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష -
జేసీ అక్కసు రాజకీయాలు.. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ
‘కుక్కతోక వంకర ’ అన్న చందంగా ఉంది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారం. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఆయన బుద్ధిలో మాత్రం ఏ మార్పూ రాలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం సేవ్ తాడిపత్రి పేరుతో మొసలి కన్నీరు కార్చి బోటాబోటీగా గెల్చి మున్సిపల్ చైర్మన్ పీఠమెక్కారు. చైర్మన్ స్థానంలో తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన జేసీ.. అందుకు భిన్నంగా అభివృద్ధి పనులకు మొకాలడ్డుతున్నారు. తాడిపత్రి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే అభివృద్ధి పనులు పూర్తయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న అక్కసుతో జేసీ ప్రభాకర్‌రెడ్డి అభివృద్ధి పనులన్నింటినీ తన పచ్చ మూకలను అడ్డుపెట్టుకుని అడ్డుకుంటున్నాడు. సొంత పార్టీ నేతల అసంతృప్తి.. జేసీ ఒంటెద్దు పోకడలు నచ్చక సొంత పారీ్టలోని కొందరు నాయకులు ఇప్పటికే టీడీపీని వీడారు. మరికొందరు వీడేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందో? రాదోనన్న ఆందోళనతో తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షుద్ర రాజకీయాలతో పట్టణాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారన్న విమర్శలున్నాయి. రాత్రికి రాత్రే నిర్మాణాల కూల్చివేత.. తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని జేసీ టీం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుందన్న ఆరోపణలున్నాయి. అయితే నాడు – నేడు ఫేజ్ 2 పనుల్లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారు. జూనియర్ కళాశాల సమీపంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం ఉండడంతో ప్రహరీ వల్ల తన వారికి ఎక్కడ ఇబ్బందులు కలుగుతాయోనని గత నెల 19న రాత్రి ప్రభుత్వ వ్యయంతో అప్పటి వరకూ చేపట్టిన ప్రహరీ పనులను కూలి్చవేó శారు. తన పచ్చబ్యాచ్‌తో రాత్రికి రాత్రే కాంక్రీట్ పిల్లర్లను కూలి్చవేసి, గుంతలను పూడ్చివేశారు. మరుసటి రోజు కూలీలు పని చేపట్టేందుకు ప్రదేశానికి వెళ్లగా మేస్త్రీ, కూలీలను పనులు చేపట్టకూడదని హుకుం జారీ చేశారు. మేస్త్రీ గురుశంకర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బందోబస్తు మధ్య తిరిగి కళాశాల ప్రహరీ నిర్మాణ పనులు సాగేలా చూశారు. దీన్ని జీరి్ణంచుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరుడి చేత కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చి మరీ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులు ముందుకు సాగకుండా అడ్డుపుల్లేశారు. మరికొన్ని ఇలా.... ► వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు తాడిపత్రి పట్టణం, ఆంజనేయస్వామి మాన్యంలోని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేద ప్రజలకు మేలు జరగడాన్ని జీరి్ణంచుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులచే హైకోర్టులో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడ్డారు. ►పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లోని మున్సిపల్ స్థలంలో ఆరోగ్య ఉపకేంద్ర భవనం నిర్మించడం గిట్టక తన అనుచరుడు, ఓ టీడీపీ కౌన్సిలర్‌తో హైకోర్టులో పిటీషన్ వేయించి ఆ పనులకూ ఆటంకం కలిగించారు. ►తాడిపత్రిలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ మంజూరుకు ఒప్పించారు. అప్పటి ఎస్పీ కూడా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఎమ్మెల్యే సొంత డబ్బుతో స్టేషన్ నిర్మాణం చేపట్టడాన్ని ఓర్వలేక మళ్లీ ఓ టీడీపీ కౌన్సిలర్‌తో హైకోర్టులో పిటీషన్ వేయించారు. నిర్మాణ పనులు ముందుకు సాగకుండా స్టే తెప్పించారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. ► ఆటోనగర్ సమీపంలో జగనన్న ఇళ్ల నిర్మాణాల కోసం అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు గతంలో అక్రమంగా ఇళ్ల స్థలాలు పొంది, రద్దయిన పట్టాలను తిరిగి ఇవ్వాలంటూ వారిచే కోర్టులో కేసు వేయించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. జేసీ తీరుపై సర్వత్రా విమర్శలు.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి సహకరించాల్సింది పోయి అడుగడుగునా అడ్డుకోవడం సమంజసం కాదని పట్టణ ప్రజలు అంటున్నారు. ప్రశాంతత చెడగొట్టేందుకే... ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపొందిన అనంతరం తాడిపత్రి నియోజకవర్గంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేశారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, శాంతిభద్రతలను వారు అదుపులో ఉంచేలా కృషి చేశారు. అయితే మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితానికి చెక్ పడడంతో మింగుడుపడని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎలాగైనా తిరిగి పట్టు సాధించేలా నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకు కుట్రపన్నుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. -
జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి సవాల్..
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. ఒక రోజంతా మనమిద్దరం ఒక గదిలో ఉందాం.. దమ్ముంటే నన్ను చంపుతావా? అని సవాల్ చేశారు. ప్రభాకర్ రెడ్డి బెదిరింపు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కాగా, ఎమ్మెత్యే కేతిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నన్ను చంపేస్తానని ప్రతీరోజు ప్రభాకర్ రెడ్డి అరుస్తున్నారు. నువ్వు-నేను ఒక గదిలో ఉందాం. రోజంతా టైమ్ ఇస్తాను. నన్ను చంపుతావా?. అడుగు తీసి అడుగు వేయలేని ప్రభాకర్ రెడ్డి బెదిరింపు హాస్యాస్పదం. తాడిపత్రిలో టీడీపీ లీడర్ ఎవరో అర్థం కాక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. తాడిపత్రి టీడీపీ ఇంఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి వీకెండ్ పొలిటీషియన్. ఉనికి కోసమే ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో హడావుడి చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం గద్వాల్లో దొంగతనాలు చేసి తాడిపత్రికి వలస వచ్చారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారం తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ఉంది. త్వరలో ఆయా రాష్ట్రాల్లో కేసులు వేస్తాం. బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి నాగాలాండ్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన నీచ చరిత్ర ప్రభాకర్ రెడ్డిది. నన్ను పదే పదే ఆయన రెచ్చగొడుతున్నారు. సానుభూతిలో తన కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకుందామన్న ఆలోచనలో జేసీ ఉన్నారు. జేసీ బ్రదర్స్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే త్రిశూల్ సిమెంట్ వ్యవహారంలో ప్రభుత్వం విధించిన వంద కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: నన్ను పిలవకపోవడం దుర్మార్గం.. అసలు విలన్ పురంధరేశ్వరి: లక్ష్మీపార్వతి -
సీఐ ఆనందరావు ఆత్మహత్యపై జేసీవి శవరాజకీయాలు:కేతిరెడ్డి పెద్దారెడ్డి
సాక్షి, అనంతపురం: సీఐ ఆనందరావు ఆత్మహత్య అంశంలో తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైరయ్యారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య ను రాజకీయం చేయడం దురదృష్టకరమని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఆత్మహత్యకు అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. టీడీపీ పాలనలో పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుసని అన్నారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య కేసును పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారించాలని కోరారు. తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లాక తలుపులు బిగించుకొని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు... తాడిపత్రి సీఐ ఆనందరావు మృతికి కుటుంబ కలహాలే కారణమని తెలిపారు. ఇదీ చదవండి: ఆత్మహత్యకు పాల్పడ తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు -
'పోలీసులంటే జేసీ బ్రదర్స్ కు ఎందుకంత చులకన'
సాక్షి, తాడిపత్రి : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం తీవ్రంగా ఖండించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఓ గూండాలాగా ప్రవర్తించారు. పోలీసులపై జేసీ అనుచిత ప్రవర్తన సరికాదు.. పోలీసులంటే జేసీ బ్రదర్స్ కు ఎందుకంత చులకన అంటూ ప్రశ్నించారు. ఒక ప్రజాపతినిధిగా పనిచేసిన వ్యక్తి పోలీసులను హిజ్రాలతో పోల్చడం దారుణమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బహింరంగంగానే పోలీసులకు వార్నింగ్ ఇచ్చారన్నారు. జేసీ బ్రదర్స్ ఆగడాలపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించాలని కోరారు. దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీలపై లోతుగా విచారించి జేసీ బ్రదర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దారెడ్డి వెల్లడించారు.(జేసీ వర్గీయుల హంగామా.. నిలిచిన 108 అంబులెన్సు) -
'జేసీ బ్రదర్స్ దొంగల కన్నా హీనం'
సాక్షి, అనంతపురం : యాడికి మండలం కోన ఉప్పలపాడులో జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన త్రిశూల్ ఫ్యాక్టరీ భూములను అఖిలపక్ష నేతలతో కలిసి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ.. త్రిశూల్ సిమెంట్స్ అనుమతుల రద్దును స్వాగతిస్తున్నామని తెలిపారు. త్రిశూల్ సిమెంట్స్ పేరుతో జేసీ దివాకర్‌రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. పరిశ్రమ స్థాపించి ఉద్యోగాలు కల్పించకుండా అన్యాయం చేశారని,రూ.200 కోట్ల విలువైన సున్నపురాయి గనులను జేసీ కొల్లగొట్టారని పేర్కొన్నారు. జేసీ బ్రదర్స్ దొంగల కన్నా హీనమని, జేసీ దివాకర్‌రెడ్డి అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దివాకర్‌రెడ్డ్డిపై బినామి చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పెద్దారెడ్డి పేర్కొన్నారు. (జేసీ వర్గీయుల అక్రమాలు బట్టబయలు) -
శుభోదయం తాడిపత్రి కార్యక్రమం నిర్వహించిన హర్షవర్దన్ రెడ్డి
-
తాడిపత్రిలో ‘జేసీ’కి వ్యతిరేక పవనాలు..
సాక్షి, తాడిపత్రి : తాడిపత్రినియోజకవర్గం.. అనంతపురం జిల్లాలోని ఈ సిగ్మెంట్లో జేసీ కుటుంబీకులదే హవా..జేసీ కుటుంబసభ్యులే ఏడుసార్లు ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి మాత్రం తాడిపత్రి ఓటర్లు జేసీ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వనున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో దివాకర్‌రెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. దివాకర్‌రెడ్డి అనంతపురం ఎంపీగా గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ప్రత్యక్షరాజకీయాల నుంచి విశ్రమించారు. వారి వారసులను బరిలోకి దించారు. తాడిపత్రి నుంచి ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా, జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నుండి తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీచేస్తున్నారు. జేసీ బ్రదర్స్‌కు వ్యతిరేకంగా.. స్థానికంగా జేసీ దివాకర్ రెడ్డి ఎదురులేని నాయకుడిగా ఎదిగారు. అయితే ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తాడిపత్రిలో అరాచకం ఎక్కువైంది. ‘లగాన్’ బ్యాచ్ పేరుతో ఒక బృందం జేసీ కనుసన్నల్లో గ్రానైట్ పరిశ్రమను పీల్చిపిప్పి చేసింది. గెర్డావ్ పరిశ్రమలో కూడా ఉద్యోగాలు, వాహనాలు, ఇతరత్రా వ్యవహారాలన్నీ జేసీ కనుసన్నల్లో సాగుతున్నాయి. చివరకు మునిసిపల్ కాంప్లెక్స్‌లు కూడా జేసీ చెప్పిన వారికే అధికారులు కేటాయిస్తున్నారు. ఇన్నేళ్లుగా వారికి ఎదురు చెప్పలేకపోయిన తాడిపత్రి వాసులు ఇప్పుడు గళం విప్పుతున్నారు. తాడిపత్రిలో పాత టీడీపీ ఖాళీ! జేసీ బ్రదర్స్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరినప్పుడు వారితో కేడర్ టీడీపీలోకి రాలేదు. కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు మొత్తం వైఎస్సార్సీపీలో చేరారు. అప్పటి వరకూ జేసీపై పోటీ చేస్తూ వచ్చిన పేరం నాగిరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటనాయుడు, జగదీశ్వరరెడ్డి, కాకర్ల రంగనాథ్, ఫయాజ్, జయచంద్రారెడ్డి, జేసీ చిత్తరంజన్‌రెడ్డి తదితరలు జేసీకి అండగా నిలిచి టీడీపీని గెలిపించారు. ఆ తర్వాత వారిని జేసీ బ్రదర్స్ దూరం పెట్టారు. ఇది తట్టుకోలేక వారంతా జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇది జేసీ బ్రదర్స్‌కు కోలుకోలేని దెబ్బ. ఇక అన్ని రకాలుగా అండగా ఉన్న భోగాతి నారాయణరెడ్డి కుటుంబం కూడా జేసీ బ్రదర్స్‌ను వీడి వైఎస్సార్సీపీలో చేరింది. ఇలా అందరూ వెళ్లిపోవడంతో బ్రదర్స్, వారి వారసులు మినహా చెప్పుకోదగ్గ ద్వితీయ శ్రేణి నేతలు ఒక్కరూ కూడా జేసీతో ప్రస్తుతం లేరు. అస్మిత్‌కు అంతా వ్యతిరేకం.. రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న జేసీ అస్మిత్‌రెడ్డి, బలమైన పెద్దారెడ్డిని ఢీకొట్టబోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు జేసీ బ్రదర్స్‌కు అనుకూలంగా లేవు. అందరిపై నోరు పారేసుకోవడం, తాడిపత్రి తమ సొత్తు అనేలా ప్రవర్తిస్తుండటతో జేసీ బ్రదర్స్ అంటే తాడిపత్రి ప్రజలకు మింగుడుపడని పరిస్థితి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అస్మిత్‌రెడ్డి నెగ్గుకురావడం కష్టమే అనే చర్చ సాగుతోంది. ఆత్మవిశ్వాసంతో పెద్దారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో వైఎస్సార్సీపీ బాధ్యతలు తీసుకున్న తర్వాత జేసీ బ్రదర్స్‌ను గట్టిగా నిలువరించారు. దీంతో భారీగా పార్టీలో చేరారు. పెద్దారెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు కదనోత్సాహంతో ఉన్నాయి. తాను గెలిస్తే తాడిపత్రికి వాక్స్వాతంత్య్రం తీసుకొస్తానని పెద్దారెడ్డి చెబుతూ ప్రజలను ఆకర్షిస్తోంది. మొత్తం ఓటర్లు: 2,20,678 పురుషులు : 1,10,923 మహిళలు : 1,09,745 – మొగిలి రవివర్మ, సాక్షిప్రతినిధి, అనంతపురం -
తాడిపత్రికి విముక్తి కలిగిస్తాం : కేతిరెడ్డి
సాక్షి, తాడిపత్రి అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో వైఎస్సార్సీపీ జెండా ఎగిరేసి జేసీ సోదరుల కబంధహస్తాల్లో చిక్కుకున్న తాడిపత్రికి విముక్తి కల్గిస్తామని తాడిపత్రి వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం తాడిపత్రిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆద్యంతం జేసీ బ్రదర్స్‌పై నిప్పులు చెరిగారు. తాడిపత్రి ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకునే రోజు దగ్గర్లోనే ఉంది. జగనన్న రాజ్యం రావాలంటే మనమందరం కలిసి కట్టుగా పోరాటం చేయాలన్నారు. జేసీ సోదరుల రాక్షస పాలనకు చరమగీతం పాడాలంటే ఓటు అనే ఆయుధంతో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీలోనే బీసీలకు పెద్దపీట బడుగు,బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించడంలో వైఎస్.జగనన్న ఎప్పుడూ ముందుంటారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలకు బీసీ అభ్యర్థులనే ప్రకటించిన వైఎస్.జగన్ తన విశ్వసనీయతను చాటుకున్నాడు. పార్లమెంటు ఇద్దరికీ ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేనప్పటికీ ముందుగా మాట ఇచ్చిన విధంగానే రెండు పార్లమెంటు స్థానాలను బీసీలకు ఇచ్చి తన చిత్తశుద్ది నిరూపించుకున్నాడు రాబోయే ఎన్నికల్లో విశ్వసనీయతకు, విలువలకు పట్టం కట్టండి. ఫ్యానుగుర్తుకు ఓటువేసి జేసీ సోదరుల అరాచకపాలనకు చరమగీతం పాడదాం. – తలారి రంగయ్య, అనంతపురం వైఎస్సార్సీపీ పార్లమెంటు అభ్యర్థి. భయపడాల్సిన అవసరం లేదు తాడిపత్రి ప్రజలు మనసాక్షిగా ఓటేయండి ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. టీడీపీ వారు డబ్బు ఇస్తే అది ఒక్కసారి మాత్రమే ఇస్తారు. కాని జగనన్న సీఎం అయితే ప్రతి ఏడాది రూ.20వేలు ఇస్తాడు. మహిళలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. తాడిపత్రిలో మార్పు అవసరం.వచ్చే ఎన్నికల్లో మార్పు తథ్యం. –ఆలూరి సాంబశివారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు. జేసీ గుండెల్లో రైళ్లు వైఎస్.జగన్ సభతో జేసీ గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. జేసీ సోదరుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వైఎస్.జగన్ సీఎం అయితే తనను జైలులో పెడతారని ఎంపీ జేసీ చేస్తున్న వ్యాఖ్యలు త్వరలోనే నిజమవుతాయి. ఎంపీ దివాకర్‌రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్ళడం తథ్యం. –పైలా నరసింహయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి జగనన్నను సీఎం చేసుకుందాం వైఎస్.జగనన్నను సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముస్లిం సోదరులు ఒక సారి ఆలోచించాలి. మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఉండకపోతే ఈరోజు పేద ముస్లింల పరిస్థితి ఎంతో దారుణంగా ఉండేదని ఆ మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల ఎంతో మంది పేద ముస్లిం మైనార్టీల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. నవరత్నాల పథకాలతో మన భవిష్యత్తు మారబోతోంది. వైఎస్.జగన్ సీఎం కావడం తథ్యం. –గయాజ్‌బాషా, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మంచి పాలన వైఎస్. జగన్‌తోనే సాధ్యం ప్రజలకు మంచి పాలన అందించాలంటే అది ఒక్క వైఎస్.జగన్‌తోనే సాధ్యం. రైతుల కష్టసుఖాలను తెలుసుకుని రైతాంగానికి పెద్దపీట వేసిన మహానేత వైఎస్సార్‌ను రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని, విలువలను,విశ్వసనీయను పుణికిపుచ్చుకున్న యువనేత వైఎస్.జగనన్న నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం.మంచి నాయకుడు ఉండే రాష్ట్రం అభివృద్ది చెందుతుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని గెలిపించి జగనన్నకు కానుకగా ఇవ్వాలి. - పేరం స్వర్ణలత, వైఎస్సార్సీపీ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి తాడిపత్రిని చెడగొట్టకండి తాడిపత్రిలో గ్రానైట్రంగం జేసీసోదరుల నిర్వాకం వల్ల మూతపడిపోతోంది. 2014 ఎన్నికల్లో గ్రానైట్ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే జేసీ పీఆర్ గ్రానైట్ పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉంటుందని విజిలెన్స్ దాడులు ఏవీ ఉండవని హామీ ఇచ్చి, వారి ఓట్లతో లబ్దిపొంది నేడు వారిపై కక్షసాధింపుచర్యలకు పూనుకున్నాడు. జేసీ సోదరులారా ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది.- జగదీశ్వర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు -
జేసీకి ‘కాక’ర్ల బ్రదర్స్
సాక్షి, తాడిపత్రి అర్బన్: జేసీ సోదరుల పతనం ప్రారంభమైంది. ఇప్పటికే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా దూరం కాగా.. సొంత ఊళ్లోనే వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడింది. తాజాగా వ్యతిరేక వర్గం కూడా కేతిరెడ్డి తరఫున ప్రచారం చేస్తూ ఒక్కసారి మార్పును కోరుకుందామని ప్రజలను కోరుతున్నారు. ఈ కోవలోనే కాకర్ల రంగనాథ్ సోదరులు మంగళవారం తాడిపత్రి మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ‘‘తాడిపత్రి ప్రాంతంలో జేసీ సోదరుల అరాచకాలకు ఎక్కువయ్యాయి, వాటిని నిలువరించాలంటే వైఎస్సార్ సీపీ తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి తలారి పీడీ రంగయ్యకు ఓటు వేయండి.. అందరం ఒక్కసారి మార్పును కోరుకుందాం.. వైఎస్సార్ సీపీని గెలిపిద్దాం’’ అని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదట హుస్సేనాపురం గ్రామానికి కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డితో పాటు వచ్చిన కాకర్ల సోదరులకు గ్రామస్తులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ఘనస్వాగతం పలికారు. కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డితో పాటు కాకర్ల రంగనాథ్ సోదరులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య, కాకర్ల రంగనాథ్ జగన్నాథ్(జయుడు) రంగనాయకులు, కేతిరెడ్డి సాయి ప్రతాప్‌రెడ్డి, జగ్గి సోదరులు జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్ జయచంద్రారెడ్డి, చిత్తరంజన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వెంకటేష్, రామ్‌శేఖర్, మాజీ కౌన్సిలర్ నాగరంగయ్య, డీఎన్ పెద్దయ్య, మోహన్‌రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
తాడిపత్రిలో జేసీ పోలీస్
తాడిపత్రి (అనంతపురం): తాడిపత్రిలో ఏపీ పోలీసులు లేరని, ఉన్నవాళ్లంతా జేసీ పోలీసులేనని వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక భగత్‌సింగ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారన్నారు. చిన్నపొలమడ వద్ద ఎంపీ తన 500 మంది అనుచరులతో వెళ్లి టెంట్లు వేసుకుని ఆశ్రమంపై దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారన్నారు. ప్రబోధాశ్రమ భక్తులు ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించినప్పుడు ఇరువార్గాల వారు తీవ్రంగా గాయపడ్డారని.. అయితే ఈ అల్లర్లకు మూల కారణం ఎంపీ జేసీయేనన్నారు. డీఎస్పీ విజయ్‌కుమార్ ప్రతి గ్రామంలో కక్షలను పెంచి పోషించారని, శాంతి భద్రతలను పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఇందుకు తాజా ఉదాహరణ చిన్నపొలమడలో గణేష్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వడమేనన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయని గ్రామస్తులు వివరించినా.. పోలీసులు బలవంతంగా ఆశ్రమం వద్దకు తీసుకెళ్లి ఘర్షణలకు కారణమయ్యారన్నారు. ఘర్షణలకు కారణమైన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన అనుచరులపై పోలీసులు సుమోటోగా స్వీకరించి కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఊరుచింతల గ్రామంలో జంట హత్యలు జరిగాయని, అందుకు రూరల్ సీఐ నారాయణరెడ్డి పరోక్షంగా సహకరించారని ఆరోపించారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం లేదని, సామాన్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళితే జేసీ సోదరుల అనుమతి లేనిదే అంగీకరించడం లేదన్నారు. ఇక్కడి పోలీసులకు ఉన్నతాధికారులంటే జేసీ సోదరులేనని వ్యాఖ్యానించారు. ఇటీవల చుక్కలూరులో ఓ దళితునిపై దాడి జరిగిందని, ఈ విషయంలో జేసీ అనుచరునికి చెందిన ఓ బ్రోకర్‌పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా రూరల్ సీఐ కేసు నమోదు చేయలేదన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సభ్య సమాజం తలదించుకునేలా పోలీస్‌స్టేషన్ ముందు 24గంటల పాటు ధర్నా చేసిన ఎంపీ జేసీపై పోలీసులు ఎంతుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. అదే మరెవరైన పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా చేస్తే వారి గుడ్డలు ఊడదీసి కొట్టిన సందర్భాలు లేవా అన్నారు. ప్రబోధాశ్రమంపై దాడి చేసిన ఎంపీ జేసీ, ఆయన అనుచరులపై వచ్చే 15లోపు కేసు నమోదు చేయకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు. ఎక్కడైనా ఘర్షణలు జరిగితే ఇరువార్గలపై కేసులు నమోదు చేస్తారని.. తాడిపత్రిలో మాత్రం పోలీసులు ఒక వర్గానికే కొమ్ము కాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసుల వైఖరి ఇదే విధంగా కొనసాగితే బీహార్ తరహాలో ప్రతి నాయకుడూ ఒక దళాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. ప్రజల్లో రానురాను పోలీసులపై నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. -
‘వైఎస్ జగన్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం’
అనంతపురం : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి శనివారం వైఎస్ఆర్ సీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి తదితరులు తాడిపత్రిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేతలు మాట్లాడుతూ ... ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లో పోలీసులు పని చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి ప్రజలకు అందుబాటులో ఉంటానని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడతానని ఆయన తెలిపారు. కాగా అంతకు ముందు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వస్తున్న ఆయనను అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలంటూ వై.విశ్వేశ్వరరెడ్డి ఆందోళన చేపట్టడంతో నిన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.