పశ్చిమ గోదావరి, సాక్షి: టీడీపీలో చేరిన మరుసటి రోజే.. పశ్చిమ గోదావరి పార్టీ రాజకీయాల్లో రఘురామ కష్ణంరాజు చిచ్చు రాజేశారు. మరోవైపు.. తన వీరవిధేయుడు రఘురామ కృష్ణంరాజును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరుణించాడు. అయితే తొలి నుంచి ఆశించినట్లు నరసాపురం ఎంపీ టికెట్ కాకుండా.. అసెంబ్లీ స్థానాన్ని కట్టబెట్టారు. శనివారం పాలకొల్లులో జరిగిన సమావేశంలో రఘురామకు ఉండి అసెంబ్లీ సీటు ఇస్తున్నట్లు చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.
తొలి నుంచి కూటమి తరఫునే పోటీ చేయాలని ఉవ్విళ్లూరిన రఘురామకు నరసాపురం సీటు బీజేపీకి పోవడంతో నిరాశే ఎదురైంది. అయినప్పటికీ ఆ స్థానం కోసం చంద్రబాబుతో భారీ లెవల్‌లో లాబీయింగ్ నడిపించారు. బీజేపీతో సీటు మార్పిడి కోసం తెగ ప్రయత్నించారు. అయితే బీజేపీ మాత్రం ససేమీరా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈలోపే రఘురామ కనీసం అసెంబ్లీ సీటు కోసమైనా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
గత వారం రోజులుగా చంద్రబాబుతో రఘురామ ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. చివరకు మంగళవారం రాత్రి ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి టీడీపీ సేఫ్ సీటుగా భావిస్తుంటుంది. అందుకే.. తన కోసం పని చేసిన రఘురామకు ఈ సీటును ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అలా.. పార్టీలో చేరిన కొద్ది గంటలకే ఉండి అభ్యర్థిగా రఘురామ పేరును ప్రకటించారు. అయితే..
పాలకొల్లులో చంద్రబాబును అడ్డుకుని నిలదీస్తున్న కార్యకర్తలు
రఘురామకు సీటు ప్రకటన చేయగానే.. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు బయటకు రాకుండా హాలు ముందు బైఠాయించారు. ‘‘ఉండి గడ్డ రామరాజు అడ్డ’’ ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’ అంటూ నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment