
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీ మంత్రులు చేపట్టనున్న బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశాలున్నాయని, అలా జరుగుతుందని తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. బస్సులకు సేఫ్ గార్డ్‌లు పెట్టుకుంటే మంచిదని తెలిపారు. పోలీసులు వాహనాలకు ఉపయోగించే విధంగా ఫెన్సింగ్ పెట్టుకుంటే బాగుంటుందన్నారు.
కాగా రాష్ట్రంలో మూడేళ్లుగా అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించడంతోపాటు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘సామాజిక న్యాయభేరి’ పేరుతో మంత్రులు బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈనెల 26న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమై 29వ తేదీన అనంతపురంలో ముగుస్తుంది. యాత్ర సందర్భంగా రోజూ ఒకచోట బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే జేసీ వ్యాఖ్యలతో మంత్రుల బస్సు యాత్రను టీడీపీ భగ్నం చేసేందుకు ఏదైనా కుట్ర పన్నుతోందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
చదవండి: ఎంగిలి పేట్లు కడిగాం.. ఆస్తులన్నీ రాసిచ్చాం.. బతకడానికి దారి చూపండయ్యా
Comments
Please login to add a commentAdd a comment