jc prabakar reddy
-
తాడిపత్రిలో టెన్షన్.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై...
సాక్షి, అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. తాజాగా వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులే దాడి చేసినట్టు బాధితులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. అనంతపురంలోని పెద్దవడగూరు మండలం అప్పేచర్లలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అరాచకం సృష్టించారు. గురువారం ఉదయం వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తల తలకు బలమైన గాయం కావడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల దాడి విషయాన్ని వైఎస్సార్సీపీ కార్యకర్త భాస్కర రెడ్డి సెల్ఫీ వీడియోలో వివరించారు.ఇదిలా ఉండగా.. తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై దళిత సంఘం నేత రాంపుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను ఫోన్లో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెదిరించిన జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటిదాకా ఎన్ని కేసులు నమోదు అయ్యాయి. వాటి వివరాలు చెప్పాలని సమాచార చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీకి రిజిస్టర్ పోస్టు ద్వారా వివరాలను పంపించారు. -
జేసీ కక్ష.. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేత
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అన్ని అనుమతులు ఉన్నా కానీ రమేష్ రెడ్డి ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేత రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్సార్సీపీ కార్యకర్త పొలానికి మళ్లీ నిప్పు మరో ఘటనలో రాప్తాడు మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఓబులేష్, వసంత్‌కు చెందిన పొలానికి మళ్లీ నిప్పు పెట్టారు. మండలంలోని గొందిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధి (పులల్లరేవు) పరిధిలోని సర్వే నంబర్ 103–2 (88–3)లో 4.90, 103–3 (88–3)లో పెద్ద ఓబులేష్, వసంత్ తమకున్న 7.76 ఎకరాల వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పొలంలో రెండేళ్ల క్రితం దాదాపుగా 400 అల్ల నేరేడు మొక్కలను నాటారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఓబులేష్‌కు చెందిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఈ ఏడాది జనవరి 17న 15 చెట్లు, అలాగే జనవరి 21న 40 చెట్లను టీడీపీ నాయకులు నరికి వేశారు. మళ్లీ ఈ నెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఓబులేష్ తోటకు నిప్పు పెట్టడంతో కొన్ని చెట్లు కాలిపోయాయి.వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్ పరికరాలు, మోటర్ సెల్ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా 4 ఎకరాల్లో పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంప కాలిపోయింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జేసీ ప్రభాకర్‌పై కేసు నమోదు.. షాకిచ్చిన మాధవీలత
సాక్షి, తాడిపత్రి/హైదరాబాద్: తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. సినీ నటి, బీజేపీ నేత మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జేసీ.. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు, ఆయన అనుచరులు తనను బెదిరిస్తున్నారని మాధవీలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy)పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత మాధవీలత(Madhavi Latha) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, మాధవీలత మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు.ఈ క్రమంలో మాధవీలత కామెంట్స్ తప్పుబడుతూ జేసీ అనుచితంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తనను కించపరిచేలా జేసీ మాట్లాడారంటూ మాధవీలత ఫిర్యాదులో వెల్లడించారు. అలాగే, జేసీ అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా జేసీ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా చెప్పుకొచ్చారు.క్షమాపణలు చెప్పిన జేసీతన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో నోరు జారాను, టంగ్ స్లిప్ అయింది.. సారీ అంటూ వ్యాఖ్యానించారు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మాధవి కన్నీళ్లు పెట్టుకుని ఒక వీడియో పంచుకుంది. ‘మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాధవీలత ఫిల్మ్ ఛాంబర్లో కూడా ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజికి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాధవీలత..‘జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు’ అని అన్నారు. -
తాడిపత్రిలో టెన్షన్.. కేతిరెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అనంతరం, తాడిపత్రి నియోజకవర్గంలోకి కేతిరెడ్డి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.తాడిపత్రిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం ఉదమయే కేతిరెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని గృహ నిర్బంధంలోనే ఉంచారు. అనంతరం, కేతిరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు.ఇదిలా ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ వర్గీయులు రెచ్చిపోతున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఏడు నెలలుగా అడ్డంకులు సృష్టిస్తూన ఉన్నారు. జేసీ కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ, పోలీసుల తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం తాడిపత్రిలోకి ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ ప్రశ్నించారు. దీంతో, తిమ్మంపల్లి గ్రామంలో పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జేసీ ప్రభాకర్‌పై పోలీసులకు మాధవీలత ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై (Madhavi Latha అనంతపురం జిల్లా టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ( J. C. Prabhakar Reddy) చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. తాజాగా, జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాధవీలత సైబరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించారు. తనపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం సైబరాబాద్ సీపీని కలిసిన మాధవీలత రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ..‘జేసీ మాటలతో నేను, నా కుటుంబం ఇబ్బంది పడ్డాం. క్షమాపణ చెప్పానంటే సరిపోతుందా? నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా’ అంటూ మాధవీలత ప్రశ్నలు కురిపించారు. జేసీ ప్రభాకర్ మాటలతో చాలా ఇబ్బంది పడ్డానని తెలిపారు. ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా? అని మాధవీలత నిలదీశారు. అంతకుముందు ఆమె ఫిలింఛాంబర్లోనూ ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదుజేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్లో నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజికి(Siva Balaji) పిర్యాదు పత్రాన్ని ఆమె అందజేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని తన సోషల్‌మీడియాలో ఆమె పేర్కొన్నారు.లేఖలో మాధవీలత ఏమన్నారంటే?'జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.' అని ఆమె అన్నారు.అసలు వివాదం ఏంటి?నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఆయనతో పాటు టీడీపీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ మల్లికార్జున కూడా పరుష పదజాలంతో మాట్లాడారు. మాధవీలతకు సంబంధించిన చిత్రాలను చూపిస్తూ అశ్లీలంగా నటించిందంటూ వ్యాఖ్యానించారు.మీరు థర్డ్ జెండర్ కంటే అధ్వానం..జేసీ ప్రభాకర్‌రెడ్డి బీజేపీని, దాని అనుబంధ సంస్థలనూ వదల్లేదు. ‘మాధవీలత బతుకుదెరువు కోసం ఏదో పాట్లు పడుతోంది, పడనివ్వండి. ఆమె మాకు నీతులు చెప్పకూ డదు. భజరంగదళ్, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్.. ఇలాంటి వాళ్లా నన్ను బెదిరించేది? వాళ్లకంటే థర్డ్‌జెండర్ (ట్రాన్స్‌జెండర్)లు మేలు’ అని వ్యాఖ్యానించారు.బీజేపీ వాళ్లు నా వెంట్రుక కూడా పీక్కోలేరు.. సిగ్గులేని నా కొ...కల్లారా అంటూ ఫైర్ అయ్యారు. తన బస్సును కాల్చిన తర్వాత ఆ వేడికి కరెంటు వైర్లు పడ్డాయని.. కానీ, షార్ట్ సర్క్యూట్ అని రాసుకున్నారని, అలాగే రాసుకోండని జేసీ అన్నారు. తన వర్గం మహిళలతో మాధవీలత పైనే తాడిపత్రి పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించారు.కేసులకు భయపడను: మాధవీలతజేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఇలాగైతే తాడిపత్రి నుంచి తెర మీదకు ఎవరూ రాకూడదన్నట్లు ఉందన్నారు.తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు. -
నోట్ల కట్టలు విసురుతూ.. జేసీ హాట్ కామెంట్స్
-
కూటమిలో కుంపటి.. జేసీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. నిన్న బీజేపీ నేతలపై జేసీ సంచలన వ్యాఖ్యలు చేయగా.. నేడు ప్రభాకర్ రెడ్డికి కాషాయ పార్టీ నేతలు కౌంటరిచ్చారు. ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ పార్టీ కంట్రోల్ చేయాలని బీజేపీ నేత హితవు పలికారు.తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీనటి మాధవీలతపై జేసీ వ్యాఖ్యలు జుగుప్సాకరం. ప్రభాకర్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. బీజేపీ నేతలను హిజ్రాలతో పోల్చటం జేసీ ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనం. అధికారంలో ఉన్నప్పుడే జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం చేస్తారు. అధికారం లేకపోతే పలాయనం.. జేసీ విధానం. ఇప్పటికైనా ప్రభాకర్ రెడ్డిని టీడీపీ కంట్రోల్ చేయాలి. ఆయన ఇలాంటి వైఖరితో టీడీపీ ప్రభుత్వానికే చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇక, అంతకుముందు ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్యా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్.. నాపై లేనిపోని ఆరోపణలు చేశాయని మండిపడ్డారు. జేసీ ఈవెంట్‌పై విమర్శలు చేసిన బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.అలాగే, అనంతపురంలో నా బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉండొచ్చంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక, ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగి ఉంటుందని ట్రావెల్స్ మేనేజర్ అనంతపురం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, గురువారం రాత్రి జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం బస్సు ప్రమాదం కుట్రపూరితంగా జరిగినట్లు ఆరోపించడం సంచలనంగా మారింది. ఫ్లైయాష్ వివాదమే కారణమా? నిజానికి.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఆర్టీపీపీలో ఫ్లైయాష్ రవాణా విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి జేసీ ప్రభాకర్‌రెడ్డికి మధ్య ఇటీవల తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో వీళ్లిద్దరి పంచాయతీ సీఎం వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలను ఉద్దేశించి ప్రభాకర్‌రెడ్డి విమర్శించి ఉండవచ్చునని తెలుస్తోంది. -
మరో వివాదంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి,అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రి జేసీ పార్క్‌లో అర్ధరాత్రి దాకా డిస్కో ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్‌కు మహిళలకు మాత్రమే ప్రవేశమంటూ ప్రకటించారు. తాడిపత్రి మహిళలంతా ఎంజాయ్ చేయాలంటూ జేసీ సలహా ఇచ్చారు.అయితే,జేసీ తీరుపై బీజేపీ నేత యామిని శర్మ, సినీనటి మాధవీలత మండిపడ్డారు. సున్నిత ప్రాంతమైన తాడిపత్రిలో ఇలాంటి ఈవెంట్ నిర్వహించడం సరికాదని హెచ్చరించారు. మహిళలకు భద్రత ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
కూటమి సర్కార్ కక్ష సాధింపు.. మున్సిపల్ అధికారుల ఓవరాక్షన్!
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి పాలనలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను కూటమి నేతలు, అధికారులు టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటి నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. అన్ని అనుమతులు ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
కూటమి నేతల కమీషన్ దందా.. జేసీ ప్రభాకర్‌పై ఫిర్యాదు!
సాక్షి, అనంతపురం: కూటమి సర్కార్ పాలనలో లిక్కర్ మాఫియా హవా కొనసాగుతోంది. పలుచోట్ల కూటమి నేతలకు మద్యం షాపులు దక్కకపోవడంతో కమీషన్ల కోసం టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కారణంగా తాడిపత్రిలో నేటికీ నాలుగు మద్యం షాపులు ప్రారంభం కాలేదు.వివరాల ప్రకారం.. తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారులు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో నాలుగు మద్యం షాపులను విజయవాడకు చెందిన వ్యాపారులు గోపీనాథ్, గురునాథం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో తన అనుమతి లేనిదే మద్యం షాపులు ప్రారంభించవద్దని జేసీ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. వ్యాపారులను బెదిరించే ప్రయత్నం చేశారు.దీంతో, నాలుగు మద్యం షాపులు దక్కించుకున్నప్పటికీ తాడిపత్రిలో మాత్రం అవి ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో విజయవాడ మద్యం వ్యాపారులు గోపీనాథ్, గురునాథం.. తమకు భద్రత కల్పించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో మద్యం షాపులు తమ వారికి దక్కకపోవడంతో టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు 15 శాతం కమీషన్ ఇచ్చాకే మద్యం షాపులు నిర్వహించాలని వార్నింగ్ ఇచ్చారు. -
చంద్రబాబును చూసి టీడీపీ సీనియర్లలో జాలి!
‘అనగనగా ఒక ఊరిలో ఒక నాగుపాము ఉండేది. తనకు ఎవరు కనిపిస్తే వారిని కాటేసి చంపేసేది. లేదా, చిన్న జీవులైతే తినేసేది. అదంటే అందరికీ చాలా భయం. కొన్నాళ్లకు ఆ నాగుపాము బాగా ముసలిది అయిపోయింది. ఈలోగా ఒక వేటగాడు దానిని పట్టుకుని కోరలు పీకి మళ్లీ అడవిలో వదిలేశాడు. ఇక కదలలేని పరిస్థితి వచ్చింది. జనం గానీ, మిగిలిన జీవులు గానీ దాన్ని పట్టించుకోవడమే మానేశాయి. దానికి పొట్టగడవడం కూడా కష్టమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఆ దారిలో ఒక సన్యాసి వెళుతూ ఉంటే ఆయనను తనకో దారి చూపించమని ప్రాధేయపడింది. ఆయన దానితో.. ‘నువ్వు కదలలేని, కరవలేని ముసలి పామువి అయిపోయావు గానీ కనీసం బుసకొట్టగలవు కదా.. కాబట్టి బుస కొడుతూ ఉండు.. అందరూ నిన్ను చూసి భయపడతారు’ అని సలహా చెప్పి వెళ్లాడు.ఈ ఐడియా భలే ఉందని ఆ పాముకు అనిపించింది. అప్పటి నుంచి బుస కొట్టడం ప్రారంభించింది. కొన్ని జీవులు భయపడేవి కూడా! కొన్నాళ్లకు వాటన్నింటికీ అసలు విషయం అర్థమైంది. ‘ఈ పాము బుసకొడుతుందే తప్ప.. కాటు వేయలేదు’ అని తెలుసుకున్నాయి. పిల్లి గుడ్డిదైతే ఎలుక దాని ఎదుట బ్రేక్ డ్యాన్స్ చేసినట్టుగా.. చిట్టెలుకలు, చిట్టి కుందేళ్లు కూడా ఆ పాము ఎదుట డిస్కో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాయి. ఆ పాము గట్టిగా బుస కొడుతుంది. కానీ మిగిలిన జీవులు కనీసంగా కూడా పట్టించుకోవడం మానేశాయి. పాపం.. ఆ పాము ముసలి బతుకు అలాగే గడిచిపోయింది’ ఇదీ కథ.ఈ కథకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలకు చిన్న సామ్యం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తానంటే అందరికీ హడల్ అని, తనను చూసి అందరూ జడుసుకుంటూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. తాను రంకె వేస్తే భూకంపం వస్తుందని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆయన పార్టీలోని సీనియర్లలోనే చంద్రబాబు పట్ల భయం కాదు కదా.. జాలి కలుగుతోంది.దేశంలోనే నన్ను మించిన సీనియారిటీ ఉన్న నాయకుడు లేరని ఆయన చెప్పుకుంటూ ఉంటారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా తనను మించిన మహానుభావులు లేరని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ, సొంత పార్టీలో ఆయనకు ఒకప్పుడు ఉన్నంత విలువ, గౌరవం, ఆయన పట్ల భయం ఇప్పుడు లేవు. తాజాగా ఆర్టీపీపీ తడి బూడిద గొడవ ఇందుకు పెద్ద ఉదాహరణ.ఆర్టీపీపీ నుంచి వచ్చే తడి బూడిదను అమ్ముకోవడంలో రోజుకు దాదాపుగా రెండు లక్షల రూపాయల దందా తెలుగుదేశం నేతలు సాగిస్తున్నట్టుగా గుసగుసలున్నాయి. దీనికోసం కూటమి పార్టీల నాయకులే కొట్టుకుంటున్నారు. లోకల్ టీడీపీ భూపేష్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి మధ్య తగాదాలు ముదిరాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్, నారా లోకేష్ రాజీ చర్చలు చేసినా.. వారు దిగిరాలేదు. అప్పుడు బుస కొట్టడానికి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. అందరినీ తన ఎదుట హాజరుకావాలని పురమాయించారు.ఆయన మాటలను జేసీ ప్రభాకర రెడ్డి బేఖాతర్ అన్నారు. బీజేపీ ఆదినారాయణ రెడ్డి వచ్చి తన వాదన చెప్పుకుని వెళ్లిపోయారు. బాబు ‘బుస’లను సొంత పార్టీ వారు కూడా పట్టించుకోవడం లేదు. సొంత పార్టీలోని సీనియర్లు మాత్రమే కాదు, పార్టీలో బొడ్డూడని నాయకులు, తొలిసారి ఎమ్మెల్యే అయిన అప్రెంటిసులు కూడా చంద్రబాబు బుసలను పట్టించుకోవడం లేదు. లోకల్‌గా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దందాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దందాలు చేస్తే తాటతీస్తా అని చంద్రబాబు హెచ్చరిస్తుంటారు. బహుశా ఈ అప్రెంటిస్ ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు హూంకరింపులు చూసి జాలిగా నవ్వుకుంటూ ఉంటారేమో! ఒకప్పట్లో ఎడాపెడా పార్టీ నేతల మీద చర్యలు తీసుకుంటూ మీడియాలో ప్రచారం కోరుకుంటూ తమ మీద రెచ్చిపోతూ వచ్చిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు అప్రెంటీసులకు కూడా లెక్కలేకుండా అయిపోయారని ఇప్పుడు సీనియర్లు బాబు పరిస్థితి మీద జాలిపడుతున్నారు.-ఎం.రాజేశ్వరి -
కోమటికుంట్లలో హైటెన్షన్.. పెద్దారెడ్డిపై దాడులకు టీడీపీ స్కెచ్
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం కోమటికుంట్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై దాడికి టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. కోమటికుంట్లలో ఉన్న పెద్దారెడ్డిపై దాడి చేయాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ క్రమంలో వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పెద్దారెడ్డిపై దాడి చేయాలని టీడీపీ నేతలతో జేసీ ప్లాన్ చేయించారు. కోమటికుంట్ల గ్రామానికి వెళ్లేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తల యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. జేసీ వర్గీయుల అరాచకాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి సిద్ధమయ్యారు.ఇదీ చదవండి: అటు ఆది.. ఇటు జేసీ ‘బూడిద’ రగడ! -
జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
నావల్లనే ప్రాబ్లమ్ అయితుంది అంటే వెళ్లిపోతా: జేసీ
అనంతపురం, సాక్షి: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాల్ని తాను ఇష్టమొచ్చినట్లు తిడతానని, పడాల్సిందేనంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ‘చదువులెందుకంటూ?’ విడ్డూరమైన వ్యాఖ్యలు చేశారాయన.‘‘తాడిపత్రిలో ఆలయాలకు వెళ్లే భక్తులకు క్రమశిక్షణ లేదు. జనాలను దారిలో పెట్టేందుకు ఖచ్చితంగా తిడతా.. పడాల్సిందే. మీరు మారతారా? లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. నావల్లనే సమస్య అంటే నేను వెళ్లిపోతా. ఉంటే మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా’’ అని అన్నారాయన. చెత్త వేసే వారి ఇళ్లకు కరెంట్ కట్ చేస్తా.. తాగునీటి సరఫరా నిలిపివేయిస్తా అని హెచ్చరించారు. అలాగే..బీటెక్ చదివిన ఓ అమ్మాయిని దీపాలు అమ్ముతుంటే.. సంతోషపడ్డానని, వేరే దగ్గర ఆమెతో స్టాల్ పెట్టిస్తే.. మళ్లీ పాత చోటుకే వచ్చి అమ్ముతోందని మండిపడ్డారాయన. ఈ మాత్రం దానికి చదువుకుని దేనికి? అంటూ ప్రశ్నించారు. పిల్లలకు చదువులు కాకుండా క్రమశిక్షణ నేర్పించాలని తల్లిదండ్రులకు జేసీ సూచించారు.‘‘పిల్లలకు డిసిప్లిన్ నేర్పియండి. చదువుకాదు. లేకుంటే పాడైపోతారు. అమెజాన్, రెడ్‌బస్ ఓనర్లు.. ఎలాన్ మస్క్.. వీళ్లంతా చదువులేనోళ్లే!!. ఇప్పుడంతా కొత్త షావుకారులే వస్తున్నారు. సదువులేనోళ్లు బ్రహ్మాండమైన ఇళ్లు కడుతున్నారు. వాళ్లంతా బుర్రున్నోళ్లు. ఇంజనీరింగ్ కంటే మున్సిపల్లో ఊడ్చే పర్మినెంట్ ఉద్యోగికి మంచి జీతం వస్తోంది’’ అని జేసీ అన్నారు. తాడిపత్రి ప్రజలకు ఉంది రెండే ఆప్షన్లు. మీరైనా మారాలి లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండని అన్నారాయన. -
తాడిపత్రిలో వెలుగులోకి జేసీ ప్రభాకర్ రెడ్డి మద్యం దందా
-
దసరా తర్వాత తాడిపత్రిలో అడుగు పెడతా: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం కలిశారు. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కావాలని ఆయన కోరారు. అనంతరం పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన ఇంటికి వెళ్లేందుకు టీడీపీ నేతల అనుమతి అవసరమా? అంటూ ప్రశ్నించారు. అవసరమని ఎస్పీ చెబితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి పర్మిషన్ కోరేందుకు సిద్ధమని.. దసరా తర్వాత తాడిపత్రిలో అడుగు పెడతానన్నారు.ఓ మాజీ ఎమ్మెల్యేని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వకపోవడం దుర్మార్గం. జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియా ప్రతినిధులను బెదిరించినా పోలీసులు మౌనంగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తాడిపత్రిలో హింస చోటుచేసుకుంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తున్నా ఎస్పీ జగదీష్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తా’’ అని పెద్దారెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: పేదల ప్రాణాలంటే ‘లెక్క’లేదా? -
చంద్రబాబుకు జేసీ ఝలక్
అనంతపురం, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక ఆక్రమ రవాణా జరుగుతున్న మాట వాస్తవమేనని చెప్పారాయన. ఏకంగా తన వర్గానికి చెందిన వాళ్లే ఈ పని చేస్తున్నారని చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. తన వర్గానికి చెందిన సుమారు 25 మంది టీడీపీ నేతలే ఇసుక తరలిస్తున్నారని చెప్పారు జేసీ. అయితే.. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణా ఆపాలని అన్నారు. లేకపోతే తానే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక అక్రమ రవాణా జరగటం లేదని చెప్పుకునే చంద్రబాబుకు సొంత పార్టీ నేతలే షాక్ ఇవ్వడం కొసమెరుపు. -
తాడిపత్రిలో హై టెన్షన్
సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపుతోంది. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తోంది. శనివారం ఉదయం తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్ షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి కేతిరెడ్ఢి పెద్దారెడ్డి వెళ్లారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం నేరుగా తాడిపత్రి పీఎస్‌కు వెళ్లిన పెద్దారెడ్డి.. తాడిపత్రి పోలీసులతో మాట్లాడారు. బెయిల్ మంజూరై ఐదు రోజులు గడిచినా షూరిటీలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని మండిపడ్డారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఐదు రోజులైనా పోలీసులు ఎందుకు షూరిటీలు స్వీకరించలేదని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరు కాదని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.‘‘నన్ను, నా కొడుకులను జిల్లా బహిష్కరణ చేయటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు?. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటా. నా ఊపిరి ఉన్నంతవరకూ తాడిపత్రిలోనే ఉంటా. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. -
ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత!
కాపురం చేసే కళ కాలు తొక్కిననాడే తెలుస్తుంది అని ఒక సామెత. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఆరంభమైన తీరు అలాగే ఉందని చెప్పాలి. ఎవరైనా మంచి శుభ కార్యాలతో ,అభివృద్ది పనులతో ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం అందుకు విరుద్దంగా నడక మొదలు పెట్టింది. దానికి తగినట్లే కొందరు నేతలు సాగిస్తున్న దూషణల పర్వం ప్రభుత్వ పరువును గంగపాలు చేస్తున్నట్లుగా ఉంది. టీడీపీ ఇంత భారీ మెజార్టీతో ఎలా గెలిచిందా? అని ప్రజలు అంతా ఆశ్చర్యపోతున్న తరుణంలోనే ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడే ఇలా ఉంటే, వచ్చే ఐదేళ్లు ఎలా భరించాలో అని భయపడే పరిస్థితిని సృష్టిస్తున్నారు.ఎన్నికలలో గెలుస్తున్నట్లు కౌంటింగ్‌లో వెల్లడి కాగానే తెలుగుదేశం శ్రేణులు అనండి, ఆ పార్టీ గూండాలు అనండి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులపై దాడులు చేశారు. పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడ్డారు ఆ పార్టీ వారి ఆస్తులను ద్వంసం చేశారు.వీటిలో ఎక్కువగా నష్టపోయింది బలహీనవర్గాలు, పేదలే అని చెప్పాలి. టీడీపీ వారి కక్షలకు తేలికగా దొరికేది వారే కాబట్టి.కొంతమంది నేతల ఇళ్లను టార్గెట్ గా చేసుకుని కూడా టీడీపీ రౌడీలు విచ్చలవిడిగా చెలరేగిపోయారు.ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే పంధా కొనసాగిస్తున్నారు. దీనిని చంద్రబాబు కాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని ఖండించకపోవడం ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతోందో చెప్పినట్లయింది. పోలీసులు నిష్క్రియాపరత్వం కారణంగా పరస్పర ఘర్షణలు కూడా సాగాయి. కొన్ని వందల చోట్ల వైఎస్సార్సీపీ క్యాడర్ నష్టపోతే, ఒకటి,రెండు చోట్ల టీడీపీ వారు కూడా ఎదురుదాడుల కారణంగా నష్టపోయారు. రెండువైపులా సంయమనం పాటించాలని చెప్పవలసిన ముఖ్యమంత్రి,మంత్రులు, టీడీపీవారిపై దాడులు జరుగుతున్నాయని విమర్శలు చేశారు. మరి వందల చోట్ల టీడీపీ వారు చేసిన దాడులు,హింసాకాండ పై పల్లెత్తి మాట్లాడలేదు. ఒక పక్క కక్ష సాధింపు రాజకీయాలు చేయబోము అని చెబుతూనే, మరో వైపు తప్పు చేసినవారిని ఉపేక్షించబోమని హెచ్చరిస్తుంటారు.దీంతో టీడీపీ క్యాడర్ కు ఏదో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. టీడీపీ నేతలు సైతం ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్నారు.స్పీకర్ గా ఎన్నికైన సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపై కొందరు అధికారులను ఉద్దేశించి బూతులు తిట్టారు. వారికి అధికారులపై అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియదు. అయినా అధికారులు తప్పు చేశారని భావిస్తే,వారిపై చర్య తీసుకోవడానికి కొన్ని పద్దతులు ఉంటాయి. ఆ విషయం అయ్యన్నకు తెలియనిది కాదు. ఎంతోకాలం మంత్రిగా కూడా పనిచేశారు. ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంత పద్దతిగా మాట్లాడాలి!అలాకాకుండా నోరుపారేసుకుని అధికారులను నైతికంగా దెబ్బతీశారు. కాకపోతే ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది కనుక, ఆ అధికారులు ప్రస్తుతానికి సర్దుకుపోవచ్చు. కాని సమయం సందర్భం వచ్చినప్పుడు వారుతమ నిరసన తెలుపుతారు. అంతదాకా తెచ్చుకోవడం అయ్యన్నకు అవసరమా?అధికారం రావడంతోనే అహంకారం తలకెక్కితే ఇలాగే చేస్తారన్న విమర్శలను ఆయన మూట కట్టుకున్నారు. మరో నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రవాణా శాఖ అధికారులను ఉద్దేశించి చేసిన దూషణలు దారుణంగా విన్నాయి.అధికారులను నరుకుతా అని అంటున్నారు. వినడానికే భయంకరంగా ఉన్నాయి. ఆయన హాహాభావాలు ప్రదర్శిస్తూ తనను గతంలో జైలులో పెట్టిన అధికారుల సంగతి చూస్తానని చెప్పడం ద్వారా టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు ఎలా ఉండబోతున్నారో చెప్పినట్లయింది.తాను చేసినవి చిన్న తప్పులని ఆయన అంటున్నారు. దానికే తనను ఇబ్బంది పెడతారా? ఇప్పుడు తమకు అధికారం వచ్చింది కనుక తమ బస్ లను బాగు చేసి తమకు అప్పగించాలని ప్రభాకరరెడ్డి డిమాండ్ చేయడం అంటే రాష్ట్రంలో అధికారులు ఎవరూ తమ పని తాము చేయకూడదని చెప్పినట్లయింది. ప్రభాకరరెడ్డిపై వచ్చిన ఆరోపణ ఏమిటి?ఆయన కేంద్ర ప్రభుత్వ నిబందనలకు వ్యతిరేకంగా బస్ లు కొని ఎక్కడో నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించి మోసం చేశారన్నది అభియోగం.దీనిపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. అది వారి బాధ్యత కదా! రాజకీయాలలో ఉంటే ఎలాంటి తప్పు చేసి అయినా చెలామణి అయిపోవచ్చా!అందులోను అధికార తెలుగుదేశంలో ఉంటే ఎవరూ వారి జోలికి రాకూడదా!మరి ఎన్ పోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ విషయంలో జెసి ప్రభాకరరెడ్డి సంస్థపై కేసులు పెట్టింది కదా! ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తమ కంట్రోల్ లో ఉంటారు కనుక ఏమైనా చేయవచ్చన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.మరి ఈడి అధికారులను కూడా అలాగే చేస్తారా?జేసీ ప్రభాకర్ రెడ్డి నిజంగానే తప్పు చేయకపోతే ఆ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అధికారులపై ఫిర్యాదు చేయవచ్చు. అలాకాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజులకే ఇలా తిట్లు లంఘించుకున్నారంటే ఏమని అనుకోవాలి.మరో నేత, మంత్రి అచ్చెన్నాయుడు కొత్త రూల్ పాస్ చేశారు. ఎవరైనా టీడీపీ కార్యకర్త పసుపు బిళ్ల పెట్టుకుని వస్తే వారిని ఆయా ఆఫీస్ లలో అధికారులు స్వాగతం పలికి టీ ఇచ్చి మరీ వారు అడిగిన పనులు చేయాలంట.లేకుంటే వారి సంగతి ఈయన చూస్తారట.అచ్చెన్నాయుడుకు నోటు దురుసుతనం కొత్తకాదు. మరింత పెట్రేగి మాట్లాడారు.ప్రతి టీడీపీ కార్యకర్తకు అధికారులు గులాం అయి పనిచేయడం సాధ్యమేనా?అది చట్టబద్దమేనా?. కొత్తగా హోం మంత్రి అయిన వంగలపూడి అనిత ఏకంగా బ్లడ్ గురించి మాట్లాడుతున్నారు.వైఎస్సార్సీపీ బ్లడ్ ఉంటే పోలీసు అధికారులు రిజైన్ చేసి పోవాలట. అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని చెప్పవలసిన మంత్రులు ఇలా దుడుకుతనంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు ఎలా అర్ధం చేసుకోవాలి. అధికారులు ఎవరు ప్రభుత్వం లో ఉంటే వారు చెప్పినట్లు పనులు చేయడం సహజంగానే జరుగుతుంది. ఉదాహరణకు మంత్రి అనిత ఎవరైనా పోలీసు అధికారికి ఏదైనా పని చెబితే, అది సాధ్యం కాదని ఆ అధికారి అంటే ఒప్పుకుంటారా? వెంటనే ఆ అధికారికి రాజకీయ పార్టీ ని అంటగడతారా?పోలీసు అధికారులంతా పచ్చ రక్తం ఎక్కించుకోవాలని ఆమె చెబుతున్నట్లుగా ఉంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాని మంచి మాట, మంచి పనులే ఎప్పటికి గుర్తుంటాయి. అందుకు విరుద్దంగా పనిచేస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు. ఆ విషయం తెలిసినా రాజకీయ పార్టీల నేతలు యధాప్రకారం అహంభావంతో ప్రవర్తించి దెబ్బతింటుంటారు. సాధారణంగా మంత్రి పదవులలోకి వచ్చిన కొన్నాళ్లయినా సంయమనంగా ఉంటారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే అరాచకాలకు తెగబడరు. కాని ఈసారి అధికారంలోకి రావడంతోనే విచ్చలవిడిగా టీడీపీ శ్రేణులు జనం మీద పడుతున్నాయి. మంత్రులు ,టీడీపీ నేతలు కసిగా సంభాషిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో నిమిత్తం లేకుండా తాడేపల్లి వద్ద వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణాలను అధికారులు కూల్చివేయడం విద్వంస పాలనకు పరాకాష్టగా ఉంది. ఇప్పటికైనా అత్యంత సీనియర్ నాయకుడు అయిన చంద్రబాబు నాయడు ఈ పెడపోకడలకు పుల్ స్టాప్ పెట్టాలి.ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మంత్రులను,టీడీపీ నేతలను అదుపులో పెట్టాలి. లేకుంటే చంద్రబాబుకు మరింత అప్రతిష్ట అవుతుందని చెప్పకతప్పదు. ఈ నేపధ్యంలోనే కాపురం చేసే కళ పెళ్లినాడే తెలిసిపోతుందన్న సామెత టీడీపీకి అతుకుతుందనిపిస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తాడిపత్రిలో పోలీసులు టీడీపీ తొత్తులుగా పనిచేశారు..
-
వంచకుడికి వంత పాడతారా?
తాడిపత్రి రూరల్: ‘ఓ ప్రజాప్రతినిధిగా మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి, మోసం చేసిన వాళ్లకే వంత పాడతారా? ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై టీడీపీ కౌన్సిలర్ చేతిలో వంచనకు గురైన బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు, తాడిపత్రి 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ప్రేమ పేరుతో వాడుకుని వదిలేయడంతో పాటు చంపుతానని బెదిరిస్తుండడంతో ఓ అభాగ్యురాలు ఇటీవల పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మల్లికార్జునను మందలించి, ఆమెకు న్యాయం చేయాల్సిన జేసీ ప్రభాకర్ రెడ్డి అందుకు భిన్నంగా ఇటీవల టీడీపీ నాయకులతో కలిసి కౌన్సిలర్ మద్దతుగా స్థానిక పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేశారు. దీనిపై సోమవారం బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని వారం రోజుల క్రితం జేసీని కలిస్తే తనను అవమానించారని వాపోయారు. మల్లికార్జున తనను శారీరకంగా వాడుకుని, మోజు తీరాక మరో యువతితో తిరుగుతున్నాడని ఆయన దృష్టికి తీసుకెళ్తే హనీ ట్రాప్ అంటూ తనపైనే దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లికార్జునతో వివాహం చేయనని కరాఖండీగా చెప్పారని వెల్లడించారు.జేసీ చేసిన అవమానం భరించడం కంటే చనిపోవడమే మేలంటూ విలపించారు. తనకు న్యాయం జరిగేంత వరకూ పోరాడతానని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌ను కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించనున్నట్లు తెలిపారు. వారు న్యాయం చేయకుంటే మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తానన్నారు. తనకు మల్లికార్జునతో వివాహం చేయిస్తానని హామీ ఇచ్చేంతవరకు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు. మహిళ అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతూ టీడీపీ నాయకులు వేధిస్తున్నారని వాపోయారు. కాగా, బాధితురాలు సోమవారం రాత్రి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సిగ్గనిపించడం లేదా జేసీ? టీడీపీ కౌన్సిలర్ చేతిలో వంచనకు గురైన బాధితురాలికి న్యాయం చేయాల్సిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆమైపెనే దౌర్జన్యం చేయడం దుర్మార్గం. మల్లికార్జున అమాయకుడంటూ పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేయడానికి సిగ్గుండాలి. పైగా వంచకుడి తప్పును కప్పిపుచ్చడానికి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టిస్తూ బాధితురాలిని మానసికంగా వేధించడం హేయం. ప్రజలు జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలను గమనిస్తున్నారు. వాళ్లే మళ్లీ తగిన గుణపాఠం చెబుతారు. – ఎమ్మెల్యే పెద్దారెడ్డి -
AP Politics: ఏం ‘జేసి’నా అభాసుపాలే!
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్లుంది జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరు. అధికారమే అండగా ఒకప్పుడు తాడిపత్రి నియోజకవర్గంలో కక్షలు, కార్పణ్యాలు రాజేసిన ఆయన నేడు తనను తాను శాంతికాముకుడిలా బిల్డప్ ఇస్తుండడంపై జనం నవ్వుకుంటున్నారు. ఒళ్లంతా విషం నింపుకుని ఒంటిపై శాలువ, నుదుటిపై విబూది పెట్టినంత మాత్రాన అరాచకాలు మరచిపోగలమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రిరూరల్: ‘శంఖారావం’ సభలో పాల్గొనేందుకు సోమవారం టీడీపీ నేత నారా లోకేష్ తాడిపత్రి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కంట్లో పడేందుకు జేసీ చేస్తున్న డ్రామా అందరికీ నవ్వులు తెప్పిస్తోంది. పట్టణ పోలీసు స్టేషన్ సర్కిల్లో ఏర్పాటు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీ అందరినీ పగలబడి నవ్వేలా చేస్తోంది. ‘దొంగే దొంగ.. దొంగ’ అన్న చందంగా ఉందని ఫ్లెక్సీని చూసి పలువురు విమర్శలు గుప్పించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అందులోని అక్షరాలు ఉన్నాయని మండిపడ్డారు. అరాచకాలు మరువగలమా జేసీ..! అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలను తన ప్రాపకం కోసం రెండుగా చీల్చారు. కక్షలు, కార్పణ్యాలు రాజేశారు. తాడిపత్రి మండలం వీరాపుం గ్రామంలో జేసీ ప్రభాకర్ రెడ్డి రాజేసిన చిచ్చు ఇప్పటికీ చల్లారడం లేదంటే అతిశయోక్తి కాదు. తన రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న గ్రామస్తులను రెచ్చ గొట్టి రెండు వర్గాలుగా చీలగొట్టారు. నిప్పు రాజేసి తమకు కావాల్సిన సమయంలో ఆజ్యం పోశారు. వీరి వికృత చేష్టలు గత ఎన్నికల సమయంలో ఏకంగా భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి హత్యకు దారి తీశాయి. ప్రశాంతంగా ఉన్న ఇగుడూరు గ్రామంలో సైతం జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో వర్గ కక్షలకు తెరలేపారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పొలాల్లో చెట్లు పీకేయించడం, బోర్లు పగుల గొట్టడం తదితర చర్యలకు ఉసిగొల్పి రాక్షసానందం పొందారు. ► అధికార దాహంతో కన్నూమిన్నూ కానరాకుండా వ్యవహరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వగ్రామంలో చిచ్చు రాజేయాలని చూశారు. పెద్దారెడ్డి రాజకీయంగా ఎదుగుతుండడం చూసి ఎలాగైనా దెబ్బగొట్టేందుకు ఆయన స్వగ్రామం తిమ్మంపల్లివాసులను రెండు వర్గాలుగా విడగొట్టారు. గ్రామంలో తన అనుచరునికి ఇల్లు కొనుగోలు చేయించి కక్షలు రాజేశారు. పెద్దారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. అంతటితో ఆగక ‘నేను నీ ఊరొచ్చా, ధైర్యం ఉంటే నీవు తాడిపత్రికి రావాలంటూ’ పెద్దారెడ్డిని రెచ్చగొట్టారు. జేసీ చాలెంజ్‌ను స్వీకరించిన పెద్దారెడ్డి ఆయన కోరినట్లుగానే తాడిపత్రికి వచ్చారు. అప్పటికే జేసీ సోదరుల ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు పెద్దారెడ్డికి జై కొట్టారు. ఎన్నికల్లో జేసీ తనయుడిని చిత్తుచిత్తుగా ఓడించారు. అయినా, జేసీ ప్రభాకర్ రెడ్డికి బుద్ధి మాత్రం రాలేదు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని ఇప్పటికీ నియోజకవర్గవ్యాప్తంగా దౌర్జన్యాలు చేస్తున్నారు. తన అనుచరులను రెచ్చగొడుతూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో మళ్లీ అలజడులు రేకెత్తిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ సీపీ నాయకులను కవ్వించేందుకు తానేదో మంచికి మారు పేరు అన్నట్లుగా ఫ్లెక్సీలు కట్టించుకున్నారు. గతంలో ఆయన చేసిన అరాచకాలను చూసిన ప్రజలు ఇదంతా చూసి నవ్వుకుంటున్నారు. ఇతనికెప్పటికి బుద్ధి వస్తుందో అంటూ నిట్టూరుస్తున్నారు. -
సీనియర్లకు దిక్కేది?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నమ్మించి నట్టేట ముంచడం అనే దానికి అసలైన నిదర్శనం చంద్రబాబు అని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు దశాబ్దాల పాటు పార్టీ జెండా మోసిన తమకే టికెట్ లేదంటే ఇక ఎటు వెళ్లాలి అంటూ అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు ఆవేదనతో రగిలిపోతున్నారు. అసలే వర్గపోరుతో గందరగోళంగా ఉన్న పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోకపోవడం, చివరి నిమిషం వరకూ ‘నీకే టికెట్’ అంటూ పలువురికి అధిష్టానం చెప్పడం నాయకుల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతమని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు టీడీపీ ఓటికుండగా మారింది. చంద్రబాబును నమ్ముకున్న సీనియర్ నాయకులు ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నం హనుమంతరాయచౌదరి ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారు. పైగా 2014లో గెలిచారు. ఇప్పుడు ఆయనను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడంతో లోలోపల అధినేతపై రగిలిపోతున్నారు. ∙గుంతకల్లు నియోజకవర్గంలో సీనియర్ నాయకుడైన జితేందర్‌గౌడ్‌కు టికెట్ లేదని పరోక్షంగా లీకులు ఇస్తుండటంతో టీడీపీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. పాతికేళ్లుగా పార్టీ జెండాను మోసిన తనను కాదని వేరేవాళ్లకు ఇస్తే ఎలా గెలుస్తారో తానూ చూస్తా అని వ్యాఖ్యానిస్తున్నారు. పుట్టపర్తి సీటుపైనా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. తనకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి పని చేసేది లేదని ఆయన ఇప్పటికే క్యాడర్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. పైగా ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. జేసీ కుటుంబానికి కొమ్ములొచ్చాయా? నిన్నగాక మొన్న టీడీపీలోకి వచ్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గానికి ఏమైనా కొమ్ములొచ్చాయా అంటూ కొంతమంది నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. 2014లో జేసీ వర్గం టీడీపీలోకి వచ్చింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు అస్మిత్‌రెడ్డికి దాదాపుగా సీటు ఖరారైన నేపథ్యంలో.. దివాకర్‌రెడ్డి కొడుకు పవన్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ పవన్‌కు టికెట్ ఇస్తే మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్తి భగ్గుమనేలా కనిపిస్తోంది. కుటుంబానికి ఒక్కటే టికెట్ అన్న బాబు.. జేసీ వర్గానికి రెండు ఇస్తే తమకూ రెండు సీట్లు ఇవ్వాల్సిందేనని పరిటాల వర్గం పట్టుబట్టనుంది. బీసీ వర్గాల్లో అసమ్మతి రాగాలు బోయ, కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల శాతం జిల్లాలో ఎక్కువ. ఈ నేపథ్యంలో బీసీ వర్గాల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో హిందూపురం ఎంపీగా గెలిచిన నిమ్మల కిష్టప్ప తనను పక్కన పెట్టారని టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అవసరమైనప్పుడు వాడుకుని ఇప్పుడు వదిలేస్తారా అంటున్నట్టు సమాచారం. నిమ్మల, బీకే పార్థసారథి, జితేందర్‌గౌడ్ వంటి బీసీ నేతలతోపాటు శింగనమల, మడకశిర నియోజకవర్గాలకు చెందిన ఎస్సీ సామాజిక వర్గ నేతలూ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు అధికార పక్షం దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికల బరిలోకి దూసుకెళుతుండగా.. ఇప్పటివరకు చంద్రబాబు ఎటూ తేల్చడం లేదని నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చంద్రబాబు శనివారం ఉరవకొండకు వస్తున్న నేపథ్యంలో నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిందే. -
'రేయ్.. నేను రెడీగున్నా! అరెస్ట్ చెయ్‌రా.. చెయ్!'
తాడిపత్రి అర్బన్, సాక్షి: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. 'రేయ్.. అరెస్టు చెయ్.. నీయమ్మా.. ఖాకీ డ్రెస్సులేసుకుని సిగ్గులేదు.. రేయ్ నేను రెడీగున్నా.. అరెస్ట్ చెయ్.. చెయ్ రా చెయ్' అంటూ పోలీసులను దుర్భాషలాడారు. రోడ్డుపై పడుకుని హంగామా సృష్టించారు. రెండు రోజుల కిందట జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణ సుందరీకరణ పేరుతో సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు డెకరేషన్ బల్బులను ఏర్పాటు చేసేందుకు మునిసిపల్ కమిషనర్ జి.రవిని అనుమతి కోరారు. తర్వాత మునిసిపల్ సిబ్బందితో కలసి దగ్గరుండి డెకరేషన్ లైట్లు వేయించడానికి బయలుదేరారు. అయితే స్తంభాలకు ఉన్న వైఎస్సార్సీపీ జెండాలను పనిగట్టుకుని తొలగిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్.. తన అనుచరులతో కలిసి నడిరోడ్డుపై బైఠాయించి నానా హంగామా సృష్టించాడు. ట్రైనీ డీఎస్సీ హేమంత్ కుమార్, ఎస్ఐలు రామకృష్ణ, గౌస్మహ్మద్లు అక్కడికి చేరుకుని మునిసిపల్ కమిషనర్‌తో మాట్లాడి జెండాలను తొలగింపజేస్తామంటూ హామీ ఇవ్వడంతో జేసీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీవో వెంకటేష్‌ను టీడీపీ కౌన్సిలర్లు కలసి సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు ఉన్న వైఎస్సార్సీపీ జెండాలు తొలగించాలంటూ వినతిపత్రం ఇవ్వడమే కాకుండా.. అక్కడే బైఠాయించారు. ఇది తన పరిధిలోని అంశం కాదని, అనవసరంగా రాద్దాంతం చేయకుండా మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆర్జీవో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలసి అర్బన్ పోలీస్ స్టేషన్ వద్దకొచ్చారు. వచ్చీ రాగానే గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించాడు. ఎస్పీ ధరణీబాబు, రామకృష్ణ, గురుప్రసాద్‌రెడ్డి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వారిపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. పోలీసులు సంయమనం పాటిస్తూ నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు జీపును తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధమవగా నడిరోడ్డుపై పడుకుండిపోయాడు. పోలీసులు అతన్ని జీవులోకి ఎక్కించుకుని స్థానిక పుట్లూరు రోడ్డులో వదిలేయడంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. జేసీపై కేసు నమోదు పోలీసులతో అనుచిత ప్రవర్తకు గానూ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం.. విధులకు ఆటంకం కలిగించడం, దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించడంపై జేసీతో పాటు ఆయన ముగ్గురి అనుచరులపై కేసు నమోదు చేశారు. -
అసహనంతో అరాచకం.. పేట్రేగిపోతున్న జేసీ సోదరులు
రాజకీయాల్లో వివాదాలకు కేంద్రబిందువైన జేసీ బ్రదర్స్ (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి – మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి) టీడీపీ అధికారం లేకపోయే సరికి సహనం కోల్పోతున్నారు. ప్రతిపక్షంలో హుందాతనం కనబరచాల్సిన వీరు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాడిపత్రిలో 30 ఏళ్లకు పైగా అధికారంలో ఉండి దొరతనాన్ని వెలగబెట్టిన జేసీ సోదరులు ప్రతిపక్షంలోకి వచ్చాక ఉనికి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. వీరు నిత్యం ఏదో ఒక వివాదంతో నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్‌రెడ్డి చేష్టలకు సామాన్యులకే కాదు పోలీసులకు సైతం కంటిమీద కునుకులేకుండా ఉంది. ఇప్పటికే పలు అవినీతి కేసుల్లో ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరింతగా పేట్రేగిపోతున్నట్టు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటినెలాగైనా అడ్డుకోవాలనేది జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆలోచన. ఇందులో భాగంగా ఆస్పత్రి నిర్మాణాలను అడ్డుకోవాలని కాంట్రాక్టర్‌ను బెదిరించారు. దీంతో ఈ నెల 23వ తేదీ వివాదం రాజుకుంది. జేసీ బెదిరింపులకు భయపడి కాంట్రాక్టర్ పనులు ఆపేసి వెళ్లినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇది తొలిసారి కాదు... జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాస్పత్రి పనులను అడ్డుకోవడం మొదటి సారేమీ కాదు. మొన్నటికి మొన్న డ్రెయినేజీ పనులను అడ్డుకున్నారు. ఏకంగా మురికి కాలువలో కుర్చీ వేసుకుని కూర్చుని వివాదం రేపారు. అంతకుముందు ‘నాడు–నేడు’ పనుల కింద జూనియర్ కాలేజీకి ప్రహరీ నిర్మిస్తుంటే అడ్డుకున్నారు. అనుచరులతో కలిసి గొడవకు దిగారు. చివరకు పోలీసుల రక్షణలో ప్రహరీ పనులు చేపట్టాల్సి వచ్చింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసినా అడ్డుకుని రాద్ధాంతం చేశారు. చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై... వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు మున్సిపాలిటీలో అన్ని పనులకూ అడ్డు తగులుతున్నారు. అనుచరులను ఉసిగొలుపుతూ... గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేకపోయేసరికి జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర అక్కసుతో ఉన్నారు. తన అనుచరులతో కలిసి ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం, ధర్నాలు, నిరసనలు చేపట్టడం, సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడం.. ఇదీ తాడిపత్రిలో రోజువారీ తీరు. గత నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో మళ్లీ పల్లెలకు వెళ్లి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇదిలా ఉండగా జేసీ ప్రభాకర్ చేష్టలతో విసిగిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎవ్వరూ ఈయనకు అండగా నిలవని పరిస్థితి. జేసీ సోదరులు టీడీపీకి గుదిబండగా మారారని అనంతపురానికి చెందిన ఆ పార్టీ నాయకుడొకరు చెప్పారు. వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్ప తాడిపత్రిలో టీడీపీకి మనుగడ లేదంటున్నారు. జేసీ తీరుపై పోలీసుల మౌనం జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరురాలు కమలమ్మ ఫిర్యాదుపై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులు.. జేసీ అనుచరుల ఆగడాలపై మాత్రం కనీస స్పందన లేదు. ఇన్ని వివాదాలు సృష్టిస్తున్నా సుమోటోగా కేసు నమోదు చేయలేదు. జేసీ బెదిరింపులను, వివాదాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పోలీసులు ఎందుకు భయపడుతున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదుకు ఆదేశం కాంట్రాక్టర్లను బెదిరించిన తీరుపై బాధితులనుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయాలని తాడిపత్రి పోలీసులను ఆదేశించాం. ఎవరినైనా బెదిరించినా, ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డు తగిలినా తీవ్రంగా పరిగణిస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదు. – అన్బురాజన్, ఎస్పీ -
జేసీ అక్కసు రాజకీయాలు.. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ
‘కుక్కతోక వంకర ’ అన్న చందంగా ఉంది తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారం. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఆయన బుద్ధిలో మాత్రం ఏ మార్పూ రాలేదు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం సేవ్ తాడిపత్రి పేరుతో మొసలి కన్నీరు కార్చి బోటాబోటీగా గెల్చి మున్సిపల్ చైర్మన్ పీఠమెక్కారు. చైర్మన్ స్థానంలో తాడిపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన జేసీ.. అందుకు భిన్నంగా అభివృద్ధి పనులకు మొకాలడ్డుతున్నారు. తాడిపత్రి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే అభివృద్ధి పనులు పూర్తయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న అక్కసుతో జేసీ ప్రభాకర్‌రెడ్డి అభివృద్ధి పనులన్నింటినీ తన పచ్చ మూకలను అడ్డుపెట్టుకుని అడ్డుకుంటున్నాడు. సొంత పార్టీ నేతల అసంతృప్తి.. జేసీ ఒంటెద్దు పోకడలు నచ్చక సొంత పారీ్టలోని కొందరు నాయకులు ఇప్పటికే టీడీపీని వీడారు. మరికొందరు వీడేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందో? రాదోనన్న ఆందోళనతో తీవ్ర నిరాశ, నిస్పృహలో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షుద్ర రాజకీయాలతో పట్టణాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారన్న విమర్శలున్నాయి. రాత్రికి రాత్రే నిర్మాణాల కూల్చివేత.. తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని జేసీ టీం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుందన్న ఆరోపణలున్నాయి. అయితే నాడు – నేడు ఫేజ్ 2 పనుల్లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టారు. జూనియర్ కళాశాల సమీపంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం ఉండడంతో ప్రహరీ వల్ల తన వారికి ఎక్కడ ఇబ్బందులు కలుగుతాయోనని గత నెల 19న రాత్రి ప్రభుత్వ వ్యయంతో అప్పటి వరకూ చేపట్టిన ప్రహరీ పనులను కూలి్చవేó శారు. తన పచ్చబ్యాచ్‌తో రాత్రికి రాత్రే కాంక్రీట్ పిల్లర్లను కూలి్చవేసి, గుంతలను పూడ్చివేశారు. మరుసటి రోజు కూలీలు పని చేపట్టేందుకు ప్రదేశానికి వెళ్లగా మేస్త్రీ, కూలీలను పనులు చేపట్టకూడదని హుకుం జారీ చేశారు. మేస్త్రీ గురుశంకర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బందోబస్తు మధ్య తిరిగి కళాశాల ప్రహరీ నిర్మాణ పనులు సాగేలా చూశారు. దీన్ని జీరి్ణంచుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరుడి చేత కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చి మరీ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులు ముందుకు సాగకుండా అడ్డుపుల్లేశారు. మరికొన్ని ఇలా.... ► వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు తాడిపత్రి పట్టణం, ఆంజనేయస్వామి మాన్యంలోని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేద ప్రజలకు మేలు జరగడాన్ని జీరి్ణంచుకోలేని జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులచే హైకోర్టులో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడ్డారు. ►పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌లోని మున్సిపల్ స్థలంలో ఆరోగ్య ఉపకేంద్ర భవనం నిర్మించడం గిట్టక తన అనుచరుడు, ఓ టీడీపీ కౌన్సిలర్‌తో హైకోర్టులో పిటీషన్ వేయించి ఆ పనులకూ ఆటంకం కలిగించారు. ►తాడిపత్రిలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ మంజూరుకు ఒప్పించారు. అప్పటి ఎస్పీ కూడా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఎమ్మెల్యే సొంత డబ్బుతో స్టేషన్ నిర్మాణం చేపట్టడాన్ని ఓర్వలేక మళ్లీ ఓ టీడీపీ కౌన్సిలర్‌తో హైకోర్టులో పిటీషన్ వేయించారు. నిర్మాణ పనులు ముందుకు సాగకుండా స్టే తెప్పించారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. ► ఆటోనగర్ సమీపంలో జగనన్న ఇళ్ల నిర్మాణాల కోసం అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తే వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు గతంలో అక్రమంగా ఇళ్ల స్థలాలు పొంది, రద్దయిన పట్టాలను తిరిగి ఇవ్వాలంటూ వారిచే కోర్టులో కేసు వేయించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. జేసీ తీరుపై సర్వత్రా విమర్శలు.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి సహకరించాల్సింది పోయి అడుగడుగునా అడ్డుకోవడం సమంజసం కాదని పట్టణ ప్రజలు అంటున్నారు. ప్రశాంతత చెడగొట్టేందుకే... ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి గెలుపొందిన అనంతరం తాడిపత్రి నియోజకవర్గంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేశారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, శాంతిభద్రతలను వారు అదుపులో ఉంచేలా కృషి చేశారు. అయితే మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితానికి చెక్ పడడంతో మింగుడుపడని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎలాగైనా తిరిగి పట్టు సాధించేలా నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకు కుట్రపన్నుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. -
అనంత.. టికెట్లపై ‘తమ్ముళ్ల’ నిరసన గళం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న నాయకులపై కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వీళ్లకు టికెట్లిస్తే వచ్చే ఎన్నికల్లో మునిగిపోతాం అంటూ బహిరంగంగానే చెబుతున్నారు. నాయకుల కంటే వర్గాలు ఎక్కువయ్యాయని, ఈ నాయకుల కొట్లాటలతో పిచ్చెక్కిపోతోందని వాపోతున్నారు. మరోవైపు టీడీపీ నాయకులు ఇప్పటి వరకూ ఏం చేశామో చెప్పలేక.. భవిష్యత్‌లో ఏం చేయగలమో తెలియక ప్రజల్లోకి వెళ్లడం మానేశారు. అధికార పక్షమే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో దేశ చరిత్రలో తొలిసారి ప్రతి గడపకూ వెళుతున్న పార్టీగా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించింది. కుల, మత, వర్గాలకతీతంగా 86 శాతం మందికి పైగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంక్షేమ ఫలాలు అందించిన ఘనతను సాధించింది. వాళ్లను ప్రోత్సహిస్తే పుట్టి మునుగుతుంది వాహనాలకు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మి ఈడీ కేసులో ఇరుక్కోవడంతో పాటు తాడిపత్రిలో నిత్యం వివాదాలు సృష్టిస్తున్న జేసీ సోదరుల (దివాకర్‌రెడ్డి– ప్రభాకర్‌రెడ్డి)ను ప్రోత్సహించవద్దని జిల్లానుంచి పలువురు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తే పార్టీకి నష్టం కలుగుతుందని టీడీపీ నాయకులే చెబుతున్నారు. జేసీ సోదరుల చౌకబారు ఎత్తుగడలకు పార్టీ అథఃపాతాళానికి దిగజారిందని వాపోతున్నారు. ► పరిటాల రవి కుటుంబం పైనా అనేక ఆరోపణలు ఉన్నాయి. పరిటాల రవి హయాంలో ఆర్ఓసీ పేరిట జరిగిన దమనకాండ చెరగని మచ్చ అని..పైగా పరిటాల సునీత నాడు మంత్రిగా ఉండి చేసిందేమీ లేదని, ఈ కుటుంబానికి రెండు టికెట్లు కాదు ఒక్కరికి టికెట్ ఇచ్చినా మునిగిపోవడం ఖాయమని పలువురు అంటున్నారు. వీళ్లేమి జిల్లా అధ్యక్షులు బాబూ..! జిల్లాల పునర్విభజన తర్వాత అనంతపురానికి కాలవ శ్రీనివాసులు, శ్రీసత్యసాయికి బీకే పార్థసారథి టీడీపీ జిల్లా అధ్యక్షులుగా అయ్యారు. వీళ్లపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. జిల్లాలో కాలువ శ్రీనివాసులు ఎవరినీ కలుపుకుపోవడం లేదని, పైగా రాయదుర్గంలో ఆయన గెలవలేని పరిస్థితి ఉందని కొంతమంది కార్యకర్తలు అంటున్నారు. ఇటీవల చంద్రబాబు అనంతపురం వచ్చినప్పుడు బాగా గుర్తింపు ఉన్న ఓ కార్యకర్తను ‘చస్తే చావు’ అంటూ అన్న మాటలు అక్కడున్న వారిని తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. పైగా మూడేళ్లు మంత్రిగా ఉండి ఏమీ చేయలేదని ఆరోపణలున్నాయి. దీంతో పాటు బీకే పార్థసారథి ఇంట గెలవ లేక రచ్చ రచ్చ చేస్తున్నారని, ఆయనకు జిల్లా మొత్తం ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రతి రోజూ బీసీ సామాజికవర్గానికి చెందిన సవితమ్మతో పోరు కొనసాగిస్తూ పెనుకొండ నియోజకవర్గానికే పరిమితమయ్యారన్న చెడ్డపేరు ఉంది. జిల్లా అధ్యక్షులుగానే కాదు నియోజకవర్గ ఇన్చార్జ్లుగానూ వీరు పనికి రారన్న విమర్శలు గుప్పిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి కదిరిలో ఇప్పటికే కందికుంట వెంకట ప్రసాద్ కుటుంబానికి టీడీపీ టికెట్ ఇవ్వవద్దని మరో వర్గం పోరాడుతోంది. పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై అవినీతి ఆరోపణలున్నాయని, ఆయనకు గనుక టికెట్ కేటాయిస్తే ఓటమి తథ్యమని కొందరు కుండ బద్దలుకొడుతున్నారు. గుంతకల్లులో టీడీపీకి అభ్యర్థి ఉన్నారనే విషయమే ఎవరికీ తెలియదని, కళ్యాణదుర్గంలో రెండు వర్గాలు కొట్టుకుంటూ ఉంటే పరువు బజారున పడుతోందని, అసలు అనంతపురం జిల్లావైపు అధిష్టానం ఎప్పుడైనా చూస్తోందా అంటూ కిందిస్థాయి కేడర్ మండిపడుతోంది. దళిత నేతలకు గుర్తింపు ఏదీ? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ దళిత నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. రెండు నియోజవర్గాల్లోనూ ఆధిపత్య కులాల నాయకులదే పెత్తనం. శింగనమలలో బండారు శ్రావణిని పట్టించుకునే దిక్కు లేదు. స్వయానా ఆమె తండ్రిపై టీడీపీ వారే దాడి చేస్తే లోకేష్ (పాదయాత్ర సమయంలో) జిల్లాలో ఉండికూడా పరామర్శించలేదు. ఇక మడకశిరలో టీడీపీ అభ్యర్థి ఎవరో ఇప్పటికీ తెలియదు. మైనింగ్ అవినీతిలో కూరుకుపోయిన గుండుమల తిప్పేస్వామి కనుసన్నల్లో ఆ నియోజకవర్గం ఉంది. దీంతో జిల్లాలో రోజురోజుకూ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: బీఎస్–3 వాహనాలను బీఎస్-4గా మార్చి నడుపుతున్నారన్న ఫిర్యాదుపై ఎందుకు విచారణ చేయలేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు పలువురు ఉన్నతాధికారులు, సీబీఐతో పాటు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. టీడీపీ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బీఎస్–3 వాహనాలను బీఎస్–4గా మార్చి నడపడంపై తాను 2020 అక్టోబర్ 12న రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదంటూ ఏపీలోని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అక్రమాలు తేలడంతో పలు వాహనాలను సీజ్ చేశారని పేర్కొన్నారు. చదవండి: తీవ్ర వాయుగుండం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు తెలంగాణలో మాత్రం వాహనాలను అక్రమంగా నడుపుతున్నారని వివరించారు. ఇది సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై విచారణ జరిపి కేసు నమోదు చేసేలా అధికారులను ఆదేశించాలని.. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. వాదనల అనంతరం ప్రతివాదులైన రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ కమిషనర్, డీజీపీ, సీబీఐతో పాటు జేసీ ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ విచారణను సెప్టెంబరు 12కు వాయిదా వేశారు. -
జేసీ ప్రభాకరరెడ్డి నీకు సిగ్గుందా?
తాడిపత్రి: ‘జేసీ ప్రభాకరరెడ్డి నీకు సిగ్గుందా? అసలు మున్సిపాలిటీలో డీజిల్ కుంభకోణం జరిగింది నీ హయాంలో కాదా? ఈ విషయాన్ని కప్పిపెట్టి అధికారులపై నిందలు మోపుతావా?’ అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు. స్థానిక తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో ప్రాభవాన్ని కోల్పోయిన జేసీ సోదరులు... రాబోవు ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో అధికారులు, పోలీసులను బెదిరించి గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయ త్నిస్తున్నారని మండిపడ్డారు. తన మాట వినని అధికారులకు అవినీతి మరక అంటించడం జేసీ ప్రభాకర్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఒక్కసారి జేసీ ప్రభాకరరెడ్డి గత చరిత్రను పరిశీలిస్తే అక్రమాలు వెల్లువలా వెలుగులోకి వస్తాయన్నారు. మున్సిపల్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా జేసీ ప్రభాకరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డీజిల్ వాడకం ఎంత మేరకు ఉందో... ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఎంత మేరకు తగ్గిందో ఒక్కసారి గుర్తించాలన్నారు. అప్పట్లో మున్సిపల్ ఏఈ జయభారత్‌రెడ్డిని దొడ్డిదారిన కమిషనర్‌గా ఏర్పాటు చేయించుకుని మున్సిపాలిటీని నిలువునా దోచేశాడన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. గతంలో తాను సవాల్ చేసిన ప్రతిసారీ జేసీ ప్రభాకరరెడ్డి తోక ముడుస్తూ వచ్చాడన్నారు. ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో అలజడులు సృష్టించేందుకు అధికారులను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతుండడం సిగ్గుచేటన్నారు. కాలం చెల్లిన రాజకీయ నేత జేసీ ప్రభాకరరెడ్డి బెదిరింపులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. తన అక్రమాలు వెలుగులోకి రాకుండా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించకుండా రెండు నెలలుగా జాప్యం చేస్తున్నాడన్నారు. ఇప్పటికై నా నీచ రాజకీయాలకు స్వస్తి పలకకపోతే పుట్టగతుల్లేకుండా పోతావని హెచ్చరించారు. -
పోలీసులపై జేసీ ప్రభాకర్‌రెడ్డి జులుం
తాడిపత్రి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై జులుం ప్రదర్శించారు. ఆగ్రహంతో ఊగిపోతూ చిందులు తొక్కారు. టీడీపీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి, ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి శనివారం సాయంత్రం పట్టణంలోని ఒకటో వార్డులో పర్యటించేందుకు నివాసం నుంచి బయల్దేరారు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి లేనిదే వార్డుల్లో పర్యటించకూడదని పోలీసులు ఆయన్ను ఒకటో వార్డు గాందీనగర్ వద్ద అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్కడికి చేరుకుని పోలీసులపై చిందులు తొక్కారు. డీఎస్పీ వీఎన్కే చైతన్య జోక్యం చేసుకుని.. శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని, నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయని స్పష్టంచేశారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డిని పంపించివేశారు. ఇదీ చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో రంగంలోకి సీబీఐ.. నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు -
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై జేసీ వర్గీయుల రాళ్ల దాడి
-
పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అలా ఊగిపోతారంతే..!
ఆయనో సీనియర్ రాజకీయ నాయకుడు. ఒక నియోజకవర్గంలో దశాబ్దాలుగా చక్రం తిప్పినా.. గత ఎన్నికల్లో పరాజయం చెందారు. తనకు రాజకీయంగా సమాధి తప్పదని కుమిలిపోతున్న ఆ నేత.. ఇప్పుడు కనిపించిన వారందరిపైనా తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. కావాలనే వివాదాలు సృష్టించుకుంటూ అభాసుపాలవుతున్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ పేరు తెలియనివారుండరు. సోదరులిద్దరూ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం తర్వాత పచ్చపార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జేసీ దివాకరరెడ్డి రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా జిల్లా రాజకీయాలను శాసిస్తే.. తమ్ముడు ప్రభాకరరెడ్డి మాత్రం లోకల్‌గానే తన ప్రతాపం చూపించేవారు. నాలుగు దశాబ్దాలుగా వీరిద్దరూ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి బరిలో లేకపోవడంతో.. తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి తన కొడుకు అస్మిత్ రెడ్డి తో పోటీ చేయించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కొడుకు ఓటమి..తనకు వయోభారంతో పాటు గతంలో చేసిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసులు జేసీ ప్రభాకర్ రెడ్డి మెడకు చుట్టుకుని గిలగిల్లాడుతున్నారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసుల్లో 33 ఛార్జిషీట్లను, ఆధారాలతో సహా పోలీసులు కోర్టులో సమర్పిస్తున్నారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి... తన ఫ్రస్ట్రేషన్ అంతా చుట్టూ ఉన్నవారిపైన చూపుతున్నారు. అలా ఊగిపోతారంతే..! ఇటీవలే తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకించి అభాసుపాలైన జేసీ ప్రభాకర్ రెడ్డి... ఇప్పుడు అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిపై దురుసుగా ప్రవర్తించి ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి గురయ్యారు. అనంతపురం కలెక్టరేట్లో ఓ వినతి పత్రాన్ని అందజేసేందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. సమస్యను చెప్పకుండానే.. కలెక్టర్ నాగలక్ష్మి పై అనుచితంగా ప్రవర్తించారు. ఆవేశం ఊగిపోతూ.... బీకేర్ ఫుల్ అంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వార్నింగ్ ఇచ్చాడు జేసీ. అంతటితో ఆగక.. గన్ మెన్ ను తోసేసి దాడికి యత్నించారు. అత్యంత సహనంతో వ్యవహరించిన కలెక్టర్ నాగలక్ష్మి పెద్దమనసుతో జేసీని క్షమించారు. ఆయన దురుసు ప్రవర్తనపై ఇప్పటిదాకా కలెక్టర్ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. జేసీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే జేసీకి తెగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గతంలోనూ ఓ రవాణా శాఖ కార్యాలయంలో కూడా ఉన్నతాధికారులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాగే వ్యవహరించారు. పప్పులు ఉడకలేదు మరీ.! రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులు చేయించటం.. తనకు అనుకూలంగా వ్యవహరించని పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులు పెట్టించటం.. బెదిరించి పనులు చేయించుకోవటం జేసీ ప్రభాకర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. గతంలో పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ, ఎస్సై లను బెదిరించి తన మనుషులను విడిపించుకెళ్లిన చరిత్ర కూడా ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి పై అనేక క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో ముక్కుసూటిగా విధులు నిర్వహిస్తూ.. పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్న డీఎస్పీ చైతన్యను టార్గెట్ చేశారు. డీఎస్పీపై ఇరవైకి పైగా ప్రైవేటు కేసులను జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టించారు. ఈయన వ్యవహార శైలిపై సొంత పార్టీ లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాబు కనుసన్నల్లోనే బ్లాక్ మెయిల్ జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని పలువురు టీడీపీ నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వీర్యమయ్యాక గత్యంతరం లేక టీడీపీలో చేరిన ప్రభాకర్ రెడ్డి అవినీతి.. అక్రమాలు.. దౌర్జన్యాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చంద్రబాబుకు తెలిసినా చూసీ చూడనట్లుగా వ్యవహరిన్నారని అనంతపురం టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం.. మహిళ కలెక్టర్‌తో దురుసు ప్రవర్తన!
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి రౌడీయిజం ప్రదర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్ హాల్లో ఏకంగా కలెక్టర్‌పైనే విరుచుకుపడ్డారు. కలెక్టర్ నాగలక్ష్మి ఎదుట పేపర్లు విసిరేసి దురుసుగా ప్రవర్తించారు. నువ్వు కలెక్టర్‌గా పనికిరావంటూ మహిళా అధికారినిని అవమానించారు. బీకేర్‌ఫుల్ అంటూ కలెక్టర్‌కే వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే, తాడిపత్రిలో ఓ భూవివాదం గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి.. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రెవెన్యూ భవన్లో కలెక్టర్‌ను జేసీ కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. కలెక్టర్‌ను బెదిరిస్తున్న క్రమంలో గన్‌మెన్.. ప్రభాకర్ రెడ్డిని వారించే ప్రయత్నం చేసినా ఆయన.. గన్‌మెన్‌ను వెనక్కి నెట్టివేశారు. ఈ క్రమంలోనే మహిళా కలెక్టర్ అని కూడా చూడకుండా బీకేర్‌ఫుల్ అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా బయటకు వచ్చి.. మీడియాతో కూడా ఆయన దురుసుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. -
జేసీ ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కాగా, జూటూరులో వైఎస్సార్సీపీ నేతలపై కత్తులతో జేసీ వర్గీయులు దాడి చేశారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్లో స్పష్టం చేశారు. దాడికి సంబంధించిన ఘటనలో ఐదుగురు టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జేసీ ట్రావెల్స్‌పై నమోదైన 33 కేసుల్లో ఛార్జిషీట్ సిద్ధం చేశారు. తాడిపత్రి, అనంతపురం కోర్టుల్లో ఛార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు. టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి సహా మొత్తం 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. చదవండి: వైఎస్సార్సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. నిషేధిత 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యూమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లతో బీఎస్-4 వాహనాలుగా చూపి అక్రమ రిజిస్ట్రేషన్‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి పాల్పడ్డారు. నాగాలాండ్ రాష్ట్రం కోహిమా ఆర్టోవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆధారాలతో సహా కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. -
పొలిటికల్ కారిడార్ : వివాదాల మధ్యనే జీవిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
-
రెండు కోట్ల డైమండ్ నెక్లెస్.. జేసీ అక్రమ ఆస్తులు చూసి ఈడీ షాక్
-
మంత్రుల బస్సు యాత్రపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీ మంత్రులు చేపట్టనున్న బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశాలున్నాయని, అలా జరుగుతుందని తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. బస్సులకు సేఫ్ గార్డ్లు పెట్టుకుంటే మంచిదని తెలిపారు. పోలీసులు వాహనాలకు ఉపయోగించే విధంగా ఫెన్సింగ్ పెట్టుకుంటే బాగుంటుందన్నారు. కాగా రాష్ట్రంలో మూడేళ్లుగా అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించడంతోపాటు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘సామాజిక న్యాయభేరి’ పేరుతో మంత్రులు బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈనెల 26న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమై 29వ తేదీన అనంతపురంలో ముగుస్తుంది. యాత్ర సందర్భంగా రోజూ ఒకచోట బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే జేసీ వ్యాఖ్యలతో మంత్రుల బస్సు యాత్రను టీడీపీ భగ్నం చేసేందుకు ఏదైనా కుట్ర పన్నుతోందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. చదవండి: ఎంగిలి పేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా -
టీడీపీలో వర్గవిభేదాలు: ఆయనకు టిక్కెట్టు ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడు అంటూ..
అనంతపురం (ఓడీ చెరువు): టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరస్పర వ్యాఖ్యలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం ఓడీచెరువు మండలం కొండకమర్లలోని మాజీ ఎంపీపీ ఇస్మాయిల్ గృహ ప్రవేశ కార్యక్రమానికి పార్టీ నేత సాకెం శ్రీనివాసరెడ్డితో కలసి వచ్చారు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ చానల్‌తో జేసీ మాట్లాడుతూ జిల్లాలో టీడీపీకి చెందిన 11 మంది మాజీ ఎమ్మెల్యేలు మరకలున్న నాయకులేనని, వారందరినీ చంద్రబాబు మార్చాలని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో పల్లె రఘునాథరెడ్డికి టిక్కెట్టు ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏ మరకాలేని సాకెం శ్రీనివాసరెడ్డి టీడీపీ తరఫున బరిలో ఉంటాడని, అతన్ని బలపర్చుతున్నట్లు చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఘాటుగా స్పందించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పుట్టపర్తిలో టీడీపీని బలహీన పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘టిక్కెట్టు ఇచ్చేది పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు. తాడిపత్రిలో నీకు టిక్కెట్టు వస్తుందో, లేదో చూసుకో. ఇతర నియోజకవర్గాల్లోకి జోక్యం చేసుకుంటే పార్టీకి ప్రమాదం. నేను ఇప్పటికి ఆరు సార్లు బీ ఫారం తీసుకున్నా. ఏడోసారి కూడా తీసుకుంటా’నని అన్నారు. -
అనంత టీడీపీలో రచ్చకెక్కిన గ్రూపు రాజకీయాలు
-
అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల అంతర్గత కుమ్ములాట
-
జేసీ టీడీపీలోకి వచ్చాకే గ్రూపు రాజకీయాలు పెరిగాయి
-
రేయ్...రూ.2 వేలు తీసుకుని ఓటేశారు: జేసీ
తాడిపత్రి: ‘‘రేయ్...ఎలక్షన్లో ఓటుకు రూ.2 వేలు తీసుకుని నాకు ఓటేశారు.. ఇప్పుడు పనులు చేయమని అడుగుతారా! నా... డకల్లారా.. పనులు చేయమని నన్ను అడిగే హక్కు మీకు లేదు’’ అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రజలపై చిందులు తొక్కారు. తాడిపత్రి పట్టణంలోని 35వ వార్డు ఆంజనేయస్వామి మాన్యంలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమకు రోడ్లు లేవని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన అక్కడున్న వారిపై ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘మీరు డబ్బు తీసుకోకుండా ఓట్లేసి ఉంటే.... నేను మీకు పనులు చేసిపెట్టాలి. డబ్బు తీసుకుని ఓట్లేశారు.. మీకు నన్ను అడిగే హక్కులేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహిళల ఎదుటే అక్కడున్న పురుషులను బూతులు తిడుతూ దుర్భాషలాడారు. దీంతో అక్కడున్న వారంతా బిత్తరపోయారు. ఎన్నికల ముందు ‘సేవ్ తాడిపత్రి’ పేరుతో మొసలి కన్నీరు కార్చిన జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారం దక్కగానే ఇలా నోటికి పనిచెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు. -
పోలీస్ కస్టడీలో జేసీ ప్రభాకర్ రెడ్డి
-
దళిత సీఐని పబ్లిక్‌గా బెదిరించిన జేసీ
-
జేసీ వర్గీయుల హంగామా.. నిలిచిన 108 అంబులెన్సు
సాక్షి, అనంతపురం : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గురువారం అత్యుత్సాహం చూపించారు. కడప కేంద్ర కారాగారం నుండి జేసీ, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు గురువారం విడుదలయ్యారు. అక్రమ వాహనాల కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద జేసీ వర్గీయులు హంగామా చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా భారీ కాన్వాయ్‌తో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌లు కడప నుంచి తాడిపత్రి చేరుకున్నారు. తాడిపత్రికి వెళ్లే సమయంలో కడప బైపాస్‌లో భారీ కాన్వాయ్ కారణంగా 108 అంబులెన్సు వాహనం నిలిచిపోయింది. జేసీ అనుచరుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. కరోనా వ్యాప్తి సమయంలో ఇలాంటివి అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జేసీ ప్రభాకర్, అస్మిత్‌కు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు నిషేధించిన వాహనాలను రోడ్లపై ఎలా తిప్పుతారని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. ప్రమాదాలకుఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేసింది. మోసపూరిత పనులను అనుమతించమని తెల్చిచేప్పింది. బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. (దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ) దీంతో హైకోర్టులో మూడు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లను జేసీ కుటుంబసభ్యులు ఉపసంహరించుకున్నారు. అదే విధంగా కింది కోర్టులో బెయిల్ దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా చూపి రిజిస్ట్రేషన్ చేయించి దివాకర్ ట్రావెల్స్ అక్రమాలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యూమెంట్స్‌తో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. నాగాలాండ్ రాష్ట్రంలో కూడా పలు వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌లు కడప సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. -
కస్టడీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి
కడప అర్బన్/కోటిరెడ్డి సర్కిల్/సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డిలను అనంతపురం జిల్లా పోలీసులు రెండు రోజులపాటు తమ కస్టడీకి తీసుకున్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కోర్టు ఈ నెల 20 మధ్యాహ్నం 1 గంట నుంచి 22 మధ్యాహ్నం 2 గంటల వరకు రిమాండ్‌కు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అనంతపురం పోలీసులు శనివారం కడప కేంద్ర కారాగారం నుంచి జేసీని, ఆయన తనయుడిని తమ వాహనాల్లో తీసుకెళ్లారు. కేసును కొట్టేయాలంటూ పిటిషన్ వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో అనంతపురం వన్‌టౌన్ పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి జేసీ ఉమ, అస్మిత్‌రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావు విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియచేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
జేసీ దివాకర్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి అరెస్ట్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్జరీ డాక్యూమెంట్స్‌తో 154 వాహనాలను జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలన్నారు. దివాకర్‌రెడ్డి అండతోనే ఈ అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. తాడిపత్రి సీఐ, ఎస్సై సంతకాలను కూడా జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ చేసిందని పెద్దారెడ్డి విమర్శించారు. (మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్) జేసీ కుటుంబ సభ్యుల అరెస్ట్ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని పెద్దారెడ్డి తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తప్పు చేశారని అందుకే అరెస్ట్ అయ్యారని తెలిపారు. వందలాది మంది ప్రయాణికులను జేసీ ట్రావెల్స్ పొట్టన పెట్టుకుందని దుయ్యబట్టారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. జేసీ ట్రావెల్స్ అరాచకాలపై లోతుగా దర్యాప్తు చేయాలని పెద్దారెడ్డి అన్నారు. -
వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలింపు
-
అంతులేని అవినీతి..
-
40 ఏళ్ల నుంచి అక్రమంగా దివాకర్ ట్రావెల్స్ నిర్వహణ
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జేసీ బ్రదర్స్ (జేసీ దివాకర్‌రెడ్డి– జేసీ ప్రభాకర్‌రెడ్డి) వ్యాపార సామ్రాజ్యమంతా అవినీతి, అక్రమమేనని తేలింది. గత తెలుగుదేశం పాలనలో మరీ చెలరేగిపోయారు. ట్రావెల్స్, ట్రాన్స్పోర్ట్, అసాంఘిక కార్యకలాపాలు, మాన్యం భూముల ఆక్రమణ తదితర వాటి ద్వారా గత ఐదేళ్లలో రూ.2900 కోట్ల మేర దోపిడీ సాగించారు. తాడిపత్రి: దివాకర్ ట్రావెల్స్ అక్రమాలు 2012లో వెలుగులోకి వచ్చాయి. అప్పటి రవాణా శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య మహబుబ్‌నగర్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఓ మహిళా ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు రవాణా శాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి కర్నూలు – హైదరాబాద్ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించారు. దివాకర్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సులో మొబైల్ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి.. ఆ బస్సును కూడా సీజ్ చేశారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించి అనుమతులు లేని బస్సులను పదుల సంఖ్యలో సీజ్ చేశారు. ఆదర్శ మున్సిపాలిటీలోనూఅంతులేని అవినీతి తాడిపత్రి మున్సిపాలిటీ పేరుకే ఆదర్శం.. కానీ ఆ ఆదర్శం మాటున అంతులేని అవినీతి చోటు చేసుకుంది. జేసీ సోదరులే కాకుండా వారి అనుచరులు సైతం తాడిపత్రి మున్సిపాలిటీని అడ్డుపెట్టుకొని రూ.200 కోట్లకు పైగా దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి బినామీగా వ్యవహరించిన ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి పట్టణంలోని జేసీ నాగిరెడ్డి మున్సిపల్ కాంప్లెక్స్‌లో మొదటి అంతస్తు టెండర్ దక్కించుకున్నాడు. మొదటి అంతస్తుకు సంబంధించి రూ.2.73కోట్లు బకాయిలు మున్సిపాలిటీకి చెల్లించాలి. ఈ మొత్తం కాంప్లెక్స్‌ను వ్యాపారులకు సబ్లీజుకు ఇచ్చేశాడు. ఒక్కో వ్యాపారి నుంచి రూ.20 వేల నుంచి రూ.30 వేలు చొప్పున అద్దె వసూలు చేశాడు. ఈ కాంప్లెక్స్‌లో కనీసం 50 మంది వ్యాపారులు ఉంటారు. ఈ లెక్క ప్రకారం నెలకు రూ.10 లక్షలు నుంచి రూ.15 లక్షల ఆదాయం వచ్చేది. ఇదే కాంప్లెక్స్‌లో 64, 68 నంబర్ షాపులు కూడా ఎస్వీ రవీంద్రారెడ్డి దక్కించుకున్నారు. వీటికి రూ.3.52 లక్షలు గుడ్‌విల్, రూ.3.33 లక్షలు బాడుగల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో ఈ దుకాణాల లీజును మున్సిపల్ అధికారులు రద్దు చేశారు. అయినా ఈ దుకాణాలు లీజుకు ఇచ్చి ప్రతినెలా భారీగా అద్దె వసూలు చేశాడు. గత ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగించాడు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో 64, 76, 68, 62 నంబర్ షాపులను కూడా ఎస్వీ రవీంద్రారెడ్డి దక్కించుకున్నాడు. వీటికి రూ.2 వేల చొప్పున మాత్రమే అద్దె చెల్లిస్తున్నారు. వ్యాపారులకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సబ్లీజుకు ఇచ్చారు. రెండు కాంప్లెక్స్‌లోని అద్దెలు రవీంద్రారెడ్డి వసూలు చేసినా, ఈ డబ్బులు తిరిగి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి చేరినట్లు సొంత పార్టీ నేతలే చెబుతుండడం గమనార్హం. నిజాయతీ అధికారికి బదిలీనే బహుమానం మైనింగ్ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలో జరుగుతున్న గ్రానైట్ మాఫియా అక్రమాలు చూసి ఆయన షాక్‌కు గురయ్యారు. గ్రానైట్ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా కోటి రూపాయలు కూడా ఫెనాల్టీ రూపంలో వచ్చేవి కావు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారు. ఈ జరిమానాలను బట్టి అక్కడ దందా ఏ స్థాయిలో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. తమకు ప్రతిబంధకంగా మారుతున్న ప్రతాప్‌రెడ్డిని బదిలీ చేయించాలని చూశారు. చివరకు చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీంతో గ్రానైట్ మాఫియాతో తనకు ముప్పు ఉందంటూ మైనింగ్ విజిలెన్స్ డైరెక్టర్‌కు ప్రతాప్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డితో పాటు గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు, నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత ప్రతాప్‌రెడ్డిని ఇక్కడి నుంచి ఆ మాఫియానే బదిలీ చేయించి తమ అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగించింది. అధికారాన్నీ అడ్డుపెట్టుకుని గ్రానైట్ మాఫియా ద్వారా రూ. 200 కోట్లకు పైగా ఆర్జించారన్న ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. మాఫియా జోక్యం లేక ముందు ఈ ప్రాంత గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు ప్రతి నెలా రూ.9.5 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. అంటే పరిశ్రమలు ఎంత బాగా నడిచాయో ఈ బిల్లులను చూస్తే తెలిసేది. మాఫియా జోక్యంతో పరిశ్రమలు కాస్తా చీమకుర్తి, మాటూరు, చిత్తూరు, కర్నూలు, ఒంగోలు తదితర ప్రాంతాలకు తరలిపోయాయి. దీంతో ప్రస్తుతం రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లు మాత్రమే కరెంటు బిల్లులు వస్తున్నాయి. అంటే గ్రానైట్ పరిశ్రమలు భారీగా మూతపడ్డాయి. తద్వారా రూ.2,500 కోట్లు గ్రానైట్ పరిశ్రమకు నష్టం వాటిల్లింది. ట్రాన్స్పోర్ట్ ద్వారా రూ.300 కోట్లు ఆర్జాస్ స్టీల్‌ప్లాంట్ కోసం హుసేన్‌పురం, జంబులపాడు, చల్లవారిపల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు దాదాపు రెండు వేల ఎకరాల వరకు తమ భూములను స్వాధీనం చేశారు. వీరు లారీలు, ఇతర మార్గాల ద్వారా ఈ ప్లాంటుపై ఆధారపడి జీవించే వారు. అయితే దివాకర్ రోడ్‌లైన్స్, ట్రాన్స్ ఇండియా పేరుతో జేసీ బ్రదర్స్ సొంతంగా ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్ట్‌ను కాదనే ధైర్యం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఉండేది కాదు. దీంతో తొలి ప్రాధాన్యత జేసీ వారికే ఇస్తూ వచ్చేవారు. అయితే ఇందుకు సంబంధించిన బిల్లులను జేసీ బ్రదర్స్ ట్రాన్స్‌పోర్టు పేరు మీద కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ పేరుపై చేయిస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతున్నట్లు సమాచారం. లారీలపై జేసీపీఆర్ అని ఉంటుంది. బిల్లులు మాత్రం ఆయన పేరుతో ఉండవు. మొత్తం బినామీ లెక్కలే. ఈ లారీలు మినహా ఇతర లారీలు స్టీల్‌ప్లాంట్‌లోకి వెళ్లేందుకు వీల్లేదు. ఇలా ఐదేళ్లలో ట్రాన్స్పోర్ట్ ద్వారా రూ.300 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. డ్రై స్లాగ్ ద్వారా నెలకురూ.15కోట్ల ఆదాయం ఆర్జాస్ స్టీల్ ప్లాంట్‌లో డ్రై స్లాగ్‌ను టన్ను రూ.10తో ఇక్కడి టీడీపీ నేతలు కొనుగోలు చేసేవారు. దీనిని అల్ట్రాటెక్ సిమెంట్, సాగర్ సిమెంట్ పరిశ్రమలకు తరలించి టన్ను రూ.850 చొప్పున విక్రయిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చుల కింద రూ.250 పోగా రూ.600 మేర మిగులుతుండేది. ప్రతి నెలా 25వేల టన్నులకు పైగా డ్రైస్లాగ్‌ను ఈ స్థాయిలో తరలించే వారు. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.750 కోట్లకు పైగా ఆదాయం గడించినట్లు తెలుస్తోంది. అన్ని రూట్లకూ ఒకటే పర్మిట్ జేసీ సోదరులు అధికార బలంతో రవాణా శాఖ అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఒక పర్మిట్ నంబర్‌పైనే పలు రూట్లలో అనధికారికంగా బస్సులు నడుపుతూ వచ్చారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్‌ల నిర్వహణపై నిఘా అధికమైంది. దీనికి తోడు దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు తరచూ ప్రమాదాలకు గురయ్యేవి. ఈ ట్రావెల్స్ అక్రమాలపైనా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు అనుమతులు లేకుండా తిరుగుతున్న బస్సులన్నింటినీ ఎక్కడికక్కడ సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. రాజకీయ అవసరాలకు మట్కా డాన్ సహకారం తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ అవసరాలకు మట్కా డాన్ రషీద్ స్పాన్సర్‌గా వ్యవహరించేవాడు. నియోజకవర్గంలోని నేతలకు పెద్ద మొత్తంలో కానుకలను ఆయన అందజేసేవాడు. ప్రజాప్రతినిధులు కార్లు కొనుగోలు చేస్తే వాటికి నెలవారీ కంతులు కూడా రషీద్ చెల్లించేవాడని తెలిసింది. మట్కా నిర్వహణకు పోలీసుల నుంచి ఇబ్బందులు రాకుండా కప్పం రూపంలో స్థానిక నేతలకు రషీద్ నజరానాలు ఇచ్చేవాడు. 2018 డిసెంబర్ 30న వైఎస్సార్ జిల్లాకు చెందిన సీఐ హమీద్‌ఖాన్‌తో పాటు పోలీసులపై దాడి చేసి వారి వాహనాన్నే తగులబెట్టి సవాల్ విసిరే స్థాయికి ఎదిగాడంటే అతని వెనుక ఉన్న వ్యక్తి ఎవరనేది తాడిపత్రిలోని ఏఒక్కరినీ అడిగినా తెలుస్తుంది. మాన్యాన్నీ వదలని జేసీ సోదరులు పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో పప్పూరమ్మ ఆలయానికి దాదాపు 19 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. ఈ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆలయంలో ధూపదీప నైవేద్యాలు, నిత్య కైంకర్యాలు చేస్తుండేవారు. అయితే తాడిపత్రి – పెద్దపప్పూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూములను మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కబ్జా చేసి పంట సాగు చేపట్టారు. రెండు పెద్ద ఫారంపాండ్లు ఏర్పాటు చేయించి బోరుబావుల నీటితో వాటిని నింపారు. ఈ నీటితో మాన్యం భూముల్లో కరివేపాకు, అరటి సాగు చేశారు. పంట దిగుబడుల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నా ఆలయంలో పూజలకు కనీసం ఒక్క పైసా కూడా చెల్లించలేదనే ఆరోపణలున్నాయి. ఏడాది క్రితం ఈ విషయంపై విచారణకు వచ్చిన దేవదాయ శాఖ అధికారలు ఆ భూములన్నీ జేసీ దివాకర్‌రెడ్డి అధీనంలో ఉన్నాయని తెలుసుకుని నోరు మెదపకుండా వెళ్లిపోయారు. మూడు నెలల క్రితం అధికారులు వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గ్రానైట్ మాఫియా తాడిపత్రిలో 850 వరకు గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 70 లారీలతో 20 నుంచి 30 మంది ట్రాన్స్పోర్టర్లు గ్రానైట్ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. ఒక లోడు గ్రానైట్‌ను క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేలు రాయల్టీ చెల్లించాలి. అయితే రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ యాజమాన్యం తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారుల మధ్య కుదిరిన ఒప్పందం మాఫియాను తలపించింది. లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణాన్ని తగ్గించి బిల్లులో చూపించి రవాణా చేసేవారు. ఒకే బిల్లుతో 5 – 6 లోడ్లు రవాణా చేస్తుండేవారు. ఈ డబ్బులు మొత్తం మాఫియాను నడిపే ఓ పెద్దమనిషి ఇంటికి చేరవేసేవారు. అక్కడ వాటాల పంపకం జరుగుతుండేది. -
సీఐ నారాయణరెడ్డిపై ఈసీ కొరడా
సాక్షి, తాడిపత్రి అర్బన్ : తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డిపై బదిలీ వేటు పడింది. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నందున ఆయనపై ఈసీ చర్యలు తీసుకుంది. రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నారాయణరెడ్డి పనితీరు వివాదాస్పదంగానే ఉంది. ఎస్ఐలకు సీఐలుగా పదోన్నతులు ఇచ్చిన తరువాత మొట్టమొదటగా నారాయణరెడ్డి పేరునే పరిశీలించారు. ఎస్ఐల నుంచి సిఐగా పదోన్నతి లభిస్తే రెండేళ్ల పాటు లూప్లైన్లో ఉంచాల్సి ఉంది. ఈ నిబంధనలను పక్కనపెట్టి నారాయణరెడ్డి ఏ స్టేషన్లో పనిచేశారో అక్కడే సీఐగా పోస్టింగ్ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. దీనికి కారణం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సిఫార్సే కారణమన్న ఆరోపణలు కూడాపెద్ద ఎత్తున వినిపించాయి. ఇందుకు ఎమ్మెల్యేకు భారీ స్థాయిలో లాబీయింగ్ చేశారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి. ఇందుకు కృతజ్ఞతగా సీఐ నారాయణరెడ్డి తన సొంత గ్రామమైన వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం లావనూరులో అప్పట్లో భారీ విందు ఇచ్చారు. ఈ విందుకు ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని ఆహ్వానించారు. దీంతో ఎమ్మెల్యే తన అనుచరగణంతో లావనూరుకు వెళ్లడం.. సీఐ ఘన స్వాగతం పలకడం జరిగింది. ఊరేగింపుగా తీసుకెళ్లిన వీడియో అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో సీఐ నారాయణరెడ్డి ఎమ్మెల్యే ఏది చెబితే దానికి తలూపడం, పాటించడం తప్ప లా అండ్ ఆర్డర్‌తో, న్యాయ, అన్యాయాలతో సంబంధం లేకుండా వ్యవహరించడం వివాదాస్పదమైంది. సీఐ ఏకపక్ష తీరుతోనే సమస్యలు ముందే తాడిపత్రి సమస్యాత్మక అతి సున్నితమైన ప్రాంతం కావడంతో ఇక్కడ అధికార, విపక్ష పార్టీల మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నాయి. దీనికితోడు ప్రబోధాశ్రమం ఘటన ఉంది. ఇలాంటి నియోజకవర్గంలో సీఐ అనే అధికారి చాలా పారదర్శకంగా పనిచేసి నిక్కచ్చిగా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఇక్కడ సీఐ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. సీఐ నారాయణరెడ్డి ఎమ్మెల్యే ఆదేశాలు పాటించడం తప్ప మరో విషయం తెలియదని, పూర్తిగా జేసీ సోదరులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని అప్పట్లో వైఎస్సార్సీపి నేతలు బాహాటంగా ఆరోపించారు. గతంలో ఇదే స్టేషన్లో ఎస్ఐగా పనిచేసినపుడు కూడా నారాయణరెడ్డి వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరిగి సీఐగా ఇదే స్టేషన్‌కు పోస్టింగ్ ఇవ్వడంపై విపక్ష నేతలు అదే రీతిలో ఆరోపణలు చేశారు. పోలీసు అధికారులు మాత్రం జేసీ సోదరుల సిఫారస్సు లేనిదే ఇక్కడి నుంచి బదిలీ చేయలేరు, పోస్టింగ్ ఇవ్వలేరు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో సీఐ నారాయణరెడ్డిని బదిలీ చేయడంతో ఎన్నికల కమిషన్(ఈసీ)పై మరింత నమ్మకం కలిగినట్లైంది. ప్రతిపక్షపార్టీ నేతలే ఆయన టార్గెట్ ప్రజాసంకల్ప పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకున్న సందర్భంగా వైఎస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి 2018 అక్టోబర్ ఆరో తేదీన పెద్దపప్పూరు మండలంలో చేపట్టిన సంఘీభావ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి చివర్లో నిరాకరించారు. సొంత మండలంలో పెద్దారెడ్డి పాదయాత్ర చేస్తే తమ ఇమేజీ దెబ్బతింటుందన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే తన అనుంగులైన పోలీసు అధికారులను ఉసిగొల్పాడు. ఇందులో భాగంగానే రూరల్ పోలీసులు అప్పట్లో పెద్దారెడ్డి పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. ఎలాగైనా పాదయాత్ర చేయాలన్న సంకల్పంతో పెద్దారెడ్డి ముచ్చుకోటకు రావడంతో వెంటనే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో 2018 ఆగస్టు 29న జరిగిన చిన్నపాటి ఘర్షణకు వైఎస్సార్సీపీ సమన్వకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని బాధ్యుడిని చేస్తూ హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి ఏకపక్షంగా వ్యవహరించారు. 2018 సెప్టెంబర్‌లో జేసీ ట్రావెల్స్ బస్సు అద్దాలు ధ్వంసం చేశారన్న నెపంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. తాడిపత్రి మండలం ఆలూరులో వైఎస్సార్సీపీ నేత గోసు రాజగోపాల్‌రెడ్డి అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసును బనాయించారు. నిన్న చిత్తూరు జిల్లా మదనపల్లి సీఐ, నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ సీఐపై ఈసీ కొరడా ఝుళిపించింది. అధికార తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఏకపక్షంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తోంది. ఈసీ చర్యలతో సదరు పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరిపై వేటు పడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు స్పందించిన ఈసీ తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డి ఏకపక్ష వ్యవహారంపై వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పలుమార్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు ఈసీ స్పందిస్తూ నారాయణరెడ్డిని బదిలీ చేసింది. ఈయన స్థానం లో తిరుపతి క్రైం బ్రాంచ్‌లో పనిచేస్తున్న శరత్‌చంద్రను నియమిస్తూ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. -
జేసీ దివాకర్‌రెడ్డి కళాశాలలో తనిఖీలు
సాక్షి, యాడికి : తెలుగుదేశం పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు సిద్ధం చేశారని సమాచారం అందడంతో తహసీల్దార్ అంజనాదేవి, రాష్ట్ర ఎన్నికల తనిఖీ అధికారి చంద్రశేఖరన్, రెవిన్యూ సిబ్బందితో శనివారం సాయంత్రం యాడికి మండల పరిధిలోని జేసీ దివాకర్‌రెడ్డి జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. అయిగే గదులు తాళాలు వేసి ఉండటంతో వీఆర్వో పవిత్ర ప్రిన్సిపల్‌ను ఫోన్లో సంప్రదించారు. తాను బెంగళూరులో ఉన్నానని, తాళంచెవులు తాడిపత్రిలోని తన ఇంటిలో ఉన్నాయని చెప్పాడు. ఈ మేరకు సిబ్బంది తాడిపత్రికి వెళ్లి తాళంచెవులు తీసుకొచ్చారు. ఇందులో ఒక గదిలో టీడీపీ కండువాలు, కరపత్రాలు లభించాయి. ప్రిన్సిపల్ రూము, మరో గదికి సంబంధించిన తాళంచెవులు లేకపోవడంతో వాటిని తెరవలేకపోయారు. ఈ గదుల తాళాలను తర్వాతైనా తెరిచి పరిశీలించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల తనిఖీ అధికారి చంద్రశేఖర్‌ను సిబ్బందికి సూచించారు. ఇదిలా ఉండగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనిఖీల సమయంలో తహసీల్దార్‌కు ఫోన్ చేసి.. తమ కళాశాల గదులను తెరవవద్దని, ఒక వేళ కాదు అని తెరిస్తే మీ మీద కోర్టులో కేసు వేస్తానని బెదిరించినట్లు తెలిసింది. మరి ప్రిన్సిపల్ గదిని తెరుస్తారో లేదో వేచి చూడాల్సిందే. -
లక్ష్ముంపల్లిలో ఉద్రిక్తత
సాక్షి, పెద్దవడుగూరు : లక్ష్ముంపల్లిలో టీడీపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అరాచక పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారు. ఆ పార్టీలోని పలువురు నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీలోకి పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. దీంతో తాము ఎక్కడ ఓటమిపాలవుతామోనన్న భయం టీడీపీని వెంటాడుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం లక్ష్ముంపల్లిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుడిపై నోటికొచ్చినట్టు దూషించాడు. వైఎస్సార్సీపీలోకి చేరికలు వెల్లువెత్తుతుండటంతో అసహనానికి లోనయ్యాడు. ప్రభాకర్‌రెడ్డి తిట్లదండకం శ్రుతిమించడంతో గ్రామస్తులు తిరగబడ్డారు. చివరకు పోలీసులు సర్దిచెప్పాల్సి వచ్చింది. అనంతరం ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయాడు. వైఎస్సార్సీపీ నా యకుడు గూడూరు సూర్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు సోమవారం లక్ష్ముంపల్లికి చేరుకున్నారు. ఇదేరోజు టీడీపీ ఎన్నికల ప్రచారం మరోమారు జరగాల్సి ఉంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ప్రధాన రహదారిపైకి చేరుకున్నారు. తమ గ్రామంలోకి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని రానిచ్చే ప్రసక్తే లేదని భీష్మించారు. ప్రచారం చేసేవాళ్లు ఓట్లు అడుక్కోవాలే కానీ బూతులు తిట్టాల్సిన పనేముందని ప్రశ్నించారు. గ్రామంలో జరుగుతున్న సంఘటనలను తెలుసుకొన్న ఎమ్మెల్యే జేసీపీఆర్ క్రిష్టిపాడులో ప్రచారం ముగించుకుని లక్ష్ముంపల్లికి రాకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. అప్పటికే పెద్దవడుగూరు సీఐ రాము, ఎస్ఐ రమేష్‌రెడ్డి, ప్రత్యేక బలగాలను గ్రామంలోకి మోహరింపజేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. ఎమ్మెల్యే గ్రామంలోకి రావడం లేదని ఎవ్వరూ ఘర్షణలకు పాల్పడవద్దని పోలీసులు స్థానిక ప్రజలకు, కార్యకర్తలకు సర్దిచెప్పి శాంతింపజేశారు. గ్రామంలో జరుతున్న పరిణామాలను తెలుసుకొన్న ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు లక్ష్ముంపల్లికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. -
గెలిస్తే ఊర్లో లేకుండా చేస్తాం : జేసీ బ్రదర్స్
సాక్షి టాస్క్‌ఫోర్స్: పెద్దపప్పూరు మండలంలో జేసీ సోదరులకు ఎదురుగాలి వీస్తోంది. దేవునిఉప్పలపాడు, పెద్ద ఎక్కలూరు గ్రామాల్లో మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది. ముఖ్య నాయకులు కూడా ముఖం చాటేసి ఇంట్లో లేకుండా వెళ్లిపోవడంతో ప్రచారాన్ని తూతూ మంత్రంగా ముగించాల్సి వచ్చింది. ఇది జేసీ సోదరుల్లో అలజడి రేపింది. దీనికితోడు జేసీ సొంత గ్రామమైన జూటూరులో బలమైన యర్రగుడి వర్గం ఆదివారం ఉదయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీపార్టీలో చేరిపోయింది. దీంతో కంగారు పడిపోయిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు రహస్య పర్యటనలకు శ్రీకారం చుట్టారు. గతంలో టీడీపీలో ఉండి ప్రసుత్తం వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్న నాయకులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు ముఖం చాటేసి వెళ్లిపోతుండటంతో రాత్రివేళల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం రాత్రి దేవుని ఉప్పలపాడు, పెద్ద ఎక్కలూరులో రహస్యంగా పర్యటించారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆశలు చూపారని, వాళ్లు లొంగకపోవడంతో బెదిరింపులకు దిగారని సమాచారం. రెండు రోజుల్లో తమ దారికి రావాలని, లేకుంటే తాము గెలిస్తే ఊర్లో లేకుండా చేస్తామని హెచ్చరికలు చేసినట్లు బాధితులు తెలిపారు. ఈసారి పెద్దారెడ్డి చేతిలో ఓటమి తప్పదని గ్రహించిన జేసీ సోదరులు తాటాకు చప్పుళ్లు చేస్తున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ నాయకులు అంటున్నారు. -
హత్యకేసు సాక్షులను చంపేందుకు కుట్ర!
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయభాస్కర్ రెడ్డి హత్యకేసు ప్రధాన సాక్షులపై హత్యకు కుట్ర జరిగింది. తమను హత్య చేసేందుకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కుట్ర చేశారని ఆరోపిస్తూ అప్పేచర్లకు చెందిన గరుడ శేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు జేసీ వర్గీయులు వెంకటేశ్వర్లు, నెల్లూరు నాయుడు, మహబూబ్ బాషాలపై గుత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయభాస్కర్ రెడ్డి హత్య కేసులో నిందితులు గుర్రంశీనా, వెంకటేశ్వర్లు, గురుప్రసాద్‌లకు గుత్తి కోర్టు ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. జేసీ అండతో నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
స్వామి.. జేసీ.. ఓ పోలీసు!
పోలీసులపై జేసీ రెచ్చిపోవడం.. పోలీసు అధికారుల సంఘం అదేస్థాయిలో వార్నింగ్ ఇవ్వడం.. తిరిగి జేసీ తనదైన స్థాయిలో స్పందించడం.. ఇంతలో ఇప్పటి వరకు ఎక్కడున్నారో తెలియని ప్రబోధానంద ఓ వీడియో విడుదల చేసి మొత్తం ఘటనకు జేసీనే కారణమని ఆరోపించడం.. వెరసి చల్లారిందనుకున్న ‘తాడిపత్రి’ రోజుకో రీతిన రగులుతూనే ఉంది. వారం రోజులు గడుస్తున్నా.. వినాయక చవితి రగడ తిరుగుతున్న మలుపులు ఏ పరిస్థితులకు దారి తీస్తాయోననే చర్చ జోరుగా సాగుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: గణేశ్ నిమజ్జం సందర్భంగా తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడ గ్రామంలో ఘర్షణ తలెత్తింది. ఆ సందర్భంగా పోలీసులు వైఫల్యం చెందారని వారిని ‘కొజ్జా’లతో పోల్చడంతో పాటు ఎంపీ జేసీ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా రాజకీయపార్టీలు వ్యవహరిస్తున్నాయని, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే నాలుక కోస్తామని జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, సీఐ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై శుక్రవారం జేసీ స్పందించారు. గొడవ సందర్భంగా పోలీసులంతా పారిపోయారని, వారితో పాటు తాను పారిపోయానన్నారు. పారిపోయిన పోలీసులు కొజ్జాలే అని, వారితో పాటు తానూ కొజ్జానే అని జేసీ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. సినీ హీరో సాయికుమార్ తరహాలో మీసం మెలేసి, నాలుక కోస్తా అని మాధవ్ అంటున్నారని, ఇది సినిమా కాదు నిజ జీవితం అన్నారు. ‘రేయ్ మాధవ్ఎన్నిసార్లు నా చుట్టూ తిరగలేదు. నువ్వు నా నాలుక కోస్తావా. ఎక్కడికి రావాలో చెప్పు’ అని తీవ్రంగానే స్పందించారు. అంతటితో ఆగకుండా తాడిపత్రికి వెళ్లి మాధవ్‌పై ఫిర్యాదు చేశారు. సీఐలా కాకుండా వీధిరౌడీలా మాట్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆశ్రమ ఘటనలో పోలీసులు వైఫల్యం చెందారన్నారు. పోలీసు సంఘం స్పందన తర్వాత జేసీ క్షమాపణలు చెబుతారని పోలీసులు భావించారు. అందుకు భిన్నంగా జేసీ వ్యవహరించడం, ఏకంగా ఫిర్యాదు వరకూ వెళ్లడంతో పోలీసులు పునరాలోచనలో పడ్డారు. ఈ విషయంలో వెనక్కి తగ్గితే పోలీసు వ్యవస్థపై ఓ వ్యక్తి పైచేయి సాధించినవారవుతారని భావిస్తున్నారు. దీనిపై సీఎం, డీజీపీని కలిసి జేసీపై కేసు నమోదు చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆశ్రమంలో జరిగిన ఘటనను, పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలను వేర్వేరుగా చూడాలని విన్నవించనున్నారు. వీడియో ద్వారా వెలుగులోకి ప్రబోధానంద ఈ వివాదం ఇలా నడుస్తుంటే గణేశ్నిమజ్జనం గొడవ, ఆశ్రమంపై ఆరోపణలు, జేసీ బ్రదర్స్‌తో వైరంపై ఆశ్రమ నిర్వాహకుడు ప్రబోధానంద వీడియా ద్వారా స్పందించారు. గతంలో బీజేపీ కార్యకర్తలకు ఆశ్రయం కల్పించామనే కారణంతో మాపై కక్షకట్టారని, అప్పట్లో ఆశ్రమం ఖాళీ చేయించి కర్ణాటకకు వెళ్లామన్నారు. 2003లో జేసీతో విభేదాలు వద్దని ఆయనతోనే ఆశ్రమం ప్రారంభించామన్నారు. 2008 వరకూ జేసీ మంచిగానే ఉన్నారన్నారు. ఆపై డబ్బులు డిమాండ్ చేయడం, తాము ఇవ్వకపోవడంతో కక్ష కట్టి నీళ్లు, కరెంటు నిలిపేసి ఇబ్బందులు పెట్టాలని చూశారన్నారు. తాము లొంగకపోవడంతో కొంతమంది గ్రామస్తులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. గణేశ్ నిమజ్జనం కూడా రాజకీయకుట్రలో భాగంగానే జరిగిందని, సీఐ సురేంద్రనాథ్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని గొడవ సృష్టించి తమను కేసుల్లో ఇరికించాలని జేసీ బ్రదర్స్ కుట్రపన్నారని ప్రబోధానంద వెల్లడించారు. ఆశ్రమ భవనాన్ని కూల్చాలని కూడా ప్రయత్నించారన్నారు. ఆశ్రమంపై చేసిన ఆరోపణలు ఖండిస్తూ 64 సీసీ కెమెరాలు ఉన్నాయని, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందని.. విచారించుకోవచ్చన్నారు. ఈ క్రమంలో తాడిపత్రిలో ప్రబోధానందకు వ్యతిరేకంగా ముస్లింలు ర్యాలీ చేశారు. 2017మేలో ‘దేవుని ముద్ర’ పేరుతో ప్రబోధానంద ఓ పుస్తకం ప్రచురించారు. అందులో ముస్లింలను కించపరిచేలా రచనలు ఉన్నాయని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై కేసు నమోదైంది. తాజాగా కేసు నమోదైనా ఆశ్రమంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తాడిపత్రి ముస్లింలు శుక్రవారం తిరిగి ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసు సంఘం, జేసీ దివాకర్‌రెడ్డి వివాదంతో పాటు ఆశ్రమం, చిన్నపొలమడ గ్రామస్తులు, ఆశ్రమం, ముస్లింలు నమోదు చేసిన కేసు...ఇలా మూడు రకాలుగా వివాదం నడుస్తున్నట్లయింది. ముగింపు పలకకపోతే మరింత ప్రమాదం తాడిపత్రి స్టేషన్లో గతేడాది జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన అనుచరులు సీఐలపై పరుష పదజాలం వాడినప్పుడే స్పందించి ఉంటే, ఈ రోజు జేసీ దివాకర్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదని కొంతమంది పోలీసులు చెబుతున్నారు. పోలీసులను కొజ్జాలతో పోల్చినా పట్టనట్లు వ్యవహరించడంతో పోలీసుల్లో ఐక్యత లేదని, తనపై ఎలాంటి కేసు నమోదు చేయలేరనే ధీమాతో జేసీ ఉన్నారు. అందుకే పోలీసు సంఘం స్పందన తర్వాత కూడా అదేస్థాయిలో జేసీ స్పందించారు. బాధ్యత కలిగిన ఎంపీ వ్యవస్థపై పరుష వ్యాఖ్యలు చేసినా డీజీపీతో పాటు ముఖ్యమంత్రి కూడా స్పందించలేదు. దీంతో ఉన్నతాధికారుల మద్దతు లేకుండా ముందడుగు వేయాలా? వద్దా? అని కూడా పోలీసు సంఘం మరో కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జేసీపై కేసు నమోదు చేస్తే తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందేమోనని ఓ వైపు, పట్టనట్లు వ్యవహరిస్తే ఏం మాట్లాడినా పోలీసులు ఏం చేయలేకపోయారనే భావన ప్రజల్లో ఉంటుందని మరోవైపు పోలీసులు సంఘర్షణ పడుతున్నారు. ఏదేమైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ వ్యవహారానికి ముగింపు పలకకపోతే ఈ వ్యవహారం మరింత ముదిరే ప్రమాదం లేకపోలేదు. -
కలకలం రేపుతున్న జేసీ ఆడియో టేపులు
సాక్షి, అనంతపురం : తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన కమర్షియల్ కాంప్లెక్స్‌ను జేసీ కబ్జా చేశారని మల్లిఖార్జున చారి అనే బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. జేసీ ట్రావెల్స్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని బాధితుడు కోరాడు. బాధితుడు ఫిర్యాదులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైలెంట్‌గా ఉండకపోతే, ఆ భవనాన్ని కూల్చివేస్తానంటూ బాధితుడికి ఫోన్లో హెచ్చరించాడు. బాధితుడిని జేసీ బెదిరించిన ఫోన్ ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. జేసీ బెదిరింపులపై తాను కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మల్లిఖార్జున చారి ఆరోపించాడు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. జేసీ కబ్జాలో ఉన్న భవనాన్ని తనకు అప్పగించాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడి హెచ్చరిస్తున్నాడు. -
తాడిపత్రిలో రాక్షస పాలన
అనంతపురం: తాడిపత్రిలో రాక్షసపాలన సాగుతోందని, జేసీ బ్రదర్స్ రాజకీయ హింసను ప్రోత్సహిస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. జేసీ సోదరులకు పోలీసులు తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. జేసీ వర్గీయుల దౌర్జన్యంపై ప్రశ్నించిన తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. పోస్టింగుల కోసం పోలీసు అధికారుల అరాచకాలను ప్రోత్సహించటం తగదన్నారు. -
తాడిపత్రిలో టీడీపీకి షాక్
అనంతపురం ,తాడిపత్రి: తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేతలు బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, 23వ వార్డు కౌన్సిలర్ జయచంద్రారెడ్డిలు (జగ్గీ బ్రదర్స్) టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జగ్గీ బ్రదర్స్ జూన్ 20న వివరణ కూడా ఇచ్చారు. అయితే సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధ్యక్షుని పేరుతో ఉన్న ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన వారిద్దరూ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తాజా పరిణామాలతో తాడిపత్రి టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మరికొందరు సీనియర్ నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. విభేదాలు పొడసూపాయిలా.. ♦ 1993 నుంచి జగదీశ్వర్‌రెడ్డి– జయచంద్రారెడ్డి సోదరులు టీడీపీలో కొనసాగుతూ వస్తున్నారు. జేసీ సోదరుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న జగ్గీ సోదరులు కష్టకాలంలో పార్టీని వీడక అలాగే అంటిపెట్టుకుని సేవ చేశారు. 2014 ఎన్నికల్లో జేసీ సోదరులు టీడీపీలో చేరారు. అప్పటి నుంచి జేసీ బ్రదర్స్ – జగ్గీ బ్రదర్స్ విభేదాలు వీడి ఒక్కటయ్యారు. ఈ క్రమంలో 23వ వార్డు కౌన్సిలర్‌గా జగ్గీ సోదరుడు జయచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఇదిలా వుండగా జగదీశ్వర్‌రెడ్డి (జగ్గీ)కి మార్కెయార్డ్ పదవి విషయంలో జిల్లా నాయకుల అండదండలు సంపాదించడంతో ఆ విషయం ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డికి మింగుడుపడలేదు. దీంతో మార్కెట్‌యార్డు పదవి జగ్గీకి దక్కకుండా పావులు కదిపారని అప్పట్లో ప్రచారం జరిగింది. ♦ గతంలో జరిగిన ఓ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అతని అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, ప్రజా ధనాన్ని దోచుకుతింటున్నారని కౌన్సిలర్ జయచంద్రారెడ్డి ఆరోపించారు. దీంతో జయంద్రారెడ్డిని మూడు నెలల పాటు కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే జేసీ, జగ్గీ బ్రదర్స్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే జేసీ నిర్వాకం వల్లే తాడిపత్రిలో గ్రానైట్ పరిశ్రమ దెబ్బతిందని, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని జయచంద్రారెడ్డి పత్రికాముఖంగా దుమ్మెత్తిపోశారు. ♦ జగ్గీ బ్రదర్స్ తీరుపై ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశం అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని ఒత్తిడి పెంచడంతో జిల్లా అధ్యక్షుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. -
పరిటాల X జేసీ
వారిద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలే.. ఒకరు మంత్రి..మరొకరు గత ఎన్నికల్లో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. కానీ ఒకరంటే..మరొకరికి పడదు. దీంతో వారి అనుచరులూ రెండుగా చీలిపోయి ఆధిపత్యపోరు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసుల తీరును నిరసిస్తూ మంత్రి సునీత అనుచరులు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగగా..పోలీసులు లాఠీలతో చితక్కొట్టారు. తాడిపత్రి:టీడీపీకి చెందిన స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ తీరుపై ఇటీవల కొందరు కరపత్రాలు ముద్రించి పట్టణంలో పంచిపెట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఎస్ఐ రాఘవరెడ్డి టీడీపీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హీరాపురం ఫయాజ్‌బాషాకు చెందిన డ్రైవరు మౌసిన్‌ను గురువారం అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత వర్గీయులైన హీరాపురం ఫయాజ్‌బాషా, జగదీశ్వర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్‌లు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తమ అనుచరున్ని ఎందుకు అరెస్టు చేశారని పట్టణ సీఐ సురేందర్‌రెడ్డిని ప్రశ్నించారు. కరపత్రాలు పంపిణీ చేసి శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం వల్లే అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే గతంలో తమపై కరపత్రాలు వేసిన వారిపై కేసులు నమోదు చేయాలని మంత్రి పరిటాల సునీత వర్గీయులు పట్టుబట్టారు. దీంతో సీఐ సురేందర్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించడంతో ఫయాజ్‌బాషా, జగదీశ్వర్‌రెడ్డి, కాకర్ల రంగనాథ్ తదితరులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. సీఐ సురేందర్‌రెడ్డి వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, టీడీపీ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుతో మనస్తాపం చెందిన జగదీశ్వర్‌రెడ్డి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే లాఠీలకు పనిచెప్పిన పోలీసులు అక్కడున్న వారందరినీ తరిమికొట్టారు. అంతేకాకుండా స్టేషన్ సమీపంలో ఉన్న సామాన్యులపై కూడా లాఠీ ఝులిపించారు. స్టేషన్ ముందు బైఠాయించిన టీడీపీ నాయకులను ఈడ్చుకుని వెళ్లారు. ఎమ్మెల్యే జేసీ ప్రోద్బలంతోనే ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రోద్బలంతోనే తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని టీడీపీ సీనియర్ నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, ఫయాజ్‌బాషా, కాకర్ల రంగనాథ్‌లు ఆరోపించారు. తాడిపత్రిలో పోలీసుల వల్లే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. కేవలం ఒక వర్గానికే వత్తాసు పలుకుతూ ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నారని మండిపడ్డారు. -
144 సెక్షన్ బేఖాతర్
యల్లనూరు: అధికారంలో ఉన్నాం కదా అని.. తాము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నిబంధనలను బేఖాతరు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నా అవేమీ తనకు పట్టవన్నట్లు వ్యవహరించారు. పోలీసులు కూడా ఆయనకే వత్తాసు పలికారు. వివరాల్లోకెళితే.. యల్లనూరు మండలం కొడవండ్లపల్లి పెద్దమ్మతల్లి ఆలయం నిర్వహణ విషయం ఇటీవల వివాదాస్పదమైంది. ఇక్కడ అవాంఛనీయ ఘటనలలు చోటుచేసుకోకుండా ఉండేందుకు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఈ నెల ఆరో తేదీ నుంచి పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ సెక్షన్ అమలులో ఉన్నపుడు ఆలయానికి 400 మీటర్ల పరిధిలో ఎక్కడా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకూడదు. భారీగా వాహనాల్లో రావడం తదితర వాటిని చేయకూడదు. నిబంధనలు జాన్తా నై.. పామిడి సీఐ నరేంద్రరెడ్డి, తాడిపత్రి రూరల్ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, పుట్లూరు ఎస్ఐ సురేష్‌బాబు, పెద్దపప్పూరు ఎస్ఐ ఆంజనేయులు, యల్లనూరు ఎస్ఐ గంగాధర్, తాడిపత్రి తాలూకా పీఎస్ఐ, యల్లనూరు స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది సుమారు 60 మంది పోలీసుల బందోబస్తు నడుమ శనివారం తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో కొడవండ్లపల్లి పెద్దమ్మతల్లి ఆలయం చేరుకున్నారు. ఆయనతోపాటు మండల వ్యాప్తంగా ఉన్న వారి అనుచర వర్గం కూడా తరలివచ్చింది. ఆలయం వద్ద అనుచర వర్గానికి ఎమ్మెల్యే అల్పాహార విందు ఇచ్చారు. ఆలయ ఆవరణంలోనే చీరల పంపిణీ చేపట్టారు. 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించినా పోలీసులే దగ్గరుండీ పర్యవేక్షించడం విమర్శలకు దారితీసింది. తాడిపత్రి ఎమ్మెల్యే యల్లనూరు మండలానికి వచ్చి చీరలు పంపిణీ చేయడం రాజకీయలబ్ధి పొందడం కోసమేనన్న వాదనా లేకపోలేదు. కొడవండ్లపల్లిలో 144 సెక్షన్ అములులో ఉందా లేదా అనే విషయంపై తహసీల్దార్ నాగరాజును వివరణ కోరగా ఉందని సమాధానమిచ్చారు. -
జేసీ దిస్టిబొమ్మ దగ్ధం
పులివెందుల(వైఎస్సార్ జిల్లా): ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహరెడ్డి ఫై జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పులివెందులలో ఆదివారం సాయంత్రం స్థానిక పూల అంగళ్ల సర్కిల్లో వైఎస్సార్సీపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసారు. బొమ్మను చెప్పులతో కొడుతూ ఆగ్రహం చూపారు. ఇంకోసారి జగన్ కుటుంబంపై అవాకులు చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రభాకర్‌రెడ్డి ఒకప్రజాప్రతినిధిలా కాకుండా వీధిగూండాల ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు.జగన్ గురించి మాట్లాడే నైతిక విలువలు వారికి లేవన్నారు.