జేసీ అక్కసు రాజకీయాలు.. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ | JC Prabhakar Reddy Over Action in Tadipatri - Sakshi
Sakshi News home page

జేసీ అక్కసు రాజకీయాలు.. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ

Published Mon, Sep 4 2023 11:32 AM | Last Updated on Mon, Sep 4 2023 12:46 PM

JC Prabhakar Reddy Over Action in Tadipatri  - Sakshi

‘కుక్కతోక వంకర ’ అన్న చందంగా ఉంది తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారం. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఆయన బుద్ధిలో మాత్రం ఏ మార్పూ రాలేదు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్ల కోసం సేవ్‌ తాడిపత్రి పేరుతో మొసలి కన్నీరు కార్చి బోటాబోటీగా గెల్చి మున్సిపల్‌ చైర్మన్‌ పీఠమెక్కారు. చైర్మన్‌ స్థానంలో తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన జేసీ.. అందుకు భిన్నంగా అభివృద్ధి పనులకు మొకాలడ్డుతున్నారు.  

తాడిపత్రి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే అభివృద్ధి పనులు పూర్తయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న అక్కసుతో జేసీ ప్రభాకర్‌రెడ్డి అభివృద్ధి పనులన్నింటినీ తన పచ్చ మూకలను అడ్డుపెట్టుకుని అడ్డుకుంటున్నాడు.  

సొంత పార్టీ నేతల అసంతృప్తి.. 
జేసీ ఒంటెద్దు పోకడలు నచ్చక సొంత పారీ్టలోని కొందరు నాయకులు ఇప్పటికే టీడీపీని వీడారు. మరికొందరు వీడేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు తనకు ఎమ్మెల్యే టికెట్‌ వస్తుందో? రాదోనన్న ఆందోళనతో తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షుద్ర రాజకీయాలతో పట్టణాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారన్న విమర్శలున్నాయి.  

రాత్రికి రాత్రే నిర్మాణాల కూల్చివేత.. 
తాడిపత్రి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానాన్ని జేసీ టీం  అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుందన్న ఆరోపణలున్నాయి. అయితే నాడు – నేడు ఫేజ్‌ 2 పనుల్లో భాగంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారు. జూనియర్‌ కళాశాల సమీపంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం ఉండడంతో ప్రహరీ వల్ల తన వారికి ఎక్కడ ఇబ్బందులు కలుగుతాయోనని గత నెల 19న రాత్రి ప్రభుత్వ వ్యయంతో అప్పటి వరకూ చేపట్టిన ప్రహరీ పనులను కూలి్చవేó శారు. తన పచ్చబ్యాచ్‌తో రాత్రికి రాత్రే కాంక్రీట్‌ పిల్లర్లను కూలి్చవేసి, గుంతలను పూడ్చివేశారు.

మరుసటి రోజు కూలీలు పని చేపట్టేందుకు ప్రదేశానికి వెళ్లగా మేస్త్రీ, కూలీలను పనులు చేపట్టకూడదని హుకుం జారీ చేశారు. మేస్త్రీ గురుశంకర్‌ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బందోబస్తు మధ్య తిరిగి కళాశాల ప్రహరీ నిర్మాణ పనులు సాగేలా చూశారు. దీన్ని జీరి్ణంచుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరుడి చేత కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చి మరీ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులు ముందుకు సాగకుండా అడ్డుపుల్లేశారు. 

మరికొన్ని ఇలా.... 
► వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు తాడిపత్రి పట్టణం, ఆంజనేయస్వామి మాన్యంలోని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేద ప్రజలకు మేలు జరగడాన్ని జీరి్ణంచుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులచే హైకోర్టులో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడ్డారు.
 
►పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌లోని మున్సిపల్‌ స్థలంలో ఆరోగ్య ఉపకేంద్ర భవనం నిర్మించడం గిట్టక తన అనుచరుడు, ఓ టీడీపీ కౌన్సిలర్‌తో హైకోర్టులో పిటీషన్‌ వేయించి ఆ పనులకూ ఆటంకం కలిగించారు. 

►తాడిపత్రిలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ మంజూరుకు ఒప్పించారు. అప్పటి ఎస్పీ కూడా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఎమ్మెల్యే  సొంత డబ్బుతో స్టేషన్‌ నిర్మాణం చేపట్టడాన్ని ఓర్వలేక మళ్లీ ఓ టీడీపీ కౌన్సిలర్‌తో హైకోర్టులో పిటీషన్‌  వేయించారు. నిర్మాణ పనులు ముందుకు సాగకుండా స్టే తెప్పించారు. దీంతో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణ పనులు ఆగిపోయాయి.  

► ఆటోనగర్‌ సమీపంలో జగనన్న ఇళ్ల నిర్మాణాల కోసం అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతే కాదు గతంలో అక్రమంగా ఇళ్ల స్థలాలు పొంది, రద్దయిన పట్టాలను తిరిగి ఇవ్వాలంటూ వారిచే కోర్టులో కేసు వేయించి అడ్డుకునే ప్రయత్నం చేశారు.  

జేసీ తీరుపై సర్వత్రా విమర్శలు.. 
ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు మున్సిపల్‌ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి సహకరించాల్సింది పోయి అడుగడుగునా అడ్డుకోవడం    సమంజసం కాదని పట్టణ ప్రజలు అంటున్నారు.
 
ప్రశాంతత చెడగొట్టేందుకే... 
ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపొందిన అనంతరం తాడిపత్రి నియోజకవర్గంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేశారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, శాంతిభద్రతలను వారు అదుపులో ఉంచేలా కృషి చేశారు. అయితే మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితానికి చెక్‌ పడడంతో మింగుడుపడని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎలాగైనా తిరిగి పట్టు సాధించేలా నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకు కుట్రపన్నుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement