
తూర్పు గోదావరి జిల్లా : రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి ఎగిసి పడుతున్నాయి. మంటలు వ్యాపించడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే మంటలు వ్యాపించడంతో అగ్నికి ఆహుతైన పండ్లు నిల్వ ఉంచిన షెడ్డు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది.ఇతర షాపులకు వ్యాపించకుండా మంటల్ని పండ్ల వ్యాపారులు, స్థానికులు అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment