అన్ని వర్గాలకు జరిగిన మంచిని చెప్పండి: సీఎం జగన్‌ | CM YS Jagan Announced YSRCP Bus Yatras | Sakshi
Sakshi News home page

26 నుంచి రెండు నెలలపాటు వైఎస్సార్‌సీపీ బస్సు యాత్రలు.. సీఎం జగన్‌ దిశానిర్దేశం

Published Tue, Oct 10 2023 8:00 PM | Last Updated on Tue, Oct 10 2023 8:36 PM

CM YS Jagan Announced YSRCP Bus Yatras - Sakshi

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు జరిగిన మంచిని.. క్షేత్రస్థాయికి వెళ్లి మరీ తెలియజెప్పాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో ఆయన భేటీ నిర్వహించారు. వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాల్లో భాగంగా.. ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. 

దసరా పండుగ ముగించుకుని ఈ నెల 26వ తేదీ నుంచి బస్సు యాత్రలు మొదలుపెట్టాలి. ప్రతీ నియోజకవర్గంలోనూ సమావేశాలు జరగాలి. మూడు ప్రాంతాల నుంచి ఒక్కో మీటింగ్‌చొప్పున.. ప్రతిరోజూ మూడు మీటింగ్‌లు నిర్వహించాలి.  ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. విజయవంతం  చేయాలి.. అని పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి సీఎం జగన్‌ తెలిపారు. 

వచ్చే రెండు నెలలపాటు బస్సు యాత్రలు జరగాలి. నియోజకవర్గాల వారీగా సమావేశాల తేదీ, స్థలం.. ఇలా పక్కా ప్రణాళిక తయారు చేసుకోవాలి. బస్సు యాత్ర మీటింగ్‌లో స్థానిక ఎమ్మెల్యే, పార్టీ ఇంఛార్జి సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు మాట్లాడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును వివరించాలి. వచ్చే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం. కాబట్టి.. పేదవాడు మన పార్టీని ఓన్‌ చేసుకోవాలి.  

పార్టీ ప్రతినిధుల సమావేశంలో నిర్దేశించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు బస్సు యాత్ర విజయవంతం చేసేందుకు.. ప్రాంతాల వారీగా బాధ్యుల్ని సీఎం జగన్‌ నియమించారు. బస్సు యాత్ర మీటింగ్‌ ఏర్పాట్లను సమన్వయ పర్చడానికి కూడా ముగ్గురు పార్టీ నాయకుల్ని నియమించారు.  ఈ భేటీకి విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి,  వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి,  మర్రి రాజశేఖర్‌, ఆకేపాటి,  అమర్నాథ్, రామసుబ్బారెడ్డి, తలశిల రఘరామ్‌, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు హాజరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement