పరిహారం కోసం కొట్లాడుదాం...! | fighting for Compensation | Sakshi
Sakshi News home page

పరిహారం కోసం కొట్లాడుదాం...!

Published Thu, Mar 1 2018 12:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

fighting for Compensation - Sakshi

జహీరాబాద్‌ సభలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జహీరాబాద్‌లో పారిశ్రామిక పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి (నిమ్జ్‌) ఏర్పాటుతో భూములు కోల్పోతున్న వారికి మెరుగైన పరిహారం కోసం అసెంబ్లీ లోపలా, బయటా కొట్లాడతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రజా చై తన్య బస్సు యాత్రలో భాగంగా జహీరాబాద్, నారాయణఖేడ్‌లో జరి గిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చెరుకు రైతుల సమస్యలపై అధ్యయనం చేసి, మద్దతు ధర కల్పిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాన్ని సహకార రంగంలో లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో నడిపిస్తామన్నారు.


ఆర్ధిక సహాయం అందిస్తున్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

నాలుగేళ్ల పాలనలో నాలుగు వేల మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నా ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కేసీఆర్‌ ఓదార్చలేదని ఆరోపించారు. ఆయనలా నిస్సిగ్గుగా మాట్లాడే నేత ఎవరూ లేరని, రైతులకు రూ.4వేలు పెట్టుబడి ప్రోత్సాహకం, రైతులకు బీమా పథకం ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించారు. సదాశివపేట మండలం బొబ్బిలిగామలో పత్తిరైతు శ్రీశైలం ఆత్మహత్య ఘటనను ఉదహరిస్తూ.. కేసీఆర్‌ పాలనకు ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. కాంగ్రెస్‌ బస్సు యాత్ర నేపథ్యంలో, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు బంగారు తెలంగాణలో ఎందుకు బడ్జెట్‌ కేటాయింపులు చేయడం లేదని ఉత్తమ్‌« ప్రశ్నించారు. వ్యవసాయానికి, రైతులకు సంబంధం లేని వారిని రైతు సమన్వయ సమితుల్లో నియమించారని, డిసెంబర్‌లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేస్తామన్నారు. ‘రైతు సమన్వయ సమితి ద్వారా రాజకీయ లబ్ధి పొం దాలని చూస్తే, కాంగ్రెస్‌ వారికి అన్యాయం చేస్తే ప్రతిఘటిస్తామని’ ఉత్తమ్‌ హెచ్చరించారు. 



రూ. 2లక్షల కోట్ల అప్పులు..
రెవెన్యూ మిగులుతో ఉన్న రాష్ట్రం టీఆర్‌ఎస్‌ రెండేళ్ల పాలనలో రూ.2లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. కాంగ్రెస్‌ను లోఫర్‌ పార్టీ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించడంపై శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ విమర్శించారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క ఎన్నికల హామీని టీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదని ఎంపీపీ డాక్టర్‌ సంజీవరెడ్డి అన్నారు.

సింగూరు నీటిని కేటీఆర్‌ రాజకీయ ప్రయోజనాల కోసం సిరిసిల్లకు తరలించారని ఆరోపించారు. జహీరాబాద్, నారాయణఖేడ్‌లో జరిగిన బహిరంగ సభల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ మంత్రి గీతారెడ్డి,,  వీ.హనుమంతరావు, శాసన మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ  మాజీ ఎంపీలు సురేశ్‌ షెట్కార్, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శశిధర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ అ«ధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, ఎంపీపీ సంజీవరెడ్డి, నగేశ్‌ షెట్కార్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 రైతు కుటుంబానికి పరామర్శ
సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): కేసీఆర్‌ పాలనలో గిట్టుబాటు ధర లేక, పండించిన పంటకు కనీసం పెట్టిన పెట్టుబడులు రాక తీవ్ర మనస్తాపానికి గురై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. కనీసం వారి కుటుంబాలను పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. మండల పరిధిలోని బాబిల్‌గాం గ్రామానికి చెందిన తలారి శ్రీశైలం పత్తి పంట దిగ్గుబడి రాక, అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి సైతం రాక మంగళవారం తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే.

బాధిత కుటుంబాన్ని బుధవారం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, షబ్బీర్‌ అలీ, దానం నాగేందర్‌ తదితరులు పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తమవంతు సాయంగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గడీల రాంరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఆశిరెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ మాణిక్‌ రెడ్డి, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు మద్దికుంట శేఖర్, జెడ్పీటీసీ సంగమేశ్వర్, ఎంపీటీసీ సభ్యులు గంగయ్య, సంగమేశ్వర్, నాయకులు మల్లికార్జున్‌ పాటిల్, ఒగ్గు శ్రీనివాస్, ఎవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 2019లో అధికారం మాదే : కుంతియా

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి కుంతియా అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో సైతం ప్రజలు కాంగ్రెస్‌ పాలనను కోరుకుంటున్నారని, రాహూల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌లో అంతా కలిసి కట్టుగా పని చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ లాభం కోసం తెలంగాణ ఇవ్వలేదని, ప్రజల ఆకాంక్ష మేరకే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దేశ హితం కోసమే పని చేస్తుందన్నారు.  వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి కుంతియా అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో సైతం ప్రజలు కాంగ్రెస్‌ పాలనను కోరుకుంటున్నారని, రాహూల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌లో అంతా కలిసి కట్టుగా పని చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ లాభం కోసం తెలంగాణ ఇవ్వలేదని, ప్రజల ఆకాంక్ష మేరకే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దేశ హితం కోసమే పని చేస్తుందన్నారు.  


వైఎస్‌ చలవతో మైనార్టీలకు లబ్ధి : షబ్బీర్‌ అలీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మైనార్టీలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్‌ సౌకర్యంతో ఎందరో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించారని ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ అన్నారు. సుమారు 30లక్షల మంది వరకు లబ్ధి పొందిన వారిలో ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేసేదే చెబుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదవి కోసం అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించాడన్నారు. మైనార్టీలు, రైతులు, నిరుద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాలు సీఎం మాటలు నమ్మే స్థితిలో లేరన్నారు. 

మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు : దానం
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం వల్ల కేసీఆర్‌ కుటుంబానికి మాత్రమే ప్రయోజనం చేకూరిందన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి  నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించి వారి అభ్యున్నతికి తోడ్పడ్డారని గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి సాధించిందంటే కాంగ్రెస్‌ పార్టీ పుణ్యమే అన్నారు.

 కొత్త పార్టీలతో ఒరిగేది లేదు: అజారుద్దీన్‌
కొత్తగా వచ్చిన పార్టీలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని మాజీ క్రికెటర్, కాంగ్రెస్‌ నాయకుడు అజారుద్దీన్‌ అన్నారు. ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ గెలుపుతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుదామన్నారు. ఇందు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ప్రస్తుతం ప్రజలు టీఆర్‌ఎస్‌ పాలనతో విసిగిపోయి ఉన్నారని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ది మోసపూరిత చరిత్ర : షెట్కార్‌
సోనియాగాంధీ చలవతో తెలంగాణ వచ్చిందని, కేసీఆర్‌ అధికార పీఠాన్ని ఎక్కి ప్రజలను వంచిస్తున్నారని మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌ దుయ్యబట్టారు. నారాయణఖేడ్‌కు పట్టణంలోని తహసీల్‌ మైదానంలో నిర్వహించి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ది మోసపూరిత చరిత్ర అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని సురేష్‌ షెట్కార్‌ పిలుపునిచ్చారు. 

 మంజీరను ఎడారి చేశారు: సంజీవరెడ్డి
ఉప ఎన్నికల్లో మంత్రి హరీశ్‌ నారాయణఖేడ్‌ ప్రాంత ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసగించారని టీపీసీసీ సభ్యుడు సంజీవరెడ్డి విమర్శించారు. 60ఏళ్ల కాలంలో చేయని అభివృద్ధి ఆరు నెలల్లో చేస్తానని  హామీలు ఇచ్చారని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంజీరా నీటిని సిరిసిల్లకోసం కేటీఆర్‌ మిడ్‌మానేరుకు తరలించారని ఆరోపించారు. మంజీరను ఎడారి చేశారన్నారు. మోసపూరిత టీఆర్‌ఎస్‌కు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement