bus yathra
-
అండగా ఉంటా.. ఆదుకుంటా
మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్ జగన్ గురువారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్లో కొద్దిసేపు ఆగి ప్రజలతో మమేకమయ్యారు. తనను కలిసిన పలువురు అనారోగ్య బాధితులకు ‘నేనున్నానంటూ’ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. అర్జీలు స్వీకరించారు. అండగా ఉంటానంటూ కన్నీళ్లు తుడిచారు. వారంతా సంతోషంతో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. –కొత్తపేట/రావులపాలెం జగనన్న న్యాయం చేస్తానన్నారు.. గతేడాది దీపావళి సమయంలో బాణసంచా పేలి నా కుమారుడు వినోద్ కుమార్ కుడిచేతికి తీవ్ర గాయమైంది. మణికట్టు వరకు తొలగించారు. కృత్రిమ చేయి పెట్టించేందుకు అవసరమైన సాయం కోసం ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ద్వారా జగనన్నను కలిశాను. నా బాధ విన్న జగనన్న తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పారు. ఈ ఐదేళ్లలో ఆయన అమలు చేసిన పథకాల ద్వారా రూ.4.75 లక్షలు లబ్ధి పొందాం. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – పువ్వల చినబాబు, జార్జిపేట, తాళ్లరేవు మండలం అడగకుండానే.. నా కాలికి ఆపరేషన్ చేయిస్తానన్నారు మా కుటుంబానికి సీఎం జగన్ మరో దేవుడు. ఆయన వస్తున్నారని తెలిసి చూద్దామని వచ్చాను. కానీ ఆయన్ని కలిసి మాట్లాడే అదృష్టం దక్కింది. నా పోలియో కాలును చూసిన జగనన్న.. ‘ఏమ్మా ఆపరేషన్ చేయించుకోలేదా’ అని అడిగారు. ఇరవై ఏళ్ల క్రితం చేయించుకున్నాను సార్.. అయినా ప్రయోజనం లేదని చెప్పాను. దీంతో జగనన్న ఆపరేషన్ చేయిస్తానని మాట ఇచ్చారు. అడగకుండానే అన్నీ ఇస్తున్న జగనన్నే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా. – మెరుగు పువ్వు శాంతి, గోపాలపురం, రావులపాలెం మండలం భరోసా దొరికింది.. నాకు గుండె సమస్య ఉంది. ఏడాది కిందట ఒకసారి, ఇటీవల మరోసారి గుండెపోటు రాగా.. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స చేయించుకొని నిన్ననే డిశ్చార్జ్ అయ్యాను. అయినా ఖరీదైన చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో సీఎం జగన్‌ను కలిసి నా బాధ చెప్పుకున్నాను. ఆయన ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. – మెర్ల చంద్రరావు, ర్యాలీ, ఆత్రేయపురం మండలం బస్సు ఆపి.. బాధలు తెలుసుకున్న సీఎం రాజమహేంద్రవరం రూరల్/రాజమహేంద్రవరం సిటీ: మేమంతా సిద్ధం బస్సుయాత్ర గురువారం రాత్రి రాజమహేంద్రవరం పరిధిలోని కాతేరులో కొనసాగుతుండగా రోడ్డు పక్కన కొందరు వైద్య సహాయం కోసం వేచి ఉన్నారు. వారిని చూసిన సీఎం జగన్ వెంటనే బస్సు ఆపించారు. ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఆరోగ్యశ్రీ ఇన్చార్జి హరికృష్ణను వారి వద్దకు పంపి వివరాలు సేకరించారు. కొంతమూరు అఫీషియల్ కాలనీకి చెందిన బడుగు నర్సశ్రీ తన కుమారుడు సోహిత్ శివకుమార్‌కు కంటి ఆపరేషన్ చేయించినప్పటికీ రెటీనా దెబ్బతినడంతో కంటి చూపుపోయిందన్నారు. కంటిచూపు వచ్చేలా చూడాలని విన్నవించింది. దేవీపట్నం మండలం చిన్నదేవరపేటకు చెందిన బుడ్డిగ శ్రీనివాస్ కీళ్లవాతంతో బాధపడుతున్నాడని అతడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు వైద్య సహాయం చేయాలని వేడుకుంది. రాజమహేంద్రవరంలోని తాడితోట జంక్షన్ వద్ద ఓ కుటుంబం తమ కుమారుడికి వైద్య సహాయం కోసం వేడుకుంది. బస్సులోంచి వారిని గమనించిన సీఎం జగన్ వెంటనే వారిని దగ్గరకు పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేటలో గల ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన గుర్తుర్తి శ్రీకాంత్ చిరు వ్యాపారి. రెండో కుమారుడు తారకరామ్ ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. అతడికి వైద్యం చేయించేందుకు సాయం చేయాలని వారు కోరారు. -
16వ రోజు కొనసాగుతున్న "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర
-
Memantha Siddham Bus Yatra Day 7: మేమంతా సిద్ధం.. పోటెత్తిన జనం (ఫొటోలు)
-
చిత్తూరు బస్సుయాత్రలో జగనన్న ఆత్మీయ పలకరింపు..(ఫొటోలు)
-
మేమంతా సిద్ధం @ఏడో రోజు: ప్రజలతో సీఎం జగన్ మమేకం
Memantha Sidham Day 7 Highlights CM Jagan Bus Yatra Details పూతలపట్టు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మన రక్తం తాగకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఒకటే తేదీన సూర్యుడు ఉదయించే ముందు వాలంటీర్లువ చ్చి పెన్షన్లు ఇచ్చేవారు. పథకం ప్రకారం ఈసీకి తన మనిషి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారు అవ్వాతాతలు పడుతున్న అగచాట్లు చూస్తుంటే చంద్రబాబు మనిషా, శాడిస్టా అనిపిస్తుంది జగన్ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు.. ప్రతి పథకం మీ ఇంటికే వస్తుంది. 3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు ప్రభుత్వంపై చంద్రబాబు, కూటమి ఎంత విషయం కక్కుతున్నారో ప్రజలు చూస్తున్నారు 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. రైతు భరోసా పేరుతో రైతులకు నేరు 34,370 కోట్లు ఇచ్చాం . ఉచిత పంటల భీమా కోసం రూ. 7,800 కోట్లు చెల్లించాం. ఇన్పుట్ సబ్సిడీ పేరుతో రైతుకు రూ. 3,262 కోట్లు అందించాం. 53 లక్షల మంది తల్లుల అకంట్లలో అమ్మఒడిడి ద్వారా 26,067 కోట్లు ఇచ్చాం. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద 18 వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయుత కింద 39 ళక్షల మంది అక్క చెల్లెళ్లకు రూ. 19,182 కోట్లు అందించాం. ఈబీసీ నేస్తం కింద 1,876 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం కింద రూ. 2,029 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసారా కింద 25, 571 కోట్లు. ఆరోగ్య శ్రీ కింద 33 12463 కోట్లు ఖర్చు చేశాం. సున్నా వడ్డీ కింద అక్క చెల్లెళ్లకు రూ. 4,969 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ. 1,390 కోట్లు ఇచ్చాం. 10 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితులకు రూ. 906 కోట్లు చెల్లించాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చాం ఆరోగశ్రీని 25 లక్షలకు పెంచింది మీ జగన్ ప్రభుత్వం ఏకంగా 2 లక్షల 70 వేల కోట్లను నేరుగా అకౌంట్లో వేసింది మధ్యలో ఎక్కడా జన్మభూమి లాంటి దళారులు లేరు. మీరు వేసే ఓటు ఐదేళ్లు అంటే 1825 రోజులు మీ భవిష్యత్ వారి చేతుల్లో పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి ఎవరి హయాంలో మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయని ఆలోచించుకోండి చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తు వస్తుందా 14 ఏళ్ల కాలంలో చంద్రబాబు మీ ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా? రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఎవరు? ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియాం తెచ్చిందెవరు? విలేజ్ క్లీనిక్, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ను ఏర్పాటు చేసింది ఎవరు? ఇంటింటికీ పౌరసేవల్నీ డోర్‌డెలివరీ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది మీ జగన్ ఒకటో తేదీ ఆదివారమైనా సరే అవ్వాతాతలకు పెన్షన్లు అందించిన వాలంటీర్ల వ్యవస్థను తెచ్చింది మీ జగన్. పూతలపట్టులో జన మహాసముద్రం కనిపిస్తోంది: సీఎం జగన్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం ప్రభుత్వం మంచి చేయడానికి ఉపయోగించుకుంది ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు జగన్‌కు, చంద్రబాబుకు యుద్ధం కాదు ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు, ప్రజలకు జరుగుతున్న ఎన్నికలు ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షంలో ఉన్నాం ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. ఒక్కడిపై పోరాటానికి ఇంతమంది వస్తున్నారు మంచివైపు నిలబడి యుద్ధం చేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా..? ధర్మాన్ని గెలిపించడానికి మీరంతాసిద్ధమా? ఈ ఎన్నికల్లో మన ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మంచి ఓ వైపు, చెడు మరోవైపు.. ధర్మం ఓవైపు అధర్మం మరోవైపున్నాయి. ఓవైపు విశ్వసనీయత, మరోవైపు మోసం.. ఓవైపు నిజం, మరోవైపు అబద్దం అబద్దం, మోసం, అన్యాయం, తిరోగమనం, చీకటిని రిటర్స్‌గిఫ్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పూతలపట్టు బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ కాసేపట్లో పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు కాసేపట్లో పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభ బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం జగన్ దామలచెరువులో సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం వేలాదిగా తరలి వచ్చిన జన ప్రభంజనం సుమారు 20 క్రేన్లతో భారీ గజమాలలు ఏర్పాటు చేసి సీఎంకు స్వాగతం దామలచెరువు చేరుకున్న సీఎం జగన్ చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర దామలచెరువు వద్ద పదుల సంఖ్యలో గుమ్మడికాయలతో దిష్టి తీసి సీఎంకు స్వాగతం పలికిన అక్కచెల్లెమ్మలు ఎర్రటి ఎండల్లోనూ మేమంతా సిద్ధమంటూ సీఎం బస్సు యాత్రలో జన జాతర షెడ్యూల్లో లేకున్నా.. ప్రజల కోసం.. కల్లూరులో స్థానిక ప్రజల కోరిక మేరకు షెడ్యూల్లో లేకున్నా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్లిన సీఎం జగన్ కల్లూరులో సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన జనం మండుటెండలోను కదం తొక్కిన మహిళా లోకం కల్లూరు ప్రధాన రహదారి పొడవునా సీఎం జగన్‌ను చూసేందుకు వెల్లువలా తరలివచ్చిన ప్రజలు కల్లూరు చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సీఎం జగన్‌కు భారీ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు జగనన్నకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు సీఎం జగన్‌కు హారతులు ఇచ్చిన అక్కా చెళ్లెమ్మలు బస్సు మీది నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్ నేను విన్నాను... నేను ఉన్నాను పెరాలసిస్ బాధితుడికి సీఎం వైఎస్ జగన్ భరోసా చిత్తూరు జిల్లా సదుం మండలం సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల క్రితం పెరాలసిస్‌కు గురయ్యాడు ఇప్పటికే స్తోమతకు మించి, అప్పుల చేసి మరీ వైద్యం చేయించింది ముఖేష్ కుటుంబం అంతంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారికి ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి అతని వైద్యానికి మరో 15 లక్షలు అవసరం అవుతాయని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు సీఎం వైఎస్ జగన్‌ను కలిస్తే తప్పక తమకు సహాయం దొరుకుతుందని నమ్ముతున్నామని ముఖేష్ తల్లి ఆశాభావం వ్యక్తం చేసారు. మేమంతా సిద్ధం యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిసారు సీఎం వైఎస్ జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకుని అతడి ఆరోగ్య పరిస్థితిని గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు ముఖేష్ వివరాలను తీసుకోవాలని ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం జరిగి మామూలు మనిషి అవుతాడనే నమ్మకం కలిగిందని ఆ కుటుంబం నమ్మకంగా ఉంది మతుకువారిపల్లె చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర దారిపొడవునా సీఎం జగన్‌కు స్వాగతం పలికిన ప్రజానికం చిత్తూరు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది దారిపొడవునా సీఎం జగన్‌కు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతున్నారు సీఎం సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ నేత మేమంతా సిద్ధం బస్సుయాత్రలో గంగాధరనెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన ముఖ్యనేత అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, 2019లో టీడీపీ తరపున గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎ. హరికృష్ణ. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు ఎ. హరికృష్ణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి సీఎం జగన్ సమక్షంలో పార్టీలో కీలక నేతల చేరికలు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరిన కీలక నేతలు. అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎం సుబ్రమణ్యంనాయుడు, కృష్ణమూర్తి, బేతప్పలు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ పార్టీ నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం అమ్మగారిపల్లె నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన అన్నమయ్య, చిత్తూరు జిల్లా చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ... యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్ సదుం సర్కిల్లో స్వాగత ఏర్పాట్లు... సదుం సర్కిల్ స్వాగత ఏర్పాట్లు చేసిన వైఎస్సార్సీపీ నేతలు భారీగా చేరుకున్న ప్రజలు, కార్యకర్తలు తీన్మార్ డాన్స్‌లతో సందడిగా సదుం సర్కిల్ సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం చిత్తూరులో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అమ్మగారిపల్లె నుంచి బయల్దేరిన సీఎం జగన్ సీఎం జగన్‌కు అమ్మగారిపల్లిలో భారీగా స్వాగతం పలికిన ప్రజానికం సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకోనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అనంతరం రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు బైపాస్కు చేరుకోనున్న బస్సు యాత్ర సాయంత్రం పూతలపట్టు బైపాస్ వద్ద బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ అనంతరం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లిక్రాస్, చంద్రగిరి క్రాస్ రేణిగుంట మీదుగ గువరరాజుపల్లెకు చేరుకోనున్న బస్సు యాత్ర రాత్రికి గురవరాజుపల్లెలో సీఎం జగన్ బస చిత్తూరు జిల్లాలో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర అమ్మగారిపల్లె నుంచి మరికొద్ది సేపట్లో బయల్దేరానున్న సీఎం జగన్ సదుం సర్కిల్ స్వాగత ఏర్పాట్లు చేసిన వైఎస్సార్సీపీ నేతలు భారీగా చేరుకున్న ప్రజలు, కార్యకర్తలు తీన్మార్ డాన్స్‌లతో సందడిగా సదుం సర్కిల్ చిత్తూరు జిల్లా సిద్ధమా..? ఏడో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చిత్తురులో కొనసాగనుంది ‘చిత్తూరు జిల్లా సిద్ధమా...?’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు Day-7 చిత్తూరు జిల్లా సిద్ధమా..?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2024 ఏడో రోజు ‘మేమంతా బస్సు’ యాత్ర షెడ్యూల్: నేడు చిత్తూరు జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 7వ రోజుకు చేరుకున్న సీఎం జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర ఉదయం 9 గంటలకు పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం అమ్మగారిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు సదుం, కల్లూరు మీదుగా, చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో దామలచెరువు వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది అనంతరం పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని తలుపులపల్లి మీదగా తేనెపల్లి చేరుకొని లంచ్ బ్రేక్ తీసుకుంటారు అనంతరం తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం 3 గంటలకి పూతలపట్టు బైపాస్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు సభ అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజవర్గం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గాధంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి, చంద్రగిరి క్రాస్ వరకు కొనసాగుతుంది అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంట, గురవరాజుపల్లెకు చేరుకుని సీఎం జగన్ రాత్రి బస చేస్తారు Memantha Siddham Yatra, Day -7. ఉదయం 9 గంటలకు అమ్మగారిపల్లె దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డులో బహిరంగ సభ సభ అనంతరం రేణిగుంట మీదుగా గురవరాజుపల్లె వరకు కొనసాగుతుంది. గురువరాజుపల్లె వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/qw7x7QFOCM — YSR Congress Party (@YSRCParty) April 3, 2024 ఆరో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. సూపర్ సక్సెస్ అన్నమయ్య జిల్లాల్లో సీఎం జగన్‌కు భారీగా స్వాగతం పలికిన ప్రజానికం దారి పొడవునా ప్రజలతో మమేకమైన సీఎం జగన్ పలువురి సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం పార్టీలో చేరిన పలువురు నేతలు మదనపల్లిలో మేమంతా సిద్ధం బహిరంగ సభకు పోటెత్తిన జనం ఎన్నికలకు మేమంతా సిద్ధం అంటూ నినాదించిన శ్రేణులు సీఎం ప్రసంగిస్తూ బాబు పేరెత్తగానే శ్రేణుల్లో ఉత్సాహం ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసిన సీఎం జగన్ మధ్యాహ్నం నుంచి సభ ముగిసే వరకు కార్యకర్తల్లో తగ్గని జోష్ -
ఆప్యాయంగా జగనన్న.. అన్నమయ్యలో ఆరో రోజు మేమంతా సిద్ధం(ఫొటోలు)
-
ఆరో రోజు మేమంతా సిద్ధం: సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
Memantha Sidham Day 6 Highlights CM Jagan Bus Yatra Details మదనపల్లె సభ సక్సెస్ పై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ మనందరి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇంటింటికీ చేసిన మంచికి మద్దతు తెలుపుతూ తరలివచ్చిన సమరయోధుల సముద్రం మదనపల్లెలో నాకు కనిపించింది మరో 6 వారాల్లో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కొరకు జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం నేను సిద్ధం.. మరి మీరంతా సిద్ధమేనా? మనందరి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇంటింటికీ చేసిన మంచికి మద్దతు తెలుపుతూ తరలివచ్చిన సమరయోధుల సముద్రం మదనపల్లెలో నాకు కనిపించింది. మరో 6 వారాల్లో పేదల పక్షాన, పేదల భవిష్యత్తు కొరకు జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం నేను సిద్ధం.. మరి మీరంతా సిద్ధమేనా?#MemanthaSiddham pic.twitter.com/Z0Nbf7kyOc — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నారు.. 2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోడీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు!#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/DJqhuefo9V — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 మదనపల్లెలోని మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మదనపల్లెలో అన్నమయ్య జిల్లాలో ఇక్కడ కనిపిస్తున్న అభిమానం.. ఒక జనసముద్రాన్ని తలపిస్తోంది మన అందరి ప్రభుత్వం ఇంటింటికి చేసిన మంచికి మద్దతు పలుకుతూ మళ్లీ మనందరి ప్రభుత్వమే ఉండాలన్న ఆకాంక్షతో పేదల వ్యతిరేకులను, పెత్తందారులను, ప్రతిపక్ష కూటమిని ఓడించాలనే సంకల్పంతో వచ్చిన సమరయోధుల సముద్రం ఇక్కడ కనిపిస్తోంది ఇంటింటి నుంచి తరలి మదనపల్లె వచ్చిన నా ఆత్మ బంధుల జన సముద్రమిది నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా అవ్వా తాతలకు మీ అందరికీ కూడా పేరు పేరునా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పేదల పక్షాన ఉన్న మనకు గొప్ప గెలుపు రాబోతోంది ఇంటింటి అభివృద్ధిని, ప్రతీ ఊరు అభివృద్ధిని, సామాజిక వర్గాల అభ్యున్నతిని, అక్క చెల్లెమ్మల సాధికారితను, అవ్వా తాతల సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు, కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. ప్రతీ గ్రామానికి మంచి చేశాం చేసిన మంచిని ప్రతీ గడపకు వివరించి 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు గెలించేందుకు, డబుల్ సెంచరీ కొట్టేందుకు, రెండు వందలకు రెండొందల కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా 2019లో దేవుడు, మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చి న ప్రతీ హామీని నెరవేర్చాం మ్యానిఫెస్టోను ఒక బైబిల్‌గా, ఒక ఖురాన్‌గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం.. నెరవేర్చిన తర్వాత ఓటు అడగటానికి అడుగులు వేస్తా ఉన్నా ప్రభుత్వం. విశ్వసనీయతకు ఇది అర్థం అని చెబుతూ అడుగులు వేశాం ఈ 58 నెలల పాలనలో.. ఐదేళ్లు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత మీ ముందు నిలబడి ఇది మంచి చేశామని సగర్వంగా, సవినయంగా చెప్పగలగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ, మన అభిమానులు కానీ, మన వాలంటీర్లు కానీ ప్రతీ ఇంటికి వెళ్లి గడిచిన ఈ 58 నెలల్లో ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్‌కు మీ బిడ్డకు, మన ప్రభుత్వానికి, మన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఓటు వేయమని అడుగుతున్నారంటే దానికి కారణం మంచి చేశాం కాబట్టేనని సగర్వంగా చెప్పగలుగుతున్నాను ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్నవారంతా విడివిడిగా రాలేకపోతున్నారు.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు. జెండాలు జత కట్టడమే వారి పని.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ పని అని సగర్వంగా చెప్పగలుగుతున్నాను ఇవాళ ఒక్కడి మీద ఎంత మంది దాడి చేస్తున్నారో చూడండి ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ-5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రులు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్.. వీళ్లందరికీ తోడు కుట్రలు-కుతంత్రాలు ఒక్కడి మీద దాడి చేయడానికి సిద్ధమయ్యారంటే మిమ్మల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా వారందరికీ తెలియని విషయం ఒక్కటి ఉంది.. 99 శాతం మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు భయపడతాడా అని అడుగుతున్నాను. మరి కనీసం 10 శాతం మార్కులు తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతున్నాను ఏకంగా 99 శాతం వాగ్దానాలను నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు.. తన హయాంలో 10 శాతం కూడా హామీలు నెరవేర్చని బాబు నిలబడగలుగుతాడా? అని అడుగుతున్నా విలువులు, విశ్వసనీయతలు లేని ఇలాంటి వారితో ముఫ్పై పార్టీలు కలిసి వచ్చినా, ఇలాంటి పొత్తులను చూసి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన పార్టీ నాయకులు కానీ, మన అభిమానులు కానీ మన వాలంటీర్లు కానీ, ఇంటింటి అభివృద్ధి అందుకున్న పేద వర్గాలు కానీ భయపడతారా? అని అడుగుతున్నాను. జగన్ సీఎంగా ఉంటేనే పథకాలన్నీ కొనసాగుతాయి రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో జమ చేశాం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ. 3 లక్షల 75 వేల కోట్లు ఇచ్చాం చంద్రబాబు పేరు చెబితే ఒక పథకం కూడా గుర్తుకు రాదు జగన్ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి గుర్తుకువస్తాయి లంచాలు, వివక్ష లేని పాలన అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ పాలన రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది.. మీ జగన్ పాలన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ 2 లక్షల 31 వేల ఉద్యోగాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్ 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్ అమ్మ ఒడి, విద్యా దీవెన అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ దిశ యాప్ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి చంద్రబాబు జిత్తులమారి, పొత్తుల మారి అధికారం కోసం చంద్రబాబు పసుపుపతిగా మారాడు మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వ్యక్తి బాబు 2014లో పసుపుపతిగా మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నాడు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25వేల డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తాడంట ఇది 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటి ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు మరి మదనపల్లెలో ఏమైనా హైటెక్ సిటీ కనబడుతుందా? ఆయన మ్యానిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటివి 650కి పైగా హామీలు కనిపిస్తాయి ముఖ్యమైన హామీల పరిస్థితి ఇది అయితే, మరి మ్యానిఫెస్టో సంగతి దేవుడెరుగు ఎన్నికలు అయిపోగానే మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు ఈ ముఖ్యమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోదీ గారితో ఉన్న ముగ్గురు ఫోటోలు పెట్టి ఇంటింటికి పాంఫ్లెట్ పంపించారు చంద్రబాబు. ఇందులో ఒక్కటైన నెరవేర్చారా అని గట్టిగా అడుగుతున్నాను పోనీ ప్రత్యేకహోదా ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నాను ఇప్పుడు మళ్లీ ఇదే పొత్తు.. ఇదే పార్టీలు.. ఇదే కూటమి.. మరోసారి ఇదే మాదిరిగా మీటింగ్‌లు పెట్టి, మరోసారి రంగు రంగుల మ్యానిఫెస్టోలు తయారు చేసి డ్రామకు తెరతీశారు. మళ్లీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు.. ఇంటింటికి కేజీ బంగారం అంటున్నారు.. మళ్లీ ఇదే ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ అంటూ ఉన్నారు.. సూపర్ సెవన్ అంటున్నారు మరి వదలబొమ్మాలి అంటూ మళ్లీ పేదల రక్తం పీల్చేందుకు పసుపుపతి తయారవుతున్నాడు చంద్రబాబు మరి వీరిని నమ్మవచ్చా అని మీ అందరిని కూడా అడుగుతున్నా నమ్మినవారిని నట్టేట ముంచి, మరోసారి మన రాష్ట్రాని దోచుకోవాలని బాబు ప్లాన్ బాబుకు అధికారం కావాల్సింది మంచి చేయడం కోసం కాదు.. దోచుకోవడం కోసం, దాన్ని దాచుకోవడం కోసం అధికారం కావాలి ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా.. వద్దా అని అడుగుతున్నాను గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ చదువు చెబుతా వద్దన్న ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలా.. వద్దా అని అడుగుతున్నాను పేదలంటే చంద్రబాబుకు కక్ష నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నాడు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. గతంలో కోర్టులకెళ్లి అడ్డుకున్నాడు బాబుకు ఓటు వేశామంటే వాలంటీర్ వ్యవస్థను సైతం, స్కీములను సైతం, పెన్షన్లను సైతం అన్నింటికీ రద్దు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని ప్రతీ ఒక్కరూ ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి పేదలకు అందాల్సిన ప్రతీ ఒక్క రూపాయి.. ఏ సంక్షేమ పథకం ఆగకుండా గత ఐదేళ్లు మాదిరిగా పొందాలంటే.. బాబులాంటి సైంధవుడికి అవకాశం ఇవ్వకూడదు అది జరగాలి అంటే రెండు బటన్లు ప్రతీ పేదవాడు నొక్కాలి పేదవాళ్ల కోసం, నా అక్క చెల్లెమ్మల భవిష్యత్ కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్లు నొక్కాడు.. వారంతా ఏకమై రెండే రెండు బటన్లు నొక్కాలి.. ఫ్యాన్ గుర్తు మీద నొక్కాలి మన వేసే ఈ ఓటు ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడమే కాదు.. మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్, మీ ఇంట్లో ఆడపడుచుల భవిష్యత్, మీ ఇంట్లో అవ్వా తాతల భవిష్యత్ అంతా కూడా మీ ఓటు మీద ఆధారపడి ఉంది అనే విషయం గ్రహించమని అడుగుతున్నాను జగనన్నను మళ్లీ తెచ్చుకుందాం.. అన్న మళ్లీ భారీ మెజార్టీతో వస్తే ఈ మంచి అంతా కొనసాగుతుందని ప్రతీ ఇంటికి వెళ్లి చెప్పండి అన్నమయ్య జిల్లాపై సీఎం జగన్ ప్రేమ చేతల్లో చూపించారు: మిథున్‌రెడ్డి సాగు, తాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేశారు ప్రతి గ్రామానికి నీళ్లు వచ్చేలా కొత్త ప్రాజెక్టులు చేపట్టారు సీఎం జగన్ పాలనతోనే సంక్షేమం సాధ్యమైంది: నిస్సార్ అహ్మద్ ఇచ్చిన ప్రతీ హామీని సీఎం జగన్ నెరవేర్చారు జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు మేమంతా సిద్ధం మదనపల్లె మేమంతా సిద్ధం సభకు హాజరైన సీఎం జగన్ పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంత జనం పెత్తందారులపై పోరుకు ‘మేమంతా సిద్ధం’ అంటూ నినాదాలు మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగసభ సీఎం జగన్ ట్వీట్.. ఆరవ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో నా స్టార్ క్యాంపెయినర్లతో.. With my star campaigners from Day-6 of the Memantha Siddham Yatra. #MemanthaSiddham #VoteForFan pic.twitter.com/KxnAfbVe9O — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 మదనపల్లి సభకు బయలుదేరిన సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర కాసేపట్లో మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ మదనపల్లె బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ అంగళ్లు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర యాత్ర బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ రోడ్డుకు ఇరువైపుల భారీ సంఖ్యలో ప్రజలు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు పోటెత్తిన ప్రజాభిమానం.. ఇసుకేస్తే రాలనంత జనం పెత్తందారులపై పోరుకు ‘మేమంతా సిద్ధం’ అని నినాదాలు దారిపొడవునా సీఎం వైఎస్ జగన్‌కు జననీరాజనాలు ప్రజలతో మమేకమవుత్ను సీఎం జగన్.. నేనున్నానంటూ సీఎం భరోసా కురభలకోట మండలం కంటేవారిపల్లి చేరుకున్న జగన్ బస్సు యాత్ర పెద్దపల్లి క్రాస్ వద్ద సీఎం రాక కోసం ఎదురుచూస్తున్న ప్రజలు కనికలతోపుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర బి.కొత్తకోట మండలం తుమ్మనంగుట్టలో సీఎం జగన్ తుమ్మనంగుట్టలో యాత్ర బస్సు దిగిన సీఎం జగన్ సీఎం జగన్ బస్సు యాత్ర బుర్రకాయలకోట క్రాస్ దాటింది సీఎం జగన్‌కు ప్రజలు, అభిమానులు స్వాగతం పలికారు అన్నమయ్య జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర సీఎం జగన్‌కు ప్రజలు భారీగా స్వాగతం పలుకుతున్నారు కొంతమంది తమ సమస్యలు సీఎం జగన్‌కు చెప్పుకున్నారు వేపూరి కోట క్రాస్‌లో సీఎం జగన్‌కు భారీ స్వాగతం ఉమా శంకర్ కాలనీ వద్ద సీఎం జగన్ బస్సు యాత్రకు ఘన స్వాగతం పూల వర్షం కురిపించిన చిన్నారులు సీఎం జగన్‌పై అభిమానంతో... కడపజిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అమరనాథ్ సీఎం జగన్‌పై అభిమానంతో ఉద్యోగం వదిలి బైక్‌తో బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. ఈరోజు ములకలచెరువు నుంచి యాత్ర వెంట ఉన్నారు ములకలచెరువు దాటి.. పెద్దపాళ్యం చేరుకున్న సీఎం జగన్ సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజానికం వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత ఎం. గంగాధర్ చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం. గంగాధర్ వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేత మొబసిర్ అహ్మద్ చీకటిమునిపల్లి స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్ అహ్మద్ వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ నేత ఏవీ సుబ్బారెడ్డి చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో బీజేపీ సీనియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ వీ సుబ్బారెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర మొలకల చెరువు వద్దకు చేరుకున్న సీఎం జగన్ అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు వద్ద గజమాలతో సీఎంకు ఘనస్వాగతం పలికిన ప్రజలు. ఆరో రోజు మేమంతా సిద్దం.. ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర చీకటిమనిపల్లెలో ప్రారంభమైన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ములకలచెరువు,పెదపాలెం, వేపురికోట మీదుగా.. బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్లు వరకు కొనసాగనున్న యాత్ర సాయంత్రం మదనపల్లెలో వైఎస్సార్సీపీ ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ సభ అనంతరం.. నిమ్మనల్లి క్రాస్, బోయకొండ క్రాస్చ చౌడేనపల్లి సోమల మీదుగా అమ్మగారిపల్లె దాకా యాత్ర రాత్రికి అమ్మగారిపల్లెలోనే సీఎం జగన్ బస దారిపొడవునా ఆత్మీయ స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్న ప్రజానీకం ఆరో రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మేమంతా సిద్ధం బస్ యాత్రకు అన్నమయ్య జిల్లా సిద్ధమా...? అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. Day-6 అన్నమయ్య జిల్లా సిద్ధమా…?#MemantaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 మేమంతా సిద్ధం.. సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన అడుగడుగునా నీరాజనం పడుతున్న ఏపీ ప్రజలు నేడు అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించనున్న యాత్ర మదనపల్లెలో వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభ ఇదీ చదవండి: మేమంతా మీ వెంటే.. జననేత యాత్రలో జనగర్జన అన్నమయ్య జిల్లా మేమంతా సిద్ధం - 6వ రోజు ఆరవ రోజుకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్ర నేడు 40 కిలోమీటర్లు మేర కొనసాగానున్న మేమంతా సిద్దం బస్సు యాత్ర నేడు మదనపల్లి టిప్పుసుల్తాన్ మైదానంలో మేమంతా సిద్దం బస్సు యాత్ర బహిరంగ సభ సీఎం జగన్ పాలనలో.. జిల్లా పునర్విభజనతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లాలో డిబిటి, నాన్ డిబిటి ద్వారా రూ. 9,450 కోట్ల నగదు బదిలీ మదనపల్లెలో రూ. 500 కోట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు బీటీ కాలేజీ యూనివర్శిటిగా అభివృద్ధి రూ. 24 కోట్లతో 100 పడకలతో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి తిరుపతి - పీలేరు -మదనపల్లి జాతీయ రహదారి రాయచోటి దాహార్తి తీరుస్తూ 100 కోట్లు కేటాయింపు జిల్లా కేంద్రంగా రాయచోటి అభివృద్ధి రూ. 25 కోట్లతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి రూ. 100 కోట్లతో రాయచోటి లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం అన్నమయ్య జిల్లా మేమంతా సిద్ధం - 6వ రోజు షెడ్యూల్ ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు చీకటిమనిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. ములకలచెరువు,పెదపాలెం మీదగా వేపురికోట, బుర్రకాయలకోట క్రాస్, గొల్లపల్లి, అంగళ్ళు చేరుకుంటారు. అంగళ్ళు దాటినతరువాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 3.30 గంటలకి మదనపల్లె చేరుకుని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా అమ్మగారిపల్లె శివారులో రాత్రి బసకు చేరుకుంటారు Memantha Siddham Yatra, Day -6. ఉదయం 9 గంటలకు చీకటిమనిపల్లె దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు మదనపల్లె బైపాస్ రోడ్డులో బహిరంగ సభ సభ అనంతరం సోమల మీదుగా అమ్మగారిపల్లె వరకు కొనసాగుతుంది అమ్మగారిపల్లె వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/zohYZ3HsEw — YSR Congress Party (@YSRCParty) April 2, 2024 సీఎం జగన్ రోడ్ షోకు ఊరూరా ఘన స్వాగతం 58 నెలలుగా తమకు కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం కళ్లారా చూసేందుకు పరితపిస్తున్న ప్రజానీకం.. రోడ్ షోలో ఊరూరా ఘన స్వాగతం మండుటెండైనా.. అర్ధరాత్రయినా ఆత్మీయ నేత కోసం ఉప్పొంగుతున్న అభిమానం.. మూడు జిల్లాల్లో అతి పెద్ద ప్రజా సభలుగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు సభలు పేదలకు మరింత గొప్ప భవిష్యత్తు కోసం అసమాన్యుడు చేస్తున్న యుద్ధ కవాతు.. మాటకు కట్టుబడి.. నిబద్ధతతో నిలబడే నేతను గుండెల్లో దాచుకుంటున్న జనం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దేశ చరిత్రలో మహోజ్వలఘట్టంగా నిలుస్తుందంటున్న పరిశీలకులు చంద్రబాబు కూటమి వెన్నులో వణుకు పుట్టించేలా సాగుతున్న బస్సు యాత్ర మాటపై ఎన్నడూ నిలబడని బాబును ఛీకొడుతున్న జనం.. టీడీపీ సూపర్ సిక్స్ హామీలను ఏమాత్రం పట్టించుకోని వైనం చంద్రబాబు కుట్రలను చిత్తు చేసేందుకు తామంతా సిద్ధమంటూ లక్షల మంది సెల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించి సభలలో సీఎం జగన్‌కు సంఘీభావం అనంతలో మేమంతా సిద్ధం.. సూపర్ సక్సెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం యాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో కొనసాగిన సీఎం జగన్ బస్సు యాత్ర ఐదో రోజు అనంతలో యాత్రకు ప్రజల బ్రహ్మరథం అనంతలోనూ సూపర్ సక్సెస్ అయ్యిందంటూ వైఎస్సార్సీపీ Day 5 - శ్రీ సత్యసాయి జిల్లా సిద్ధం! #MemanthaSiddham pic.twitter.com/PZNYJryRQI — YS Jagan Mohan Reddy (@ysjagan) April 1, 2024 -
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ
-
జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన ఎర్రగుంట్ల
-
మేమంతా సిద్ధం.. సీఎం జగన్ బస్సు యాత్ర
-
అన్ని వర్గాలకు జరిగిన మంచిని చెప్పండి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు జరిగిన మంచిని.. క్షేత్రస్థాయికి వెళ్లి మరీ తెలియజెప్పాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. మంగళవారం వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ఆయన భేటీ నిర్వహించారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాల్లో భాగంగా.. ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. దసరా పండుగ ముగించుకుని ఈ నెల 26వ తేదీ నుంచి బస్సు యాత్రలు మొదలుపెట్టాలి. ప్రతీ నియోజకవర్గంలోనూ సమావేశాలు జరగాలి. మూడు ప్రాంతాల నుంచి ఒక్కో మీటింగ్‌చొప్పున.. ప్రతిరోజూ మూడు మీటింగ్‌లు నిర్వహించాలి. ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. విజయవంతం చేయాలి.. అని పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి సీఎం జగన్ తెలిపారు. వచ్చే రెండు నెలలపాటు బస్సు యాత్రలు జరగాలి. నియోజకవర్గాల వారీగా సమావేశాల తేదీ, స్థలం.. ఇలా పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలి. బస్సు యాత్ర మీటింగ్‌లో స్థానిక ఎమ్మెల్యే, పార్టీ ఇంఛార్జి సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు మాట్లాడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును వివరించాలి. వచ్చే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం. కాబట్టి.. పేదవాడు మన పార్టీని ఓన్ చేసుకోవాలి. పార్టీ ప్రతినిధుల సమావేశంలో నిర్దేశించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు బస్సు యాత్ర విజయవంతం చేసేందుకు.. ప్రాంతాల వారీగా బాధ్యుల్ని సీఎం జగన్ నియమించారు. బస్సు యాత్ర మీటింగ్ ఏర్పాట్లను సమన్వయ పర్చడానికి కూడా ముగ్గురు పార్టీ నాయకుల్ని నియమించారు. ఈ భేటీకి విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మర్రి రాజశేఖర్, ఆకేపాటి, అమర్నాథ్, రామసుబ్బారెడ్డి, తలశిల రఘరామ్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం
సాక్షి, జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తోందని, వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగిన ఆ పార్టీ ప్రజా చైతన్య బస్సుయాత్ర సభలో ఆయన ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు ప్రజలు విసిగిపోయారని, ఆ పార్టీని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇలా.. ప్రజలకు ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకో లేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పాలనలో దళితులు, గిరిజనులు అవమానాలకు, అణచివేతకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చేస్తున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న దళితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మండిపడ్డారు. నేరెళ్ల బాధితులను పరామర్శించడానికి వచ్చిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ను అవమానపర్చే విధంగా కేసీఆర్ మాట్లాడారని చెప్పారు. మానకొండూరులో శ్రీనివాస్, పరుశురాం మూడు ఎకరాల భూమి కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్నా.. ఇప్పటికీ కేసు నమోదు కాలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. మిర్చి మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులకు బేడీలు వేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చెందిన రూ.10 వేల కోట్ల నిధులను దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరని మండిపడ్డారు. అప్పులు తెచ్చి ఆదాయంగా చూపుతున్నారని కాగ్ నివేదిక మొట్టికాయలు వేసిందన్నారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తున్న తమను అసెంబ్లీ నుంచి బహిష్కరించారని ఉత్తమ్ ఆరోపించారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. పత్తి పంటకు రూ.6 వేల కనీస మద్ధతు, వరి, మొక్కజొన్న, కందులకు రూ.2 వేలు, మిర్చికి రూ.10 వేల మద్దతు ధరను చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల డ్వాక్రా సంఘాల్లో ఉన్న 70 లక్షల మంది మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తామని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.10 లక్షలు చెల్లిస్తామన్నారు. ఒక్కో సంఘానికి లక్ష రూపాయల చొప్పున తిరిగి చెల్లించే అవసరం లేకుండా గ్రాంట్ కింద ఇస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, అభయహస్తం తీసుకుంటున్న మహిళలకు నెలకు రూ.వెయ్యి చొప్పున అందిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. దళితులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు వరంగల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను మోసం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ, కేసీఆర్‌లు అనుసరిస్తున్న విధానాల వల్ల దళితులు అన్యాయానికి గురవుతున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రివ్యూ పిటిషన్ వేస్తారని చెప్పారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కేటాయించలేదని విమర్శించారు. బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించి.. ఆ నిధులను ఇతర పనులకు మళ్లించడంపై ప్రభుత్వానికి కాగ్ మొట్టికాయ వేసిందన్నారు. వర్గీకరణ చేయాలని డిమాండ్ చేసిన మంద కృష్ణను కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికి రెండు సార్లు జైలులో పెట్టిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. -
వైఎస్సార్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
జోగిపేట(అందోల్): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తెలంగాణలోని 31 జిల్లాల్లో బస్సుయాత్ర చేపట్టి , వైఎస్సార్ చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి బి.సంజీవరావు అన్నారు. బస్సుయాత్రను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందోలు గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్, మే నెలలో బస్సుయాత్రను నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ యాత్రను చేపడుతున్నామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈయాత్ర జరుగనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, వాటిని కూడా ప్రజల ముందు ఉంచుతామన్నారు. విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో నిర్లక్ష్యం చేసిందన్నారు. దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమిని అందించడం లేదన్న విషయాన్ని తెలంగాణ వ్యాప్తంగా తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అందోలు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, పరిపూర్ణ, రాజు, ప్రవీణ్‌కుమార్, వినోద్, టీ.నరేష్, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రాకేష్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ పాలనకు చరమగీతం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ప్రభుత్వపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని, ఆయన ఆడుతున్న ఫెడరల్, థర్డ్‌ఫ్రంట్ డ్రామాకు ప్రజలు బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆడుతున్న కొత్త నాటకానికి కూడా తెరవేసే సమయం ఆసన్నమైందని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చని సీఎం కేసీఆర్.. డిసెంబర్లో జరిగే ఎన్నికలకు వెళ్తే ప్రజలు నిలదీస్తారని భావించి వారిని తప్పుదోవ పట్టించేందుకు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత ప్రజాచైతన్య బస్సుయాత్ర ముగింపు సభ గురువారం రాత్రి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కటకం మత్యుంజయం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామచంద్రకుంతియా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. తెలంగాణ ప్రజలు సెంటిమెంట్‌తో పట్టం కడితే, ఆ ప్రజలకు మేలు చేసే అంశాలను మరిచిన కేసీఆర్ రోజుకోతీరుగా బక్వాసు మాటలు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందన్నారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ను ఓడించేందుకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, థర్డ్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని.. కాంగ్రెస్ బస్సుయాత్రకి ఎవరూ రావడం లేదని కేసీఆర్ అంటున్నారని, ఆయన మాటలకు హుజూరాబాద్‌లో జరిగే ఈ సభే సమాధానం చెబుతుందన్నారు. ఈ సభని చూస్తే మంత్రి ఈటల రాజేందర్ పనైపోయినట్టే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగానికి రూ.4 వేలు ఎకరానికి ఈ మేనెలలోనే ఇస్తామంటూ ఓట్లకోసమే డ్రామాలు అడుతున్నాడన్నాడన్నారు. గిట్టుబాటు, మద్దతు ధర కోసం అనేక ఆందోళనలు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుచేయని విషయాన్ని ప్రజలు మరిచపోలేదన్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ప్రజల అవసరాలు తీర్చేలా ఉండాలని.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అప్రజాస్వామిక పరిపాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకే బస్సుయాత్ర చేపట్టామన్నారు. విద్యాహక్కు చట్టం, వందరోజుల పని, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్‌పార్టీయే అని అన్నారు. రూ.300 కోట్ల ట్రాక్టర్ల సబ్సిడీ కుంభకోణం.. ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసిఆర్, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అప్పుల రాష్ట్రంగా చేస్తున్నారని, తెలంగాణ ఏర్పాటు సమయంలో రూ.69 వేల కోట్లు అప్పు ఉంటే, ప్రస్తుతం రూ.2 లక్షల కోట్లకు పెరిగిందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలకే సబ్సిడీ ట్రాక్టర్లను పంపిణీ చేస్తూ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందని, నాలుగేళ్ల కాలంలో నాయకులు ఎన్ని వేల కోట్లు దోచుకొని ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు. ప్రధానంగా తెలంగాణలో ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులను చేసి, రూ.వేల కోట్లు గుంజుకుంటోందని పేర్కొన్నా రు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆబ్కారీ శాఖ ఆదా యం రూ.8 వేల కోట్లు ఉంటే, ప్రస్తుతం ప్రభుత్వ ఆదా యం రూ.20 వేల కోట్లకు చేరిందని తెలిపారు. ఎస్సారెస్పీ ద్వారా చివరి ఆయకట్టు రైతులకు సాగునీరందిస్తామని చెప్పిన మంత్రి ఈటల రాజేందర్, మిడ్‌మానేరు నీళ్లను మంత్రి హరీష్‌రావు తీసుకెళ్తుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టిన సీఎం కేసిఆర్ రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపుగా 4 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని విమర్శించారు. ∙ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సోనియాగాందీ దయతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జమ్మికుంట పట్టణంలో 20 రోజులకోసారి తాగునీళ్లు వచ్చే పరిస్థితులు ఉన్నాయంటే ఇక్కడ అభివృద్ధి ఏ మేరకు జరుగుతుందో అర్థమవుతుందన్నారు. ధనిక రాష్ట్రమని గొప్పులు చెప్తున్న సీఎం కేసిఆర్, 4 ఏళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లు అప్పులు చేయగా.. అందులో సీఎం విలాస జీవితానికే అధికం మొత్తంలో నిధులు ఖర్చు చేసుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. సీఎం, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో మాత్రమే డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతోందని.. ఇతర జిల్లాల్లోని మంత్రులు మాత్రం ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లేకుండా చేస్తాననడం ఆయన తరం కాదని పేర్కొన్నారు. ∙ నాలుగేళ్లుగా రాష్ట్రంలో దమనకాండ జరుగుతోందని మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో అన్నివర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. వీణవంక మండలంలో అత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబానికి ఏళ్లు గడుస్తున్నా న్యాయం చేయలేదని విమర్శించారు. ప్రజలను మాటలతోనే మభ్యపెడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని పేర్కొన్నారు. రూ.17 వేల కోట్లు అదనంగా ఉన్న బడ్జెట్‌ను మంత్రి ఈటల రాజేందర్.. ఇప్పుడు లోటు బడ్జెట్‌గా చేసి ఖజానా ఖాళీ చూపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 2.18 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, దళితులకు మూడెకరాల భూమి అందని ద్రాక్షగానే మిగిలిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వేసిన రోడ్లను డబుల్ రోడ్లు వేస్తూ, డబుల్‌రోడ్లుగా ఉన్న వాటిని ఫోర్‌లేన్‌గా వేస్తేనే అభివృద్ధి చేసినట్లా అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ హన్మంత్‌రావు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం కేసిఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానని సోనియాగాందీ వద్ద చెప్పిన సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. దళితుడినే సీఎం చేస్తానని చెప్పి మోసం చేశాడని, నక్సలైట్ల ఎజెండానే టీఆర్ఎస్ ఎజెండా అని చెప్పి, నక్సలైట్లనే పిట్టల్లా కాల్చి చంపతున్నాడని విమర్శించారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లికి రాజ్యసభ సీటు ఇవ్వాలన్నారు. ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన తర్వాత ఢిల్లీకి వెళ్లాలని హితవు పలికారు. ∙ మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, హుజూరాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు. ముగింపు సభకు వచ్చిన రాష్ట్ర నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో శాసనమండలి ఫ్లోర్‌లీడర్ షబ్బీర్‌అలీ, వి.హన్మంతరావు, మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, బలరాంనాయక్, సీనియర్ కాంగ్రెస్ నేతలు టి.సంతోష్‌కుమార్, గండ్ర వెంకటరమణారెడ్డి, నేరేళ్ల శారద, రమ్యారావు, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, ప్యాట రమేష్, స్వర్గం రవి, పరిపాటి రవీందర్‌రెడ్డి, విజయరమణారావు, మల్లు రవి, సంపత్‌కుమార్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, దొమ్మాటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక, పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం..హుజూరాబాద్ సభలో ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదర్శాలను వల్లించే హుజూరాబాద్ ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక, పౌరసరఫరాల శాఖలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, కోట్ల రూపాయలను మంత్రి రాజేందర్ అక్రమంగా సంపాదించుకున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్‌లో బస్సుయాత్ర ముగింపు సభలో మాట్లాడిన ఆయన మంత్రి ఈటల రాజేందర్ టార్గెట్‌గా ఘాటైన ఆరోపణలు చేశారు. కస్టమ్ మిల్లింగ్ కింద రైసుమిల్లర్లకు రారైసుకు క్వింటాల్‌కు రూ.15లు, బాయిల్డ్‌కు క్వింటాల్‌కు రూ.25 చెల్లించాల్సి ఉండగా, రూ.30, రూ.50లకు పెంచి రూ.70 కోట్ల అదనపు భారం పడేలా చేశారని, ఇందులో పెద్దమొత్తంలో చేతులు మారాయన్నారు. రవాణా, ఇతర ఖర్చుల కింద మిల్లర్లకు రూ.270 కోట్లు చెల్లించారని, ఇందులోనూ పెద్ద మొత్తంలో లంచంగా తీసుకోగా, ఆడిట్ అభ్యంతరాలతో బయటపడిందన్నారు. వీటిని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తే మిల్లర్లు సమ్మెకు దిగారన్నారు. 2014–15 సంవత్సరంలో కేంద్రం లెవీ కింద లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం చెల్లించామని రూ.1,670 కోట్లకు ప్రతిపాదనలు పంపిన దానిలో రూ.600 కోట్ల మేరకు చేతులు మారితే తాను చేసిన ఫిర్యాదుల మేరకు కేంద్రం విచారణ జరిపిందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట రూ.కోట్ల కుంభకోణం జరిగితే.. ఆర్థికశాఖ మంత్రి గుడ్డిగా సంతకం చేసిన మంత్రి ఈటల రాజేందర్.. కేసీఆర్ అక్రమాలలో కీలకపాత్ర ధారని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని, ఆయన వెంట ఈటల రాజేందర్ కూడా వెళ్లక తప్పదన్న రేవంత్‌రెడ్డి.. తాను విసిరిన సవాళ్లకు దమ్ముంటే విచారణకు రావాలని అన్నారు. -
పరిహారం కోసం కొట్లాడుదాం...!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జహీరాబాద్‌లో పారిశ్రామిక పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి (నిమ్జ్) ఏర్పాటుతో భూములు కోల్పోతున్న వారికి మెరుగైన పరిహారం కోసం అసెంబ్లీ లోపలా, బయటా కొట్లాడతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజా చై తన్య బస్సు యాత్రలో భాగంగా జహీరాబాద్, నారాయణఖేడ్‌లో జరి గిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చెరుకు రైతుల సమస్యలపై అధ్యయనం చేసి, మద్దతు ధర కల్పిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాన్ని సహకార రంగంలో లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో నడిపిస్తామన్నారు. ఆర్ధిక సహాయం అందిస్తున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో నాలుగు వేల మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నా ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కేసీఆర్ ఓదార్చలేదని ఆరోపించారు. ఆయనలా నిస్సిగ్గుగా మాట్లాడే నేత ఎవరూ లేరని, రైతులకు రూ.4వేలు పెట్టుబడి ప్రోత్సాహకం, రైతులకు బీమా పథకం ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించారు. సదాశివపేట మండలం బొబ్బిలిగామలో పత్తిరైతు శ్రీశైలం ఆత్మహత్య ఘటనను ఉదహరిస్తూ.. కేసీఆర్ పాలనకు ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. కాంగ్రెస్ బస్సు యాత్ర నేపథ్యంలో, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు బంగారు తెలంగాణలో ఎందుకు బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదని ఉత్తమ్« ప్రశ్నించారు. వ్యవసాయానికి, రైతులకు సంబంధం లేని వారిని రైతు సమన్వయ సమితుల్లో నియమించారని, డిసెంబర్లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేస్తామన్నారు. ‘రైతు సమన్వయ సమితి ద్వారా రాజకీయ లబ్ధి పొం దాలని చూస్తే, కాంగ్రెస్ వారికి అన్యాయం చేస్తే ప్రతిఘటిస్తామని’ ఉత్తమ్ హెచ్చరించారు. రూ. 2లక్షల కోట్ల అప్పులు.. రెవెన్యూ మిగులుతో ఉన్న రాష్ట్రం టీఆర్ఎస్ రెండేళ్ల పాలనలో రూ.2లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. కాంగ్రెస్‌ను లోఫర్ పార్టీ అని కేటీఆర్ వ్యాఖ్యానించడంపై శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. నారాయణఖేడ్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క ఎన్నికల హామీని టీఆర్ఎస్ నెరవేర్చలేదని ఎంపీపీ డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. సింగూరు నీటిని కేటీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం సిరిసిల్లకు తరలించారని ఆరోపించారు. జహీరాబాద్, నారాయణఖేడ్‌లో జరిగిన బహిరంగ సభల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రి గీతారెడ్డి,, వీ.హనుమంతరావు, శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ మాజీ ఎంపీలు సురేశ్ షెట్కార్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శశిధర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ అ«ధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, ఎంపీపీ సంజీవరెడ్డి, నగేశ్ షెట్కార్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు కుటుంబానికి పరామర్శ సదాశివపేట రూరల్(సంగారెడ్డి): కేసీఆర్ పాలనలో గిట్టుబాటు ధర లేక, పండించిన పంటకు కనీసం పెట్టిన పెట్టుబడులు రాక తీవ్ర మనస్తాపానికి గురై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కనీసం వారి కుటుంబాలను పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. మండల పరిధిలోని బాబిల్‌గాం గ్రామానికి చెందిన తలారి శ్రీశైలం పత్తి పంట దిగ్గుబడి రాక, అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి సైతం రాక మంగళవారం తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని బుధవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్ తదితరులు పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తమవంతు సాయంగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గడీల రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఆశిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మాణిక్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మద్దికుంట శేఖర్, జెడ్పీటీసీ సంగమేశ్వర్, ఎంపీటీసీ సభ్యులు గంగయ్య, సంగమేశ్వర్, నాయకులు మల్లికార్జున్ పాటిల్, ఒగ్గు శ్రీనివాస్, ఎవాన్ తదితరులు పాల్గొన్నారు. 2019లో అధికారం మాదే : కుంతియా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి కుంతియా అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో సైతం ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని, రాహూల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌లో అంతా కలిసి కట్టుగా పని చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ లాభం కోసం తెలంగాణ ఇవ్వలేదని, ప్రజల ఆకాంక్ష మేరకే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ హితం కోసమే పని చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి కుంతియా అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో సైతం ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని, రాహూల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌లో అంతా కలిసి కట్టుగా పని చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ లాభం కోసం తెలంగాణ ఇవ్వలేదని, ప్రజల ఆకాంక్ష మేరకే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ హితం కోసమే పని చేస్తుందన్నారు. వైఎస్ చలవతో మైనార్టీలకు లబ్ధి : షబ్బీర్ అలీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మైనార్టీలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ సౌకర్యంతో ఎందరో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. సుమారు 30లక్షల మంది వరకు లబ్ధి పొందిన వారిలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసేదే చెబుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పదవి కోసం అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించాడన్నారు. మైనార్టీలు, రైతులు, నిరుద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాలు సీఎం మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు. మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు : దానం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి దానం నాగేందర్ అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడం వల్ల కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ప్రయోజనం చేకూరిందన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించి వారి అభ్యున్నతికి తోడ్పడ్డారని గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి సాధించిందంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అన్నారు. కొత్త పార్టీలతో ఒరిగేది లేదు: అజారుద్దీన్ కొత్తగా వచ్చిన పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ అన్నారు. ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ గెలుపుతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుదామన్నారు. ఇందు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ప్రస్తుతం ప్రజలు టీఆర్ఎస్ పాలనతో విసిగిపోయి ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ది మోసపూరిత చరిత్ర : షెట్కార్ సోనియాగాంధీ చలవతో తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ అధికార పీఠాన్ని ఎక్కి ప్రజలను వంచిస్తున్నారని మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ దుయ్యబట్టారు. నారాయణఖేడ్‌కు పట్టణంలోని తహసీల్ మైదానంలో నిర్వహించి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ది మోసపూరిత చరిత్ర అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని సురేష్ షెట్కార్ పిలుపునిచ్చారు. మంజీరను ఎడారి చేశారు: సంజీవరెడ్డి ఉప ఎన్నికల్లో మంత్రి హరీశ్ నారాయణఖేడ్ ప్రాంత ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసగించారని టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి విమర్శించారు. 60ఏళ్ల కాలంలో చేయని అభివృద్ధి ఆరు నెలల్లో చేస్తానని హామీలు ఇచ్చారని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంజీరా నీటిని సిరిసిల్లకోసం కేటీఆర్ మిడ్‌మానేరుకు తరలించారని ఆరోపించారు. మంజీరను ఎడారి చేశారన్నారు. మోసపూరిత టీఆర్ఎస్కు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. -
కుర్చీల కొట్లాటలో భాగమే బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న కుర్చీల కొట్లాటలో భాగంగానే బస్సు యాత్ర జరుగుతున్నదని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, భూపాల్‌రెడ్డితో కలిసి బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పెత్తనంకోసం ఈ కుర్చీల కొట్లాట జరుగుతున్నదన్నారు. రైతు సమన్వయ సమితులను రౌడీ సమితులు అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దారుణమని, దీనిపై తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఆ మాటలను కాంగ్రెస్ నేతలు ఉపసంహరించుకోవాలన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్వయంగా చెప్పినా గత ఎన్నికల్లో ప్రజలు నమ్మలేదని, భవిష్యత్తులోనూ ఆ పార్టీని నమ్మరని పాతూరి అన్నారు. ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులను రౌడీలు అంటూ మాట్లాడిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల బస్సుయాత్ర ఎందుకో వారికే తెలియదన్నారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలపై 420 కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. -
'ప్రతిపక్ష ధర్నా విఫలం చేసేందుకు టీడీపీ కుట్ర'
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 12న ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాను విఫలం చేసేందుకు కేంద్రమంత్రులు సుజనాచౌదరి, వెంకయ్యనాయుడు కుట్రలు పన్నుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర గురువారం సాయంత్రం నెల్లూరు జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో కె.రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించటంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. బీజేపీ ఇచ్చిన రెండు కేంద్ర మంత్రి పదవులతో సరిపెట్టుకుంటారో లేక ప్రత్యేక హోదా సాధించేందుకు కట్టుబడి ఉంటారో సీఎం చంద్రబాబు తేల్చుకోవాలని రామకృష్ణ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
కట్టు..ఉంటే ఒట్టు..!
యాత్రలన్నీ కలిపి కాంగ్రెస్ పీకనులిమే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో ఆ క్రెడిట్ కాంగ్రెస్‌కు, అధినేత్రి సోనియాకు దక్కించేందుకు కృషిచేయాలని ఆ పార్టీ ఆదేశాలిస్తుంటే జిల్లాలో వర్గాలకు ఊతమిస్తూ నేతలు వ్యవహరిస్తున్నారు. తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు వినియోగించుకుంటున్నారు. ఇటీవల ఎంపీ వీహెచ్ చేపట్టిన రథయాత్ర వర్గాల కుంపట్లను రాజేయగా త్వరలో దాన్ని తిప్పి కొట్టి తన సత్తా చాటేందుకు జిల్లా మంత్రి డికే ఆరుణ సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధిః పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. అదీ ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజానీకం చేస్తున్న పోరాటం ఫలితం. కొన్ని కోట్లమంది ప్రజానీకం మనోభావం. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ప్రకటన చేసింది. అంతవరకూ ఓకే. ఇప్పుడు దాన్ని తమ పార్టీ క్రెడిట్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే కాంగ్రెస్ నేతలు తంటాలు పడుతున్నారు. కలిసి కట్టుగా ఈ అంశాన్ని ప్రచారం చేయాల్సింది పోయి ఎవరికివారు యమునా తీరు చందాన వ్యవహరిస్తున్నారు.నాయకుల మధ్య నెలకొన్న మనస్పర్థల వల్ల కలసి మెలసి పని చేసేందుకు వారు ఇష్టపడటం లేదు. వర్గాలు విచ్చుకొని అసలు విషయాన్ని పక్కనపెడుతున్నాయి. జిల్లాలో మంత్రి డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో అం తా తానై ముందుకెళ్తుండటంతో స్పీడును తగ్గించేందు కు వ్యతిరేకవర్గంగా ఉన్న కేంద్రమంత్రి జయపాల్రె డ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి తదితరులు లోలోపల తీవ్ర యత్నాలు చేస్తున్నారు. జైత్రయాత్ర పేరుతో మం త్రి డీకే అరుణ ఇప్పటికే ఒక దఫా జిల్లాలో పర్యటించడంతో పాటు తెలంగాణ ప్రాంతంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులను ఆహ్వానించి గత ఏడాది అక్టోబర్ 29వ తేదీన గద్వాలలో బహిరంగ సభ ఏర్పాటు చేసినా వ్యతిరేకవర్గం వారు ఎక్కడా కూడా పాల్గొనలేదు. రథయాత్ర పేరుతో తాజాగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఈ నెల 2వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించడంతో ఈ అవకాశాన్ని డీకే అరుణ వ్యతిరేక వర్గం సద్వినియోగం చే సుకున్నారు. హనుమంతరావు రథయాత్ర అంతా కూడా ఆమెకు వ్యతిరేకవర్గంగా ముద్రపడిన ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి కనుసన్నలలోనే సాగింది. ఈ యాత్ర కొనసాగిన సమయంలో డీకే అరుణ విదేశాలకు వెళ్లడంతో ఆమె ఈ యాత్రకు దూరంగా వున్న విషయం తెలిసిందే. వీహెచ్ యాత్ర వెంట అరుణ వర్గం వెళ్లినా వారికి అక్కడ పెద్దగా ప్రా ధాన్యత లభించలేదనే విమర్శలున్నాయి. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వర్గానికి చెందిన సూదిని రాంరెడ్డి ఆమనగల్లు, తలకొండపల్లి , మాడ్గుల మండలాల నాయకు లు, కార్యకర్తలతో కలిసి చురుకుగా పాల్గొని హల్చల్ చేశారు. మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, వెల్దండ, కల్వకుర్తి మండలాల పార్టీ శ్రేణులతో హడావిడి చేశారు. నాగర్‌కర్నూల్‌లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కె.దామోదర్‌రెడ్డి, దిలీపాచారి వర్గాల మధ్య భేదాబిప్రాయాలు బయట పడ్డాయి. స్వాగత ఫ్లెక్సీల్లో తమ నాయకుడి ఫొటోలు పెట్టలేదని దామోదర్ రెడ్డి వర్గీయులు వాటిని చింపి వీరంగం చేయడంతో పార్టీ నాయకులు నివ్వెరపోయారు. ఆ తర్వాత దిలీపాచారిని వేదికపైకి పిలవలేదని కార్యకర్తలువర్గాలుగా విడిపోయి సభలో రసాభాస సృష్టించారు. దేవరకద్ర అసెంబ్లీ నియోజక వర్గంలోని కొత్తకోట, అడ్డాకుల, భూత్పూర్ మండల కేంద్రాల్లో జరిగిన యాత్రలో మంత్రి అనుచరులు ఎక్కడా కన్పించలేదు. జైపాల్‌కు జైబోలో... జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చిన్నారెడ్డి తెలంగాణ ఏర్పా టు ప్రకటనలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారని గట్టిగా చెప్పారు. ఆయన వల్లనే హైద్రాబాద్ కేంద్ర పాలితం, రాయల తెలంగాణ అంశాలు మరుగున పడ్డాయని వెల్లడించారు. గతంలో కూడా మాజీ కేంద్ర మంత్రి మల్లికార్జున్ మలిదశ ఉద్యనికి శ్రీకారం చుట్టారని, ఆయన మరణానంతరం టీఆర్సీ కన్వీనర్‌గా బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నానని చెప్పుకున్నారు. అలాగే 2000 సంవత్సరంలో 41 మంది తెలంగాణ ఎమ్మెల్యేలను సమీకరించి పార్టీ అధిష్టానానికి ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని తెలియజేశామని గుర్తు చేశారు. ఇందులో మంత్రి అరుణ. ఆమె వర్గాల ప్రమేయం ఏమీ లేదన్న రీతిలో చిన్నారెడ్డి ప్రసంగించి కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లైంది. ఇప్పుడు అరుణ వంతు ఈ నేపథ్యంలో డీకే అరుణ మళ్లీ తన ప్రాభవాన్ని చాటుకునేందుకు బస్సుయాత్రకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తనపై పార్టీలోని ఒక వర్గం చేసిన దాడికి దీటు గా సమాధాన మిచ్చేందుకు దాన్ని వినియోగించుకోవాలని ఆమె ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. బస్సు యాత్రలో ఎవ్వరైనా అడ్డుతగిలే పరిస్థితి ఏర్పడితే అక్కడికక్కడే తగిన రీతిలో సమాధానం ఇవ్వాలనే విధంగా పకడ్బందీ ప్రణాళికను సిద్దం చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర చేసేందుకు మంత్రి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. -
‘సమైక్యం కోసమే శంఖారావం
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయన సోదరి షర్మిల సమైక్య శంఖారావం పేరిట బస్సు యాత్ర చేస్తున్నారని ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అదనపు పరిశీలకులు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ భవనంలో పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, నగర కన్వీనర్ బాలరాజు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నిడ్జూరు రాంభూపాల్ రెడ్డి, డాక్టర్ గిడ్డయ్య, తోట వెంకటక్రిష్ణారెడ్డి తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల బస్సు యాత్ర వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 5వ తేదీన ఉదయం 10 గంటలకు డోన్‌లో, సాయంత్రం 5 గంటలకు కర్నూలులోని పాతబస్టాండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగిస్తారన్నారు. 6వ తేదీ ఉదయం 10 గంటలకు నంద్యాల బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం.. సాయంత్రానికి షర్మిల బస్సు యాత్ర కడప జిల్లాలోకి ప్రవేశిస్తుందన్నారు. రెండు ప్రాంతాలు కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని నమ్మి ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని తమ పార్టీ ప్లీనరీ నుంచి నేటి వరకు అనేక పర్యాయాలు లేఖల్లో కోరిందని.. కాంగ్రెస్, టీడీపీలు మాత్రం ఓట్లు, సీట్ల కోసమే స్వార్థ రాజకీయాలకు తెర తీశాయన్నారు. కర్నూలులో లక్ష గళ ఘోష నినాదంతో చేసిన కార్యక్రమం సీమాంధ్రలోని 13 జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ వైఖరి ప్రకటించిన తర్వాతే ఆందోళనల్లో పాల్గొనాలని.. అప్పటి వరకు ఆయా పార్టీల నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెబుతూనే చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తున్నాడంటే ఇక్కడి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కుమారుడిని ప్రధానిని చేసుకోవడం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రక్రియకు సోనియా గాంధీ శ్రీకారం చుట్టారని విమర్శించారు. 35 రోజుల పాటు నిరంతరాయంగా సమైక్య ఉద్యమం సాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటే ఉద్యమ స్వరూపం మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు, వ్యాపార వాణిజ్య వర్గాలు షర్మిలమ్మ శంఖారావం బస్సు యాత్రకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.