సాక్షి, తూర్పుగోదావరి : ఏ ముఖ్యమంత్రి జగనన్నలాగా సామాజిక న్యాయం పాటించలేదని హోం మంత్రి తానేటి వనిత కొనియాడారు. జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆచరణలో చూపారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌లతో కలిసి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
‘స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ ఉండకూడదని అమ్మ ఒడి పథకాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారు. గతంలో మన పిల్లల కోసం ఆలోచించిన సీఎంను చూశారా? సీఎం జగన్మోహన్ రెడ్డి మన బిడ్డల చదువులు, ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం చేయూత, కాపు నేస్తం, ఇచ్చారు. అగ్ర వర్ణాల్లో ఉన్న పేదలను గుర్తించిన సీఎం మన జగనన్న 32లక్షల ఇళ్ళ స్థలాలు ఉచితంగా ఇచ్చారు. మహిళకు పుట్టింటి కానుకగా ఇంటి స్థలాన్ని ఇచ్చారు’అని వనిత చెప్పారు.
గ్రామ సచివాలయం వ్యవస్థతో జగనన్న పాలన మన ముంగిటకు చేర్చారు. ప్రజల్లోకి వెళ్ళలేక ప్రతి పక్షాలు.. చిన్న పిల్లల ట్యాబ్‌లపై బురద చల్లుతున్నారు. ట్యాబ్‌లను సైతం రాజకీయలకు వాడుకుంటున్నారు. మీ పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవవచ్చు కానీ పేదలు చదవ కూడదా...?దళితులకు పెద్ద పీట వేస్తూ నన్ను హోం మంత్రిని చేశారు’అని వనిత తెలిపారు.
మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ..
‘మహిళా సాధికారితకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారు.చంద్ర బాబు ఒక అబద్ధం. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచాడు. వైఎస్‌ఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తే దానిలో కోతలు పెట్టాడు. రైతులు, డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరు చెప్పి మోసం చేశాడు. 2లక్షల 60వేల కోట్ల రూపాయలను పేదలకు ఇచ్చింది సీఎం జగన్మోహన్ రెడ్డి’అని అన్నారు.
మంత్రి కారుమూరి మాట్లాడుతూ..
‘ఏపీలో 11శాతం ఉన్న పేదరికాన్ని ఆరు శాతానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి తగ్గించారు. దోపిడీ దారులు చంద్రబాబు హయాంలో ఉండేవారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మ ఒడితో పిల్లలను బడిబాట పట్టేలా చేశారు. రూ.65వేల కోట్లు పిల్లల విద్యకు ఖర్చు పెట్టారు. పెత్తందారులు, ఎల్లో మీడియా, చంద్రబాబు పేద పిల్లల విద్య పై విషం చిమ్ముతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేసింది సీఎం జగన్మోహన్‌రెడ్డి’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment