YS Jagan Bus Yatra
-
YSRCP: మరో జైత్రయాత్రకు సిద్ధం
సాక్షి, గుంటూరు: ఒకవైపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి.. మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రజాప్రతినిధుల్ని ప్రజలతో మమేకం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో జైత్రయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట నాలుగు భారీ బహిరంగ సభలు, 22 రోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజా మద్దతు వైఎస్సార్సీపీకే ఉందని నిరూపించారాయన. ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారాయన. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభంఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు.. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండెపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో.. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్‌మ్యాప్‌కు వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం.ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయా సభల్లో తన పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల,మత,వర్గ, జాతి, రాజకీయ బేధాల్లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యలోనే ఆయన వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. -
ఈ యాత్ర వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు సంకేతం: సీఎం జగన్
-
Watch Live: టెక్కలి మేమంతా సిద్ధం సభ
-
ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన సీఎం జగన్ బస్సు యాత్ర
-
మేమంతా సిద్ధం యాత్రకు స్కాట్లాండ్ లో సంఘీభావం
-
శ్రీకాకుళంలో ధూమ్ ధామ్..!
-
శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ఎదురుదెబ్బ
శ్రీకాకుళం, సాక్షి: జనం అంతా జగన్ వెంటే.. మేమంతా సిద్ధం యాత్రతో ఈ విషయం మరోసారి స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే రాజకీయంగానూ అధికార పార్టీ మరింత బలపడుతోంది. కూటమికి షాకిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు.తాజాగా బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఉదయం ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో ప్రతిపక్షాలకు సంబంధించిన కొందరు నేతలు తమ అనుచరగణంతో సహా వైఎస్సార్సీపీలో చేరారు. వీళ్లలో పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు, అలాగే పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణిలు ప్రముఖంగా ఉన్నారు. పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు వైఎస్సార్సీపీలో చేరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీకి చెందిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు YSRCP కండువా కప్పుకున్నారు.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్, మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావులు వైఎస్సార్సీపీలో చేరారు.సీఎం జగన్ వాళ్లకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ నాయకత్వంలో ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధం అని ప్రకటించారు. -
జగన్ మార్కుతో సమాజం ‘సిద్ధం’: సీఎం వైఎస్ జగన్
సమాజంలో ప్రతి రంగాన్ని మీ బిడ్డ ప్రభుత్వం అధికారం దక్కిన మొదటి రోజు నుంచే ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించాలని కోరుతున్నా. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పులతో గ్రామస్థాయిలో వ్యవసాయ రంగం సిద్ధం! విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడి సిద్ధం! గ్రామస్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులతో గవర్నమెంట్ ఆస్పత్రి సిద్ధం! పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికీ సేవలందిస్తున్న వలంటీర్ల వ్యవస్థ సిద్ధం! ఏకంగా 1.35 లక్షల మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు, తమ్ముళ్లు దాదాపు 600 రకాల సేవలందిస్తూ మన గ్రామాల్లో సచివాలయాల్లో సిద్ధం! 58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధం! పట్టణాల్లో సైతం ఇంటింటికీ పౌరసేవలు సిద్ధం! దేశ చరిత్రలో తొలిసారిగా లంచాలు, వివక్ష లేకుండా రూ.2.70 లక్షల కోట్లు ఇంటింటికీ డోర్ డెలివరీ చేసిన వ్యవస్థ సిద్ధం! ఒకటో తేదీనే ఇంటికే వచ్చి రూ.3,000 పెన్షన్ ఇచ్చే వలంటీర్ల వ్యవస్థ సిద్ధం! ఇదీ మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. – సీఎం జగన్ సాక్షి, శ్రీకాకుళం: ‘‘ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు సిక్కోలు సింహాలు ఇవాళ ఇక్కడకు కదలివచ్చాయి. ఈ విప్లవ గడ్డపై ఆ పెత్తందార్ల ముఠాపై ఎగురవేస్తున్న తిరుగుబాటు బావుటా కనిపిస్తోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా జన సముద్రమే. వైఎస్సార్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడవునా జన సునామీని చూస్తుంటే 25 ఎంపీలకు 25 ఎంపీలు, 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు మొత్తంగా డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా?’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. 22 రోజుల పాటు సాగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం అక్కవరం వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ..బలమైన పునాదులతో..ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తెచ్చిన పలు సంస్కరణలు, పథకాలు కొనసాగాలా? వద్దా? అనేది నిర్ణయించే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేయమంటే పథకాలన్నింటికీ ముగింపే. మళ్లీ మోసపోవటమే. జగన్‌ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం తలపడుతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్రగానీ, పేదల ఆశీస్సులుగానీ లేని ఆ మూడు పార్టీల కూటమి, వారి మోసాలకు చెంప ఛెళ్లుమనేలా సమాధానం చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? కుటుంబంతో చర్చించండిసినిమాకు వెళ్లినప్పుడు హీరో ఎందుకు నచ్చుతాడు? విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి ఆలోచించండి. గుణగణాలు, మంచితనం వల్ల మా హీరో అని అనుకుంటాం. మోసాలు, అబద్ధాలు, కుట్రలు పన్నే క్యారెక్టర్‌ను విలన్ అంటాం. నిజ జీవితంలో, రాజకీయాల్లో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరంతా ఇంటికి వెళ్లాక కాసేపు కుటుంబ సభ్యులతో కూర్చుని నింపాదిగా మాట్లాడండి. చిన్నపిల్లల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. అవ్వాతాతలు, ఆడపడుచుల అంతరంగాన్ని గమనించండి. ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందనే నమ్మకం కలుగుతుందో వారితోనే అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నా. మీ గుండె చప్పుడే ‘‘సిద్ధం’’పొత్తుల జిత్తులు, జత కట్టిన జండాలకు బదులిస్తూ జగన్ వెనుక ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే.. సిద్ధం! సామాన్యులు, పేదల గుండె చప్పుడే ఈ సిద్ధం. ఇడుపులపాయలో మొదలై ఇచ్ఛాపురం వరకు సాగిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్రయాత్రకు సంకేతం. ఇది మూడు నాలుగు నెలల క్రితం మొదలు పెట్టింది కాదు. ఓ 25 సభలతో వచ్చింది కాదు. మనందరి ప్రభుత్వం 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తెస్తూ చేస్తున్న యుద్ధమే ఈ సిద్ధం. ఆ చైతన్యం పేరే..ఇక్కడ నిర్వహిస్తున్న సభ పేరు మాత్రమే కాకుండా మరో ఐదేళ్లు ఈ మార్పులన్నీ కొనసాగాలని ఇంటింటికీ వెళ్లి వారు మరో వంద మందికి వివరించాల్సిన అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం! మీకు మంచి జరిగి ఉంటే.. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవాలని ప్రజలను కోరే ధైర్యమే సిద్ధం! ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుటలో పారేసే చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి 99 శాతం వాగ్దానాలను నెరవేర్చి ఇంటింటికీ మళ్లీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాలపై చేసిన చైతన్యం పేరే సిద్ధం!పేదలు, అక్కచెల్లెమ్మలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా సాధికారత దిశగా చెయ్యి పట్టుకుని నడిపించే ఘటమే ఈ సిద్ధం! ఇంతగా సిద్ధమైన సమాజంతో, మీ జగన్ పార్టీతో యుద్ధానికి బాబు మరో మూడు పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తోంది. పరోక్షంగా కూడా పొత్తులు వెతుక్కోవాల్సి వస్తోంది. కుట్రలకు దిగజారాల్సి వస్తోంది. నాలుగు మంచి పనులు చేశానని చెప్పలేని చంద్రబాబు రోజూ నన్ను తిట్టడం, తిట్టించడం, వారి ఛానళ్లు, పత్రికల్లో అదో ఘనకార్యమన్నట్లుగా చూపిస్తున్నారు. ఇది గొప్ప రాజకీయం అవుతుందా? మన అభ్యర్థులను ఆశీర్వదించండిఎంపీ అభ్యర్థి తిలక్, టెక్కలి నుంచి శ్రీను, ఆమదాలవలస నుంచి తమ్మినేని సీతారామ్, పలాస నుంచి డాక్టర్ అప్పలనాయుడు, పాతపట్నం నుంచి శాంతమ్మ, ఇచ్చాపురం నుంచి విజయమ్మ, నర్సీపట్నం నుంచి ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావును ఆశీర్వదించి గెలిపించాలని కోరుతున్నా. ఏనాడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా?మన ప్రభుత్వం వల్ల పేదల కుటుంబాల్లో, వారి చదువుల్లో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, అవ్వాతాతలకు అందిన మనశ్శాంతిలో, రైతన్నలకు అందిన ఆత్మస్థైర్యంలో, సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మగౌరవంలో ఎంత మార్పు తీసుకురాగలిగామో టీడీపీ, చంద్రబాబు, ఆయనకు దరువు వేసే ఎల్లో మీడియా ఏనాడైనా కనీసం ఆత్మవిమర్శ చేసుకోవడం చూశారా? ఇలాంటి వారికి పరిపాలన ఇవ్వడం అంటే అర్థమేమిటి? ప్రభుత్వం అనేది ఎవరి కోసం? అందమైన వాగ్ధానాలతో అధికారం లాక్కుని ఐదేళ్లు వంచించటానికి, లూటీ చేసి దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, దాచుకోవడం కోసమే వారికి అధికారం కావాలని అడుగుతున్నారు. బాబు రోల్డ్ గోల్డ్ దుకాణం..మీ బిడ్డ కరోనా కష్టంలో కూడా సాకులు వెతుక్కోలేదు. ఏ ఒక్క పథకాన్నీ, బటన్లు నొక్కటాన్ని ఆపలేదు. పేదవారి కష్టం తన కష్టం కంటే ఎక్కువని భావించాడు. మీ జగన్ స్వచ్ఛమైన మనసుతో, మంచి చేశాననే ఆత్మవిశ్వాసం, ఆత్మ సంతృప్తితో మీ ముందు సవినయంగా తలెత్తుకుని నిలబడ్డాడు. 2014 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలనూ మేనిఫెస్టోలో మీ బిడ్డ చెప్పలేదు. రాష్ట్ర ప్రజలు, నమ్ముకున్న వారిని ఎన్నటికీ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్డ్ గోల్డ్ దుకాణం తెరవడు.దాన్ని బంగారం అని నమ్మించే యత్నం చేయడు. చంద్రబాబు నిర్వహించే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. 14 ఏళ్లు అధికారంలో ఉండీ ఏ ఒక్క మంచి పని చేయని చంద్రబాబుతో మీ బిడ్డ పోటీ పడడు. మీ జగన్ మార్కు ఇవాళ ప్రతి పేద ఇంట్లోనూ కనిపిస్తుంది. ప్రతి అక్కచెల్లెమ్మ చిరునవ్వులో, అవ్వాతాతల ఆనందంలో, పిల్లల ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. జగన్‌కు పేదలపై ఉన్నంత ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికీ లేదు, ఉండదు. ఇది నిజం. ఇది మాత్రమే నిజం. ఇదీ చదవండి: యువనేత జైత్రయాత్ర!నావల్ల కానిది బాబు జేజమ్మ కూడా చేయలేదు..జగన్ చేయలేని ఏ స్కీమ్‌నూ చంద్రబాబు కాదు కదా.. ఆయన జేజమ్మ కూడా చేయలేదు! మోసాలు, అబద్ధాలతో ఏ స్థాయికైనా దిగజారి పొత్తులు పెట్టుకునే ఆయనతో మీ బిడ్డ పోటీ పడలేడు. నిజాలు, నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం నాకుంది. బాబు మాదిరిగా నేను మోసపూరిత వాగ్దానాలు చేయను. మోసాన్ని మోసంతోనే జయించాలన్న రాజనీతిని మీ బిడ్డ పాటించడు. మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చని నిరూపించటానికి మీ బిడ్డ సిద్ధం. మరి మీరంతా కూడా సిద్ధమేనా? మోసాలా.. విశ్వసనీయతా? మీకు ఎలాంటి నాయకుడు కావాలని అందరినీ అడుగుతున్నా. బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా? మేనిఫెస్టోలో చెప్పేవన్నీ ఎగ్గొట్టే నాయకుడు అబద్ధాలు, వెన్నుపోట్లు నైజంగా కలిగిన నాయకుడు కావాలా? లేక నోటి నుంచి ఒక మాట వస్తే, మేనిఫెస్టోలో చేరిస్తే తు.చ. తప్పకుండా పాటించే జగన్ లాంటి నాయకుడు కావాలా? సొంత బలం లేక పొత్తుల డ్రామాలాడే నాయకుడు కావాలా? లేక చేసిన మంచిని చూపిస్తూ సింహంలా సింగిల్‌గా వచ్చే నాయకుడు కావాలా? మోసాలు చేసే చంద్రబాబు కావాలా? విశ్వసనీయతతో నిలబడే జగన్ కావాలా? తమ నాయకుడి గురించి కాలర్ ఎగరేసి గర్వంగా ఇంటింటికీ చెప్పుకోగలిగిన మీ బిడ్డ కావాలా? చెప్పిన మాటలు గాలికి వదిలేసే బాబు కావాలా? వ్యత్యాసాన్ని తుడిచి వేస్తూ..పిల్లలెవరకూ తమ కులం, మతం, ఆర్థిక పరిస్థితుల వల్ల మంచి చదువులు చదువుకోలేకపోయామని బాధపడేందుకు వీల్లేని సమ సమాజాన్ని మీ బిడ్డ నిర్మిస్తున్నాడు. ధనికులు, పేదలకు వేర్వేరు చదువులు అనే వ్యత్యాసాన్ని మీ బిడ్డ తుడిచి వేస్తున్నాడు. ఒక రైతు, ఒక కూలీ, చిరువ్యాపారి, పేద కుటుంబం, నిరుపేద సామాజిక వర్గం.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని, ఆ మంచిని కొనసాగిస్తుందనే నమ్మకాన్ని ఇవ్వగలిగే పరిపాలనను 58 నెలలుగా అందిస్తున్నాడు. వ్యవస్థలు బాగుండాలంటే..మోసాలు, అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమైతే వారి చీకటి యుద్ధాన్ని, ఆ ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సెల్ఫోన్లలో టార్చిలైట్లను వెలిగించండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదలకు పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలనతో ముందుకు పోవాలన్నా, మన వ్యవస్థలన్నీ బాగుండాలన్నా ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లోనూ గొప్ప మెజార్టీతో గెలిపించాలి. బలమైన పునాదులతో..ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగనున్నాయి. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తెచ్చిన పలు సంస్కరణలు, పథకాలు కొనసాగాలా? వద్దా? అనేది నిర్ణయించే ఎన్నికలు. జగన్‌కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేయమంటే పథకాలన్నింటికీ ముగింపే. మళ్లీ మోసపోవటమే. జగన్‌ను ఓడించాలని వాళ్లు.. పేదలను గెలిపించాలని మనం తలపడుతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్రగానీ, పేదల ఆశీస్సులుగానీ లేని ఆ మూడు పార్టీల కూటమి, వారి మోసాలకు చెంప ఛెళ్లుమనేలా సమాధానం చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? కుటుంబంతో చర్చించండిసినిమాకు వెళ్లినప్పుడు హీరో ఎందుకు నచ్చుతాడు? విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి ఆలోచించండి. గుణగణాలు, మంచితనం వల్ల మా హీరో అని అనుకుంటాం. మోసాలు, అబద్ధాలు, కుట్రలు పన్నే క్యారెక్టర్‌ను విలన్ అంటాం. నిజ జీవితంలో, రాజకీయాల్లో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరంతా ఇంటికి వెళ్లాక కాసేపు కుటుంబ సభ్యులతో కూర్చుని నింపాదిగా మాట్లాడండి. చిన్నపిల్లల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి. అవ్వాతాతలు, ఆడపడుచుల అంతరంగాన్ని గమనించండి. ఎవరి పాలనలో మంచి జరిగింది? ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందనే నమ్మకం కలుగుతుందో వారితోనే అడుగులు ముందుకు వేయాలని కోరుతున్నా. 2014లో చంద్రబాబు ముఖ్యమైన మోసాలివీ..► రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? ► పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా?► ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా?► ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఒక్కరికైనా ఇచ్చాడా?► అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా?► రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్‌లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా?► మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ► సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ► ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. కట్టాడా? టెక్కలిలో లేదా శ్రీకాకుళంలో ఏమైనా కనిపిస్తోందా? ► ముఖ్యమైన హామీలంటూ ఒక్కటైనా నెరవేర్చాడా? ► పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే అదీ లేదు.► ఇప్పుడు సూపర్ సిక్స్, సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్ అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. -
అడుగడుగునా జన నీరాజనం
-
22 రోజులు.. 2100 కిలోమీటర్లు.. ముగిసిన సీఎం జగన్ బస్సు యాత్ర
CM Jagan Memantha Siddham Bus Yatra Live Updates..నేటితో ముగిసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర22 రోజులు పాటు 2100 కిలోమీటర్ల మేర సాగిన బస్సు యాత్రఈ యాత్రలో 16 బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం జగన్6 ప్రత్యేక సమావేశాలకు హాజరయిన సీఎం జగన్9 చోట్ల భారీ రోడ్ షోల్లో పాల్గొన్న సీఎం జగన్ ఇడుపులపాయలో ప్రారంభమై 86 నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సు యాత్రఅక్కవరం ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగంఅక్కవరంలో సిక్కోలు సింహాలు కనిపిస్తున్నాయి.అక్కవరం, శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లాలో జనసముద్రం కనిపిస్తోంది.సిక్కోలు జనం సింహాల్లా కదిలివచ్చారుజగన్కు ఓటేస్తే పథకాలన్నీ ముందుకేచంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేమూడు పార్టీల కూటమి మెసాలకు చెంపచెళ్లు మనేలా సమాధానం చెప్పాలిఇవి ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కాదు.పేద ప్రజల గుండెచప్పుడే ఈ సిద్ధం సభ.ఈ యాత్ర వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు సంకేతంఇక్కడి జనసునామి చూస్తుంటే 25కు 25 ఎంపీలు, 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం ఖాయం.రాయలసీయ నుంచి ఉత్తరాంద్ర వరకు జన సునామీ చూశాంసంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది.విద్యా, వైద్య, ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకువచ్చాం.గ్రామ స్వరాజ్యంతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగులు నింపాం.పేద ధనిక విద్యార్ధులకు ఒకే రకమైన విద్యను అందిస్తున్నాం.పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారు.కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలిమరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు సిద్ధమేనా?జగన్ వెనుక ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే సిద్ధంవిప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్య, ఆరోగ్య రంగంలో మార్పులతో ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంఇంటింటికీ సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలు సిద్ధంలక్షా 35 వేల మంచి ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు సిద్ధంగ్రామస్వరాజ్యం సిద్ధం, పట్టణాల్లో ఇంటింటికీ పౌరసేవలు సిద్ధం1వ తేదీ ఇంటికే వచ్చే రూ.3 వేలు పింఛను సిద్ధంమీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండని అడిగే ధైర్యమే సిద్ధంమరో 18 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయిమేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చాంపొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారుమంచి పనులు చేసానని చంద్రబాబు చెప్పుకోలేడు...అందుకే నన్ను తిట్టడమే చంద్రబాబు పనిఇదొక రాజకీయం అవుతుందా చంద్రబాబూజతకట్టిన జెండాలకు సరైన సమాధానం చెప్పాలిఅబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారుదోచుకోవడం, పంచుకోవడమే వారి అలవాటుచంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వనుబాబులాంటి మోసగాడు కావాలా?.. జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా?చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదు2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు.. చేశాడా?ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?సింగపూర్‌ను మించి అభిృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుందిఇప్పుడు సూపర్ 6 అంటూ చంద్రబాబు వస్తున్నాడు..ఇంటికి బంగారం, బెంజ్ కారు అంటున్నాడు..నమ్ముతారా?ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్నికాపాడేందుకు మీరంతా సిద్ధమామీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోంది58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధంవిద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాస్పత్రులు సిద్ధంఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం..600లకుపైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధంమంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి..మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం..అక్కాచెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా ఉన్నాం..కరోనా కష్టకాలంలోనూ ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం..చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. అక్కాచెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది..మాట మీద నిలబడే మీ జగన్ కావాలా?మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండిశ్రీకాకుళం జిల్లాలో అడుగడుగునా సీఎం జగన్ బస్సు యాత్రకు జననీరాజనందారిపొడవునా జై జగన్ అంటూ నినాదాలుదారి పొడవునా సీఎం జగన్ బస్సు యాత్రకు మహిళల హారతులుఅభిమాన నేత కోసం ఎండను సైతం లెక్క జేయకుండా తరలివస్తున్న జనం చిన్నారి చికిత్సకు సాయం.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు►అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్►ఆరోగ్య శ్రీ ద్వారా తన కుమారుడు త్రిషాన్కు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించి.. కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్►చిన్నారి త్రిషాన్ ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి►2022 జూలై 18న కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ జరిగిందని సీఎంకు చెప్పిన శ్రీధర్►కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత తన కుమారుడు త్రిషాన్ వినగలుగుతున్నాడని.. చిన్న చిన్న పదాలు కూడా పలుకుతున్నాడని ఆనందంగా సీఎంకి చెప్పిన శ్రీధర్► నరసన్నపేటకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర►ఆముదాలవలస ఫ్లై ఓవర్ చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర. ►ఎచ్చెర్ల చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర►చిలకపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర►అక్కివలస నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం►శ్రీకాకుళం సిద్ధమా?. శ్రీకాకుళం జిల్లా సిద్ధమా..? #MemanthaSiddham— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2024 ►వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజైన బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది. Memantha Siddham Yatra, Day -22.ఉదయం 9 గంటలకు అక్కివలస రాత్రి బస నుంచి ప్రారంభంసాయంత్రం 3:00 గంటలకు టెక్కలి వద్ద బహిరంగ సభ#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/U5fyZ9Vt5d— YSR Congress Party (@YSRCParty) April 24, 2024 ►బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. కాగా, నేటితో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగియనుంది. ►ఇక, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకొని.. 3 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఉత్తరాంధ్రలో జగనన్న జన ప్రభంజనం✊🏻Memantha Siddham Yatra, Day -21.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/axMpaCHQ68— YSR Congress Party (@YSRCParty) April 23, 2024 -
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజైన బుధవారం(ఏప్రిల్ 24) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకొని.. 3 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
మీ డ్రీమ్సే.. నా స్కీమ్స్: సీఎం వైఎస్ జగన్
ఊరు కలలనూ నెరవేర్చాం..ఊరికి కూడా కలలుంటాయి. గ్రామంలో అందే సేవలు బాగుంటేనే తమ ఊరు బాగుంటుందని.. ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్లిపోరని.. గ్రామానికి కూడా కల ఉంటుంది. ఆ గ్రామం డ్రీమ్ కోసం మీ జగన్ ఎన్ని స్కీమ్‌లు తెచ్చాడో తెలుసా? ఏకంగా ఏడు స్కీమ్‌లు తెచ్చాడు. ఆ గ్రామంలోనే కనిపిస్తాయి సచివాలయాలు, 60–70 ఇళ్లకో వలంటీర్ వ్యవస్థ, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, నాడు–నేడుతో మారిన ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, మహిళా పోలీసు వ్యవస్థ కనిపిస్తాయి. వీటితోపాటు నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్.. ఇవన్నీ మీ గ్రామాల్లోనే కనిపించే జగన్ మార్కు విప్లవాత్మక మార్పులు. గ్రామాలే కాకుండా రాష్ట్రం కలలను కూడా సాకారం చేస్తూ విప్లవాత్మక చర్యలు చేపట్టాం. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘‘డ్రీమ్స్ మీవి.. స్కీమ్స్ మీ బిడ్డ జగన్‌వి! ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం కలలను నెరవేరుస్తూ విప్లవాత్మక పథకాలు, వ్యవస్థలు తీసుకొచ్చాం. 58 నెలల పాలనలో మీ అందరి కలలను నెరవేర్చిన ప్రజా ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కాలి’’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. మంగళవారం సాయంత్రం విజయనగరం జిల్లా చెల్లూరు వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘చెల్లూరు సభ జనసముద్రాన్ని తలపిస్తోంది. ఒక్కసారిగా లక్షల మంది తాండ్ర పాపారాయుళ్లు శత్రుసైనాన్ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమైతే, ఆ యుద్ధం ఎలా ఉంటుందో పేదల వ్యతిరేకులకు రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర, నా విజయనగరం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతున్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, తమ పిల్లల భవిష్యత్తును రాబోయే ఐదేళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలంతా గుర్తించారు. వారికి అడ్డుతగులుతున్న ఆ పెత్తందార్లకు, ఆ కౌరవ సైన్యానికి, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తున్న ప్రజాసైన్యం ఈ రోజు నా కళ్ల ఎదుట కనిపిస్తోంది. చంద్రబాబుకు కాంగ్రెస్, బీజేపీ పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతిస్తున్నాయి. ఇదే బాబుకు తోడుగా దత్తపుత్రుడున్నా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయి. వాళ్లు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అబద్ధాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతున్నారు. జగన్ కనుక ఇంటింటికీ మంచి చేయకపోయి ఉంటే, జగన్‌ను ప్రతీ ఇంట్లోనూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ్ముడిగా భావించకపోతే ఇన్ని తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది? జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం మీరే అని సగర్వంగా చెబుతున్నా. 58 నెలల పాలనలో ఇంటింటికీ చేసిన మంచి నా నమ్మకం. ప్రతీ వర్గాన్ని మోసం చేసిన వారితో ఈరోజు ఎన్నికల కురుక్షేత్రంలో తలపడుతున్నాం. జగన్‌ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించి ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? ప్రజల కలల్ని తన మోసాలతో వంచించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు, ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? 420.. చంద్రముఖి బృందం వస్తువులు ఎత్తుకుపోయేవారని దొంగల ముఠా అంటాం. బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠా అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి ఆ ప్రజలు ఇచ్చిన అధికారంతో ఐదేళ్లూ మోసం చేసిన చరిత్ర ఉన్న కూటమిని ఏమనాలి? తియ్యటి మాటలు మేనిఫెస్టోలో చెప్పి ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రజల్ని మోసం చేసేవారిని ఏమంటాం? 420 అనే కదా అంటారు. పేదల కలల్ని, బతుకుల్ని బలిపెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాం. చంద్రబాబు అంటే చంద్రముఖి... తల్లుల కలలు, బాధల గురించి 14 ఏళ్లు పాలించానని చెప్పుకునే చంద్రబాబు ఏరోజైనా ఆలోచన చేశాడా? ఆయనకు ఆ ఆలోచన ఎందుకు రాలేదంటే కారణం.. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాకుండా పేదల రక్తం తాగేందుకు లకలకా అని తపిస్తాడు. కలలను నెరవేర్చిన స్కీములు... ఏ అక్కచెల్లెమ్మ అయినా ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటుంది. పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, కుటుంబం మరింత బాగుండేలా రెండు మెట్లు ఎదగాలని కలగంటుంది. చంద్రబాబు మాటలు నమ్మి 2014 నుంచి 2019 మధ్య కుదేలయిపోయిన పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల సాధికారత, మళ్లీ వాళ్లను తమ కాళ్ల మీద తమను నిలబెట్టేందుకు వారి డ్రీమ్స్‌ను సాకారం చేస్తూ వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాలు పుట్టాయి. 45 – 60 సంవత్సరాల వయసున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆత్మగౌరవంతో జీవించేలా చేసేందుకు పుట్టింది వైఎస్సార్ చేయూత పథకం. నా కాపు అక్కచెల్లెమ్మల కోసం తెచ్చిన మరో పథకం వైఎస్సార్ కాపు నేస్తం. ఈబీసీ అక్కచెల్లెమ్మల కోసం వైఎస్సార్ ఈబీసీ నేస్తం అనే పథకం. తెచ్చాం. చంద్రబాబు హయాంలో ఏరోజూ ఇలాంటి స్కీములు ఎందుకు లేవు? నాడు ఉన్నదల్లా అక్కచెల్లెమ్మలను మోసం చేయడం, రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రమే. అక్కచెల్లెమ్మల సొంతింటి కల... తమకు సొంత ఇల్లు ఉండాలని ప్రతి అక్కచెల్లెమ్మ కల కంటుంది. కొన్ని కుటుంబాలకు ఇది జీవితకాల కల లాంటిది. వారి డ్రీమ్‌ను నెరవేరుస్తూ 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మీ బిడ్డ జగన్ ఇచ్చాడు. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. భావోద్వేగానికి గురైన మంత్రి బొత్స... చీపురుపల్లి అభ్యర్ధిగా మంత్రి బొత్స సత్యనారాయణను సీఎం జగన్ పరిచయం చేసిన సందర్భంలో ఉద్వేగ వాతావరణం నెలకొంది. బొత్స తనకు తండ్రి లాంటివారని, ఆయన్ను ఆప్యాయంగా అన్నా అని పిలుస్తానని సీఎం జగన్ చెప్పడంతో బొత్స భావోద్వేగానికి గురయ్యారు. అవ్వాతాతలు.. రైతుల కలలు నెరవేర్చాం ► అవ్వా తాతల డ్రీమ్ ఏమిటో తెలుసా? బాబు హయాంలో మాదిరిగా పెన్షన్ల కోసం క్యూలో నిలబడి తమ ప్రాణాలు అక్కడికక్కడే పోయే పరిస్థితి రాకూడదన్నది వారి డ్రీమ్. ఆ పెన్షన్ సొమ్ము కాస్తంత పెంచి ఇస్తే బాగుంటుందన్నది డ్రీమ్. వారి మనవడు జగన్ తెచ్చిన స్కీమ్ ఏమిటంటే అవ్వాతాతల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ వలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి రూ.3 వేల పెన్షన్ ఇవ్వడం. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. నాడు చంద్రబాబు ముష్టి వేసినట్లు రూ.వెయ్యి రాష్ట్రంలో 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. ► మీ బిడ్డ వచ్చాక ఇంటివద్దే నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నాడు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 58 నెలల కాలంలో 2.31 లక్షల ఉద్యోగాలు యువతకు ఇచ్చి వారి కలను సాకారం చేశాం. రైతన్నలు కోరుకున్నట్లుగా పంట వేసే సమయానికి పెట్టుబడి సాయం, సమయానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామంలోనే అందచేస్తున్నాం. అమూల్‌ను తెచ్చి పాడి రైతులకు అండగా నిలిచాం. ఏకంగా 35 లక్షల ఎకరాల భూముల మీద రైతులకు పూర్తి హక్కులు ఇచ్చిందీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. మరి రైతుల గురించి చంద్రబాబు ఏరోజైనా ఆలోచించాడా? నాడూ నేడూ ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్. కానీ చంద్రబాబు హయాంలో డీబీటీలు, బటన్లు నొక్కడం లేవు. మీ పొలాలలో పెట్టే దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చేమో గానీ చంద్రబాబును మాత్రం నమ్మలేమని గుర్తు పెట్టుకోండి. విజయవాడలో కాల్‌మనీ, సెక్స్ రాకెట్లు నడపటం మినహా బాబు చేసిందేమిటి? మళ్లీ ప్రజల రక్తం తాగడానికి చంద్రముఖిలా మారాడు. జనానికి మంచి చేసిన మీ జగన్‌పై తోడేళ్లలా దాడి చేస్తున్నారు. మన 58 నెలల పాలనలో జరిగిన మేలుపై మీ కుటుంబమంతా చర్చించుకోవాలి. పిల్లలు, సంక్షేమ పథకాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఏకంగా 40 పథకాలు.. ఏ మనిషికైనా, ఏ కుటుంబానికైనా కొన్ని కలలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని నిజం చేసే మార్గాలు ఉంటే ఆ కుటుంబం ఒక్కో మెట్టు ఎదుగుతూ పోతుంది. అలాంటి పేదల కలల్ని అర్ధం చేసుకుని నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? దాదాపుగా 40. ఈ 58 నెలల కాలంలో వాటిని నెరవేర్చేందుకు మీ బిడ్డ ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కాడు. ఏకంగా రూ. 2.70 లక్షల కోట్లు నేరుగా అందజేశాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాయి. ఎక్కడా లంచాలు, వివక్ష లేదు. దీనికి తోడు నాన్ డీబీటీ అంటే ఇళ్లస్థలాలు, విద్యాకానుక, టాబ్స్... ఇవన్నీ కలిపి మరో రూ.లక్ష కోట్లకుపైగా ప్రయోజనాన్ని చేకూర్చాం. ఇలా వాళ్ల డ్రీమ్స్.. మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా రూ. 3.75 లక్షల కోట్లు పై చిలుకు లబ్ధి చేకూర్చాడని చెప్పడానికి గర్వపడుతున్నా. విద్యా విప్లవం.. ప్రతి నిరుపేద తల్లి కలను నిజం చేయడానికే పుట్టింది జగనన్న అమ్మఒడి పథకం. పేద తల్లులు తన పిల్లల భవిష్యత్తు కోసం కనే కలలు గురించి అర్థం చేసుకున్నాను. తమ పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా, పెద్ద కంపెనీల్లో ఉద్యోగస్తులుగా చూడాలని, ఉన్నత చదువులు చదివించాలన్న కలల నుంచి పుట్టిన స్కీములతో నాడు – నేడు, ఇంగ్లిష్ మీడియం బడులు, సీబీఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేశాం. 3వ తరగతి నుంచి గవర్నమెంట్ బడుల్లో టోఫెల్ శిక్షణ, సబ్జెక్టు టీచర్లు, బైజూస్ కంటెంట్, 6వ తరగతి నుంచి డిజిటల్ బోధన, క్లాస్ రూముల్లో ఐఎఫ్‌పీ ప్యానళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టాం. పెద్ద చదువులు చదువుతున్న 93 శాతం మందికి ఈ రోజు విద్యాదీవెనతో లబ్ధి చేకూరుతోంది. డిగ్రీ కరిక్యులమ్‌లో మార్పులు తీసుకొస్తూ, విదేశీ విశ్వవిద్యాలయాల్లో సర్టిఫైడ్ ఆన్ లైన్ వర్టికల్స్‌ను మన డిగ్రీలతో అనుసంధానం చేయడం, డిగ్రీలో తప్పనిసరి ఇంటర్న్‌షిప్ తెచ్చాం. ఇవన్నీ నా అక్కచెల్లెమ్మలు, ఆ పిల్లల డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్. అత్యధిక మెజార్టీతో గెలిపించండి... విజయనగరం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పరిచయం చేశారు. ఎంపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి, బొబ్బిలి అసెంబ్లీ అభ్యర్థిగా శంబంగి చిన అప్పలనాయుడు,. నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు, రాజాం నుంచి పోటీచేస్తున్న డాక్టరు తలే రాజేష్, గజపతినగరం నుంచి పోటీచేస్తున్న బొత్స అప్పలనరసయ్య, ఎచ్చెర్ల నుంచి పోటీచేస్తున్న గొర్లె కిరణ్‌ను గొప్ప మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. 2014లో ‘చంద్రముఖి’ మోసాలివీ.. ► రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందా? ► పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ► ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశారా? ► ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా? ► అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా? ► రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్‌లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి అయ్యాయా? ► మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? ► సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. చేశాడా? ► ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి నిర్మించాడా? విజయనగరంలో ఏమైనా కనిపిస్తోందా? ► పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే అదీ లేదు. ► ఇప్పుడు సూపర్ సిక్స్, సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్ అంటూ మళ్లీ మోసాలకు తయారయ్యారు. -
చంద్రబాబు హయాం అంతా.. మోసం,మోసం, మోసం
-
2014 లో ప్రదర్శించిన చంద్ర "కళలు" చూద్దామా..!
-
నా తండ్రి లాంటి వారు ఎమోషనల్ అయిన బొత్స
-
అక్క చెల్లమ్మలకు జగనన్న విజ్ఞప్తి..!
-
వీళ్ళే మన అభ్యర్థులు .. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
చంద్రబాబు అంటే చంద్రముఖి: వైఎస్ జగన్
-
నా ప్రతి ఇంటి ఆడపడుచు, నా తల్లి ఒక కల కంటుంది..!
-
లక్షల మంది తాండ్ర పాపారాయుడులు
-
చంద్రబాబు పాలన రక్తాన్ని పీల్చే పాలన.. బాబుపై సీఎం జగన్ సెటైర్లు
-
కూటమికి కొత్త పేరు పెట్టిన సీఎం జగన్..!
-
ఆ దేవుడు శాశిస్తాడు మీ జగన్ పాటిస్తాడు...!
-
అలాంటి మోసగాళ్లను ఏమంటాం.. 420లు అంటాం
-
నారా సైన్యానికి బుద్ధి చెప్పటానికి ప్రజా సైన్యం సిద్ధం..!
-
ప్రజల అండతో సీఎం జగన్.. ఇతర పార్టీల అండతో చంద్రబాబు
-
ర్యాంప్ పై నడుస్తూ ప్రజలకు అభివాదం
-
సీఎం జగన్ డైనమిక్ ఎంట్రీ
-
Watch Live: మేమంతా సిద్ధం చెల్లూరు సభ (విజయనగరం జిల్లా)
-
రేపు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్ ఇలా..
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22 రోజు షెడ్యూల్‌ను సీఎంఓ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనతో సీఎం జగన్ బస్సు యాత్ర ముగియనుంది. యాత్రలో భాగంగా ఉదయం 9 గంటలకు అక్కివలస(రాత్రి బస చేసిన ప్రాంతం) నుంచి బయల్దేరుతారు. ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరుశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరుశురాంపురం జంక్షన్ వద్ద సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకుబయల్దేరుతారు. 4.20 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.20 గంటల వరకు సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి అక్కవరం హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో విశాఖపట్నం విమాశ్రయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 6.15 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. 6.30 గంటలకు విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. 7.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టునుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు. చదవండి: మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలన్న: YSRCP సోషల్ మీడియా వింగ్ జనమే సైన్యంగా సంక్షేమసారథి యాత్ర సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు. 43 నుంచి 45 డిగ్రీల మండుటెండల్లోనూ.. రాత్రి పొద్దుపోయినా సీఎం జగన్‌ను చూసేందుకు ప్రజలు ఆరాటపడుతున్నారు. సీఎం జగన్‌ను దగ్గరి నుంచి చూసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే ఫోటో దిగేందుకు బస్సు వెంట పరుగులు తీస్తున్నారు. అడుగడుగునా జనంతో మమేకమవుతూ.. బాధితులకు భరోసా ఇస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. జనమే సైన్యంగా సంక్షేమ రథసారథి ప్రారంభించిన బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగియనుంది. ఇప్పటిదాకా 21 రోజులు పాటు 22 జిల్లాల్లో యాత్ర సాగింది. బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలు.. వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్ 15 భారీ బహిరంగ సభల్లో(మంగళవారం సభతో సహా) పాల్గొని ప్రసంగించారు. -
అడుగడునా ప్రజల కష్టాలు వింటూ ముందుకు సాగుతున్న సీఎం జగన్
-
సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి
-
విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్ర
-
మిమ్మల్ని తలవని రోజు లేదు అన్న.. మహిళ భావోద్వేగం
-
100 ఈనాడులు, 100 ఆంధ్ర జ్యోతిలు వచ్చినా మీ అన్నకు భయం లేదు..!
-
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ సెల్ఫీ
-
సంచలన నిజాలు బయటపెట్టిన అప్పటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్
-
విశాఖపట్నంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ రోడ్ షో విజువల్స్
-
గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారు: సీఎం జగన్
విశాఖపట్నం, సాక్షి: సోషల్ మీడియాలో టీడీపీ, దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఆనందపురంలో రెండు వేల మందితో కూడిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్‌తో ముఖాముఖి నిర్వహించారాయన. ‘‘మనం కూటమి కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు, దత్తపుత్రుల కుట్రలతో యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. నేను ఒక్కడిని ఒకవైపు.. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఇతరులు మరోవైపు. ఒకే ఒక్కడిగా ఎన్నికల కురుక్షేత్రంలో దిగుతున్నా. విజయానికి దగ్గరగా ఉన్నామనే.. మనపై దాడి తీవ్రతరం చేశారు. గీతాంజలిని దారుణంగా ట్రోల్ చేసి వేధించారు. టీడీపీ.. వ్యవస్థ ఎంత దిగజారిందో అనడానికి గీతాంజలి ఆత్మహత్య ఘటనే ఉదాహరణ. కానీ, సోషల్ మీడియా మనతోనే ఉంది. సెల్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ మనతోనే ఉన్నారు. దాడులకు భయపడేది లేదు. దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ ఏదో రాశాడు. అందుకే దాడి నుంచి బయటపడగలిగాను. ఈసారి ఎన్నికల్లో 175కి 175 రావాలి. 25కి 25 లోక్‌సభ సీట్లు గెలవబోతున్నాం’’ అని సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ అన్నారు. సీఎం వచ్చి నేరుగా విశాఖలో కూర్చుంటే.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో పోటీ పడే స్థాయికి వెళ్తుంది. విశాఖపట్నం ఏపీకి డెస్టినేషన్ అవుతుంది. ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు YSRCP సోషల్ మీడియా కార్యకర్తలు తమ మనోగతాన్ని సీఎం జగన్‌తో పంచుకున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పార్టీ సోషల్ మీడియా ఆఫీస్ బేరర్స్ కు, పార్టీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ కు, ఇండిపెండెంట్ ఇన్ ఫ్లూయెన్సర్స్ కు, ఎన్ఆర్ఐ యాక్టివిటీలో అక్కడ నుంచి వర్చువల్ గా అటెండ్ అవుతున్న సోషల్ మీడియా సైనికులకు, యూట్యూబ్ నెట్ వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉన్న వాళ్లందరికీ, ఇక్కడికి రాలేకపోయినా కూడా మీ అభిమానంలో మాత్రం ఎక్కడా కూడా తక్కువ అనేదే లేకుండా మీ అన్నకు, దాదాపుగా 5 సంవత్సరాల పాటు మనం అధికారంలోకి రాకమునుపటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉంటూ వస్తున్న నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, కొంత మంది నా అన్నలకు కూడా మీ అందరికీ కూడా మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు పేరు పేరునా రెండు చేతులూ జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ఈరోజు ఇక్కడ మనమంతా ఏకమయ్యాం రాబోయే మరో 18 రోజుల్లో జరగబోతున్న ఎన్నికల కురుక్షేత్రంలో మనమంతా కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ఈరోజు అందరం కూడా షేర్ చేసుకునే విషయంలో ఏకమయ్యాం. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెబుతున్నాను. మనకు ఒకవైపున చూస్తే, అటువైపు ఉన్న బలాలు మన దగ్గర లేవు. అటువైపు మనం యుద్ధం చేస్తున్నది ఎవరితో అని చూస్తే, ఇటువైపున కేవలం మీ జగన్ ఒకే ఒక్కడు కనిపిస్తాడు. కానీ అటువైపున కూటమిలో వాళ్లను చూస్తే చాలా గంభీరంగా కనిపిస్తుంటుంది. ఒక్క జగన్ మీద ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగా ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్. వీళ్లందరే కాకుండా మనం యుద్ధం చేస్తున్నది ఎవరితో అంటే వీళ్ల కుట్రలతో, కుతంత్రాలతో, అబద్ధాలతో, మోసాలతో యుద్ధం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో అయితే వాళ్ల ఉక్రోశం ఏ స్థాయిలోకి వెళ్లిపోయింది అంటే చివరికి సోషల్ మీడియాలో మీ జగన్ కు అంటే వాళ్ల అన్నకు తాను సపోర్ట్ చేసింది అని, ఆ సపోర్ట్ కూడా పాపం తాను ఎందుకు చేసిందంటే.. తాను జగనన్న చేసిన మంచితో తాను కూడా బాగుపడింది అని, జగనన్న వల్ల తనకు ఇల్లు వచ్చిందని, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా జగనన్న వల్ల వచ్చాయని, తన సంతోషాన్ని తన సోషల్ మీడియాలో పాలు పంచుకుంటే ఏకంగా ఆ గీతాంజలి అనే నా చెల్లెల్లి ఎంత దారుణంగా ట్రోల్ చేశారో అందరం కూడా చూశాం. ఎంతటి దారుణంగా వేధించారో కూడా అందరం చూశాం. చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునేంత దూరం కూడా పోయింది అంటే నిజంగా ఈ వ్యవస్థ అన్నది ఎంత దారుణంగా చెడిపోయింది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. మనకు సోషలో మీడియా ఉంది. ఇంతకు ముందు నేను చెప్పాను. జగన్ ఇటువైపున ఒకే ఒక్కడు. అటువైపున చూస్తే ఇంత మంది.. ఈ ఇంత మందికీ తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్ మెంటు, అన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇంత మందితో, ఇన్ని కుట్రలతో, ఇన్నిన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్.. మీ అన్న, మీ తమ్ముడు.. తట్టుకొని నిలబడగలుగుతున్నాడంటే కారణం.. వాళ్లకు ఈనాడు ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి ఉండొచ్చు, టీవీ5 ఉండొచ్చు. కానీ మనకు.. సోషల్ మీడియా ఉంది. సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడూ జగన్ కు తోడుగా ఉన్నాడు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్ కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. జగన్ కోసం ప్రాణం ఇచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా, తోడుగా ఉన్నాయి. ఇంత మంది తోడున్న జగన్ ఒంటరివాడు కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరి ఎలా అవుతాడు? ఆ దేవుడి దయ మీద జగన్ కు నమ్మకం ఉంది. జగన్ ను ప్రేమించే గుండెల మీద జగన్ కు నమ్మకం ఉంది. మీ అందరూ చేసిన, చేస్తున్న, చూపిస్తున్న అభిమానానికి, ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు. మీకు ఎంత చేసినా, ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుందని మాత్రం ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలుగుతాడు. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తున్నాను. ఆర్గనైజేషన్ ను కూడా స్ట్రీమ్ లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్ గా స్ట్రీమ్ లైనింగ్ కూడా జరిగింది. భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్ లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తున్నాడు. మీ అందరికీ భరోసా ఇస్తున్నా... అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటే అసూరెన్స్ ఇస్తున్నాం.మీ వెనకాల ఉండేది ఒక్క జగనే కాదు. మీ వెనకాల ఉన్నది ఒక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీ వెనకాల ఉంది అని చెబుతున్నాను.ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది. ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూమీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా చెబుతున్నాను. ఈ విషయాలన్నీ మీ అందరికీ చెబుతూ, సోషల్ మీడియా పరంగా మీరు ఏదైనా అడగాలి అనుకుంటే మీ అన్న, మీ తమ్ముడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా చెబుతూ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమని కూడా కోరుతున్నాను. సిటీ ఆఫ్ డెస్టినీ రేపు ఆంధ్రా డెస్టినీ కాబోతుంది ఈ రోజు ఎలాగూ అందరూ విశాఖపట్నానికి వచ్చారు. కొంతమంది విశాఖపట్నం వాసులు, కొంత మంది విశాఖపట్నం బయట నుంచి కూడా వచ్చిన వాళ్లు. ఈరోజు ఈ సిటీని చూస్తున్నారు కదా.. ఈ సిటీ ఆఫ్ డెస్టినీ అనేది రేప్పొద్దున ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందన్నది మాత్రం ఈ సందర్భంగా కచ్చితంగా తెలియజేస్తున్నాను. ఈ విషయం తెలియజేస్తూ, ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చోవడం మొదలు పెడతాడో, ఎప్పుడైతే ముఖ్యమంత్రి ఈ సిటీ నుంచి పరిపాలన చేయడం మొదలు పెడతాడో అప్పుడు ఈ సిటీ అన్నది హైదరాబాద్ తో పోటీ పడే పడే పరిస్థితి, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి, ఐటీని ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కు తీసుకుని పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ మాట చెబుతూ మైకులో మాట్లాడాలని ఎవరైనా అనుకుంటే మీ దాకా మైకు వస్తుంది. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నేను ఎదైనా నోట్ చేసుకోవాల్సి ఉంటే నోట్ చేసుకుంటాను. మీకు ఏదైనా నేను సమాధానం చెప్పాల్సి వస్తే చెప్తాను. థ్యాంక్యూ. అని సీఎం జగన్ ప్రసంగంలో పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రతినిధులు మాట్లాడిన అనంతరం సీఏం జగన్ ఏం మాట్లాడారంటే.. జగనన్న మీకు ఎప్పుడూ అండగా, తోడుగా ఉంటాడు మీ అందరితో కూడా ఒకే ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చాలా మంది మాట్లాడగలిగారు. ఇంకా చాలా మంది మాట్లాడలేని పరిస్థితి. కానీ మీ అందరితో ఒకటే చెబుతున్నాను. మీ అందరికీ కూడా తోడుగా, మీ జగనన్న ఎప్పుడూ మీకు అండగా ఉంటాడని మాత్రం ఈ సందర్భంగా చెబుతున్నాను. దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. ఈ దెబ్బ ఇక్కడ (నుదురుపైన) తగిలింది అంటే అది ఇక్కడా(కంటి మీద) తగల్లేదు. ఇక్కడా (కణత మీద) తగల్లేదు అంటే దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్టే మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడు అని దాని అర్థం. కాబట్టి భయం లేదు. పైన దేవుడు – కింద మీరు అండగా ఉండగా మీ అన్నకు భయంలేదు మనం గెలిచేది 175కు 175 సీట్లే అని 25కు 25 ఎంపీ సీట్లే. ఒక్క సీటు కూడా ఎక్కడా తగ్గేందుకు వీల్లేదు. మీ భుజస్కందాల మీద ఫోన్ అనే ఈ ఆయుధం మీ చేతుల్లో ఉందనేది గుర్తుపెట్టుకోమని అందరితో కోరుతున్నాను. అటు వైపున 100 ఈనాడులు వచ్చినా, 100 ఆంధ్ర జ్యోతులు వచ్చినా, 100 టీవీ 5లు వచ్చినా, 100 మంది చంద్రబాబులు, 100 మంది దత్తపుత్రులు వచ్చినా, జాతీయ పార్టీలు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ మద్దతు పలికినా, కుట్రలు పన్నినా కుతంత్రాలు పన్నినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు చేసినా మీ అందరికీ ఒకటే చెబుతున్నాను మీ జగన్‌కు భయం లేదు. మీ అన్నకు. మీ తమ్ముడుకి భయం లేదు. కారణం పైన దేవుడు ఉన్నాడు. కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు ఇక్కడ ఉన్న వాళ్లకు, ఇక్కడికి రాలేకపోయిన చాలా మంది ఆత్మీయులకు, దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండి కూడా వారి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న నా అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొక్కసారి మనసారా చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఇటువైపున తిరుగుతా వచ్చినంత మేర సెల్ఫీ తీసుకుంటాను అంటూ... సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
Memantha Siddham Bus Yatra: వన్స్‌మోర్ జగన్.. గళమెత్తిన విశాఖ (ఫొటోలు)
-
21వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర
-
CM Jagan: ‘స్టీల్ ప్లాంట్ అంశంపై మాది రాజీలేని ధోరణి’
విశాఖపట్నం, సాక్షి: విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవం కోసం తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తోందని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నారు. మంగళవారం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని ధోరణి అని వాళ్లకు ఆయన స్పష్టం చేశారాయన. సీఎం జగన్‌ను కలిసిన సందర్భంలో.. విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు కార్మిక సంఘాల నాయకులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్సీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుంది. ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తింది. తొలిసారిగా ప్రధానికి లేఖ కూడా రాశాం. అంతేకాదు.. స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం. .. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్సార్సీపీ పార్టీది రాజీలేని ధోరణి. ఎన్నికలొచ్చేసరికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పుడు జట్టుకట్టాయి, కూటమిగా ఏర్పడ్డాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరి ఏంటో బయటపడింది. శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపుతో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుంది. మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారం అవుతాయి.. .. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకు వస్తూనే ఉన్నాం. ఈ ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికత YSRCPకే ఉంది. ఎన్నికల వేళ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని కోరుతున్నాను అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ పై మా వైఖరిలో ఏ మార్పు లేదు. మేము కన్సెంటు ఇవ్వలేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని సీఎం జగన్ చెప్పారు. ఉద్యమానికి మొదటి నుంచి వైఎస్సార్సీపీ అండగా ఉంది. ఇకపై కూడా ప్రభుత్వ సహకారంతోనే ఉద్యమం జరుగుతుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానమంత్రికి సీఎం జగన్ ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాశారు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకూడదని మేం కోరుకుంటున్నాం. -
చెల్లూరు సీఎం జగన్ బహిరంగ సభ భారీ ఏర్పాట్లు..!
-
సీఎం జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్..!
-
21వ రోజు బస్సు యాత్ర..!
-
దేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు
-
నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసిన YSRCP ప్రణాళిక బద్ధంగా అడుగులు
-
YSRCP Bus Yatra Photos: విశాఖ నగరి.. అభిమాన ఝరి
-
YSRCP Bus Yatra Photos: సామాన్యులతో సీఎం జగన్.. అడుగడుగునా జన నీరాజనం (ఫొటోలు)
-
గతంలో ఏ ప్రభుత్వంలో నైనా ఇలాంటి పథకాలు చూసారా
-
వీళ్లే మన అభ్యర్థులు ఆశీర్వదించండి
-
నేను బచ్చా అయితే భయమెందుకు? బాబు, వదిన, దత్తపుత్రుడికి మాస్ కౌంటర్
-
గతంలో ఏ ప్రభుత్వంలో నైనా ఇలాంటి పథకాలు చూసారా
-
సింగల్ గా వస్తున్న నన్ను చూసి బాబు భయంతో వణికిపోతున్నాడు
-
నేను బచ్చానును కాదు బాబు..చంద్రబాబు వ్యాఖ్యలకు సీఎం జగన్ మాస్ కౌంటర్
-
సభను ఉర్రుతలూగించిన అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్
-
ప్రజల్లోకి సీఎం వైఎస్ జగన్ డైనమిక్ ఎంట్రీ
-
సీఎం వైఎస్ జగన్ గూస్బంప్స్ ఎంట్రీ
-
అడుగడుగునా జననీరాజనం తరగని ఆప్యాయత
-
బాధిత కుటుంబానికి కొండంత భరోసా ఇచ్చిన సీఎం జగన్
-
జగన్ కు అరచేతిలో హారతి.. వద్దు తల్లి..!
-
మళ్లీ జగనే అధికారంలోకి వస్తారు
-
Kakinada Memantha Siddham: మేమంతా సిద్ధం సభ: కాకినాడలో జన హోరు (ఫొటోలు)
-
ఏపీలో మత్స్యకారులకు శుభవార్త
-
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
వదల బొమ్మాళీ... వదల..చంద్రబాబు పై సీఎం జగన్ సెటైర్లు
-
జ్వరమొస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ కు, పవన్ ను ఆటాడుకున్న సీఎం జగన్
-
నాకు ఈ రోజు కాకినాడలో ఉప్పొంగిన గోదావరి కనిపిస్తుంది
-
చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ..చంద్రబాబు పై నిప్పులు చెరిగిన కన్నబాబు
-
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ అదుర్స్ @కాకినాడ
-
కాకినాడ సభకు చేరుకున్న సీఎం జగన్
-
సామర్లకోటలో సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర
-
అడుగడుగునా ఆప్యాయత కాకినాడ జనసంద్రం
-
రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనాలు
-
ఎండను, వానను లెక్కచేయం.. మాకు జగనన్నే ముఖ్యం
-
గోదావరి పొడవునా.. ఉరకలెత్తిన జనం
‘ఇన్నాళ్లూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించా. పక్షవాతం వచ్చి కాలుచేయి పడిపోయాయి. వయసు మళ్లడంతో కష్టపడే ఓపిక లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌బాబు ఇంటికే నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డుతో ఉచితంగా వైద్యం చేయించారు. దేవుడు లాంటి ఆ బాబును చూడ్డానికి పొద్దునే వచ్చా’.. – తేతలి హైవేపై ముఖ్యమంత్రి రాక కోసం నిరీక్షిస్తున్న 75 ఏళ్ల విష్ణుమూర్తి అంతరంగం. ‘నాకు ఇద్దరు కొడుకులు. కూలి చేసుకునే బతుకులు మావి. పిల్లలను చదివించుకోలేకపోయా. ఇప్పుడు నా మనవళ్లను జగన్ గారు ఉచితంగా చదివిస్తున్నారు. అలాంటి గొప్ప మనిషిని చూడడం మా అదృష్టం’.. – తణుకు ప్రాంతానికి చెందిన పంపన ఇందిర సంతోషం ఇదీ. ‘మా ఇద్దరు తోటికోడళ్లకు జగన్ గారు ఇంటి స్థలం ఇచ్చారు. మా బాబుకు అమ్మఒడి ఇస్తున్నారు. మా సొంత ఇంటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు మా ఊరు వచ్చారు.. ఎంతసేపైనా సరే ఇక్కడే ఉండి ఆయనకు స్వాగతం పలుకుతాం’.. – ఇందిర కోడలు అపర్ణ ఆనందం ఇదీ. మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మండుటెండల్లోనూ గోదారమ్మ పోటెత్తింది! ఉభయ గోదావరులూ ఉప్పొంగాయి! కోనసీమ కోలాహలమైంది! గోదావరి తీరం జన సంద్రమైంది! రావులపాలెం నుంచి రాజమహేంద్రి దాకా ఎటుచూసినా జన ప్రవాహమే! తమకు మంచి చేసిన జననేతను స్వయంగా చూసేందుకు పెద్దల నుంచి పిల్లల దాకా ప్రతి ఒక్కరూ ఎండను లెక్క చేయకుండా వెల్లువలా తరలి వచ్చారు. అభిమాన నేతను దగ్గరి నుంచి చూడాలని.. వీలైతే మాట్లాడాలని.. ఒక్క ఫొటో తీసుకోవాలని ఉత్సాహం చూపారు. ఊర్లన్నీ జాతీయ రహదారి బాటపట్టాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా 17వ రోజైన గురువారం కనిపించిన దృశ్యాలివి. తేతలి నుంచి తణుకు వరకు రోడ్డుకు ఇరువైపులా మానవహారంలా నిలబడి సీఎం జగన్‌ను ఆశీర్వదించారు. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీలను నెలకొల్పి తమ కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థులు థాంక్యూ సీఎం సర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి కృతజ్ఞతలు తెలియచేశారు. ఇక రాజమహేంద్రవరం చరిత్రలో ఇంతవరకూ ఏ రాజకీయ నేత నిర్వహించిన యాత్రలో ఇంత జనసందోహాన్ని చూడలేదని స్థానికులు చెబుతున్నారు. తేతలి రాత్రి బస కేంద్రం నుంచి ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన సందోహం తరలిరాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చేరుకుంది. తేతలి నుంచి యాత్ర ప్రారంభం కాగానే దారి పొడవునా అక్క చెల్లెమ్మలు, వృద్ధులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. అంతకుముందు తేతలి బస వద్ద సీఎంను తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు నేతలు కలిశారు. దారిలో తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎదురు చూస్తున్న దివ్యాంగులు, స్థానికులను సీఎం పరామర్శించి వినతి పత్రాలు స్వీకరించారు. యాత్ర అక్కడకు రెండు కి.మీ. దూరంలోని తణుకు చేరుకునే సరికి 40 నిమిషాల సమయం పట్టింది. బైక్ ర్యాలీతో కోనసీమ స్వాగతం.. జాతీయ రహదారి వెంట సాగిన సీఎం జగన్ యాత్రలో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున మహిళలు కనిపించారు. సిద్ధాంతం సెంటర్ జనంతో కిక్కిరిసిపోయింది. ఈతకోటలో యువకులు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీగా వచ్చి తమ ప్రియతమ నేతను అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోకి ఆహ్వానించారు. అమ్మ ఒడితో ఆదుకున్న జగన్ మామయ్యను చూసేందుకు స్కూల్ పిల్లలు తరలివచ్చారు. ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న సీఎం జగన్‌కు మద్దతుగా లిడియా ఫార్మశీ కాలేజీ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్ వద్ద గోదావరి సాక్షిగా సీఎం జగన్ బస్సు యాత్రకు మహిళలు మేమంతా సిద్ధం అంటూ స్వాగతం పలికారు. రావులపాలెం సెంటర్ జన సందోహంతో కిక్కిరిసిపోయింది. మండుటెండను లెక్క చేయకుండా జగన్ కోసం గంటల తరబడి ఎదురు చూశారు. ఎడ్లబండ్లపై వచ్చిన రైతన్నలు.. మధ్యాహ్నం పొట్టిలంక వద్ద స్వల్ప విరామం అనంతరం సీఎం జగన్ యాత్రను తిరిగి ప్రారంభించారు. వేమగిరి సెంటర్లో రైతులు ఎడ్లబండ్లపై వచ్చి స్వాగతం పలికారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, ఆర్బీకేలతో మాకు ఎంతో మేలు చేసిన సీఎం జగన్ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. అక్క చెల్లెమ్మలు 108 గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. రావులపాలెం నుంచి బొమ్మూరు, రాజమండ్రిలోని పలు కూడళ్లు మధ్యాహ్నం నుంచే జనంతో కిక్కిరిసిపోయాయి. బొమ్మూరు నుంచి మొదలు దేవీచౌక్ వరకు ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయాయి. జగన్ పాలనకు మద్దతుగా రాజీనామా చేసిన వలంటీర్లు మేమంతా నీవెంటేనంటూ వేమగిరిలో ప్లకార్డులు ప్రదర్శించారు. రాజమహేంద్రి జనసంద్రం... సాయంత్రం 4.30 గంటలకు బొమ్మూరు జంక్షన్ చేరుకున్న సీఎం జగన్ యాత్ర 5.45కి మోరంపూడికి చేరుకుంది. రోడ్డు మొత్తం జనంతో నిండిపోవడంతో 3 కి.మీ ప్రయాణానికి దాదాపు 1.15 గంటల సమయం పట్టింది. అనంతరం యాత్ర ఆర్టీసీ కాంప్లెక్స్, జాంపేట, దేవిచౌక్, గోకవరం బస్టాండ్, సీతంపేట, పేపర్‌మిల్లు, మల్లయ్యపేట, దివాన్‌చెరువు మీదుగా రాజానగరం చేరుకుంది. మోరంపూడి సెంటర్ నుంచి 16 కి.మీ కొనసాగిన యాత్ర రాత్రి 9 గంటలకు దివాన్‌చెరువు చేరుకుంది. మధ్యలో ప్రతి సెంటర్ జనంతో నిండిపోయింది. రాజమండ్రి వాసులే కాకుండా చుట్టుపక్కల 10 కి.మీ పరిసరాల్లో ప్రజలు జగన్ కోసం ఎదురు చూశారు. మండుటెండలోనూ.. 58 నెలల పాలనలో తామంతా ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించే అవకాశం కల్పించారని, పిల్లలకు అత్యుత్తమ విద్యను ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన సీఎం జగన్‌ను స్వయంగా చూడాలన్న ప్రజల కోరిక ముందు భగభగమండే సూరీడు సైతం చిన్నబోయాడు. మిట్ట మధ్యాహ్నం 43 డిగ్రీలకు పైగా ఉన్న ఎండను సైతం లెక్క చేయకుండా తణుకు బైపాస్ నుంచి పెరవలి, ఖండవల్లి, సిద్ధాంతం, ఈతకోట, రావులపాలెం, జొన్నాడ, చెముడులంక, పొట్టిలంక, కడియపులంక, వేమగిరి వరకు యువత, వృద్ధులు, విద్యార్థులు, పిల్లలతో కలసి మహిళలు రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. కడియపులంక వద్ద జగన్‌పై పూల వర్షం కురిపించారు. రాజమహేంద్రవరంలో యువ లాయర్లు సీఎం జగన్‌కు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం జగన్ యాత్ర సాయంత్రం 4.30 గంటలకు బొమ్మూరు చేరుకుంది. రాత్రి 9.15 గంటలకు ఎస్టీ రాజాపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. తేతలి నుంచి ఎస్టీ రాజపురం వరకు మొత్తం 88 కి.మీ. మేర గురువారం బస్సు యాత్ర కొనసాగింది. అనారోగ్య బాధితుడికి భరోసా ఆలమూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామంలో బస్టాండు వద్ద అంబులెన్స్‌ను గమనించిన సీఎం జగన్ తన బస్సును ఆపాలని ఆదేశించారు. కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డితో కలిసి అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు. చిలకలపాడుకు చెందిన రాయుడు సత్తిబాబు రెండేళ్ల నుంచి నరాల సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నట్లు బాధితుడి కుటుంబ సభ్యులు సీఎంకు విన్నవించారు. వైద్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. దీంతో సీఎం జగన్ చలించిపోయి సత్తిబాబుకు ఆరోగ్యం చేకూరేందుకు ఎంత వ్యయమైనా భరించేందుకు సిద్ధమని హామీ ఇచ్చారు. వెంటనే బాధితుడి వివరాలు తీసుకోవాలని వ్యక్తిగత సిబ్బందికి సూచించారు. తక్షణమే స్పందించడం పట్ల బాధితుడి కుటుంబ సభ్యులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, జనసేన నేతల చేరిక తేతలిలో రాత్రి బస కేంద్రం వద్ద తనను కలసిన మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణరాజును సీఎం జగన్ ఆత్మీయంగా పలుకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, జనసేన కీలక నేతలు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీలో చేరారు. వారికి కండువాలు వేసి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. రాజోలు జనసేన కీలక నేత బొంతు రాజేశ్వరరావు, మాజీ పీఏసీ చైర్మన్ మేకల వీరవెంకట సత్యనారాయణ (ఏసుబాబు), టి.త్రిమూర్తులు, ఎం.నరసింహస్వామి, దొమ్మేటి సత్యనారాయణ, మంద సత్యనారాయణ, కేశనపల్లి మాజీ సర్పంచ్ డి.సూర్యనారాయణ, జనసేన సర్పంచ్ కాకర శ్రీను, చింతా సత్యప్రసాద్, తాడేపల్లిగూడేనికి చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏపీ కన్వీనర్ గమ్మిని సుబ్బారావు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. పి.గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్.గణపతిరావు కుమారుడు గణేష్ బాబు, మనవడు గణపతిరావు, టీడీపీ నుంచి వడ్లమూడి గంగరాజు పార్టీలో చేరారు. -
అభిమానం.. ఆకాశమంత
ఈ చిత్రంలో ఒంటిమీద వైఎస్సార్సీపీ రంగు దుస్తులు.. బైక్ మొత్తం వైఎస్సార్సీపీ జెండాలతో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు.. రామిరెడ్డి అమరనాథ్ రెడ్డి. మండుటెండలో కాలికి చెప్పులు కూడా లేకుండా వైఎస్సార్సీపీ జెండా రంగులతో ఉన్న హెల్మెట్ పెట్టుకుని, మోటార్ సైకిల్‌కు మైక్‌ను కట్టుకుని, వైఎస్సార్సీపీ ప్రచార గీతాలను వినిపిస్తూ వేల కిలోమీటర్లు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రతో పాటు ప్రయాణిస్తున్నాడు. ఎందుకిదంతా అంటే.. జగనన్న అంటే ప్రాణమని తెలిపాడు. ఆయన కోసం విశాఖ ఫార్మా కంపెనీలో రూ.40 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టానన్నాడు. అంతేకాకుండా ఏడాదిన్నర పాపతోపాటు కుటుంబానికి దూరమైనా సంతోషంగా జగనన్న వెంట నడుస్తున్నానని చెబుతున్నాడు. జగన్ మళ్లీ సీఎం అయ్యేంత వరకూ తాను కాలికి చెప్పులు ధరించనని దీక్ష పూనానని అంటున్నాడు. తన వాహనాన్నే ప్రచార రథంగా మార్చి దానికి రెండు వైపులా ‘బలవంతుడికి.. బలహీనుడికి జరిగే యుద్ధం’ అనే వ్యాఖ్యతో ఉన్న స్టిక్కర్‌ను అతికించుకుని తిరుగుతున్నాడు. అమరనాథ్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన సిద్ధం సభల్లోనూ ఇదేవిధంగా పాల్గొని ప్రచారంలో తన వంతు పాత్ర పోషించాడు. తన జీవితం జగనన్నకే అంకితమని, ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ బస్సుయాత్రలో తన బైక్ యాత్ర కూడా కొనసాగుతుందని అభిమానాన్ని చాటుకున్నాడు. (బోణం గణేష్, ‘మేమంతా సిద్ధం బస్సు యాత్ర’ నుంచి సాక్షి ప్రతినిధి) ఇలా ఒక్క అమరనాథ్ రెడ్డి మాత్రమే కాదు.. ‘మేమంతా సిద్ధం’ అంటూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సుయాత్రలో ఇలాంటి వారు అడుగడుగునా కనిపిస్తున్నారు. ప్రజలు ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా అభిమానిస్తే.. గుండెల్లో గుడికట్టేస్తారనడానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. గుంటూరు జిల్లా పాత మంగళగిరికి చెందిన పండ్ల వ్యాపారి శ్రీనివాసరావు తన ద్విచక్ర వాహనంపై భార్య, కుమార్తెను ఎక్కించుకుని, ఆ బైక్ మొత్తం వైఎస్సార్సీపీ జెండాలను కట్టుకుని బస్సుయాత్రలో పాల్గొన్నారు. మరి కొందరు కార్లతో యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. రోజుల తరబడి, జిల్లాలు దాటి, ఎండా, వాన లెక్క చేయకుండా, వ్యయప్రయాసలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్ వెంట ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు జననేత తమ ప్రాంతానికి వస్తున్నారని తెలియడం ఆలస్యం.. బస్సుయాత్ర వెళ్లే రహదారికి తమ గ్రామం దూరంగా ఉన్నాసరే అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, చిన్నారులు, యువత ప్రతికూల వాతావరణంలోనూ కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చి జగన్‌కు అఖండ స్వాగతం పలుకుతున్నారు. పసిపిల్లలతో పాటు వచ్చిన తల్లులు, బాలింతలు ఇలా ఒకరేమిటి గంటల తరబడి జగన్‌ను చూసేందుకు నిరీక్షిస్తున్నారు. పగలూరాత్రి తేడా లేకుండా వీధుల్లో పోటెత్తుతున్నారు. మమా మాస్.. ఇక యువత అయితే వారి ఉత్సాహం మామూలుగా లేదు. ఓ మాస్ హీరోకు ఉన్న దానికంటే వంద రెట్లు ఫాలోయింగ్ సీఎం వైఎస్ జగన్‌కు ఉందని యువత ఆనందం చూస్తుంటే తెలుస్తోంది. బస్సు యాత్ర మొత్తం ప్రతి చోటా వైఎస్సార్సీపీ ప్రచార గీతాలకు ఒళ్లుమరచి యువత ఆనంద తాండవం చేస్తోంది. సినిమా పరంగా తాము ఎవరి ఫ్యాన్ అయినప్పటికీ..రాజకీయాల్లో జగన్ తమ రియల్ హీరో అంటూ బైక్‌ల మీద తమ అభిమాన హీరో ఫొటోతో పాటు సీఎం జగన్ ఫొటో స్టిక్కర్లను అతికించుకోవడం విశేషం. స్థానిక నాయకుల్లోనూ బస్సుయాత్ర నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది. ఎక్కడికక్కడ సీఎం వైఎస్ జగన్‌కు సంప్రదాయం ఉట్టిపడేలా కోలాటాలు, స్టిక్ వాకర్స్‌ను ఏర్పాటు చేసి భారీ గజమాలలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ గజమాలలు సాధారణ పరిమాణం దాటి ఉండటంతో వాటిని క్రేన్లతో మోయాల్సి వస్తోంది. సీఎం జగన్ బస్సు యాత్ర వెంట వేలాది బైకులతో భారీ ర్యాలీలు చేస్తూ యువత, కార్యకర్తలు, స్థానిక నేతలు సందడి చేస్తున్నారు. కొండంత ఆనందం.. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు అఖండ స్వాగతాలు పలుకుతున్నారు. హారతులు ఇచ్చి దిష్టి తీయడంతోపాటు పూలతో దండలు, పూలాభిషేకాలు చేస్తున్నారు. ప్రతి కూడలిలో జగన్ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జగన్ తమ గ్రామానికి, వీధికి రాగానే బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, బాలికలు సైతం జగన్ మామే మళ్లీ సీఎం కావాలంటూ జెండాలు చేతబట్టి నినదిస్తున్నారు. సీఎం జగన్ బస్సు ఆపి తమను పలకరిస్తుంటే ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. ఆయనతో ఫొటో దిగి కొండంత ఆనందాన్ని మూటగట్టుకుంటున్నారు. అన్నా నీ కోసం మా ప్రాణం ఇస్తామంటూ సీఎం వైఎస్ జగన్‌కు భరోసా ఇస్తున్నారు. ఆనక ఆ ఫొటోలను తమ వారందరికీ పంపుతున్నారు. అంతేకాకుండా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. కటిక చీకటిని.. జోరున కురిసే వర్షాన్ని..మండుతున్న ఎండను కూడా లెక్కచేయకుండా తమ అభిమాన నేతకు జననీరాజనం పలుకుతున్న ఇలాంటి అపురూప దృశ్యాలు సీఎం జగన్‌ను ప్రజలు ఎంతగా ఆరాధిస్తున్నారో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనాలని రాజకీయ విశ్లేషకులు చెబుతుండటం విశేషం. -
నేడు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజైన గురువారం(ఏప్రిల్ 18) షెడ్యూల్‌ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. సీఎం జగన్ రాత్రి బస చేసిన తేతలి నుంచి గురువారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోటజంక్షన్, చర్చిసెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజపురం వద్ద రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కొలిక్కి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో పోలీసుల దర్యాప్తు కొలిక్కి వచ్చింది. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో శనివారం రాత్రి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ దుండగుడితోపాటు సహకరించిన ముఠా, కీలక సూత్రధారులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దాడికి పాల్పడినట్లు గుర్తించిన అనుమానితుడితోపాటు మరో ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఒకరు ఉండటం గమనార్హం. హత్యాయత్నం వెనుక కుట్ర కోణంలో సంచలన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. అనుమానితులు, తెర వెనుక పాత్రధారులకు సంబంధించిన ఆధారాలను పక్కా శాస్త్రీయంగా విశ్లేషించారు. నేరాన్ని రుజువు చేసేందుకు హేతుబద్ధమైన ఆధారాలను సేకరించి క్రోడీకరించారు. సాంకేతికపరమైన ప్రక్రియను కూడా పాటించిన అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించే అవకాశాలున్నాయి. 60 మందికిపైగా విచారణ ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. పదునైన రాయితో ఏ విధంగా హత్యాయత్నానికి పాల్పడిందీ నిర్ధారించారు. పదునైన రాయితో దాడి చేసింది ఎవరు? దుండగుడికి సహకారం అందించింది ఎవరు? అనే కీలక అంశాలను రాబట్టారు. వీడియో ఫుటేజీలు, కాల్ డేటా, ఇతర శాస్త్రీయ ఆధారాలతో కేసు దర్యాప్తును పోలీసులు తుది అంకానికి తెచ్చారు. దాదాపు 60 మందికిపైగా అనుమానితులను విచారించి అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసి కేసును కొలిక్కి తెచ్చారు. కుట్ర కోణంపై ముమ్మర దర్యాప్తు ఈ హత్యాయత్నం వెనుక కుట్ర కోణంపై విచారణ సందర్భంగా సంచలన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. దుండగుడికి సహకరించినవారితోపాటు ఆ దిశగా ప్రోత్సహించిన కీలక నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ క్రియాశీలక నేత కావడం గమనార్హం. టీడీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్గా కూడా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని క్షుణ్నంగా విచారించడంతో సంచలన అంశాలు వెల్లడైనట్టు తెలుస్తోంది. అజ్ఞాతంలో సెంట్రల్ నేత తాజా పరిణామాల నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత అజ్ఞాతంలోకి వెళ్లడం గమనార్హం. పోలీసులు దీంతో నిమిత్తం లేకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. టీడీపీ నేత వెల్లడించిన విషయాలను ఇతర అంశాలతో సరిపోల్చి నిర్ధారించుకుంటున్నారు. అదుపులో ఉన్న నిందితులు వెల్లడించిన కుట్ర కోణం వాస్తవమేనని నిర్ధారించుకున్న తరువాతే తదుపరి చర్యలు చేపట్టాలన్నది పోలీసుల ఉద్దేశం. దాంతో ఆ దిశగా దర్యాప్తు వేగం పుంజుకుంది. ప్రధాన ఎన్నికల అధికారికి నివేదిక ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఈ కేసు దర్యాప్తు వివరాలను పోలీసులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు. దాడికి పాల్పడిన విధానం, అనుమానితుల నుంచి సేకరించిన సమాచారం, కుట్ర కోణాలపై కీలక సమాచారాన్ని విజయవాడ పోలీసులు ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి నివేదించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వివరాలపై ఆయన వ్యక్తం చేసిన సందేహాలను సంతృప్తికరంగా నివృత్తి చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో సాంకేతిక వ్యవహారాలను పూర్తి చేసి కేసులో కీలక వివరాలను నేడు వెల్లడించవచ్చని భావిస్తున్నారు. -
పేదలపై బాణాలా?: సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు.. అందరికీ మంచి చేసిన జగన్‌కు ప్రతి ఇంటా మద్దతు ఉంది. ఏ ఇంట్లో చూసినా తోడుగా పేదల సైన్యం ఉంది. జగనే మళ్లీ రావాలని కోట్ల హృదయాలు ఆశీర్వదిస్తున్నాయి. ఒక్క జగన్ మీద చంద్రబాబు 10 మంది సేనానులను తోడు తెచ్చుకుని బాణాలు గురి పెడుతున్నారు. అవి తగిలేది జగన్‌కా? లేక పేదలకా?’’ అనేది ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. 16వ రోజు బస్సు యాత్ర సందర్భంగా మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే.. బాబు గురించి చరిత్ర చెబుతున్న నిజం.. భీమవరంలో జన సముద్రం కనిపిస్తోంది. శబరి, ఇంద్రావతి కలసి ఉప్పొంగిన గోదావరిని తలపిస్తోంది. మంచి చేసి మనం, జెండాలు జతకట్టి వాళ్లు తలపడుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా? సంక్షేమ రాజ్యాన్ని అబద్ధాలు, కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కావు. మీ ఐదేళ్ల భవిష్యత్తు, అక్కచెల్లెమ్మల సాధికారత, పిల్లల చదువులు, అవ్వాతాతల సంక్షేమం, రైతన్నలకు అందుతున్న భరోసా, పేదలకు సామాజిక న్యాయం కొనసాగుతూ మరో రెండు అడుగులు ముందుకు వేయాలా? లేక మోసపోయి మళ్లీ నష్టపోవాలా? అనేది నిర్ణయించే ఎన్నికలు ఇవి. అందుకే మళ్లీ మళ్లీ చెబుతున్నా.. ఇవి మన తలరాతలను మార్చే ఎన్నికలు. ఇవి కేవలం చంద్రబాబు – జగన్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. పేదలకు – చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని గుర్తు పెట్టుకోండి. మీ ప్రతి ఓటు వచ్చే ఐదేళ్లు ఏ దారిలో నడవాలో నిర్ణయిస్తుంది కాబట్టి మీ కుటుంబమంతా కూర్చుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. జగన్‌కు ఓటు వేస్తే ఇప్పుడు జరుగుతున్న మంచి అంతా కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ అంతటితో ముగిసిపోతాయి. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఆయన సాధ్యం కాని అలవిమాలిన హామీలతో వస్తున్నారనేది నిజం. కొంగ జపం.. నటిస్తావెందుకయ్యా? మీరంతా ఈమధ్య చూసే ఉంటారు. చంద్రబాబుకు నాపై కోపం చాలా ఎక్కువగా వస్తోంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు హైబీపీ కనిపిస్తోంది. ఏవేవో తిడుతుంటాడు.. శాపనార్ధాలు పెడుతుంటాడు. నాకు ఏదో అయిపోవాలని కోరుకుంటూ ఉంటాడు. రాళ్లు వేయండి.. అంతం చేయండని పిలుపునిస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి. అక్కచెల్లెమ్మలూ.. నాపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకో తెలుసా? బాబూ.. చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకోపక్క జపం చేస్తున్నట్లు నటిస్తావెందుకయ్యా? కొంగ జపాలు ఎందుకు చేస్తున్నావ్? అని అడిగా. అలా అడగడం తప్పా? మీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకంగానీ మంచి పనిగానీ ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అని చంద్రబాబును అడిగా. ఆయన పేదలకు చేసింది ఏమీ లేకపోగా చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోట్లు, మోసం, దగా, అబద్ధాలు, కుట్రలే గుర్తుకొస్తాయి. భార్యలను వదిలేసి.. నియోజక వర్గాలనూ మార్చేసి! ఇక దత్తపుత్రుడి విషయానికి వస్తే.. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను కూడా పుట్టించి నాలుగైదేళ్లకు ఒకసారి కార్లను మార్చేసినట్లుగా భార్యలను వదిలేసి, ఇప్పుడు నియోజక వర్గాలను కూడా అలవోకగా వదిలేస్తున్నావ్! ఏం మనిషివయ్యా నువ్వు? అని ఆయన్ను అడిగా. అందుకే దత్తపుత్రుడిలో కూడా ఈమధ్య బీపీ బాగా కనిపిస్తోంది. ఒకసారి చేస్తే అది పొరపాటు! మళ్లీ మళ్లీ చేస్తే అలవాటు అంటారయ్యా.. దత్తపుత్రా! పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డుపైకి తీసుకురావడం, ఆడవాళ్ల జీవితాలను చులకనగా చూపడం ఘోరమైన తప్పుకాదా? ఇదే విషయం నేను అడిగితే తప్పు అట! నిన్ను చూసి అదే తప్పు ప్రతి ఒక్కరూ చేయడం మొదలుపెడితే.. ఇలా నాలుగేళ్లకు, ఐదేళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి? అని కనీసం ఆలోచన కూడా చేయడు. ఆ పెద్దమనిషికి నువ్వు చేస్తున్నది తప్పు అని చెబితే బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా ఇలా.. ఊగిపోతుంటాడు. చేతులు, కాళ్లు, తల..అన్నీ ఊపేస్తుంటాడు. ఇలా అడిగినందుకే బాబుకు, దత్తపుత్రుడికి నాపై కోపం. బాబు వదిన గారికి కూడా కోపం వచ్చింది. బాబు భజంత్రీలకు కూడా పిచ్చి కోపం.. వీళ్లంతా ఊగిపోతూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5లలో పూనకం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటారు. పేదలపై బాబు బాణాలు.. జగన్ ఒక్కడే.. చంద్రబాబుకు మాత్రం పది మంది సేనానులు. వారంతా బాణాలు గురి పెట్టారు. కానీ అవి తగిలేది ఎవరికి? జగన్‌కా? లేక పేదలకు జగన్ అందిస్తున్న పథకాలకా? వలంటీర్లు–సచివాలయాల వ్యవస్థలకా? ఆర్బీకేలు–విలేజ్ క్లినిక్స్ వ్యవస్థలకా? నాడు – నేడు, ఇంగ్లీషు మీడియంతో మారిన పిల్లల చదువులకా? వారి బాణాలు తగిలేది ఎవరికి? ఇంటింటికీ అందించే పెన్షన్లకు వారి బాణాలు తగులుతున్నాయి. మీ బిడ్డ బటన్ నొక్కడంతో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు పలు పథకాల ద్వారా గత 58 నెలల్లో పేదలకు అందాయి. మరి వాళ్లు వేసే బాణాలు జగన్‌కు తగులుతున్నాయా? లేక ఆ రూ.2.70 లక్షల కోట్లు అందుకున్న అక్కచెల్లెమ్మల కుటుంబాలకు తగులుతున్నాయో ఆలోచన చేయమని కోరుతున్నా. వారంతా బాణాలు ఎక్కుపెట్టింది మీ అందరి మంచి కోరుతూ మనం తీసుకొచ్చిన వ్యవస్థలపై, పథకాలపై. అక్క చెల్లెమ్మల సాధికారత, పేద బిడ్డల బంగారు భవిష్యత్తు, అవ్వాతాతల సంక్షేమం, రైతన్నలకు అందుతున్న రైతు భరోసాపై చంద్రబాబు, ఆయన పెత్తందారుల బృందం ప్రకటించిన యుద్ధమిది. పుట్టుకతోనే రొయ్యకు మీసాలు.. బాబుకు మోసాలు రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతో ఎలా వచ్చాయో భీమవరంలో తేల్చేద్దాం. బాబు వస్తే జాబులు రావడం కాదు.. ఉన్నవి ఎలా ఊడిపోతాయో, రైతులను ఎలా ముంచాడో మొన్ననే పిడుగురాళ్ల సిద్ధం సభలో చెప్పా. టీడీపీ, ఎల్లో మీడియా చంద్రబాబును జాకీలు, పొక్లెయిన్లతో లేవనెత్తుతూ చేస్తున్న మోసాలు, పచ్చి అబద్ధాల గురించి ఇవాళ తేలుద్దాం. ఆ ప్రచారాల్లో ఎంత నిజం ఉందో చూద్దాం. ఖాళీ డబ్బాలో రాళ్లు వేస్తే డబడబ సౌండ్ వచ్చిన తరహాలో బాబు వల్లే అభివృద్ధి అంటూ ఊదరగొడుతుంటారు. అసలు బాబుకు – అభివృద్ధికి ఏమైనా సంబంధం ఉందేమో మీరే చెప్పండి. సెల్‌ఫోన్‌ను కనిపెట్టిందీ, సత్య నాదెళ్లను చదివించిందీ తానేనని చెప్పుకునే బాబు పాత డైలాగులు కాసేపు పక్కనబెట్టి మీ అందరికీ బాగా గుర్తున్న 2014 ఎన్నికల్లో ఆయన ఏం చెప్పారో చూద్దాం. కొత్త రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఞుడైన బాబు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ ఎల్లో గ్యాంగ్ డప్పు కొట్టింది. జగన్‌కు అనుభవం లేదు, పిల్లోడని.. బాబుకైతే బాగా అనుభవం ఉంది, ఆయన వస్తేనే అభివృద్ధి అని ఊదరగొట్టారు. చంద్రబాబు సెల్ఫ్‌డబ్బా.. అదిగో హైపర్ లూప్.. బుల్లెట్ రైలు.. మైక్రోసాఫ్ట్ వచ్చేసిందని.. ఏపీలో ఒలంపిక్స్ అని.. ఆమ్స్టర్ డ్యామ్, సింగపూర్, వెనిస్తో పోటీపడే నగరాన్ని నిర్మిస్తున్నామని చంద్రబాబు సెల్ఫ్‌డబ్బా కొట్టుకోలేదా? మరి సింగపూర్ కట్టాడా? హైపర్ లూప్ తెచ్చాడా? బుల్లెట్ రైలు వచ్చిందా? మైక్రోసాఫ్ట్ ఏమైనా తెచ్చాడా? రాష్ట్రంలో ఏమైనా ఒలంపిక్స్ జరిగాయా? కొత్తగా ఏమైనా పోర్టులు కట్టాడా? ఫిషింగ్ హార్బర్లు కట్టాడా? కనీసం ఎయిర్‌పోర్టులు ఏమైనా కొత్తవి కట్టాడా? జిల్లాకో హైటెక్ సిటీ మీకేమైనా కనిపించిందా? ఎక్కడైనా ఓ మెడికల్ కాలేజీ కట్టాడా? ఇవన్నీ కట్టకపోతే పోనివ్వండి. ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ స్కూల్‌ని, కనీసం వార్డునైనా బాగు చేశాడా? ఎక్కడైనా ఒక ఊరిలో సచివాలయం, విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాడా? గ్రామానికి ఫ్యామిలీ డాక్టర్‌ను తెచ్చాడా? మీ ఇంటివద్దకే ఆరోగ్య సురక్ష వచ్చిందా? డిజిటల్ లైబ్రరీలు, మారుమూల గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించాడా? రైతన్నకు మేలు చేస్తూ ఆర్బీకే వ్యవస్థను తెచ్చాడా? ఒక వలంటీర్ వ్యవస్థను తెచ్చాడా? మరి ఇలాంటి బాబు ఏం చేశాడని అభివృద్ధి కింగ్ అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు? మీదంతా బోగస్ రిపోర్టు కాదా? మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్టు.. ► వాయువేగంతో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీల పనులు ► కొత్తగా, శరవేగంగా మరో నాలుగు సీ పోర్టుల పనులు ► కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్ల పనులు వడివడిగా ► కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు ► 15 వేలకుపైగా సచివాలయాల ఏర్పాటు ► నాడు–నేడుతో బాగుపడ్డ స్కూళ్లు, ఆస్పత్రులు ► కొత్తగా 15 వేలకుపైగా విలేజ్, వార్డు క్లినిక్స్ ► కొత్తగా 11 వేలకుపైగా ఆర్బీకేలు ► కొత్తగా ఇప్పటివరకు 3 వేలకుపైగా డిజిటల్ లైబ్రరీల నిర్మాణం ► గ్రామానికే ఫైబర్ గ్రిడ్ సదుపాయం ► రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడుల రాక ► విమానాశ్రయాల విస్తరణ, వాయువేగంతో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు ► 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడ్స్, ఎంఎస్ఎంఈలకు ఆపన్న హస్తం ► స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, వాహనమిత్ర, మత్స్యకార భరోసా, చేదోడు, తోడు, నేతన్ననేస్తం, ► దేశంలో అభివృద్ధిలో టాప్ 5 రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ ► ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా ఇంటివద్దకే పథకాలు, సేవలు 2014లో బాబు మోసాలిలా.. రూ.87,612 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశాడా?రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు, కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా? ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు చొప్పున బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. ఎవరికైనా చేశాడా? ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు. ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, ఇల్లు కూడా ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చారా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. మరి చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామని నమ్మబలికిన బాబు చేశాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీని నిర్మించాడా?.. భీమవరంలో కనిపిస్తోందా? ఇన్ని ప్రధాన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశాడా? ప్రత్యేక హోదా తెచ్చాడా? సూపర్ సిక్స్, సెవన్ అంటూ ఇప్పుడు మళ్లీ మోసాలకు బాబు తయారు. వెలిగించండి ఫోన్లలో టార్చిలైట్లు.. ఇవాళ ఎక్కడైనా లంచాలు అనే మాట వినిపిస్తోందా? 58 నెలల్లో ఎలాంటి వివక్ష లేని పారదర్శక వ్యవస్థలను తెచ్చింది మీ బిడ్డ కాదా? గతంలో పెన్షన్ కావాలంటే లంచం.. సబ్సిడీ లోన్లు కావాలన్నా లంచాలే.. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలే. మాయలు, మోసాలు చేసి గ్రాఫిక్స్ చూపించేవాడిని ఏమంటాం? ఛీటర్.. మోసగాడనే కదా? మాయలోడు అనేకదా అంటాం. మన ఖర్మ ఏమిటోగానీ ఐదేళ్ల క్రితం ఆ మనిషిని మనం ముఖ్యమంత్రి అని అన్నాం. చంద్రబాబు చరిత్రను ప్రతి ఒక్కరికీ వివరించండి. మోసాలతో పోరాడుతూ రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? వారి చీకటి యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీరంతా సెల్ఫోన్లలో టార్చిలైట్లు వెలిగించి సంఘీభావం తెలియచేయండి. వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు లేని పాలన కొనసాగాలన్నా, వ్యవస్థలు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ సీట్లలో మన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి. జగన్‌కు తోడుగా కోట్ల గుండెలు.. ఈ యుద్ధంలో తలపడటానికి మీరంతా సిద్ధమేనా? జగన్ ఎన్నడూ ఒంటరి కానే కాదు. మంచి చేసిన జగన్‌కు మద్దతుగా ఏ ఇంట్లో చూసినా పేదల సైన్యం తోడుగా ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో జగనే ఉండాలి.. జగనే రావాలి.. మా బిడ్డే కావాలి అని కోట్ల మంది దీవిస్తున్నారు. ఇంటికే వస్తున్న రూ.3 వేల పెన్షన్ అందుకుంటున్న అవ్వాతాతలు జగన్‌కు తోడుగా ఉన్నారు. అమ్మ ఒడి నుంచి చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, సున్నావడ్డీ, విద్యాదీవెన, వసతి దీవెన దాకా ప్రతి ఇంట్లో పథకాలు అందుకుంటున్న అక్కచెల్లెమ్మలు నా తమ్ముడు, నా అన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. బాగుపడ్డ ఆస్పత్రులు, మెరుగైన ఆరోగ్యశ్రీ, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, ఇంటివద్దే పరీక్షలు – మందులు .. వీటన్నిటితో జీవితాలు మెరుగైన పేదలంతా మాకు తోడుగా నిలబడే వ్యక్తి ఒక్క జగన్ మాత్రమేనని భావిస్తూ మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. జగన్ ఉంటేనే స్కూళ్లు, పిల్లల చదువులు బాగుంటాయని, మరో 10–15 ఏళ్లలో మా బిడ్డలు కూడా పెద్దవారి పిల్లల మాదిరిగా అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడే పరిస్థితి వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఒక్క జగన్ ఉంటేనే క్రమం తప్పకుండా రైతు భరోసా వస్తుందని, గ్రామాల్లో ఆర్బీకేలు పని చేస్తాయని, దళారీలు లేకుండా పంటను అమ్ముకునే పరిస్థితి ఉంటుందని నమ్ముతూ ప్రతి రైతన్నా నాకు తోడుగా ఉన్నాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి జరిగింది కాబట్టే ప్రతి ఇంట్లోనూ జగన్‌కు అండగా ఉన్నారు. మరి ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉండగా జగన్ ఒంటరి కానే కాదు. హత్యాయత్నంపై దిగజారుడు వ్యాఖ్యలా? నిత్యం రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తపించే ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం చేయడాన్ని ప్రజలు సహించలేకపోతున్నారు. జగనన్నను ఆప్యాయంగా చేయి పట్టుకుని పలకరించేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. భగవంతుడి దయ వల్ల సీఎంకు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటుంటే మానవత్వం లేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 60 ఏళ్లకే రూ.3 వేల చొప్పున íపింఛన్లను ఇంటివద్దే అందిస్తున్నందుకు కక్ష గట్టారా? నిరుపేద బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తున్నందుకు కక్షగట్టారా? సీఎం జగన్‌కు కోట్లాదిమంది ఆశీర్వాదం ఉంది. స్వల్ప వ్యవధిలో సీఎం రెండోసారి భీమవరం రావడం సంతోషంగా ఉంది. పశ్చిమ గోదావరిపై ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు చూపుతున్నందుకు ధన్యవాదాలు. – గ్రంధి శ్రీనివాస్, ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే