సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22 రోజు షెడ్యూల్‌ను సీఎంఓ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనతో సీఎం జగన్ బస్సు యాత్ర ముగియనుంది.
యాత్రలో భాగంగా ఉదయం 9 గంటలకు అక్కివలస(రాత్రి బస చేసిన ప్రాంతం) నుంచి బయల్దేరుతారు. ఎచ్చెర్ల, కుశాలపురం, శ్రీకాకుళం బైపాస్, పలివలస, నరసన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరుశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరుశురాంపురం జంక్షన్ వద్ద సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకుబయల్దేరుతారు. 4.20 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 5.20 గంటల వరకు సభలో ప్రసంగించనున్నారు.
అనంతరం అక్కడి నుంచి బయల్దేరి అక్కవరం హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో విశాఖపట్నం విమాశ్రయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 6.15 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. 6.30 గంటలకు విశాఖపట్నం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లనున్నారు. 7.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టునుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకోనున్నారు.
చదవండి: మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలన్న: YSRCP సోషల్ మీడియా వింగ్
జనమే సైన్యంగా సంక్షేమసారథి యాత్ర
సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ప్రారంభించారు. 43 నుంచి 45 డిగ్రీల మండుటెండల్లోనూ.. రాత్రి పొద్దుపోయినా సీఎం జగన్‌ను చూసేందుకు ప్రజలు ఆరాటపడుతున్నారు. సీఎం జగన్‌ను దగ్గరి నుంచి చూసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే ఫోటో దిగేందుకు బస్సు వెంట పరుగులు తీస్తున్నారు.
అడుగడుగునా జనంతో మమేకమవుతూ.. బాధితులకు భరోసా ఇస్తూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. జనమే సైన్యంగా సంక్షేమ రథసారథి ప్రారంభించిన బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో బస్సు యాత్ర ముగియనుంది. ఇప్పటిదాకా 21 రోజులు పాటు 22 జిల్లాల్లో యాత్ర సాగింది. బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలు.. వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్ 15 భారీ బహిరంగ సభల్లో(మంగళవారం సభతో సహా) పాల్గొని ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment