west godavari District
-
రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్నిప్రమాదం
తూర్పు గోదావరి జిల్లా : రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్లో మంటలు చెలరేగాయి. కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి ఎగిసి పడుతున్నాయి. మంటలు వ్యాపించడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే మంటలు వ్యాపించడంతో అగ్నికి ఆహుతైన పండ్లు నిల్వ ఉంచిన షెడ్డు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది.ఇతర షాపులకు వ్యాపించకుండా మంటల్ని పండ్ల వ్యాపారులు, స్థానికులు అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. -
వణికిస్తున్న బర్డ్‌ఫ్లూ.. చికెన్ షాపుల మూసివేతకు ఆదేశాలు
సాక్షి,పశ్చిమగోదావరి : గోదావరి జిల్లాలను బర్డ్‌ఫ్లూ వణికిస్తోంది. కోవిడ్ పరిస్థితుల్ని బర్డ్ ఫ్లూ రెడ్ జోన్ ప్రాంతం తలపిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫామ్ కిలోమీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు.తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ నుండి నమూనాలను పరీక్షించగా ఏవియన్ ఇన్ఫ్లుఎంజాగా నిర్ధారణైంది. దీంతో కాళ్ల మండలం పెద్ద అమీరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. అనంతరం, వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుండి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా విధించారు.ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫెక్షన్ జోన్ నుండి 1-10 కి.మీ. ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా (అలర్ట్ జోన్) గుర్తించారు. అదే సమయంలో వ్యాధి సోకిన, హెచ్చరిక జోన్ (0-10 కి.మీ) లోపల, వెలుపల కోళ్లు, గుడ్ల రవాణా నిషేధం విధించారు. చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలో అన్ని చికెన్,ఎగ్స్ దుకాణాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు 20 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. కోళ్లు, బాతులతో వస్తున్న లారీలను వెనక్కి పంపుతోంది. -
తాడేపల్లిగూడెంలో అమానుష ఘటన
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. పసికందును పూడ్చిపెట్టడానికి ఒడిగట్టారు తల్లిదండ్రులు. తణుకు సాయి హాస్పిటల్లో 28వ తేదీ ఉదయం 10: 30ని.లకు సంధ్యా కుమారి అనే మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డకు తలలో ప్రాబ్లమ్ కారణంగా చనిపోయే అవకాశం ఉందని బావించిన తల్లిదండ్రులు.. ఆ శిశువును బతికుండగానే పూడ్చి పెట్టేందుకు ప్రయత్నించారు.బిడ్డను తాడేపల్లిగూడెం శ్మశానంలో పూడ్చేందుకు ప్రయత్నిస్తుండగా బిడ్డ అరుపులతో కాటికాపరి అలర్ట్ అయ్యాడు. దాంతో ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు కాటికాపరి, బిడ్డను పూడ్చి పెట్టేందకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు పారిపోగా, మరొకర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులు ఉంగుటూరు మండలం బాదంపూడికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
డామిట్.. పారని ‘పార్శిల్’ పాచిక (క్రైమ్ స్టోరీ)
సాక్షి, భీమవరం/ఉండి/ఆకివీడు/కాళ్ల: తాను రెండో పెళ్లి చేసుకున్న అత్తమామల ఆస్తి మీద కన్నేశాడు.. వదినకు వాటా దక్కకుండా చేసేందుకు తన రెండో భార్యతో కలిసి పథకం పన్నాడు.. అందుకు మృతదేహం అవసరమై తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఓ అమాయకుడిని అంతమొందించాడు. బాక్సులో మృతదేహాన్ని ఉంచి రూ.1.30 కోట్లు ఇవ్వాలంటూ లెటర్ పెట్టి వదినకు పార్శిల్ పంపాడు. ఇంటికి పార్శిల్ వచి్చనట్లు ఫోన్ రావడంతో ఏమీ తెలీనట్లుగా వచ్చాడు. హత్యానేరం పడకుండా మృతదేహాన్ని మాయం చేయడం.. ఆగంతకునికి ఇచ్చేందుకు డబ్బులు తాను సర్దుబాటు చేస్తున్నట్లు నటించి వదినకు వచ్చే వాటాను తమ పేరిట రాయించుకోవాలనుకున్నాడు. కానీ, కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారంలో నిందితులందరూ పోలీసులకు చిక్కారు. ఆద్యంతం క్రైం థ్రిల్లర్‌ను తలపించిన ఈ కేసుకు సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి..పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం గాంధీనగర్‌కు చెందిన శ్రీధర్‌వర్మ అలియాస్ సుధీర్‌కు ఇదివరకే వివాహం కాగా... అతని మొదటి భార్య తన ఇద్దరు పిల్లలతో గాంధీనగర్‌లో ఉంటోంది. అతను తన కులం తప్పుగా చెప్పి యండగండికి చెందిన మరో మహిళను ప్రేమ పేరిట రెండో వివాహం చేసుకున్నాడు. అంతేకాక.. ఫేస్బుక్లో పరిచయమైన కాళ్ల గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. రెండో భార్య రేవతి తల్లిదండ్రులకు యండగండిలో ఇంటితోపాటు మూడెకరాల వరకు పొలం ఉంది. ఆమె అక్క తులసికి ఈ ఆస్తిలో వాటా ఉంది. తులసికి ఆస్తి దక్కకుండా కాజేసేందుకు శ్రీధర్‌వర్మ, రేవతి పథకం పన్నారు. గ్రామంలోని జగనన్న కాలనీలో తులసి ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా క్షత్రియ ఫౌండేషన్ పేరిట ఆమెకు రెండుసార్లు పార్శిల్ ద్వారా నిర్మాణ సామగ్రి పంపించారు. మూడోసారి తులసి తండ్రి ముదునూరి రంగరాజు పేరుతో మృతదేహాన్ని పంపాలని స్కెచ్ వేశారు.బలైన తాగుబోతు.. ఇందులో భాగంగా మృతదేహం కోసం ఎవరో ఒకరిని హత్యచేయాలని నిందితులు భావించారు. అది కుదరకపోవడం.. మరోవైపు భార్య ఒత్తిడి తెస్తుండటంతో శ్రీధర్‌వర్మ కన్ను అతని స్వగ్రామమైన కాళ్ల మండలం గాం«దీనగర్‌లో ఆవారాగా తిరిగే బర్రే పర్లయ్య (38)పై పడింది. పర్లయ్య మద్యానికి బానిసై భార్యాపిల్లలను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. అతనైతే ఎవరికీ అనుమానం రాదని శ్రీధర్‌వర్మ భావించాడు. అనుకున్నదే తడవుగా తాను లీజుకు చేస్తున్న చెరువు వద్దకు పనికి రావాలని చెప్పాడు. ఈ నెల 17న జక్కరం వద్ద అతనిని తన కారులో ఎక్కించుకుని కాళ్ల గ్రామానికి వెళ్లి అక్కడ తన స్నేహితురాలు, ఆమె కుమార్తె అయిన బాలికను ఎక్కించుకున్నాడు. ఉండి మండలం వాండ్రం–పెదపుల్లేరు గ్రామాల మధ్యన ఉన్న లింకు రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకొచ్చి పర్లయ్యతో ఫుల్లుగా మద్యం తాగించాడు. తర్వాత తన స్నేహితురాలి సాయంతో పర్లయ్య మెడకు తాడు బిగించి హత్యచేసి మృతదేహాన్ని తమ వెంట తెచ్చుకున్న బాక్సులో ప్యాక్ చేశాడు. అక్కడి నుంచి తాడేపల్లిగూడెం రోడ్డులోని సాగుపాడు చేరుకుని బాక్సును దింపి ఆటోలో లోడ్ చేసేందుకు తన స్నేహితురాలిని అక్కడ ఉంచాడు. అటుగా వెళ్లే ఆటోను ఆమె ఆపి బాక్సు ఎక్కించే వరకు మైనర్ బాలికతో కలిసి దూరంగా వేచి ఉన్నాడు. అనంతరం.. శ్రీధర్‌వర్మ తల్లీకూతుళ్లను కారులో ఎక్కించుకుని ఇద్దరినీ కాళ్లలోని ఇంటి వద్ద దింపాడు.ఒకరిని మించి మరొకరు.. అక్క ఆస్తిని కాజేయాలని చెల్లి.. ఆస్తి మొత్తాన్ని చేజిక్కించుకున్నాక ఇద్దరు భార్యలను వదిలించుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో ఉడాయించాలని శ్రీధర్‌వర్మ.. ప్రియుడు తెచ్చే ఆస్తితో కలిసి వెళ్లిపోవాలని ఒకరు.. ఇలా ఒకరికి మించి మరొకరు కుట్రపూరిత ఆలోచనలు చేసి చివరకు పోలీసులకు చిక్కారు.కేసు లేకుండా చేస్తానని చెప్పి.. పార్శిల్ అందిన తర్వాత శ్రీధర్ వర్మకు అతని వదిన తులసి వద్ద నుంచి ఫోన్ వచి్చంది. ఇంటి సామాన్లకు సంబంధించి పార్శిల్ వచి్చందని అతనికి చెప్పింది. తాను వచ్చేవరకు దానిని ఓపెన్ చెయ్యొద్దని తులసికి శ్రీధర్‌వర్మ చెప్పాడు. ఇంటికొచ్చి బాక్సు ఓపెన్ చేసి మృతదేహాన్ని చూసి అవాక్కయినట్లు నటించాడు. పోలీసు కేసవుతుందని, అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుందని తన పన్నాగంలో భాగంగా శ్రీధర్‌వర్మ ఆమెను బెదిరించాడు. కేసు లేకుండా అందరినీ మేనేజ్ చేసేందుకు కోటి రూపాయలకు పైనే ఖర్చవుతుందని చెప్పడంతో తులసి అందుకు అంగీకరించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వాలని చూడటంతో ఇంట్లో అందరి వద్ద నుంచి ఫోన్లు తీసేసుకున్నాడు. అప్పటికే తులసి తమ బంధువులకు సమాచారం ఇవ్వడంతో విషయం పోలీసులకు చేరింది. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఆటకట్టు.. మొత్తానికి.. విషయం బయటకు పొక్కడంతో శ్రీధర్‌వర్మ పోలీసులకు దొరక్కుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసి కృష్ణాజిల్లా బంటుమిల్లి గ్రామంలో దాక్కున్నాడు. దర్యాప్తులో భాగంగా శ్రీధర్‌వర్మ భార్యలను, అనుమానితులను పోలీసులు విచారించారు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ రికార్డుల ఆధారంగా శ్రీధర్‌వర్మ వివరాలు మీడియాకు విడుదల చేశారు. బంటుమిల్లికి చెందిన స్థానికుడొకరు పోలీసులకు సమాచారం అందించడంతో శ్రీధర్‌వర్మను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచి్చంది. గురువారం శ్రీధర్‌వర్మ, ఇద్దరు మహిళలు, మైనర్ బాలికను సంఘటనాస్థలానికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి చాకచక్యంగా ఈ కేసును ఛేదించినట్లు తెలుస్తోంది.ఒకటి, రెండు రోజుల్లో నిందితులను పోలీసులు కోర్టుముందు హాజరుపరిచే అవకాశముంది. -
ఏపీ హోంమంత్రి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,పశ్చిమ గోదావరి : డ్రగ్స్ తీసుకుంటేనే, స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లా పాలకొల్లు మండలంలో ఇవాళ (డిసెంబర్15) ఉదయం పాలకొల్లులో ‘సేవ్ గర్ల్ చైల్ఢ్’ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు.ఈ సందర్భంగా వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యువత గంజాయి మత్తుకు అలవాటుపడుతోంది. సినిమాలు చూసి ప్రభావితమవుతున్నారు. గంజాయి,డ్రగ్స్,మందు తాగేవాళ్లను హీరోలుగా చూస్తున్నారు. చిన్నారులపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం,రాష్ట్రంలో శాంతి భద్రతలు సంరక్షించే హోంమంత్రి హోదాలో అనిత ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై వివాదం రాజుకుందిఇలా హోమంత్రిగా హోదాలో ఉన్న వంగలపూడి అనిత ఈ నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు పారేసుకున్నారు.అసెంబ్లీలో అనిత ఏం మాట్లాడారంటే?ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో కంటే.. తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేటు విపరీతంగా తగ్గిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ ఆందోళనకుదిగగా.. మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుబట్టారు.ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడీ వేడి చర్చ నడిచింది. తొలుత.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరదు కళ్యాణి మాట్లాడారు. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. అలాగే.. మహిళల భద్రత పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని, దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించామని ఆమె అన్నారామె. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొయ్యే మోషేన్‌రాజు, మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు.బాధ్యత గల మంత్రిగా ఉండి.. దమ్ము ధైర్యం గురించి మాట్లాడం సరైనది కాదు అని అన్నారాయన. దీంతో ఆమె క్షమాపణలు చెప్పి కూర్చున్నారు. అయితే అనిత వ్యాఖ్యలపై నిరసనగా.. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైనందున మండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. అంతకు ముందు..‘‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పై నేరాలు, వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళల పై జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాలు జరుగుతున్నాయి. ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు. హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు. ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. దిశ యాప్ ని కొనసాగిస్తున్నారా..? లేదా..?. దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా?. మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..? అని మండలిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు. -
ఏపీలో ఆగని ‘కూటమి ’వేధింపులు
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ బూడిద సుజన్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దివ్యాంగుడైన సుజన్ కుమార్‌పై సైతం కేసు నమోదు చేయడం పట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.సుజన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, సోషల్ మీడియా కార్యకర్తలపై కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను మేము ప్రజల్లోకి తీసుకువెళుతున్నామనే ఒకే ఒక్క కారణంతో మా గొంతు నొక్కాలని చూస్తుందన్నారు. ప్రభుత్వం పాలన వైఫల్యం చెందింది కాబట్టే.. సోషల్ మీడియా గొంతు నొక్కాలని చూస్తుంది. నేను దివ్యాంగుడనని కూడా చూడకుండా నాపై కేసు పెట్టారు.’’ అని సుజన్ ఆవేదన వ్యక్తం చేశారు.‘‘వైఎస్ జగన్ నాయకత్వాన్ని కచ్చితంగా బలపరుస్తాం. ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం. వైఎస్ జగన్ ఎన్నో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఆయన కోసం మేము ఎంతవరకైనా తెగిస్తాం. మా గొంతు నొక్కే బదులు ప్రజలకు మంచి చేస్తే వారే మిమ్మల్ని ఆదరిస్తారు. ఎన్ని కేసులు పెట్టిన వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’’ అని సుజన్‌కుమార్ స్పష్టం చేశారు. -
అప్రజాస్వామిక పాలనలో.. ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం: వైఎస్సార్సీపీ
తాడేపల్లి: ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్న కారణంగా తాము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.ఈ మేరకు వైఎస్సార్సీపీ నేతలు గురువారం మీడియాతో మాట్లాడారు. ‘కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. టీడీపీ నేతలు ఎన్ని అఘాయిత్యాలు చేసినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం’ అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఇవి కూడా చదవండి: నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనితదే బాధ్యతనీచ రాజకీయాలకు తెరతీసిన ఎమ్మెల్యే బాలకృష్ణస్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం -
క్యాన్సర్‌ని జయించి శిశువుకు జన్మనిచ్చిన మహిళ
హైదరాబాద్: సాధారణంగా క్యాన్సర్ బాధితులకు జీవితమే అంధకారబంధురంగా ఉంటుంది. అందులోనూ గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ వచ్చిందంటే, ఆ తర్వాత ఇక గర్భం దాల్చడం, పిల్లలు పుట్టడం అనే ఆశలే వదిలేసుకోవాల్సి వస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన 27 ఏళ్ల మహిళకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చినట్లు తెలిసింది. దాంతో వాళ్లు గర్భసంచి తొలగించుకునేందుకు హైదరాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి వచ్చారు. ఇక్కడ ఆమెకు కౌన్సెలింగ్, చికిత్స చేసిన సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్టు, రోబిటిక్ & లాప్రోస్కొపిక్ సర్జన్ డాక్టర్ వసుంధర చీపురుపల్లి ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు.“ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన మౌనిక అనే 27 ఏళ్ల మహిళకు తొలుత ఒకసారి గర్భం వచ్చింది. కానీ కొన్నాళ్ల తర్వాత లోపలున్న శిశువుకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో స్థానికంగా తప్పనిసరై గర్భస్రావం చేయించాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత మౌనిక ఆరోగ్యం బాగోలేదని పరీక్ష చేయించుకోగా, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించారు. దాంతో తప్పనిసరిగా ఆమెకు గర్భసంచి తొలగించాలని అక్కడి వైద్యులు చెప్పారు. కిమ్స్ కడల్స్ సికింద్రాబాద్ ఆస్పత్రిలో ఆ శస్త్రచికిత్స చేయించుకోవాలని భావించి, ఇక్కడకు వచ్చారు. క్యాన్సర్ ఉన్నంత మాత్రాన గర్భసంచి తొలగిస్తే, తర్వాత ఇక జీవితాంతం పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. గర్భసంచి తొలగించకుండానే క్యాన్సర్ చికిత్స చేయొచ్చని, ఆ తర్వాత పిల్లలను కూడా పొందవచ్చని వివరించాము. క్యాన్సర్ ఇతర ప్రాంతాలకు విస్తరించకపోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం నూరుశాతం ఉంటుందని, నిరాశ చెందక్కర్లేదని కౌన్సెలింగ్ చేశాము. అలా రెండు మూడు సార్లు కౌన్సెలింగ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్లు సమాధానపడి, చికిత్సకు సిద్ధమయ్యారు. ముందుగానే పిండాలను (ఎంబ్రియో) సేకరించి, వాటిని ఫ్రీజ్ చేసిన తర్వాత అప్పుడు క్యాన్సర్ శస్త్రచికిత్స ప్రారంభించాము. క్యాన్సర్ ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా గుర్తించి, దాన్ని మాత్రమే తొలగించాము. గర్భసంచికి కూడా కుట్లు వేశాం. తొలగించిన ప్రాంతానికి బయాప్సీ చేయించగా క్యాన్సర్ అక్కడ మాత్రమే ఉందని, ఇతర ప్రాంతాలకు వ్యాపించలేదని నిర్ధారణ అయ్యింది.క్యాన్సర్ చికిత్స పూర్తయిన తర్వాత ఫ్రీజ్ చేసిన రెండు పిండాలను గర్భసంచిలో ప్రవేశపెట్టాము. రెండూ ఫలదీకరణం చెందాయి. అయితే, కుట్లు వేయడం వల్ల గర్భసంచి రెండు పిండాలను మోసే పరిస్థితి ఉండకపోవచ్చని ముందుజాగ్రత్తగా ఒక పిండాన్ని తీసేయాల్సి వచ్చింది. మిగిలిన ఒక పిండాన్నే కొనసాగించాము. మధ్యలో కూడా ఎందుకైనా మంచిదని క్యాన్సర్ పరీక్షలు, ఇతర పరీక్షలు చేశాము. 32 వారాల తర్వాత ముందుజాగ్రత్తగా లోపల శిశువుకు ఊపిరితిత్తులు బలంగా ఉండేందుకు ఇంజెక్షన్లు చేశాము. 34, 35 వారాల సమయంలోనే ప్రసవం కావచ్చని చూశాము గానీ, గర్భసంచి బాగానే ఉండటంతో వేచి చూశాము. సరిగ్గా 37 వారాల తర్వాత అంతా బాగుండటంతో ఆమెకు సిజేరియన్ శస్త్రచికిత్స చేశాము. పూర్తి ఆరోగ్యవంతమైన పాప పుట్టింది.పాప పుట్టిన తర్వాత, ఒకసారి క్యాన్సర్ వచ్చింది కాబట్టి తర్వాత ఇక ఇబ్బంది లేకుండా ఉంటుందని గర్భసంచి తొలగించాల్సిందిగా ఆ దంపతులు కోరారు. కానీ, సిజేరియన్ చేసిన సమయంలోనే హిస్టరెక్టమీ కూడా చేస్తే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, పైగా ఇప్పుడు క్యాన్సర్ సమస్య లేదు కాబట్టి అలాగే వదిలేయడం మంచిదని వారికి చెప్పాము. ఇప్పుడు తల్లీబిడ్డలు ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు” అని డాక్టర్ చీపురుపల్లి వసుంధర తెలిపారు. “ఒకానొక దశలో మేము అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదనుకున్నాం. కానీ డాక్టర్ వసుంధర చీపురుపల్లి, కిమ్స్ కడల్స్ ఆస్పత్రి బృందం ఎంతగానో మాకు నచ్చజెప్పారు. ఇప్పుడు మాకు మంచి ఆరోగ్యకరమైన పాప పుట్టింది. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాము. కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి, డాక్టర్ వసుంధర, ఆమె బృందానికి మేమెంతో కృతజ్ఞులై ఉంటాము” అని మౌనిక భర్త మహేష్ చెప్పారు. -
టీడీపీ అభ్యర్ధి సైలెంట్.. అన్ని సర్దుకుని సొంత నియోజకవర్గానికి పరార్
పోలింగ్‌కు ముందు గెలుపు మాదే అంటూ వీరంగం వేశారు. బస్తీమే సవాల్ అన్నారు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చి మరీ పోటీ చేశారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విజయంపై ధీమాగా ఉన్నారు. కాని బయటి నుంచి వచ్చి సవాళ్ళు విసిరిన టీడీపీ అభ్యర్థి సైలెంట్ అయిపోయారు. అన్నీ సర్దుకుని తన సొంత నియోజకవర్గానికి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కుడుంది? అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థే దొరకలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించగల బలమైన నేత ఎవరూ కనిపించలేదు. దీంతో రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడి తనయుడు బాలసుబ్రహ్మణ్యంను రాజంపేట అభ్యర్థిగా బరిలోకి దింపారు. రాజంపేట అసెంబ్లీ సీటుకు ఉన్న సెంటిమెంట్ ప్రకారం అక్కడ గెలిచి తీరాలనే లక్ష్యంతో బలమైన అభ్యర్థి అంటూ పొరుగు నుంచి సుబ్రహ్మణ్యంను తీసుకువచ్చారు.వాస్తవానికి బాలసుబ్రమణ్యాన్ని టీడీపీ తరపున రాజంపేట ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించాలనే ప్రయత్నాలు జరిగాయి. ఆ మేరకు అయన పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు. కానీ పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ స్థానాన్ని బిజేపికి ఇవ్వగా..అక్కడి నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని బీజేపీ బరిలో దించింది. అసెంబ్లీ సీటు రాయచోటి నేత సుబ్రహ్మణ్యంకు ఇవ్వడంతో స్థానికంగా టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే గాకుండా...ఆందోళనలు కూడా చేశారు. ఓ వైపు తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ.. సొంత పార్టీలోనే నిరసనలు ఎదురైనా బాలసుబ్రమణ్యం మాత్రం ఎన్నికల బరిలో నిలిచారు. కానీ చాలా మంది టీడీపీ నేతలు అయనకు సహకరించేది లేదని తేల్చిచెప్పారు. అయినా బాలసుబ్రమణ్యం మాత్రం గెలుపుపై దీమా వ్యక్తం చేశారు. రాజంపేట మార్పు కోరుకుంతోందని, నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామనే అలవికానీ హామీలతో రాజంపేట వాసులను అకట్టుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రాజంపేటకు తీసుకువచ్చి ప్రచారం చేయించారు. రాజంపేటలో టిడిపి జెండా ఎగరేస్తానంటూ సుబ్రహ్మణ్యం గొప్పలు చెప్పుకున్నారు. తన గెలుపు కోసం వైఎస్సార్సీపీ పై బురదజల్లే ప్రయత్నం చేశారు. కానీ బాలసుబ్రమణ్యం అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించిన సొంత పార్టీ నేతలే ఆయనకు పనిచెయ్యలేదని.. బిజేపితో పొత్తు వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు కూడా పడలేదని, ప్రత్యేకించి మహిళల ఓట్లు సైకిల్ గుర్తుకు అస్సలు పడలేదని నియోజకవర్గంలో బలమైన టాక్ నడుస్తొంది. పోలింగ్ పూర్తయ్యాక రాయచోటి నుంచి రాజంపేట టీడీపీ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యంకు తత్వం బోధపడింది. గెలిచే అవకాశాలు ఏమాత్రం కనిపించకపోవడంతో.. ఓటమి భయంతో మౌనముద్ర దాల్చారు. ఎన్నికల తర్వాత మరోమాట మాట్లాడకుండా తన అన్నీ సర్దుకుని సొంత నియోజకవర్గమైన రాయచోటికి వెళ్లిపోయారు. పోలింగ్ ముందు వరకు గెలుస్తాం, టీడీపీ జెండా ఎగరేస్తామన్న అయన ఇప్పుడు సైలెంటయ్యారు. కానీ తొలినుంచీ గెలుపుపై ధీమాగా ఉన్న వైఎస్సార్సీపీ మాత్రం కాన్ఫిడెంట్గ ఉంది. రాజంపేట వాసులు సీఎం వైఎస్ జగన్ నిలిపిన అభ్యర్ధికి ఆమోదం తెలిపారని, రాజంపేటలో వైఎస్ఆర్సీపీ గెలుపొందడం, వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అయిందని ధీమాగా చెబుతున్నారు. -
ఉమ్మడి ‘పశ్చిమ’లో సంక్షేమానికే పట్టం!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ సమయంలో జనప్రభంజనం సునామీలా కనిపించింది. మెజార్టీ స్థానాల్లో ప్రజలు సంక్షేమానికే పట్టం కట్టారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసింది. ప్రతి ఇంటికీ లబ్ది చేకూర్చడం అధికార పార్టీకి ఉమ్మడి జిల్లాలో కలిసొచ్చిన అంశం. కూటమి పొత్తులు, గుర్తుల గందరగోళాలు, చివరి నిమిషంలో వచ్చి చేరిన దిగుమతి నేతలు మోసుకొచ్చిన సమస్యలే కాకుండా... కేవలం దౌర్జన్యాలు, పోల్ మేనేజ్మెంట్ను నమ్ముకోవడంతో కూటమి పరిస్థితి అయోమయంగా మారింది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున అమలయ్యాయి. ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు బాగా పడిందనే వాదన జిల్లాలో బలంగా వినిపిస్తోంది.ఇక టీడీపీ కంచుకోట అని చెప్పుకునే నియోజకవర్గాల్లో సైతం ఫ్యాన్ హవా బాగా కనిపిస్తోందని, సైలెంట్ ఓటుతో ఓటర్లు కూటమి పార్టీలకి షాక్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం, దెందులూరు నియోజకవర్గాల్లో కూటమి నేతలు దౌర్జన్యాలకు తెగబడినా, కైకలూరులో కూటమి అభ్యర్థి పోలీసులపై బెదిరింపులకు దిగినా ఓటింగ్ శాతంపై ఎక్కడా ప్రభావం చూపలేదు. ఏలూరు జిల్లాలో 2019లో 82.61 శాతం పోలింగ్ నమోదు కాగా 2024లో 83.65గా నమోదైంది. ఉంగుటూరులో అత్యధికంగా 87.75 శాతం నమోదుకాగా ఏలూరులో అత్యల్పంగా 71 శాతం నమోదైంది.అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12,16,667 ఓట్లు పోలవ్వగా, ఏలూరు జిల్లాలో 13,67,999 ఓట్లు పోలయ్యాయి. సంక్రాంతి పండక్కి బారులు తీరినట్లుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఈసారి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారిలో 50 నుంచి 60 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లాకు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పోలింగ్‌కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం కూడా ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంతో పోలింగ్ శాతం గతం కంటే కూడా స్వల్పంగా పెరిగింది. అలాగే రెండు జిల్లాల్లో 18 ఏళ్ళు నిండి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 80 వేలకు పైగానే ఉంది. దీంతో పోలింగ్ కేంద్రాల్లో యువత, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు.ఏలూరు జిల్లాలో ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రతి ఇంటికీ పథకాలు అందాయి. ఊళ్లు రూపురేఖలు మారాయి. ప్రతి ఊరిలో నాడు-నేడు కార్యక్రమంతో బాగుపడిన పాఠశాలలు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, రహదారుల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ్మిలేరు రిటైనింగ్ వాల్‌తో సహా కీలక అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి. వంచనకు, విశ్వసనీయతకు మధ్య జరిగిన ఎన్నికల సంగ్రామంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్‌కే ప్రజలు మళ్లీ పట్టం కట్టారనీ తెలుస్తోంది.ఏలూరు జిల్లాలోని 28 మండలాల్లో 548 సచివాలయాలు నిర్మించి, 600 రకాల సేవలను ప్రజలకు స్థానికంగా అందిస్తున్నారు. పెన్షన్ మొదలుకొని పౌర సేవలు, రేషన్ వంటివి ఇంటికే అందిస్తున్నారు. 271 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు నిర్మించి పల్లెల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 2,83,239 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 350 రైతు భరోసా కేంద్రాలు నిర్మించి దళారీ వ్యవస్థ లేకుండా ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నారు. నాడు-నేడుతో జిల్లాలో 2,032 పాఠశాలలను రూ.270.75 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేశారు. జిల్లాలో 1,16,431 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర జగన్ సర్కారుది. రూ.713.17 కోట్లతో 98,874 ఇళ్ల నిర్మాణం చేసుకునేలా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించింది. జిల్లాలో 2.81 లక్షల మందికి ఐదేళ్లలో రూ.3,880 కోట్ల పెన్షన్, 35,745 ఆసరా గ్రూపుల్లోని రూ.3.55 లక్షల మంది మహిళలకు రూ.1305.05 కోట్ల రుణమాఫీ, 1.78 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద రూ.1,069.30 కోట్లు, 1.73 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఏటా రూ.130.15 కోట్ల చొప్పున విద్యా కానుక ఇలా పలు సంక్షేమ పథకాల వేల కోట్ల లబ్ధిని చేకూర్చారు.ఇతర పార్టీల నుంచి వచ్చిన దిగుమతి నేతలతో స్థానిక నేతలకు సమస్యలు, కూటమి పేరుతో చివరి నిమిషంలో ఊడిపడ్డ జనసేన, బీజేపీ నేతలతో చికాకులు, నాయకులతో సమన్వయలేమి ఇలా గందరగోళాలతో సైకిల్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్నా జిల్లాను పట్టించుకోకపోవడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా టీడీపీ నేతలు జేబులు నింపుకోవడం, కొన్నిచోట్ల పెద్ద ఎత్తున విధ్వంసకాండ, కోట్ల దోపిడీ, అధికారులపై దాడులు వంటి ఘటనలను జిల్లా ప్రజలు మరిచిపోలేదు. టీడీపీ ఎంపీ అభ్యర్థి, దిగుమతి నేత పుట్టా మహేష్‌కు జిల్లా నేతల నుంచి సహకారం లేకపోవడం, పోలవరం, చింతలపూడి, కైకలూరు, నూజివీడు ఇలా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతల వివాదాలను పరిష్కరించలేని పరిస్థితితో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం చేయలేక చేతులెత్తేశారు.జిల్లాలో చంద్రబాబు ఏలూరు, నూజివీడు, దెందులూరులో సభలు నిర్వహించినా అట్టర్ ఫ్లాప్ కావడంతో పార్టీ కేడరే లైట్ తీసుకుంది. అలాగే కీలక నియోజకవర్గాల అభ్యర్థులు పోలింగ్‌కు ముందే చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. ఐదేళ్ల జగన్ సంక్షేమ పాలనలో నవరత్నాల ద్వారా జిల్లాలో రూ.8,500 కోట్ల మేర నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఏలూరు వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడం, కొల్లేరు మిగులు భూముల పంపిణీకి వీలుగా సర్వే ప్రక్రియ తుది దశకు చేరడం, టీడీపీ విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి యుద్ధప్రాతిపదికన ప్రధాన పనులు పూర్తిచేయడంతో పాటు ఆర్అండ్ఆర్ కాలనీలో సమగ్ర అభివృద్ధి పనులు జరిగాయి.ఏలూరులో 50 ఏళ్ల నుంచి ఉన్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా తమ్మిలేరు రిటైనింగ్ వాల్‌ను రూ.80 కోట్ల ఖర్చుతో పూర్తి చేశారు. అలాగే బుట్టాయగూడెం, చింతలపూడి, నూజివీడుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునికీకరణ పనులు ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. జిల్లాలో వైఎస్సార్సీపీ క్వీన్‌స్వీప్ దిశగా దూసుకువెళ్తోంది. ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రెండుసార్లు గడపగడపకూ వెళ్లడం, విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారడం పార్టీకి కలిసి వచ్చిన అంశాలు. పార్టీ అధినేత, సీఎం జగన్ దెందులూరులో లక్షలాది మందితో సిద్ధం బహిరంగ సభ నిర్వహించడం, ఏలూరు, కైకలూరులో ఎన్నికల ప్రచార సభలు, దెందులూరు, ఏలూరు, ఉంగుటూరులో రోడ్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ఎన్నికల ప్రచారం చేశారు. అటు పార్టీ అధినేత వైఎస్ జగన్, ఇటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా ప్రజలతో మమేకం కావడం, పాజిటివ్ ఓటు మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని తేలిపోయింది.నర్సాపురం పార్లమెంట్ పరిధిలోనూ వైఎస్సార్సీపీదే హవా!ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో వైఎస్ఆర్సీపీకి ఎదురుండదనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎంపీ సీటుతో సహా, ఏడు అసెంబ్లీ స్థానాలపై పోటీ చేసిన అభ్యర్థులు ఎంతో ధీమాగా కనిపిస్తున్నారు. జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెబుతున్నారు. వారి ధీమాకు కారణం ఏంటో చూద్దాం.నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగనుంది. నర్సాపురం ఎంపీ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ సీట్లల్లోనూ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించనున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఐదేళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్య క్రమాలు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు, మరోపక్క కూటమిలోని వర్గ విభేదాలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలకు స్పందన లేకపోవడం, కూటమి మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదనే వాదన ప్రజల్లో స్పష్టంగా కనబడుతోంది. సీఎం జగన్ పాలనలో జిల్లాలో ప్రగతి పరవళ్లు తొక్కింది. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో సంక్షేమ పథకాల ద్వారా 11,364.57 57 కోట్లు లబ్దిదారులకు అందించారు. జిల్లాలో 6,988.37 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు.నరసాపురంలో ఆక్వావర్సిటీ, ఫిషింగ్ హార్బర్, పాలకొల్లులో వైద్య కళాశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు తలమానికమయ్యాయి. నాడు-నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ బడులు, ఆస్పత్రుల రూపురేఖలు మారాయి. సచివాలయం, వలంటీర్ వ్యవస్థల ద్వారా పాలనను ప్రజల చెంతకు చేర్చారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా జిల్లాలోని 6,05,780 మంది లబ్దిదారులకు ఉచితంగా 6,48,607 సర్టిఫికెట్లు జారీ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్షలో 447 వైద్యశిబిరాలు ద్వారా ప్రజల చెంతకే వెళ్లి 4.10 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. నవరత్న పథకాల్లో భాగంగా 77 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశారు.పొత్తులు కుదుర్చుకుని కూటమిలోని మూడు పార్టీలు సీట్లు ప్రకటించిన తర్వాత జనసేన శ్రేణుల్లో నిస్సత్తువ అలముకుంది. పవన్ కల్యాణ్ వైఖరిని నిరసిస్తూ ఆచంటలో ఆ పార్టీ ఇన్చార్జి చేగొండి సూర్యప్రకాష్ ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడే రెండోసారి భీమవరం నుంచి పోటీకి వెనుకడుగు వేయడం, భీమవరంలో సొంత నేతలకు సత్తాలేదని టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను దిగుమతి చేసుకుని సీటు ఇవ్వడం జిల్లాలో ఆ పార్టీకి పట్టు లేదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. టీడీపీ పోటీ ఉన్నచోట తమకు సరైన ప్రాధాన్యత ఉండటం లేదని జనసేన నేతలు మదనపడుతున్నారు. భీమవరం, తణుకు, నరసాపురం తదితర నియోజకవర్గాల్లో రెండు పార్టీల కేడర్ మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.కూటమితో పోలిస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో చాలా వేగంగా దూసుకుపోయారు. గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతిఇంటికీ వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడం, జగనన్న సురక్ష, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలతో ఐదేళ్లుగా జనం మధ్యనే ఉండటం ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రజలకు మరింత చేరువచేసింది. ఆయా గ్రామాలు, వార్డులకు వెళ్లినప్పుడు స్థానికులను పేర్లు పెట్టి పిలుస్తూ, మీ సమస్యలు పరిష్కరించామని చెబుతూ, ఐదేళ్ల ప్రగతిని వివరిస్తూ, చేపట్టబోయే పనులను తెలుపుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అపూర్వ స్పందన లభించింది.వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో ఉంటే టీడీపీ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదిగా ఉందని ప్రజలు పెదవి విరిచారు. గత అనుభవాల నేపథ్యంలో చంద్రబాబు హామీలను వారు విశ్వసించలేదు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన రోజుల్లో జగన్ సర్కారు, వైఎస్సార్సీపీ అభ్యర్థులు అండగా నిలిచిన తీరును గుర్తు చేసుకున్నారు. కూటమి అభ్యర్థులు, మూడు పార్టీల అధినేతలు అప్పుడేమయ్యారని ప్రజలు ప్రశ్నించారు. టీడీపీ, జనసేన తొలిసారిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ తుస్సుమంది. సభా ప్రాంగణంలో సగానికి పైగా ఖాళీగానే కనిపించింది. ఆ తర్వాత నరసాపురం, పాలకొల్లు. తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రచార సభలకు జనం రాక వెలవెలబోయాయి. వారు ప్రసంగిస్తున్న సమయంలోనే జనం వెనుదిరిగి వెళ్లిపోవడం కనిపించింది.జిల్లాలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి జనం ప్రభంజనంలా తరలిరావడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సుయాత్రకు దారిపొడవునా బారులు తీరి జననేతకు బ్రహ్మరథం పట్టారు. భీమవరం, నరసాపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలకు మండుటెండను సైతం లెక్కచేయకుండా వేలాదిగా తరలివచ్చి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎంపీ స్థానంతో పాటు ఏడింటిలో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్సీపీ తాజా పరిస్థితుల నేపధ్యంలో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.70 ఏళ్ల నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో తొలి బీసీ మహిళా నేత వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు. బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీటు ఇవ్వడాన్ని జిల్లాకు చెందిన కూటమి అసెంబ్లీ అభ్యర్థులు వ్యతిరేకించారు. బీసీ మహిళకు సీటు ఇవ్వడం వైఎస్సార్సీపీకి బాగా కలిసొచ్చిన అంశమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఉమాబాల విజయానికి బాటలు వేస్తుందని అంటున్నారు. అంతేకాక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు. -
భీమవరం ‘మేమంతా సిద్ధం’సభలో సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్
Live Updates.. గరగపర్రు చేరుకున్న సీఎం జగన్.. గరగపర్రు అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం జగన్‌కు స్వాగతం పలకిన ప్రజలు భీమవరంలో కెరటాల్లా పోటెత్తిన అభిమాన జనసంద్రం. సీఎం వైఎస్ జగన్ రోడ్‌షోకు పోటెత్తిన జనకెరటాలు. డాక్టర్ బీవీరాజు స్టాట్యూ సర్కిల్లో ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం. వేలాదిమంది మహిళలు దారిపొడవునా మానవహరమై ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం. మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రికి రోడ్‌షోలో అండగా నిలిచిన అక్కచెల్లెమ్మలు. భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రసంగం భీమవరంలో జన సముద్రం కనిపిస్తోంది ఉప్పొంగిన ప్రజాభిమానం కనిపిస్తోంది మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్థమా? దుష్టచతుష్టయం కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా? మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్ ఈ ఎన్నికలు మన తలరాతను మార్చేవి పేదలకు, చంద్రబాబు మోసాలకు జరుగుతున్న ఎన్నికలు ఇవి మీ బిడ్డది పేదలపక్షం చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువగా వస్తుంది ఆయన మాటల్లో, మాట్లాడేటప్పుడు హైబీపీ వస్తా ఉంటుంది.. మీరు గమనించే ఉంటారు శాపనార్థాలు పెడుతూ ఉంటాడు.. నాకు ఏదో అయిపోవాలని కోరుకుంటాడు రాళ్లు వేయండని పిలుపునిస్తా ఉంటాడు ఈ పెద్ద మనిషి నాపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకంటే.. ఎందుకో తెలుసా.. అడగకూడని ప్రశ్న చంద్రబాబుని అడిగినందుకు.. అదేమిటో తెలుసా.. బాబు.. బాబు.. చెరువులో కొంగ మాదిరిగా ఎదురుచూస్తూ ఇంకొపక్క కొంగమాదిరిగా జపం చేస్తావ్ ఎందుకయ్యా అని అడగా ఇలా అడగడం తప్పా చెప్పండి చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్ ఒక్కటైనా ఉందా అని అడిగా నీ పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబుని అడిగా.. అందుకే నాపై కోపం, ఆయనకు అందుకే బీపీ ఎక్కువై పోతోంది. ఆయన చేసిన మంచి ఏ ఒక్కటీ గుర్తుకురాకపోగా, ఆయన పేరు చెబితే గుర్తుకువచ్చేవి ఏమిటో తెలుసా.. వెన్నుపోట్లు, మోసం, దగా, అబద్ధాలు, కుట్రలు ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువస్తాయి అదే మాదిరిగా దత్తపుత్తా, దత్తపుత్రా.. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి, పిల్లల్ని పుట్టిచ్చి, నాలుగేళ్లకు, ఐదేళ్లకొకసారి కార్లును మార్చేసినట్లుగా భార్యను వదిలేసినట్లుగా నియోజకవర్గాలకు అలవోకగా మార్చేస్తున్నావ్.. ఏం మనిషవయ్యా అని అడిగా అందుకే దత్తపుత్రుడిలో బీపీ బాగా కనిపిస్తోంది అయ్యా దత్తపుత్రా.. ఒకసారి చేస్తే పొరపాటు.. మళ్లీ మళ్లీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా పవిత్రమైన సంప్రదాయాన్ని నడినొడ్డమీదకు తీసుకురావడం, ఆడవాళ్ల జీవితాలను చులకనగా చూపించడం తప్పుకాదా ఇది నేను అడిగితే తప్పుకాదా ఇలా నిన్ను చూసి ఇదే తప్పు ప్రతీ ఒక్కరు చేస్తే.. ఇలా భార్యల్ని మార్చేస్తే అక్క చెల్లెమ్మల బ్రతుకులు ఏం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఆ పెద్ద మనిషిలో బీపీ కూడా పెరిగిపోతోంది చేయిలూపేస్తాడు.. కాళ్లు ఊపేస్తాడు.. తల ఊపేస్తాడు పవన్ కల్యాణ్ బీపీని అసలు తట్టుకోలేము చంద్రబాబుకు, దత్తపుత్రుడికి, ఈ బాజాభజీంత్రీలకు ఎందుకు నాపై కోపం వస్తుందంటే.. కారణం ఈ వర్గాలన్నింటినీ.. ఈ పేదలను, ఈ అక్కా చెల్లెమ్మలను, సామాజిక వర్గాలను, పిల్లలను, అవ్వాతాతలను, రైతన్నలను నువ్వు ఎలా ముంచావంటే చెప్పడానికి బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి చేసిన మంచి మాత్రం చెప్పడానికి ఏ ఉదాహరణలు కనిపించవు ప్రజలిచ్చిన అధికారాన్ని ఏనాడు కూడా చంద్రబాబు మంచి కోసం ఉపయోగించలేదు మోసాల్ని, అబద్ధాల్ని, వెన్నుపోట్లని, కుట్రల్ని, పొత్తుల్ని నమ్ముకుని ఈ రోజు చంద్రబాబు రాజకీయం చేయాల్సి వస్తుంది ఎందుకంటే చేసిన మంచి లేదు కాబట్టే.. వీటిని నమ్ముకుని ఇలా రాజకీయాలు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టే.. పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా జనం మద్దతులేని ఈ చంద్రబాబు.. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ-5, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్. వీరందరీతో పాటు కుట్రలు, మోసాలు, ఇతర పార్టీల్లో చంద్రబాబు పెట్టుకున్న కోవర్టులు కలిసి ఒక్క జగన్ మీద దండయాత్రలు చేస్తా ఉన్నారు జగన్ ఒక్కడు.. బాబుకు పదిమంది సేనానులు వారంతా కూడా బాణాలు పట్టుకుని ఉన్నారు మరి వారు బాణాలు తగిలేది ఎవరికి అని అడుగుతున్నా.. జగన్ పేదలకిచ్చే పథకాలకా అని ప్రతీ ఒక్కర్నీ ఆలోచన చేయమని అడుగుతున్నా వారు బాణాలు తగిలేది.. జగన్‌కు జగన్ పెట్టిన వాలంటీర్లు, సచివాలయవ్యవస్థలకా? వారు బాణాలు తగిలేది.. జగన్ తెచ్చిన ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌ల వ్యవస్థలకా? వారు బాణాలు తగిలేది.. జగన్‌కా.. జగన్ మార్పులు తెస్తూ పిల్లల భవిష్యత్లకా, వారి చదువులకా? వారు బాణాలు తగిలేది.. అవ్వా తాతాల పెన్షన్‌కు తగులుతా ఉందా.. లేక జగన్‌కు తగులుతా ఉందా? వారు బాణాలు తగిలేది.. జగన్‌కు తగులుతా ఉందా.. రైతన్నకు ఇస్తున్న రైతు భరోసాకా? వారు బాణాలు తగిలేది.. జగన్‌కు తగులుతున్నాయా.. లేక అక్కచెల్లెమ్మలకోసం, వారి అభ్యుతన్న కోసం, వారి కుటుంబాలకు తగులుతుందా? నా అక్క చెల్లెమ్మల కోసం, వారి సంక్షేమ కోసం వారి ఖాతాల్లోకి రెండు లక్షల డబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ వేశాడు వీరు వేసే బాణాలు ఎవరికి తగులుతున్నాయో ఆలోచన చేయమని అడుగుతున్నాను నేను తీసుకొచ్చిన పథకాలమీద.. వీరంతా బాణాలు ఎక్కుపెడుతున్నారు ఆలోచన చేయమని అడుగుతున్నాను ఈ యుద్ధం.. పేదల ప్రయోజనాల మీద, అక్క చెల్లెమ్మల సాధికారత మీద, పేద పిల్లల బంగారు భవిష్యత్ మీద, అవ్వా తాతల సంక్షేమ మీద, రైతన్నలకు అందుతున్న రైతు భరోసా మీది చంద్రబాబు అండ్ ఆయన పెత్తందార్ల బృందం ప్రకటించిన యుద్ధం ఇది అని ప్రతీ ఒక్కరు గమనించాలని కోరుతున్నాను ఈ యుద్ధంలో తలపడటానికి మీరంతా కూడా సిద్ధమేనా? కాబట్టే చెబుతున్నా.. జగన్ ఒంటరి కాదు.. మంచి చేసిన జగన్‌కు మద్దతుగా ప్రతీ ఇంట్లో సైన్యం ఉంది. జగనే ఉండాలి.. జగనే కావాలి.. జగనే రావాలి అని ఈరోజు ప్రతీ ఇంట్లో కూడా మద్దతు తెలిపే వారున్నారు జగన్‌కు కోట్లాది మంది సైన్యం ఉంది. నాడు-నేడు ద్వారా విద్య వైద్య రంగంలో మార్పులు తీసుకొచ్చాం మీ బిడ్డకు రైతన్న, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు తోడుగా ఉన్నారు ఇంతమంది తోడుగా ఉన్న మీ జగన్ ఎప్పుడూ ఒంటరి కాదు చంద్రబాబుపై ఎల్లో మీడియా ఇచ్చేది అతిపెద్ద బోగస్ రిపోర్ట్ చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు 2014లో చంద్రబాబు చేసిన మోసాలు గుర్తున్నాయా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డపుడితే రూ. 25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా? అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? రూ. 10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా? ప్రతి జిల్లాలో హైటెక్ సిటీ అన్నాడు.. ఎక్కడైనా కనిపించిందా? కొత్తగా పోర్టులు కట్టాడా? మెడికల్ కాలేజీలు కట్టాడా? సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు చేశాడా? ప్రభుత్వ బడులు, ఆస్పత్రులనైనా బాగు చేశాడా? మళ్లీ ఈ ముగ్గురూ కలిసి కొత్త కొత్త మోసాలతో వస్తున్నాడు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నారు.. నమ్ముతారా పేదల భవిష్యత్‌ను కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? వారి చీకటి యుద్ధాన్ని ఎదుర్కోనేందుకు మీరంతా కూడా మీ జేబుల్లోంచి సెల్ఫోన్లు తీసి లైట్ ఆన్ చేసి మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి మన సంక్షేమం ఇలాగే కొనసాగడానికి మీరంతా సిద్ధమేనా? ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం విచ్చేసిన సీఎం జగన్మోహన్రెడ్డిగారికి ఘనంగా స్వాగతం తెలియజేస్తున్నాం భీమవరానికి ఈ రెండు మూడు నెలల్లోనే రెండుసార్లు రావడం జరిగింది పశ్చిమగోదావరి జిల్లా మీద ప్రత్యేకమైన అభిమానం చూపెడుతున్న సీఎం జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన జగనన్న అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడకు వచ్చిన అశేష జనమంతా మీ అభిమానులన్నా. మీ చేయిని పట్టుకుని ఓదార్చాలని ఇక్కడకు వచ్చిన మీ శ్రేయోభిలాషులన్నా మీ అభిమానులంతా మా అన్నపై దాడి జరిగినా పెద్ద ప్రమాదం తప్పింది కదా అని సంతోషిస్తుంటే.. దుర్మార్గులు, దుష్టులు.. మానవత్వం లేని మృగాలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లాంటి వారు మాట్లాడే మాటలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. అన్నా.. వారికి ఎందుకంత నీ మీద అంత కక్ష, ద్వేషం ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి జన హృదయాల్లో నిలిచిపోయినందుకా అన్నా మీపై వారికి ద్వేషం భీమవరం మేమంతా సిద్ధం సభ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ భీమవరం సభకు పోటెత్తిన ప్రజాభిమానం ర్యాంప్‌పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్ జై జగన్ నినాదాలతో మార్మోగుతున్న సభా ప్రాంగణం ఉండి సెంటర్‌కు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర కాసేపట్లో భీమవరంలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర పశ్చిమలో జనజాతర, కిక్కిరిసిన రహదారులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం మండుటెండలోనూ జననేత కోసం పోటెత్తిన అభిమానం సీఎం జగన్‌కు అడగడుగునా జన నీరాజనాలు దారి పొడవునా సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం ►గణపవరం చేరుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ►సీఎం జగన్‌కు దారిపొడువున్న అపూర్వ ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు. ►ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్ ►సీతారామపురం చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర ►గణపవరం సెంటర్లో సీఎం జగన్ రాక కోసం ఎదురుచూస్తున్న జన సందోహం నారాయణపురం స్టే పాయింట్ వద్ద వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు.. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక పలువురు నేతలు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు ఆకుర్తి శేఖర్, గారపాటి వాసు, గౌడ సంఘం నేత మాదు గంగాధర్. పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పార్టీ కీలక నేత 2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్ధి చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్ అశోక్ కుమార్, దాచేపలి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు వైఎస్సార్సీపీలోకి చేరిక. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్.పేరయ్య, టీడీపీ సీనియర్ నేత గుంటుపల్లి రామారావు. కార్యక్రమంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, న నిడమర్రు చేరుకున్న సీఎం జగన్ ముఖ్యమంత్రి జగన్‌కు ఘనస్వాగతం పలికిన ప్రజలు. నిడమర్రు వద్దకు భారీగా చేరుకున్న మహిళలు, వృద్ధులు. మండుటెండలో ఉదయం 9 గంటల నుండి జగన్ కోసం ఎదురుచూస్తున్న మహిళలు మళ్ళీ సీఎం కావాలంటూ నినాదాలు చేసిన మహిళలు పెత్తందార్లతో జగన్ చేసే యుద్ధానికి ఆయనతో పాటు మేమంతా సిద్ధం అంటున్న ప్రజలు. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర కొనసాగుతోంది. ►కాసేపట్లో నిడమర్రు చేరుకోనున్న సీఎం జగన్. ►ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు నిడమర్రు సెంటర్‌కు భారీ చేరుకున్న ప్రజలు ►రాచూరుకు చేరుకున్న సీఎం బస్సుయాత్ర.. ►ఉంగుటూరు నియోజకవర్గం రాచూరుకు.. చేరుకున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ►ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్న గోదావరి జిల్లావాసులు ►గ్రామ గ్రామాన సంక్షేమ సారధి సీఎం జగన్‌కు హారతులు పడుతున్న అక్క చెల్లెమ్మలు. . ►పశ్చిమ గోదావరి జిల్లాలో 16వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభైంది. ►కాసేపట్లో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ►పశ్చిమ గోదావరి సిద్ధమా? Day-16 పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధమా..?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2024 ►వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజైన మంగళవారం నారాయణపురం నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి సీఎం జగన్ తొమ్మిది గంటలకు బయలుదేరనున్నారు. ►నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివారులో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు. -
సారీ రఘురామ.. అడ్జస్ట్ చేస్కో!
పశ్చిమ గోదావరి, సాక్షి: టీడీపీలో చేరిన మరుసటి రోజే.. పశ్చిమ గోదావరి పార్టీ రాజకీయాల్లో రఘురామ కష్ణంరాజు చిచ్చు రాజేశారు. మరోవైపు.. తన వీరవిధేయుడు రఘురామ కృష్ణంరాజును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరుణించాడు. అయితే తొలి నుంచి ఆశించినట్లు నరసాపురం ఎంపీ టికెట్ కాకుండా.. అసెంబ్లీ స్థానాన్ని కట్టబెట్టారు. శనివారం పాలకొల్లులో జరిగిన సమావేశంలో రఘురామకు ఉండి అసెంబ్లీ సీటు ఇస్తున్నట్లు చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తొలి నుంచి కూటమి తరఫునే పోటీ చేయాలని ఉవ్విళ్లూరిన రఘురామకు నరసాపురం సీటు బీజేపీకి పోవడంతో నిరాశే ఎదురైంది. అయినప్పటికీ ఆ స్థానం కోసం చంద్రబాబుతో భారీ లెవల్లో లాబీయింగ్ నడిపించారు. బీజేపీతో సీటు మార్పిడి కోసం తెగ ప్రయత్నించారు. అయితే బీజేపీ మాత్రం ససేమీరా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈలోపే రఘురామ కనీసం అసెంబ్లీ సీటు కోసమైనా ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత వారం రోజులుగా చంద్రబాబుతో రఘురామ ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. చివరకు మంగళవారం రాత్రి ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి టీడీపీ సేఫ్ సీటుగా భావిస్తుంటుంది. అందుకే.. తన కోసం పని చేసిన రఘురామకు ఈ సీటును ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అలా.. పార్టీలో చేరిన కొద్ది గంటలకే ఉండి అభ్యర్థిగా రఘురామ పేరును ప్రకటించారు. అయితే.. పాలకొల్లులో చంద్రబాబును అడ్డుకుని నిలదీస్తున్న కార్యకర్తలు రఘురామకు సీటు ప్రకటన చేయగానే.. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు బయటకు రాకుండా హాలు ముందు బైఠాయించారు. ‘‘ఉండి గడ్డ రామరాజు అడ్డ’’ ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’ అంటూ నినాదాలు చేశారు. -
టీడీపీపై మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు
సాక్షి, విజయవాడ: టీడీపీపై మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా? అంటూ ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల వారికి, ఎన్ఆర్ఐలకు సీట్లు ఇస్తున్నారని, చంద్రబాబుని కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. టీడీపీలోని కొందరు పెత్తందార్లు దళితులను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీలో పరిణామాలు తీవ్రంగా కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె వీడియో విడుదల చేశారు. ‘‘నేను 20 ఏళ్లుగా టీడీపీలో ఉంటే సీటు ఇవ్వలేదు. పశ్చిమగోదావరిలో ఒక్క మాల వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం అన్యాయం. మా కుటుంబం 1982 నుండి టీడీపీలోనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పనిచేస్తే సీట్లేమో ఎన్ఆర్ఐలకు ఇస్తున్నారు. నాతో పాటు మాజీమంత్రి జవహర్‌కి కూడా టికెట్ ఇవ్వలేదు. సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడం అన్యాయం. నన్ను 2015 నుండి పెత్తందార్లు అవమానిస్తున్నారు’’ అంటూ పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: పిఠాపురం రచ్చ.. వర్మ దారెటు? -
వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని
తాడేపల్లి: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని(వెంకట మధుసూదనరావు) వైఎస్సార్సీపీలో చేరారు. ఈలి నాని.. ఈరోజు(గురువారం) వైఎస్సార్సీపీలో చేరారు. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు ఈలి నానికి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. 2009లో తాడేపల్లిగూడెం నుంచి ప్రజారాజ్యం(పీఆర్పీ) తరఫున పోటీ చేసి గెలుపొందిన ఈలి నాని.. ఆపై టీడీపీలో చేరిపోయారు ఈలి నాని. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్‌గా కూడా ఈలి నాని పని చేశారు. -
నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో సీఎం పర్యటన
సాక్షి,అమరావతి: సీఎం జగన్ ఈ నెల 28న (బుధవారం) పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్‌లో జరిగే వైఎస్సార్సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి విశాఖ చేరుకుని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగే పార్టీ నేత కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. కాగా, ఈ నెల 29న కృష్ణా జిల్లా పామర్రులో జరగాల్సిన సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది. -
అన్నీ లాగేసుకుని.. ఇదేం లిస్ట్ బాబూ..?
తూర్పుగోదావరి/పశ్చిమ గోదావరి: ముందు నుంచి ఊహించిందే జరిగింది. టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటన తర్వాత ఇరు పార్టీల నుంచి అసంతృప్త జ్వాలలు తారాస్థాయికి చేరాయి. కొన్ని చోట్ల ఆ పార్టీల ఫ్లెక్సీలను చించేయడంతో పాటు అధిష్టానానికి తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో.. రాజానగరంలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చెయ్యి ఎదురైంది. అలాగే.. రాజమండ్రి రూరల్ స్థానానికి ఇప్పటిదాకా ఇరు వర్గాలకు క్లారిటీ లేకుండా చేశారు. దీంతో.. టీడీపీ సీనియర్ బుచ్చయ్య చౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక.. ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు. మరోవైపు.. కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇక.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఈ అసంతృప్తులు తెరపైకి వస్తున్నాయి. నరసాపురం పార్లమెంట్ పరిధిలో పాలకొల్లు, ఉండి, ఆచంట, తణుకు సీట్లు టీడీపీ అభ్యర్థులకు కేటాయించారు. తణుకులో జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని స్వయంగా ప్రకటించిన పవన్.. ఇప్పుడు చంద్రబాబుకి తలొగ్గి ఆ స్థానాన్ని టీడీపీకి వదిలేశాడని కేడర్ మండిపడుతోంది. ఇక.. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏలూరు, చింతలపూడి స్థానాల్ని సైతం టీడీపీనే లాగేసుకుంది. ఈ క్రమంలో.. మాజీ మంత్రి పీతల సుజాతకు మొండి చేయి చూపించారు చంద్రబాబు. ఇక.. చింతలపూడి లో నాన్ లోకల్‌కి టికెట్ కేటాయించడంతో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంగా రోషన్‌కు టికెట్ ఇవ్వడంపై టీడీపీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. తాడేపల్లిగూడెం, నరసాపురం స్థానాల్లో టిడిపి జనసేన మధ్య కుమ్ములాటలతో తొలి జాబితాలో పంచాయితీ తేలలేదు. ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేననేత రెడ్డప్పల నాయుడుకి భంగపాటే ఎదురైంది. ఉండి నియోజకవర్గంలో టికెట్ పై ఆశకు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజుకు ఆశాభంగం కలిగింది. తణుకు నియోజకవర్గంలో వారాహి యాత్రలో పవన్ మాట ఇచ్చినా విడివాడ రామచంద్ర రావుకు సీటు దక్కలేదు. పాపం.. తనకే ఎమ్మెల్యే సీటు వస్తుందంటూ ప్రచారం చేసుకున్న విడివాడ రామచంద్ర రావుకు చుక్కెదురైంది. -
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
అత్తిలి(పశ్చిమగోదావరి): వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని, వారు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిలో మంగళవారం చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర కార్యక్రమంలో మంత్రి సమక్షంలో జనసేన, టీడీపీలకు చెందిన 150 మంది వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మంత్రి కారుమూరి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయానికి కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్దరాతి భరణీ ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, సర్పంచ్ గంటా విజేత నాగరాజు, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మహ్మద్ అబీబుద్దీన్, వైస్ ఎంపీపీలు సుంకర నాగేశ్వరరావు, దారం శిరీష, అత్తిలి టౌన్ అధ్యక్షుడు పోలినాటి చంద్రరావు, ఉపసర్పంచ్ మద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: జన బలమే గీటురాయి.. -
మానవత్వం చాటుకున్న సీఎం జగన్.. గంటలో పరిష్కారం
సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా: భీమవరం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవత్వం చాటుకున్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీని గంటలో పరిష్కారం చూపారు. తొమ్మిది మంది అర్జిదారులకు తొమ్మిది లక్షల రూపాయల చెక్కులను అధికారులు పంపిణీ చేశారు. ఆర్డీవో కార్యాలయంలో సదరు 9 మంది అర్జి దారులకు లక్ష రూపాయలు చొప్పున చెక్కులను కలెక్టర్ ప్రశాంతి అందజేశారు. చెక్కులు అందుకున్న వారి వివరాలు.. ►కడలి నాగలక్ష్మి, తండ్రి కడలి సత్యనారాయణ, ఎల్ బి చర్ల గ్రామం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా, భూ పరిష్కారంలో పరిహారం అందజేశారు ►ఎల్లమల్లి అన్నపూర్ణ, 29వ వార్డు, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. భర్త చనిపోయారు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ►చిల్లి సుమతి, బోడ్డి పట్ల గ్రామం, ఎలమంచిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా,.. బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆర్థిక సహాయం ►కంతేటి దుర్గ భవాని, వైఫ్ ఆఫ్ నాగ వెంకట రవితేజ, శ్రీరామవరం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా. వైద్య సహాయం నిమిత్తం.. ►తేతలి గీత, వైఫ్/ఆఫ్ లేట్ టి ఎస్ ఎస్ ఎన్ రెడ్డి, ఫైర్ స్టేషన్ సెంటర్, ఏలూరు, ఏలూరు జిల్లా.. భర్త మరణించడం వల్ల ఆర్థిక సహాయం ►అరుగుల లాజరస్, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా కుమారునికి వైద్య సహాయం నిమిత్తం ►గుడాల అపర్ణ జ్యోతి, తిరుపతి పురం, అత్తిలి, పశ్చిమగోదావరి జిల్లా. వైద్య సహాయం నిమిత్తం తాడేపల్లి: విద్యాదీవెన నిధులు విడుదల చేయటంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఉన్నత చదువులు చదువుతున్న 8,09,039 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.583 కోట్లను నేడు మన ప్రభుత్వంలో జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా వారి తల్లుల ఖాతాల్లో రీయింబర్స్ చేశామని తెలిపారు. అలాగే దాదాపు 2 లక్షల మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి విడతగా చెల్లించాల్సిన నగదును కూడా ఇప్పటికే వారి తల్లుల ఖాతాల్లో జమచేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకూ జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 27.61 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఫీజు కింద రూ.11,900 కోట్లను అందజేశామని చెప్పేందుకు గర్వపడుతున్నానని అన్నారు. -
ఏపీలో పేద పిల్లలకూ నాణ్యమైన విద్య: సీఎం జగన్
Updates: పేదల తలరాతలు మార్చే ఆస్తి చదువు: సీఎం జగన్ ►మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య, మీ అందరి చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం భీమవరం నుంచి చేస్తున్నాం ►ఈ రోజు పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును మనందరి ప్రభుత్వం పిల్లల తల్లుల ఖాతాల్లోకి, పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ చేయబోతున్నాం. ►ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా మూడు నెలలకోసారి పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన డబ్బును తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం ►8 లక్షల 9 వేల 39 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి 7,47,920 మంది తల్లుల ఖాతాల్లోకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన 583 కోట్లను నేరుగా జమ చేయనున్నాం ►ఫైనలియర్ విద్యార్థులకు ఏమాత్రం ఇబ్బంది కలగడకూడదనే ఉద్దేశంతో 2 లక్షల మంది విద్యార్థులకు చివరి ఇన్ స్టాల్ మెంట్‌గా చెల్లించాల్సిన ఫీజు కూడా వారి తల్లుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశాం. ►ఈ నాలుగున్నర సంవత్సరాల ప్రయాణం గమనించినట్టయితే ఈ ఒక్క జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారా 27,61,000 మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు ఒక మంచి మేనమామగా ఇచ్చింది రూ.11,900 కోట్లు ►ఇదొక్కటే కాదు జగనన్న వసతి దీవెన.. నాలుగున్నర సంవత్సరాల్లో పిల్లలు చదువులే కాదు, వాళ్ల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులకు పిల్లలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ విషయంలో కూడా పిల్లలకు అండగా, తోడుగా ఉంటూ దీని కోసం ఇచ్చింది మరో రూ.4,275 కోట్లు ►పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదివేందుకు అప్పులపాలు కాకూడదనే తపన తాపత్రయంతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలతో ఖర్చు చేసింది రూ.16,176 కోట్లు ►ఈరోజు వీళ్ల బతుకులు మారాలి. కుటుంబాల్లోంచి ప్రతి ఒక్కరూ గొప్ప చదువులతో, గొప్ప డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీరింగ్, కలెక్టర్లు, డాక్టర్లు కావాలని, ఆ కుటుంబాల తలరాతలు మారాలని తపనతో అడుగులు పడ్డాయి ►2017-18కి సంబంధించిన ఫీజుల సైతం పెండింగ్‌లో ఉన్న పరిస్థితులు, ఎగ్గొట్టిన పరిస్థితులు. రూ.1,777 కోట్లు కూడా మనందరి ప్రభుత్వమే ఆ పిల్లల కోసం చిక్కటి చిరునవ్వులతో మనమే చెల్లించాం ►గత ప్రభుత్వ హయాంలో 12 వేల కోట్లు కూడా సరిగా ఖర్చు చేయని పరిస్థితులు.. ఈరోజు రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితులు. తేడా గమనించాలని కోరుతున్నా ►చదువు అన్నది ఒక తలరాతలు మార్చే ఒక ఆస్తి ►మనిషి తలరాతనుగానీ, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలని అనుకున్నా, వెనకబడిన కులాల తలరాతలుగానీ, ఒక దేశం భవిష్యత్ గానీ ఇవన్నీ మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువుకు మాత్రమే ఉంది ►దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టే ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య దాకా 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేశాం. వేయగలిగాం ►గతానికి, ఇప్పటికీ తేడా చూడమని అడుగుతున్నా ►నాడు-నేడుతో వారి బడులు బాగుపడిన తీరును గమనించాలి ►తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంకు, సీబీఎస్ ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతున్న ప్రయాణం ►పిల్లలందరినీ గొప్పగా చదివించాలనే తపన, తాపత్రయంతో 3వ తరగతి నుంచే టోఫెల్ ను సబ్జెక్ట్ గా తీసుకొచ్చిన పరిస్థితులు, సబ్జెక్ట్ టీచర్ ను తీసుకొచ్చిన పరిస్థితి. ►పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఎంత తాపత్రయపడుతూ వాళ్ల జగన్ మామ అడుగులు వేశాడన్నది ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది ►బడులను ఒకవైపు రూపురేఖలు మారుస్తూ, మరోవైపున ఉన్నత విద్యపై ధ్యాస పెట్టాం ►ఉన్నత విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చాం. కరిక్యులమ్‌లో మార్పులు చేశాం ►పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా ఉందని ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్ మామ పరిపాలనలోనే జరుగుతోంది ►ఆన్ లైన్ వర్టికల్స్ ను కూడా డిగ్రీలో తీసుకురావడం జరిగింది ►10 నెలలపాటు ఇంటర్న్ షిప్ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ 55 నెలల కాలంలోనే పడ్డాయి ►జాబ్ ఓరియెంటెడ్‌గా అడుగులు వేగంగా పడుతూ వచ్చాయి ►మన పిల్లలు ప్రపంచంలో మేటి యూనివర్సీటీలతో పోటీ పడి చదవాలనే తపనతో, అంతర్జాతీయంగా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాంలో ఎంఐటీ, హార్వర్డ్, ఎల్ బీఎస్, లాంటి సర్టిఫికెట్లు ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి వచ్చేట్టుగా హెడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యి, ఆన్ లైన్ లో కోర్సులు తీసుకొస్తూ, ఏఐని అనుసంధానం చేస్తూ, డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఆ దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ►మన పేద విద్యార్థి, మన పిల్లలు ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితే వేగంగా ఎదగగలుగుతారు. ►ప్రపంచంలో ఎక్కడైనా పిలిచి ఆ పర్టిక్యులర్ సబ్జెక్టులో ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీలకు సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలతో భాగమైనప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ కాదు, ఎక్కడైనా ప్రపంచంలో ముందు వరుసలో మనం ఉంటాం. ►ఇదొక్కటే కాదు, ప్రపంచంలో ఎక్కడైనామన పిల్లలు గొప్ప చదువులు చదవగలిగితే, బెస్ట్ యూనివర్సిటీ నుంచి రాగలిగతితే, మన రాష్ట్ర తలరాతలు కూడా మార్చగలుగుతారు. ►జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చాం. టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో సీటు వస్తే చాలు ఏకంగా ఆ కాలేజీల్లో సీట్లు వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ 50 లక్షల నుంచి కోటి దాకా ఉన్నాయి. ►అయినా ఏ ఒక్కరూ అప్పులపాలు కావాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు ►ఈ పథకం ద్వారా సీటు తెచ్చుకోండి, కోటీ 25 లక్షల దాకా మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం ►జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత కాలేజీల్లో చదువుతున్నారు ►వాళ్ల బతుకులతో పాటు రాష్ట్రం రూపురేఖలు మార్చే లీడర్షిప్ స్థాయికి రాబోయే రోజుల్లో వస్తారు ►ఒక్క విద్యా రంగంలోనే ఉన్నత విద్యగానీ, స్కూళ్లు గానీ సంస్కరణ మీదే 55 నెలల కాలంలో అక్షరాలా ఖర్చు చేసింది 73 వేల కోట్లు అని చెప్పడానికి గర్వపడుతున్నా ►ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యారంగంలోనే కాదు, వైద్య రంగం, వ్యవసాయ రంగం, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలో కూడా ప్రతి రంగంలోనూ, ప్రతి అడుగు వేస్తూ, మార్పులు చేస్తూ ప్రయాణం సాగుతోందని చెప్పడానికి గర్వపడుతున్నా జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల ►జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ►ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18,576 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికం. ►పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్లో నేరుగా జమ చేస్తున్నారు. ►గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ►కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ విద్యావసతి కింద తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. అదేవిధంగా ఫైనల్ పరీక్షలు రాసిన, తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే మే 2023–ఆగస్ట్ 2023లలో 2,00,648 మంది విద్యార్థులకు మేలు చేస్తూ రూ.185.85 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ►అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విద్యారంగంపై అక్షరాలా రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. -
కొవ్వూరు రైల్వేస్టేషన్లో రైళ్లను పునరుద్ధరించాలి: తానేటి వనిత
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో లాక్ డౌన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్లో రద్దు చేసిన రైళ్లును పునరుద్దరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్‌ను విజయవాడలో కలిసి ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలను ప్రత్యేక లేఖ ద్వారా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కొవ్వూరు రైల్వేస్టేషన్లో రెగ్యులర్‌గా నిలుపుదల చేయవలసిన రైళ్లను నిలుపుదల చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. హైదరాబాద్, మద్రాసు, బెంగుళూరు, తిరుపతి వెళ్లే ప్రయాణికులు రైళ్లు నిలుపుదల చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యయ ప్రయాసలకు గురై రాజమహేంద్రవరం వెళ్లి రైళ్లు ఎక్కవలసి వస్తుందన్నారు. ప్రజలశేయస్సు దృష్ట్యా కొవ్వూరు స్టేషన్లో కొవిడ్ కారణంగా రద్దుచేసిన రైళ్లును పునరుద్ధరించాలని కోరారు. సదరు విజ్ఞప్తిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కొవ్వూరు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తొలగించాలని నిర్మలా సీతారామన్ ను హోంమంత్రి తానేటి వనిత కోరారు. కొవ్వూరు రైల్వేస్టేషన్ కొవ్వూరు, పోలవరం, గోపాలపురం మొత్తం మూడు నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. కరోనా లాక్ డౌన్ అనంతరం 4 రైళ్లను మాత్రమే పునరుద్దరించారని.. మరో 9 రైళ్లను పునరుద్దరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరులో పునరుద్దరించాల్సిన రైళ్ల జాబితాను అందజేశారు. పునరుద్దరించాల్సిన రైళ్లలో విజయవాడ వైపు, విశాఖపట్నం వైపు తిరిగే రైళ్లున్నాయి. తిరుమల ఎక్స్ ప్రెస్ (17488, 17487), సర్కార్ ఎక్స్ ప్రెస్ (17644, 17643), బొకారో ఎక్స్ ప్రెస్ (13351, 13352), కాకినాడ-తిరుపతి ఎక్స్ ప్రెస్ (17250, 17249), సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17240, 17239), తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ (17479, 17480), మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ (17220, 17219), రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ (17244, 17243), బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ (17482, 17481) రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్ లో ఆగేవిధంగా పునరుద్దరించాలని హోంమంత్రి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. హోంమంత్రి విజ్ఞప్తి పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్లు నిలుపుదల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. -
సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం
సాక్షి, తణకు(పశ్చిమగోదావరి): వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారిత బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారితను వెలుగెత్తి చాటుతూ సాగుతున్న ఈ బస్సుయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈరోజు(శనివారం) పశ్చిమగోదావరి జిల్లాలోని తణుణు నియోజకవర్గంలో సాగిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీనిలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై తమ సంఘీభావం ప్రకటించారు. సామాజిక సాధికారత బస్సుయాత్ర బహిరంగ సభ లో ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, ఎలక్ట్రానికి మీడియా సలహాదారు అలీ, మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరావు, మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎంపీ నందిగాం సురేష్, ఎంపీ భరత్‌లతో పాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, వంకా రవీంద్రనాథ్‌లు పాల్గొన్నారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ‘తణుకు సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రజలు విజయవంతం చేశారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం అయ్యింది. రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు జగనన్న అండగా నిలబడుతున్నారు. చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, రైతులు ఇలా అందరికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది. అందుకే ప్రతీ విద్యార్థి ఆయన్ను ఒక మేనమామలా చూస్తున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తోన్న వ్యక్తి సీఎం జగన్. కరోనా లాంటి మహమ్మారి కాలంలో కూడా అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించిన వ్యక్తి సీఎం జగన్. గత ప్రభుత్వాలతో పోలిస్తే జగనన్న హయాంలో పేదరికం 12 శాతం నుండి ఆరు శాతం వరకూ తగ్గింది. అందుకే జగన్ లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి. అలాగే కారుమూరి లాంటి మంచి నాయకుడిని కూడా మళ్ళీ గెలిపించుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ‘ఎవ్వరు కొడితే లోకేష్, చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆయననే మన జగనన్న. చంద్ర బాబు హయాంలో ఒక్క బీసీనైనా రాజ్యసభ కు పంపారా...?, వందల కోట్లకు సీట్లు అమ్ముకునే వాడు చంద్రబాబు. మళ్లీ కారుమూరి వన్స్‌మోర్’ అంటూ కారుమూరి నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. ‘ బీసీలను నిండా ముంచిన నాయకుడు చంద్రబాబు. సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేశారు. కరోనా సమయంలో చేనేతలకు అండగా నిలిచారు సీఎం జగన్,. చంద్రబాబు హయాంలో చేనేతలకు రూ. 200 కోట్లు ఖర్చు పెడితే, నేడు జగనన్న ముఖ్యమంత్రిగా రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టారు. బీసీలకు లక్షా 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసు’ అని స్పష్టం చేశారు. ఇక విశాఖలో జరిగిన సామాజిక సాధికారిత సభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘సగానికి పైగా పదవులను బడుగు బలహీనర్గాలకు కట్టబెట్టారు. ఒక ఊరులో ఇద్దరు బాగుండాలి అంటే చంద్రబాబు కావాలి.. ఊరు మొత్తం బాగు పడాలి అంటే సీఎం జగన్ రావాలి.ఒక యాదవనైన నాకు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు.యాదవులు కు సీఎం జగన్ పదవులు ఇస్తే గొడ్లు కాసుకొనే వారికి పదవులు ఇచ్చారని హేళన చేశారు.శ్రీకృష్ణ డు కూడా గొడ్డెలను కాసుకున్నారు. బీసీలను తోకలు కత్తిరిస్తమని బెదిరించారు.పార్టీ పెట్టి సీఎం కాకూడదనుకున్న వ్యక్తి పవన్. చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వ్యక్తి పవన్.పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అబద్ధాలు మోసాలకు ప్రజలు ప్రలోబకావద్దు.లోకేష్ ఒక పులకేశి.తండ్రి జైల్ లో ఉండే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్..సీఎం జగన్ దమ్ము నాయకుడు.నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయాలని సీఎం జగన్ చెపుతున్నారు.. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘దశాబ్దాలుగా బడుగు బలహీనర్గాల వారు సంక్షేమం అభివృద్ధి దూరంగా ఉన్నారు.బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలను కూరలో కరివేపాకులా చూసేవారు.మత్స్యకారులను చంద్రబాబు బెదిరించారు. రూ. 150 కోట్లతో హార్బర్‌ను ఆధునీకరిస్తున్నారు. సీఎం జగన్ పాలనలో పది హార్బర్ లు, నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారు.సుదీర్ఘమైన తీర ప్రాంతన్ని చంద్రబాబు గాలికి వదిలేసారు.మత్స్యకారుడుని రాజ్యసభకు పంపిన ఘనత సీఎం వైఎస్ జగన్ ది.బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు లేఖలు రాశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఆత్మ గౌరవం ను చంద్రబాబు తాకట్టు పెట్టారు.అణగారిన వర్గాల ఆత్మ గౌరవంను సీఎం జగన్ కాపాడారు. ఇంటిపై టిడిపి జెండా కడితేనే పథకాలు ఇచ్చేవారు. సీఎం జగన్ పాలనలో కులాలు మతాలు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ చేశారు.విశాఖ రాజదానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది.విశాఖ ను రాజదాని కాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని రాజదాని గా చేశారు -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. 11వ రోజు షెడ్యూల్..
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. నేడు సామాజిక సాధికార బస్సు యాత్ర పార్వతీపురం మన్యం, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో జరుగనుంది. ఇక, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి రాజన్న దొర ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. షెడ్యూల్ ఇలా.. పార్వతీపురం మన్యం జిల్లాలో.. ►నేడు 11వ రోజు సామాజిక సాధికార యాత్ర ►సాలూరు, పాలకొల్లు, కనిగిరి నియోజకవర్గాలలో బస్సుయాత్ర ►ఉదయం 10:30 గంటలకు మెంటాడ మండలం పోరాం గ్రామంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ►అనంతరం పోరాం గ్రామంలోని సచివాలయం సందర్శన. ►పెద్దమెడపల్లి, బూసాయవలస, రామభద్రపురం మీదుగా బస్సుయాత్ర ►మధ్యాహ్నం మూడు గంటలకు సాలూరు బోసు బొమ్మ జంక్షన్లో బహిరంగ సభ ప్రకాశం జిల్లాలో.. ►ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►నందన మారెళ్ల సెంటర్ నుండి బస్సుయాత్ర ప్రారంభం ►సురా పాపిరెడ్డి నగర్ దగ్గర లారీ అసోసియేషన్ సభ్యులతో సమావేశం ►వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్న నేతలు ►ప్రభుత్వ కాలేజీలో "నాడు-నేడు" కార్యక్రమంపై విద్యార్థులతో సమావేశం. ►వైఎస్సార్‌భవన్‌లో రెండు గంటలకు విలేకర్ల సమావేశం ►సాయంత్రం నాలుగు గంటలకు పామూరు బస్టాండ్ వద్ద బహిరంగ సభ పశ్చిమగోదావరి జిల్లాలో.. ►పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బస్సుయాత్ర ►శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో బస్సుయాత్ర ►పాలకొల్లు బైపాస్ రోడ్డు రామచంద్ర గార్డెన్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్సార్సీపీ నేతల ప్రెస్ మీట్ ►అనంతరం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వరకు బస్సుయాత్ర ►గాంధీ బొమ్మల సెంటర్లో బహిరంగ సభ -
ఖబడ్ధార్ నారా లోకేష్... ప్రజలపై దాడి చేస్తే ఊరుకునేది లేదు..
అమరావతి: యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ఈ సందర్బంగా లోకేష్ అసలు రాజకీయాలకు పనికిరావని ప్రజల్లో తిరిగేందుకు అసలు పనికిరావని విమర్శించారు. దౌర్జన్యం చేయడానికి వచ్చావా? పశ్చిమగోదావరి జిల్లాలో లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర రక్తపాతాన్ని సృష్టించడంతో రాష్ట్ర ఉపముఖ్యమంత్త్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నీ ఇష్టమొచ్చినట్లు రౌడీలను పెట్టుకుని రౌడీయిజం చేస్తున్నావ్ ఖబడ్దార్ లోకేష్ అని హెచ్చరిస్తూనే నువ్వు ఇప్పటి వరకు ఎంత మంది ప్రజలు కష్టాలు తెలుసుకున్నావ్? అసలు నువ్వొచ్చింది ప్రజల బాగోగులు తెలుసుకోవడానికా? దౌర్జన్యం చెయ్యడానికా? అంటూ ప్రశ్నించారు. అంతటా వ్యతిరేకత.. ప్రశాంతతకు మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో నల్లజర్ల, మందలపర్రు, భీమవరం ఇలా అన్ని చోట్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ గొడవలు చేస్తున్నావ్. భీమవరంలో అయితే వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ మీ పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది. ఇప్పటివరకు అవగాహన లేక మాట్లాడుతున్నాడని 'పప్పు' అనుకునేవారు. కానీ ఈ పాదయాత్రతో ప్రజల్లో నీ మీద పూర్తి వ్యతిరేకత తెచ్చుకున్నావ్. ఇలాంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మారణాయుధాలు ఎందుకు? నారా లోకేష్ ఒక క్రిమినల్ లాగా, ఒక రక్త పిశాచి లాగా, ఒక సైకో లాగా తయారయ్యాడని ప్లెక్సీ కనిపిస్తే చింపేయమంటూ.. దుర్మార్గుడిలా తయారయ్యారన్నారు. మీ పాదయాత్రకి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తే మీ మనుష్యులతో ఆ పోలీసులనే కొట్టిస్తున్నావు.. నీ వెనుక ఉన్న వారిలో నేర చరిత్ర ఉన్నవాళ్లని ట్రాక్ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు మీద దాడి చేస్తే సహించేది లేదు ఖబడ్దార్.. లోకేష్ నువ్వు రాజకీయాలకు పనికిరావు, ప్రజల్లో తిరిగేందుకు అస్సలు పనికిరావు. నీ పాదయాత్రలో కర్రలు, రాళ్లు, మరణయుధాలు తీసుకుని వెళ్తున్నావ్. తండ్రీకొడుకులు ఇద్దరూ జైలుకే.. చంద్రబాబు బండారం బయట పడిపోయింది. అతనిపై ఇంకా అనేక కుంభకోణాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో వారిలో గుబులు మొదలైంది. చంద్రబాబు చేసిన తప్పులకు జైలుకి వెళ్లడం ఖాయం. నారా లోకేష్ కూడా పాదయాత్ర ఇలాగే చేస్తే అతను కూడా జైలుకి వెళ్లడం ఖాయమని అన్నారు. ఇది కూడా చదవండి: చిత్తూరు జిల్లా ద్రోహి చంద్రబాబు: మంత్రి రోజా -
ఏలూరు, ప.గో.జిల్లాలో పంచాయతీ ఉపఎన్నికలు
అమరావతి: ఏలూరు, పశ్చిమ గోదావరి జిలాల్లో మొత్తం నాలుగు సర్పంచ్ స్థానాలకు 31 వార్డు స్థానాలకు నేడు పంచాయతీ ఉపఎన్నికలు జరగనున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి కాగా ఉదయం 7 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది గత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనంతరం ఖాళీ అయిన స్థానాల భర్తీ కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈరోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లాలో మొతం 3 సర్పంచ్ స్థానాలకు 21 వార్డులకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానానికి 10 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటలనుంచి కౌంటిం ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు రిటర్నింగ్ అధికారి. ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి మండలంలోని అడవినెక్కలం, పెదపాడు మండలం వీరమ్మకుంట, ముదినేపల్లి మండలంలోని వణిదురు సర్పంచ్ స్థానాలకు, అలాగే 21 వార్డులకు.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇరగవరం మండలం కావలిపురం సర్పంచ్ పదవికి, 10 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు పూర్తయిన వెంటనే జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియకు కూడా అని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో మొత్తం 4 సర్పంచ్ స్థానాలు, 47 వార్డు మెంబర్లకు గాను శ్రీనివాసపురం సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. అలాగే 12 వార్డులు ఏకగ్రీవం కాగా, 12 వార్డులకు సింగిల్ నామినేషన్లు, మరో రెండు వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 21 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 160 మంది సిబ్బందిని నియమించారు. ఏలూరు జిల్లాలో 11,114 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 120 మంది సిబ్బందిని నియమించారు. -
పశ్చిమగోదావరి జెడ్పీ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ
సాక్షి, పశ్చిమగోదావరి: ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ మహిళ అయిన పద్మశ్రీ కి సీఎం జగన్ బీఫామ్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఇవాళ జెడ్పీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగ్గా.. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీకి జిల్లా మంత్రులతో పాటు పలువురు నేతలు అభినందనలు తెలియజేశారు. ‘‘బీసీ మహిళగా నన్ను గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. సాధారణ గృహిణి నైన నాకు జెడ్పీటీసీగా అవకాశం ఇచ్చారు . కొప్పుల వెలమలకు పెద్దపీట వేస్తూ జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారు. మెరుగైన పాలన అందించి సీఎం జగన్‌కి మంచి పేరు తీసుకొస్తాను’’ అని గంటా పద్మశ్రీ చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినట్లే వెనుక బడిన వర్గాలకు అండగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ ,అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చి అండగా ఉంటున్నారు. పార్టీ కోసం కష్ట పడ్డ ప్రతి కార్య కర్త కు మంచి భవిష్యత ఉంటుందని నిరూపించారు. ఒక బీసీ మహిళకు జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారు. ::ఎమ్మెల్యే ఆళ్ళ నాని బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి. నాడు జడ్పీ చైర్మన్ గా నాకు వైఎస్సార్ రాజకీయ భవిష్యత్తు ఇస్తే.. నేడు మంత్రి గా సీఎం జగన్మోహన్రెడ్డి అవకాశం ఇచ్చారు. ఉద్యోగులకు వరాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఈనాడు లాంటి టిష్యూ పేపర్ మరొకరి లేదు. మేము అప్పుల పాలు చేశాము అంటున్నారు. మరి ఆనాడు 20 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు... వారికి కనపడలేదు. 4500 కోట్లు పసుపు కుంకుమ రూపంలో డైవర్ట్ చేశారు చంద్రబాబు. బాబు చేసిన అప్పై మేము తీర్చు తున్నాము. ::: మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఈరోజు సామాజిక విప్లవం సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి పాలనలో కనిపిస్తుంది. బలహీన వర్గాల చెందిన వ్యక్తి కవురు శ్రీనివాస్ ను శాసనమండలికి పంపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో బలహీన వర్గాలకు పెద్దపీట వేసి విప్లాత్మకమైన మార్పు తెచ్చారు. :::ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే చంద్రబాబు.. సరిగ్గా ఎన్నికల ముందు బీసీలను ముందు పెట్టీ అధికారం అనుభవించేవాడు. ఇప్పుడు బీసీ వెలమ కులస్తులకి జడ్పీ చైర్మన్ కేటాయించి ప్రత్యేక స్థానం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు. సీఎం జగన్మోహన్రెడ్డికి వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్థానాలు ఇచ్చి ఆయన రుణo తీర్చుకుందాం ::: ఎంపీ కోటగిరి శ్రీధర్ రెండో మహిళగా.. పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ 1936లో జిల్లా బోర్డుగా ఏర్పడింది. 1959 లో జిల్లా ప్రజాపరిషత్‌గా అవతరించింది. అప్పటి నుంచి 21 మంది జెడ్పీ చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో 1995, 2000లో జెడ్పీ చైర్మన్‌గా ఇమ్మణ్ణి రాజేశ్వరి పనిచేయగా.. రెండో మహిళా చైర్‌పర్సన్‌గా పద్మశ్రీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
గోదావరిలో పడవ బోల్తా ..ఇద్దరు గల్లంతు
సాక్షి, ఆచంట: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం బీమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. పడవ బొల్తా పడటంతో ఇద్దరు గల్లంతయ్యారు. అధిక కొబ్బరి లోడుతో పడవ వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతయిన బాధితులు వల్లురూ గ్రామనికి చెందిన కుడిపుడి పెద్దిరాజు(58), దొడ్డిపట్ల గ్రామానికి చెందిన సిరగం వెంకటన రమణ(35)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్యలు చేపట్టారు. సామార్థ్యానికి మించి కొబ్బరి కాయల లోడు ఎక్కించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు పేర్కొన్నారు. పడవలో మొత్తం ఐదుగురు ఉన్నారని అందులో ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. (చదవండి: సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధత) -
AP: శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఎగిసిపడుతున్న మంటలు!
సాక్షి, పశ్చిమగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, పశ్చిమ గోదావరిలో జరగుతున్న వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకలు జరుగుతున్న వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చలువు పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల ప్రకారం.. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. మంటల కారణంగా చలువ పందిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
సీఎం జగన్ పశ్చిమగోదావరి పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లా కలగంపూడిలో పర్యటించనున్నారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 4.20 గంటలకు కలగంపూడి చేరుకుంటారు. 4.30 గంటలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. అనంతరం 5.15 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 5.55 తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు. చదవండి: GIS: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్ -
పాతపాటి సర్రాజు భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు
పెద అమిరం(ప.గో. జిల్లా): గుండెపోటుతో మరణించిన క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. శనివారం మధ్మాహ్నం పశ్చిమగోదావరి జిల్లాలోని పాతపాటి సర్రాజు నివాసానికి చేరుకున్న సీఎం జగన్.. సర్రాజు భౌతికకాయానికి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే పాతపటి సర్రాజు కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించారు. పాతపాటి సర్రాజు మరణవార్త తెలిసిన వెంటనే ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. ఆపై వెంటనే పశ్చిమగోదావరి జిల్లాలోని సర్రాజు నివాసానికి బయల్దేరి వెళ్లారు. కాగా, పాతపాటి సర్రాజు గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. 1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్రాజు రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు. 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి వైఎస్సార్ హయాంలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు. 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోలవరం నియోజక వర్గ పరిశీలకులుగా సర్రాజు ఉన్నారు. -
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా గుట్టు రట్టు
-
ముగిసిన మావుళ్లమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు
భీమవరం(ప.గో.జిల్లా): సిరుల తల్లి.. కల్పవల్లి.. భీమవరం మావుళ్లమ్మవారి ఆలయ వార్షికోత్సవాలముగింపు సందర్భంగా శుక్రవారం ఆలయంలో మహా నివేదన (మహా ప్రసాదం) సమర్పించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం జరిగిన అఖండ అన్నసమారాధనకు సుమారు 70 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. 29 రోజులపాటు అమ్మవారి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. -
ఒక్కటైన ఆంధ్రా అబ్బాయి.. మలేషియా అమ్మాయి.. మూవీ రేంజ్ లవ్‌స్టోరీ
ఆంధ్రా అబ్బాయి.. మలేషియా అమ్మాయి.. ఆస్ట్రేలియాలో ప్రేమ.. వీరిది ట్విస్టులతో కూడిన సినిమా రేంజ్ లవ్‌స్టోరీ. పెద్దలను ఒప్పించడానికి ఏకంగా 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. వారు ఒప్పుకున్నాకే విశాఖలోని రుషికొండలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. కాస్తా లేట్ అయినా కుటుంబంలో ఆనందం నెలకొంది. ఇంతకీ వీళ్ల పరిచయం ఎక్కడ.. ఎలా జరిగిందంటే.. వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని వేడంగికి చెందిన కోట సూర్యప్రకాశరావు 15 ఏళ్ల క్రితం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. కాగా, సూర్యప్రకాశరావుకు భవానీ ప్రసాద్ మూడో కుమారుడు. అయితే, భవానీ ప్రసాద్.. ఉన్నత చదువుల కోసం 13 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ మలేషియాకు చెందిన ఐక్‌వేతో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. దీంతో, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ప్రేమ విషయాన్ని ఇద్దరి ఇళ్లలో చెప్పాలని డిసైడ్ అయి వారి మనసులో మాట చెప్పారు. అయితే, చాలా మంది ఫ్యామిలీల్లో జరిగినట్టే వీరి ప్రేమకు కూడా కుటుంబ సభ్యులు నో చెప్పారు. దీంతో, పెద్దల మాటలను గౌరవించి.. తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని ఐక్‌వే చెప్పింది. ఈ క్రమంలో భాను ప్రసాద్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, ఇద్దరూ ఫ్రెండ్స్‌గానే ఉన్నారు. ఉన్నత చదవుల తర్వాత.. ఇద్దరూ మంచి ఉద్యోగాలు పొందారు. కొద్దిరోజుల్లోనే భాను ప్రసాద్ జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. దీంతో, ఐక్‌వే కూడా జాబ్ మానేసి.. భాను వ్యాపార వ్యవహారాలను చూస్తున్నారు. ఇలా ఏకంగా 12 సంవత్సరాల కాలం గడిపోయింది. ఇంట్లో వాళ్లు ఇద్దరికీ సంబంధాలు చూసినప్పటికీ నో చెబుతూ వచ్చారు. ఇలా ఇద్దరికీ 41 ఏళ్ల వయస్సు వచ్చింది. ఈ క్రమంలో ఐక్‌వే కుటుంబ సభ్యులు వీరిద్దరి ప్రేమకు ఓకే చెప్పి.. పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య విశాఖలో ఘనంగా వివాహ వేడుక జరిగింది. -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యను టార్గెట్ చేసి..
కాజులూరు, తూర్పు గోదావరి: తనపై భర్త, అతడి ప్రియురాలు హత్యాయత్నానికి పాల్పడ్డారని.. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పోలీసులు నెల రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని.. ఇకనైనా న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడం కలకలం రేపింది. మీడియాకు ఆమె మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు శివారు చాకిరేవు మెరకకు చెందిన అనసూరి లోవలక్ష్మికి పదేళ్ల కిందట కె.గంగవరం మండలం శివల గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. అయితే అతడు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై లోవలక్ష్మి నిలదీసింది. ఈ నేపథ్యంలో ఒక రోజు అర్ధరాత్రి భర్త, అతడి ప్రియురాలు కలిసి లోవలక్షి్మపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న లోవలక్ష్మి కాజులూరులోని పుట్టింటికి వచ్చేసింది. తనపై హత్యాయత్నం జరిగిందని, తనకు న్యాయం చేయాలని గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్‌లో ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో కాకినాడ జిల్లా ఎస్పీ రవీద్రనాథ్‌బాబును కలిసి పరిస్థితి వివరించింది. ఎస్పీ ఆదేశాల మేరకు గొల్లపాలెం పోలీసులు లోవలక్ష్మి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అయితే ఎటువంటి కేసూ నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో తనను నెల రోజులుగా అర్ధరాత్రి వరకూ ముద్దాయి మాదిరిగా పోలీస్ స్ట్షేన్ చుట్టూ తిప్పుతున్నారని, ఇకనైనా తనకు న్యాయం చేయకపోతే గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్ ఎదుట ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరో దారి లేదని లోవలక్ష్మి పేర్కొంది. ఆమె ఈవిధంగా మాట్లాడుతున్న వీడియోపై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కౌన్సెలింగ్ వల్లనే జాప్యం ఇది భార్యాభర్తలకు సంబంధించిన కేసు. ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. అందువల్లనే కేసు నమోదు ఆలస్యమైంది. రెండుసార్లు కౌన్సెలింగ్ చేసినా వారు అంగీకరించలేదు. దీంతో మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. – ఎం.తులసీరామ్, ఎస్సై, గొల్లపాలెం -
‘ప్రేమోన్మాది కల్యాణ్‌ను కఠినంగా శిక్షిస్తాం’
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో ఓ యువతిపై ప్రేమోన్మాది దారుణానికి పాల్పడిన ఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్య స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న వాసిరెడ్డి పద్మ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నిందితుడు కల్యాణ్‌ను కఠినంగా శిక్షిస్తామన్నారు. ‘ఇది ఒక ప్రేమోన్మాది దాడి. కల్యాణ్ అనే యువకుడు ఒక పశువులా అర్ధరాత్రి ప్రవర్తించాడు. బాధిత యువతి డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ కోర్స్ చేస్తోంది. పవర్ కట్ చేసి మరీ దాడికి పాల్పడ్డాడు. కరెంట్ పోవడంతో ఇంటిలోని వారు బయటకు వచ్చారు. యువతితో పాటు తల్లి, చెల్లి చేతులు, మెడపైన కత్తితో దాడి చేశాడు. వారి ట్రీట్మెంట్కు ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఆ ప్రేమోన్మాదిపై చార్జ్‌షీట్ వేసి హత్యాయత్నం కింద కేసు పెట్టి రౌడీ షీట్ తెరవాలని ఎస్పీని కోరాం. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతుంది’ అని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. -
న్యూ ఇయర్ పార్టీకి అత్తారింటికి వెళ్లడమే శాపమైంది..
బిక్కవోలు: న్యూ ఇయర్ వేడుకలో శృతి మించిన సరదా ఒకరి ప్రాణాన్ని బలిగొన్న ఘటన మండలంలోని కొమరిపాలెంలో ఆదివారం జరిగింది. బాధితులు పోలీసుల కథనం ప్రకారం రంగంపేట మండలం బాలవరం గ్రామానికి చెందిన కొమారపు చిన్నబాబు(20) కొమరిపాలెం గ్రామానికి చెందిన వెంకటలక్షి్మని 2020లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొమరిపాలెంలో నివాసం ఉంటున్నాడు. కాగా, నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని భార్యను, కుమార్తె వినితను పక్క వీధిలో ఉంటున్న అత్తవారింటికి పంపించాడు. అర్ధరాత్రి సమయంలో పక్కింటిలోనే ఉంటున్న వెంకటలక్ష్మి బంధువు ఖండవిల్లి నూకరాజు కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకున్నాడు. ఈ క్రమంలో కేక్ క్రీమును ఒకరికొకరు పూసుకునే క్రమంలో నూకరాజు కుటుంబ సభ్యులు చిన్నబాబును హేళన చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్పంగా ఘర్షణ జరిగింది. చిన్నబాబు అత్తగారి ఇంటికి వచ్చిన తరువాత.. ఇదే విషయమై నూకరాజుకు వెంకటలక్ష్మి ఫోన్ చేసి అడిగింది. నీ భర్త రేపు ఉండడంటూ నూకరాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెల్లవారుజాము మూడుగంటల ప్రాంతంలో నూకరాజు కూతురు శిరీష, ఆమె భర్త ధర్మ అలియాస్ సురేష్, అతని ఇద్దరు స్నేహితులు చిన్నబాబు అత్తవారింటి వద్దకు వచ్చి బయటకు రమ్మని కేకలు వేశారు. చిన్నబాబు బయటకు రావడంతో సురేష్ కత్తితో పలుచోట్ల పొడిచి చంపేశాడని అని వెంకటలక్ష్మి ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలాన్ని సీఐ వి.శ్రీనివాస్, ఎస్ఐ పి.బుజ్జిబాబు పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని అనపర్తి సీహెచ్‌సీకి తరలించారు. విషాద ఛాయలు ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నబాబు తండ్రి రామకృష్ణకు ఇద్దరు కూమారులు. ఇటీవల పెద్ద కుమారుడు ప్రమాదం మరణించడంతో ఉన్న ఒక్క కొడుకుతో జీవనం సాగిస్తున్నారు. అయితే ఆదివారం జరిగిన ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. నాలుగు నెలల గర్భిణి అయిన వెంకటలక్షి్మ.. ఏడాది వయసున్న కుమార్తె వినితతో చిన్నబాబు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచి వేసింది. -
పేదలకు గృహవరం.. ఏళ్ల నాటి కల సాకారం
సొంతిల్లు ప్రతిఒక్కరి కల.. ఏమి ఉన్నా లేకున్నా ఇల్లు ఉంటే చాలు.. ఏళ్ల తరబడి సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకు సీఎం జగన్ గృహయోగం కల్పించారు. స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ప్రోత్సహిస్తున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో గృహనిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తిచేసుకున్న లబ్ధిదారులు ఆనందోత్సాహాలతో గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అద్దె ఇంటి కష్టాలు తీర్చిన ముఖ్యమంత్రికి నీరాజనాలు పడుతున్నారు. సొంతింటికి చేరిన భాగ్యలక్ష్మి భీమవరం 8వ వార్డుకు చెందిన బాలం భాగ్యలక్ష్మి సుమారు 30 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో జీవనం సాగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆమెకు భీమవరం విస్సాకోడేరు లేవుట్‌లో ఇంటి స్థలం మంజూరు కాగా నిర్మాణం పూర్తిచేసుకుని ఇటీవల గృహప్రవేశం కూడా చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి తమ సొంతింటి కలను సాకారం చేశారని, అద్దె ఇంటి ఇబ్బందులు తప్పాయని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి గృహప్రవేశం ఈమె పేరు టి.అప్పాయమ్మ, భీమవరంలోని 6వ వార్డులో 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె కూలీ పనులు చేస్తుండగా కుమారుడు ఆటో నడుపుతున్నాడు. సీఎం జగన్ ఆమెకు విస్సాకోడేరు లేఅవుట్లో ఇంటి స్థలం మంజూరు చేశారు. అప్పాయమ్మ తన కుమారుడితో కలిసి ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. సంక్రాంతికి గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటు న్నారు. సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె అంటున్నారు. భీమవరం(ప్రకాశం చౌక్) : జిల్లాలోని 609 జగనన్న లేఅవుట్లతో పాటు సొంత స్థలాల్లోనూ లబ్ధిదారులు గృహనిర్మాణాలను ముమ్మరంగా చేపట్టారు. జిల్లాలో మొత్తం 72,688 ఇళ్లు మంజూరు కాగా లేఅవుట్లలో 55,766 మందికి స్థలాలు కేటాయించారు. మిగిలినవి సొంత స్థలంలో లబ్ధిదారులకు మంజూరుచేశారు. ఇప్పటివరకూ 15,197కు పైగా నిర్మాణాలు పూర్తికాగా మరో 2,800 ఇళ్లు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. వీరు జనవరిలో గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే 50 వేలకుపైగా ఇంటి నిర్మాణాలు పలు దశల్లో ఉన్నాయి. అద్దె కష్టాలు తీరుస్తూ.. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇంటి స్థలం కొనలేని వారికి సీఎం జగన్ గృహవరం ఇచ్చారు. దీంతో ఏళ్ల తరబడి అద్దె ఇంటిలో గడుపుతున్న పేదల కష్టాలు తీరుతున్నాయి. ఇంటి స్థలం ఉచితంగా అందించడంతో పాటు నిర్మా ణానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పిస్తోంది. నాడు దివంగత వైఎస్సార్ పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే నేడు ఆయన తనయుడు సీఎం జగన్ భారీ కాలనీలనే నిర్మిస్తున్నారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ అనుయాయులకే పథకాలు అందించేవారని, అయితే ప్రస్తుత ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా అన్ని పథకాలు వర్తిస్తున్నాయని అంటున్నారు. వేగంగా నిర్మాణాలు జిల్లావ్యాప్తంగా 609 లేఅవుట్లలో నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తయిన వారు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అన్నిరకాలుగా ఇంటి నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నాం. ఇసుక సరఫరాకు బల్క్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరంతరం లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. హౌసింగ్, మున్సిపాలిటీ, రెవెన్యూ తదితర శాఖల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. – పి.ప్రశాంతి, కలెక్టర్ కల నిజమాయె.. పెనుగొండ: ఎన్నో ఏళ్ల కల సీఎం జగన్ పాలనతో సాకారం కావడంతో లబ్ధిదారుడి ఆనందానికి అవధులు లేవు. మండలంలోని ఇలపర్రు జగనన్న కాలనీలో స్థలం పొందిన దంపతులు పోలుమూరి రత్నంరాజు, రత్న సురేఖ ఇంటి నిర్మాణం పూర్తి చేసి శనివారం గృహప్రవేశం చేశారు. యోగా అసోషియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ నరసింహరాజుతో ప్రారంభోత్సవం చేయించి కృతజ్ఞ త చాటారు. మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి, ఎంపీటీసీ పడపట్ల పద్మనాగేశ్వరి, సొసైటీ చైర్పర్సన్ వేండ్ర వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు పులిదిండి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఎడవల్లి సుబ్బారావు (62) మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఈ నెల 7న విజయవాడలో జరిగిన జయహో బీసీ సదస్సుకు హాజరైన సుబ్బారావు అక్కడ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను పార్టీ శ్రేణులు విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి అత్యుత్తమ వైద్యం అందించారు. మరోవైపు.. సుబ్బారావు మృతి సమాచారం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి, మంత్రి కొట్టు సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఈ విషయాన్ని ఆయన సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పార్టీ తరఫున రూ.10 లక్షలు సాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని మృతుడి గ్రామానికి వెళ్లి స్వయంగా అందజేయనున్నట్లు కొట్టు సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీసీల పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని తెలిపారు. అంతకుముందు.. తొక్కిసలాట విషయం తెలిసి విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు, ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావును కలిసి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసిన విషయాన్ని మంత్రులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. చదవండి: (ప్రతిపక్షాలకు అసత్య ప్రచారమే పనిగా మారింది: వైవీ సుబ్బారెడ్డి) -
పెళ్లింట విషాదం నింపిన రోడ్డు ప్రమాదం..
మామిడికుదురు: ఇంట్లో పెళ్లి జరిగిందన్న ఆనందంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులకు గంటల వ్యవధిలోనే ఆ ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది. ఒక్కగానొక్క కుమార్తెను కన్యాదానం చేసి కల్యాణ మంటపం నుంచి ఇంటికి తిరిగివస్తున్న తండ్రిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. దీంతో పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో ఆవేదన కట్టలు తెంచుకుంది. ఈ విషాద ఘటన పాశర్లపూడిలంక గ్రామంలో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వధువు తండ్రి ముత్యాల శ్రీనివాసరావు (51) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. అతని మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పాశర్లపూడిలంకకు చెందిన ముత్యాల శ్రీనివాసరావు కుమార్తె వనదుర్గవల్లీశ్రావణి వివాహం ఈ నెల 8వ తేదీ రాత్రి పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి ఫంక్షన్ హాల్లో జరిగింది. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత శ్రీనివాసరావు మోటార్ సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తూ పాశర్లపూడి కైకాలపేటలో 216వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ అతనిని కాకినాడలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. భగవంతుడు తమ కుటుంబానికి తీరని అన్యాయం చేశాడని మృతుడి భార్య మంగ, నవ వధువు వనదుర్గవల్లీశ్రావణి, వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి సోదరుడు వీరవెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు నగరం హెచ్‌సీ కొండబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆశాజ్యోతి దారుణ హత్య.. అనుమానమే ప్రాణం తీసిందా?
తాళ్లపూడి: కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను కర్కశంగా కత్తితో నరికి చంపి ముగ్గురు పిల్లలను అనాథలను చేశాడు. అంగన్వాడీ హెల్పర్ హత్య పశ్చిమ గోదావరి జిల్లాలోని కుకునూరులో సంచలనమైంది. భార్యపై అనుమానంతో మెడపై కత్తితో నరికిన నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తాళ్లపూడి ఎస్సై కె.వెంకటరమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాళ్లపూడి పరిధిలోని కుకునూరు అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న ఆటపాకల ఆశాజ్యోతి(30) తన ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటోంది. భర్త ఆటపాకల వీర వెంకట సత్యనారాయణతో విభేదాలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటోంది. ఇటీవల మళ్లీ పిల్లల కోసమని వచ్చి భార్యా పిల్లలతో కలసి ఉంటున్నాడు. సోమవారం ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్లే సమయంలో భార్య ఆశాజ్యోతితో గొడవ పడి కత్తితో ఆమె మెడపై, గొంతుపై నరికి హత్యచేశాడు. తీవ్ర రక్త స్రావం అయి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుని ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తన కుమార్తెపై అనుమానంతో అల్లుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని మృతురాలి తండ్రి పెద్దాడ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.వెంకటరమణ కేసు నమోదు చేశారు. కొవ్వూరు రూరల్ సీఐ కేవీ రమణ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ సత్యనారాయణవర్మ ఆధ్వర్యంలో ఘటనా ప్రదేశంలో వివరాలను సేకరించారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిల్లలు కన్నీరుమున్నీరు ఆశాజ్యోతి దంపతులకు ముగ్గురు పిల్లలు. ప్రభుత్వ పాఠశాలలో సురేంద్ర 8వ తరగతి, తేజ 5వ తరగతి, గోపి దుర్గ నాలుగో తరగతి చదువుతున్నారు. తల్లి మృతితో వీరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ ఆలనా పాలనా చూసే తల్లి తమ కళ్ల ముందే మృత్యు వాత పడడంతో వారు జీరి్ణంచుకోలేకపోతున్నారు. వీరి పరిస్థితి చూసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అంగన్వాడీ వర్కర్లు ఆశాజ్యోతి మృతదేహానికి నివాళులు అరి్పంచారు. -
ఏపీ మార్కెట్లోకి మధుర ఫలాలు.. అన్ సీజన్లో కిలో మామిడి పండ్లు ఎంతంటే?
సాక్షి, విశాఖపట్నం: నగరంలోకి మామిడి పండ్లు అప్పుడే వచ్చేశాయ్! వేసవిలో వచ్చే మామిడి పండ్లు శీతాకాలంలో రావడమేమిటని ఆశ్చర్యపోకండి! నూజివీడు ప్రాంతంలో ప్రత్యేకంగా పండించిన ఈ మధుర ఫలాలు నగరవాసులకు రుచిచూపించడానికి విచ్చేశాయి. సాధారణంగా ఏప్రిల్ నాటికి మామిడి పండ్లు పక్వానికి వస్తాయి. ఎక్కడైనా ముందుగా కాసిన చోట ఒక నెల ముందు మార్కెట్లో కనిపిస్తాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా నాలుగైదు నెలల ముందుగానే ఇవి దర్శనమిస్తున్నాయి. అనూహ్యంగా మార్కెట్లో కనిపిస్తున్న ఈ మామిడిని చూసిన వారు ఒకింత ఆశ్చర్య చకితులవుతున్నారు. ప్రస్తుతం విశాఖ మార్కెట్లో బంగినపల్లి, సువర్ణరేఖ, పరియా రకాల మామిడి పండ్లు అందుబాటులోకి ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నూజివీడు ప్రాంతంలో కొంతమంది రైతులు వీటిని ప్రత్యేకంగా పండిస్తున్నారు. మూడు నాలుగు రోజుల నుంచి విశాఖ, గాజువాకలకు చెందిన కొందరు పండ్ల వర్తకులు కొనుగోలు చేసి ఇక్కడకు తెస్తున్నారు. వీటిలో ఏ రకమైనా కిలో రూ.250 చొప్పున పండ్ల బండ్లపై విక్రయిస్తున్నారు. ధర ఎక్కువైనా మామిడి పండ్లపై మోజు పడేవారు అర కిలో, కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సాధారణ సీజనులో వచ్చే మామిడి పండ్లకంటే కాస్త రుచి తక్కువగానే ఉంటున్నా కాలం కాని కాలంలో వీటిని తినడం ఓ తీయని అనుభూతిని కలిగిస్తోందని నగరంలోని శాంతిపురానికి చెందిన ఎంకేఆర్ శర్మ ‘సాక్షి’తో చెప్పారు. రోజుకు అర టన్ను పండ్లు అమ్మకం నూజివీడు ప్రాంతం నుంచి కొనుగోలు చేసిన మామిడి పండ్లను నగరంలోని డైమండ్ పార్క్, ఎల్ఐసీ బిల్డింగ్, సీతమ్మధార రైతుబజార్, ఎంవీపీ కాలనీ, పూర్ణామార్కెట్, గాజువాక తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. రోజుకు నూజివీడు ప్రాంతం నుంచి అర టన్ను (500 క్వింటాళ్ల) మామిడి పండ్లు తెస్తుండగా 90 శాతం అమ్ముడుపోతున్నాయని ఈ పండ్ల వ్యాపారులు చెబుతున్నారు. రోజూ తాను 50 కిలోల మామిడి పండ్లను తెస్తే 40 కిలోలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయని డైమండ్ పార్కు వద్ద బండిపై విక్రయించే పండ్ల వ్యాపారి ఎస్.ఈశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. మామిడిపండ్లు డిసెంబర్లో మార్కెట్లోకి రావడం ఇదే తొలిసారని, సంక్రాంతి వరకు ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
పెళ్లి పుస్తకంలో రంగుల పేజీలు
పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయనేది పాత మాట.. ఇక్కడే స్వర్గం సృష్టిస్తామనడం నయా ట్రెండ్.. సంప్రదాయ తంతుకు సరికొత్త హంగులద్దుతున్నారు.. ఎంగేజ్మెంట్ హంగామా.. ప్రీవెడ్డింగ్ షూట్.. ప్రత్యేక అలంకరణలు.. మెహందీ.. సంగీత్ వంటి వాటితో మెగా ఈవెంట్‌ను తలపింపజేస్తున్నారు.. వివాహాది శుభకార్యాలను పదికాలాల పాటు పదిలపర్చుకోవాలని వధూవరులు చూపిస్తున్న ఆసక్తిని ఉపాధిగా మలుచుకుంటున్నారు కొందరు. ముహూర్తాలు మొదలవడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పెళ్లిసందడి ప్రారంభమైంది. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : పెళ్లిచూపులు, నిశ్చయ తాంబూలాల నుంచి వివాహ వేడుక వరకూ భారీ బడ్జెట్‌తో జరుగుతున్నాయి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వీడియోలు, ఫొటోలు తీయించుకోవడం పెళ్లి పుస్తకంలో మధుర ఘట్టంలా వధూవరులు భావిస్తున్నారు. దీంతో ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఉపాధి లభిస్తోంది. అలాగే వివాహ వేడుకలో పూర్వకాలం నుంచి అరివేడు ముంత, పూలజడ, చమ్మిలి దండ, అడ్డుతెర, ఉంగరాల ఆట బిందె, మంగళస్నానాల జల్లెడ, గొడుగులు వంటి వాటికి ప్రాధాన్యముంది. పెళ్లివారి అభిరుచులకు అనుగుణంగా వీటిని రంగులు, అద్దాలతో ప్రత్యేకంగా అలంకరిస్తూ ఆకట్టుకుంటున్నారు డిజైనర్లు. భలే ముహూర్తం ఈ ఏడాది వరుసగా మూడు నెలల మూఢం కారణంగా ఎటువంటి శుభకార్యాలు జరగలేదు. ఈనెల మొదటి వారంలోనే మూఢానికి ముగింపు పడగా కొద్దిపాటు ముహూర్తాలు అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 2న రాత్రి నుంచి కొద్దిపాటి పెళ్లిళ్ల ముహూర్తాలు మొదలయ్యాయి. అలాగే జనవరిలో 25 నుంచి మాఘమాసం ప్రవేశించి ఫిబ్రవరి 11వ తేదీ వరకూ గట్టి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అనంతరం మార్చి 28 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకూ గురు మూఢం ప్రవేశిస్తుండడంతో ముహూర్తాలకు బ్రేక్ పడనుంది. మెండైన ఉపాధి : వివాహాది శుభకార్యాలు మొదలుకావడంతో ఇప్పటికే చాలా మంది బ్యూటీషియన్లను బ్రైడల్ మేకప్‌ల కోసం రిజర్వ్ చేసుకున్నారు. అలాగే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు డిమాండ్ పెరిగింది. వీరితో పాటు పూలు, విద్యుత్ అలంకరణ చేసేవారు, ఫుడ్, ఐస్‌క్రీమ్, పాన్ సప్లయర్లు, కేటరర్లు, ఆయా వర్గాలకు సంబంధించిన సహాయకులకు చేతినిండా పని దొరుకుతుందనే ఆశతో ఉన్నారు. దాదాపు మూడు నెలలపాటు ముహూర్తాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్లిన వారంతా తిరిగి ఇటుగా రానున్నారు. దృశ్య కావ్యంలా.. వధూవరుల మంగళస్నానాలకు వినియోగించే పాత్రలు, మహారాజా తలపాగాలు, కాళ్లకు తొడిగే పావుకోళ్లు, రోళ్లు, రోకళ్లు, బాసికాలు, విదేశీ పూలజడలు, అల్లికల జాకెట్లు, పట్టువస్త్రాలు, వధూవరులు ఆకర్షణీయంగా కనిపించడానికి బ్రైడల్ మేకప్‌లు, పూచ్చిపూల మండపాలు, విద్యుద్దీపాలంకరణ, బాణసంచా సందడి, ఆర్కెస్ట్రా, వింధు భోజనాలు ఇలా అన్నింటా ప్రత్యేకతకు ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తంగా దృశ్యకావ్యంలా వివాహ తంతును జరిపించేందుకు పలువురు ఆసక్తి చూపడంతో ఆయా రంగాల్లో ని ఎందరో ముహూర్తాల సీజన్లో ఉ పాధి పొందుతున్నారు. మెహందీ.. సంగీత్ వేడుకలు వివాహా వేడుకల్లో ముఖ్యంగా మెహందీ, సంగీత్‌లు ప్రత్యేకతను సంతరించుకుంటున్నా యి. ఉత్తర భారతదేశంలో ఉండే ఈ వేడుకలు ఇటీవల జిల్లాలోను తళుక్కుమనిపిస్తున్నాయి. గోరింటాకు పెట్టుకోవడం, సినీ గీతాలకు నృత్యాలు చేయడం వంటి పనులు వినోదాత్మకంగా జరుగుతున్నాయి. దీంతో బ్యూటీషియన్లు, ఈవెంట్ మేనేజర్లకు ఉపాధి లభిస్తోంది. ఈవెంట్ అంటే ఓ కళ పెళ్లంటే సంప్రదాయ సంబరం. అందరినీ ఒకదగ్గరకు చేర్చి వినోదాన్ని పంచాలి. అలాంటి ఈవెంట్‌ను నిర్వహించడంలో ఓ కిక్ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరితో డ్యాన్స్ చేయిస్తే ఈవెంట్ ఆర్గనైజర్‌గా విజయం సాధించినట్టే. ఒక్కోసారి ముహూర్తం అర్ధరాత్రి ఉంటుంది. అటువంటప్పుడు అందరినీ ఆహ్లాదపరుస్తూ సమయం గడిచేలా చేయడం కూడా కళగా భావిస్తున్నాం. – అల్లాడ లావణ్య, ఈవెంట్ మేనేజర్ ఓపిగ్గా మేకప్ బ్రైడల్ మేకప్‌ను ఎంతో ఓపికగా చేయాలి. దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. ఒక్కొక్కరి శరీర ఛాయకు సరిపడేలా రంగులు అద్దాల్సి ఉంటుంది. దానిని గుర్తించడం బ్యూటీషియన్‌కు సవాలే. కరోనా తర్వాత చాలా మంది బ్రైడల్ మేకప్‌కు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనికి తోడు చాలా మంది ఈ రంగంలోకి రావడంతో పోటీ పెరిగి ఆదాయం తగ్గింది. అలాగే ఖర్చు కూడా పెరుగుతోంది. – బండి శిరీష, బ్యూటీషియన్, సిరీస్ హెయిర్ అండ్ బ్యూటీ ప్రత్యేక అలంకరణలు పెళ్లి తంతులో వినియోగించే ప్రతి వస్తువునూ ఆకర్షణీయంగా అలంకరించడం ట్రెండ్‌గా మారింది. ఇందుకు అనుగుణంగా గరికి ముంతలు, అవిరేడు ముంతలు, బాసికాలు, తలపాగాలు, సంప్రదాయ టోపీలు, పూల జడలు, గొడుగులు, బుట్టలు, బిందెలు వంటివి ప్రత్యేకంగా అలంకరిస్తున్నాం. ప్రతి దానికీ హంగులు అద్దుతూ పూసలు, పెయింటిగ్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాం. – పి.ఉమా మహేశ్వరిదేవి, శ్రీదేవి ఉమెన్స్ వరల్డ్ యజమాని ప్రీ వెడ్డింగ్ షూట్‌తో.. ఇటీవల ప్రీ వెడ్డింగ్ షూట్ నంచి ఫొటో, వీడియోగ్రాఫర్లకు పెళ్లి పని మొదలవుతోంది. చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్‌కు ఆసక్తి చూపుతున్నారు. ఇది ఫొటోగ్రాఫర్ల పనితనానికి మచ్చు తునకగా నిలుస్తోంది. దీంతో మేం అందమైన లొకేషన్లను వెదుకుతున్నాం. పెళ్లి తంతులో ప్రతి ఘట్టాన్నీ కవర్ చేయాల్సి ఉంది. ఇందుకు తగ్గట్టు ఖరీదైన కెమెరాలు వాడుతున్నాం. వివాహాల కవరేజ్‌ను బట్టి ప్యాకేజీ ఉంటుంది. – కరణం ఫణి, ఫొటోగ్రాఫర్ -
వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తా: చంద్రబాబు
సాక్షి, ఏలూరు/సాక్షి, రాజమహేంద్రవరం/కొవ్వూరు: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలను నట్టేట ముంచుతున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. నేను అనుకుంటే వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తా. పశ్చిమ గోదావరిలో ఉన్న హార్టీకల్చర్ యూనివర్సిటీ పేరు మారుస్తా’ అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేశారు. గురువారం జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, పోలవరం మండలాల్లో, కొవ్వూరులో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో రోడ్‌షోలు నిర్వహించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. తొలుత కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగిన బీసీ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి, డీజీపీ, చీఫ్ సెక్రటరీ ఒకే జిల్లా వాళ్ళు. రాష్ట్రంలో సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల ఈ నలుగురే రాజకీయం చేస్తుంటే మేము చూస్తూ ఉండాలా’ అని అన్నారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు పదవులు ఇచ్చి అగ్రవర్ణాల కింద పని చేయించుకుంటున్నారని అన్నారు. బీసీలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలని కోరిక ఉండటం తప్పు కాదని, ఒక పద్ధతి ప్రకారం ఎదగాలని చెప్పారు. బీసీల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు ఆయన పోలవరంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు గానీ గంజాయి మాత్రం ఇస్తున్నారని, అందరూ గంజాయి మత్తులో ఉంటే రాష్ట్రాన్ని దోచేస్తున్నారని విమర్శించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని, తెలంగాణలో ఎక్కువ మద్దతు ధర ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు పోయి, ఇసుక, మైనింగ్ మాఫియా, గంజాయి, ఎర్రచందనం స్మగ్లర్లు ఎక్కువయ్యారన్నారు. పోలవరం పునరావాస కాలనీలను జూబ్లీహిల్స్‌లా చేయాలనుకున్నా అన్నారు. 72 శాతం ప్రాజెక్టు తానే పూర్తి చేశానని, తాము అధికారంలోకి రాగానే పోలవరాన్ని జిల్లా గా ప్రకటిస్తామన్నారు. మనం ఎమైనా చేస్తే పోలీసులు వచ్చి గోడలు దూకి అరెస్టు చేస్తారని అంటూనే, వాళ్లదేం తప్పులేదని, జీతాలు కూడా లేవంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. తన మీద కేసులు పెట్టేందుకు తవ్వుతూనే ఉన్నారని, ఈక కూడా దొరకదని చెప్పారు. ప్రాజెక్టు వద్ద హైడ్రామా అంతకుముందు చంద్రబాబు, టీడీపీ నేతలు పోలవరం ప్రాజెక్టులోకి వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొన్నారు. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి తప్పనిసరని, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో అనుమతించలేమని డీఎస్పీ లతాకుమారి వివరించారు. దీంతో పోలీసులను అడ్డగోలు రీతిలో ప్రశి్నంచి 15 నిమిషాల పాటు రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఉద్యోగాలిచ్చా.. రాయల్టీ ఇవ్వండి తన హయాంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశానని, మీ పిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయని, లక్షల ఆదాయం చూపించానని అందుకు ప్రతిఫలంగా తనకు రాయల్టీ పే చేయాలని చంద్రబాబు కొవ్వూరు సభలో అన్నారు. సంపాదనలో కనీసం ఒక శాతం రాయల్టీ ఇవ్వాలన్నారు. పార్టీ ఫండ్ అన్నా ఇవ్వాలని ప్రాథేయపడ్డారు. -
కొవ్వూరు టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విబేధాలు
-
ఆర్బీకేల్లోనే గోనె సంచులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతు సంక్షేమమే థ్యేయంగా పరిపాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విత్తు దగ్గర నుంచి కోత కోసే వరకు అన్ని రకాలుగా సాయం అందిస్తోంది. రైతు పంటకు మద్దతు «ధర దక్కేలా చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎక్కడా నష్టపోకుండా ధాన్యాన్ని కళ్లాల వద్దే కొనుగోలు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు రెండు జిల్లాల అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా రైతులకు రైతుభరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోళ్ళకు ఏర్పాట్లు చేశారు. ఆర్బీకేల వద్ద వలంటీర్లు, రెవెన్యూ అధికారులు, పౌరసరఫరాల అధికారులతో ఒక టీం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్ళకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ళల్లో రైతు సంఘాల నేతలు, రైస్‌మిల్లర్లు, రైతులతో జిల్లా అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. గోనెసంచుల కొరతతో ఇబ్బందులు ఈ నెల మొదటి వారంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోనెసంచుల కొరత అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించి వాటికి ఇబ్బందులు ఏర్పడకుండా గోనెసంచులు భారీ ఎత్తున అందించేందుకు అ«ధికారులు చర్యలు తీసుకున్నారు. రెండు జిల్లాల పరిధిలో ధాన్యం సేకరణ లక్ష్యానికి అనుగుణంగా ఆరంభంలో గోనెసంచుల కొరత ఏర్పడినప్పటికీ దానిని అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించారు. గోనె సంచులను రైస్‌మిల్లర్ల నుంచి రైతులకు అందించేందుకు రెండు జిల్లాల జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. రైతుభరోసా కేంద్రాల్లో గోనెసంచులు అందుబాటులో ఉండేలా మిల్లర్లు గోనెసంచులు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆరంభంలో మిల్లర్లు గోనెసంచులు అందించడంలో కాస్త అశ్రద్ధ వహించినప్పటికీ క్రమేపి రైతు భరోసా కేంద్రాలకు గోనెసంచులు సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకున్నారు. మిల్లర్ల సాయంతో గోనెసంచుల సేకరణ ఏలూరు జిల్లా వ్యాప్తంగా 745 రైతుభరోసా కేంద్రాల్లో 4.2 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా పశ్చిమగోదావరి జిల్లాలో 296 రైతుభరోసా కేంద్రాల పరిధిలో 3.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. వీటికి ఏలూరులో 1.50 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 85 లక్షలు గోనెసంచులు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటికి అనుగుణంగా ప్రస్తుత అవసరాలకు ఏలూరు జిల్లాలో 95 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో 60 లక్షలు గోనెసంచులు అవసరం కానున్నాయి. వీటిని రైతులకు అందుబాటులో ఉన్న రైతుభరోసా కేంద్రాలకు మిల్లర్ల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5.43 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా ప్రస్తుత ఖరీఫ్‌లో మంచి దిగుబడి వచ్చింది. ఈ నేపథ్యంలో గోనెసంచులు భారీగా అవసరమయ్యాయి. గోనెసంచుల విషయంలో అధికారులు పూర్తి దృష్టి కేంద్రీకరించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. గోనెసంచులను రీసైక్లింగ్ విధానం ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతుభరోసా కేంద్రాల వద్ద అధికారులు అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణ చేస్తున్నారు. కళ్ళాల వద్దే ధాన్యం కొనుగోలుకు అధికారులు వాహనాలను సైతం సిద్ధంగా ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్బీకేల వద్ద వీఆర్ఓ, ఆర్ఐలను కస్టోడియన్లుగా నియమించి మిల్లులకు ధాన్యం రవాణా చేస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో 120 నుంచి 180 వరకు వాహనాలను అందుబాటులో ఉంచి రవాణాలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరణ చేపడుతున్నాం. ఆరంభంలో గోనెసంచుల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అ«ధిగమించి రైతులకు గోనెసంచుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – వె.ప్రసన్నవెంకటేష్, ఏలూరు జిల్లా కలెక్టర్ గ్రామస్థాయిలోనే రైతులకు సేవలు గ్రామ స్థాయిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు సేవలందిస్తున్నాను. ప్రస్తుతం కళ్ళాల వద్దే ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు అందుబాటులో గోనెసంచులు ఉంచి కొనుగోలు నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాము. రైతుభరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు అ«ధికారులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. – పి.ప్రశాంతి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ -
చంద్రబాబు ఈ వయసులో అలాంటివి అవసరమా?: మంత్రి కారుమూరి
సాక్షి, పశ్చిమగోదావరి: కర్నూలులో న్యాయరాజధాని వస్తే తమప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆనందంలో అక్కడి ప్రజలు ఉన్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అందుకే వాళ్లు బాబుని అడ్డుకొని గోబ్యాక్ నినాదాలు చేశారన్నారు. జగన్ ప్రజల హృదయాలకు దగ్గరయ్యేసరికి చంద్రబాబుకి పిచ్చి ముదిరిందని మండిపడ్డారు. ఎవరైనా అతనిని మెంటల్ ఆస్పత్రిలో చూపించాలన్నారు. ఈ మధ్య చంద్రబాబు కొత్తగా తొడగొట్టడం కూడా మొదలు పెట్టాడు. ఈ వయసులో అలాంటివి అవసరమా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ పార్టీలకతీతంగా పథకాలు అందిస్తూ ప్రజలకు దగ్గరయ్యేసరికి బాబుకి ఈర్ష్య, ద్వేషం పెరిగిపోయాయి అన్నారు. అమరావతి రాజధాని కాకపోతే లక్షల కోట్లు పోతాయనే బెంగ పట్టుకుందన్నారు. బాబు ఎక్కడికెళ్లినా తన భార్యను అవమానించారంటూ సింపతీ కోసం చూస్తున్నాడు. దమ్ముంటే అసెంబ్లీ రికార్డులు వెరిఫై చేసి నిరూపించు చంద్రబాబు అని సవాల్ విసిరారు. మేము చంద్రబాబు భార్యను ఒక్కమాట అన్నట్లు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతగా విరమించుకొంటాను అని సవాల్ చేశారు. మహానుభావుడు ఎన్టీఆర్‌ని క్షోభ పెట్టి, ఆయన బ్యాంక్ అకౌంట్లు కూడా బ్లాక్ చేసిన నీచుడు చంద్రబాబు అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (నానిపై చంద్రబాబు సీరియస్.. ఉండేవాళ్లు ఉండండి, పోయేవాళ్లు పోండి) -
రూ.1,400 కోట్లతో ‘పశ్చిమ’కు తాగునీరు
సాక్షి, అమరావతి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా కల్చర్‌తో ఏర్పడిన నీటి కాలుష్యంతో పాటు తీర ప్రాంతంలో ఉప్పునీటి సాంద్రత కారణంగా నెలకొన్న తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా రూ.1,400 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పనులకు సీఎం వైఎస్ జగన్ ఈ నెల 21న శంకుస్థాపన చేయనున్నారు. నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, దెందులూరు (కొంత భాగం), తాడేపల్లిగూడెం (కొంత భాగం) పరిధిలోని 26 మండలాల ప్రజలకు పథకం ద్వారా ఏడాది పొడవునా తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. మొత్తం 1,178 గ్రామీణ నివాసిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయిని ఏర్పాటు చేసి రోజూ సగటున ప్రతి వ్యక్తికి 55 లీటర్ల సురక్షిత తాగునీటి సరఫరా చేస్తామని గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వెల్లడించారు. సమీపంలోని నదుల నుంచి.. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల ఇప్పటికే రక్షిత మంచినీటి పథకాలున్నా సరఫరా చేయడానికి నీరు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. వాటర్ గ్రిడ్ ద్వారా ఏడాది పొడవునా తాగునీటి సరఫరా జరిగేలా సమీప నదులతో ప్రత్యేక పైపులైన్ల ద్వారా అనుసంధానిస్తున్నారు. సీఎం ప్రారంభించనున్న రూ.1,400 కోట్ల తాగునీటి పథకానికి కూడా గోదావరి నుంచి ఏటా 1.374 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. 30 నెలల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. రూ.10,131 కోట్ల పనులు.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వాటర్ గ్రిడ్ ద్వారా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో రూ.10,131 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ప్రభుత్వం చేపట్టింది. దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో రూ.700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని అధికారంలోకి రాగానే సీఎం జగన్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.480 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులు ఇప్పటికే 34 శాతానికిపైగా జరిగాయి. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలో రూ.279 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులు 25 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగతా చోట్ల త్వరలోనే ప్రారంభం.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రూ.1,650 కోట్లతో, ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.1,290 కోట్లతో, ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో రూ. 1,200 కోట్లతోనూ, ఉమ్మడి కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో రూ.750 కోట్లతో, ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.2,370 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా శాశ్వత రక్షిత మంచినీటి పథకాలకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తి చేసింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. -
సంక్రాంతికి తగ్గేదేలే.. స్పెషల్ డైట్‌తో తర్ఫీదు.. పుంజు ధర ఎంతో తెలుసా?
సంక్రాంతి పండగ అంటే గోదావరి జిల్లాల్లో గుర్తొచ్చేది కోడిపందేలే. ఏటా ఎంతో సందడిగా జరిగే ఈ పందేలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడకు వస్తుంటారు. పందేలలో రూ.కోట్లు చేతులు మారుతుంటాయి. అయితే సంక్రాంతి పండగకు ఇంకా రెండు నెలల సమయం ఉండగా అప్పుడే కోడిపుంజులను పందేలకు సిద్ధం చేస్తున్నారు. బరిలో బలంగా ఢీకొట్టేలా జాతి కోళ్లను జిల్లాలోని కొన్ని శిబిరాల్లో పెంచుతుండగా, వీటి ఖరీదు రూ.వేల నుంచి లక్షల్లో పలుకుతుండటం విశేషం. భీమవరం (ప్రకాశం చౌక్): సంక్రాంతి బరిలో దించే పుంజులపై పందెం రాయుళ్లు, అలాగే పుంజుల పెంపకందారులు భారీగా పెట్టుబడులు పెడతారు. పందేనికి పుంజును సిద్ధం చేయడం కోసం పెంపకందారులు చాలా శ్రమిస్తారు. పుంజును సుమారు ఏడాది పాటు పెంచుతారు. వీటి ఆహారం నుంచి ఆరోగ్యంగా, బలంగా ఉండేవరకు ఒక్కోక్క పుంజుపై సుమారు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేస్తారు. కొందరు ప్రత్యేకంగా కోసం స్థలం లీజుకు తీసుకుని మరీ 20 నుంచి 200 పుంజుల వరకు పెంచుతారు. పుంజుల సంఖ్య బట్టి ఏడాదికి సుమారు రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తారు. మరి కొందరు అయితే తమ ఇంటి వద్ద ఉండే చిన్న పాటి ఖాళీ స్థలంలోనే పందెం పుంజులను పెంచుతూ పండగ సమయంలో వాటిని విక్రయించి ఉపాధి పొందుతారు. ఖరీదైనా దాణా.. నిత్యం వ్యాయామం పందెం పుంజుకు బలవర్థమైన ఆహారం పెడతారు. మటన్ కైమా, జీడిపప్పు, బాదం పప్పు, కోడిగుడ్డు, గంటులు, చోళ్లు, తదితర వాటిని ప్రతిరోజు వాటికి ఆహారంగా పెడతారు. తరచూ పుశువైద్యులకు చూపించి వారి సలహాలు మేరకు విటమిన్ మాత్రలు, అనారోగ్యానికి గురికాకుండా వైద్యం అందించడం చేస్తారు. పందెం బరిలో త్వరగా అలసిపోకుండా ఎక్కువ సేపు పోరాడేలా ప్రతి రోజు వ్యాయామం చేయిస్తారు. నీటిలో ఈత కొట్టిస్తారు. పుంజు ఎలా పోరాడుతుంతో తెలుసుకోవడానికి తరచూ ఇతర కోళ్లతో పందేలు వేసి గమనిస్తుంటారు. రూ.10 కోట్ల వ్యాపారంపైనే.. జిల్లాలో పందెం పుంజుల పెంపకం కలిగిన ప్రాంతాల చూస్తే ముఖ్యంగా భీమవరం, పాలకొల్లు, ఉండి, ఆకివీడు, కాళ్ల, వీరవాసరం, నర్సాపురం, ఆచంట, తణుకు, పాలకోడేరు, తాడేపల్లిగూడెం, తదితర ప్రాంతాల్లో భారీగా పుంజులను పెంచుతుంటారు. మొత్తం జిల్లాలో ఏటా సంక్రాంతి పండగకు పందెం పుంజుల కొనుగోలు కోసం పందెంరాయుళ్లు సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తుంటారని అంచనా. పుంజు ధర, రకాలు పందెం పుంజుల ధర విషయానికి వస్తే జాతి, రంగు, దెబ్బలాడే విధానాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు. వీటి ధర సుమారుగా రూ.15 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతాయి. వీటిలో నెమలి, కాకీ నెమలి, పచ్చ కాకి, సేతువా, పర్ల, డేగ, నెమలి డేగ, రసంగీ, మైలా, ఫింగలా, పెట్టమర్రు, తదితర రకాల పుంజులు ఉంటాయి. ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు పందెం పుంజులను పెంపకందారులు పలు రకాలుగా విక్రయిస్తున్నారు. పుంజు కావాల్సిన వారు ముందుగా కొంత అడ్వాన్సు ఇచ్చి బుక్ చేసుకుని పందెం రోజు పూర్తి మొత్తం ఇచ్చి తీసుకువెళుతుంటారు. మరి కొందరు నేరుగా మకాం వద్దకు వెళ్లి వారికి కావాల్సిన పుంజులను ఎంచుకుని కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు అయితే పెంపకందారులు పుంజులను ఆన్లైన్లో కూడా విక్రయిస్తున్నారు. సంక్రాంతి పండగ సమయంలో పందేలు జరిగే ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడ నేరుగా కూడా విక్రయిస్తుంటారు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, వీరవాసరం, కాళ్ల, ఉండి, ఆకివీడు, తాడేపల్లిగూడెం, అత్తిలి, తణుకు తదితర మండలాల్లో కోడి పుంజులను విక్రయాలు ఎక్కువగా విక్రయిస్తుంటారు. -
CM Jagan: నరసాపురం పర్యటనకు సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: నరసాపురంలో ఈనెల 18న జరుగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్‌హార్బర్, కాళీపట్నం రెగ్యులేటర్ల నిర్మాణం, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్, సబ్‌స్టేషన్ నిర్మాణం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన, బస్టాండ్, 100 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సాలు చేస్తారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. పట్టణంలోని 25వ వార్డు వీవర్స్‌కాలనీలో బహిరంగసభ నిర్వహించే ప్రాంతంలో ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయా లని ఆదేశించారు. చినమామిడిపల్లి లేఅవుట్ వద్ద హెలీప్యాడ్ పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గం మీదుగా వెళ్లే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఉన్న సిబ్బందికి పాస్‌లు జారీ చేయాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. అనంతరం ఆమె సీఎం పర్యటించనున్న ప్రాంతాలు బస్టాండ్, ప్రభుత్వాస్పత్రి, సభావేదిక స్థలాన్ని పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మురళి, నరసాపురం సబ్‌కలెక్టర్ ఎం.సూర్యతేజ ఆమె వెంట ఉన్నారు. చదవండి: (CM Jagan: రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్) 92 అర్జీల స్వీకరణ : నరసాపురం మున్సిపల్ కార్యా లయంలో కలెక్టర్ పి.ప్రశాంతి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 92 మంది అర్జీలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను తక్షణం పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార అంశానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, స్పందన దరఖాస్తుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సూచించారు. వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి కలెక్టర్ వినతులు స్వీకరించారు. చదవండి: (విశాఖ నార్త్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సీఎం జగన్ భేటీ) -
బెడ్రూమ్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. ఏం జరిగింది?
తణుకు (పశ్చిమ గోదావరి) : తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో ఓ యువతి సజీవ దహనం ఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న గ్రామానికి చెందిన ముళ్లపూడి నాగహారిక (19) ఇంట్లో బెడ్రూమ్లో మంచంపైనే సజీవ దహనం అయ్యింది. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా హత్య చేసి కాల్చివేశారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్, రూపరాణి దంపతుల కుమార్తె నాగహారిక శుక్రవారం రాత్రి తన గదిలో నిద్రించింది. తెల్లారేసరికి నాగహారిక మంచంపై కాలి బూడిదై కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగహారికకు రూపరాణి సవతి తల్లికాగా ఆమెకు తొమ్మిదేళ్ల మంజలిప్రియ అనే కుమార్తె ఉంది. ఇటీవల నూతనంగా ఇల్లు నిర్మించుకున్న వీరు మూడు నెలల క్రితం గృహప్రవేశం చేశారు. అయితే పూర్తిస్థాయిలో ఇంటి సామగ్రి తెచ్చుకోకపోవడంతో యజమాని ముళ్లపూడి శ్రీనివాస్ పాత ఇంటివద్దనేనిద్రిస్తున్నారు. శనివారం ఉదయం కొత్త ఇంటికి వచ్చి భార్యను నిద్రలేపే సమయంలో కుమార్తె నిద్రిస్తున్న గది నుంచి పొగలు రావడం గమనించారు. అప్పటికే నాగహారిక మంటల్లో కాలిపోయింది. తండ్రి ముళ్లపూడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ సీహెచ్ ఆంజనేయులు, ఎస్సై రాజ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ సిబ్బంది, డాగ్‌స్కా్వడ్ ఘటనా స్థలంలో పలు ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు నాగహారిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
బ్లాక్ రైస్ సాగులో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. యువరైతు సక్సెస్ ఫార్ములా ఇదే!
నేటి యువతరం కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని ఉన్నతమైన ఉద్యోగం, వేతనాలతో ఆధునిక జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. అదేబాటలో పయనిస్తూ ఫైన్ ఆర్ట్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడిన యువ రైతు విష్ణుమూడి శశికాంత్ కోవిడ్ వల్ల వచ్చిన స్వల్ప విరామం సమయంలో వ్యవసాయంపై ఆసక్తి చూపారు. బ్లాక్ రైస్, సుగర్ ఫ్రీ రైస్, బాస్మతీ రకాలను తనకున్న సొంత క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాక అధిక దిగుబడులను సాధించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. తాడేపల్లిగూడెం రూరల్: కోవిడ్ మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెనుమార్పులను తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ వైరస్ బారిన పడ్డ వారు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పరగూడెం గ్రామానికి చెందిన విష్ణుమూడి శశికాంత్ కుటుంబీకులు కోవిడ్ బారిన కోలుకోవడంతో వైద్యుల సూచన పోషకాలతో కూడిన ఆహారంపై దృష్టి సారించారు. శశికాంత్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా, కోవిడ్ సంక్షోభంలో సాఫ్ట్వేర్ రంగంలో కొంత విరామం రావడం వంటి కారణాలతో తనకున్న భూమిలోనే ప్రయోగాత్మకంగా పోషకాలతో కూడిన బ్లాక్ రైస్ సాగుపై మక్కువ చూపారు. బ్లాక్ రైస్‌లో ప్రోటీన్లు 8.16 శాతం, కొవ్వు శాతం 0.07 శాతం, బార్లీ, గోధుమల్లో లభించే గ్లూటన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తిని అందించడంలో ఎంతగానో ఉపకరిస్తాయి. వీటన్నింటిని గ్రహించిన శశికాంత్ బ్లాక్ రైస్ సీడ్‌ను వరంగల్ నుంచి తీసుకువచ్చి తనకున్న ఐదెకరాల విస్తీర్ణంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా బ్లాక్ రైస్ సాగు చేపట్టారు. అందులో పురుగుమందులు వినియోగించుకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాక ఎకరాకు 25 నుంచి 30 బస్తాల వరకు నాణ్యమైన దిగుబడి సాధించారు. ప్రస్తుతం ఎకరం విస్తీర్ణంలో బ్లాక్‌రైస్‌ను సాగు చేస్తున్నారు. వీటితో పాటు బాస్మతీ రైస్, సుగర్ ఫ్రీ (బీపీటీ 5420) రైస్‌ను అరెకరం చొప్పున విస్తీర్ణంలో సాగు చేశారు. బాస్మతీ రైస్ 20 బస్తాలు, సుగర్ ఫ్రీ రైస్ 25 బస్తాలు దిగుబడి లభించాయి. పశువుల వ్యర్థాలే ఎరువు పశువుల, జీవాల విసర్జిత మల, మూత్రం, వేప పొడి వంటి వాటితో ఎరువును తయారు చేసి చేనుకు అందించడం ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించారు. తద్వారా ఎరువుల ఖర్చులను దాదాపు తగ్గించుకున్నారు. రైతుకు ప్రధానంగా నష్టం చేకూర్చేది తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు. అటువంటి వాటిని సైతం దీటుగా ఎదుర్కొని నిలబడగలిగే వరి వంగడంగా ఆయన పేర్కొన్నారు. బ్లాక్ రైస్ సాగు చేపట్టిన రైతు గుండెలపై చేయి వేసుకుని ప్రశాంతంగా ఉండవచ్చని భరోసానిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు ఆదాయం బ్లాక్ రైస్‌ను తమ ఇంటి అవసరాలకు, బంధువులకు సరఫరా చేయగా, మిగిలిన వాటిని 25 కిలోల బస్తాకు రూ.3 వేలు, సుగర్ ఫ్రీ రైస్ బస్తాకు రూ.1500లకు విక్రయించారు. ఒక పక్క ఆరోగ్యం, మరో పక్క ఆదాయం కూడా బాగుందని శశికాంత్ చెబుతున్నారు. ఒత్తిడి లేని వ్యవసాయమే లక్ష్యం ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నా వ్యవసాయం చేయడం అంటే ఇష్టం. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల బెడద లేకుండా ఎటువంటి ఒత్తిడి లేని వ్యవసాయాన్ని రైతుకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. వ్యవసాయ యంత్ర పరికరాలను తయారు చేసుకోవాలని భావిస్తున్నా. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో 680 రకాల రైస్ బ్రాండ్స్ ఉన్నాయి. వాటిలో మేలైన రకాలు సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించాలన్నదే నా లక్ష్యం. – విష్ణుమూడి శశికాంత్, యువ రైతు, మెట్ట ఉప్పరగూడెం, తాడేపల్లిగూడెం మండలం -
భీమవరం కాలేజీ హాస్టల్లో దారుణం..
సాక్షి, పశ్చిమగోదావరి: భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య ఘర్షణ కారణంగా ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అంకిత్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. ఐరన్ బాక్స్‌లో అంకిత్ ఛాతిపై వాతలు పెట్టారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లీజ్ అని వేడుకున్నప్పటికీ వారు కర్రలతో కొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అంకిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నలుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
AP: కళ్లెదుటే కలల గృహం
పేదల సొంతింటి కల సాకారమవుతోంది.. పల్లెల స్వరూపం మారుతోంది.. జగనన్న కాలనీలు కొంగొత్త గ్రామాలుగా అవతరిస్తున్నాయి.. కళ్లెదుటే ఆనందాల లోగిళ్లను చూస్తూ పేదల మోము వికసిస్తోంది.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గృహనిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా పేదల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా ప్రతి పేదవాడికీ సొంతింటిని అందించాలని సంకల్పించి చర్యలు తీసుకుంది. ఈ మేరకు అర్హులందరికీ స్థలాల పట్టాలు అందించి గృహనిర్మాణాలకు అన్నివిధాలా తోడ్పాటు అందిస్తోంది. ఈ క్రమంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 1,863 లేఅవుట్లు గ్రామాలుగా విస్తరిస్తున్నాయి. ఒక్కో లేఅవుట్లో ఇళ్ల నిర్మాణంతో కొత్త ఊరిని తలపిస్తోంది. లేఅవుట్ల వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వివిధ దశల్లో నిర్మాణాలు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,863 లేవుట్లు ఉండగా.. 2,12,895 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లో 17,916 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా లబ్ధిదారులు నివాసముంటున్నారు. ఇదిలా ఉండగా రెండు జిల్లాల్లోనూ వివిధ దశల్లో ఉన్న గృహాలను వచ్చే డిసెంబర్ 21 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ప్రతి రోజూ లక్ష్యాలను నిర్దేశించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వందల కోట్లతో.. రెండు జిల్లాల్లో నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల కోసం ప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 322.48 కోట్లు వెచ్చించింది. అలాగే వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాల కోసం మరో రూ.600 కోట్లు అందిస్తోంది. వీటితో పాటుగా ప్రతి ఇంటికీ డీఆర్ డీఏ ఆధ్వర్యంలో రూ.35 వేలు అదనంగా అందిస్తూ నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు కూడా అడిగిన వెంటనే ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి ఏలూరు జిల్లావ్యాప్తంగా గృహనిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాం. వీలైనంత ఎక్కువ మందికి గృహాలు అందించాలని నిర్ణయించి ఆ దిశగా లక్ష్యాన్ని నిర్దేశించి పనులు పూర్తి చేయిస్తున్నాం. ఇప్పటికే పెండింగ్ బిల్లులు చెల్లించి, ఎప్పటికప్పుడు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ గృహనిర్మాణాల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నాం. – వె.ప్రసన్న వెంకటేష్, కలెక్టర్, ఏలూరు ప్రభుత్వమే అన్నీ సమకూర్చుతూ.. అధికారులు సిమెంట్, ఐరన్, ఇసుకను ఇంటి వద్దనే అందిస్తున్నారు. నిర్మాణ పనుల కోసం నీటిని సరఫరా చేస్తున్నారు. నేను, నా భార్య కూలీలతో కలిసి పనిచేస్తున్నాం. మా ఇద్దరికీ ఉపాధి పథకం ద్వారా 90 రోజుల కూలీ డబ్బు లు రూ.30 వేలు బ్యాంకు ఖాతాలో జమచేశారు. మొత్తంగా రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. సంతోషంగా నిర్మాణం పూర్తి చేస్తాం. – పాలే ఈశ్వరరావు, చాటపర్రు, ఏలూరు మండలం. పక్కాగా మౌలిక వసతులు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీ భూమి మెరక చేసింది. దీంతో మాకు పునాది ఖర్చు రూ.50 వేల వరకు తగ్గింది. కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంటు ఇచ్చారు. గ్రావెల్ రోడ్డు వేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. అధికారులు అన్ని పనులు దగ్గరుండీ చేయిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. – బసవరాజు వెంకటేశ్వరరావు, చాటపర్రు, ఏలూరు మండలం స్థిరాస్తిని అందించిన ప్రభుత్వం ఇతడి పేరు కిల్లారి రాంబాబు, భీమడోలు మండలంలోని గుండుగొలను గ్రామం. వీరి కుటుంబానికి ప్రభుత్వం సెంటున్నర భూమి ఇచ్చి ఇంటిని మంజూరు చేసింది. ఐదు నెలల క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తిచేసి కుటుంబంతో అక్కడే నివసిస్తున్నారు. సొంతింటి కల సాకారం చేయడంతో పాటు జగనన్న తనను రూ.5 లక్షల ఆస్తికి హక్కుదారుడిని చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంగా నిర్మాణం ఈమె పేరు కానూరి పార్వతి, భీమడోలు మండలం గుండుగొలను గ్రామం. కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో అవస్థలు పడుతుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది. సెంటున్న స్థలాన్ని ఉచితంగా అందించగా ఆనందంగా నిర్మాణ పనులు చేపట్టింది. తన దశాబ్దాల కల సాకారమైందని, జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని ఆమె అంటున్నారు. -
ద్వారకాతిరుమలలో దారుణం.. కూతురుపై ప్రేమ ఎంతకు దారితీసింది
ద్వారకాతిరుమల: తన కుమార్తె మృతికి ప్రియుడే కారణమని భావించిన ఆమె తండ్రి ఆ యువకుడిని పథకం ప్రకారం హతమార్చాడు. తన కుమార్తె సమాధికి కూతవేటు దూరంలో ఆ యువకుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఈ దారుణ ఘటన ద్వారకాతిరుమల మండలం, గొడుగుపేట శివార్లలో సోమవారం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఐఎస్ రాఘవాపురం పంచాయతీ తూర్ల లక్ష్మీపురానికి చెందిన తానిగడప పవన్‌కల్యాణ్ (24), రామసింగవరం పంచాయతీ గొడుగుపేటకు చెందిన మరీదు శ్యామల (18) జంగారెడ్డిగూడెంలో చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారు. వారు తమ ప్రేమ విషయాన్ని కొద్ది నెలల క్రితం ఇంట్లో చెప్పగా, కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించ లేదు. దాంతో మనస్థాపానికి గురైన శ్యామల ఈ ఏడాది జూన్ 5న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మృతితో కలత చెందిన ఆమె తండ్రి నాగేశ్వరరావు.. పవన్ కల్యాణ్‌ను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 15న జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంలోని ఓ కాలువ గట్టుపై తన స్నేహితుడు నాగరాజుతో కలిసి పవన్ కల్యాణ్ పార్టీ చేసుకున్నాడు. అప్పటి నుంచీ అతడు కనిపించడం లేదు. విచారణ చేపట్టిన పోలీసులు అదే రోజు రోజు రాత్రి పవన్ కల్యాణ్‌ను శ్యామల తండ్రి నాగేశ్వరరావు తీసుకెళ్లినట్టు గుర్తించారు. దీంతో, పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్టు నాగేశ్వరరావు అంగీకరించాడు. మృతదేహాన్ని శ్యామల సమాధికి సమీపంలో పూడ్చిపెట్టినట్టు తెలిపాడు. జంగారెడ్డిగూడెం సీఐ బాలసురేష్‌బాబు, లక్కవరం ఎస్సై దుర్గామహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు పవన్ కల్యాణ్ కుటుంబాన్ని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సోమవారం పరామర్శించారు. -
అమరావతి పాదయాత్రకు రెండో రోజూ నిరసన సెగలు
-
అమరావతి రైతుల మహాపాదయాత్రకు నిరసన సెగ
సాక్షి, పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ చేస్తోన్న పాదయాత్రపై పాలకొల్లు నియోజకవర్గం వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాజధాని ముసుగులో వస్తున్న తెలుగుదేశం బినామీలు గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ''ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు, వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య చిచ్చు వద్దు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే.. మూడు రాజధానులుగా అమరావతి, కర్నూలు, విశాఖపట్నం కావాలి, రాజధాని ముసుగులో తెలుగుదేశం బినామీ నాయకులు గోబ్యాక్ గోబ్యాక్'' అంటూ ఫ్లెక్సీల్లో నినాదాలు ముద్రించారు. చదవండి: (స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ) -
NIT Tadepalligudem: క్యాంపస్ ప్లేస్మెంట్లో నిట్ విద్యార్థుల సత్తా
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): క్యాంపస్ ప్లేస్మెంట్లలో నిట్ 2018–22 బ్యాచ్ విద్యార్థుల్లో 97.19 శాతం మంది ఉద్యోగాలు సాధించారు. సీఎస్ఈ విద్యార్థిని సూరపరాజు సాయి కీర్తన అమెజాన్‌లో రూ. 47.3 లక్షల వేతనం పొందగా.. ఈఈఈ విద్యార్థిని ఊర్వశి డాంగ్ అమెజాన్‌లో రూ. 47.3 లక్షల వేతనం అందుకోనున్నారు. సీఎస్ఈ విద్యార్థి కేతన్ బన్సాల్ స్కైలార్క్ ల్యాబ్స్‌లో రూ. 37.8 లక్షల వేతనం, అదే గ్రూపునకు చెందిన గాదె అశ్రితరెడ్డి అమెజాన్‌లో రూ.37 లక్షల వేతనంతో ఉద్యోగం పొందారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ప్రత్యేక కృషితో మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించారు. దేశంలోని 31 నిట్‌లలో క్యాంపస్ ప్లేస్మెంట్ విషయంలో ఏపీ నిట్ సత్తా చాటింది. ఈ బ్యాచ్‌లో 511 మంది 262 కంపెనీలు జరిపిన ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు పొందారు. (క్లిక్ చేయండి: ఒకేసారి డబుల్ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే..) -
లక్షల్లో డబ్బు పెట్టి అలుగులను కొంటున్న చైనా.. ఎందుకో తెలుసా?
బుట్టాయగూడెం: అడవికి రాజు సింహం... అది ఎంతటి జీవినైనా వేటాడి నమిలేస్తుందని నమ్ముతాం... కానీ, సింహం కూడా తినలేనంత గట్టిగా ఉండే అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి. అటువంటి వాటిలో అడవి అలుగు ఒకటి. అలుగు వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదును కలిగి ఉంటాయి. ఇవి సింహం కూడా నమలలేనంత గట్టిగా ఉంటాయి. అటువంటి అరుదైన అడవి అలుగులు ఏలూరు జిల్లా పరిధిలోని పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో గల పాపికొండల అభయారణ్యంలో సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలిన్ అని కూడా పిలుస్తారు. చైనీస్ పాంగోలిన్, ఏషియా పాంగోలిన్, సుండా పాంగోలిన్, పాతమాన్ పాంగోలిన్ అని నాలుగు రకాల అలుగులు ఉంటాయి. వీటి మూతి ముంగిసను పోలి ఉంటుంది. నాలుగు కాళ్లతో ఉండే ఈ అలుగు సుమారు 20 ఏళ్లు జీవిస్తుంది. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. ఎక్కువ శాతం దట్టమైన అడవి, అధికంగా వర్షాలు కురిసే ప్రాంతాలతోపాటు ఎడారి ప్రాంతాల్లో ఇవి జీవనం సాగిస్తుంటాయి. తొలిసారిగా 1821లో ఈ జంతువుల సంచారాన్ని గుర్తించినట్లు వైల్డ్ లైఫ్ అధికారులు తెలిపారు. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 20 వరకు సంచరిస్తున్నాయని వెల్లడించారు. అలికిడి అయితే బంతిలా ముడుచుకుపోతాయి.. అలుగులు పగలు కంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలికిడి అయితే అవి బెదిరి కదలకుండా గట్టిగా బంతిలా ముడుచుకుని ఉండిపోతాయి. వీటికి ఎదురు దాడి చేసే గుణం కూడా ఉంటుంది. ఇవి రెండేళ్లకు ఒకసారి పిల్లలకు జన్మనిస్తాయి. కోతి మాదిరిగానే తన పిల్లలను వీపుపై ఎక్కించుకుని తిప్పుతూ పోషిస్తాయి. అలుగు పెంకులను చైనాలో మందుల తయారీకి ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఒక్కో అలుగు రూ.20లక్షల వరకు ధర పలుకుతోందని చెప్పారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు తప్పవు వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎవరైనా వేటాడితే కఠిన శిక్షలు తప్పవు. పాపికొండల అభయారణ్య ప్రాంతంలో సంచరిస్తున్న అలుగుల వేట కోసం బయట ప్రాంతాల నుంచి స్మగ్లర్లు వస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టాం. ఇటీవల ఇద్దరు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేశాం. అలుగులను వేటాడితే ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. – జి.వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ డిప్యూటీ రేంజ్ అధికారి, పోలవరం, ఏలూరు జిల్లా -
రాబోయే రెండేళ్లలో మరో 23 లక్షల ఇళ్లు
తాడేపల్లిగూడెం రూరల్(ప.గో. జిల్లా): కొత్తగా పెళ్లయిన పేదలకు 90 రోజుల స్కీంలో ఇళ్ళ పట్టాలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన నివాసం వద్ద పెదతాడేపల్లి గ్రామానికి చెందిన 24మంది లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 31 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు, నిర్మాణాలు చేపట్టారన్నారు. రాబోయే రెండేళ్ళల్లో మరో 23 లక్షల ఇళ్ళు కట్టించాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నారన్నారు. పెదతాడేపల్లి గ్రామంలో రెండో దఫా 24 మందికి ఇళ్ళ పట్టాలు అందిస్తున్నట్టు తెలిపారు. పేదల సొంతింటి కల నిజం చేయాలనే సంకల్పంతో సీఎం జగన్మోహన్రెడ్డి ఉన్నారన్నారు. పెదతాడేపల్లిలోనే చాలామంది దుర్మార్గులు ఉన్నారని, దోచుకోవడానికి చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధికారంలోకి వస్తే ఉచిత పథకాలన్నీ రద్దు చేస్తామని ప్రచారం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా చేయాలనేది వారి ఆలోచనగా పేర్కొన్నారు. దుర్మార్గుల కళ్ళు తెరిపించేలా చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అప్పుడే సీఎం జగన్‌కు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టి.రవిచంద్ర, వీఆర్వో ఆర్వీ.పోతురాజు, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు గుండుబోగలు నాగు, పెద తాడేపల్లి సొసైటీ అధ్యక్షుడు పరిమి తులసీదాస్, వీరేశ్వరస్వామి దేవాలయం చైర్మన్ ఆలపాటి కాశీవిశ్వనాధం, నాయకులు పరిమి ప్రసాద్, పరిమి రంగ, తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలకు డుమ్మా కొట్టడం ఇకపై కుదరదు.. ఇంట్లో తెలిసిపోద్ది!
సాక్షి, భీమవరం: అమ్మా.. బడికి వెళుతున్నానని ఇంటిలో చెప్పి స్నేహితులతో కలిసి షికార్లు కొడుతూ పాఠశాలకు డుమ్మా కొట్టడం ఇకపై కుదరదు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయడంతో విద్యార్థులు ఉదయం 9.30 గంటలలోపు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్లేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించే అవకాశం ఏర్పడింది. ప్రత్యేక యాప్‌తో ప్రయోజనాలెన్నో.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడానికి, మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన స్టూడెంట్ అటెండెన్స్ యాప్ దోహదపడుతోంది. ప్రభుత్వ పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆయా క్లాసుల్లో ఉదయం 9.15 గంటల నుంచి 9.30 గంటల వరకు హాజరు వేస్తారు. పాఠశాల ఉపాధ్యాయుడు తన తరగతికి వెళ్లిన వెంటనే సెల్ఫోన్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లాగిన్ అయ్యి విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. సాయంత్రం పూట గతంలో మాదిరి హాజరు పట్టీలో మ్యాన్యువల్‌గా నమోదు చేస్తారు. ఉదయం యాప్‌లో విద్యార్థి హాజరు నమోదు కాకుంటే వెంటనే తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు మెసేజ్ వెళుతుంది. దీంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు బడికి రాకపోవడానికి గల కారణాలను పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నారు. కార్పొరేట్ సవ్వడి రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలుచేయడంతో పాటు ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రవేశపెట్టారు. మన బడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తరగతి గదులు, ఫరి్నచర్, తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలాలు వంటి వసతులు కలి్పస్తున్నారు. అన్ని పాఠశాలల్లో.. జిల్లాలోని 1,391 ప్రభుత్వ, 472 ప్రైవేట్ పాఠశాలల్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అమలుచేస్తున్నాం. దీంతో విద్యార్థులు తప్పని సరిగా క్లాసులకు హాజరవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం వెళుతుండటంతో వారి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఏర్పడింది. – ఆర్.వెంకటరమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం హాజరు శాతం పెరిగింది స్టూడెంట్ అటెండెన్స్ యాప్ కారణంగా హాజరుశాతం పెరిగింది. ప్రభుత్వం అమలుచేస్తున్న అమ్మఒడి పథకానికి హాజరు శాతం తప్పనిసరి కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలు హాజరు కాకుంటే వారికి నచ్చచెప్పి స్కూల్‌కు పంపిస్తున్నారు. దీని కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగింది. – వి.రాధాకృష్ణ, ఉపాధ్యాయుడు, పీఎస్ఎం స్కూల్, భీమవరం చాలా బాగుంది ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం అభినందనీయం. విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు వెళ్లేలా స్టూడెంట్ అటెండెన్స్ యాప్ చాలా బాగుంది. మా అమ్మాయి 7వ తరగతి చదువుతోంది. ఎప్పుడైనా బడికి వెళ్లకపోతే మెసేజ్ వస్తుంది. స్కూల్‌కు వెళ్లకపోవడానికి గల కారణాలను టీచర్స్‌కు వివరిస్తున్నాం. – ఎన్.వరలక్ష్మి, విద్యార్థిని తల్లి, దొంగపిండి -
శారీరక సంబంధంతోనే పెద్దలు వివాహం చేస్తారని నమ్మించి..
సాక్షి, నూజివీడు (పశ్చిమగోదావరి): శారీరక సంబంధంతోనే పెద్దలు వివాహం చేస్తారని నమ్మించి మోసం చేయడంతో మనస్తాపంతో ఎలుకలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని స్టేషన్‌తోటకు చెందిన రాణిమేకల రాణి(20) ఇంటర్ వరకు చదివింది. అదే ఏరియాకు చెందిన డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న కొండా ప్రదీప్‌కుమార్, రాణి ఆరునెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం రెండు నెలల క్రితం వారి ఇళ్లల్లో తెలిసి వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో వీరు సైతం మాట్లాడుకోవడం లేదు. ఈ నేపధ్యంలో ఆగస్టు మొదటి వారంలో ప్రదీప్ మళ్లీ రాణితో మాటలు కలిపి ఇద్దరం శారీరకంగా ఒక్కటైతే పెద్దలు కచ్ఛితంగా పెళ్లికి అంగీకరిస్తారని చెప్పి నమ్మించాడు. 10వ తేదీన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శారీరకంగా ఒక్కటయ్యారు. మరుసటి రోజు నుంచి ప్రదీప్ యువతితో మాట్లాడటం మానేశాడు. మహిళ భయంతో 27న తన తల్లి మంజులకు జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె పెద్దలతో చెప్పగా, వారు ప్రదీప్, అతని తల్లిని వివాహం చేసుకోవాలని అడగగా నిరాకరించారు. దీంతో 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాణి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని తల్లికి చెప్పగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అత్తతో అసభ్యంగా ప్రవర్తించిన అల్లుడికి ఐదేళ్ల శిక్ష) -
ఉపాధి జాతర: కోటికిపైగా పనిదినాల కల్పన
ఏలూరు (టూటౌన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కష్టకాలంలో పేదలకు భరోసాగా నిలుస్తోంది. ఏలూరు జిల్లాలో 2022– 23 ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో అధికారులు కోటికి పైగా పనిదినాలు కల్పించారు. వేతనాలు, మెటీరియల్ కాంపోనెంట్ కలిపి రూ. 227.85 కోట్ల మేరకు ఖర్చు చేశారు. జిల్లా ఉపాధి హామీ చరిత్రలో ఇదో రికార్డుగా నిలిచింది. జిల్లాల పునర్విభజన తర్వాత ఒక్క ఏలూరు జిల్లాలోనే కోటికి పైగా పనిదినాలు కల్పించడంతో పాటు అత్యధిక నిధులు ఖర్చు చేయడంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ సిబ్బంది, అధికారులు విశేష కృషి చేశారు. వీరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం స్వాతంత్య్ర దిన వేడుకల్లో అవార్డు ఇచ్చి సత్కరించింది. అడిగిన ప్రతిఒక్కరికీ పని కల్పించే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కష్టకాలంలో బాసటగా.. కరోనా ప్రభావంతో పూర్తిగా ఛిన్నాభిన్నమైన పేదల బతుకులు తేరుకునేందుకు ఉపాధి హామీ పథకం ఊతమిస్తోంది. ఏలూరు జిల్లాలో 2022–23లో 1.50 కోట్లు పనిదినాలు కల్పించాలనే లక్ష్యాన్ని నిర్దేశించగా మొదటి ఐదు నెలల్లోనే 1.03 కోట్ల పనిదినాలు కల్పి ంచారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడు నెలలు పనిచేసి లక్ష్యానికి రెట్టింపు పనులు చేయాలనే దృఢ సంకల్పంతో డ్వామా సిబ్బంది పనిచేస్తున్నారు. వివిధ దశల్లో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు కొత్తగా పనులను గుర్తించి పేదలకు ఉపాధి కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో స్థానికంగానే పనులు కల్పించడంపై ఉపాధి కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేదల జీవనానికి ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 706 కుటుంబాలకు వంద రోజుల పని జిల్లాలో 5.35 లక్షల జాబ్ కార్డులు ఉండగా వీటిలో మొత్తం 5.82 లక్షల మంది ఉపాధి కూలీలు నమోదయ్యారు. ఇప్పటివరకూ 3.26 లక్షల జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలకు చెందిన దాదాపు 4.50 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు 103.38 లక్షల పనిదినాలు కల్పించారు. జిల్లావ్యాప్తంగా 706 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు కల్పించారు. సగటున రోజుకు ఒక్కరికి రూ.206.16లు వేతనాలుగా చెల్లించారు. ఐదు నెలల్లో రూ.227.85 కోట్ల నిధులు ఖర్చు చేయగా దీనిలో రూ. 203.13 కోట్లు కూలీల వేతనాలుగా, రూ. 24.72 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్గా వెచ్చించారు. కూలీలకు వేతనాలను 15 రోజుల వ్యవధిలో 95.84 శాతం మేర చెల్లిస్తున్నారు. అడిగిన వారందరికీ పని ఉపాధి హామీ పథకంలో అడిగిన ప్రతిఒక్కరికీ పనులు కల్పించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో అధికంగా పనులు కల్పించే దిశగా కృషి చేస్తున్నాం. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పరి«ధిలో జరుగుతున్న అన్ని పనులను సత్వరం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ అరుణ్‌బాబు సహకారంతో నిరంతరం పనులు కల్పించేలా పనిచేస్తున్నాం. – డి.రాంబాబు, పీడీ, డ్వామా, ఏలూరు -
AP: రూపాయికే ఇల్లు ప్రభుత్వం ఘనత
భీమవరం (ప్రకాశంచౌక్)/పాలకొల్లు అర్బన్(ప.గో. జిల్లా): దేశంలోనే ఒక్క రూపాయికి 300 చదరపు అడుగుల ఇల్లు ను ఉచితంగా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పాలకొల్లు సమీపంలోని పెంకుళ్లపాడులో సుమారు 54 ఎకరాల్లో తొలి విడత నిర్మించిన 1,856 టిడ్కో గృహాలను, భీమవరం పట్టణం గునుపూడిలో 82 ఎకరాల్లో నిర్మించిన 1,920 టిడ్కో గృహాలను శుక్రవారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు. పాలకొల్లులో జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి కవురు శ్రీనివాస్ అధ్యక్షతన, భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులకు సారె రూపంలో టిడ్కో ఇళ్లు అందిస్తున్నామని, జగనన్ననగర్ పేరుతో వీటిని నిర్మిస్తూ సొంతింటి కల సాకారం చేస్తున్నామన్నారు. టిడ్కో ఇళ్లను దశల వారీగా లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేపట్టా మన్నారు. ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు టిడ్కో ఇళ్లపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. నాడు 300 చదరపు అడుగుల ఇల్లుకు రూ.2.50 లక్షల బ్యాంకు రుణం కట్టాలని టీడీపీ వారు చెప్పారా లేదా అనిప్రశ్నించారు. ఈ మేరకు పేదలు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు కట్టాలంటే సాధ్యమా అన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో పేదలపై భారం తగ్గించేలా రూపాయికే రిజిస్ట్రేషన్ చేయించి 300 చదరపు అడుగుల ఫ్లాట్‌ను పూర్తి ఉచితంగా అందిస్తున్నామన్నారు. జగనన్నకు మీ అందరి అశీస్సులు ఉండాలని ఆయన కోరారు. భీమవరంలో నాడు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 82 ఎకరాల భూమిని ఒకేచోట సేకరించడం వల్ల ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే నిమ్మ ల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహ న్, టిడ్కో చైర్మన్ జె.ప్రసన్నకుమార్, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, కార్పొరేషన్ చైర్మన్లు పెండ్ర వీరన్న, గుబ్బల తమ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, జెడ్పీటీసీలు కాండ్రేగుల నర్సింహరావు, నడపన గోవిందరాజులనాయుడు, గుంటూరు పెద్దిరాజు, ఎంపీపీలు రావూరి వెంకటరమణ, సబ్బితి సు మంగళి, పేరిచర్ల విజయనర్సింహరాజు, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లెం ఆనందప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం నా భర్త శ్రీనివాస్ వడ్రంగి పని, నేను కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. నాకు రూపాయి రిజిస్ట్రేషన్‌తో ఏ–59 బ్లాక్‌లో ఫ్లాట్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2.15 లక్షల బ్యాంక్ రుణం కట్టాలన్నారు. నెలకి రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు కడుతూ మొత్తంగా రూ.7 లక్షల వరకు చెల్లించాలన్నారు. సీఎం జగన్ నా కుటుంబానికి ఉచితంగా టిడ్కో ఇల్లు ఇచ్చారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం. – కీర జ్యోతి, లబ్ధిదారు, పాలకొల్లు సొంతింటి కల నెరవేరింది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నా సొంతింటి కల నెరవేర్చారు. సుమారు 30 ఏళ్లపాటు అద్దె ఇంట్లోనే ఇబ్బందులు పడుతున్న నాకు ఈ రోజు సొంతిల్లు రావడంతో కొండంత ధైర్యం వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కేవలం రూపాయికే నాకు ఇంటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందించడం చాలా సంతోషంగా ఉంది. పండగ పూట మా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మంత్రుల చేతులమీదుగా ఇళ్ల పట్టా అందుకోవడం ఆనందంగా ఉంది. – కె.దానమ్మ, లబ్ధిదారు, భీమవరం సొంతింటి కల సాకారం మండలి చైర్మన్ మోషేన్‌రాజు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ భీమవరంలో తొలి విడతగా 1,920 మందికి ఇళ్లను అందించడం, పట్టణంలోని పలు ప్రాంతాల్లో 180 ఎకరాలు సేకరించి వేల మందికి ఇంటి పట్టాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇవ్వడం అభినందనీయమన్నారు. సీఎం జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాల లబ్ధిని అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం పండగ రోజున టిడ్కో ఇళ్లను అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దివంగత వైఎస్సార్ సాయంతో పట్టణంలో 82 ఎకరాల భూమిని అప్పట్లో సేకరించామన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ భీమవరంలో మిగిలిన టిడ్కో ఇళ్లను రెండు, మూడు నెలల్లో అందజేస్తామన్నారు. ఇక్కడ 512 మందికి ఒక్క రూపాయికే ఇళ్లు ఇచ్చామన్నారు. -
సీఎం వైఎస్ జగన్ పాలన భేష్
భీమవరం(పశ్చిమ గోదావరి జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన బాగుందని ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మనేంద్రసింగ్ జిత్త్ బిట్ట (ఎంఎస్ బిట్ట) తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ తనకు అన్నయ్య లాంటివారని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉండేదన్నారు. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచివారని, మంచి పాలన అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ కన్నా ఆంధ్రా సురక్షిత ప్రాంతమని, ఆంధ్ర ప్రభుత్వానికి, పోలీసులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. తెలంగాణ బేకార్ అని, అక్కడ పొలిటికల్ టెర్రరిజం ఉందని, అటువంటి విధానం ఆంధ్రాలో లేదన్నారు. తెలంగాణ కంటే ఆంధ్రా పోలీసుల భద్రత చాలా బాగుందన్నారు. హైదరాబాద్ సురక్షితమైన ప్రాంతం కాదని.. కానీ ఆర్థికంగా బలమైందన్నారు. కాగా, భీమవరానికి చెందిన ప్రముఖ హస్తసాముద్రిక నిపుణుడు మాండ్రు నారాయణ రమణారావు ఆహ్వానం మేరకు తాను ఇక్కడికి వచ్చినట్టు ఎంఎస్ బిట్ట చెప్పారు. ముందుగా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో శక్తీశ్వరస్వామిని, అనంతరం భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని వేంకటేశ్వరస్వామిని ఎంఎస్ బిట్ట దర్శించుకున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
పశ్చిమ గోదావరి: ఆగడాలలంక శివారు వద్ద లారీ కింద పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఏలూరు రూరల్ మండలం పైడిచింతపాడుకు చెందిన ముంగర హర్షవర్దన్ (30) బెంగళూరులోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచే విధులను నిర్వహిస్తున్నాడు. శనివారం బ్యాంకు పని నిమిత్తం తన స్కూటిపై హర్షవర్దన్ పైడిచింతపాడు నుంచి ఏలూరు బయలుదేరాడు. ఆగడాలలంక శివారు వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న ఇటుకల లోడు లారీని అధిగమించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్కూటి ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదవశాత్తు లారీ చక్రాల కింద పడిపోవడంతో తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న భీమడోలు ఏఎస్సై చలపతిరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవ పంచానామా అనంతరం బంధువులకు అప్పగించారు. ఏఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పైడిచింతపాడులో విషాదఛాయలు హర్షవర్దన్ మృతితో పైడిచింతపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని ముంగర బోజరాజు, ఝాన్సీలక్షి్మల పెద్ద కుమారుడు హర్షవర్దన్‌కు మూడేళ్ల క్రితం దుర్గాశ్రీతో వివాహం కాగా, ప్రస్తుతం ఆమె ఎనిమిదో నెల గర్భిణి. భార్య డెలివరీ తర్వాత బెంగళూరుకు కుటుంబ సమేతంగా వెళదామని భావించాడని, ఇంతలోనే లారీ రూపంలో మృత్యువు కబళించిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. దేవుడు తనకు అన్యాయం చేశాడంటూ భార్య దుర్గాశ్రీ గుండెలవిసేలా రోదించడంతో ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. గ్రామంలో అందరితో కలిసిమెలిసి మెలిగే హర్షవర్దన్ మృతి చెందాడన్న వార్తను గ్రామస్తులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. -
AP: ఆ ఊరే ఒక సైన్యం.. వీరుల పురిటిగడ్డ అది..
తాడేపల్లిగూడెం: అక్కడి తల్లులు తమ పిల్లలకు ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని రంగరించి పోస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆ ఊరు ఊరంతా ఒక సైన్యమే అంటే అతిశయోక్తి కాదు. టెక్నాలజీతో అందివస్తున్న జాబ్‌లెన్నో ఉన్నా.. తమ మొగ్గు మాత్రం దేశమాత సేవకే అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం భారత సైన్యంలో ఈ ఊరి నుంచి 1,650 మంది పనిచేస్తున్నారు. వీరిలో కల్నల్స్, లెఫ్టినెంట్ కల్నల్స్ ఉండటం విశేషం. భారత సైన్యంలో చేరాలనుకునే తమ ఊరి యువతకు ఎక్స్‌సర్వీస్‌మెన్ అసోసియేషన్ మార్గనిర్దేశం చేస్తోంది. ఇప్పుడు అగ్నిపథ్ ద్వారా భారత సైన్యంలోకి చేరికలు ఉండటంతో యువత సులువుగా ఎంపికయ్యేలా ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభిస్తామని ఎక్స్‌సర్వీస్‌మెన్ అసోసియేషన్ బాధ్యులు ప్రత్తి రామకృష్ణ, బొల్లం వీరయ్య చెబుతున్నారు. దేశంలోనే రెండో స్థానం.. మాధవరం గ్రామస్తులు స్వాతంత్య్రానికి ముందు నుంచే సైనికులుగా, అధికారులుగా సేవలు అందించారు. దేశంలోనే అత్యధికంగా సైన్యంలోకి యువకులను పంపిస్తున్న ప్రాంతంగా మాధవరం రెండో స్థానం పొందడం విశేషం. గ్రామస్తులు మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, దేశ స్వాతంత్య్ర పోరాటం, పాకిస్థాన్, చైనాలతో యుద్ధాలు, బంగ్లాదేశ్, శ్రీలంక తరఫున చేసిన యుద్ధాల్లో ప్రతిభ చూపారు. సిపాయి, హవల్దార్, సుబేదార్, సుబేదార్ మేజర్, నాయక్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్ వంటి హోదాల్లో సేవలను అందించారు. భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో 1,850 మంది మాధవరం సైనికులు పాల్గొని సత్తా చాటడం విశేషం. వార్ మెమోరియల్ ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఉండగా రెండోది మాధవరంలో మాత్రమే ఉంది. ఇది కూడా చదవండి: సచివాలయ సేవలు బాగున్నాయి.. కేంద్ర మంత్రి కితాబు -
ప్రభుత్వ సాయం అందింది.. బాబుకు చెప్పిన వరద బాధితులు
పాలకొల్లు సెంట్రల్ / యలమంచిలి: ‘మాకు ప్రభుత్వం పంపిణీ చేసిన రూ.2 వేలు నగదు అందింది. వరదల్లో చిక్కుకున్న మమ్మల్ని ప్రభుత్వం చాలా బాగా చూసుకుంది. ఈ రోజు వరకు అంటే శుక్రవారం వరకు పునరావాస కేంద్రాల్లో భోజనాలు పెడుతూనే ఉన్నారు..’ అంటూ వరద బాధితులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో చెప్పారు. బాధితుల పరామర్శ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, గంగడపాలెం, లక్ష్మీపాలెం గ్రామాలను సందర్శించారు. ముందుగా దొడ్డిపట్లలో నాలుగు బాధిత కుటుంబాలను సందర్శించగా వారిలో ఇద్దరు ప్రభుత్వం ఇప్పటివరకు బాగానే చూసుకుందన్నారు. ఏటిగట్టు ఎవరు పటిష్టం చేశారని అడుగగా, అధికారుల సహకారంతో తామంతా కృషి చేసి గట్టును పటిష్టం చేసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత అబ్బిరాజుపాలెం, గంగడపాలెం గ్రామాల్లో చంద్రబాబు ప్రసంగించారు. గంగడపాలెంలో టీడీపీ అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపించారు. చాలా ఆనందంగా ఉందని చెప్పగా, గంగడపాలెం గ్రామస్తుల్లో కొందరు చంద్రబాబు మా కష్టాలు తెలుసుకోవడానికి వచ్చారా లేక పార్టీ నాయకులను పొగడడానికి వచ్చారా అంటూ స్థానిక టీడీపీ నాయకులను నిలదీశారు. అక్కడి నుంచి లక్ష్మీపాలెం గ్రామానికి వెళ్లిన చంద్రబాబును అక్కడి మత్స్యకార ప్రాంతానికి రావాలని పలువురు గొడవ చేయడంతో వెళ్లారు. అక్కడ మహిళలను చంద్రబాబు వివరాలు అడగ్గా ప్రభుత్వం తమకు రూ.2 వేలు ఇచ్చిందని, ఇప్పటివరకు తమను బాగానే చూసుకుందని చెప్పారు. వరద బాధితులు ఉన్నది ఉన్నట్టు చెపుతుండగా, ఏంచేయాలో పాలుపోని స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. అదే నేను పోరాటం చేసిన తరువాత ఇవన్నీ వచ్చాయని చెప్పడం గమనార్హం. ఈ పర్యటనలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడినచోట కాస్త ఎక్కువసేపు ఉన్న చంద్రబాబు... ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినచోట వారి మాటలు వినకుండా వెళ్ళిపోయారు. పైపెచ్చు వరద బాధితులను పరామర్శించడానికి బాబు రాగా... స్థానిక నాయకులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించడం గమనార్హం. బాధితులను ఆదుకోకుండాగాల్లో తిరుగుతారా... పరామర్శ యాత్రలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న బాధితులను ఆదుకోకుండా గాల్లో తిరిగి వెళ్లిపోతారా? నాడు తండ్రి చనిపోతే సుమారు ఐదేళ్ల పాటు ఓట్ల కోసం ఓదార్పు యాత్ర పేరుతో తిరిగిన జగన్మోహన్రెడ్డికి... నేడు గడప గడపకూ తిరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు వరద బాధితుల ప్రాంతాల్లో తిరగాలని గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వరదల్లో నష్టపోయిన బాధితులకు రూ.10 వేలు తక్షణ సాయం అందించాలని, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలు, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.4 లక్షలు, అరటి తోటకు ఎకరానికి రూ.40 వేలు, తమలపాకుల తోటకు రూ.50 వేలు, వరికి హెక్టారుకు రూ.20 వేలు, ఆక్వా రైతులకు కరెంటు బిల్లు యూనిట్‌కు రూ.1.50 చేస్తూ హెక్టారుకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆవు, గేదెలకు రూ.40 వేలు, పశువుల షెడ్డుకు లక్ష నుంచి రూ.1.80 లక్షల వరకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. తమ డిమాండ్లను వెంటనే అమలు చేయకపోతే పోరాటం చేస్తామన్నారు. -
జగనన్న కాలనీలు.. ఆనందాల లోగిళ్లు
పెంటపాడు(పశ్చిమగోదావరి జిల్లా): పల్లెలు నూతన గృహాలతో సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి.. జగనన్న కాలనీలు ఊళ్లుగా రూపాంతరం చెందుతున్నాయి.. రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నారు. అర్హులందరికీ ఇప్పటికే స్థలాలు అందించగా.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ సాయం, అధికారుల ప్రోత్సాహంతో నెల రోజులుగా నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో జగనన్న కాలనీలు ఆనందాల లోగిళ్లను తలపిస్తున్నాయి. కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో లబ్ధిదారులు నిర్మాణాలకు మరింత ఆసక్తి చూపుతున్నారు. నిర్మాణాల ప్రగతి భళా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పెంటపాడు మండలంలోని 22 గ్రామాల్లో 27 లేఅవుట్లను ఏర్పాటుచేశారు. మొత్తం 2,193 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకూ 1,340 మంది ఇళ్లు నిర్మించుకున్నారు. అలాగే 760 ఇళ్లు పునాది దశ దాటాయి. మిగిలిన లబ్ధిదారులు కూడా నిర్మాణాలు చేపట్టేలా అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో పెంటపాడు మండలం 55 శాతం ప్రగతితో జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్థిక సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందిస్తోంది. నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. సిమెంట్, స్టీల్‌ను రాయితీపై ఇస్తోంది. పెంటపాడు మండలంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆర్థిక సాయం, మెటీరియల్ ఖర్చు కింద రూ.15,00,79,366 అందిం చినట్టు గృహనిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. సదస్సులతో స్ఫూర్తి గ్రామాల్లో అధికారులు, సర్పంచ్‌లతో అవగాహన సదస్సులు నిర్వహించాం. దీని ద్వారా చాలా మంది పేదలు గృహనిర్మాణాలకు ముందుకు వస్తున్నారు. వారికి గూడు సమకూరుతోంది. – ఓ.శ్రీనివాసరావు, హౌసింగ్ ఏఈ, పెంటపాడు జిల్లాలో రెండో స్థానంలో.. పెంటపాడు మండలంలో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాం. అవగాహన సదస్సులతో స్ఫూర్తి పొందిన లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు వస్తున్నారు. దీనిద్వారా 55 శాతం ప్రగతి సాధించి జిల్లాలో రెండో స్థానంలో నిలిచాం. – ఎ.ప్రసాద్, హౌసింగ్ డీఈ ఆన్లైన్ కాగానే బిల్లులు జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి దశల వారీగా ఆన్లైన్ కాగానే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తోంది. స్టాక్ పాయింట్ల ద్వారా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా మెటీరియల్ అందిస్తున్నాం. – జయరాజు, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్, పెంటపాడు పెంటపాడు మండలం బి.కొండేపాడుకు చెందిన యల్లా బాలాజీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు కాగా సొంతిల్లు కలగా ఉంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో వారికి గృహం మంజూరు కాగా.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. సీఎం జగన్ దయవల్లే తమకు గూడు సమకూరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. పెంటపాడు మండలం బి.కొండేపాడుకు చెందిన గూడూరి పుణ్యవతి చాలా కాలంగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం స్థలం మంజూరు చేయడంతో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకు అధికారులు ఆమెను ప్రోత్సహించారు. దశల వారీగా బిల్లులు మంజూరు చేయడంతో ఆమె ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోగలిగారు. సీఎం జగన్ సంకల్పంతోనే తన సొంతింటి కల సాకారమైందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. -
జగనన్న ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక బృందాలు
సాక్షి, భీమవరం: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో గృహాలను మంజూరు చేస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులు ముమ్మరం జరుగుతున్నాయి. వీటిని మరింత వేగవంతం చేసేందుకు పట్టణాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్లు నిర్మించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 71,797 మందికి స్థలాల పట్టాలు మంజూరు చేయగా ఇప్పటికే 63,933 ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. వీటి నిర్మాణాల కోసం ప్రభు త్వం రూ.257.21 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే సుమారు 21 వేల మంది లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టగా వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణం చేపట్టిన లబ్ధిదా రులకు ప్రభుత్వం రూ.1.80 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు మరో రూ.30 వేలు బ్యాంకు రుణంగా అందించే ఏర్పాట్లు చేసింది. పట్టణాల్లో పక్కా ప్రణాళికతో.. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి అధికారులు పటిష్ట ప్రణాళిక రూపొందించారు. కాంట్రాక్టర్ ద్వారా పనులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. లబ్ధిదారులు విడివిడిగా గృహ నిర్మాణం చేపడితే మెటీరియల్ రవాణా, కొనుగోలు వంటి వాటికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడంతో పాటు వ్యయప్రయాసలు తప్పవు. ఈ నేపథ్యంలో 30 మంది లబ్ధిదారులను యూనిట్‌గా విభజించి సచివాలయ ఉద్యోగులు ఆరుగురిని బృందంగా ఏర్పాటుచేసి కాంట్రాక్టర్‌కు నిర్మాణాన్ని అప్పగిస్తారు. ఇలా ముందుగా పట్టణాల్లో ని ర్మాణాలు చేపట్టి అనంతరం గ్రామాల్లో నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు చేసే పనులను సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పర్యవేక్షించేందుకు వీలున్నందున నాణ్యతా ప్రమా ణాలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ విధా నం ద్వారా సత్ఫలితాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. భీమవరంలో 42 బృందాలు భీమవరంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకంలో త్వరితగతిన గృహాల నిర్మాణానికి 42 ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేస్తున్నాం. ఒక్కో బృందం 30 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తాయి. టీమ్ సభ్యులంతా ఆయా ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పటికే కొందరు కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చారు. గృహ నిర్మాణ ఆవశ్యకత, లబ్ధిదారుల ఇబ్బందులను కాంట్రాక్టర్లకు వివరించి కాంట్రాక్ట్ పద్ధతిన పనులు చేయించేందుకు సన్నద్ధం చేస్తున్నాం. – ఎస్.శివరామకృష్ణ, మునిసిపల్ కమిషనర్, భీమవరం -
గోదావరి డెల్టాకు భరోసా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి డెల్టా ఆధునికీ కరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు నిర్వహించేలా సమగ్రంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 11 నియోజకవర్గాల్లో రూ.163.06 కోట్లతో 95 పనుల కోసం సాంకేతికపరమైన అనుమతులు పొందారు. వచ్చే ఏడాది రబీ సీజన్ ప్రారంభమయ్యే నాటికి పనులను పూర్తిచేయాలని నిర్ణయించారు. వీటిలో రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, కాలువల మరమ్మతులు, స్లూయిజ్ గేట్ల మరమ్మతులు వంటి కీలక పనులు ఉన్నాయి. 7.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 7.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గోదావరి జలాలతో పాటు మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతోంది. ఏటా రబీ సీజన్ ప్రారంభంలో వీటికి వార్షిక మరమ్మతులు చేస్తుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి కాలువలకు సాగునీరు విడుదల చేశారు. ఈ క్రమంలో జిల్లాలో సీజన్ ప్రారంభానికి ముందే రూ.22.54 కోట్లతో 180 పనులను ప్రతిపాదించగా 121 పనులకు టెండర్ల ఖరారై వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా వచ్చే రబీ నాటికి శాశ్వత ప్రాతిపదికన గోదావరి డెల్టాలో కీలక పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి సంబంధించి సాంకేతికపరమైన, పరిపాలనా అనుమతులు వచ్చాయి. ప్రభుత్వ ఆమోదంతో కొద్ది నెలల్లో టెండర్ల దశకు పనులు చేరుకోనున్నాయి. వీటిలో ప్రధానంగా మేజర్ డ్రెయిన్లలో మరమ్మత్తులు, కొన్నిచోట్ల రిటైనింగ్‌వాల్ నిర్మాణాలు, స్లూయిజ్ గేట్ల మరమ్మత్తులు, ఎర్త్ వర్క్స్‌తో పాటు పూడికతీత పనులు ఉన్నాయి. పశ్చిమగోదావరిలో.. ఆచంట నియోజకవర్గంలో రూ.3.68 కోట్లతో 5 పనులు నరసాపురం నియోజకవర్గంలో రూ.28.22 కోట్లతో 2 పనులు పాలకొల్లు నియోజకవర్గంలో రూ.19.01 కోట్లతో 5 పనులు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రూ.6.41 కోట్లతో 21 పనులు ఉండి నియోజకవర్గంలో రూ.38.25 కోట్లతో 18 పనులు తణుకు నియోజకవర్గంలో రూ.7.49 కోట్లతో 12 పనులు భీమవరం నియోకవర్గంలో రూ.30.14 కోట్లతో 13 పనులు ఏలూరు జిల్లాలో.. దెందులూరు నియోజకవర్గంలో రూ.14.40 కోట్లతో ఒక పని ఉంగుటూరు నియోజకవర్గంలో రూ.8.35 కోట్లతో 3 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో.. గోపాలపురం నియోజకవర్గంలో రూ.4.71 కోట్లతో 11 పనులు నిడదవోలు నియోజకవర్గంలో రూ.2.37 కోట్లతో 4 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో మొండికోడు మేజర్ డ్రెయిన్‌కు 2.50 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణం, భీమవరంలో పశ్చిమ డెల్టా డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ పనులు, తణుకులో ఎర్రకోడు మీడియం డ్రెయిన్, ఉండిలో కోరుకొల్లు మైనర్ డ్రెయిన్, ఇతర మరమ్మతులు ఇలా 95 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో పాలకొల్లులో రూ.8.10 కోట్ల వ్యయంతో నక్కల మేజర్ డ్రెయిన్‌పై డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించారు. -
పది పాస్‌కు ప్రత్యేక తరగతులు
పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా వారిని పరీక్షలకు మరింత సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. దీనిలో భాగంగా ఈనెల 13 నుంచి ఫెయిలైన విద్యార్థులకు ఆయా పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. సాక్షి, భీమవరం: కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు విద్యాబోధన సక్రమంగా సాగకపోవడంతో ఇటీవల ప్రకటించిన 10వ తరగతి పరీక్షల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. గత రెండేళ్లు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేశారు. ప్రస్తుత విద్యాసంçవత్సరం తరగతులు నిర్వహించిన రోజులు తక్కువ కావడంతో ప్రభుత్వం పరీక్షా విధానంలో మార్పులు చేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఈసారి 57.55 శాతం మాత్రమే పాస్ అయ్యారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సుమారు 47వేల మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో దాదాపు 27 వేల మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో 31,254 మంది విద్యార్థులకు 13,274 మంది పాస్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో 9,303 మంది విద్యార్థులు తప్పగా వారిలో ఒక సబ్జెక్ట్ తప్పినవారు 3,226 మంది, రెండు సబ్జెక్టŠట్స్‌లో తప్పినవారు 2,272 మంది, మూడింటిలో తప్పినవారు 1,856 మంది, నాలుగింటిలో తప్పినవారు 1,079 మంది ఉన్నారు. 602 మంది అయిదు సబ్జెక్ట్స్ లో, 268 మంది అన్నింటిలో ఫెయిల్ అయ్యారు. ఈ నేపథ్యంలో వారిని సన్నద్ధం చేసి జూలైలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సా«ధించేలా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఏ పాఠశాలలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు.. ఏఏ సబ్జెక్సŠట్లో తప్పారు అన్న విషయాలను సేకరించి దానికి అనుగుణంగా ఆయా పాఠశాలల్లో ఈ నెల 13 నుంచి ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణకు రూపకల్పన చేశారు. ఏ స్కూల్లో ఎన్ని తరగతులు నిర్వహించాలనే అంశాన్ని ఆయా పాఠశాలల ప్రాధానోపాధ్యాయులకే అప్పగించారు. విద్యార్థులకు సబ్జెక్సŠట్ వారిగా తరగతులు నిర్వహించి ఉత్తీరణ సాధించేలా సన్నద్ధం చేయడానికి రూపకల్పన చేశారు. కంపార్ట్మెంట్ పాస్‌గా కాకుండా రెగ్యులర్ పాస్‌గా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఉత్తీర్ణత శాతంన్ని పెంచడానికి విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి ప్రత్యేక తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణతో తరగతుల నిర్వహణ పదో తరగతి అడ్వాన్స్డ్ పరీక్షలను ప్రత్యేకంగా సన్నద్ధం చేయడానికి కార్యాచరణ రూపొందించాం. ఎక్కువ మంది విద్యార్థులు ఒకటి, రెండు సబ్జ్క్ట్స్లో ఫెయిల్ అయినందున వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా పరీక్షలకు సన్నద్ధం చేస్తాం. తరగతులు ఎలా నిర్వహించాలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదే నిర్ణయం. ఫెయిలయిన విద్యార్థులకు సబ్జ్క్ట్ల బట్టి తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసేవరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. – ఆర్వీ రమణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం -
మామిడి రైతుకు నిరాశే
నూజివీడు/ చింతలపూడి : ఏటా వేలాది మంది కూలీలకు ఉపాధి, కోట్లాది రూపాయల వ్యాపారం చేసే మామిడి పరిశ్రమ ఈ ఏడాది రైతులు, వ్యాపారులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మామిడి ఎగుమతుల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఏలూరు జిల్లా ప్రాంతంలో ప్రస్తుతం వ్యాపారం మందగించింది. సీజన్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం మామిడి సాగుకు పెట్టింది పేరు. జిల్లాలో దాదాపు 52 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉండగా ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే 45 వేల ఎకరాలు ఉండటం విశేషం. మిగిలిన ఏడు వేల ఎకరాలు చింతలపూడి చుట్టుపక్కల ప్రాంతాల్లో సాగులో ఉన్నాయి. దెబ్బతీసిన నల్ల తామర గత రెండేళ్లు కరోనాతో దెబ్బతిన్న రైతులు, ఈ ఏడాది కొత్తగా ఆశించిన నల్లతామర వల్ల దారుణంగా దెబ్బతిన్నారు. సంక్రాంతి తరువాత తోటల్లో పూత ఉద్ధృతంగా వచ్చినప్పటికీ నల్లతామర పురుగు ఆశించడంతో పూత అంతా మాడిపోయి కేవలం కాడలే మిగిలాయి. దీని ప్రభావం దిగుబడిపై çపడింది. సాధారణంతో పోల్చితే సగం కూడా దిగుబడి రాలేదు. అరకొరగా వచ్చిన దిగుబడికి సరైన ధర లభించకపోవడంతో మామిడిపై రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. భారీగా తగ్గిన ఎగుమతులు ప్రతి ఏటా ఈ ప్రాంతం నుంచి కోల్‌కతా, నాగపూర్, గుజరాత్, హైదరాబాద్, పూనే, అహ్మదాబాద్, ఢిల్లీ, కాన్పూర్, ఒడిశా తదితర రాష్ట్రాలకు వేలకొద్ది లారీల్లో నాణ్యమైన మామిడి ఎగుమతి అయ్యేది. ఈ ఏడాది సీజన్ ముగింపు దశకు వచ్చినా ఎగుమతులు చేయలేకపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. ఏటా ఒక్క నూజివీడు ప్రాంతం నుంచే రోజుకు దాదాపు 350 నుంచి 400 లారీల మామిడి ఎగుమతులు జరి గేవి. ఈ ఏడాది ఎగుమతులు రోజుకు 150 లారీలకు పడిపోయాయి. చింతలపూడి ప్రాంతం నుంచి రోజుకు 25 లారీల ఎగుమతులు జరిగేవి. ఈ ఏడాది 10 నుంచి 12 లారీలకు పడిపోయాయి. దీనిని బట్టి దిగుబడులు ఏ స్థాయిలో తగ్గాయో అర్థం చేసుకోవచ్చు. సిండికేట్‌తో పడిపోయిన ధరలు ఈ ఏడాది మామిడి దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర బాగుంటుందని రైతులు భావించారు. రైతుల ఆశలను ఢిల్లీ వ్యాపారులు ప్రతిఏటా మాదిరిగానే అడియాస చేశారు. వారంతా సిండికేట్ అయ్యి ధరను తమకు కావాల్సిన విధంగా పెంచడం, తగ్గించడం చేస్తూ రైతులతో ఆడుకున్నారు. దీంతో దిగుబడి తక్కువగా ఉన్నా ధర మాత్రం రోజురోజుకూ దారుణంగా పతనమైంది. మామిడి సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరి చివరి వారం, మార్చి తొలి వారంలో బంగినపల్లి టన్ను రూ.1.20 లక్షలు, కలెక్టర్ (తోతాపురి) రకం రూ.90 వేలకు కొనుగోలు చేసిన ఢిల్లీ వ్యాపారులు దిగుబడి పూర్తిస్థాయిలో వచ్చే సమయాల్లో అతి దారుణంగా ధరను పతనం చేశారు. ఆ తరువాత సీజన్ గడుస్తున్న కొద్దీ తగ్గుకుంటూ వచ్చి చివరకు బంగినపల్లి ధర టన్ను రూ.20 వేల నుంచి రూ.40 వేల మధ్యలో నిలబడింది. కలెక్టర్ రకం ధర రూ.11 వేల నుంచి రూ.16 వేల మధ్య నడుస్తోంది. ఢిల్లీ వ్యాపారులు సిండికేట్ అయ్యారు ఈ ఏడాది దిగుబడి బాగా తగ్గినప్పటికీ ఆశించిన స్థాయిలో ధర లభించలేదు. ఢిల్లీ వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర దారుణంగా తగ్గించి కొనుగోలు చేశారు. ప్రారంభంలో ధర బాగున్నప్పటికీ సీజన్ గడుస్తున్న కొద్దీ ధరను తగ్గించేశారు. దీంతో రైతులు నష్టాలపాలయ్యారు. – మూల్పురి నాగవల్లేశ్వరరావు, మామిడి రైతు, నూజివీడు నష్టాలు తప్పువు ఈ ఏడాది మామిడి రైతుకు నష్టాలు తప్పవు. మంగు తెగులు కారణంగా ఎగుమతులు మందగించాయి. ధర పెరిగితేనే గానీ నష్టాల నుంచి బయటపడడం కష్టం. ప్రారంభంలో టన్ను రూ.లక్ష వరకు ఉన్న ధర ప్రస్తుతం రూ.20 వేలు మాత్రమే పలుకుతోంది. ప్రస్తుతం ఉన్న ధర ఇలాగే కొనసాగితే రైతులు, వ్యాపారులకు ఈ ఏడాది తీవ్ర నిరాశే మిగులుతుంది. – చిక్కాల సుధాకర్, మామిడి కమీషన్ వ్యాపారి, చింతలపూడి -
9న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాక
సాక్షి, భీమవరం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వచ్చేనెల 9న భీమవరం రానున్నారని, ఆజాదీకా అమృత ఉత్సవాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు జూలై 4న ప్రధాని మోదీ ఇక్కడకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆదివారం భీమవరంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ అధ్యక్షతన జ రిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వపరంగా కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆజాదీకా అమృత ఉత్సవాల్లో భాగంగా కేంద్రం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఇందుకోసం 250 మంది ప్రముఖులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైందన్నారు. స్వాత్రంత్య సమరయోధుల ప్రాంతాల సందర్శనలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కృషితో ప్రధాని మోదీ భీమవరం రానున్నారన్నారు. ప్రధాని పర్యటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయని, 3 లక్షల మంది రావచ్చని అంచనా వేస్తున్నారన్నారు. బీజేపీ కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు అల్లూరి సా యిదుర్గరాజు, నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, మణికంఠ వెంకటేష్ పాల్గొన్నారు. -
జూలై 4న ప్రధాని మోదీ భీమవరం రాక!
ఆకివీడు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పినట్టు ఆ పార్టీ ఆకివీడు మండల కమిటీ అధ్యక్షుడు నేరెళ్ల పెదబాబు శనివారం తెలిపారు. ఆకివీడులోని ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వీర్రాజు పార్టీ మండల కార్యాలయంలో కొద్దిసేపు ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులో జరిగే జయంతి కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్ 7న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వస్తారని వీర్రాజు చెప్పినట్లు తెలిపారు. -
విద్యాసంక్షేమం సఫలం.. దొరబిడ్డల్లా పేద పిల్లలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంతో పాటు పేదలందరికీ ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. విద్యా కానుక, ఇంగ్లిష్ మీడియం చదువులు, నాడు–నేడు, గోరుముద్ద, అమ్మఒడి తదితర పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తున్నారు. 2021–22 విద్యాసంవత్సరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలుచేశారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2021–22లో సంక్షేమ కార్యక్రమాలను సంపూర్ణంగా అందించి ఈ ఏడాది అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా ముగించారు. ప్రభుత్వ విద్యారంగంపై సీఎం జగన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, చిత్తశుద్ధిని చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డలను కాన్వెంట్లలో మాన్పించి ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. దీంతో మూడేళ్లుగా జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లా అధికారులు పథకాలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున అమ్మఒడి పథకాన్ని విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత అమలుచేయనున్నారు. ఈ ఏడాది విద్యార్థుల హాజరు శాతానికి సంబంధించిన నివేదికలను ఉన్న తాధికారులకు పంపించారు. దొరబిడ్డల్లా పేద పిల్లలు ప్రభుత్వం విద్యాకానుక కింద యూనిఫాం, నోట్ పుస్తకాలు, బూట్లు, టై, బెల్టులు, డిక్షనరీలు, స్కూల్ బ్యాగులు అందిస్తోంది. 2021–22లో మొత్తంగా నోట్ పుస్తకాలు 1,840,218, బెల్టులు, 2,53,530, స్కూల్ బ్యాగులు 3,39,273, బూట్లు 3,36,424, యూనిఫాం 3,42,494, డిక్షనరీలను 3,42,494 విద్యార్థులను అందజేశారు. కార్పొరేట్ హంగులతో.. మనబడి నాడు–నేడు పథకంలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కార్పొరేట్‌కు దీటుగా అధునాతన వసతులతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నారు. దీంతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. పక్కాగా ప్రహరీలతో పాఠశాలలకు రక్షణ ఏర్పాట్లు చేశారు. అందమైన బొమ్మలతో పాఠశాల ఆవరణ, తరగతి గదులను తీర్చిదిద్దారు. విద్యా సంస్కరణలతో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సీఎం జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏటా విద్యార్థుల నమో దు శాతం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో అక్షర యజ్ఞం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అక్షర యజ్ఞం కొనసాగుతోంది. రెండు విడతలు అమ్మఒడి పథకం అమలుచేయగా మూడో విడత ల్యాప్‌టాప్‌లు, నగదు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. త్వరలో రెండో విడత నాడు–నేడు పనులు చేపట్టనున్నారు. సర్కారీ బడుల్లో ఉన్నత కుటుంబాల విద్యార్థులు కూడా చేరే రోజు వస్తుంది. – జీజేఏ స్టీవెన్, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణాళికాబద్ధంగా ముందుకు.. విద్యారంగ పథకాలను నిర్ణీత సమయంలో అమలు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప థకాల అమలుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. అర్హులందరికీ పథకాలు అందేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాడు–నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసిన అంశం చరిత్రలో నిలిచిపోతుంది. – పి.శ్యామ్‌సుందర్, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ నాడు–నేడు పనులు తొలివిడతలో 1,176 పాఠశాలలను ఎంపిక చేసి రూ.242.70 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటివరకూ 1,076 పాఠశాలల్లో రూ.226.48 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. రెండో విడతలో 892 పాఠశాలలను ఎంపిక చేసి రూ.292.18 కోట్ల నిధులు కేటాయించారు. -
ఉదయం భగభగలు.. రాత్రి కుండపోత
బుట్టాయగూడెం, ఏలూరు (మెట్రో): పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మంగళవారం ఉదయం భానుడి భగభగలతో జనం అల్లాడిపోగా.. రాత్రి కుండపోత వానతో సేదదీరారు. అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ప్రజలు ఊరటచెందినా.. మామిడి తదితర పంటలకు భారీ వర్షం నష్టాన్ని మిగిల్చింది. గత నాలుగు రోజులుగా రెండు జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం అల్లాడిపోయారు. ఉదయం 11 గంటలకే గ్రామాలు, పట్టణాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. సాయంత్రం 7 గంటల వరకూ కూడా వేడి గాలులు వీయడంతో ఉక్కబోతతో జనం ఇబ్బందులు పడ్డారు. అయితే మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈదురు గాలులు, వర్షంతో ప్రజలు ఎండ తీవ్రత నుంచి కొంత ఉపశమనం పొందారు. కారుమబ్బులు కమ్మి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు రెండు గంటల పాటు వాన హోరెత్తింది. వాతావరణం చల్లబడి ప్రజలు సేదతీరారు. జిల్లా కేంద్రమైన ఏలూరులో కొద్దిపాటి వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం వరకు వర్షం పడుతూనే ఉంది. -
మారనున్న ‘పశ్చిమ’ ముఖ చిత్రం
సాక్షి, భీమవరం: భీమవరం కేంద్రంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లాలో గణపవరం మండలాన్ని విలీనం చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో ముఖచిత్రం మారనుంది. ఇప్పటివరకూ ఏలూరు జిల్లాలో ఉన్న గణపవరాన్ని ‘పశ్చిమ’లో కలుపుతామని ఇటీవల గణపవరంలో జరిగిన రైతు భరోసా సభలో ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గణపవరానికి భీమవరం అత్యంత సమీపంలో ఉండటంతో ‘పశ్చి మ’లో కలపాలని ఈ ప్రాంత ప్రజలు వినతులు సమర్పించారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం మండలం ఆక్వా సాగులో పేర్గాంచింది. ప్రస్తుతమున్న ఏలూరు జిల్లా కేంద్రం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ‘పశ్చిమ’లో కలపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. 2,278 చ.కి.మీ విస్తీర్ణంతో.. భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా 19 మండలాలు, ఆరు మున్సిపాలిటీలతో ఏర్పడింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో 2,178 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17.80 లక్షల జనాభా కలిగి ఉంది. గణపవరాన్ని విలీనం చేస్తే మండలాల సంఖ్య 20కి పెరుగుతాయి. మరో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 65 వేల మంది జనాభా పెరగనుంది. -
నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి.. పలుమార్లు లైంగిక దాడి
సాక్షి, పాలకోడేరు (తూర్పుగోదావరి): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ టీవీ సత్యనారాయణ పాలకోడేరులో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని శృంగవృక్షం గ్రామానికి చెందిన బాలిక పదోతరగతి చదివి ఇంటి దగ్గరే ఉంటోంది. వీరవాసరం మండలం అండలూరు గ్రామానికి చెందిన నల్లి దిలీప్ డెకరేషన్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాలికతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకుని.. నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే చచ్చిపోతానని నమ్మించి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంటికి తీసుకువెళ్లి అక్కడ కూడా లైంగిక దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై సీహెచ్ రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: (పెళ్లి చేసుకుంటానని.. యువతులతో సంబంధాలు: నటి అనుశ్రీ) -
దశాబ్దాల సమస్యకు ఏపీ కేబినెట్ పరిష్కారం..
నరసాపురం తీర గ్రామాల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యకు పరిష్కారం దొరికింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టడంతో.. బ్రిటీష్ హయంలో లీజుకు తీసుకుని తరతరాలుగా అనుభవిస్తున్న సాగుభూములకు వారికే అప్పగించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. నరసాపురం: నరసాపురం మండలం దర్భరేవు కంపెనీ భూములను ప్రస్తుతం అనుభవిస్తున్నవారికే రూ.100 నామమాత్రపు కనీస ధరకు అప్పగించాలని, రిజిస్ట్రేషన్ చార్జీలు ప్రభుత్వమే భరించాలని కేబినెట్ నిర్ణయించింది. 1754 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్న 1485 మంది రైతులకు పంపిణీ చేయనున్నారు. త్వరలో నరసాపురంలో ముఖ్యమంత్రి పర్యటనలో ఈ పంపిణీ జరుగుతుంది. 1921లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దర్భరేవు చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న 1814 ఎకరాల భూమిని సాగు చేసుకునేందుకు పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ది అగ్రికల్చర్ సొసైటీ కంపెనీతో ఓ సొసైటీని ఏర్పాటు చేసి దానికి 1,814 ఎకరాల భూమిని 100 ఏళ్ల లీజుకు అప్పగిస్తూ జీవో విడుదల చేసింది. మళ్లీ ఓ ఐదేళ్ల తరువాత అదే బ్రిటీష్ ప్రభుత్వం సర్వే చేపట్టి కాలువలు, డ్రెయిన్ల తవ్వడం కోసం 1,814 ఎకరాల్లో 60 ఎకరాలు అవసరమని తీసుకుంది. మిగిలిన 1,754 ఎకరాలు వ్యవసాయానికి పనికి రాకుండా అడవిలా ఉండేవి. స్వాతంత్య్రం వచ్చాక మన ప్రభుత్వాలు ఈ భూముల జోలికి వెళ్లలేదు. రైతులు కష్టపడి వాటిని సాగుభూములుగా మార్చుకున్నారు. కోట్లు దండుకున్న టీడీపీ ప్రభుత్వం గత టీపీపీ ప్రభుత్వం ఈ భూములపై కన్నేసింది. 2019లో అమలు సాధ్యంకాని జీవో హడావుడిగా తీసుకొచ్చింది. ఎకరాకు రూ.1000 నామమాత్రం ధర తీసుకుని సాగుదారులకు కంపెనీ భూముల పట్టాలిస్తున్నామని మభ్యపెట్టారు. తీరా ఎకరాకు రూ.1000 కాకుండా స్థానిక టీడీపీ నాయకులు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారు. అయితే పట్టాలు ఇవ్వలేదు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రైతులు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు తాము మోసపోయిన వైనాన్ని మొరపెట్టుకున్నారు. ముఖ్యమంత్రికి, అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో నరసాపురం సబ్‌కలెక్టర్‌తో విచారణ చేయించారు. అవకతవకలు జరిగినట్టు అప్పటి సబ్ కలెక్టర్ నివేదిక ఇవ్వడంతో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ అంశంపై సీఐడీ విచారణ సాగుతుంది. చదవండి: (Palle Vs JC: పల్లె అక్రమాలపై జేసీ లొల్లి..) న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ము తిరిగి ఇచ్చేలా ప్రభుత్వ ముదునూరి కృషి చేస్తున్నారు. ఇప్పుడు సాగుదారులగా ఉన్న కొందరి రైతుల చేతుల్లో 10, 12 ఎకరాలు కూడా ఉన్నాయి. నిబంధనల మేరకు రెండున్నర ఎకరాలకు మించి ప్రభుత్వ భూములు పంచడానికి వీలులేదు. భూముల్లో అసలు సాగుదారుల ఎవరు అనే అంశంపై సర్వే చేయించి, భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించారు. నిజమైన సాగుదారులకే భూముల పంపిణీ దర్బరేవు కంపెనీ భూముల సమస్య చెప్పగానే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు నిజమైన సాగుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ భూములు పంచుతాం. గత ప్రభుత్వంలో ఈ భూముల విషయంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు సాగుతుంది. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ -
నా కారునే ఆపుతావా అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూ టౌన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్‌పై సంతోష్ అనే వ్యక్తి దాడి చేశాడు. ట్రాఫిక్‌లో అతి వేగంగా వెళ్తున్న కారును కానిస్టేబుల్ కుమార్ అడ్డుకున్నాడు. సంతోష్ అనే వ్యక్తి కారుదిగి నా కారునే ఆపుతావా అంటూ కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. దీంతో టూటౌన్ పోలీసులు సంతోష్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: (కాలేజీ బస్సు డ్రైవర్‌తో ప్రేమ పెళ్లి.. తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి..) -
AP: ప్రగతి బాటలుగా ప్రధాన రహదారులు
ప్రధాన రహదారులు ప్రగతి బాటలుగా మారుతున్నాయి. జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉండే రోడ్లు కళకళలాడుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు, నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రభుత్వం మూడు డివిజన్ల పరిధిలో రూ.207.55 కోట్లను కేటాయించగా పనులు ముమ్మరంగా జరిగేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఏలూరు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా ఏకకాలంలో వందల కోట్లతో రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనులు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి రూ.2 వేల కోట్లను వెచ్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లాలో 71 పనులకు రూ.207.55 కోట్లు కేటాయించారు. ఏలూరు, కొవ్వూరు, భీమవరం ఆర్అండ్బీ డివిజన్ల వారీగా పనులు జరుగుతున్నాయి. మూడు డివిజన్ల పరిధిలో 3,219 కిలోమీటర్ల రోడ్లు విస్తరించి ఉన్నాయి. దీనిలో 44 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లు, 792 కిలోమీటర్ల మేర డబుల్ లైన్, 2,383 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ రహదారులు ఉన్నాయి. అనుసంధాన రహదారులపై ప్రత్యేక దృష్టి జిల్లా రోడ్లపై ముందుగా దృష్టి కేంద్రీకరించిన అధికారులు జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉన్న రోడ్ల మరమ్మతులు పూర్తిచేశారు. అనంతరం పూర్తిస్థాయిలో నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు. ప్రధాన పట్టణాలకు అనుసంధానంగా ఉండే జంగారెడ్డిగూడెం–ఏలూరు, చింతలపూడి–ఏలూరు, ఏలూరు–భీమవరం, భీమవరం–తాడేపల్లిగూడెం, నరసాపురం–భీమవరం, నిడదవోలు–కొవ్వూరు ఇలా ప్రతి పట్టణానికి అనుసంధానంగా ఉండే రహదారుల నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ౖMðకలూరు, భీమవరంలో రోడ్ల పనులు పూర్తికాగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఎన్డీబీ నిధులతో.. నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు నిధుల ద్వారా ఫేజ్–1లో 11 రోడ్ల పరిధిలో 74 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేస్తున్నారు. ఫేజ్–2లో 13 రోడ్ల పరిధిలో 108 కిలోమీటర్ల మేర అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. సీఆర్ఐఎఫ్ పథకం ద్వారా 29 కిలోమీటర్ల మేర 3 రోడ్ల పనులను చేయనున్నారు. రాష్ట్ర రహదారులపై గోతులు పూడ్చి, మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హై లెవిల్ బ్రిడ్జిలకు నిధులు ఉమ్మడి జిల్లాలో రూ.29.50 కోట్లతో 3 హైలెవిల్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వంతెనల మరమ్మతులకు సైతం సన్నాహాలు చేస్తున్నారు. డివిజన్ల వారీగా.. ఏలూరు డివిజన్ పరిధిలో రూ.9 కోట్లతో 5 పనులను పూర్తిచేయగా.. రూ.76 కోట్లతో 21 పనులు జరుగుతున్నాయి. కొవ్వూరు డివిజన్ రూ.5.41 కోట్లతో 3 పనులను పూర్తిచేయగా.. రూ.74.43 కోట్లతో 21 పనులు పలు దశల్లో ఉన్నాయి. రూ.11 లక్షలతో ఐదు రో డ్లు పూర్తిచేయగా.. రూ.30 లక్షలతో 15 పనులు పలు దశల్లో ఉన్నాయి.