భీమవరం ‘మేమంతా సిద్ధం’సభలో సీఎం జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌ | CM YS Jagan Memantha Siddham Bus Yatra 16th Day Updates | Sakshi
Sakshi News home page

భీమవరం ‘మేమంతా సిద్ధం’సభలో సీఎం జగన్‌ స్పీచ్‌ హైలైట్స్‌

Published Tue, Apr 16 2024 8:59 AM | Last Updated on Tue, Apr 16 2024 9:36 PM

CM YS Jagan Memantha Siddham Bus Yatra 16th Day Updates - Sakshi

Live Updates..

గరగపర్రు చేరుకున్న సీఎం జగన్..

  • గరగపర్రు అంబేద్కర్‌ విగ్రహం వద్ద సీఎం జగన్‌కు స్వాగతం పలకిన ప్రజలు

భీమవరంలో కెరటాల్లా పోటెత్తిన అభిమాన జనసంద్రం.

  • సీఎం వైఎస్‌ జగన్‌ రోడ్‌షోకు పోటెత్తిన జనకెరటాలు.
  • డాక్టర్ బీవీరాజు స్టాట్యూ సర్కిల్‌లో ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం.
  • వేలాదిమంది మహిళలు దారిపొడవునా మానవహరమై ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం.
  • మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రికి రోడ్‌షోలో అండగా నిలిచిన అక్కచెల్లెమ్మలు.

భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌ ప్రసంగం

  • భీమవరంలో జన సముద్రం కనిపిస్తోంది
  • ఉప్పొంగిన ప్రజాభిమానం కనిపిస్తోంది
  • మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు
  • జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్థమా?
  • దుష్టచతుష్టయం కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా?
  • మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్‌

  • ఈ ఎన్నికలు మన తలరాతను మార్చేవి
  • పేదలకు, చంద్రబాబు మోసాలకు జరుగుతున్న ఎన్నికలు ఇవి
  • మీ బిడ్డది పేదలపక్షం

  • చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువగా వస్తుంది
  • ఆయన మాటల్లో, మాట్లాడేటప్పుడు హైబీపీ వస్తా ఉంటుంది.. మీరు గమనించే ఉంటారు
  • శాపనార్థాలు పెడుతూ ఉంటాడు.. నాకు ఏదో అయిపోవాలని కోరుకుంటాడు
  • రాళ్లు వేయండని పిలుపునిస్తా ఉంటాడు ఈ పెద్ద మనిషి
  • నాపై చంద్రబాబుకు అంత  కోపం ఎందుకంటే..
  • ఎందుకో తెలుసా.. అడగకూడని ప్రశ్న చంద్రబాబుని అడిగినందుకు..
  • అదేమిటో తెలుసా..  బాబు.. బాబు.. చెరువులో కొంగ మాదిరిగా ఎదురుచూస్తూ ఇంకొపక్క  కొంగమాదిరిగా జపం చేస్తావ్‌ ఎందుకయ్యా అని అడగా
  • ఇలా అడగడం తప్పా చెప్పండి
  • చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్‌ ఒక్కటైనా ఉందా అని అడిగా

  • నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబుని అడిగా.. అందుకే నాపై కోపం, ఆయనకు అందుకే బీపీ ఎక్కువై పోతోంది.
  • ఆయన చేసిన మంచి ఏ ఒక్కటీ గుర్తుకురాకపోగా, ఆయన పేరు చెబితే గుర్తుకువచ్చేవి ఏమిటో తెలుసా.. వెన్నుపోట్లు, మోసం, దగా, అబద్ధాలు, కుట్రలు
  • ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువస్తాయి
  • అదే మాదిరిగా దత్తపుత్తా, దత్తపుత్రా.. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి, పిల్లల్ని పుట్టిచ్చి, నాలుగేళ్లకు, ఐదేళ్లకొకసారి కార్లును మార్చేసినట్లుగా భార్యను వదిలేసినట్లుగా నియోజకవర్గాలకు అలవోకగా మార్చేస్తున్నావ్‌.. ఏం మనిషవయ్యా అని అడిగా
  • అందుకే దత్తపుత్రుడిలో బీపీ బాగా కనిపిస్తోంది
  • అయ్యా దత్తపుత్రా.. ఒకసారి చేస్తే పొరపాటు.. మళ్లీ మళ్లీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా
  • పవిత్రమైన సంప్రదాయాన్ని నడినొడ్డమీదకు తీసుకురావడం, ఆడవాళ్ల జీవితాలను చులకనగా చూపించడం తప్పుకాదా
  • ఇది నేను అడిగితే తప్పుకాదా

  • ఇలా నిన్ను చూసి ఇదే తప్పు ప్రతీ ఒక్కరు చేస్తే.. ఇలా భార్యల్ని మార్చేస్తే అక్క చెల్లెమ్మల బ్రతుకులు ఏం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఆ పెద్ద మనిషిలో బీపీ కూడా పెరిగిపోతోంది
  • చేయిలూపేస్తాడు.. కాళ్లు ఊపేస్తాడు.. తల ఊపేస్తాడు
  • పవన్‌ కల్యాణ్‌ బీపీని అసలు తట్టుకోలేము

  • చంద్రబాబుకు, దత్తపుత్రుడికి, ఈ బాజాభజీంత్రీలకు ఎందుకు నాపై కోపం వస్తుందంటే..
  • కారణం ఈ వర్గాలన్నింటినీ.. ఈ పేదలను, ఈ అక్కా చెల్లెమ్మలను, సామాజిక వర్గాలను,  పిల్లలను, అవ్వాతాతలను, రైతన్నలను నువ్వు ఎలా ముంచావంటే చెప్పడానికి బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి
  • చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణలు కనిపించవు
  • ప్రజలిచ్చిన అధికారాన్ని ఏనాడు కూడా చంద్రబాబు మంచి కోసం ఉపయోగించలేదు
  • మోసాల్ని, అబద్ధాల్ని, వెన్నుపోట్లని, కుట్రల్ని, పొత్తుల్ని నమ్ముకుని ఈ రోజు చంద్రబాబు రాజకీయం చేయాల్సి వస్తుంది
  • ఎందుకంటే చేసిన మంచి లేదు కాబట్టే.. వీటిని నమ్ముకుని ఇలా రాజకీయాలు చేస్తా ఉన్నాడు
  • మీ బిడ్డ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టే.. పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా జనం మద్దతులేని ఈ చంద్రబాబు.. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ​‍్యోతి, ఒక టీవీ-5, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్‌.
  • వీరందరీతో పాటు కుట్రలు, మోసాలు, ఇతర పార్టీల్లో చంద్రబాబు పెట్టుకున్న కోవర్టులు కలిసి ఒక్క జగన్‌ మీద దండయాత్రలు చేస్తా ఉన్నారు
  • జగన్‌ ఒక్కడు.. బాబుకు పదిమంది సేనానులు
  • వారంతా కూడా బాణాలు పట్టుకుని ఉన్నారు
  • మరి వారు బాణాలు తగిలేది ఎవరికి అని అడుగుతున్నా.. జగన్‌ పేదలకిచ్చే పథకాలకా అని ప్రతీ ఒక్కర్నీ ఆలోచన చేయమని అడుగుతున్నా
  • వారు బాణాలు తగిలేది.. జగన్‌కు జగన్‌ పెట్టిన వాలంటీర్లు, సచివాలయవ్యవస్థలకా?
  • వారు బాణాలు తగిలేది.. జగన్‌ తెచ్చిన ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌ల వ్యవస్థలకా?
  • వారు బాణాలు తగిలేది.. జగన్‌కా.. జగన్‌ మార్పులు తెస్తూ పిల్లల భవిష్యత్‌లకా, వారి చదువులకా?
  • వారు బాణాలు తగిలేది.. అవ్వా తాతాల పెన్షన్‌కు తగులుతా ఉందా.. లేక జగన్‌కు తగులుతా ఉందా?
  • వారు బాణాలు తగిలేది.. జగన్‌కు తగులుతా ఉందా.. రైతన్నకు ఇస్తున్న రైతు భరోసాకా?
  • వారు బాణాలు తగిలేది.. జగన్‌కు తగులుతున్నాయా.. లేక అక్కచెల్లెమ్మలకోసం, వారి అభ్యుతన్న కోసం, వారి కుటుంబాలకు తగులుతుందా?
  • నా అక్క చెల్లెమ్మల కోసం, వారి సంక్షేమ కోసం వారి ఖాతాల్లోకి రెండు లక్షల డబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ వేశాడు
  • వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతున్నాయో ఆలోచన చేయమని అడుగుతున్నాను
  • నేను తీసుకొచ్చిన పథకాలమీద.. వీరంతా బాణాలు ఎక్కుపెడుతున్నారు ఆలోచన చేయమని అడుగుతున్నాను
     
  • ఈ యుద్ధం.. పేదల ప్రయోజనాల మీద, అక్క చెల్లెమ్మల సాధికారత మీద, పేద పిల్లల బంగారు భవిష్యత్‌ మీద, అవ్వా తాతల సంక్షేమ మీద, రైతన్నలకు అందుతున్న రైతు భరోసా మీది చంద్రబాబు అండ్‌ ఆయన పెత్తందార్ల బృందం ప్రకటించిన యుద్ధం ఇది అని ప్రతీ ఒక్కరు గమనించాలని కోరుతున్నాను
  • ఈ యుద్ధంలో తలపడటానికి మీరంతా కూడా సిద్ధమేనా?
  • కాబట్టే చెబుతున్నా.. జగన్‌ ఒంటరి కాదు.. మంచి చేసిన జగన్‌కు మద్దతుగా ప్రతీ ఇంట్లో సైన్యం ఉంది. 
  • జగనే ఉండాలి.. జగనే కావాలి.. జగనే రావాలి అని ఈరోజు ప్రతీ ఇంట్లో కూడా మద్దతు తెలిపే వారున్నారు
  • జగన్‌కు కోట్లాది మంది సైన్యం ఉంది.
  • నాడు-నేడు ద్వారా విద్య వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చాం
  • మీ బిడ్డకు రైతన్న, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు తోడుగా ఉ‍న్నారు
  • ఇంతమంది తోడుగా ఉన్న మీ జగన్‌ ఎప్పుడూ ఒంటరి కాదు

  • చంద్రబాబుపై ఎల్లో మీడియా ఇచ్చేది అతిపెద్ద బోగస్‌ రిపోర్ట్‌
  • చంద్రబాబు సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నాడు
  • 2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా?
  • రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
  • పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?
  •  ఆడబిడ్డపుడితే రూ. 25వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?
  • ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?
  • ఉ‍ద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?
  • అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
  • రూ. 10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు.. చేశాడా?
  • ప్రతి జిల్లాలో హైటెక్‌ సిటీ అన్నాడు.. ఎక్కడైనా కనిపించిందా?
  • కొత్తగా పోర్టులు కట్టాడా?
  • మెడికల్‌ కాలేజీలు కట్టాడా?
  • సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు చేశాడా?
  • ప్రభుత్వ బడులు, ఆస్పత్రులనైనా బాగు చేశాడా?
  • మళ్లీ ఈ ముగ్గురూ కలిసి కొత్త కొత్త మోసాలతో వస్తున్నాడు
  • సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటున్నారు.. నమ్ముతారా

  • పేదల భవిష్యత్‌ను కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా?
  • వారి చీకటి యుద్ధాన్ని ఎదుర్కోనేందుకు మీరంతా కూడా మీ జేబుల్లోంచి సెల్‌ఫోన్లు తీసి లైట్‌ ఆన్‌ చేసి మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి
  • మన సంక్షేమం ఇలాగే  కొనసాగడానికి  మీరంతా సిద్ధమేనా?

ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

  • పశ్చిమగోదావరి జిల్లా భీమవరం విచ్చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డిగారికి ఘనంగా స్వాగతం తెలియజేస్తున్నాం
  • భీమవరానికి ఈ రెండు మూడు నెలల్లోనే రెండుసార్లు రావడం జరిగింది
  • పశ్చిమగోదావరి జిల్లా మీద ప్రత్యేకమైన అభిమానం చూపెడుతున్న సీఎం జగన్‌కు  హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
  • ఇక్కడ విచ్చేసిన జగనన్న  అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
  • ఇక్కడకు వచ్చిన అశేష జనమంతా మీ  అభిమానులన్నా.
  • మీ చేయిని పట్టుకుని ఓదార్చాలని ఇక్కడకు వచ్చిన మీ శ్రేయోభిలాషులన్నా
  • మీ అభిమానులంతా మా అన్నపై దాడి జరిగినా పెద్ద ప్రమాదం తప్పింది కదా అని సంతోషిస్తుంటే..
  • దుర్మార్గులు, దుష్టులు.. మానవత్వం లేని మృగాలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌లాంటి వారు మాట్లాడే  మాటలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది.
  •  అన్నా.. వారికి ఎందుకంత నీ మీద అంత కక్ష, ద్వేషం
  • ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి జన హృదయాల్లో నిలిచిపోయినందుకా అన్నా మీపై వారికి ద్వేషం

భీమవరం మేమంతా సిద్ధం సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్‌

  • బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్‌ జగన్‌
  • భీమవరం సభకు పోటెత్తిన ప్రజాభిమానం
  • ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్‌
  • జై జగన్‌ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం

ఉండి సెంటర్‌కు చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర

  • కాసేపట్లో భీమవరంలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ
  • బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్‌ జగన్‌
  • పశ్చిమగోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర
  • పశ్చిమలో జనజాతర, కిక్కిరిసిన రహదారులు
  • రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం
  • మండుటెండలోనూ జననేత కోసం పోటెత్తిన అభిమానం
  • సీఎం జగన్‌కు అడగడుగునా జన నీరాజనాలు
  • దారి పొడవునా సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం

గణపవరం చేరుకున్న సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర


సీఎం జగన్‌కు దారిపొడువున్న అపూర్వ ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు. 


ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్‌

సీతారామపురం చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్ర

గణపవరం సెంటర్‌లో సీఎం జగన్ రాక కోసం ఎదురుచూస్తున్న జన సందోహం

నారాయణపురం స్టే పాయింట్‌ వద్ద వైఎస్సార్‌సీపీలో భారీగా చేరికలు.. 

  • ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక పలువురు నేతలు. 
  • సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేతలు ఆకుర్తి శేఖర్, గారపాటి వాసు, గౌడ సంఘం నేత మాదు గంగాధర్‌.
  • పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్‌. 
  • కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి.
  • పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జనసేన పార్టీ కీలక నేత
  • 2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్ధి చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్‌ అశోక్‌ కుమార్, దాచేపలి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు వైఎస్సార్‌సీపీలోకి చేరిక.
  •  టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్‌.పేరయ్య, టీడీపీ సీనియర్‌ నేత గుంటుపల్లి రామారావు.
  • కార్యక్రమంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి, న

నిడమర్రు చేరుకున్న సీఎం జగన్

  • ముఖ్యమంత్రి జగన్‌కు  ఘనస్వాగతం  పలికిన ప్రజలు.
  • నిడమర్రు వద్దకు భారీగా చేరుకున్న మహిళలు, వృద్ధులు.
  • మండుటెండలో ఉదయం 9 గంటల నుండి జగన్ కోసం ఎదురుచూస్తున్న మహిళలు
  • మళ్ళీ సీఎం కావాలంటూ నినాదాలు చేసిన మహిళలు
  • పెత్తందార్లతో జగన్ చేసే యుద్ధానికి  ఆయనతో పాటు మేమంతా సిద్ధం అంటున్న ప్రజలు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగుతోంది. 

కాసేపట్లో నిడమర్రు చేరుకోనున్న సీఎం జగన్‌. 

ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు నిడమర్రు సెంటర్‌కు భారీ చేరుకున్న ప్రజలు

రాచూరుకు చేరుకున్న సీఎం బస్సుయాత్ర..

ఉంగుటూరు నియోజకవర్గం రాచూరుకు.. చేరుకున్న సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 

ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్న గోదావరి జిల్లావాసులు 

గ్రామ గ్రామాన సంక్షేమ సారధి సీఎం జగన్‌కు హారతులు పడుతున్న అక్క చెల్లెమ్మలు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 16వ రోజు సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభైంది. 

కాసేపట్లో సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభం కానుంది. 

పశ్చిమ గోదావరి సిద్ధమా?

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజైన మంగళవారం నారాయణపురం నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి సీఎం జగన్‌ తొమ్మిది గంటలకు బయలుదేరనున్నారు. 

నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివారులో సీఎం జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్‌ రోడ్‌ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్‌ కాలేజ్‌ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్‌ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement