మేమంతా సిద్ధం @ఏడో రోజు: ప్రజలతో సీఎం జగన్‌ మమేకం | CM YS Jagan Memantha Siddham Bus Yatra Day 7 Updates, Highlights | Sakshi
Sakshi News home page

మేమంతా సిద్ధం @ఏడో రోజు: ప్రజలతో సీఎం జగన్‌ మమేకం

Published Wed, Apr 3 2024 8:22 AM | Last Updated on Wed, Apr 3 2024 9:40 PM

memantha siddham bus yatra day 7 highlights CM ys jagan updates - Sakshi

Memantha Sidham Day 7 Highlights CM Jagan Bus Yatra Details

పూతలపట్టు బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగం

  • చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మన రక్తం తాగకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది.
  • ఒకటే తేదీన సూర్యుడు ఉదయించే ముందు వాలంటీర్లువ చ్చి పెన్షన్లు ఇచ్చేవారు.
  • పథకం ప్రకారం ఈసీకి తన మనిషి నిమ్మగడ్డతో లేఖ రాయించి వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకున్నారు
  • అవ్వాతాతలు పడుతున్న అగచాట్లు చూస్తుంటే చంద్రబాబు మనిషా, శాడిస్టా అనిపిస్తుంది
  • జగన్‌ వస్తేనే మళ్లీ వాలంటీర్లు వస్తారు.. ప్రతి పథకం మీ ఇంటికే వస్తుంది.

3 వేలు పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు

  • ప్రభుత్వంపై చంద్రబాబు, కూటమి ఎంత విషయం కక్కుతున్నారో ప్రజలు చూస్తున్నారు
  • 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే.
  • రైతు భరోసా పేరుతో రైతులకు నేరు 34,370 కోట్లు ఇచ్చాం .
  • ఉచిత పంటల భీమా కోసం రూ. 7,800 కోట్లు చెల్లించాం.
  • ఇన్‌పుట్‌ సబ్సిడీ పేరుతో రైతుకు రూ. 3,262 కోట్లు అందించాం.
  • 53 లక్షల మంది తల్లుల  అకంట్లలో అమ్మఒడిడి ద్వారా 26,067 కోట్లు ఇచ్చాం.
  • జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద 18 వేల కోట్లు ఇచ్చాం.
  • వైఎస్సార్‌ చేయుత కింద 39 ళక్షల మంది అక్క చెల్లెళ్లకు రూ. 19,182 కోట్లు అందించాం.
  • ఈబీసీ నేస్తం కింద 1,876 కోట్లు ఇచ్చాం.
  • కాపు నేస్తం కింద రూ. 2,029 కోట్లు ఇచ్చాం.
  • వైఎస్సార్‌ ఆసారా కింద 25, 571 కోట్లు.
  • ఆరోగ్య శ్రీ కింద 33  12463 కోట్లు ఖర్చు చేశాం.
  • సున్నా వడ్డీ కింద అక్క చెల్లెళ్లకు రూ. 4,969 కోట్లు ఇచ్చాం.
  • వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద రూ. 1,390 కోట్లు ఇచ్చాం.
  • 10 లక్షల మంది అగ్రి గోల్డ్‌ బాధితులకు రూ. 906 కోట్లు చెల్లించాం.
  • 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చాం

  • ఆరోగశ్రీని 25 లక్షలకు పెంచింది మీ జగన్‌ ప్రభుత్వం
  • ఏకంగా 2 లక్షల 70 వేల కోట్లను నేరుగా అకౌంట్‌లో వేసింది
  • మధ్యలో ఎ‍క్కడా జన్మభూమి లాంటి దళారులు లేరు.
  • మీరు వేసే ఓటు ఐదేళ్లు అంటే 1825 రోజులు మీ భవిష్యత్‌ వారి చేతుల్లో పెట్టినట్లే.
  • చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి
  • ఎవరి హయాంలో మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి
  • ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయని ఆలోచించుకోండి
  • చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తు వస్తుందా
  • 14 ఏళ్ల కాలంలో చంద్రబాబు మీ ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా?
  • రైతు భరోసా కేంద్రాలు నిర్మించింది ఎవరు?
  • ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్‌ మీడియాం తెచ్చిందెవరు?
  • విలేజ్‌ క్లీనిక్‌, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌ను ఏర్పాటు చేసింది ఎవరు?
  • ఇంటింటికీ పౌరసేవల్నీ డోర్‌డెలివరీ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది మీ జగన్‌
  • ఒకటో తేదీ ఆదివారమైనా సరే అవ్వాతాతలకు పెన్షన్లు అందించిన వాలంటీర్ల వ్యవస్థను తెచ్చింది మీ జగన్‌.

పూతలపట్టులో జన మహాసముద్రం కనిపిస్తోంది: సీఎం జగన్‌

  • ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం ప్రభుత్వం మంచి చేయడానికి ఉపయోగించుకుంది
  • ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు
  • జగన్‌కు, చంద్రబాబుకు యుద్ధం కాదు ఈ ఎన్నికలు
  • ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు, ప్రజలకు జరుగుతున్న ఎన్నికలు
  • ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షంలో ఉన్నాం
  • ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే.
  • ఒక్కడిపై పోరాటానికి ఇంతమంది వస్తున్నారు
  • మంచివైపు నిలబడి యుద్ధం చేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా..?
  • ధర్మాన్ని గెలిపించడానికి మీరంతాసిద్ధమా?

  • ఈ ఎన్నికల్లో మన ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
  • మంచి ఓ వైపు, చెడు మరోవైపు.. ధర్మం ఓవైపు అధర్మం మరోవైపున్నాయి.
  • ఓవైపు విశ్వసనీయత, మరోవైపు మోసం.. ఓవైపు నిజం, మరోవైపు అబద్దం
  • అబద్దం, మోసం, అన్యాయం, తిరోగమనం, చీకటిని రిటర్స్‌గిఫ్ట్‌గా ఇచ్చిన చంద్రబాబు మనముందే ఉన్నారు.
  • చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
  • పూతలపట్టు బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్‌

కాసేపట్లో పూతలపట్టు బైపాస్‌ వద్ద బహిరంగ సభ

  • ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం
  • సీఎం జగన్‌కు అడుగడుగునా జన నీరాజనాలు
  • కాసేపట్లో పూతలపట్టు బైపాస్‌ వద్ద బహిరంగ సభ
  • బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌

దామలచెరువులో సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం

  • వేలాదిగా తరలి వచ్చిన జన ప్రభంజనం
  • సుమారు 20 క్రేన్లతో భారీ గజమాలలు ఏర్పాటు చేసి సీఎంకు స్వాగతం

దామలచెరువు చేరుకున్న సీఎం జగన్‌

  • చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బస్సు యాత్ర
  • దామలచెరువు వద్ద పదుల సంఖ్యలో గుమ్మడికాయలతో దిష్టి తీసి సీఎంకు స్వాగతం పలికిన అక్కచెల్లెమ్మలు
  • ఎర్రటి ఎండల్లోనూ మేమంతా సిద్ధమంటూ సీఎం బస్సు యాత్రలో జన జాతర

షెడ్యూల్‌లో లేకున్నా.. ప్రజల కోసం.. 

  • కల్లూరులో స్థానిక ప్రజల కోరిక మేరకు షెడ్యూల్లో లేకున్నా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్లిన సీఎం జగన్‌

కల్లూరులో సీఎం జగన్‌కు ఘనస్వాగతం పలికిన జనం

  • మండుటెండలోను కదం తొక్కిన మహిళా లోకం
  • కల్లూరు ప్రధాన రహదారి పొడవునా సీఎం జగన్ను చూసేందుకు వెల్లువలా తరలివచ్చిన ప్రజలు

కల్లూరు చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

  • సీఎం జగన్‌కు భారీ సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు
  • జగనన్నకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
  • సీఎం జగన్‌కు హారతులు ఇచ్చిన అక్కా చెళ్లెమ్మలు
  • బస్సు  మీది నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం జగన్‌

నేను విన్నాను... నేను ఉన్నాను

  • పెరాలసిస్‌ బాధితుడికి సీఎం వైఎస్ జగన్ భరోసా
  • చిత్తూరు జిల్లా సదుం మండలం సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల క్రితం పెరాలసిస్‌కు గురయ్యాడు
  • ఇప్పటికే స్తోమతకు మించి, అప్పుల చేసి మరీ వైద్యం చేయించింది ముఖేష్ కుటుంబం
  • అంతంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న వారికి ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి
  • అతని వైద్యానికి మరో 15 లక్షలు అవసరం అవుతాయని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు
  • సీఎం వైఎస్ జగన్‌ను కలిస్తే తప్పక తమకు సహాయం దొరుకుతుందని నమ్ముతున్నామని ముఖేష్ తల్లి ఆశాభావం వ్యక్తం చేసారు.
  • మేమంతా సిద్ధం యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిసారు
  • సీఎం వైఎస్‌ జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకుని అతడి ఆరోగ్య పరిస్థితిని గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు
  • ముఖేష్ వివరాలను తీసుకోవాలని ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు
  • ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం జరిగి మామూలు మనిషి అవుతాడనే నమ్మకం కలిగిందని ఆ కుటుంబం నమ్మకంగా ఉంది
     

మతుకువారిపల్లె చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర

  • దారిపొడవునా సీఎం జగన్‌కు స్వాగతం పలికిన ప్రజానికం

చిత్తూరు జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది

  • దారిపొడవునా సీఎం జగన్‌కు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతున్నారు

సీఎం సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ నేత

  • మేమంతా సిద్ధం బస్సుయాత్రలో గంగాధరనెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం జగన్‌ సమక్షంలో వైఎ‍స్సార్‌సీపీలో చేరిన ముఖ్యనేత 
  • అమ్మగారిపల్లె స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ సీనియర్‌ నేత, 2019లో టీడీపీ తరపున గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎ. హరికృష్ణ. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు ఎ. హరికృష్ణ
  • కార్యక్రమంలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి

సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో కీలక నేతల చేరికలు

  • మేమంతా సిద్ధం బస్సుయాత్రలో కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరిన కీలక నేతలు.
  • అమ్మగారిపల్లె స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎం సుబ్రమణ్యంనాయుడు, కృష్ణమూర్తి, బేతప్పలు. 
  • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌

పార్టీ నేతలకు సీఎం జగన్‌ దిశా నిర్దేశం

  • అమ్మగారిపల్లె నైట్‌ స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ను కలిసిన అన్నమయ్య, చిత్తూరు జిల్లా చెందిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు
  • పలువురు పార్టీ నేతలు, సీనియర్‌ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ... యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్‌

సదుం సర్కిల్‌లో స్వాగత ఏర్పాట్లు...

  • సదుం సర్కిల్‌ స్వాగత ఏర్పాట్లు చేసిన వైఎస్సార్సీపీ నేతలు
  • భారీగా చేరుకున్న ప్రజలు, కార్యకర్తలు
  • తీన్మార్ డాన్స్‌లతో సందడిగా సదుం సర్కిల్

సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభం

  • చిత్తూరులో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
  • అమ్మగారిపల్లె నుంచి బయల్దేరిన సీఎం జగన్
  • సీఎం జగన్‌కు అమ్మగారిపల్లిలో భారీగా స్వాగతం పలికిన ప్రజానికం

  • సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకోనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
  • అనంతరం రంగంపేట క్రాస్‌ మీదుగా పూతలపట్టు బైపాస్‌కు చేరుకోనున్న బస్సు యాత్ర
  • సాయంత్రం పూతలపట్టు బైపాస్‌ వద్ద బహిరంగ సభ
  • బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్‌ జగన్‌
  • అనంతరం పి.కొత్తకోట, పాకాల క్రాస్‌, గదంకి, పనపాకం ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లిక్రాస్‌, చంద్రగిరి క్రాస్‌
  • రేణిగుంట మీదుగ గువరరాజుపల్లెకు చేరుకోనున్న బస్సు యాత్ర 
  • రాత్రికి గురవరాజుపల్లెలో సీఎం జగన్‌ బస

చిత్తూరు జిల్లాలో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

  • అమ్మగారిపల్లె  నుంచి మరికొద్ది సేపట్లో బయల్దేరానున్న సీఎం జగన్
  • సదుం సర్కిల్‌ స్వాగత ఏర్పాట్లు చేసిన వైఎస్సార్సీపీ నేతలు
  • భారీగా చేరుకున్న ప్రజలు, కార్యకర్తలు
  • తీన్మార్ డాన్స్‌లతో సందడిగా సదుం సర్కిల్


చిత్తూరు జిల్లా సిద్ధమా..?

  • ఏడో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చిత్తురులో కొనసాగనుంది
  • ‘చిత్తూరు జిల్లా సిద్ధమా...?’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు

ఏడో రోజు ‘మేమంతా బస్సు’ యాత్ర షెడ్యూల్‌:

  • నేడు చిత్తూరు జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
  • 7వ రోజుకు చేరుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్ర 
  • ఉదయం 9 గంటలకు పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం అమ్మగారిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు 
  • సదుం, కల్లూరు మీదుగా, చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో దామలచెరువు వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది
  • అనంతరం పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని తలుపులపల్లి మీదగా తేనెపల్లి చేరుకొని లంచ్ బ్రేక్ తీసుకుంటారు
  • అనంతరం తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా సాయంత్రం 3 గంటలకి పూతలపట్టు బైపాస్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగిస్తారు
  • సభ అనంతరం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజవర్గం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గాధంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి, చంద్రగిరి క్రాస్‌ వరకు  కొనసాగుతుంది
  • అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంట, గురవరాజుపల్లెకు చేరుకుని సీఎం జగన్‌ రాత్రి బస చేస్తారు

ఆరో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. సూపర్‌ సక్సెస్‌

  • అన్నమయ్య జిల్లాల్లో సీఎం జగన్‌కు భారీగా స్వాగతం పలికిన ప్రజానికం
  • దారి పొడవునా ప్రజలతో మమేకమైన సీఎం జగన్‌
  • పలువురి సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం
  • పార్టీలో చేరిన పలువురు నేతలు
  • మదనపల్లిలో మేమంతా సిద్ధం బహిరంగ సభకు పోటెత్తిన జనం 
  • ఎన్నికలకు మేమంతా సిద్ధం అంటూ నినాదించిన శ్రేణులు
  • సీఎం ప్రసంగిస్తూ బాబు పేరెత్తగానే శ్రేణుల్లో ఉత్సాహం
  • ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసిన సీఎం జగన్‌
  • మధ్యాహ్నం నుంచి సభ ముగిసే వరకు కార్యకర్తల్లో తగ్గని జోష్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement