Bus Yaatra
-
జైత్రయాత్రను తలపించిన సీఎం జగన్ బస్సుయాత్ర
నేను కోరినట్లే నాకు అధికారం ఇచ్చారు. కానీ నేను దాన్ని అధికారం అనుకోలేదు. మిమ్మల్ని చూసుకునే బాధ్యత అనుకున్నాను. ప్రతి ఇంట్లో, ప్రతివ్యక్తికి మంచి చేసే అవకాశం మీరు ఇచ్చారు అనుకున్నాను. నేనూ అలాగే నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ప్రతి ఇంటికి మేలు చేశాను. ఇది మీ ప్రభుత్వం. మీ తమ్ముడి ప్రభుత్వం.. మీ సోదరుడి ప్రభుత్వం గత డెబ్బై ఏళ్లలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కానివి ఎన్నో చేసి చూపించాను.నేను చెప్పినవన్నీ నిజం అనిపిస్తే, నేను నిజంగా మీకు మేలు చేశాను అనిపిస్తే నాకు ఓటు వేయండి. లేదులేదు నేను మీకేమీ చేయలేదనిపిస్తే నాకు ఓటేయవద్దు అని చెబుతూ.. తన ఐదేళ్ల పాలన మీద మార్కులు వేయించుకునేందుకు ప్రజా స్పందన తెలుసుకునే నిమిత్తం సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజుతో ముగిసింది.మార్చి 27న ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సుయాత్ర నేడు టెక్కలిలో ముగిసింది. 22 రోజుల పాటు 2100 కిలోమీటర్ల మేర జరిగిన ఈ బస్సు యాత్ర ఒక జైత్రయాత్రను తలపించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15 బహిరంగ సభల్లో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు. ఆరు ప్రత్యేక సమావేశాల్లో జగన్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 86 నియోజకవర్గాలోని కోట్లమందికి స్పృశిస్తూ సాగిన ఈ యాత్ర ఒక ఆత్మీయ యాత్రగా మారింది.ఎక్కడికక్కడ మహిళలు, వృద్ధులు.. రైతులు..యువత తమ అభిమాన నాయకున్ని చూసేందుకు నిప్పులుగక్కే ఎండను సైతం లెక్క చేయకుండా వేచి ఉన్నారు. ఆయనవెంట ..ఆ బస్సు వెంట పరుగులు తీసిమరీ సెల్ఫీలు సంపాదించి దాన్ని అపురూపంగా దాచుకున్న యువతీయువకులు ఎంతోమంది. మా అన్నకు కష్టం చెప్పుకుని సాంత్వన పొందాలని భావించి ఆయన్ను కలిసి గోడువెళ్లబోసుకుని కన్నీళ్లు తుడుచుకుని భరోసాతో అన్నకు బైబై అంటూ సాగనంపిన ఆడబిడ్డలు ఎంతోమంది. మనవడా.. నువ్వు మళ్ళీ రావాలి మాకందరికీ మంచి చేయాలి అంటూ ఆశీర్వదించి పంపిన అవ్వాతాతల ఆశీర్వాదాలు ఆ బస్సులో మూటలు మూటలుగా పేరుకుపోయాయి.మామయ్యా మళ్ళీ నువ్వొస్తావుగా అంటూ వీడ్కోలు పలికిన పిల్లల చిరునవ్వులు జగన్ మోములో ప్రతిబింబించాయి. ఇలా ఒకటా రెండా.. ఎన్నో గుండెలను, ఎంతోమంది మనసులను తడుముతూ ఈ యాత్ర సాగింది. తాను గతంలో ప్రతిపక్ష నేతగా నడిచి వెళ్లిన మార్గంలో మళ్ళీ ఇప్పుడిలా, అప్పుడు ఎలా ఉండే స్కూళ్ళు ఇప్పుడెలా మారాయి అప్పుడు కష్టాలతో కన్నీళ్లు ఇంకిన కళ్ళు ఇప్పుడు తనను ఆనందం నింపిన ప్రేమతో దగ్గరకు పిలుస్తుంటే ఏ నాయకుడికి మాత్రం ఆనందం కాదు.ఈ యాత్ర మొత్తం రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని, ప్రజల మూడ్‌ను మార్చేసింది. ఎక్కడికక్కడ జగన్ మావాడే . నేను సైతం జగన్ వెంట అంటూ వేర్వేరు పార్టీల నుంచి వచ్చి చేరుతున్నవాళ్ళతో జిల్లాల్లో పార్టీ విభాగం కిక్కిరిసిపోతోంది. రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేదానికి ఈ బస్సు యాత్ర ఒక నిదర్శనం.. మళ్ళీ వస్తాను..మీకు మరింత మంచి చేస్తాను..అని చెబుతూ జగన్ వెళుతున్న దారిని చూస్తూ ప్రజలు అరచేతుల్లోనే హారతి కర్పూరాలు వెలిగించి విజయీ భావ అంటూ ఆశీర్వదించి పంపించారు.-సిమ్మాదిరప్పన్న -
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఉద్యమంలా కొసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగునా జనం ప్రభంజనం మాదిరి కదిలివస్తోంది. జై జగన్ అంటూ ఉవ్వెత్తున నినాదిస్తున్నారు. మేమంతా సిద్ధం 18వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 19) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు ఎస్టీ రాజపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజైన శుక్రవారం(ఏప్రిల్ 12) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ బుధవారం రాత్రి బస చేసిన ధూళిపాళ్ల ప్రాంతం దగ్గర నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుంటూరులోని ఏటుకూరు బైపాస్ సభ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెళ్లపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళ్రావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా ప్రయాణించి నంబూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. -
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం 12వ రోజు బుధవారం (ఏప్రిల్ 10) షెడ్యూల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రాత్రి బస చేసిన గంటావారిపాలెం వద్ద నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభిస్తారు. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా ధూళిపాళ్ల దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. 12న గుంటూరులో మేమంతా సిద్ధం సభ సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరంలో ఈనెల 12న ‘మేమంతా సిద్ధం’ సభ జరుగుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఆయన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 12వ తేదీ ఉదయం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర సత్తెనపల్లి, మేడికొండూరు, పేరేచర్ల, నల్లపాడు, చుట్టుగుంట సెంటర్, వీఐపీ రోడ్ మీదుగా ఏటుకూరు చేరుకుంటుందని చెప్పారు. అక్కడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతారని తెలిపారు. రాత్రికి గుంటూరు జిల్లాలోనే సీఎం జగన్ బస చేస్తారని వెల్లడించారు. 13వ తేదీ ఉదయం ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. -
'మేమంతా సిద్ధం' సభతో.. కపట కూటమిలో మొదలైన వణుకు!
సాక్షి, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర, సభలకు జనం పోటెత్తారు. అడుగడుగునా హారతులు పట్టి, దిష్టితీసి, దీవెనలందించారు. బస్సు యాత్రగా వస్తున్న సీఎం జగన్‌కు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ‘నువ్వే మళ్లీ సీఎం.. మేమంతా సిద్ధం’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ముసలి, ముతక, చిన్నాపెద్దా తేడాలేకుండా అభిమాన నేతను చూసి తరించారు. సెల్ఫీలు దిగి సంతోషంతో ఉప్పొంగి పోయారు. కరచాలనానికి పోటీపడ్డారు. దారిపొడవునా పూల వర్షం కురిపించారు. గుండెగుడిలో గూడుకట్టుకున్న అభిమానాన్ని రంగరించి ఆత్మీయతను పంచారు. ఈ బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నింపగా.. కపట కూటమి నేతల్లో వణుకుపుట్టిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక పలు సంక్షేమ పథకాలను అందుకుంటున్న అనేక మంది లబ్ధిదారులు బస్సు యాత్రలో దారి పొడవునా జననేతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అప్యాయంగా పలుకరిస్తూ ‘నువ్వు సల్లగా ఉండాలి నాయనా’ అంటూ దీవించి ముందుకు సాగనంపారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చిత్తూరు, తిరుపతి జిల్లాలోని పలు గ్రామాల మీదుగా సాగింది. ఈ బస్సు యాత్రలో మరోసారి పల్లెలను పలుకరిస్తూ.. స్థానికుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగారు. ఈనెల 2న ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చౌడేపల్లి, పుంగనూరు, సదుం, కల్లూరు, పాకాల, ఐరాల, పూతలపట్టు, చంద్రగిరి, తిరుపతి రూరల్, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, పెళ్లకూరు, నాయుడుపేట, ఓజిలి, గూడూరు మండలాల మీదుగా సాగింది. బస్సు యాత్ర సాగినంత దూరం సీఎం వైఎస్ జగన్‌ని చూసేందుకు జనం బారులు తీరారు. సీఎం బస్సు దిగి వారందరినీ ఆప్యాయంగా పలకరించి ముందుకు సాగారు. చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువులో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్వాగతం లభించింది. దామలచెరువుకు ముందే ఉగాది పండుగ వచ్చిందా? అనిపించేలా పండుగ వాతావరణం కనిపించింది. ఆత్మీయ సమావేశం కల్లూరు శివారు ప్రాంతంలో కురుబ సామాజికవర్గం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తొట్టంబేడు మండలం, చిన్నసింగమాల వద్ద ఏర్పాటు చేసిన ఆటో యూనియన్ వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొని భరోసా కల్పించారు. వారి ఆత్మీయతతో సీఎం వైఎస్ జగన్ పులకరించిపోయారు. ఇదిలా ఉంటే.. కల్లూరులో నిర్వహించిన బస్సు యాత్రకు ముస్లింమైనారిటీ మహిళలు పోటెత్తారు. దారిపొడవునా సీఎం వైఎస్ జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి, నాయుడుపేటలో ట్రాంజెండర్స్ సీఎం వైఎస్ జగన్‌కి గుమ్మడి కాయలతో దిష్టి తీసి ఆశీర్వదించి ముందుకు సాగనంపారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పూతలపట్టు, నాయుడుపేటలో మేమంతా సిద్ధం సభలు నిర్వహించారు. జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలోని జనం, వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మండుటెండను సైతం లెక్క చెయ్యకుండా.. పనులన్నింటినీ పక్కనబెట్టి జననేతను ఒక్కసారి చూసేందుకు పరితపించిపోయారు. ఆయా పార్లమెంట్ పరిధి నుంచి వచ్చిన వారితో సభా ప్రాంగణం నిండిపోయి జాతీయ రహదారి కూడా కిక్కిరిసిపోయింది. కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. పచ్చ కూటమిలో కుదేలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభించడంతో పచ్చ కూటమి నేతల్లో వణుకు పుట్టింది. చంద్రబాబు వెంకటగిరి, గంగాధరనెల్లూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి, కుప్పంలో నిర్వహించిన అన్ని బహిరంగ సభలకు హాజరైన జనం ఒక ఎత్తైతే.. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం సభ ఒక్కటే ఒక ఎత్తుగా నిలిచిందని జనం చర్చించుకోవడం కనిపించింది. అదేవిధంగా మేమంతా సిద్ధం సభలు, బస్సు యాత్రకు వెళ్లలేని అనేక మంది టీవీలకు అతుక్కుపోయి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన, ప్రసంగాన్ని వినడం విశేషం. మారుమూల గ్రామాల నుంచి మేమంతా సిద్ధం సభలకు తరలిచ్చే జనాన్ని చూసిని జనం, మరో వైపు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ‘కూటమి కుదేలవ్వడం ఖాయం’ అని చర్చించుకోవడం గమనార్హం. ఇవి చదవండి: ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర తొమ్మిదో రోజు షెడ్యూల్ ఇలా.. -
మేమంతా సిద్ధం @ఏడో రోజు: ప్రజలతో సీఎం జగన్ మమేకం
Memantha Sidham Day 7 Highlights CM Jagan Bus Yatra Details పూతలపట్టు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మన రక్తం తాగకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఒకటే తేదీన సూర్యుడు ఉదయించే ముందు వాలంటీర్లువ చ్చి పెన్షన్లు ఇచ్చేవారు. పథకం ప్రకారం ఈసీకి తన మనిషి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారు అవ్వాతాతలు పడుతున్న అగచాట్లు చూస్తుంటే చంద్రబాబు మనిషా, శాడిస్టా అనిపిస్తుంది జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు.. ప్రతి పథకం మీ ఇంటికే వస్తుంది. 3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు ప్రభుత్వంపై చంద్రబాబు, కూటమి ఎంత విషయం కక్కుతున్నారో ప్రజలు చూస్తున్నారు 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. రైతు భరోసా పేరుతో రైతులకు నేరు 34,370 కోట్లు ఇచ్చాం . ఉచిత పంటల భీమా కోసం రూ. 7,800 కోట్లు చెల్లించాం. ఇన్పుట్ సబ్సిడీ పేరుతో రైతుకు రూ. 3,262 కోట్లు అందించాం. 53 లక్షల మంది తల్లుల అకంట్లలో అమ్మఒడిడి ద్వారా 26,067 కోట్లు ఇచ్చాం. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద 18 వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయుత కింద 39 ళక్షల మంది అక్క చెల్లెళ్లకు రూ. 19,182 కోట్లు అందించాం. ఈబీసీ నేస్తం కింద 1,876 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం కింద రూ. 2,029 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసారా కింద 25, 571 కోట్లు. ఆరోగ్య శ్రీ కింద 33 12463 కోట్లు ఖర్చు చేశాం. సున్నా వడ్డీ కింద అక్క చెల్లెళ్లకు రూ. 4,969 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ. 1,390 కోట్లు ఇచ్చాం. 10 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితులకు రూ. 906 కోట్లు చెల్లించాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చాం ఆరోగశ్రీని 25 లక్షలకు పెంచింది మీ జగన్ ప్రభుత్వం ఏకంగా 2 లక్షల 70 వేల కోట్లను నేరుగా అకౌంట్లో వేసింది మధ్యలో ఎక్కడా జన్మభూమి లాంటి దళారులు లేరు. మీరు వేసే ఓటు ఐదేళ్లు అంటే 1825 రోజులు మీ భవిష్యత్ వారి చేతుల్లో పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి ఎవరి హయాంలో మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయని ఆలోచించుకోండి చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తు వస్తుందా 14 ఏళ్ల కాలంలో చంద్రబాబు మీ ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా? రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఎవరు? ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియాం తెచ్చిందెవరు? విలేజ్ క్లీనిక్, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ను ఏర్పాటు చేసింది ఎవరు? ఇంటింటికీ పౌరసేవల్నీ డోర్‌డెలివరీ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది మీ జగన్ ఒకటో తేదీ ఆదివారమైనా సరే అవ్వాతాతలకు పెన్షన్లు అందించిన వాలంటీర్ల వ్యవస్థను తెచ్చింది మీ జగన్. పూతలపట్టులో జన మహాసముద్రం కనిపిస్తోంది: సీఎం జగన్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం ప్రభుత్వం మంచి చేయడానికి ఉపయోగించుకుంది ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు జగన్‌కు, చంద్రబాబుకు యుద్ధం కాదు ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు, ప్రజలకు జరుగుతున్న ఎన్నికలు ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షంలో ఉన్నాం ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. ఒక్కడిపై పోరాటానికి ఇంతమంది వస్తున్నారు మంచివైపు నిలబడి యుద్ధం చేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా..? ధర్మాన్ని గెలిపించడానికి మీరంతాసిద్ధమా? ఈ ఎన్నికల్లో మన ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మంచి ఓ వైపు, చెడు మరోవైపు.. ధర్మం ఓవైపు అధర్మం మరోవైపున్నాయి. ఓవైపు విశ్వసనీయత, మరోవైపు మోసం.. ఓవైపు నిజం, మరోవైపు అబద్దం అబద్దం, మోసం, అన్యాయం, తిరోగమనం, చీకటిని రిటర్స్‌గిఫ్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పూతలపట్టు బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ కాసేపట్లో పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు కాసేపట్లో పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభ బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం జగన్ దామలచెరువులో సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం వేలాదిగా తరలి వచ్చిన జన ప్రభంజనం సుమారు 20 క్రేన్లతో భారీ గజమాలలు ఏర్పాటు చేసి సీఎంకు స్వాగతం దామలచెరువు చేరుకున్న సీఎం జగన్ చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర దామలచెరువు వద్ద పదుల సంఖ్యలో గుమ్మడికాయలతో దిష్టి తీసి సీఎంకు స్వాగతం పలికిన అక్కచెల్లెమ్మలు ఎర్రటి ఎండల్లోనూ మేమంతా సిద్ధమంటూ సీఎం బస్సు యాత్రలో జన జాతర షెడ్యూల్లో లేకున్నా.. ప్రజల కోసం.. కల్లూరులో స్థానిక ప్రజల కోరిక మేరకు షెడ్యూల్లో లేకున్నా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్లిన సీఎం జగన్ కల్లూరులో సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన జనం మండుటెండలోను కదం తొక్కిన మహిళా లోకం కల్లూరు ప్రధాన రహదారి పొడవునా సీఎం జగన్‌ను చూసేందుకు వెల్లువలా తరలివచ్చిన ప్రజలు కల్లూరు చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సీఎం జగన్‌కు భారీ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు జగనన్నకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు సీఎం జగన్‌కు హారతులు ఇచ్చిన అక్కా చెళ్లెమ్మలు బస్సు మీది నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్ నేను విన్నాను... నేను ఉన్నాను పెరాలసిస్ బాధితుడికి సీఎం వైఎస్ జగన్ భరోసా చిత్తూరు జిల్లా సదుం మండలం సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల క్రితం పెరాలసిస్‌కు గురయ్యాడు ఇప్పటికే స్తోమతకు మించి, అప్పుల చేసి మరీ వైద్యం చేయించింది ముఖేష్ కుటుంబం అంతంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారికి ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి అతని వైద్యానికి మరో 15 లక్షలు అవసరం అవుతాయని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు సీఎం వైఎస్ జగన్‌ను కలిస్తే తప్పక తమకు సహాయం దొరుకుతుందని నమ్ముతున్నామని ముఖేష్ తల్లి ఆశాభావం వ్యక్తం చేసారు. మేమంతా సిద్ధం యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిసారు సీఎం వైఎస్ జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకుని అతడి ఆరోగ్య పరిస్థితిని గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు ముఖేష్ వివరాలను తీసుకోవాలని ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం జరిగి మామూలు మనిషి అవుతాడనే నమ్మకం కలిగిందని ఆ కుటుంబం నమ్మకంగా ఉంది మతుకువారిపల్లె చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర దారిపొడవునా సీఎం జగన్‌కు స్వాగతం పలికిన ప్రజానికం చిత్తూరు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది దారిపొడవునా సీఎం జగన్‌కు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతున్నారు సీఎం సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ నేత మేమంతా సిద్ధం బస్సుయాత్రలో గంగాధరనెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన ముఖ్యనేత అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, 2019లో టీడీపీ తరపున గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎ. హరికృష్ణ. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు ఎ. హరికృష్ణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి సీఎం జగన్ సమక్షంలో పార్టీలో కీలక నేతల చేరికలు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరిన కీలక నేతలు. అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎం సుబ్రమణ్యంనాయుడు, కృష్ణమూర్తి, బేతప్పలు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ పార్టీ నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం అమ్మగారిపల్లె నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన అన్నమయ్య, చిత్తూరు జిల్లా చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ... యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్ సదుం సర్కిల్లో స్వాగత ఏర్పాట్లు... సదుం సర్కిల్ స్వాగత ఏర్పాట్లు చేసిన వైఎస్సార్సీపీ నేతలు భారీగా చేరుకున్న ప్రజలు, కార్యకర్తలు తీన్మార్ డాన్స్‌లతో సందడిగా సదుం సర్కిల్ సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం చిత్తూరులో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అమ్మగారిపల్లె నుంచి బయల్దేరిన సీఎం జగన్ సీఎం జగన్‌కు అమ్మగారిపల్లిలో భారీగా స్వాగతం పలికిన ప్రజానికం సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకోనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అనంతరం రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు బైపాస్కు చేరుకోనున్న బస్సు యాత్ర సాయంత్రం పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ అనంతరం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లిక్రాస్, చంద్రగిరి క్రాస్ రేణిగుంట మీదుగ గువరరాజుపల్లెకు చేరుకోనున్న బస్సు యాత్ర రాత్రికి గురవరాజుపల్లెలో సీఎం జగన్ బస చిత్తూరు జిల్లాలో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అమ్మగారిపల్లె నుంచి మరికొద్ది సేపట్లో బయల్దేరానున్న సీఎం జగన్ సదుం సర్కిల్ స్వాగత ఏర్పాట్లు చేసిన వైఎస్సార్సీపీ నేతలు భారీగా చేరుకున్న ప్రజలు, కార్యకర్తలు తీన్మార్ డాన్స్‌లతో సందడిగా సదుం సర్కిల్ చిత్తూరు జిల్లా సిద్ధమా..? ఏడో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చిత్తురులో కొనసాగనుంది ‘చిత్తూరు జిల్లా సిద్ధమా...?’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు Day-7 చిత్తూరు జిల్లా సిద్ధమా..?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2024 ఏడో రోజు ‘మేమంతా బస్సు’ యాత్ర షెడ్యూల్: నేడు చిత్తూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం అమ్మగారిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు సదుం, కల్లూరు మీదుగా, చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో దామలచెరువు వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది అనంతరం పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని తలుపులపల్లి మీదగా తేనెపల్లి చేరుకొని లంచ్ బ్రేక్ తీసుకుంటారు అనంతరం తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం 3 గంటలకి పూతలపట్టు బైపాస్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు సభ అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజవర్గం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గాధంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి, చంద్రగిరి క్రాస్ వరకు కొనసాగుతుంది అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంట, గురవరాజుపల్లెకు చేరుకుని సీఎం జగన్ రాత్రి బస చేస్తారు Memantha Siddham Yatra, Day -7. ఉదయం 9 గంటలకు అమ్మగారిపల్లె దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డులో బహిరంగ సభ సభ అనంతరం రేణిగుంట మీదుగా గురవరాజుపల్లె వరకు కొనసాగుతుంది. గురువరాజుపల్లె వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/qw7x7QFOCM — YSR Congress Party (@YSRCParty) April 3, 2024 ఆరో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. సూపర్ సక్సెస్ అన్నమయ్య జిల్లాల్లో సీఎం జగన్‌కు భారీగా స్వాగతం పలికిన ప్రజానికం దారి పొడవునా ప్రజలతో మమేకమైన సీఎం జగన్ పలువురి సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం పార్టీలో చేరిన పలువురు నేతలు మదనపల్లిలో మేమంతా సిద్ధం బహిరంగ సభకు పోటెత్తిన జనం ఎన్నికలకు మేమంతా సిద్ధం అంటూ నినాదించిన శ్రేణులు సీఎం ప్రసంగిస్తూ బాబు పేరెత్తగానే శ్రేణుల్లో ఉత్సాహం ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసిన సీఎం జగన్ మధ్యాహ్నం నుంచి సభ ముగిసే వరకు కార్యకర్తల్లో తగ్గని జోష్ -
ఆరో రోజు మేమంతా సిద్ధం: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
Memantha Sidham Day 6 Highlights CM Jagan Bus Yatra Details మదనపల్లె సభ సక్సెస్ పై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ మనందరి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇంటింటికీ చేసిన మంచికి మద్దతు తెలుపుతూ తరలివచ్చిన సమరయోధుల సముద్రం మదనపల్లెలో నాకు కనిపించింది మరో 6 వారాల్లో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కొరకు జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం నేను సిద్ధం.. మరి మీరంతా సిద్ధమేనా? మనందరి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇంటింటికీ చేసిన మంచికి మద్దతు తెలుపుతూ తరలివచ్చిన సమరయోధుల సముద్రం మదనపల్లెలో నాకు కనిపించింది. మరో 6 వారాల్లో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కొరకు జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం నేను సిద్ధం.. మరి మీరంతా సిద్ధమేనా?#MemanthaSiddham pic.twitter.com/Z0Nbf7kyOc — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నారు.. 2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోడీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు!#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/DJqhuefo9V — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 మదనపల్లెలోని మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మదనపల్లెలో అన్నమయ్య జిల్లాలో ఇక్కడ కనిపిస్తున్న అభిమానం.. ఒక జనసముద్రాన్ని తలపిస్తోంది మన అందరి ప్రభుత్వం ఇంటింటికి చేసిన మంచికి మద్దతు పలుకుతూ మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందారులను, ప్రతిపక్ష కూటమిని ఓడించాలనే సంకల్పంతో వచ్చిన సమరయోధుల సముద్రం ఇక్కడ కనిపిస్తోంది ఇంటింటి నుంచి తరలి మదనపల్లె వచ్చిన నా ఆత్మ బంధుల జన సముద్రమిది నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా అవ్వా తాతలకు మీ అందరికీ కూడా పేరు పేరునా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పేదల పక్షాన ఉన్న మనకు గొప్ప గెలుపు రాబోతోంది ఇంటింటి అభివృద్ధిని, ప్రతీ ఊరు అభివృద్ధిని, సామాజిక వర్గాల అభ్యున్నతిని, అక్క చెల్లెమ్మల సాధికారితను, అవ్వా తాతల సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు, కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. ప్రతీ గ్రామానికి మంచి చేశాం చేసిన మంచిని ప్రతీ గడపకు వివరించి 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు గెలించేందుకు, డబుల్ సెంచరీ కొట్టేందుకు, రెండు వందలకు రెండొందల కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా 2019లో దేవుడు, మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చి న ప్రతీ హామీని నెరవేర్చాం మ్యానిఫెస్టోను ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం.. నెరవేర్చిన తర్వాత ఓటు అడగటానికి అడుగులు వేస్తా ఉన్నా ప్రభుత్వం. విశ్వసనీయతకు ఇది అర్థం అని చెబుతూ అడుగులు వేశాం ఈ 58 నెలల పాలనలో.. ఐదేళ్లు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత మీ ముందు నిలబడి ఇది మంచి చేశామని సగర్వంగా, సవినయంగా చెప్పగలగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ, మన అభిమానులు కానీ, మన వాలంటీర్లు కానీ ప్రతీ ఇంటికి వెళ్లి గడిచిన ఈ 58 నెలల్లో ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్‌కు మీ బిడ్డకు, మన ప్రభుత్వానికి, మన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఓటు వేయమని అడుగుతున్నారంటే దానికి కారణం మంచి చేశాం కాబట్టేనని సగర్వంగా చెప్పగలుగుతున్నాను ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్నవారంతా విడివిడిగా రాలేకపోతున్నారు.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు. జెండాలు జత కట్టడమే వారి పని.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ పని అని సగర్వంగా చెప్పగలుగుతున్నాను ఇవాళ ఒక్కడి మీద ఎంత మంది దాడి చేస్తున్నారో చూడండి ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ-5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రులు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీళ్లందరికీ తోడు కుట్రలు-కుతంత్రాలు ఒక్కడి మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారంటే మిమ్మల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా వారందరికీ తెలియని విషయం ఒక్కటి ఉంది.. 99 శాతం మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతున్నాను. మరి కనీసం 10 శాతం మార్కులు తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతున్నాను ఏకంగా 99 శాతం వాగ్దానాలను నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు.. తన హయాంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చని బాబు నిలబడగలుగుతాడా? అని అడుగుతున్నా విలువులు, విశ్వసనీయతలు లేని ఇలాంటి వారితో ముఫ్పై పార్టీలు కలిసి వచ్చినా, ఇలాంటి పొత్తులను చూసి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన పార్టీ నాయకులు కానీ, మన అభిమానులు కానీ మన వాలంటీర్లు కానీ, ఇంటింటి అభివృద్ధి అందుకున్న పేద వర్గాలు కానీ భయపడతారా? అని అడుగుతున్నాను. జగన్ సీఎంగా ఉంటేనే పథకాలన్నీ కొనసాగుతాయి రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 3 లక్షల 75 వేల కోట్లు ఇచ్చాం చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తుకు రాదు జగన్ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకువస్తాయి లంచాలు, వివక్ష లేని పాలన అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ పాలన రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ పాలన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ 2 లక్షల 31 వేల ఉద్యోగాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్ 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్ అమ్మ ఒడి, విద్యా దీవెన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ దిశ యాప్ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి చంద్రబాబు జిత్తులమారి, పొత్తుల మారి అధికారం కోసం చంద్రబాబు పసుపుపతిగా మారాడు మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వ్యక్తి బాబు 2014లో పసుపుపతిగా మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నాడు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25వేల డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తాడంట ఇది 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటి ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు మరి మదనపల్లెలో ఏమైనా హైటెక్ సిటీ కనబడుతుందా? ఆయన మ్యానిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటివి 650కి పైగా హామీలు కనిపిస్తాయి ముఖ్యమైన హామీల పరిస్థితి ఇది అయితే, మరి మ్యానిఫెస్టో సంగతి దేవుడెరుగు ఎన్నికలు అయిపోగానే మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు ఈ ముఖ్యమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోదీ గారితో ఉన్న ముగ్గురు ఫోటోలు పెట్టి ఇంటింటికి పాంఫ్లెట్ పంపించారు చంద్రబాబు. ఇందులో ఒక్కటైన నెరవేర్చారా అని గట్టిగా అడుగుతున్నాను పోనీ ప్రత్యేకహోదా ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నాను ఇప్పుడు మళ్లీ ఇదే పొత్తు.. ఇదే పార్టీలు.. ఇదే కూటమి.. మరోసారి ఇదే మాదిరిగా మీటింగ్‌లు పెట్టి, మరోసారి రంగు రంగుల మ్యానిఫెస్టోలు తయారు చేసి డ్రామకు తెరతీశారు. మళ్లీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు.. ఇంటింటికి కేజీ బంగారం అంటున్నారు.. మళ్లీ ఇదే ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ అంటూ ఉన్నారు.. సూపర్ సెవన్ అంటున్నారు మరి వదలబొమ్మాలి అంటూ మళ్లీ పేదల రక్తం పీల్చేందుకు పసుపుపతి తయారవుతున్నాడు చంద్రబాబు మరి వీరిని నమ్మవచ్చా అని మీ అందరిని కూడా అడుగుతున్నా నమ్మినవారిని నట్టేట ముంచి, మరోసారి మన రాష్ట్రాని దోచుకోవాలని బాబు ప్లాన్ బాబుకు అధికారం కావాల్సింది మంచి చేయడం కోసం కాదు.. దోచుకోవడం కోసం, దాన్ని దాచుకోవడం కోసం అధికారం కావాలి ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా.. వద్దా అని అడుగుతున్నాను గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ చదువు చెబుతా వద్దన్న ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలా.. వద్దా అని అడుగుతున్నాను పేదలంటే చంద్రబాబుకు కక్ష నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నాడు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. గతంలో కోర్టులకెళ్లి అడ్డుకున్నాడు బాబుకు ఓటు వేశామంటే వాలంటీర్ వ్యవస్థను సైతం, స్కీములను సైతం, పెన్షన్లను సైతం అన్నింటికీ రద్దు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని ప్రతీ ఒక్కరూ ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి పేదలకు అందాల్సిన ప్రతీ ఒక్క రూపాయి.. ఏ సంక్షేమ పథకం ఆగకుండా గత ఐదేళ్లు మాదిరిగా పొందాలంటే.. బాబులాంటి సైంధవుడికి అవకాశం ఇవ్వకూడదు అది జరగాలి అంటే రెండు బటన్లు ప్రతీ పేదవాడు నొక్కాలి పేదవాళ్ల కోసం, నా అక్క చెల్లెమ్మల భవిష్యత్ కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు.. వారంతా ఏకమై రెండే రెండు బటన్లు నొక్కాలి.. ఫ్యాన్ గుర్తు మీద నొక్కాలి మన వేసే ఈ ఓటు ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడమే కాదు.. మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్, మీ ఇంట్లో ఆడపడుచుల భవిష్యత్, మీ ఇంట్లో అవ్వా తాతల భవిష్యత్ అంతా కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది అనే విషయం గ్రహించమని అడుగుతున్నాను జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం.. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే ఈ మంచి అంతా కొనసాగుతుందని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి అన్నమయ్య జిల్లాపై సీఎం జగన్ ప్రేమ చేతల్లో చూపించారు: మిథున్‌రెడ్డి సాగు, తాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేశారు ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చేలా కొత్త ప్రాజెక్టులు చేపట్టారు సీఎం జగన్ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది: నిస్సార్ అహ్మద్ ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్ నెరవేర్చారు జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు మేమంతా సిద్ధం మదనపల్లె మేమంతా సిద్ధం సభకు హాజరైన సీఎం జగన్ పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంత జనం పెత్తందారులపై పోరుకు ‘మేమంతా సిద్ధం’ అంటూ నినాదాలు మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగసభ సీఎం జగన్ ట్వీట్.. ఆరవ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో నా స్టార్ క్యాంపెయినర్లతో.. With my star campaigners from Day-6 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham #VoteForFan pic.twitter.com/KxnAfbVe9O — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 మదనపల్లి సభకు బయలుదేరిన సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర కాసేపట్లో మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ మదనపల్లె బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ అంగళ్లు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర యాత్ర బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ రోడ్డుకు ఇరువైపుల భారీ సంఖ్యలో ప్రజలు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంత జనం పెత్తందారులపై పోరుకు ‘మేమంతా సిద్ధం’ అని నినాదాలు దారిపొడవునా సీఎం వైఎస్ జగన్‌కు జననీరాజనాలు ప్రజలతో మమేకమవుత్ను సీఎం జగన్.. నేనున్నానంటూ సీఎం భరోసా కురభలకోట మండలం కంటేవారిపల్లి చేరుకున్న జగన్ బస్సు యాత్ర పెద్దపల్లి క్రాస్ వద్ద సీఎం రాక కోసం ఎదురుచూస్తున్న ప్రజలు కనికలతోపుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర బి.కొత్తకోట మండలం తుమ్మనంగుట్టలో సీఎం జగన్ తుమ్మనంగుట్టలో యాత్ర బస్సు దిగిన సీఎం జగన్ సీఎం జగన్ బస్సు యాత్ర బుర్రకాయలకోట క్రాస్ దాటింది సీఎం జగన్‌కు ప్రజలు, అభిమానులు స్వాగతం పలికారు అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర సీఎం జగన్‌కు ప్రజలు భారీగా స్వాగతం పలుకుతున్నారు కొంతమంది తమ సమస్యలు సీఎం జగన్‌కు చెప్పుకున్నారు వేపూరి కోట క్రాస్‌లో సీఎం జగన్‌కు భారీ స్వాగతం ఉమా శంకర్ కాలనీ వద్ద సీఎం జగన్ బస్సు యాత్రకు ఘన స్వాగతం పూల వర్షం కురిపించిన చిన్నారులు సీఎం జగన్‌పై అభిమానంతో... కడపజిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అమరనాథ్ సీఎం జగన్‌పై అభిమానంతో ఉద్యోగం వదిలి బైక్‌తో బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. ఈరోజు ములకలచెరువు నుంచి యాత్ర వెంట ఉన్నారు ములకలచెరువు దాటి.. పెద్దపాళ్యం చేరుకున్న సీఎం జగన్ సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజానికం వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత ఎం. గంగాధర్ చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం. గంగాధర్ వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత మొబసిర్ అహ్మద్ చీకటిమునిపల్లి స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్ అహ్మద్ వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ నేత ఏవీ సుబ్బారెడ్డి చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో బీజేపీ సీనియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ వీ సుబ్బారెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర మొలకల చెరువు వద్దకు చేరుకున్న సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు వద్ద గజమాలతో సీఎంకు ఘనస్వాగతం పలికిన ప్రజలు. ఆరో రోజు మేమంతా సిద్దం.. ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర చీకటిమనిపల్లెలో ప్రారంభమైన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ములకలచెరువు,పెదపాలెం, వేపురికోట మీదుగా.. బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్లు వరకు కొనసాగనున్న యాత్ర సాయంత్రం మదనపల్లెలో వైఎస్సార్సీపీ ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ సభ అనంతరం.. నిమ్మనల్లి క్రాస్, బోయకొండ క్రాస్చ చౌడేనపల్లి సోమల మీదుగా అమ్మగారిపల్లె దాకా యాత్ర రాత్రికి అమ్మగారిపల్లెలోనే సీఎం జగన్ బస దారిపొడవునా ఆత్మీయ స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న ప్రజానీకం ఆరో రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్ యాత్రకు అన్నమయ్య జిల్లా సిద్ధమా...? అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. Day-6 అన్నమయ్య జిల్లా సిద్ధమా…?#MemantaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 మేమంతా సిద్ధం.. సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన అడుగడుగునా నీరాజనం పడుతున్న ఏపీ ప్రజలు నేడు అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించనున్న యాత్ర మదనపల్లెలో వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభ ఇదీ చదవండి: మేమంతా మీ వెంటే.. జననేత యాత్రలో జనగర్జన అన్నమయ్య జిల్లా మేమంతా సిద్ధం - 6వ రోజు ఆరవ రోజుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర నేడు 40 కిలోమీటర్లు మేర కొనసాగానున్న మేమంతా సిద్దం బస్సు యాత్ర నేడు మదనపల్లి టిప్పుసుల్తాన్ మైదానంలో మేమంతా సిద్దం బస్సు యాత్ర బహిరంగ సభ సీఎం జగన్ పాలనలో.. జిల్లా పునర్విభజనతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో డిబిటి, నాన్ డిబిటి ద్వారా రూ. 9,450 కోట్ల నగదు బదిలీ మదనపల్లెలో రూ. 500 కోట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు బీటీ కాలేజీ యూనివర్శిటిగా అభివృద్ధి రూ. 24 కోట్లతో 100 పడకలతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి తిరుపతి - పీలేరు -మదనపల్లి జాతీయ రహదారి రాయచోటి దాహార్తి తీరుస్తూ 100 కోట్లు కేటాయింపు జిల్లా కేంద్రంగా రాయచోటి అభివృద్ధి రూ. 25 కోట్లతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి రూ. 100 కోట్లతో రాయచోటి లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం అన్నమయ్య జిల్లా మేమంతా సిద్ధం - 6వ రోజు షెడ్యూల్ ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు చీకటిమనిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. ములకలచెరువు,పెదపాలెం మీదగా వేపురికోట, బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్ళు చేరుకుంటారు. అంగళ్ళు దాటినతరువాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 3.30 గంటలకి మదనపల్లె చేరుకుని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లె శివారులో రాత్రి బసకు చేరుకుంటారు Memantha Siddham Yatra, Day -6. ఉదయం 9 గంటలకు చీకటిమనిపల్లె దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు మదనపల్లె బైపాస్ రోడ్డులో బహిరంగ సభ సభ అనంతరం సోమల మీదుగా అమ్మగారిపల్లె వరకు కొనసాగుతుంది అమ్మగారిపల్లె వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/zohYZ3HsEw — YSR Congress Party (@YSRCParty) April 2, 2024 సీఎం జగన్ రోడ్ షోకు ఊరూరా ఘన స్వాగతం 58 నెలలుగా తమకు కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం కళ్లారా చూసేందుకు పరితపిస్తున్న ప్రజానీకం.. రోడ్ షోలో ఊరూరా ఘన స్వాగతం మండుటెండైనా.. అర్ధరాత్రయినా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం.. మూడు జిల్లాల్లో అతి పెద్ద ప్రజా సభలుగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం అసమాన్యుడు చేస్తున్న యుద్ధ కవాతు.. మాటకు కట్టుబడి.. నిబద్ధతతో నిలబడే నేతను గుండెల్లో దాచుకుంటున్న జనం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దేశ చరిత్రలో మహోజ్వలఘట్టంగా నిలుస్తుందంటున్న పరిశీలకులు చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతున్న బస్సు యాత్ర మాటపై ఎన్నడూ నిలబడని బాబును ఛీకొడుతున్న జనం.. టీడీపీ సూపర్ సిక్స్ హామీలను ఏమాత్రం పట్టించుకోని వైనం చంద్రబాబు కుట్రలను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమంటూ లక్షల మంది సెల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించి సభలలో సీఎం జగన్‌కు సంఘీభావం అనంతలో మేమంతా సిద్ధం.. సూపర్ సక్సెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం యాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో కొనసాగిన సీఎం జగన్ బస్సు యాత్ర ఐదో రోజు అనంతలో యాత్రకు ప్రజల బ్రహ్మరథం అనంతలోనూ సూపర్ సక్సెస్ అయ్యిందంటూ వైఎస్సార్సీపీ Day 5 - శ్రీ సత్యసాయి జిల్లా సిద్ధం! #MemanthaSiddham pic.twitter.com/PZNYJryRQI — YS Jagan Mohan Reddy (@ysjagan) April 1, 2024 -
బాధపడకమ్మా.. నేనున్నా: సీఎం జగన్
బత్తలపల్లి: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి, ఆమె కుమారుడు అనుదీప్‌కుమార్‌రెడ్డి కలిశారు. చదువులో రాణిస్తున్న తన కుమారుడు అనుదీప్‌కు ఉన్నట్టుండి కంటిచూపు పోయిందని ముఖ్యమంత్రికి నాగలక్ష్మి తెలియజేసింది. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతున్న అనుదీప్ యూట్యూబ్‌లో పాఠాలు వింటూ.. తోటి విద్యార్థి సహకారంతో పరీక్షలు రాస్తున్నాడని తెలిపింది. తన కుమారుడికి కంటి చూపు వచ్చేందుకు తగిన సాయం చేసి ఆదుకోవాలని వేడుకుంది. అర్జీ స్వీకరించిన సీఎం జగన్ స్పందిస్తూ.. బాధపడకమ్మా.. ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. కాగా, అర్జీ ఇచ్చిన అరగంటలోనే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల నుంచి నాగలక్ష్మికి ఫోన్ వచ్చింది. అనుదీప్ ఆరోగ్య పరిస్థితి, కంటి ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు, ఆస్పత్రి తదితర వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. -
ఈ టీచర్ మాటలకు సీఎం జగన్ ఫిదా
-
సీఎం వైఎస్ జగన్ గ్రాండ్ ఎంట్రీ
-
జనసంద్రంతో నిండిపోయిన యర్రగుంట్ల సభ
-
CM Jagan: ఆరంభం అదరహో! విపక్షాలు బెదరహో!!
బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరంభించిన మేమంతా సిద్ధం బస్ యాత్ర చూసిన తర్వాత వైఎస్సార్సీపీ విజయావకాశాలపై ఇంకెవరికైనా సందేహం ఉంటే పూర్తిగా నివృత్తి అయి ఉంటుంది. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమికి గుండెలు జారిపోయి ఉంటాయి. యాత్ర ఆరంభం అదిరిన తీరు అదరహో అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీచ్ విన్న తర్వాత విపక్షాలు బెదరహో అయి ఉండాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన స్పీచ్ ఎంతో సమగ్రంగా, అన్ని అంశాలను తడుముతూ వచ్చింది. చాలామందికి కొన్ని విషయాలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఖరి ఏమిటి అని ఎదురు చూసేవారికి పూర్తి స్థాయి జవాబు ఇచ్చారు. తన చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, విశాఖ డ్రగ్ కేసులను ప్రస్తావించి ప్రతిపక్షాల విమర్శలను ఒక్క దెబ్బతో తిప్పికొట్టారు. తన చెల్లెళ్లకు కూడా గట్టిగానే సమాదానం ఇచ్చారని చెప్పాలి. విశాఖ డ్రగ్స్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాన్ని ఆయన బహిర్గతం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీచ్‌లో ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా, సంస్కారవంతమైన విమర్శలు, అర్దవంతమైన వ్యాఖ్యలు కనిపిస్తాయి. ఈ విషయం ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే.. చంద్రబాబు నాయుడు ఈ మద్య కాలంలో ఎక్కడ మాట్లాడినా అసభ్య పదాలను వాడుతూ తన పెద్ద వయసుకు మచ్చ తెచ్చుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ద్వేషంతో ఏదేదో మాట్లాడుతూ తన పరువు పోగొట్టుకుంటున్నారు. వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటున్నా, ఆయన తన వైఖరి మార్చుకోవడం లేదు. తాము గతంలో ఏమి చేశామో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఆయనకు దత్తపుత్రుడుగా పేరొందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం అదే ధోరణి అవలంభిస్తున్నారు. చంద్రబాబు అసలు పుత్రుడు సంగతి సరేసరి. ఆయన ఎప్పుడూ స్పీచ్‌లో ఉండాల్సిన డీసెన్సీని మెయింటెన్ చేయడం లేదు. వీరికి భిన్నంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తాను చెప్పదలచుకున్న విషయాలను సవ్యమైన బాషలో వివరించారు. తొలిరోజు ఆయన తన తండ్రి సమాధి ఉన్న ఇడుపులపాయలో నివాళి అర్పించి ప్రారంభించారు. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తల్లికి ఏదో అన్యాయం చేశారని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చేసే దిక్కుమాలిన ప్రచారానికి చెక్ పెడుతూ వైఎస్ విజయమ్మ స్వయంగా అక్కడకు వచ్చి కుమారుడిని ఆశీర్వదించారు'. ఎప్పటిమాదిరి నుదుట ముద్దు పెట్టి తన ప్రేమను చాటుకున్నారు. ఆ సన్నివేశం వైఎస్సార్సీపీ శ్రేణులకు ఎంతో ఉత్సాహం ఇచ్చిందని చెప్పాలి. అక్కడ నుంచి బయల్దేరి వేంపల్లి, వీరపనాయుని పల్లి, ఎర్రగుంట్ల తదితర గ్రామాల గుండా ప్రొద్దుటూరు చేరుకునే మార్గమధ్యంలో వేలాది మంది జనం తరలివచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డికు స్వాగతం చెప్పారు. "కొందరైతే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న బస్తో పాటు పరుగులు తీస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను అభినందించడానికి పోటీ పడ్డారు. మామూలుగా అయితే ఈ దూరం గంటన్నర నుంచి రెండు గంటలలోపు చేరవచ్చు. అలాంటిది సుమారు ఐదారు గంటలు పట్టింది". కడప లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించిన సభను ప్రొద్దుటూరులో నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన బాబాయి వివేకా హత్య కేసు గురించి ఆయన చాలా స్పష్టంగా ప్రస్తావించి, చిన్నాన్నను ఎవరో చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, దేవుడికి, కడప జిల్లా ప్రజలందరికి తెలుసునని అన్నారు. 'వివేకాను చంపి, తానే చంపానని చెప్పుకుంటున్న హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు'. ఇద్దరు చెల్లెమ్మలు అంటూ షర్మిల, సునీతలను పేర్లు చెప్పకుండానే వారి గురించి మాట్లాడుతూ, 'రాజకీయ స్వార్దంతో తపిస్తున్న నా చెల్లెళ్లు" అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, ఎల్లో మీడియా, చెల్లెళ్లు హంతకులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడించిన వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని కూడా ఆయన చెల్లెళ్లను తప్పు పట్టారు. ఇదంతా నన్ను దెబ్బతీసే రాజకీయం అని కూడా అంటున్నారంటే.. ఇది కలియుగం అని అనుకోవాల్సి వస్తుందని తాత్వికంగా వ్యాఖ్యానించారు. దీంతో.. "వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరికి షర్మిల, సునీత మద్దతు ఇస్తున్నారన్న అంశాన్ని ఆయన ప్రజల దృష్టికి తెచ్చారు. అలాగే వారిద్దరు తెలుగుదేశం నేతలతో మిలాఖత్ అవడం, చంద్రబాబు చెప్పినట్లు చేయడం వంటి విషయాలను ఆయన వివరించారు. 'తమ కుటుంబంలో కూడా చంద్రబాబు చిచ్చు పెట్టారని ఆయన ద్వజమెత్తారు. అలాగే విశాఖ డ్రగ్ కేసులో చంద్రబాబు తనకు సంబందించినవారు ఉన్నారని గుర్తించి, దానని కప్పిపుచ్చేందుకు వెంటనే వైఎస్సార్సీపీపై నెట్టివేస్తూ ఆరోపణలు చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు'. ఈ కేసులో ఉన్నది చంద్రబాబు, ఆయన వదినకు చెందిన బంధువులేనని ఆయన అన్నారు. తాను ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముతున్నానని వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు." చంద్రబాబు గురించి విశ్లేషిస్తూ నలభై ఐదేళ్లుగా కుట్రలు చేస్తూ రాజకీయాలు సాగిస్తున్నారని, వివేకా బతికి ఉంటే శత్రువుగా చూస్తారని, ఆయన చనిపోగానే కొత్త రాగం అందుకుంటారని, ఎన్.టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనవారు, చనిపోయిన తర్వాత ఎన్.టీ రామారావు శవాన్ని లాగేసుకున్నారని, దండలు వేసి, విగ్రహాలు పెట్టారని.. సీఎం ఎద్దేవ చేశారు. చంద్రబాబు గుణగణాలను ఆయా సందర్భాలలో వివరిస్తూ.. చంద్రబాబు నిత్యం అబద్ధాలు, మోసాలపై ఆధారపడి రాజకీయాలను చేస్తారని అని ఆయన ద్వజమెత్తారు. 2014 తెలుగుదేశం మానిఫెస్టోలో చెప్పిన అంశాలను ప్రస్తావించి వాటిలో ఒక్కటైనా నెరవేర్చారా? అంటూ రుణమాఫి తదితర వాగ్దానాలను ఉటంకించి ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. టీడీపీ మానిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన సంగతి కూడా గుర్తు చేశారు. 2014లో ఏ మూడు పార్టీల కూటమి అయితే పోటీచేసి ప్రజలను మోసం చేసిందో, ఇప్పుడు కూడా అదే కూటమి పోటీలో ఉందని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాళ్లా, వేళ్లపడి పొత్తు పెట్టుకున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవ చేశారు. 2014లోచంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్‌ల ఫోటోలతో కూడిన కరపత్రాలను ప్రజలకు చూపిస్తూ, అందులో ఉన్న రుణమాఫీ, నిరుద్యోగ బృతి తదితర హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు. వీరు ముగ్గురు మళ్లీ మోసం చేయడానికి సిద్ధం అవుతున్నారని ఆయన విమర్శించారు. ఒకవైపు చంద్రబాబు హామీలలోని డొల్లతనాన్ని వివరిస్తూ.., తాను ఏభైఎనిమిది నెలల్లో అమలు చేసిన వాగ్దానాల గురించి వివరించారు. ప్రత్యేకించి ఇళ్లవద్దకే ప్రజలకు అవసరమైన సేవలు అందించడం, గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు, వృద్దాప్య పెన్షన్, ఫీజ్ రీయింబర్స్ మెంట్, ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టడం, ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్యశ్రీ, కాపు నేస్తం, ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర స్కీములను తాను అమలు చేశానని ప్రజలకు తెలియచేశారు. దిశ యాప్‌తో సహా పాలనతో తీసుకు వచ్చిన సంస్కరణలను, పేదలకు ఇళ్ల స్థలాలు మొదలైనవాటితో పాటు తన హయాంలో జరిగిన అభివృద్ది పనులను కూడా తెలియచేశారు.17 మెడికల్ కాలేజీలు, కొత్తగా పోర్టుల నిర్మాణం, కడప తదితర జిల్లాలలో వస్తున్న పరిశ్రమలు మొదలైనవాటి గురించ కూడా వివరించారు. "దుష్టచతుష్టయంలో బాగంగా ఈనాడు, ఆంద్రజ్యోతి, టివి 5 ల పాత్రను విమర్శిస్తూ, ఈనాడు రాస్తున్న రోత రాతలు చూశాక 'ఛీ' అని పారేస్తానని" ఆయన చెప్పారు. పొత్తు ద్వారా ప్రత్యేక హోదాకానీ, ఇతరత్రా కొత్త హామీ ఏదైనా సాధించారా అని మూడు పార్టీలను ప్రశ్నించారు. స్థూలంగా చెప్పాలంటే ఈ మూడు పార్టీల కూటమిని అభివృద్ది నిరోధక, పేదల వ్యతిరేక కూటమిగా అభివర్ణించారు. 'ఎప్పటి మాదిరి మళ్లీ కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని వీరు ప్రజల వద్దకు వస్తారని, వారిని నమ్మవద్దని' వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. చంద్రబాబును పొరపాటున నమ్మితే తమ కంటిని తమ వేలుతోనే పొడుచుకున్నట్లేనని, ఇప్పుడు అమలు అవుతున్న స్కీములు రద్దు అవుతాయని కూడా ఆయన హెచ్చరించారు. పేదల భవిష్యత్తు బాగుండాలంటే మీ బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డినే ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు అప్పీల్ చేశారు. 'ఒక మాటలోచెప్పాలంటే ఈ ప్రసంగం అంతా ఒక సమగ్రమైన స్పీచ్' అనిపిస్తుంది. అన్ని కోణాలను గంట సమయంలో సృజించారు. "ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజలలో స్పందన పెద్ద ఎత్తున కనిపించింది. సభ గంటల తరబడి ఆలస్యం అయినా పెద్ద సంఖ్యలో వచ్చిన జనం అంతా అక్కడే ఉండి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను 'సీఎం.., సీఎం..' అంటూ శుభాకాంక్షలు చెప్పిన తీరు కచ్చితంగా ఆయనకు పెద్ద బూస్ట్‌గానే ఉంది. ఇది వైఎస్సార్సీపీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటే, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి మరింత కంగారు పుట్టిస్తుంది". ఇదే రోజు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పెట్టిన సభలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సభతో పోల్చితే చాలా తక్కువ వచ్చినట్లు చెప్పక తప్పదు. చంద్రబాబు స్పీచ్‌లో కొత్త విషయం ఏమీ ఉండడం లేదు. ఒక అపనమ్మకం కనిపిస్తుంది. అందుకే భయపడి మొదటిసారి కుప్పంలో చంద్రబాబు ఇంటింటికి తిరిగి ఓట్లు వేయాలని అర్ధించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్కీముల గురించి ప్రస్తావించడానికి ఆయన వెనుకాడుతున్నారు. చంద్రబాబుకు క్రెడిబిలిటి లేని అంశాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదాహరణంగా వివరిస్తూ ఉంటే, చంద్రబాబు మాత్రం కేవలం దూషణలకే పరిమితం అవుతున్నారు. "ఒక పరిశీలకుడు అన్నట్లు చంద్రబాబు ఇస్తున్న సూపర్ సిక్స్ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు". క్రెడిబిలిటి ఆయనకు లేకపోవడమే పెద్ద సమస్యగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డికు ఆ ఇబ్బంది లేదు. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యంగా పేదల బవిష్యత్తు కోసం అంతా అండగా నిలబడాలని పిలుపు ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు సభలను చూస్తే ఏపీలో రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలలో ఉత్సాహం ఉరకలేస్తుంటే, చంద్రబాబు సభలలో ఆ స్పూర్తి కొరవడినట్లు అనిపిస్తుంది'. చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ వల్లో, ఏమో తెలియదు కానీ, 2019లో మాదిరి తొలి దశలో కాకుండా, ఈసారి నాలుగో దశకు ఎన్నికల తేదీలు వచ్చాయి. అంటే సుమారు నెల రోజులు ఆలస్యంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. 'చంద్రబాబు తాను, కూటమి పక్షాలు సర్దుకోవడానికి ఈ టైమ్ అవసరం అని భావిస్తుంటే, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం ఈ టైమ్‌ను తనకు అనుకూలంగా మలచుకుని బస్ యాత్రను పెట్టుకుని జనంలోకి మరింత చొచ్చుకువెళ్లగలిగారు. తద్వారా జనంలో తనకు ఉన్న పట్టు ఏమిటో చూపించగలుగుతున్నారు'. దీని ఫలితంగా వైఎస్సార్సీపీ ప్రభంజనం మరోసారి రావచ్చన్న అబిప్రాయం కలుగుతోంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ప్రొద్దుటూరు మేమంత సద్ధం బహిరంగ సభలో భారీ జనం
-
Bus Yatra: 'మేమంతా సిద్ధం'.. YSRCPలో నయా జోష్
సాక్షి, తాడేపల్లి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. మరోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. ఎన్నికల సంగ్రామానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు (విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల) మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. మార్చి 27 బస్సుయాత్ర షెడ్యూల్ బుధవారం ఉదయం 10:56 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి కడపకు సీఎం జగన్ 12:20కి ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం జగన్ మధ్యాహ్నం 1 నుండి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న జగన్ 1:30కి బస్సుయాత్ర ప్రారంభం వేంపల్లి, వి.ఎన్.పల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకోనున్న బస్సుయాత్ర సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొననున్న వైఎస్ జగన్ అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకోనున్న వైఎస్ జగన్ ఆ రాత్రి ఆళ్లగడ్డలోనే బస చేయనున్న వైసీపి అధినేత మరో 48 గంటలే.. కాగా, వైఎస్సార్సీపీ బస్సుయాత్ర మరో 48 గంటల్లో ప్రారంభం కానుంది. ఈనెల 27న ఇడుపులపాయలో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సీఎం జగన్ ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు. ఎర్రగుంట్ల రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద సీఎం జగన్ విడిది చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకన్యకాపరమేశ్వరి సర్కిల్, సినీ హబ్, ఆర్టీసీ బస్టాండ్, శివాలయం వీధి, రాజీవ్ సర్కిల్, కొర్రపాడు రోడ్డు మీదుగా బస్సు యాత్ర జరగనుంది. ఐదు గంటలకు పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. ఇందు కోసం సభ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఫుల్ జోష్‌లో పార్టీ శ్రేణులు బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలోనే ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతూ.. ప్రతి ఇంటికీ మేలు చేశామని వివరించనున్నారు. గత 58 నెలల్లో డీబీటీ రూపంలో 2.70 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్లు వెరసి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని 87 శాతం కుటుంబాలకు చేకూర్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. చేసిన మంచిని ప్రతి ఇంటా వివరించి.. ఆశీర్వాదం తీసుకోవడానికి చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గత 58 నెలల పాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజవకర్గం, ప్రతి గ్రామం, ప్రతి ఇంటా కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమేనని సీఎం జగన్.. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం హాజరయ్యారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం ‘సిద్ధం’ సభల్లో కళ్లకు కట్టినట్లు కన్పించడంతో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. క్లీన్ స్వీపే లక్ష్యంగా అడుగులు టీడీపీ–జనసేన–బీజేపీ శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి కకావికలమైతే.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఈ దశలో సీఎం జగన్ బస్సు యాత్ర వారిలో మరింత ఉత్సాహాన్ని నింపనుంది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను ‘మేం సిద్ధం.. మా బూత్ సిద్ధం.. ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం’ పేరుతో గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టంగా ఎన్నికలకు సన్నద్ధం చేసేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానున్న నేపథ్యంలో, ఆలోగా తొలి దశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మలి విడత ప్రచారాన్ని చేపట్టనున్నారు. -
ప్రజలతో మమేకమవుతూ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర సీఎం జగన్ నిత్యం వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతూ, కార్యకర్తలను ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధులను చేస్తూ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సాగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం జగన్ చేపట్టే ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఈ నెల 27వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతుందని తెలిపారు. 27న ఇడుపుల పాయలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులర్పిస్తారని, అనంతరం బస్సు యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. యాత్రలో ప్రతి రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి (ఇంటరాక్షన్), సాయంత్రం భారీ బహిరంగ సభ కామన్‌గా ఉంటాయని తెలిపారు. ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే తొలి 3 రోజుల బస్సు యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. తర్వాత జరగబోయే యాత్ర వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. సిద్ధం సభలు జరిగిన నాలుగు నియోజకవర్గాలు పోను మిగిలిన నియోజకవర్గాలన్నింటిలో బస్సు యాత్ర జరుగుతుందన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్ర కూడా జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే (సుమారు ఏప్రిల్ 18) వరకు సీఎం విరామం లేకుండా పూర్తిగా యాత్రలోనే ఉంటారని, పండుగలు, సెలవుల్లోనూ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. నోటిఫికేషన్ వచ్చిన తరువాత సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం చేస్తారన్నారు. ఎంత మంది కూటమి కట్టినా తమ బ్రాండ్ సీఎం జగనే అని చెప్పారు. అన్ని రకాల శక్తులు, ప్రత్యర్ధులు ఏకమై వస్తున్నారని, వారందరినీ తాము ఒంటరిగానే ఎదుర్కొంటున్నామని తెలిపారు. కార్యకర్తల్లో చైతన్యం నింపే కార్యక్రమమిది ‘మేమంతా సిద్ధం’ అంటూ కార్యకర్తలందరినీ ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు, వారిలో చైతన్యం నింపేందుకు ఈ బస్సు యాత్ర చేస్తున్నారని తెలిపారు. ప్రతి జిల్లా మేమంతా సిద్ధం అని డిక్లేర్ చేసేలా గతంలో ఎన్నడూ జరగని విధంగా చాలా పెద్ద ఎత్తున మహా సభలు జరుగుతాయన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచీ సీఎం జగన్ అట్టడుగు వర్గాల వైపు నిలబడ్డారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లూ వారి కోసమే తపన పడ్డారని తెలిపారు. యాత్రలో రోజూ ఉదయం వివిధ వర్గాలతో జరిగే ముఖాముఖిలో ప్రభుత్వం ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా తీసుకుంటారని చెప్పారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ వారిని కలుస్తారన్నారు. సాయంత్రం మహా సభ జరుగుతుందని తెలిపారు. వీలైనంత వరకూ ఒక లోక్‌సభ నియోజకవర్గంలో 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా సీఎం జగన్ బస్సు యాత్ర... వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకూ నిర్వహించిన 4 సిద్ధం సభలు జరిగిన తీరు నభూతో నభవిష్యతి అని, అక్కడికి వచ్చిన లక్షలాది వైఎస్సార్సీపీ కార్యకర్తలు సీఎం జగన్‌కి నీరాజనాలు పట్టారని తెలిపారు. చెప్పిన మాట మీద నిలబడి, విశ్వసనీయతకు మారు పేరుగా ఐదేళ్ల పాలనలో ప్రజలకు 20 ఏళ్ల పాటు జరగనంత అభివృద్ధి, సంక్షేమాన్ని అందించారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి మేనిఫెస్టోలకే కొత్త అర్ధం ఇచ్చి, ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు ఇలా ఉండాలి అనే మార్గదర్శకత్వం ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేపడుతున్నారన్నారు. సిద్ధం సభలతో జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి ఏపీ వైపు పడిందన్నారు. దానికి కొనసాగింపుగా క్షేత్ర స్థాయిలో ‘మేము సిద్ధం, మా బూత్ సిద్ధం’ అని బూత్ స్థాయిలో కూడా చైతన్యవంతులయ్యారన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, శాసన మండలిలో విప్ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ తొలి 3 రోజుల యాత్ర ఇలా.. 27వ తేదీ (తొలి రోజు యాత్ర): ఉదయం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు. అనంతరం యాత్రకు శ్రీకారం. సాయంత్రం ప్రొద్దుటూరులో తొలి ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభ. 28వ తేదీ (రెండో రోజు) : ఉదయం నంద్యాల లేదా ఆళ్లగడ్డలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి. సాయంత్రం నంద్యాలలో భారీ బహిరంగ సభ. 29వ తేదీ (మూడో రోజు): కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. పలు రంగాల ప్రముఖులతో ముఖాముఖి. సాయంత్రం ఎమ్మిగనూరులో భారీ బహిరంగ సభ. -
అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్టీ రీజనల్ కో ఆర్డీనేటర్ల సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో సాగిన ఈ సమావేశంలో వైఎస్ జగన్ బస్సుయాత్ర, రూట్ మ్యాప్, మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించారు. మూడు పార్టీల కూటమిని ఎదుర్కొనే కార్యచరణపై పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. రీజనల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని తెలిపారు. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామ సచివాలయాన్నీ సదర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలన్నారు. ఈ మేరకు అభ్యర్థులు కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. దీనిపై పార్టీకి చెందిన రీజినల్ కో-ఆర్డినేటర్లు వారికి మార్గనిర్దేశం చేయాలన్నారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 18 పార్లమెంటు నియోజకవర్గాల్లో మార్పులు చేశామని, అభ్యర్థులకు ఇప్పుడున్న సమయం చాలా చక్కగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాలలోని పార్టీ శ్రేణులును, నాయకత్వాన్ని సంఘటితపరిచి, వారిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకునడవాలని చెప్పారు. చదవండి: పదేళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం.. ఎందుకు కలిశారో చెప్పాలి: సజ్జల పార్టీ లక్ష్యం సాధించే దిశలో కలిసి వచ్చే ప్రతి అంశాన్నీ వినియోగించుకుని , ఘనవిజయాలు నమోదు చేయాలన్నారు. రీజినల్ కో-ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు తమ తమ ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుంటూ అభ్యర్థులకు చేదోడు, వాదోడుగా నిలవాలన్నారు. అలాగే బస్సు యాత్ర ప్రారంభమవుతున్నందున దీనికి అన్నిరకాలుగా సిద్ధంకావాలని, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో జరిగే ఈ సభలు చరిత్రాత్మకం కావాలని పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. కాగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించిన వైఎస్సార్సీపీ ప్రచారంపై దృష్టి పెట్టింది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. దాదాపు నెలపాటు జనంలోనే ఉండనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం ఇంటరాక్షన్.. మధ్యాహ్నం/సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలి విడతలో బస్సు యాత్ర.. ఆ తర్వాత ఎన్నిలక ప్రచార సభలు ఉండనున్నాయి. ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. చదవండి: Bus Yatra: జనంలోకి సీఎం జగన్ -
18న అభ్యర్థుల ప్రకటన?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కసరత్తు పూర్తిచేసి ఈ నెల 18న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలప్పుడు పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగానే లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపికలో జరిగిన ఆలస్యం లోక్‌సభ ఎన్నికలకు జరగకుండా అభ్యర్థులను ముందే ప్రకటిస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో హామీ ఇచ్చారు. ఇందుకు తగ్గట్లుగానే త్వర లో అభ్యర్థులను ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో వివిధ సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ వెలువడేలోగా యాత్రలు.. ఈ నెల 20 నుంచి 17 ఎంపీ సీట్ల పరిధిలో రథ (బస్సు) యాత్రలకు జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ యాత్రలను మొదట ఈ నెల 10 నుంచి మొదలుపెట్టాలనుకున్నా అభ్యర్థులు ఖరారయ్యాక చేపడితే మరింత ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నెల 20 నుంచి యాత్రలను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంపీ సీట్లను 5 క్లస్టర్లుగా (మూడు, నాలుగేసి సీట్లు ఒక్కో క్లస్టర్ చొప్పున) బీజేపీ జాతీయ నాయకత్వం విభజించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా ఈ యాత్రలను పూర్తిచేయడం ద్వారా మిగతా పార్టీల కంటే ముందే తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేసినట్లు అవుతుందని భావిస్తోంది. రోజుకు రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున నెలాఖరుకల్లా ఆయా లోక్‌సభ క్లస్టర్లలోని అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేసే యోచనలో పార్టీ ఉంది. త్వరలోనే ఆయా క్లస్టర్లవారీగా రథయాత్రల నిర్వహణ కమిటీలు, ఆయా బాధ్యతల నిర్వహణకు వివిధ బృందాల ఏర్పాటు వంటివి ఖరారు కానున్నట్లు తెలిసింది. సంఘ్ నేతలతో కీలక భేటీ... ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆరెస్సెస్ ముఖ్య నేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ (సంస్థాగత), కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట, అనంతర పరిణామాలు, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పరివార్ క్షేత్రాలు, అనుబంధ సంఘాలతో బీజేపీ కొనసాగించాల్సిన సమన్వయం తదితర అంశాలు చర్చకొచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రారంభించిన గావ్ చలో, ఘర్ చలో కార్యక్రమం ద్వారా పదేళ్ల మోదీ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి బీజేపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నారు. -
చీరాలలో బడుగుల జాతర
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో బడుగు, బలహీనవర్గాల సాధికార జాతర జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో తాము సాధించిన సామాజిక సాధికారతను చీరాల పట్టణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎలుగెత్తి చాటారు. సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బçస్సు యాత్రలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదం తొక్కారు. మళ్లీ జగన్ సీఎం అయితేనే తమ జీవితాల్లో వెలుగులు కొనసాగుతాయంటూ నినాదాలు చేశారు. ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి ప్రారంభమైన యాత్రకు వీధి వీధిలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. యాత్ర అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్ నేతృత్వంలో గడియారం సెంటర్లో జరిగిన బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. వైఎస్ జగనే మళ్లీ సీఎం అంటూ స్లోగన్లతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. అంబేడ్కర్, పూలే ఆశయాల సాధకుడు సీఎం వైఎస్ జగన్: మంత్రి నాగార్జున దేశ చరిత్రలో అంబేడ్కర్, పూలే, సాహూ మహరాజ్, పెరియార్, వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేస్తున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక విప్లవం సాధించారని అన్నారు. చంద్రబాబు కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదిగారని, జగన్ మాత్రం అంబేడ్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చి పేద పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించి, వారికి విదేశాల్లో చదివే అవకాశాలు కల్పించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశారన్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని చంద్రబాబు ముళ్లపొదల్లో పడేస్తే వైఎస్ జగన్ విజయవాడ నడిబొడ్డులో నిలబెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలు తల ఎత్తుకునేలా చేశారన్నారు. తెలంగాణలో పార్టీని పెట్టి, ఏపీతో సంబంధం లేదని చెప్పిన షర్మిల.. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి చంద్రబాబు కుట్రలో పావుగా మారారన్నారు. సీఎం జగన్ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలను దోషులుగా చిత్రీకరించింది బాబే: ఎంపీ నందిగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై అక్రమంగా కేసులు పెట్టి దొంగలుగా, దోషులుగా చిత్రీకరీంచి చిత్రహింసలకు గురిచేసింది చంద్రబాబేనని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అనేక పదవులిచ్చి దొరలను చేస్తున్నారన్నారు. ఎంపీలను చేసి పార్లమెంటులో ప్రధాని పక్కన కూర్చోబెట్టారన్నారు. బడుగు, బలహీన వర్గాలు జగనన్నతోనే: కరణం వెంకటేష్ చీరాల నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సుపరిపాలన అందిస్తున్న జగనన్నతోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ అన్నారు. అర్హతే ప్రామాణికంగా బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. చీరాలలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మళ్లీ జగనన్నను సీఎంగా ఎందుకు చేయాలంటే..: మోపిదేవి రాష్ట్రంలో సామాజిక న్యాయం, బడుగుల సాధికారత, పేదలకు పథకాలు కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆలోచించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సామాజికంగా, రాజకీయంగా ముందంజలో ఉండాలన్నదే సీఎం జగన్ తపన అని తెలిపారు. 2024 ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎంపీగా నందిగం సురేష్, చీరాల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కరణం వెంకటేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
ప్రభంజనంలా సాధికార యాత్ర.. అడుగడుగునా అపూర్వ స్పందన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 41వ రోజు వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. అడగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ నీరాజనం పలికారు. బస్సు యాత్రలో భాగంగా గ్రేటర్ విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 26వ వార్డులోని ఎన్జీజీఓస్ కాలనీలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన జీవీఎంసీ స్కూల్‌ను వైఎసార్సీపీ ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం మాధవధార నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీని చేపట్టారు. వేలాది బైక్ లతో సామాజిక సాధికార బస్సుయాత్ర కైలాసపురం వద్ద ఇన్ ఆర్పిట్ మాల్ స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రి మేరుగ నాగార్జున, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగ్గుపల్లి సుభద్ర, గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకట కుమారి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు హాజరయ్యారు. సీఎం జగన్ సాహసోపేత నిర్ణయాలు: డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ, డ్వాక్రా మహిళలకు రుణాలు, రైతుల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేస్తే, జగన్ ఇచ్చిన హామీ మేరకు దఫదఫాలుగా మాఫీ చేస్తున్నారన్నారు. పేదల పిల్లల ఉన్నతస్థాయిలో చదవుకోవాలని నాడు - నేడు ద్వారా అభివృద్ధి పనలు చేస్తున్నారని, అవ్వా , తాతలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ రూ. 3 వేలకు పెంచి అందిస్తున్న ఘనత జగన్ దేనని ఉద్ఘాటించారు. ఆరోగ్య శ్రీ కేవలం రూ. 2 లక్షల పరిమితితో ఆనాడు స్వర్గీయ వైఎస్ ప్రారంభిస్తే, సీఎం జగన్ రూ. 25 లక్షల మేరకు పెంచి ప్రతీ కుటుంబ ఆరోగ్యం పట్ల తన చిత్తశుద్ధిని చాటి సాహసోపేత నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమం కొనసాగి సామాజిక సాధికారత ఫరిడవిల్లుతుందన్నారు. విశాఖ నార్త్ లో వైసీపీ అభ్యర్థి కే కే రాజును వచ్చే ఎన్నికల్లో గెలిపించడంతో ద్వారా జగన్ ను సీఎంగా చేసుకోవాలని ముత్యాల నాయుుడు పిలుపునిచ్చారు. జగన్ పాలనలో సామాజిక సాధికార విప్లవం: మంత్రి మేరుగ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ సామాజిక సాధికారత సాధ్యం కాకపోగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జగన్ పాలనలో సామాజిక సాధికార విప్లవం సాధ్యమైందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అసమానతలు, అవినీతి, అశ్రిత పక్షపాతంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించి రాజ్యాంగ బద్ద హక్కులను కాలరాసారని మండిపడ్డారు. పేదల కడుపులో ఆకలి తీర్చడానికి, చిరునవ్వు కోసం లక్షల కోట్ల రూపాయల వెచ్చిస్తున్న ముఖమంత్రి జగన్ అని ప్రశంసించారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు సీఎం జగన్ ఇస్తే, రాజధాని ప్రాంతంలో వెనుకబడి వర్గాలకు ఇళ్లు కేటాయించాలని సీఎం జగన్ తలపిస్తే కోర్టులకెళ్లి అడ్డుకున్న చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలకు అవసరమా, అతని అంతు చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో 12.5 శాతం పేదరికం రాష్ట్రంలో ఉంటే, జగన్ హయాంలో 6 శాతానికి తగ్గిందని దీనికి వైసీపీ ప్రభుత్వ పాలన కాదా అని ప్రశ్నించారు. చంద్రగిరిలో పుట్టి కుప్పంలో పోటీ చేసే చంద్రబాబు, హైదరాబాద్ లో పుట్టిన లోకేశ్ మంగళగిరిలో పోటీ చేస్తున్న బ్రతుకు టీడీపీదైతే, జగన్ వచ్చే ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల నేతల సీట్లు మార్చుతున్నారని విమర్శిస్తుండటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో అణగారిన వర్గాల నేతలు ఎక్కడ పోటీ చేసినా సరే గెలవ గల సత్తాను సీఎం జగన్ ఇచ్చారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పాదయాత్ర పేరుతో సగం దూరం నడిచి పారిపోయిన లోకేశ్, ప్రజల కష్టాలు తీర్చుతానని చెప్పకుండా ఎర్ర బుక్ పేరుతో వైసీపీ నేతలకు బెదిరింపులు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. సీఎం జగన్ పాలనలో వెనుకబడివ వర్గాలకు గౌరవం: ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, సమాజంలో అణగారిన వర్గాలకు చేయూతనివ్వాలని సంకల్పించారని, రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల ఖర్చు చేసిన ముఖ్యమంత్రి జగన్ తప్పితే మరెవరూ లేరని వ్యాఖ్యానించారు. 133 కులాలు ఉంటే వాటిని క్రోడీకరించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సంక్షేమం అందిస్తున్నారన్నారు. వెనుకబడివ వర్గాలకు సమాజంలో గౌరవం కల్పించాలని జగన్ పరితపించారన్నారు. అధికారం పెద్దలదు కాదని, పేదలదని జగన్ నిరూపించారని, జగన్ పాలనలో పాలకులు ప్రజలకు సేవకులు మాత్రమేనని వివరించారు. జగన్ సాధించిన సాధికారతకు ఇదే నిదర్శనం: గ్రేటర్ విశాఖ మేయర్ హరికుమారి గ్రేటర్ విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ, గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలన చేసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటు బ్యాంక్ లుగా మాత్రమే పరిగణించారని, సీఎం జగన్ సముచిత స్థానం కల్పించి కేబినెట్ లో చోటుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ ల పదవులు కట్టెబెట్టి ఆత్మగౌరవం పెంచారని కొనియాడారు. వెనుకబడిన వర్గానికి చెందిన గృహిణిని అయిన తనను విశాఖ వంటి మహా నగారానికి మేయర్ ను చేసారంటే సీఎం జగన్ ఏ స్థాయిలో సామాజిక విప్లవం తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చునన్నారు. నాడు - నేడుతో విద్యా రంగంలోనూ, ఆరోగ్య శ్రీ,, జగనన్న సురక్ష వంటి పథకాలతో ఆరోగ్య రంగంలోనూ పెద్ద ఎత్తున మార్పులు తీసుకువచ్చి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిపారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసి గెలిపించాలని హరి కుమారి కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కే కే రాజు మాట్లాడుతూ, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిక్షణం ప్రజాహితం కోసం పరితపిస్తుండటాన్ని చంద్రబాబు, ఆయన తోక పార్టీల అధ్యక్షులు ఓర్వలేక కోర్టుల కేసుల పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు సీఎం జగన్ చేసిన సామాజిక సాధికారతను చెప్పేందుకు బస్సు యాత్ర ద్వారా అన్ని వర్గాల నేతలు ప్రతిపక్షాలకు ధీటుగా వివరిస్తున్నారన్నారు. ఉత్తర నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ. 3427కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనలుు చేపట్టామని, 7 హాస్పిటల్స్, 14 స్కూల్స్ నిర్మాణం చేపట్టామని కే కే రాజు వివరించారు. ఆగస్టు 1న సీఎం జగన్ శంకుస్థాపన చేసిన ఇన్ ఆర్బిటల్ మాల్ నిర్మా్ణం పూర్తియితే స్థానికంగా ఉన్న యువత 15 వేల మందికి, ఎఎంసీ మాల్ ద్వారా 3 వేల మందికి ఉపాధి లభించబోతోందని, విశాఖ నార్త్ నియోజకవర్గంలోనే దాదాపుగా 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తాను ఎమ్మెల్యేగా గెలవకపోయినా సరే ఎటువంటి వివక్ష లేకుండా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జగ్గుపల్లి సుభద్ర మాట్లాడుతూ, దేశంలో గాంధీ, అంబేద్కర్ , ఫూలే కలలు గన్న సమాజాన్ని సాకారం చేసిన నేత జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని గుర్తు చేసారు. టీడీపీ హయాంలో గిరిజన శాఖకు మంత్రి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, జీసీసీ చైర్మన్ వంటి పదవులకు గిరిజనులను నియమించకుండా తీవ్రంగా అవమానించితే, జగన్ సీఎం కాగానే ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ, రాజ్యాంగ పదవుల్లో స్థానం కల్పించి గౌరవమిచ్చారని కొనియాడారు. వైసీపీ మైనార్టీ నాయకుడు ఎస్ ఏ రెహ్మన్ మాట్లాడుతూ, చంద్రబాబు కేబినెట్ విస్తరణ చేసినపుడు లోకేష్‌ను మంత్రిని చేసుకున్నాడని, ఎస్టీలు, ముస్లింలు కనిపించలేదని మండిపడ్డారు. -
AP: మళ్లీ జగనే సీఎం: బస్సు యాత్రలో ఎంపీ నందిగాం
అన్నమయ్య, సాక్షి: రైల్వేకోడూరు ప్రజల అనందం చూస్తుంటే ఎమ్మెల్యేగా శ్రీనివాసులు, మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించడం ఖాయంగా కనిపిస్తోందని బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. రైల్వేకోడూరులో బుధవారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న ఎంపీ నందిగాం సురేష్‌బాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ గెలిపించాలని కోరారు. ‘నాలుగున్నరేళ్ల సీఎం జగన్ పాలనకు పద్నాలుగున్నర నెలల చంద్రబాబు పాలనకు చాలా తేడా ఉంది. చంద్రబాబు పాలనలో కుళ్లు కుతంత్రాలు తప్ప చేసిందేమీ లేదు. బినామీలకు దోచిపెట్టారు. బాబు ఎవరికీ చేసిందేమీ లేదు. ఏమి చేశారంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. వెన్నుపోటు గురించి మాత్రమే చెప్పుకుంటున్నారు. అదే వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజల అభివృద్దికి కృషి చేశారు. ఎంత మంది ఏకమై వచ్చినా ఊడేదేమి లేదు. రాష్టానికి మేలు చేసే వ్యక్తి సీఎం వైఎస్ జగన్. ఏపీకి దశ దిశ చూపే వ్యక్తి సీఎం జగన్. కోడూరు అభివృద్దికి జగన్ అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి శ్రీనివాసులు. మీరు మళ్లీ అవకాశమిస్తే మళ్లీ మంత్రి అవుతారు’అని ఎంపీ సురేష్ అన్నారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నవ్వులోనే ఎవరికి ఏ కష్టమోచ్చినా అండగా నేను ఉన్నానన్న నమ్మకం కలుగుతుంది. యాదవులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చి సీఎం వైఎస్ జగన్ రాజకీయ సమానత్వం తీసుకువచ్చారు. చంద్రబాబు మాత్రం బడుగు బలహీన వర్గాల వారిని అవమానపరిచారు. ఇలాంటి సీఎంను, ఎమ్మెల్యే శ్రీనివాసులును మళ్లీ భారీ మోజార్టీతొ గెలిపించాలి’ అని రమేష్ యాదవ్ అన్నారు. ఇదీచదవండి.. కేశినేని నాని వర్సెస్ చిన్ని -
సామాజిక న్యాయానికి చాంపియన్..సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి : ఏ ముఖ్యమంత్రి జగనన్నలాగా సామాజిక న్యాయం పాటించలేదని హోం మంత్రి తానేటి వనిత కొనియాడారు. జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆచరణలో చూపారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌లతో కలిసి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ ఉండకూడదని అమ్మ ఒడి పథకాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారు. గతంలో మన పిల్లల కోసం ఆలోచించిన సీఎంను చూశారా? సీఎం జగన్మోహన్ రెడ్డి మన బిడ్డల చదువులు, ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం చేయూత, కాపు నేస్తం, ఇచ్చారు. అగ్ర వర్ణాల్లో ఉన్న పేదలను గుర్తించిన సీఎం మన జగనన్న 32లక్షల ఇళ్ళ స్థలాలు ఉచితంగా ఇచ్చారు. మహిళకు పుట్టింటి కానుకగా ఇంటి స్థలాన్ని ఇచ్చారు’అని వనిత చెప్పారు. గ్రామ సచివాలయం వ్యవస్థతో జగనన్న పాలన మన ముంగిటకు చేర్చారు. ప్రజల్లోకి వెళ్ళలేక ప్రతి పక్షాలు.. చిన్న పిల్లల ట్యాబ్‌లపై బురద చల్లుతున్నారు. ట్యాబ్‌లను సైతం రాజకీయలకు వాడుకుంటున్నారు. మీ పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవవచ్చు కానీ పేదలు చదవ కూడదా...?దళితులకు పెద్ద పీట వేస్తూ నన్ను హోం మంత్రిని చేశారు’అని వనిత తెలిపారు. మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ.. ‘మహిళా సాధికారితకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారు.చంద్ర బాబు ఒక అబద్ధం. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచాడు. వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే దానిలో కోతలు పెట్టాడు. రైతులు, డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరు చెప్పి మోసం చేశాడు. 2లక్షల 60వేల కోట్ల రూపాయలను పేదలకు ఇచ్చింది సీఎం జగన్మోహన్ రెడ్డి’అని అన్నారు. మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. ‘ఏపీలో 11శాతం ఉన్న పేదరికాన్ని ఆరు శాతానికి సీఎం జగన్మోహన్రెడ్డి తగ్గించారు. దోపిడీ దారులు చంద్రబాబు హయాంలో ఉండేవారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మ ఒడితో పిల్లలను బడిబాట పట్టేలా చేశారు. రూ.65వేల కోట్లు పిల్లల విద్యకు ఖర్చు పెట్టారు. పెత్తందారులు, ఎల్లో మీడియా, చంద్రబాబు పేద పిల్లల విద్య పై విషం చిమ్ముతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేసింది సీఎం జగన్మోహన్రెడ్డి’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి..అమరావతిపై బాబుకు వైఎస్ఆర్సీపీ ప్రశ్నలు -
రాష్ట్రంలో సామాజిక న్యాయం వెల్లివిరుస్తోంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో సామాజిక న్యాయం వెల్లివిరుస్తోందని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళల సాధికారత సీఎం జగన్ ఘనతేనని తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా సోమవారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో జరిగిన సభలో మంత్రి రజిని మాట్లాడారు. సీఎం జగన్ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. పేదవారిని ప్రజాప్రతినిధులుగా మారుస్తున్నారని అన్నారు. విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచి్చన ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని చేరువ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని, ఏలూరులోనూ రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. గతంలో వార్డు మెంబరు కావాలంటే పెత్తందారుల వద్ద ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేదని, ఆ స్ధితి నుంచి సీఎం జగన్ బయటకు తీసుకువచ్చి చట్ట సభల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అందలం ఎక్కిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. రాష్ట్రంలో 25 మంది మంత్రులు ఉంటే వారిలో 17 మంది ఈ వర్గాలకు చెందిన వారే ఉన్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలంతా కలిసి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగనన్నకు విజయం చేకూర్చాలని కోరారు. సీఎం జగన్ బయటకు రాకపోయినా ఆయన కటౌట్‌ను చూసి 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు జనం తరలివస్తున్నారని చెప్పారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ గతంలో సామాజిక న్యాయం కోసం అనేక మంది ఉద్యమాలు చేశారని, వారి ఆశయాలను ఇప్పుడు సీఎం జగన్ నెరవేర్చారని చెప్పారు. దళిత కులంలో పుట్టాలనుకుంటారా.. అనే మాటలు గతంలో ఓ సీఎం నుంచి విన్నామని, కానీ ప్రస్తుతం వెనుకబడిన వర్గాలకు, దళితులకు, మైనార్టీలను అందలం ఎక్కిస్తున్న సీఎంను చూస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ వల్ల దళిత, బలహీన వర్గాలకు ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ వంటి చదువులు అందుతున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని పేకాటరాయుడు, అవినీతిపరుడు, దళిత ద్రోహి అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సాధికారత సీఎం జగన్‌తోనే సాధ్యమైందన్నారు. 2014లో చంద్రబాబు ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో కేవలం ఆయనకు చెందిన వారికి మాత్రమే పనులు చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం కులం, మతం, పార్టీ చూడటంలేదని, వైఎస్సార్సీపీకి ఓటు వేసినవారికి, వేయనివారికి కూడా న్యాయం చేస్తున్నారని, కలెక్టర్ల సమావేశంలో కూడా ఇవే ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. జగన్ పాదయాత్రలో చెప్పిన పనులు, చెప్పని పనులు కూడా చేశారన్నారు. నాలుగున్నరేళ్లలో దెందులూరులో రూ.2,800 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. నిన్న హైదరాబాద్‌లో ఒక సామాజికవర్గ సమావేశం జరిగిందని, దానిలో ఎస్సీ, బీసీలు ఎవరూ పాల్గొనలేదని చెప్పారు. గతంలో పేదలపై పెత్తనం జరిగేదని, ఇప్పుడు అదే పేదలకు పదవులు వస్తున్నాయని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్ వల్ల పేద వర్గాలు చట్టసభల్లో అడుగుపెడుతున్నాయని, ఇందుకు తానే ఉదాహరణ అని చెప్పారు. అక్రమ కేసులతో దళితులను జైళ్లలో పెట్టిన చరిత్ర చంద్రబాబుదన్నారు. దళితులు, బీసీలు, మైనార్టీలు జైళ్ళలో కాదు చట్టసభల్లో ఉండాలని భావించిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలిపారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ నియోజకవర్గంలో 11 వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చామని, దెందులూరు గడ్డ వైఎస్సార్ సీపీ అడ్డాగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కవురు శ్రీనివాస్, జయమంగళ వెంకట రమణ, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, మేకా వెంకట ప్రతాప అప్పారావు, దూలం నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, తలారి వెంకట్రావు, ఎలీజా, జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న అంబేడ్కర్ విగ్రహం చూస్తుంటే అందరికీ ఒక విషయం అర్థం అవుతుంది. సీఎం వైఎస్ జగన్ బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి పరుస్తూ సామాజిక సాధికారత సాధిస్తున్నారు. అంబేడ్కర్ ఆలోచనలు, ఆశయాలను నిజం చేస్తున్నారు. అందుకే.. తన ఆలోచనలు, ఆశయాలు కలిగిన వ్యక్తి తాడేపల్లిలో ఉన్నారని అంబేడ్కర్ వేలు ఆ వైపు చూపిస్తున్నారు. – నందిగం సురేష్, ఎంపీ -
సభలకు బదులు రోడ్ షోలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభల నిర్వహణకు బదులు ప్రస్తుతానికి కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలకే పరిమితం కావాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలన్నింటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం మినహా ఇతర రాష్ట్రాల నేతలతో రోడ్‌షోల నిర్వహణ కోసం ప్లాన్ వేస్తోంది. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను సభకు తీసుకువచ్చే దాని కంటే ప్రజల్లోకి తామే వెళ్లడం మేలన్న ఆలోచనతో కార్యాచరణ రూపొందిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. రోడ్ షోలలో భాగంగా ఉదయం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయాలని.. సాయంత్రం రోడ్ షోలు నిర్వహించాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీని ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ కొత్త జోష్ వస్తుందని అంటున్నారు. నేటి బస్సు యాత్ర వాయిదా సోమవారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్వహించతలపెట్టిన రెండో విడత బస్సు యాత్ర అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లో తిరిగి యాత్ర ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తెలియజేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అగ్రనేతలతో పెద్ద సభలు ఈ నెల 31న కొల్లాపూర్‌లో ప్రియాంకా గాంధీ బహిరంగ సభ జరగనుంది. దీనితోపాటు అగ్రనేతలతో మరో రెండు, మూడు పెద్ద సభ లు నిర్వహించాలని పీసీసీ నేతలు యోచిస్తు న్నారు. ఈ సభల్లో పార్టీ అతిరథ మహారథు లతో హామీలు ఇప్పించాలని భావిస్తున్నారు. అవి మినహా చాలా వరకు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, బస్సుయాత్రతో ఎన్నికల ప్రచారా న్ని కొనసాగించాలని నిర్ణయించారు. -
‘సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్’
సాక్షి, ప్రొద్దుటూరు: దళితులను గత ప్రభుత్వం మోసం చేసిందని రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దళితులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. దళితులకు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అందించిన చరిత్ర ఎవ్వరికీ లేదని తెలిపారు. ఈ మేరకు కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సు యాత్రలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశాంలో.. బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని అన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి అందించామని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లోనూ బలహీన వర్గాలకే ప్రాధాన్యత సామాజిక న్యాయం అనేది గతంలో మాటలకే పరిమితమైందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మండిపడ్డారు. బీసీలను గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుందని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో కేబినెట్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారని. నామినేటెడ్ పదవుల్లోనూ బలహీన వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని చెప్పారు. ‘సామాజిక న్యాయం అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరిగింది. కుల, మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాం. నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నాం. మళ్లీ జగనే సీఎంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అని అంజాద్ బాషా తెలిపారు. చదవండి: చంద్రబాబు రాజకీయ జీవితంలో చోటు లేనిది దానికే! -
కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఫోకస్ ఎందుకు లేదు: రాహుల్ ఫైర్
Updates.. ►కాటారంలో ర్యాలీ సందర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ, కేసీఆర్ కలిసి పనిచేస్తున్నారు. అవినీతి కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అవినీతిని పక్క రాష్ట్రాలకు విస్తరించారు. మీ ఉత్సాహం చూస్తుంటే కేసీఆర్ ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు దర్యాప్తు జరపడం లేదు. తెలంగాణలో కుటుంబ పాలన సాగింది. అవినీతి కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతోంది. సీఎం కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదు. జన గణన చేయాలని మేం అడుగుతున్నాం. పదేళ్లుగా కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వచ్చారు. పార్లమెంట్లో కుల, జన గణన మీద మాట్లాడాను. దేశంలో పెద్ద అంశం కులాలవారీగా జన సమీకరణ. #WATCH | "The whole control of Telangana state is in the hands of one family and corruption is highest in the state in the country...Look at BJP-BRS-AIMIM, these three parties attack the Congress party," says Congress MP Rahul Gandhi during 'Vijayabheri Yatra' in Telangana's… pic.twitter.com/49kCSvV0js — ANI (@ANI) October 19, 2023 ►నాపై 24 కేసులు పెట్టారు. 90 మంది కీలక అధికారుల్లో ఎంతమంది బీసీలు ఉన్నారని అడిగా?. ఎస్సీ, ఎస్టీ అధికారులు ఎంతమంది ఉన్నారని అడిగా. దేశాన్ని నడిపించే వారిలో మెజార్టీ ఎవరని అడిగాను. కేవలం ముగ్గురే ఓబీసీ అధికారులున్నారు. దేశంలో బడా వ్యాపారులకు అప్పులు మాఫీ చేస్తున్నారు. ►కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కాటారంలో రైతులతో భేటీ అయ్యారు. ►అనంతరం, కేటీకే 5వ బొగ్గు గని నుంచి బాంబుల గడ్డ వరకు నిరుద్యోగులతో రాహుల్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ►తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగుతోంది. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఇక, గురువారం కాంగ్రెస్ నేతలు సింగరేణి కార్మికులతో సమావేశమై.. వారితో చర్చించారు. అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ►భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో భేటీ సందర్బంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి దివాళా తీయడానికి విద్యుత్ సంస్థలకు బకాయి పడ్డ వేలాది కోట్లే కారణం కాదా?. ఉచిత విద్యుత్‌తో జెన్కో, ట్రాన్స్‌కో కు ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించడం లేదు. జెన్కోకు ఎనిమిదేళ్లు సీఎండిగా ఒక్కడే ఉన్నాడు. ఐఏఎస్‌ల్లో సమర్థులు లేరా?. ఎందులో అయినా కేసీఆర్ దోస్తులు, కుటుంబ సభ్యులే ఉంటారు. ►ప్రధాని మోదీ.. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నాడని కేసీఆర్ అంటున్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే బిల్లు 2015లో వచ్చింది. అప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు ఎంపీగా ఉన్న కవిత మద్దతు తెలిపారు. సింగరేణి ప్రైవేట్ పరం కావడానికి కారణం ఏవరో అర్థం చేసుకోవాలి. లోపాయికారీ ఒప్పందంతో తాడిచర్ల ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని ప్రైవేట్ పరం చేశారు. జెన్కో నుంచి రావాల్సిన బకాయి ఇప్పించడంలో విఫలం కావడంతోనే సింగరేణి ఎన్నికలను వాయిదా వేయించారు. రాజకీయ పార్టీలు తెలంగాణ సాధనలో విఫలమైతే జానారెడ్డి ఇంట్లో అన్ని పార్టీలు సమావేశమై జేఏసీ ఏర్పడింది. సకల జనుల సమ్మెతో తెలంగాణ ఏర్పడింది. ►సింగరేణి కార్మికుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది. కార్మికుల వైపు వాళ్ళే ఉంటారు.. ప్రభుత్వంలో వాళ్ళే ఉంటారు. ఎంపీగా ఓడిన కవిత సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. వినోద్ కుమార్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అయ్యాడు. అఆలు సరిగా రాయలేని దద్దమ్మ దయాకర్ రావు మంత్రి అయ్యాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ►మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సీఎం కేసీఆర్ ఓసీపీలను మూసివేయాలని చూస్తున్నారు. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంది. సింగరేణి ని కాపాడటానికి, కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చడానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. ►పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల పేరు మార్పిడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారంలో పూర్తి చేస్తాం. ఆదాయ పన్ను పరిమితి పెంచుతాం. పెన్షన్‌తోపాటు సొంత ఇంటి కల నెరవేర్చుతాం. సీఎం కేసీఆర్ చైనా బార్డర్లో ఉండే సైనికులతో సింగరేణి కార్మికులను పోల్చి మాటలతో బోల్తా కొట్టిస్తాడు.. కానీ కార్మికులకు రావాల్సిన రాయితీలు ఇవ్వరు. వాస్తవాలను గ్రహించి కాంగ్రెస్‌ను గెలిపించండి. ►మధు యాష్కీ మాట్లాడుతూ.. సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్నారు.