ఆరో రోజు మేమంతా సిద్ధం: సీఎం జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌ | CM Jagan Memantha Siddham Bus Yatra Day 6 Updates And Highlights - Sakshi
Sakshi News home page

ఆరో రోజు మేమంతా సిద్ధం: సీఎం జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌

Published Tue, Apr 2 2024 8:21 AM | Last Updated on Tue, Apr 2 2024 9:36 PM

Memantha Siddham Day 6 Highlights: CM Jagan Bus Yatra Updates - Sakshi

Memantha Sidham Day 6 Highlights CM Jagan Bus Yatra Details

మదనపల్లె సభ సక్సెస్ పై సీఎం వైఎస్ జగన్ ట్వీట్

  • మనందరి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇంటింటికీ చేసిన మంచికి మద్దతు తెలుపుతూ తరలివచ్చిన సమరయోధుల సముద్రం మదనపల్లెలో నాకు కనిపించింది
  • మరో 6 వారాల్లో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కొరకు జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం నేను సిద్ధం.. మరి మీరంతా సిద్ధమేనా?

చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నారు..

మదనపల్లెలోని  మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • మదనపల్లెలో అన్నమయ్య జిల్లాలో ఇక్కడ కనిపిస్తున్న అభిమానం.. ఒక జనసముద్రాన్ని తలపిస్తోంది
  • మన అందరి ప్రభుత్వం ఇంటింటికి చేసిన మంచికి మద్దతు పలుకుతూ మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందారులను, ప్రతిపక్ష కూటమిని ఓడించాలనే సంకల్పంతో వచ్చిన సమరయోధుల సముద్రం ఇక్కడ కనిపిస్తోంది

  • ఇంటింటి నుంచి తరలి మదనపల్లె వచ్చిన నా ఆత్మ బంధుల జన సముద్రమిది
  • నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా అవ్వా తాతలకు మీ అందరికీ కూడా పేరు పేరునా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

  • పేదల పక్షాన ఉన్న మనకు గొప్ప గెలుపు రాబోతోంది
  • ఇంటింటి అభివృద్ధిని, ప్రతీ ఊరు అభివృద్ధిని, సామాజిక వర్గాల అభ్యున్నతిని, అక్క చెల్లెమ్మల సాధికారితను, అవ్వా తాతల సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు, కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను.
  • ప్రతీ గ్రామానికి మంచి చేశాం
  • చేసిన మంచిని ప్రతీ గడపకు వివరించి 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు గెలించేందుకు, డబుల్‌ సెంచరీ కొట్టేందుకు, రెండు వందలకు రెండొందల కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా
  • 2019లో దేవుడు, మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చి న ప్రతీ హామీని నెరవేర్చాం
  • మ్యానిఫెస్టోను ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం.. నెరవేర్చిన తర్వాత ఓటు అడగటానికి అడుగులు వేస్తా ఉన్నా ప్రభుత్వం.
  • విశ్వసనీయతకు ఇది అర్థం అని చెబుతూ అడుగులు వేశాం ఈ 58 నెలల పాలనలో..
  • ఐదేళ్లు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత మీ ముందు నిలబడి ఇది మంచి చేశామని సగర్వంగా, సవినయంగా చెప్పగలగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

  • ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ,  మన అభిమానులు కానీ, మన వాలంటీర్లు కానీ ప్రతీ ఇంటికి వెళ్లి గడిచిన ఈ 58 నెలల్లో ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్‌కు మీ బిడ్డకు, మన ప్రభుత్వానికి, మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఓటు వేయమని అడుగుతున్నారంటే దానికి కారణం మంచి చేశాం కాబట్టేనని సగర్వంగా చెప్పగలుగుతున్నాను
  • ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్నవారంతా విడివిడిగా రాలేకపోతున్నారు.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు
  • అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత  కట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు.
  • జెండాలు జత కట్టడమే వారి పని.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్‌ పని అని సగర్వంగా చెప్పగలుగుతున్నాను

  • ఇవాళ ఒక్కడి మీద ఎంత మంది దాడి చేస్తున్నారో చూడండి
  • ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ-5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రులు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్‌.. వీళ్లందరికీ తోడు కుట్రలు-కుతంత్రాలు
  • ఒక్కడి మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారంటే మిమ్మల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా
  • వారందరికీ తెలియని విషయం ఒక్కటి ఉంది.. 99 శాతం మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్‌ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతున్నాను.
  • మరి కనీసం 10 శాతం మార్కులు తెచ్చుకోని స్టూడెంట్‌ పరీక్ష పాస్‌ అవుతాడా అని అడుగుతున్నాను

  • ఏకంగా 99 శాతం వాగ్దానాలను నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు..  తన హయాంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చని బాబు నిలబడగలుగుతాడా? అని అడుగుతున్నా
  • విలువులు, విశ్వసనీయతలు లేని ఇలాంటి వారితో ముఫ్పై పార్టీలు కలిసి వచ్చినా, ఇలాంటి పొత్తులను చూసి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన పార్టీ నాయకులు కానీ, మన అభిమానులు కానీ మన  వాలంటీర్లు కానీ, ఇంటింటి అభివృద్ధి అందుకున్న పేద వర్గాలు కానీ భయపడతారా? అని అడుగుతున్నాను.
     
  • జగన్‌ సీఎంగా ఉంటేనే  పథకాలన్నీ కొనసాగుతాయి
  • రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం
  • డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ. 3 లక్షల 75 వేల కోట్లు ఇచ్చాం
  • చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తుకు రాదు
  • జగన్‌ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకువస్తాయి
  • లంచాలు, వివక్ష లేని పాలన అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్‌ పాలన
  • రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్‌ పాలన
  • ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌
  • 2 లక్షల 31 వేల ఉద్యోగాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌
  • 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌
  • అమ్మ ఒడి, విద్యా దీవెన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌
  • దిశ యాప్‌ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్‌
  • 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి
  • చంద్రబాబు జిత్తులమారి, పొత్తుల మారి
  • అధికారం కోసం చంద్రబాబు పసుపుపతిగా మారాడు
  • మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వ్యక్తి బాబు

  • 2014లో పసుపుపతిగా మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నాడు
  • రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
  • పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
  • ఆడబిడ్డ పుడితే రూ. 25వేల డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?
  • ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?

  • రాష్ట్రాన్ని సింగపూర్‌ మించి అభివృద్ధి చేస్తాడంట
  • ఇది  2014 ఎన్నికల్లో చంద్రబాబు  ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటి
  • ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు
  • మరి మదనపల్లెలో ఏమైనా హైటెక్‌ సిటీ కనబడుతుందా?
  • ఆయన మ్యానిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటివి 650కి పైగా హామీలు కనిపిస్తాయి
  • ముఖ్యమైన హామీల పరిస్థితి ఇది అయితే, మరి మ్యానిఫెస్టో సంగతి దేవుడెరుగు
  • ఎన్నికలు అయిపోగానే మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు
  • ఈ ముఖ్యమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోదీ  గారితో ఉన్న ముగ్గురు ఫోటోలు పెట్టి ఇంటింటికి పాంఫ్లెట్‌ పంపించారు చంద్రబాబు.
  • ఇందులో ఒక్కటైన నెరవేర్చారా అని గట్టిగా అడుగుతున్నాను
  • పోనీ ప్రత్యేకహోదా ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నాను
  •  ఇప్పుడు మళ్లీ ఇదే పొత్తు.. ఇదే పార్టీలు.. ఇదే కూటమి..
  • మరోసారి ఇదే మాదిరిగా మీటింగ్‌లు పెట్టి, మరోసారి రంగు రంగుల మ్యానిఫెస్టోలు తయారు చేసి డ్రామకు తెరతీశారు.
  • మళ్లీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి బెంజ్‌ కారు కొనిస్తామంటున్నారు.. ఇంటింటికి కేజీ బంగారం అంటున్నారు.. మళ్లీ ఇదే ముగ్గురు కలిసి సూపర్‌ సిక్స్‌ అంటూ ఉన్నారు.. సూపర్‌ సెవన్‌ అంటున్నారు
  • మరి వదలబొమ్మాలి అంటూ మళ్లీ పేదల రక్తం పీల్చేందుకు  పసుపుపతి తయారవుతున్నాడు చంద్రబాబు
  • మరి వీరిని నమ్మవచ్చా అని మీ అందరిని కూడా అడుగుతున్నా
  • నమ్మినవారిని నట్టేట ముంచి, మరోసారి మన రాష్ట్రాని దోచుకోవాలని బాబు ప్లాన్‌
  • బాబుకు అధికారం కావాల్సింది మంచి చేయడం కోసం కాదు.. దోచుకోవడం కోసం, దాన్ని దాచుకోవడం కోసం అధికారం కావాలి
  • ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా.. వద్దా అని అడుగుతున్నాను
  • గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ చదువు చెబుతా వద్దన్న ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలా.. వద్దా అని అడుగుతున్నాను 

  • పేదలంటే చంద్రబాబుకు కక్ష
  • నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నాడు
  • ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. గతంలో కోర్టులకెళ్లి అడ్డుకున్నాడు
  • బాబుకు ఓటు వేశామంటే వాలంటీర్‌ వ్యవస్థను సైతం, స్కీములను సైతం, పెన్షన్లను సైతం అన్నింటికీ రద్దు చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టేనని ప్రతీ ఒక్కరూ ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి
  • పేదలకు అందాల్సిన ప్రతీ ఒక్క రూపాయి.. ఏ సంక్షేమ పథకం ఆగకుండా గత ఐదేళ్లు మాదిరిగా పొందాలంటే.. బాబులాంటి సైంధవుడికి అవకాశం ఇవ్వకూడదు
  • అది జరగాలి అంటే రెండు బటన్లు ప్రతీ పేదవాడు నొక్కాలి
  • పేదవాళ్ల కోసం, నా అక్క చెల్లెమ్మల భవిష్యత్‌ కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు..
  • వారంతా ఏకమై రెండే రెండు బటన్లు నొక్కాలి.. ఫ్యాన్‌ గుర్తు మీద నొక్కాలి
  • మన వేసే ఈ ఓటు ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడమే కాదు.. మీ భవిష్యత్‌, మీ పిల్లల భవిష్యత్‌, మీ ఇంట్లో ఆడపడుచుల భవిష్యత్‌,  మీ ఇంట్లో అవ్వా తాతల భవిష్యత్‌ అంతా కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది అనే విషయం గ్రహించమని అడుగుతున్నాను
  • జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం.. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే ఈ మంచి అంతా కొనసాగుతుందని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి

అన్నమయ్య జిల్లాపై సీఎం జగన్‌ ప్రేమ చేతల్లో చూపించారు: మిథున్‌రెడ్డి

  • సాగు, తాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేశారు
  • ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చేలా కొత్త ప్రాజెక్టులు చేపట్టారు
     

సీఎం జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది: నిస్సార్‌ అహ్మద్‌

  • ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్‌ నెరవేర్చారు
  • జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు మేమంతా సిద్ధం

 మదనపల్లె మేమంతా సిద్ధం సభకు హాజరైన సీఎం జగన్‌

  • పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంత  జనం
  • పెత్తందారులపై పోరుకు ‘మేమంతా సిద్ధం’ అంటూ నినాదాలు
  • మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగసభ

సీఎం జగన్‌ ట్వీట్‌.. ఆరవ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో నా స్టార్ క్యాంపెయినర్‌లతో..

మదనపల్లి సభకు బయలుదేరిన  సీఎం జగన్‌

  • అన్నమయ్య జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర
  • కాసేపట్లో మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ
  • మదనపల్లె బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌

అంగళ్లు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర

  • యాత్ర బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్‌
  • రోడ్డుకు ఇరువైపుల భారీ సంఖ్యలో ప్రజలు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు
  • పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంత జనం
  • పెత్తందారులపై పోరుకు ‘మేమంతా సిద్ధం’ అని నినాదాలు
  • దారిపొడవునా సీఎం వైఎస్‌ జగన్‌కు జననీరాజనాలు
  • ప్రజలతో మమేకమవుత్ను సీఎం జగన్‌.. నేనున్నానంటూ సీఎం భరోసా

కురభలకోట మండలం కంటేవారిపల్లి చేరుకున్న జగన్ బస్సు యాత్ర

పెద్దపల్లి క్రాస్ వద్ద సీఎం రాక కోసం ఎదురుచూస్తున్న ప్రజలు

కనికలతోపుకు చేరుకున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర

బి.కొత్తకోట మండలం తుమ్మనంగుట్టలో సీఎం జగన్‌

  • తుమ్మనంగుట్టలో యాత్ర బస్సు దిగిన సీఎం జగన్‌

సీఎం జగన్‌ బస్సు యాత్ర బుర్రకాయలకోట క్రాస్ దాటింది

  • సీఎం జగన్‌కు ప్రజలు, అభిమానులు స్వాగతం పలికారు

అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర

  • సీఎం జగన్‌కు ప్రజలు భారీగా స్వాగతం పలుకుతున్నారు
  • కొంతమంది తమ సమస్యలు సీఎం జగన్‌కు చెప్పుకున్నారు
     

వేపూరి కోట క్రాస్‌లో సీఎం జగన్‌కు భారీ స్వాగతం

ఉమా శంకర్ కాలనీ వద్ద సీఎం జగన్‌ బస్సు యాత్రకు ఘన స్వాగతం

  • పూల వర్షం కురిపించిన చిన్నారులు

సీఎం జగన్‌పై అభిమానంతో...

  • కడపజిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అమరనాథ్ సీఎం జగన్పై అభిమానంతో ఉద్యోగం వదిలి బైక్‌తో బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. 
  • ఈరోజు ములకలచెరువు నుంచి యాత్ర వెంట ఉన్నారు


 

ములకలచెరువు దాటి..  పెద్దపాళ్యం చేరుకున్న సీఎం జగన్‌

  • సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజానికం

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత ఎం. గంగాధర్‌

  • చీకటిమునిపల్లె స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత ఎం. గంగాధర్‌

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత మొబసిర్‌ అహ్మద్‌

  • చీకటిమునిపల్లి స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్‌ అహ్మద్‌

వైఎస్సార్‌సీపీలో చేరిన బీజేపీ నేత ఏవీ సుబ్బారెడ్డి

  • చీకటిమునిపల్లె స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో  బీజేపీ సీనియర్‌ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఏ వీ సుబ్బారెడ్డి.
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి

అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర

  • మొలకల చెరువు వద్దకు చేరుకున్న సీఎం జగన్‌
  • అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు వద్ద గజమాలతో సీఎంకు ఘనస్వాగతం పలికిన ప్రజలు.

ఆరో రోజు మేమంతా సిద్దం.. ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర

  • చీకటిమనిపల్లెలో ప్రారంభమైన సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
  • ములకలచెరువు,పెదపాలెం, వేపురికోట మీదుగా.. బుర్రకాయలకోట క్రాస్‌, గొల్లపల్లి, అంగళ్లు వరకు కొనసాగనున్న యాత్ర
  • సాయంత్రం మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ
  • బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్‌
  • సభ అనంతరం.. నిమ్మనల్లి క్రాస్‌, బోయకొండ క్రాస్‌చ చౌడేనపల్లి సోమల మీదుగా అమ్మగారిపల్లె దాకా యాత్ర
  • రాత్రికి అమ్మగారిపల్లెలోనే సీఎం జగన్‌ బస
  • దారిపొడవునా ఆత్మీయ స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న ప్రజానీకం

ఆరో రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

  • మేమంతా సిద్ధం బస్‌ యాత్రకు అన్నమయ్య జిల్లా సిద్ధమా...? అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.


 

మేమంతా సిద్ధం.. సీఎం జగన్‌ బస్సు యాత్రకు అపూర్వ స్పందన

  • అడుగడుగునా నీరాజనం పడుతున్న ఏపీ ప్రజలు
  • నేడు అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించనున్న యాత్ర
  • మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ భారీ బహిరంగ సభ

ఇదీ చదవండి: మేమంతా మీ వెంటే.. జననేత యాత్రలో జనగర్జన

అన్నమయ్య జిల్లా
మేమంతా సిద్ధం - 6వ రోజు

  • ఆరవ రోజుకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ మేమంతా సిద్దం బస్సు యాత్ర 
  • నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర
  • నేడు 40 కిలోమీటర్లు మేర కొనసాగానున్న మేమంతా సిద్దం బస్సు యాత్ర
  • నేడు మదనపల్లి టిప్పుసుల్తాన్ మైదానంలో మేమంతా సిద్దం బస్సు యాత్ర బహిరంగ సభ

సీఎం జగన్‌ పాలనలో..

  • జిల్లా పునర్విభజనతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అన్నమయ్య జిల్లా
  • అన్నమయ్య జిల్లాలో డిబిటి, నాన్ డిబిటి ద్వారా రూ. 9,450 కోట్ల నగదు బదిలీ 
  • మదనపల్లెలో రూ. 500 కోట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు 
  • బీటీ కాలేజీ యూనివర్శిటిగా అభివృద్ధి
  • రూ. 24 కోట్లతో 100 పడకలతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి
  • తిరుపతి - పీలేరు -మదనపల్లి జాతీయ రహదారి
  • రాయచోటి దాహార్తి తీరుస్తూ 100 కోట్లు కేటాయింపు
  • జిల్లా కేంద్రంగా రాయచోటి అభివృద్ధి
  • రూ. 25 కోట్లతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి
  • రూ. 100 కోట్లతో రాయచోటి లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం

అన్నమయ్య జిల్లా
మేమంతా సిద్ధం - 6వ రోజు  షెడ్యూల్

  • ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు చీకటిమనిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు.
  • ములకలచెరువు,పెదపాలెం మీదగా వేపురికోట, బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్ళు చేరుకుంటారు.
  • అంగళ్ళు దాటినతరువాత  భోజన విరామం తీసుకుంటారు.
  • అనంతరం సాయంత్రం 3.30 గంటలకి మదనపల్లె చేరుకుని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు
  • సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లె శివారులో రాత్రి బసకు చేరుకుంటారు

సీఎం జగన్‌ రోడ్‌ షోకు ఊరూరా ఘన స్వాగతం

  • 58 నెలలుగా తమకు కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం
  • కళ్లారా చూసేందుకు పరితపిస్తున్న ప్రజానీకం.. రోడ్‌ షోలో ఊరూరా ఘన స్వాగతం
  • మండుటెండైనా.. అర్ధరాత్రయినా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం.. మూడు జిల్లాల్లో అతి పెద్ద ప్రజా సభలుగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు
  • పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం అసమాన్యుడు చేస్తున్న యుద్ధ కవాతు.. మాటకు కట్టుబడి.. నిబద్ధతతో నిలబడే నేతను గుండెల్లో దాచుకుంటున్న జనం
  • ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దేశ చరిత్రలో మహోజ్వలఘట్టంగా నిలుస్తుందంటున్న పరిశీలకులు
  • చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతున్న బస్సు యాత్ర
  • మాటపై ఎన్నడూ నిలబడని బాబును ఛీకొడుతున్న జనం.. టీడీపీ సూపర్‌ సిక్స్‌ హామీలను ఏమాత్రం పట్టించుకోని వైనం
  • చంద్రబాబు కుట్రలను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమంటూ లక్షల మంది సెల్‌ఫోన్‌ టార్చిలైట్లు వెలిగించి సభలలో సీఎం జగన్‌కు సంఘీభావం

అనంతలో మేమంతా సిద్ధం.. సూపర్‌ సక్సెస్‌

  • ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ మేమంతా సిద్ధం యాత్ర
  • ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో కొనసాగిన సీఎం జగన్‌ బస్సు యాత్ర
  • ఐదో రోజు అనంతలో యాత్రకు ప్రజల బ్రహ్మరథం
  • అనంతలోనూ సూపర్‌ సక్సెస్‌ అయ్యిందంటూ వైఎస్సార్‌సీపీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement