
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ బూడిద సుజన్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దివ్యాంగుడైన సుజన్ కుమార్‌పై సైతం కేసు నమోదు చేయడం పట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సుజన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, సోషల్ మీడియా కార్యకర్తలపై కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను మేము ప్రజల్లోకి తీసుకువెళుతున్నామనే ఒకే ఒక్క కారణంతో మా గొంతు నొక్కాలని చూస్తుందన్నారు. ప్రభుత్వం పాలన వైఫల్యం చెందింది కాబట్టే.. సోషల్ మీడియా గొంతు నొక్కాలని చూస్తుంది. నేను దివ్యాంగుడనని కూడా చూడకుండా నాపై కేసు పెట్టారు.’’ అని సుజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘వైఎస్ జగన్ నాయకత్వాన్ని కచ్చితంగా బలపరుస్తాం. ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం. వైఎస్ జగన్ ఎన్నో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఆయన కోసం మేము ఎంతవరకైనా తెగిస్తాం. మా గొంతు నొక్కే బదులు ప్రజలకు మంచి చేస్తే వారే మిమ్మల్ని ఆదరిస్తారు. ఎన్ని కేసులు పెట్టిన వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’’ అని సుజన్‌కుమార్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment