Raghu Rama Krishnam Raju
-
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్‌పాల్ అరెస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన కేసులో విజయ్‌పాల్‌ను ఈ రోజు కూడా పోలీసులు విచారించారు. రాజకీయ కక్షతోనే విజయ్‌పాల్‌ను అరెస్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.ఈనెల 13న విజయ్‌పాల్ మొదటి సారి విచారణకు హాజరయ్యారు. రెండోసారి ఈ రోజు(మంగళవారం) విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. -
అధికారం ఇచ్చింది పరిపాలించడానికా లేక పగ తీర్చుకోవడానికా..!
-
రఘురామ కృష్ణంరాజు పై అంబటి సెటైర్లు
-
జగన్ పై రఘురామ పెట్టిన కేసు.. ఆధారాలతో పొన్నవోలు కౌంటర్
-
వైఎస్ జగన్ పై కేసు.. వరుదు కళ్యాణి రియాక్షన్
-
వైఎస్ జగన్ పై రఘురామ పెట్టిన కేసు.. అంబటి క్లారిటీ
-
నామినేషన్ వేసిన టీడీపీ రెబల్ షాక్ లో రఘురామ కృష్ణం రాజు
-
రఘురామ కేసు దర్యాప్తుపై స్టే ఎత్తేయండి.. సుప్రీంకోర్టును కోరిన సీబీఐ
-
రఘురామ కేసు దర్యాప్తుపై స్టే ఎత్తేయండి.. సుప్రీంకోర్టును కోరిన సీబీఐ
సాక్షి, ఢిల్లీ: బ్యాంకులను మోసం చేసిన కేసులో రఘురామ కృష్ణంరాజు దర్యాప్తుపై స్టేను ఎత్తేయాలని సుప్రీంకోర్టుకు సీబీఐ వెల్లడించింది. బ్యాంకులకు రుణం ఎగవేత కేసుపై దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ కోరింది. ఇందులో భాగంగా క్రిమినల్, సివిల్ కేసులపై దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కాగా, రఘురామ కృష్ణంరాజు బ్యాంకులకు మోసం చేసిన కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సంద్భంగా సీబీఐ తన వాదనలు వినిపించింది. ఈ క్రమంలో రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నాన్ మిసిలేనియస్ రోజుల్లో విచారణ జరిపాలని కోరారు. దీంతో, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది జస్టిస్ బీఆర్. గవాయి, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం. అయితే, రఘురామ కృష్ణంరాజు థర్మల్ పవర్ కంపెనీ స్థాపిస్తామని బ్యాంకుల నుంచి రూ.974 కోట్లు రుణం తీసుకున్నారు. ఇన్డ్-భారత్ కంపెనీ పేరుతో రఘురామ పెత్తనం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. కంపెనీ కోసం నిధులు ఖర్చు చేయకుండా ఆ డబ్బును ఇతర బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను తనఖా పెట్టి రఘురామ మళ్లీ రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని దారి మళ్లించడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 120బీ, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపైనే దర్యాప్తు కొనసాగుతోంది. -
కొంప ముంచిన రఘురామ...ఉండిలో టీడీపీ క్లోజ్..
-
‘ఉండి’ టీడీపీ టికెట్: ఎమ్మెల్యే రామరాజు కంటతడి
సాక్షి,పశ్చిమగోదావరి: తన నియోజకవర్గం నుంచి వేరొకరికి టీడీపీ టికెట్ ఇస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి పెట్టారు. మంగళవారం(ఏప్రిల్9) కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం అనంతరం రామరాజు మీడియాతో మాట్లాడారు. ‘నా నియోజకవర్గం నుంచి వేరొకరికి టికెట్ కేటాయించేందుకు సిద్ధమయ్యారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటా. వారే నా కుటుంబ సభ్యులు..వారు చెప్పినట్టు చెస్తా. రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తా’ అని రామరాజు చెప్పారు. ‘ఉండి’ సీటుపై టీడీపీ శ్రేణుల్లో అయోమయం ఉండి నుంచి కాకుండా ఎమ్మెల్యే రామరాజుకు మరో చోట టీడీపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో రామరాజు వర్గం ఆందోళనకు ఆందోళనకు దిగింది. రామరాజు సీటు మార్చొద్దంటూ కార్యకర్తలు నిరసన తెలిపారు. కాగా, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున రఘురామకృష్ణం రాజు పోటీచేస్తారని ఇటీవల పాలకొల్లు ప్రచారంలో చంద్రబాబు ప్రకటించడంతో రామరాజు వర్గంలో టెన్షన్ మొదలైంది. ఇదీ చదవండి.. మూడు ముక్కలైన ఉండి టీడీపీ -
సారీ రఘురామ.. అడ్జస్ట్ చేస్కో!
పశ్చిమ గోదావరి, సాక్షి: టీడీపీలో చేరిన మరుసటి రోజే.. పశ్చిమ గోదావరి పార్టీ రాజకీయాల్లో రఘురామ కష్ణంరాజు చిచ్చు రాజేశారు. మరోవైపు.. తన వీరవిధేయుడు రఘురామ కృష్ణంరాజును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరుణించాడు. అయితే తొలి నుంచి ఆశించినట్లు నరసాపురం ఎంపీ టికెట్ కాకుండా.. అసెంబ్లీ స్థానాన్ని కట్టబెట్టారు. శనివారం పాలకొల్లులో జరిగిన సమావేశంలో రఘురామకు ఉండి అసెంబ్లీ సీటు ఇస్తున్నట్లు చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తొలి నుంచి కూటమి తరఫునే పోటీ చేయాలని ఉవ్విళ్లూరిన రఘురామకు నరసాపురం సీటు బీజేపీకి పోవడంతో నిరాశే ఎదురైంది. అయినప్పటికీ ఆ స్థానం కోసం చంద్రబాబుతో భారీ లెవల్లో లాబీయింగ్ నడిపించారు. బీజేపీతో సీటు మార్పిడి కోసం తెగ ప్రయత్నించారు. అయితే బీజేపీ మాత్రం ససేమీరా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈలోపే రఘురామ కనీసం అసెంబ్లీ సీటు కోసమైనా ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత వారం రోజులుగా చంద్రబాబుతో రఘురామ ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. చివరకు మంగళవారం రాత్రి ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి టీడీపీ సేఫ్ సీటుగా భావిస్తుంటుంది. అందుకే.. తన కోసం పని చేసిన రఘురామకు ఈ సీటును ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అలా.. పార్టీలో చేరిన కొద్ది గంటలకే ఉండి అభ్యర్థిగా రఘురామ పేరును ప్రకటించారు. అయితే.. పాలకొల్లులో చంద్రబాబును అడ్డుకుని నిలదీస్తున్న కార్యకర్తలు రఘురామకు సీటు ప్రకటన చేయగానే.. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు బయటకు రాకుండా హాలు ముందు బైఠాయించారు. ‘‘ఉండి గడ్డ రామరాజు అడ్డ’’ ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’ అంటూ నినాదాలు చేశారు. -
రఘురామకు వెన్నుపోటా? టికెట్టా?
పద్నాలుగేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాయడి పేరు చెబితే.. ఏపీ ప్రజలకు ఏ ఒక్క మంచి గుర్తుకు రాదు. ఎందుకంటే చేసింది ఏం లేదు కాబట్టి. రాజకీయ భిక్ష పెట్టి.. పిల్లనిచ్చిన మామ నందమూరి తారక రామారావుకే తన వెన్నుపోటు రాజకీయం రుచి చూపించారాయన. అప్పటి నుంచి తన ఫార్టీ ఇయర్స్ కెరీర్లో ఎందరినో బురిడీలను చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతూ వచ్చారు. అలాంటి వ్యక్తిని రఘురామ కృష్ణంరాజు నమ్ముకోవడం గురించే ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. రఘురామ కృష్ణంరాజు.. ఐదేళ్ల కిందట నరసాపురం ఎంపీగా గెలిచింది వైఎస్సార్సీపీ పార్టీ తరఫున. వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రేజ్.. వైఎస్సార్సీపీ ‘ఫ్యాన్’ హవాలో రఘురామ గెలిచారన్నది వాస్తవం. అయినా.. రఘరామ ద్రోహానికి దిగారు. టీడీపీ కోసం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కోసమే పని చేస్తూ వచ్చారు. కేవలం బాబు చెబితేనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కోర్టుల్లో కేసులు వేశారాయన. బాబు చెబితేనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తూ వచ్చారు. అలాంటి రఘురామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధం అయ్యారా?.. రఘురామ కృష్ణంరాజు ఆటిట్యూడ్ మొదటి నుంచి తేడానే. తనకు ఢిల్లీ లెవల్లో పరిచయాలు ఉన్నాయని.. నరసాపురం సీటు తనకేనంటూ విర్రవీగుతూ వచ్చారు. అయితే కూటమి తరఫునే తన పోటీ అని ప్రకటించుకున్న రఘురామ.. ఏ పార్టీ అనేదానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. చంద్రబాబు మీద నమ్మకం వల్లే అంత బహిరంగంగా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ, సీటు పొత్తులో భాగంగా బీజేపీకి పోయింది. ఆ పార్టీ తరఫున శ్రీనివాస వర్మ పేరును అధికారికంగా ప్రకటించింది. దీంతో.. రఘురామ ఢీలా పడ్డారు. ఆ ఫ్రస్ట్రేషన్లోనూ చంద్రబాబును తిట్టే ప్రయత్నం చేయలేదు. ఏపీ బీజేపీకి తనకు మంచి సంబంధాలు లేవని, పైగా తనకు టికెట్ రాకుండా చేసింది సీఎం జగనేనంటూ విచిత్రమైన విమర్శ ఒకటి చేశారు. నరసాపురం టికెట్ బీజేపీకి పోవడంలో చంద్రబాబు వదినమ్మ పురంధేశ్వరి కీలక పాత్ర పోషించారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనీసం పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తికి టికెట్ ఎలా? ఇస్తామంటూ ఏపీ బీజేపీ నేతలు సైతం రఘురామకు చురకలు ఇస్తూ వచ్చారు. ఈలోపు చంద్రబాబుతో రఘురామ చీకటి ఒప్పందాలకు తెర లేపారు. ఒకవైపు.. ఎలాగైనా నరసాపురం టికెట్ దక్కించుకునేందుకు నానా రకాల ప్రయత్నాలు చేశారు. మరోవైపు.. పొత్తులు కుదిరిన తర్వాత కూడా తనను మించి మరొక అభ్యర్థి వారికి(కూటమికి) దొరకరని గప్పాలు కొడుతూ వచ్చారు. ఈ క్రమంలో తాజాగా డీల్ సెట్ అయినట్లు సంకేతాలిచ్చారు. ‘‘ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా ఆ మరుక్షణమే నా ఎంపీ సీటు పోతుంది. మాట్లాడించుకున్నన్ని రోజులు మాట్లాడించుని.. ఇప్పుడు సభ్యత్వం లేదంటున్నారు. కూటమి నెగ్గాలనుకున్నా. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా. తనకు బాబు న్యాయం చేస్తారని విశ్వాసం ఉంది’’ అని తాజాగా మరో స్టేట్మెంట్ ఇచ్చారు రఘురామ. ఎంపీ నో ఛాన్స్.. మిగిలిందే అదే! రఘురామను నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా నిలపాలని చంద్రబాబు నిజంగా గట్టిగానే ప్రయత్నించారా?. నిజంగానే చంద్రబాబు వల్ల అది కాలేదా?. ధన బలం కూడా రఘురామకు సీటు ఇప్పించలేకపోయిందా? ఇలాంటి ప్రశ్నలెన్నో. అయినప్పటికీ వెస్ట్ గోదావరిలో టీడీపీ అత్యంత సేఫ్ సీట్లలో ఒకటైన ఉండి నుంచి రఘురామ పోటీ చేస్తారనే ప్రచారం ఒకటి ఊపందుకుంది. ప్రస్తుతం ప్రకటించిన సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును చంద్రబాబు తప్పించి, వీర విధేయుడు రఘురామకు టికెట్ కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ఆ ప్రచారా సారాంశం. అయితే ఈ ప్రచారం తెర మీదకు రాగానే మరో టీడీపీ నేత కలవపూడి శివ అప్రమత్తం అయ్యారు. టికెట్ తనదేనంటూ భీస్మించుకుని ఊర్చున్నారు. ఒకవేళ వర్గ పోరు తలనొప్పి చంద్రబాబు వద్దనుకుంటే ఉండి స్థానంలోనూ రఘురామకు చుక్కెదురయ్యే అవకాశం లేకపోలేదు. రఘురామ కృష్ణంరాజుకు ఏదో ఒక పార్టీలో సభ్యత్వం ఉండడమే ఇప్పుడు ప్రధానం. అందుకే టీడీపీలో చేరేందుకు రంగం సిద్దపడ్డారు. తద్వారా ఏదో స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. మొత్తంగా అడ్డదారిలో ఎన్నికల బరిలో దిగడానికి రఘురామ మార్గం సుగమం చేసుకుంటున్నారనేది ఆయన ప్రయత్నాలతో స్పష్టమవుతోంది. కానీ, రాజకీయ మనుగడ కోసం నమ్మినోళ్లనే మోసం చేసిన చంద్రబాబు, కుటుంబ సభ్యుల్నే రోడ్డు మీదకు తెచ్చిన చంద్రబాబు.. అవసరం తీరిపోయింది గనుక రఘురామ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా? లేదంటే తనకు అలవాటైన వెన్నుపోటు రాజకీయం ప్రదర్శిస్తారా? అనేది ఒకట్రెండు రోజుల్లోనే తేలిపోనుంది. -
రఘురామ కొత్త రాగం
పశ్చిమ గోదావరి, సాక్షి: కూటమి తరఫున నరసాపురం సీటు తనదేనని ప్రకటించుకున్న రఘురామ కృష్ణంరాజుకి ఊహించని షాక్ తగిలింది. పొత్తులో భాగంగా బీజేపీ సీటును ఎగరేసుకుపోవడంతో రఘురామ గొంతులో వెలక్కాయ పడ్డట్లయ్యింది. అయినప్పటికీ తన ప్రయత్నాలను మాత్రం మాననలేదు. తాను నమ్ముకున్న చంద్రబాబునే స్వయంగా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఈసారి ఎన్నికల్లో రఘురామ పోటీ చేసి తీరతారని, ఈ మేరకు కూటమిలో సంప్రదింపులు జరుగుతున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతిలు సైతం కథనాలు ఇస్తూ వస్తున్నాయి. బీజేపీ నుంచి నరసాపురం సీటు తీసుకునేందుకు రఘురామ విపరీతంగా పైరవీలు నడిపిస్తున్నట్లు సమాచారం. అదీ కుదరని పక్షంలో ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారనేది ఆ కథనాల సారాంశం. ఈలోపు తాజాగా రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమంటూ ప్రకటించుకున్నారు రఘురామ. ‘‘నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ఢిల్లీ ఎంపీగానో, అమరావతి ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడమైతే పక్కా. ఎంపీగా బరిలో నిలవాలన్నది నా ఆశ. అసెంబ్లీలో ఉండాలన్నది ప్రజల కోరిక.చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకర్‌గా చూడాలనుకుంటున్నారు. నేను కోరుకుంటున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రమో త్వరలోనే తెలుస్తుంది’’ స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు ఇవాళ నరసాపురంలో పర్యటించనున్న చంద్రబాబు.. రఘురామ పోటీ కోసం జరిగే కూటమి చర్చల్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. తాను చెబితేనే వైఎస్సార్సీపీని, సీఎం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసిన రఘురామ కోసం ఎలాగైనా సీటు ఇప్పించాలని చంద్రబాబు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
సొంత రాజకీయం చెల్లదని బాబుకి అర్థమౌతోందా..!?
నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుకు కూటమి పార్టీలు మొండి చేయి చూపాయి. రఘురామకృష్ణరాజు రెచ్చిపోయి రచ్చబండ పేరుతో రచ్చచేసి అప్రతిష్టపాలైన నేపథ్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు హాండిచ్చిన తీరు రాజకీయాలలో ఉన్నవారికి గుణపాఠం అని చెప్పాలి. నోటి దురద అనండి, నోటి దూల అనండి, తీట అనండి... ఏదైనా కాని తొందరపాటుతో, అతిశయంలో ఏది పడితే అది మాట్లాడి కొందరు నేతల మన్ననలు పొందుదామనుకునే వారికి ఇలాగే పరాభవం ఎదురవుతుంటుంది. తన గురించి తాను గొప్పగా ఊహించుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎంత తప్పో రాజుకు ఇప్పటికైనా అర్దం అవుతుందా? అన్నది డౌటే. ఎందుకంటే ఆయనకు బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోతే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్అని రాజు ఆరోపించే దైన్య స్తితికి తెచ్చారు. ఎందుకంటే ఆయన నాలుగేళ్లుగా ఎవరి ట్రాప్ లో ఉన్నారు? చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణల ట్రాప్ లోనే కదా! నిజంగా రాజుకు ఇవ్వాలని అనుకుంటే చంద్రబాబు నాయుడే నర్సాపురం సీటును టీడీపీ కోటాలోకి తీసుకుని ఇచ్చి ఉండవచ్చు కదా! లేదా బీజేపీ గట్టిగా కోరుకున్న విశాఖపట్నాన్ని వారికి ఇచ్చి, తాను నర్సాపురం తీసుకుని రాజుకు కేటాయించవచ్చు కదా! విశాఖలో తన బందువైన భరత్‌కు సీటు ఇవ్వడంలో చూపిన ఆసక్తి రఘురామకీష్ణంరాజుపై లేదనే కదా దీని అర్ధం. రాజు గట్టిగా కోరి ఇంకా ప్రకటించని విజయనగరం సీటు అయినా పొందవచ్చు. ఆ రకంగా ఈయన ప్రయత్నిస్తారో, లేక చంద్రబాబుకు పూర్తిగా సరెండర్ అయ్యారు కనుక నోరు మూసుకుని కూర్చుంటారో తెలియదు. చిత్రమైన సంగతి ఏమిటంటే బీజేపీలో ఆరు సీట్లలో ఒక్కరే ఒరిజినల్ బీజేపీ నేత. నర్సాపురం నుంచి బీజేపీ టిక్కెట్ పొందిన శ్రీనివాస వర్మ తప్ప మిగిలిన వారంతా ఇతర పార్టీల నుంచి వలస వెళ్లినవారే. సీ.ఎమ్.రమేష్ టీడీపీ ఎంపీగా ఉండి బీజేపీలోకి వెళ్లారు. ఆయన బీజేపీలో ఉన్నట్లు చెబుతున్నా కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల ఎన్నికల విరాళం ఇచ్చారు. అయినా బీజేపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. కొత్తపల్లి గీత గతంలో వైసీపీ ఎంపీ, తదుపరి టీడీపీ ఎంపీ, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆమెకు టిక్కెట్ ఇచ్చారు పురందేశ్వరి కాంగ్రెస్ లో పదేళ్లు ఎంపీ, కేంద్ర మంత్రిగా ఉండి బీజేపీలోకి వచ్చారు. వర ప్రసాద్ తనకు టిక్కెట్ ఇవ్వని వైసీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరితే మరుసటి రోజే ఈ పార్టీ టిక్కెట్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. వీరందరికి టిక్కెట్లు ఇచ్చి రఘురామకృష్ణంరాజుకు ఎందుకు ఇవ్వలేదో ఆయనే ఆలోచించుకోవాలి. ఈ వ్యవహారంలో రాజు వల్ల తమకు కూడా నష్టం జరుగుతోందని భావించారో ఏమో కాని, ఆంధ్రజ్యోతి రాదాకృష్ణ ద్వారా రాయబారం చేసి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామని చెబుతున్నట్లు ఉన్నారు. అది బుగ్గ గిల్లి జోలపాడడానికే కావచ్చు. ఉండి నియోజకవర్గానికి ఇప్పటికే అభ్యర్ధిని టీడీపీ ప్రకటించింది. మరి ఆయనను మార్చి రఘురామ కు ఇస్తారా అన్నది డౌటే. 2019 ఎన్నికలలో వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇస్తే దానికి ద్రోహం చేసి రాజు టీడీపీ పంచన చేరారు. చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణల ప్రాపకం కోసం వారు ఏది మాట్లాడమంటే అది మాట్టాడి పరువు పోగొట్టుకున్నారు. చివరికి తాను ఏమి మాట్లాడుతున్నానో తనకే తెలియని పరిస్థితికి వెళ్లారు. ఎన్నికల సమయంలో కాపు సామాజికవర్గాన్ని ఉద్దేశించి ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయినా జగన్‌కు ఉన్న ఆదరణ రీత్యా ఈయన బయటపడగలిగారు. డిల్లీలో జగన్‌తో సంబందం లేకుండా సొంత రాజకీయం చేయడం, బీజేపీ వారితో పైరవీ చేసుకుని కమిటీ పదవులు పొందడం వంటివి చేశారు. ఈ క్రమంలో వైసీపీ నాయకత్వంతో కొంత తేడా వచ్చింది. అయినా కొంత సంయమనం పాటించి ఉంటే అన్ని సర్దుకుపోయేవేమో! అలాకాకుండా టీడీపీకి ఏజెంట్ అయిన ఆంద్రజ్యోతి రాదాకృష్ణ ట్రాప్‌లోకి వెళ్లి, జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆరంభించారు. ఆ సమయంలో ఒక ఏడాది పాటు మౌనంగా ఉండండని, ఆ తర్వాత అన్ని కుదుట పడతాయని కొందరు హితవు చెప్పినా ఆయన వినలేదు. దీంతో నరసాపురంలో మరో నేతను వైసీపీ ఇన్ చార్జీగా ప్రకటించింది. ఆ తర్వాత పార్టీకి సంబందం తెగిపోయింది. ఆ దశలో కాస్త నిజాయితీ ఉన్నా ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజు ప్రతిష్ట నిలబెట్టుకుని ఉండేవారు. ఉభయ గోదావరి జిల్లాలలో క్షత్రియులకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. కాని రాజు తెలివితక్కువగా, మూర్ఖంగా, కేవలం ప్రచార పిచ్చితో దానిని అంతటిని నాశనం చేసి, ఆయన వర్గానికి కూడా కళంకం తెచ్చారన్న విమర్శలకు గురయ్యారు. వైసీపీ ఈయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్‌ను కోరుతూ పిటిషన్ ఇచ్చినా, రకరకాల పద్దతులలో బీజేపీ పెద్దలను మేనేజ్ చేసుకుని నాలుగేళ్లు కధ నడిపించారు. ఈ కాలంలో ఒకటి,రెండుసార్లు తప్ప నియోజకవర్గం వైపే చూడలేదు. ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవి 5 వంటివి తనకు లైవ్ కవరేజీ ఇస్తున్నాయనే సంబడంలో ఆయన రోజూ జగన్‌పై విమర్శలు సాగించారు. అవి కూడా కొన్నిసార్లు దూషణలుగా, అనుచిత వ్యాఖ్యలుగా ఉండేవి. ఒక అగ్రవర్ణ సామాజికవర్గాన్ని తూలనాడడం, మతపరమైన వ్యాఖ్యలు చేయడం వంటివాటి ద్వారా కులాలు, మతాల మద్య చిచ్చుపెట్టే యత్నం కూడా చేశారు. ఆ క్రమంలో ప్రభుత్వం కేసు పెట్టి అరెస్టు చేసింది. అప్పట్లో ఆయా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు ద్వారా బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పుడైనా పదవికి రాజీనామా చేసి, వైసీపీకి చాలెంజ్ విసిరారా అంటే అదీ లేదు. ఓడిపోతానన్న పిరికి తనంతో ఉండిపోయారు. ఈయనను వైసీపీ ఎంపీగా పిక్చర్ ఇస్తూ ఎల్లో మీడియా కధ నడిపేవి. తనకు టీడీపీ, బీజేపీ, జనసేనలలో ఎవరైనా టిక్కెట్ ఇస్తారని బీరాలు పోయేవారు. నిజంగానే ఈయనకు అంత పలుకుబడి ఉందేమోలే అనుకున్నవారు ఉన్నారు. ఆ నమ్మకంతోనే వైసీపీని, జగన్‌ను అంత నీచంగా మాట్లాడుతున్నారని భావించినవారు లేకపోలేదు. సీన్ కట్ చేస్తే ఆ మూడు పార్టీలు ఈయనను వదలించుకోవడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఉన్నవి,లేనివి కలిపి అబద్దాలు చెప్పించిన టీడీపీ నేతలే ప్రస్తుతం మొహం చాటేశారంటేనే అర్ధం చేసుకోవచ్చు. చంద్రరబాబు నాయుడును నమ్మితే ఇంతే సంగతి అన్నది సాదారణంగా ఉన్న నానుడి. ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధికి కాకుండా టీడీపీకి ఓటు వేసి అనర్హత వేటుకు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కూడా చంద్రబాబు మొండి చేయి చూపారు. ఆమె బాపట్ల లోక్ సభ సీటు ఇస్తారని ఆశించి భంగపడ్డారు. దాంతో తత్వం బోధపడి ఏమన్నారో చూడండి. 'రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటివారు ఈ రోజు అర్దం అయింది "అని శ్రీదేవి వ్యాఖ్యానించారు. అంటే దాని అర్దం చంద్రబాబు తనకు వెన్నుపోటు పొడిచారని చెప్పడమే కదా! రఘురామకృష్ణంరాజుకు కూడా అలాగే చంద్రబాబు ప్రస్తుతానికి వెన్నుపోటు పొడిచినట్లే అవుతుంది కదా! ఆయనను నిలదీసి తాను ఇంతగా సేవ చేస్తే ఇలా నమ్మక ద్రోహం చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించాలి కదా! మరో ప్రత్యామ్నాయ సీటుకు డిమాండ్ చేయాలి కదా! ఈ మూడు పార్టీలు రఘురామకృష్ణంరాజుకు టిక్కెట్ ఇవ్వడం వేస్ట్ అని అనుకున్నాయనే కదా అర్ధం. తనను కరివేపాకు మాదిరి చంద్రబాబు వాడేసి, ఎటూ కాకుండా చేశాడని ఈయనకు జ్ఞానోదయం అవ్వాలి కదా! ఇంత జరిగాక కూడా తాను చంద్రబాబుతోనే ఉంటానని ఉసూరుమంటూ చెప్పారు. తనకు ఇంతకన్నా గతి లేదని ఫీల్ అవుతున్నారని ఆయన మొహం చూస్తేనే అర్దం అవుతుంది. తాను చిన్న ఓటమికి గురయ్యాయని అంటూ మళ్లీ ఆత్మవంచన చేసుకుని జగన్తన ప్రభావం చూపి టిక్కెట్ రాకుండా చేశారని పిచ్చి విమర్శ చేశారు. ఇలా చాతకాని వ్యాఖ్యలు చేసే బదులు తాను ఇంతకాలం తప్పు చేశానని, శ్రీదేవి మాదిరి తనకు కూడా జ్ఞానోదయం అయిందని ప్రకటించి రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదేమో ఆయన ఆలోచించాలి. అలా చేసే పరిస్థితి లేదు.. రామోజీ, రాదాకృష్ణ తదితర తెలుగుదేశం ఎజెంట్లు పెట్టిన ప్రలోభాలకు లొంగి, రోజూ తనను కాబట్టి టీవీ లైవ్ లలో చూపిస్తున్నారని, పత్రికలలో తన స్టేట్ మెంట్లు వేస్తున్నారని భ్రమపడి, వారి కోరిక మేరకు పిచ్చి మాటలన్నీ మాట్లాడి, ఇప్పుడు లబో, దిబో అంటున్నారు. ఇప్పటికైనా వారంతా తనను వాడుకుని వదలివేశారన్న సంగతి బోదపడిందో లేదో తెలియదు. రఘురామకృష్ణరాజుకు ఇంకో ఆప్షన్ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ నేత, తన వియ్యంకుడైన కెవిపి రామచంద్రరావునో, పీసీసీ అధ్యక్షురాలు షర్మిలనో కోరితే. వారు కాంగ్రెస్ టిక్కెట్ ఇప్పించవచ్చు. ఆ రకంగా ప్రయత్నం చేస్తారేమో చూడాలి. కాంగ్రెస్ టిక్కెట్ పైన అయినా, లేక స్వతంత్ర ఈ అభ్యర్ధిగా అయినా రంగంలో దిగి తన సత్తా చూపితే అప్పుడు రఘురామకృష్ణంరాజుకు కొంతైనా విలువ వస్తుంది. లేకుంటే ఈయన రోశం ఉన్న రాజకాదని, ఉత్తి రాజే అన్నే భావన కలుగుతుంది. సర్వభ్రష్టత్వం చెంది రఘురామకృష్ణంరాజు, టీడీపీ కూటమికే ఊడిగం చేస్తారా? లేక తనకు కూడా వ్యక్తిత్వం ఉందని నిరూపించుకుంటారా అన్నది ఆయన తేల్చుకోవాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
రఘురామ కృష్ణంరాజుకి సీటు ఇవ్వకపోవడంపై కొమ్మినేని రియాక్షన్
-
RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
ఓ.. జమానాల సినిమా, అందులో మోహన్ బాబుది ఓ ఆకు రౌడీ రోల్. ‘నాకు సీఎం తెలుసు.. గవర్నర్ తెలుసు’ అని తన అసిస్టెంట్‌తో ఓ బడాయిలకు పోతుంటాడు. ఎంతైనా పాత సినిమా కదా.. దానికి తగ్గట్లే క్లైమాక్స్‌లో పోలీసులు వస్తారు. ‘అయ్యా.. మీకు సీఎం, గవర్నర్ తెలుసు కదా ఫోన్ చేయండి ఈ పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారు’’ అని అసిస్టెంట్ గుర్తు చేస్తాడు. ‘నాకు వాళ్లు తెలుసుకానీ, వాళ్లకే నేను తెలియదు కదా’ అని చెప్పి పోలీస్ జీప్ ఎక్కుతాడు మోహన్‌బాబు. కట్ చేస్తే.. నరసాపురం సీటు విషయంలో RRR అదే రఘురామ కృష్ణంరాజు చేసిన హడావిడి ఆ పాత సినిమా సీన్లను సరిగ్గా మ్యాచ్ చేసిందనే చెప్పాలి. ‘‘నరసాపురం సీటు నాదే .. నా బ్యాక్ గ్రౌండ్ మీకు తెలియదు. నాకు వాళ్ళు తెలుసు.. వీళ్ళు తెలుసు’’ అంటూ ఫొటోలకు ఫోజులు పెట్టి మరీ మీసాలు తిప్పుకున్న రఘురామరాజుకు.. చివరకు చేతులు పిసుక్కోవడమే మిగిలింది. చంద్రబాబు ప్రోద్బలంతో, టీడీపీ అనుకూల మీడియా సాయంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను విమర్శిస్తూ రచ్చబండ పేరుతో నాలుగేళ్లుగా నానా రాద్ధాంతం చేసినా రఘురామకు అచ్చీరాలేదు. ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో నరసాపురం సీటు గల్లంతైపోయింది.మొదటి నుంచి బిల్డప్ బాబాయే.. స్వతహాగా తాను అందరి లాంటి వాడిని కాదనే భావనలో కూరుకుపోయిన రఘురామ.. ఆ పరిస్థితులతో వైఎస్సార్సీపీలో ఎంతకాలం కొనసాగలేకపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరి ఎంపీగా నెగ్గిన ఆయన.. ఏడాదిలోనే అనూహ్యంగా పార్టీకి దూరం అయ్యారు. ఆ తర్వాత తనకు ఢిల్లీ పెద్దల అండ ఉందని ప్రొజెక్టు చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే.. అనర్హత వేటు పడకుండా ఐదేళ్ల పాటు లోక్‌సభలో ఎలాగోలా మేనేజ్ చేసుకోగలిగారు.ఇక.. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ఢిల్లీలో నిత్యం ప్రెస్మీట్లు పెడుతూ.. ఏపీ ప్రభుత్వంపైనే కాకుండా వ్యక్తిగతంగా సీఎం జగన్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు. మధ్య మధ్యలో చంద్రబాబు సూచనలతో కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేశారు. టీడీపీని బీజేపీకి దగ్గర చేసి, 2024 తాను బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. ప్చ్.. ఇంతా చేస్తే చివరకు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు అయ్యింది RRR పరిస్థితి. అదే తిప్పి కొట్టింది మరీ.. ఈ నాలుగేళ్లుగా టీడీపీ కోసం రఘురామ చేయని పనంటూ లేదు. అదే సమయంలో.. బీజేపీ నీడలో ఉన్న తనపై వేటు కూడా వేయలేదంటూ వైఎస్సార్సీపీకి సవాల్ విసిరే స్టేజ్‌కు చేరుకున్నారు రఘురామ. అయితే.. తాను బాగా దగ్గర అని రఘురామ ఊహించుకుంటే.. బీజేపీ మాత్రం ఆయన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. పైగా చంద్రబాబు మనిషి అనే కోణంలో ఎంత దూరం ఉంచాలో.. అంత దూరం పెట్టాలని నిర్ణయించుకుంది. వీటికి తోడు ఏపీ సీనియర్లు రఘురామ మీద ఇచ్చిన నివేదికల్ని సైతం పరిగణనలోకి తీసుకుంది. అందుకే నిర్మోహమాటంగా.. టిక్కెట్ కుదరదని తేల్చేసింది. నీ మెంబర్షిప్ ఏదయ్యా?.. ఏ పార్టీ అయినా సరే.. తమదాంట్లో ప్రాథమిక సభ్యత్వం లేకుండా టికెట్ ఇస్తుందా?. బిల్డప్పుల రఘురామకు ఆ మాత్రం సోయి లేదా?.. ఎంపీల జాబితా ప్రకటన తర్వాత బీజేపీపై రఘురామకృష్ణంరాజు అక్కసు వెళ్లగక్కారు. అయితే దీనిపై ఏపీ బీజేపీ రఘురామ గాలి తీసేసింది. ‘‘బీజేపీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్ధుల జాబితాలో ఆర్ ఆర్ ఆర్ పేరు లేకపోవడం ఆశ్చర్యమేముంది అంటూ ఎక్స్ వేదికగా బీజేపీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజా పోస్ట్ వేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం లేకుండా సీటు ఎలా? అంటూ సెటైర్లు వేశారాయన. ‘‘వారిపై జాలిచూపే పార్టీలు(టీడీపీ, జనసేలను ఉద్దేశిస్తూ పరోక్షంగా) ఎందుకు సీటు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారాయన. రఘురామకు తగిన శాస్తి జరిగిందంటూ కొందరు నెటిజన్ల కామెంట్లు ‘నాకు టికెట్ రాకుండా సోము వీర్రాజు ద్వారా జగన్ అడ్డుకున్నాడు’.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుబాబోయ్.. కితకితలు పెట్టకుండానే రాజుగారు భలే నవ్విస్తున్నారే!. సోము వీర్రాజు MP టికెట్‌కే దిక్కు లేదు.. నీకు టికెట్ రాకుండా అడ్డుకోగలిగాడా?.. మింగలేక మంగళవారం మాటలు. సోము వీర్రాజు (కాపు) కు MP టికెట్ రాకుండా చక్రం తిప్పింది పురంధేశ్వరి. ఎందుకంటే సోము కు ఎంపీ టికెట్ వచ్చి గెలిస్తే .. కాపు కోటాలో కేంద్ర మంత్రి అవుతాడు. నాకు రాదు అని ‘కమ్మ’ని కుట్ర పన్నింది ‘3 అడుగులు వెనక్కి వేస్తున్నాను’ .. టికెట్ రాకపోవడం పై రఘురామ రాజు. 30 అడుగులు వెనక్కి వేసినా పీకే_లేదు.. ఓ నెటిజన్ కామెంట్నీ అతి చేష్టలు , నీవు ఏ మాత్రం నమ్మదగినవాడివి కావు అని అన్ని పార్టీలకు తెలుసు. నీవు నరసాపురం మొఖం చూడక ఐదేళ్లు. నీవు ఏ పార్టీ తరపున పోటీ చేసినా ఓడిపోతావ్ అని అన్ని పార్టీలకు తెలుసు. అందుకే కా కమ్మ మీడియా ఈనాడు జ్యోతి TV5 నిన్ను వాడుకున్నాయి. కానీ నీవేమో నేను పెద్ద తోపు కాబోలు అనుకున్నావ్ ఆక్ పాక్ కరివేపాక్ క్లబ్బులో .. శాశ్వత సభ్యునిగా నీకు మెంబెర్ షిప్ ఇచ్చాడు చంద్రబాబురఘురామరాజుకు టికెట్ ఇవ్వని టీడీపీ. నర్సాపురం బీజేపీ సీటు వర్మకు ఇచ్చారు. కానీ బీజేపీ టికెట్ ఇవ్వలేదని పడి ఏడుస్తోంది టీడీపీ అను కుల భజన మీడియా ఈనాడు జ్యోతి TV5. 2014లో కూడా టీడీపీ టికెట్ ఇవ్వలేదు రఘురామరాజు2019 లో వైఎస్సార్సీపీ టికెట్ మీద ఎంపీగా గెలిచినా పని చేసింది మాత్రం టీడీపీ కోసంబాబు కళ్ళలో ఆనందం కోసం.. నిత్యం రెడ్లను తిడుతూ కమ్మోళ్లను పొగుడుతూ గడిపాడు 5 ఏళ్ళు ఇప్పుడు సమ్మగా కమ్మ గ ఉందంట.. బాగా తీరింది దూలఅంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. ముంతమామామిడి పండన్నాడే గంగరాజు..తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ...నర్సాపురారం సీటు నాదే అని బాబు పవన్ ల ముందు ప్రకటించుకున్నాడు బిల్డప్ రాజు అయినా తగ్గడంట!అదేం చిత్రమో.. కోరుకున్న టికెట్ దక్కకున్నా.. రఘురామ రాజు ‘బేస్’లో వాయిస్ మాత్రం తగ్గలేదు. ఏమున్నా ప్రజల్లో తేల్చుకుంటానంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ రఘురామ ప్రకటించడాన్ని విడ్డూరంగా భావించాల్సిందే. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా.. పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించడంపై RRR ఒక వీడియో విడుదల చేశారు. కాలే కట్టేతో లోలోపల రగిలిపోతూనే.. తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని సంతోషంగా లేనంటూ డబుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో.. తనకు టికెట్ రాకుండా తాత్కాలికంగా విజయం సాధించారంటూ సీఎం జగన్‌పై నెపం నెట్టే యత్నమూ చేశారు. బీజేపీ నేత సోము వీర్రాజు ద్వారా సీఎం జగన్ తనకు టికెట్ రాకుండా అడ్డుకోగలిగారనేది రఘురామ రాజు ప్రధాన ఆరోపణ. ప్రతి ఒక్కరికీ ప్రతిసారీ విజయం దక్కదని వ్యాఖ్యానించిన రఘురామ.. బీజేపీ అధిష్టానం కూడా అది గుర్తించే టికెట్ వేరే వాళ్లకు ఇచ్చిందేమో!. అయితే ఇంత మాట్లాడి.. ఆఖరికి చంద్రబాబుతో కలిసి నడవాలనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం పర్చడం ఇంతకాలం సాగిన కుట్రను మరింత బలపర్చిందని ఏపీ ప్రజలు గుర్తించరంటారా?.. :::సాక్షి వెబ్ పొలిటికల్ డెస్క్ -
రఘురామకృష్ణంరాజు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూపొందించిన వివిధ పాలసీలు, తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నరసాపురం వైసీపీ ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్బంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టు ముందు పలు కీలక విషయాలు ప్రస్తావించారు. రాఘురామకృష్ణం రాజు చట్టం గురించి తెలియని అమాయకుడేమీ కాదని.. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసని అన్నారు. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్‌పై వ్యాఖ్యలు చేయడం కూడా తెలుసని, కావాలనే వాస్తవాలను తొక్కిపెట్టి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారని తెలిపారు. ఆయన దురుద్దేశాలను పరిగణనలోకి తీసుకోవద్దని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ వెనక రఘురామరాజుకు వ్యక్తిగత ప్రయోజనాలున్నాయని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు నివేదించారు. విష ప్రచారంలో భాగంగానే ఈ వ్యాజ్యం దాఖలు చేశారన్నారు. కేసుల గురించి చెప్పలేదని, స్పీకరిచ్చిన ఫిర్యాదు ప్రస్తావన లేదని గుర్తు చేశారు. ట్రిబ్యునల్‌లో ధిక్కార చర్యల గురించి పేర్కొనలేదని తెలిప పైపెచ్చూ ఎలాంటి కేసులు లేవని పిల్లో డిక్లరేషన్ ఇచ్చారని, అన్నీ దాచిపెట్టి దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని పేర్కొన్నారు. కోర్టుకొచ్చిన వ్యక్తి సదుద్దేశంతో వచ్చారో లేదో చూడాలని, సీఎం గురించి ఆయన ఏం మాట్లాడారో ఓసారి చూడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు అడ్వొకేట్ జనరల్. దీనిపై స్పందించిన కోర్టు.. రఘురామకృష్ణంరాజు మాట్లాడిన మాటల వీడియోలను పరిశీలిస్తామని చెప్పింది. తదుపరి విచారణ మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. -
రుణాలు ఎగ్గొట్టి మా వద్దకా?
సాక్షి, హైదరాబాద్: దాదాపు రూ.వెయ్యి కోట్లు రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన కేసులో ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ) తనను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ రఘురామకృష్ణంరాజునుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమ విచక్షణాధికారాలను ఇలాంటి రుణ ఎగవేతదారులకోసం వినియోగించడానికి సిద్ధంగా లేమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై మూడు వారాల్లో రివ్యూ కమిటీని ఆశ్రయించాలని, చట్టానికి అనుగుణంగా కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇ చ్చి న ఆదేశాల్లో తాము జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని పేర్కొంది. రూ.500 కోట్లు దారి మళ్లింపు తమిళనాడులోని టుటికోరిన్ జిల్లా సత్తాంకుళం తాలూకా సత్తావినల్లూరు, పల్లక్కురిచి గ్రామాల్లో 660 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఇందు భారత్ పవర్‌కు రూ.2,655 కోట్ల రుణాన్ని ఆర్ఈసీ మంజూరు చేసింది. పనులు పరిశీలిస్తూ దశల వారీగా ఈ మొత్తాన్ని ఇస్తామని పేర్కొంది. 2014లో ఈమేరకు రూ.947.71 కోట్ల రుణాన్ని అందచేసింది. ఆ సమయంలో రఘురామకృష్ణంరాజు, ఆయన సతీమణి రమాదేవి ఇందు భారత్ డైరెక్టర్లుగా ఉన్నారు. అయితే ఇందులో దాదాపు రూ.500 కోట్లను ఇందు భారత్ ఇతర కంపెనీల్లోకి మళ్లించినట్లు ఆర్ఈసీ గుర్తించింది. దీంతో తదుపరి విడుదల కావాల్సిన రుణాన్ని నిలిపివేసి ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడిగా ప్రకటించింది. 2015 ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసింది. ఈ సర్క్యులర్ జారీ చేస్తే ఇతర ఏ బ్యాంకులూ రుణ ఎగవేతదారులకు ఎలాంటి రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. అన్ని అవకాశాలు ఇచ్చాకే పిటిషనర్లకు సర్క్యులర్ తమను రుణ ఎగవేతదారులుగా గుర్తించి 2022 జూన్ 16న సర్క్యులర్ జారీ చేయడాన్ని, క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి అన్ని అవకాశాలు ఇ చ్చి న తర్వాతే ఆర్ఈసీ కమిటీ పిటిషనర్లకు సర్క్యులర్ జారీ చేసిందని స్పష్టం చేశారు. చట్టప్రకారమే ఆర్ఈసీ వ్యవహరించిందని, ఆ సర్యు్కలర్లో జోక్యం చేసుకునేందుకు తమకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి పిటిషన్లను కొట్టి వేశారు. ఆర్ఈసీ రుణం మంజూరు చేసే నాటికి పిటిషనర్లు ఇద్దరూ డైరెక్టర్లుగా ఉన్నారన్న వాదనతో ఏకీభవించారు. సింగిల్ జడ్జి తీర్పుపై పిటిషనర్లు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తీర్పునిచ్చారని, అందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రివ్యూ కమిటీని ఆశ్రయించకుండా తమ వద్దకు రావడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. రివ్యూ కమిటీ చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేస్తూ రఘురామకృష్ణంరాజు, రమాదేవి, డి.మధుసూదన్‌రెడ్డి అప్పీళ్లలో వాదనలను ముగించింది. -
రఘురామకృష్ణరాజుకు ఈడీ షాక్
సాక్షి, అమరావతి: ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. ఫెమా నిబంధనల్ని ఉల్లంఘించి దేశీయ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులను తరలించారంటూ రూ.40 కోట్ల జరిమానా విధించింది. రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్(ఐబీఎస్‌ఈపీఎల్)లోకి మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ రూ.202 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 2011 మార్చి 24న ఇన్వెస్ట్ చేసింది. ఇండ్ భారత్ సన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సేకరించిన రూ.202 కోట్లలో రూ.200 కోట్లను ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా.. ఇండ్ భారత్ ఎనర్జీ లిమిటెడ్ (ఉత్కల్)కు మళ్లించింది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నిధుల తరలింపుపై ఈడీ విచారించి 2017లో షోకాజ్ నోటీసులిచ్చింది. పూర్తిస్థాయి విచారణ జరిపి ఫెమా ఉల్లంఘనలు జరిగాయని నిర్ధారించి ఈ నెల 3న రూ.40 కోట్ల జరిమానా విధించింది. దీనిపై రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చదవండి: ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్మడమే రఘురామ ధ్యేయం -
హైకోర్టులో రఘురామకు షాక్
-
పవన్, రఘురామ కృష్ణంరాజుకి KK రాజు మాస్ వార్నింగ్
-
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను కేంద్ర కార్యాలయం ప్రకటించింది. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని పార్టీ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌గా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నాను అని ఎంపీ రఘురామ అన్నట్లు సమాచారం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది? తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, బంధువులు, భాగస్వాముల ఇళ్లలో, విద్యా సంస్థల్లో ఐటీ అధికారుల దాడులు ముగిశాయి. భారీగా నగదుతో పాటు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే? మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు లభించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. 2 నెలల్లో 1.25 లక్షల తొలగింపు.. భారతీయ టెకీలపైనే ఎక్కువ ప్రభావం? క్రికెట్ మ్యాచ్‌లో వెంట వెంటనే వికెట్లు పడిపోతుంటే అభిమానుల గుండె బరువెక్కిపోతుంది తప్ప ఇతరత్రా కష్టనష్టాలు ఉండవు. అదే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు టపటప ఊడిపోతుంటే.. కుటుంబాలు కుటుంబాలు కష్టాలపాలవుతాయి. ఆ కుటుంబాల మీద ఆధారపడ్డ చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆల్ ఉమెన్ టీమ్ ఆకాశమే హద్దు మహిళా స్వావలంబన లక్ష్యంగా టాటా మోటర్స్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ‘ఆల్–ఉమెన్ కార్ షోరూమ్’ ప్రారంభించింది. సెక్యూరిటీ గార్డ్ నుంచి జనరల్ మేనేజర్ వరకు అందరూ మహిళలే. సేల్స్, మార్కెటింగ్, కారు ఫిట్టింగ్, వాషింగ్, మేనేజింగ్... ఇలా రకరకాల విభాగాల్లో ఇరవైమంది మహిళలు ఉన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. కల్లలైన కలలు.. భర్త వివాహేతరసంబంధం.. మహిళా టెక్కీ ఆత్మహత్య ఇద్దరూ పెద్ద కంపెనీల్లో టెక్కీలు, కావలసినంత జీతం వస్తుంది, విలాసవంతమైన జీవితం ముందుంది. కానీ భర్త వివాహేతర సంబంధంతో తీవ్ర ఆవేదనకు లోనైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తి నగర రిచర్డ్ గార్డెన్లో ఈ నెల 10వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Satyam Scam:హెచ్డీఎఫ్సీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు సత్యం స్కామ్ చార్టర్డ్ అకౌంటెంట్ల వైఫల్యమేనని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ అకౌంట్ పుస్తకాలను ఆడిట్ చేసిన చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమైనట్టు చెప్పారు. బుధవారం ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పరేఖ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బంగ్లాతో వన్డే సిరీస్‌తో పాటు టెస్టులకు కూడా దూరమయ్యాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మోకాలి గాయం బారిన పడిన జడేజా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Kamal Haasan: కమల్ హాసన్‌కు అస్వస్థత స్టార్ హీరో కమల్‌హాసన్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంలో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్లో ఆయనను చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, డిశ్చార్ అయి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హింసను ప్రేరేపించేందుకే ఆ వ్యాఖ్యలు..
సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని ఆస్థిరపరిచే కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రిని, పలు కులాలను అవమానించేలా నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు కె.రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి, హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించారని, ఇది ఐపీసీ కింద నేరమని వివరించారు. ప్రతిపక్ష పార్టీ, రెండు వార్తా చానళ్లతో కలిసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రఘురామకృష్ణరాజుకు పరిపాటిగా మారిందని అన్నారు. రెడ్డి వర్గాన్ని ఉద్దేశించి డియర్ పాస్టర్స్ అని సంభోధిస్తూ వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, అందుకే ఆయనపై కేసు నమోదు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రిని, ఇతర కులాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గురువారం మరోసారి విచారణ జరిపారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. తనని ప్రజలు జోకర్‌గా భావించి తన వ్యాఖ్యలను పట్టించుకోలేదని, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలని రఘురామకృష్ణరాజు ప్రశ్నిస్తున్నారని ఏజీ తెలిపారు. ఆయన జోకర్ కావొచ్చునని, పాలన అంటే సర్కస్ మాత్రం కాదని వివరించారు. ఆయనపై నమోదు చేసిన దేశద్రోహం కేసుపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించిందని, మిగిలిన నేరాలపై దర్యాప్తు కొనసాగించవచ్చని చెప్పిందన్నారు. సీఐడీ దర్యాప్తునకు సహకరించాలని కూడా ఆయన్ని ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రక్షణకు మించి ఆయన ఇంకా ఎక్కువ రక్షణ కోరుతున్నారని, అందుకు చట్టం అనుమతించదని తెలిపారు. గతంలో విచారణకు వచ్చినప్పుడు సీఐడీ హింసించిందని, అందువల్ల ఇప్పుడు సీఐడీ వద్దకు రాలేనని, తన ఇంటికే అధికారులు రావాలన్న రఘురామకృష్ణరాజు వాదనను ఏజీ తోసిపుచ్చారు. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు ఇంటికి వెళితే, వారిని కాల్చేయాలని భద్రతా సిబ్బందిని ఆదేశించిన ఘనుడని, అందువల్ల ఆయన ఇంటికెళ్లే ప్రసక్తే లేదన్నారు. పిటిషనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన్ని విచారించే ప్రక్రియను వీడియో తీస్తామని అన్నారు. మరికొందరితో కలిపి ఆయన్ని విచారించాల్సి ఉంటుందని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ. సీఐడీ పిలిచిన చోటకి వెళ్లే పరిస్థితి లేదని, మరోసారి దాడి చేయడమో, ఇతర కేసుల్లో అరెస్ట్ చేయడమో చేసే అవకాశం ఉందని అన్నారు. ఆన్లైన్లో లేదా హైదరాబాద్‌లోని పిటిషనర్ ఇంట్లో విచారణ జరపాలని కోరారు. ఈ ప్రతిపాదనను ఏజీ వ్యతిరేకించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ఇరుపక్షాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కోర్టుపై ఉందన్నారు. అందువల్ల ఆన్లైన్లో విచారించడమా? లేక తటస్థ ప్రదేశంలోనా అన్నది తెలపాలని సీఐడీకి సూచించారు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
NCLTలో రఘురామ కృష్ణరాజు కంపెనీకి ఎదురుదెబ్బ
-
Lok Sabha: రఘురామ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి,ఢిల్లీ: లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తిప్పికొట్టారు. బ్యాంకులను మోసం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన రఘురామకృష్ణంరాజుపై రెండు సీబీఐ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. భారత్ థర్మల్ పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: ఓటీఎస్‌పై చంద్రబాబు విమర్శలు అర్థరహితం: సజ్జల ‘‘ఆయన బ్యాంకులను మోసం చేశాడు. వాటి నుంచి బయట పడటం కోసం కేంద్రంలోని అధికార(బీజేపీ) పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు మా పార్టీ నుంచి ఎంపీగా గెలిచాడు. బ్యాంకులను మోసం చేశాడు కాబట్టే.. ఆ కేసుల నుంచి బయటపడటానికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నారు. రఘురామకృష్ణరాజుపై కేసులను వీలైనంత త్వరగా తేల్చండి. భారత్ థర్మల్ పేరుతో ఆయన తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని’’ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై స్పందించిన ఆర్బీఐ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదుపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్పందించింది. రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌కు బ్యాంక్ రుణాల అవకతవకలపై విచారణ జరపాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆర్బీఐ.. తగిన చర్యలు తీసుకుంటామంటూ విజయసాయిరెడ్డికి తెలిపింది. (చదవండి: రెండో పెళ్లి చేసుకోవాలంటే ఆ గుడికే వెళ్తారు.. ఎందుకంటే..!) 2014-18 మధ్యలో పంజాబ్ కాన్సార్షియం దగ్గర రూ.826 కోట్ల రుణాలను ఇండ్ పవర్ తీసుకుంది. 2020 అక్టోబర్‌లో రుణాల స్కాంపై ఇండ్ పవర్ సంస్థకు చెందిన 11 చోట్ల సీబీఐ రైడ్స్ నిర్వహించింది. రుణాలు తీసుకుని ఇండ్ పవర్ సొంత అకౌంట్లకు డబ్బులు మళ్లించుకున్నట్లు సీబీఐ గుర్తించింది. చదవండి: చంద్రబాబు దీక్షలపై డిక్షనరీ రాయాలి: కన్నబాబు -
బెయిల్ రద్దు చేయలేం
సాక్షి, హైదరాబాద్: ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వి.విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయలేమని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులను వారు ఉల్లంఘించలేదని, బెయిల్ రద్దు చేసేందుకు సహేతుకమైన కారణాలేమీ లేవని తేల్చి చెప్పింది. ఈ మేరకు రఘురామ దాఖలు చేసిన రెండు పిటిషన్లను బుధవారం కొట్టివేసింది. గత మూడు నెలలుగా సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్‌రావు ఈ మేరకు తీర్పునిచ్చారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే.. ‘జగన్, సాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ తన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఇది చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమే. పిటిషన్ దాఖలు చేసిన తీరు, అందులో వాడిన బాష ఆయన దురుద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. అవాస్తవాలు, తప్పుడు ఆరోపణలు, అభూత కల్పనలతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రోజువారీ పద్ధతిలో కేసులను విచారిస్తోంది. నిందితులు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వింటోంది. ఈ క్రమంలో విచారణను జాప్యం చేస్తున్నారంటూ రఘురామ పేర్కొనడం కోర్టు ధిక్కరణకు పాల్పడటమే అవుతుంది. అలాగే బెయిల్ మంజూరు సమయంలో ప్రత్యేక కోర్టు విధించిన షరతులను వారు ఎప్పుడూ ఉల్లంఘించలేదు. బెయిల్ షరతులు ఉల్లంఘించారని భావించినప్పుడు నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం ప్రాసిక్యూషన్ విభాగానికి మాత్రమే ఉంటుంది. థర్డ్‌పార్టీకి బెయిల్ రద్దు చేయాలని కోరే హక్కు లేదని అనేక కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను కొట్టివేయండి..’అని జగన్, సాయిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఇ.ఉమామహేశ్వరరావు కోర్టును కోరారు. మరో కోర్టుకు బదిలీకి కారణాల్లేవు హైకోర్టులోనూ రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బదిలీ చేయడానికి సహేతుకమైన కారణాలు లేవని స్పష్టం చేసింది. ఊహాగానాలతో రఘురామ ఈ పిటిషన్ దాఖలు చే శారని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చారు. అలా చేయాలంటే నిర్దిష్టమైన కారణాలుండాలి ‘ఏదైనా పిటిషన్‌పై విచారణను ఒక కోర్టు నుంచి మరొక కోర్టుకు బదిలీ చేయాలంటే నేర విచారణ చట్టంలో పేర్కొన్న మేరకు నిర్దిష్టమైన కారణాలు ఉండాలి. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో రెండో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారన్న కారణాన్ని చూపుతూ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదు. నిందితులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలు చేసినప్పుడు అనుమతిస్తూ ఉండటం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. బెయిల్ రద్దు కోరుతూ ఏప్రిల్‌లో సీబీఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే సీబీఐ కోర్టుపై నమ్మకం లేదంటూ ఆ పిటిషన్లపై ఆదేశాలు ఇవ్వడానికి ఒక రోజు ముందు హైకోర్టును ఆశ్రయించడం సరికాదు..’అని జస్టిస్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
‘నా లేఖకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు’
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్రై. లిమిటెడ్‌కు సంబంధించి రూ.826 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో తీవ్ర జాప్యం జరుగుతోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ లేఖపై మంత్రి నిర్మాలా సీతారామన్ స్పందించారని పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని తెలిపారని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. ఎంపీ రఘురామరాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి రూ. 826 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో తీవ్ర జాప్యం జరుగుతోందని నేను రాసిన లేఖకు కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు స్పందించారు. విచారణ వేగవంతం అయ్యేలా చూస్తామని తెలిపారు. pic.twitter.com/Tc6o5N7C5J — Vijayasai Reddy V (@VSReddy_MP) August 8, 2021 -
న్యాయమూర్తుల గురించి నారా లోకేష్, రఘురామ తీవ్ర వ్యాఖ్యలు
-
నాటి నుంచి నేటి దాకా.. ‘సరస్వతి’పై సర్వం కుట్రలే
సాక్షి, అమరావతి: పరిశ్రమలను అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎంపీ రాఘురామకృష్ణరాజు ద్వయం సరికొత్త కుట్రకు తెరతీసింది. నిబంధనల ప్రకారం మైనింగ్ లీజులు పొందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌పీఐపీఎల్)పై రాజకీయ దురుద్దేశంతో పన్నాగానికి పథక రచన జరుగుతోంది. ప్రభుత్వం నుంచి భూములు తీసుకోకుండా మార్కెట్ ధరకు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూముల్లో మైనింగ్ నిర్వహిస్తున్న సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు వ్యతిరేకంగా ఇలాంటి కుట్రలకు పాల్పడుతుండటం విస్మయపరుస్తోంది. మైనింగ్ లీజు రద్దుకు టీడీపీ హయాంలో చేసిన కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ప్రస్తుతం బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో నిందితుడైన రఘురామరాజును అడ్డం పెట్టుకుని కథ నడిపిస్తున్నారు. వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని బ్యాంకులను మోసగించి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు.. సరస్వతి పవర్ మైనింగ్ లీజులను రద్దు చేయాలని కోరడం విస్మయపరుస్తోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్నది ప్రైవేటు భూములే.. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఎస్‌పీఐపీఎల్) 2008లో గుంటూరు జిల్లాలో 266 హెక్టార్ల ప్రైవేటు భూమిని కొనుగోలు చేసింది. సాధారణంగా ఏ పారిశ్రామిక సంస్థ అయినా ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంది. కానీ రాజకీయ ఆరోపణలకు అవకాశం ఇవ్వకూడదని భావించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ యాజమాన్యం తమకు భూములు కేటాయించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరలేదు. పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూముల్లో సున్నపురాయి మైనింగ్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందింది. పూర్తి పారదర్శకతతో జరిగిన ఈ వ్యవహారంపై భూములు అమ్మిన ప్రైవేట్ వ్యక్తులు కూడా దానిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. రాజకీయ కక్షతో లీజు రద్దు.. చెల్లదని కోర్టు తీర్పు 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష పూరితంగా వ్యవహరించింది. మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించలేదంటూ సరస్వతి పవర్ కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై సరస్వతి యాజమాన్యం సహేతుకమైన వివరణ ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా మైనింగ్ లీజును 2014 అక్టోబర్ 9న రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కేటాయించిన భూములైతే మైనింగ్ లీజు రద్దు చేసి వాటిని మరొకరికి ఇవ్వవచ్చు. కానీ అవి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూములు. లీజు రద్దు చేసినా సరే ఆ భూములు ప్రభుత్వానికి చెందవు. కేవలం రాజకీయ కక్షతోనే నాడు టీడీపీ సర్కారు అడ్డగోలుగా వ్యవహరించింది. చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. మైనింగ్ లీజును రద్దు చేస్తూ టీడీపీ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ భూముల్లో మైనింగ్ చేసుకోవచ్చని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు అనుమతినిచ్చింది. ఆర్థిక నేరాల నిందితుడితో కలసి... సున్నపురాయి గనుల మైనింగ్ లీజు రద్దుకు తమ ప్రభుత్వ హయాంలో చేసిన కుట్ర బెడిసికొట్టడంతో చంద్రబాబు ఈసారి కొత్త పన్నాగానికి తెరతీశారు. తన చేతిలో కీలుబొమ్మగా మారిన రఘురామకృష్ణరాజును తెరముందు పెట్టి కుట్ర పన్నారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు ఇచ్చిన మైనింగ్ లీజు రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది. జాతీయ బ్యాంకుల నుంచి రూ.2,655 కోట్ల మేర రుణాలు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. అటువంటి కేసులో నిందితుడు కోర్టును ఆశ్రయించి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ మైనింగ్ లీజును రద్దు చేయాలని కోరడం వెనుక కచ్చితంగా రాజకీయ కుట్ర ఉందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్ర... రాష్ట్రం అభివృద్ధి చెందడం ఏమాత్రం సహించలేని చంద్రబాబు అండ్ కో రాజకీయ కుట్రతోనే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ మైనింగ్ లీజు రద్దు చేయించేందుకు పన్నాగం పన్నారన్నది సుస్పష్టమవుతోంది. పరిశ్రమలు ఎక్కువగా వస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నది ఆర్థికవేత్తలు చెబుతున్న మాట. అందుకే ప్రభుత్వాలే పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకు భూములు కేటాయించి మరీ పరిశ్రమల స్థాపనకు చొరవ చూపిస్తాయి. కానీ ప్రభుత్వం నుంచి భూములుగానీ ఇతరత్రా ప్రయోజనాలను ఆశించకుండానే సరస్వతి పవర్ ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొని నిబంధనల మేరకు మైనింగ్ కార్యకలాపాలు చేపట్టింది. ఓ పారిశ్రామిక సంస్థ ఇంతటి ఉదారతతో వ్యవహరించడం అరుదని పారిశ్రామిక, న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఆగితే ఉపాధికి విఘాతం.. రాజకీయ దురుద్దేశంతో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ మైనింగ్ లీజును అడ్డుకునేందుకు యత్నిస్తూ పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకునేందుకు పన్నాగం పన్నుతుండటాన్ని పరిశీలకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మైనింగ్ లీజును రద్దు చేస్తే ఆ భూములు ప్రభుత్వానికి చెందవు. సర్వస్వతి పవర్ ఇండస్ట్రీస్ వద్దే ఉంటాయి. ఎందుకంటే అవి ఆ కంపెనీ ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన భూములు కాబట్టి. కానీ లీజు రద్దు చేస్తే ఆ భూములు నిష్ప్రయోజనంగా మారతాయి. పారిశ్రామిక కార్యకలాపాలు నిలిచిపోతే ఎంతోమంది ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం కల్పిస్తున్న సానుకూల వాతావరణానికి విఘాతం కలుగుతుంది. పారిశ్రామిక ప్రగతి దెబ్బతింటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది. రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయ కుట్రలకే ప్రాధాన్యమిస్తూ చంద్రబాబు, రఘురామరాజు ద్వయం తమ పన్నాగాలను కొనసాగిస్తుండటం వారి దురుద్దేశాలను వెల్లడిస్తోంది. ఇటువంటి రాజకీయ పరిణితిలేని, కుట్రపూరిత చర్యలు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి విఘాతమని, పెట్టుబడులను ప్రోత్సహించాలన్న జాతీయ విధానానికి వ్యతిరేకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదవండి: పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్ ఇదేమి సుమోటో..! -
రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
సాక్షి, ఏలూరు: ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా నరసాపురంలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ఏపీ బహుజన ఐక్య వేదిక వెల్లడించింది. రెండేళ్లుగా నియోజకవర్గ ప్రజలను, అభివృద్ధిని పట్టించుకోని రఘురామను ఎంపీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. ఓట్లేసి ఎన్నుకున్న ఎంపీ తమను మోసం చేశాడంటూ నియోజకవర్గ ప్రజలు రఘురామకృష్ణరాజుపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇదిలా ఉంటే, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ రఘురామకృష్ణరాజుపై ఇవాళ ఉదయం గరగపర్రు గ్రామ దళితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజును ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రఘురామకృష్ణరాజు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. చదవండి: రఘురామకృష్ణరాజును డిస్క్వాలిఫై చేయండి -
మీడియాతో మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. టీవీ, ప్రింట్, సామాజిక మాధ్యమాల్లో కేసు విషయం మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కస్టడీలోకి తీసుకొనేంతగా అభియోగాలు మోపలేదని, పిటిషనర్ ఆరోగ్య పరిస్థితిని(డిసెంబరులో గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న దృష్ట్యా) పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేస్తున్నామని తెలిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సీబీఐ విచారణకు డిమాండ్ చేయగా.. ధర్మాసనం అనుమతించలేదు. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ, బెయిల్ కోరుతూ రఘురామ, అతని కుమారుడు భరత్ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను శుక్రవారం జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆర్మీ ఆస్పత్రి సీల్డ్ కవర్లో పంపిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఎడమ కాలులో రెండో వేలు ఫ్రాక్చర్ అయిందని, జనరల్ ఎడెమా (నీరు పట్టడం) ఉందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు నివేదిక ఇచ్చినట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఆ గాయాలు ఎలా వచ్చాయో ఆర్మీ ఆస్పత్రి స్పష్టం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. ‘ఆర్మీ ఆస్పత్రి నివేదికతో మేం విభేదించడం లేదు. అయితే ఆ నివేదికలో గాయాలు ఎలా వచ్చాయో స్పష్టం చేయలేదు. మెడికల్ బోర్డు, ఆర్మీ ఆస్పత్రి పరీక్షల మధ్య ఏదో జరిగి ఉంటుంది. అవి స్వయంగా చేసుకున్న గాయాలు అని ఎందుకు భావించకూడదు. ఆర్మీ ఆస్పత్రి నివేదిక అసంపూర్తిగా ఉంది. గాయం ఎలా అయిందో అందులో లేదు’ అని దవే స్పష్టం చేశారు. ‘రఘురామకృష్ణరాజు రెండువర్గాల మధ్య ద్వేషాన్ని కలిగించడానికే యత్నించారు. ఇది ప్రజల్లో అసమానతలకు కారణమైంది. రెండు వైద్య నివేదికల మధ్య ఏదో జరిగింది. రఘురామ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేయండి. పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. బాహ్య గాయాలేమీ లేవు. అఖిల్ గొగొయ్, సిద్ధిఖ్ కప్పన్ కేసులు కూడా రాజద్రోహం కేసులే. సుప్రీంకోర్టు ఈ కేసుల్లో బెయిల్ మంజూరు చేయలేదు. గాయాలు ఉన్నాయన్న ఒక్క కారణంతో పిటిషనర్‌కు బెయిల్ ఇవ్వడం సరికాదు’ అని దవే ధర్మాసనానికి నివేదించారు. ‘బాధ్యత కలిగిన వ్యక్తి ఇంకా బాధ్యతగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. రఘురామకృష్ణరాజు కులాలు, మతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. 124ఏ దుర్వినియోగం చేశారనడం సరికాదు. క్రిస్టియన్లు అధికారంలో ఉన్నారు. హిందువులకు వ్యతిరేకం అంటూ ప్రకటనలు చేశారు. పిటిషనర్ హద్దులు మీరి ప్రవర్తించారు. రెడ్డి, క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు’ అని దవే పేర్కొన్నారు. ఆ మధ్యలో ఏదో జరిగింది ‘పిటిషనర్ కోరిన మీదట హైకోర్టు ఆదేశాలతో ఏర్పడిన మెడికల్ బోర్డు రఘురామకృష్ణరాజుకు క్షుణ్ణంగా పరీక్షలు చేసింది. ఆర్మీ నివేదిక తప్పు అనడం లేదు. రెండు పరీక్షల మధ్య సమయంలో ఏదో జరిగింది. రెండు నివేదికలు విశ్వసించదగినవే. మెడికల్ బోర్డు పరీక్షలను హైకోర్టు పరిశీలించింది. నివేదికలో గాయాలు లేవని తెలిపింది’ అని దవే వివరించారు. కాలి రెండో వేలికి ఫ్రాక్చర్ అయిందని ఆర్మీ నివేదిక చెబుతోందిగా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ‘మెడికల్ బోర్డు పరీక్షల్ని వీడియో తీశారు. రిజిస్ట్రీకి ఇచ్చారు. మెడికల్ బోర్డు, ఆర్మీ వైద్యుల పరీక్షలకు మధ్య గ్యాప్‌లో ఏదో జరిగింది. అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అంటే బోన్ ఫ్రాక్చర్ కాదు. అది ఎప్పుడు జరిగింది. పాతదా కొత్తదా అనేది ఆర్మీ ఆస్పత్రి నివేదికలో లేదు. పోలీసులు కొడితే రెండో వేలు ఒక్క దానికే గాయం అవుతుందా. పోలీసులు ఏయే మెథడ్స్ ఉపయోగిస్తారో మీకు, నాకు కూడా తెలుసు. ఎంపీతో అలా వ్యవహరించరు. అంబులెన్స్‌లో కాకుండా సొంత కారులో ఆర్మీ ఆస్పత్రికి వెళ్తానంటే పిటిషనర్‌ను అనుమతించాం. వాహనంలో వెళ్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. పాదాలు బయటకు పెట్టి అందరికీ చూపారు. ఆ దృశ్యాలు మీడియా, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. ఆర్మీ ఆస్పత్రికి తరలించే ప్రక్రియను హాస్యాస్పదం చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో తనని కొట్టారని, చంపేస్తారని భయంగా ఉందంటూ మీడియాతో వ్యాఖ్యలు చేశారు’ అని దవే స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన కూడా పెట్టమంటారు ‘పిటిషనర్ తరఫు న్యాయవాది సీబీఐ విచారణ అడుగుతున్నారు. కాలి రెండో వేలికి గాయమైతే సీబీఐ విచారణ కోరతారా. పిటినషర్ తరఫు న్యాయవాదిని ఇలాగే అనుమతిస్తే.. రాష్ట్రపతి పాలన కూడా విధించాలని కోరతారు’ అని వ్యాఖ్యానించిన దవే ఇలాంటి కేసులను సీబీఐకి పంపాల్సిన అవసరం లేదన్నారు. దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్లాలి రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, వాదనలు వినిపించగా.. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి పరిగణనలోకి తీసుకుని షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. రఘురామకృష్ణరాజు దర్యాప్తునకు సహకరించాలని, దర్యాప్తు అధికారి పిలిస్తే స్వయంగా విచారణకు హాజరుకావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏ అంశంపైనా టీవీ, ప్రింట్, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదని, దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతు విధించింది. గతంలో మాదిరిగా గాయాలను ఎక్కడా ప్రదర్శించకూడదని, షరతుల్ని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో రూ.లక్ష ష్యూరిటీ బాండ్లు ఇచ్చి బెయిలు పొందొచ్చని పేర్కొంది. ఇదిలావుండగా.. రఘురామను ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు పాటించలేదంటూ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాదులు దవే, వి.గిరి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ అలాంటి నోటీసులు జారీ అయితే ముందుగా సుప్రీంకోర్టులో ఆ అంశం మెన్షన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛనిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
రఘురామకృష్ణరాజుకు షరతులతో కూడిన బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఇరు పక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ‘‘సీఐడీ విచారణకు రఘురామ పూర్తిగా సహకరించాలి. విచారణ అధికారి ఎప్పుడు పిలిచినా హాజరుకావాలి. రఘురామకృష్ణరాజు మీడియా, సోషల్‌మీడియా ముందుకు రాకూడదు. ఎలాంటి వీడియోలు పోస్ట్ చేయకూడదు. ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. మీడియా ముందు కాళ్లు, చేతులు చూపించే విన్యాసాలు చేయొద్దు. రూ.లక్ష పూచీకత్తును ట్రయల్స్ కోర్టులో జమ చేయాలి’’ అని ఆదేశించింది. కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ 12/2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్ఐర్లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. -
Raghu Rama Krishnam Raju: ‘ఒకరిని ఒకరు చంపుకొనే విధంగా మాట్లాడారు’
సాక్షి, న్యూఢిల్లీ: రఘురామకృష్ణరాజు కేసుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదిక వివరాలు వెల్లడయ్యాయి. ఆర్మీ ఆస్పత్రి మెడికల్ రిపోర్టు ప్రకారం.. రఘురామకృష్ణరాజుకు సాధారణ ఎడిమా ఉంది. ఆయన ఎడమ కాలి రెండో వేలుపై పగులు ఉంది. ఇక ఈ కేసులో సుప్రీంకోర్టు ఎదుట హాజరైన సీఐడీ లాయర్ దుష్యంత్ దవే మాట్లాడుతూ.. ‘‘రఘురామకృష్ణరాజు గాయాలపై అనుమానాలున్నాయి. ఆయన తనకు తానుగా చేసుకున్న గాయాలనే సందేహం ఉంది. ఆర్మీ ఆస్పత్రికి వచ్చేప్పుడు ఆయన ఏం చేశారో పరిశీలించాలి’’అని పేర్కొన్నారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికను సీఐడీకి అందిస్తామని తెలిపారు. ఇక ఈ కేసులో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు వాదనలు వింటామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. UPdate: సీనియర్ అడ్వొకేట్ దవే వాదనలు రఘురామకృష్ణరాజు కేసులో లాయర్ దుష్యంత్ దవే తన వాదనలు వినిపిస్తూ... ‘‘ఆర్మీ ఆస్పత్రి నివేదిక అస్పష్టంగా ఉంది. లోతైన గాయాలున్నట్టు నివేదికలో పేర్కొనలేదు. రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌ను తక్షణం డిస్మిస్ చేయాలి. గుజరాత్ సొసైటీ కేసును దృష్టిలో ఉంచుకుని ఈ పిటిషన్‌ను కొట్టివేయాలి. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టును తప్పుపట్టకూడదు. నిజానికి తను చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణరాజు వెనక్కి తగ్గలేదు. రాజద్రోహానికి సంబంధించి మొత్తం 11 అంశాలు ఉన్నాయి. తప్పు జరిగిందా? లేదా? అనేదాన్నే కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. తన వ్యాఖ్యలతో రఘురామకృష్ణరాజు కులాల మధ్య చిచ్చుపెట్టే పని చేశారు. పార్లమెంటు సభ్యుడిగా, ఒక వ్యక్తిగా వర్గాల మధ్య చిచ్చు పెట్టారు. ఒక ఎంపీ చేసే వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ తీవ్రత చూపిస్తాయి. కోవిడ్‌లాంటి ఆపత్కాలంలో ఘర్షణలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన తప్పు సరిదిద్దుకుంటారని ప్రభుత్వం చాలా సమయం ఇచ్చింది. కానీ, రఘురామకృష్ణరాజు అన్ని పరిధులు దాటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ దశలో.. ఈ రాజద్రోహం కేసులో కోర్టు జోక్యం చేసుకోవద్దు’’ అని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ సందర్భంగా... సుప్రీంకోర్టుకు సీఐడి సీనియర్ అధికారి రిపోర్టును సమర్పించిన దవే.. ‘‘రఘురామ వ్యాఖ్యలకు సంబంధించి 45 వీడియోలున్నాయి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేశారు. ఒకరిని ఒకరు చంపుకొనే విధంగా రఘురామ మాట్లాడారు’’ అంటూ రఘురామ రెచ్చగొట్టే వ్యాఖ్యలను కోర్టుకు చదివి వినిపించారు. అదే విధంగా... ‘‘ఒక కులానికే వ్యాక్సినేషన్ చేస్తున్నారని రఘురామ తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వ వాలంటీర్లను తన్నాలంటూ రఘురామ పిలుపునిచ్చారు. ఎంత పెద్ద పదవిలో ఉంటే అంత బాధ్యతగా ఉండాలని కోర్టు చెప్పింది. రఘురామకృష్ణరాజు ఎంపీ కాబట్టి బెయిల్ ఇవ్వాలని రోహత్గీ అంటున్నారు. 4 సార్లు ఎంపీ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వలేమని 2017లో కోర్టు చెప్పింది. ఎంపీ అయినంత మాత్రాన హైకోర్టును దాటి సుప్రీంకోర్టుకు వస్తారా?’’ అని తన వాదనలు వినిపించారు. కాగా రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే దవే కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. సొంతకారులో రఘురామ ప్రయాణించిన దృశ్యాలు కోర్టుకు చూపించిన లాయర్ దవే ‘‘గుంటూరు వైద్యుల రిపోర్టు, ఆర్మీ వైద్యుల రిపోర్ట్ వచ్చే మధ్య ఏదో జరిగి ఉంటుందనుకుంటున్నా. ఎడిమా అనేది చాలా మందికి వయసుతోపాటు వచ్చేదే. వై కేటగిరి భద్రత రఘురామకృష్ణరాజుకే కాదు కంగనా రనౌత్కూ ఉంది. రఘురామకృష్ణరాజు శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. దీన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. రఘురామకృష్ణరాజు ఉన్నది పూర్తి సురక్షితమైన ఆర్మీ ఆస్పత్రిలోనే. అంబులెన్స్‌లో వెళ్లమంటే రఘురామకృష్ణరాజు సొంతకారులో వెళ్లారు. ప్రజలకు అభివాదం చేస్తూ.. కాళ్లు చూపిస్తూ వెళ్లారు. కాళ్ల రంగు మారడానికి కారణం ఎడిమా మాత్రమే కారణం. మే 17న తీసిన ఎక్స్‌రేలో రఘురామకృష్ణరాజు కాలికి ఎలాంటి గాయం లేదు. పోలీసులు నిజంగా కొట్టాలనుకుంటే ఎడమ కాలి రెండో వేలే దొరికిందా?. రఘురామకృష్ణరాజు ఆరోపణలు పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. బెయిల్ కోసం రోజుకు కొన్ని వేలమంది కోర్టుకు వస్తారు. వేలికి చిన్న గాయం అయిందన్న సాకుతో ఇంత వేగంగా విచారణ జరగదు. గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ తరలిస్తుండగా.. రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను లాయర్ దవే కోర్టుకు తెలిపారు. కారులో కాలు పైకెత్తి రఘురామ చేసిన విన్యాసాల వీడియో కోర్టుకు సమర్పించారు. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఐడీ పోలీసులు తరలిస్తుంటే..కారులో రఘురామకృష్ణరాజు కాలు పైకెత్తి, ప్రకటనలు చేస్తూ వస్తారా?. బెయిల్ పిటిషన్ కింది కోర్టులో దాఖలు చేసుకోమని హైకోర్టు చెప్పింది. బాగా డబ్బుంది కాబట్టే రోహత్గీ లాంటి పెద్ద లాయర్‌ను పెట్టుకున్నారు. డబ్బు, పలుకుబడి ఉంది కాబట్టే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అన్యాయం జరుగుతుంటే కోర్టు కళ్లు మూసుకుని ఉండకూడదు. అలాగని కళ్లు మరీ పెద్దవి చేసుకుని చూడకండి. సెక్షన్ 136 కింద సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దు. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చిన్నవిగా చూడకూడదు. కోవిడ్ వాలంటీర్లను తన్నాలన్న వ్యాఖ్యలు మామూలివి కావు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు రగిల్చే వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును వేరేగా ఎలా చూస్తారు? ఇవే విద్వేషపూరిత వ్యాఖ్యలు సాధారణ వ్యక్తి చేసి ఉంటే.. కోర్టు ఒక్క సెకను కూడా ఆయన వాదన వినేది కాదు. మెరిట్ చూస్తే ఈ బెయిల్ పిటిషన్ వెంటనే కొట్టేయాలి. కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. రాజద్రోహం కేసులో బెయిల్ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ అల్లర్లు, భీమాకోరేగావ్, హత్రాస్ కేసుల్లో చాలామంది ఎదురుచూస్తున్నారు.. వాళ్లకు బెయిల్ ఇవ్వొద్దని రోహత్గీనే వాదిస్తున్నారు. బీమాకోరేగావ్ కేసు, ఈ కేసులో ఒకే తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలున్నాయి. ఆ కేసులో రాజద్రోహం సరైందని కోర్టు చెప్పినప్పుడు...ఈ కేసును వేరేగా ఎలా చూస్తారు?. ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బెయిల్ ఇచ్చే అవకాశం లేదు.గతంలో చీఫ్ జస్టిస్‌గా ఉన్న బాబ్డే.. కేరళకు సంబంధించిన కేసులో.. బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. ఇటీవల అసోంలో జైలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అఖిల్ గొగోయ్.. బెయిల్ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. విచారణాధికారిపై హైకోర్టు ధిక్కరణ నోటీసు సస్పెండ్ చేయాలి’’ అని లాయర్ దవే న్యాయస్థానానికి విన్నవించారు. చదవండి: రఘురామకృష్ణంరాజు కేసు: కొట్టారన్నది కట్టు కథే సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామకృష్ణరాజు -
అన్నీ పరిశీలించాకే రాజద్రోహం కేసు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం గురువారం కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్రంలో పలు వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని పెంచేలా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని పేర్కొంది. రఘురామ ప్రసంగాలన్నీ పరిశీలించిన తర్వాతే రాజద్రోహం కేసు నమోదు చేసినట్లు తెలిపింది. పలు కేసుల్లో రాజద్రోహానికి సంబంధించి ఇదే కోర్టు బెయిలు నిరాకరించిందని తెలిపింది. హార్దిక్ భారతీభాయ్ పటేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, అఖిల్ గొగొయ్ వర్సెస్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, గౌతమ్ నవలఖా వర్సెస్ ఎన్ఐఏ, సుధా భరద్వాజ్ వర్సెస్ ఎన్ఐఏ వంటి కేసుల్లో కోర్టు ఆదేశాలు ఇచ్చిందని కౌంటర్లో పేర్కొంది. హైకోర్టు కూడా ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించిన నేపథ్యంలో రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది. రఘురామ పిటిషన్లో మెరిట్స్ లేవని పేర్కొంది. రాష్ట్రంలో కులం, మతం ఆధారంగా అశాంతి సృష్టించడానికి పలువురు వ్యక్తులతో కలసి కుట్ర చేశారని, ఈ నేపథ్యంలో పిటిషనర్‌పై చర్యలు తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి వేరే మార్గం లేదని పేర్కొంది. భావ ప్రకటన స్వేచ్ఛలోనే శాంతి భద్రతలకు భంగం కలిగించరాదన్న విషయం అంతర్గతంగా ఉంటుందని, అలజడి సృష్టిస్తున్న వ్యక్తులపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేయవచ్చని చెప్పింది. జ్యుడిషియల్ కస్టడీలోనూ పిటిషనర్ ప్రెస్‌మీట్ పెట్టడానికి వెనకాడలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టాలని చూశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. రాష్ట్రంలో అలజడి సృష్టించే కుట్రలో పిటిషనర్‌తో పాటు సహ కుట్రదారుల పాత్రనూ విచారించాల్సి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రఘురామను పోలీసు కస్టడీకి ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది. రఘురామ దాఖలు చేసిన బెయిలు పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయగా.. ఎ.సుబ్బారాయుడు అనే వ్యక్తి ఇంప్లీడ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. చదవండి: రఘురామకృష్ణరాజు కేసు: కొట్టారన్నది కట్టు కథే చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా: మిథున్‌రెడ్డి -
రఘురామకృష్ణరాజు కేసు: కొట్టారన్నది కట్టు కథే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుతాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర పన్నిన కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తనను పోలీసులు కొట్టినట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టమవుతోంది. బెయిల్ రాకపోవడం, కుట్రదారులను నిగ్గు తేల్చేందుకు క్షుణ్నంగా విచారణ జరుగుతుండటంతోనే ఆయన ఈ ఎత్తుగడ వేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాలి నరాల సమస్య... ఎంపీ రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలేవీ లేవని నిర్థారిస్తూ హైకోర్టు నియమించిన మెడికల్ బోర్డు ఇప్పటికే న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. రఘురామకృష్ణరాజు శరీరంపై తాము గుర్తించిన అంశాలేవీ ఆయన ఆరోపిస్తున్నట్లుగా కొట్టడం వల్ల ఏర్పడినవి కావని కూడా బోర్డు నివేదిక స్పష్టం చేసింది. ఆయన రెండు పాదాల్లో నీరు చేరడం (ఎడిమా)తో వాచినట్లు వైద్యులు నిర్ధారించారు. అందువల్లే ఆయన అరికాళ్లు రంగు మారాయని పేర్కొన్నారు. మరోవైపు ఆయనకు ముందు నుంచీ ఉన్న నరాల సంబంధిత సమస్యతో కాలి పిక్కల వద్ద నరాల పనితీరులో ఇబ్బందులు తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు. అదే విషయాన్ని నివేదికలో పేర్కొన్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, కిడ్నీ వ్యాధి నిపుణులు ఆయన్ను పరిశీలించారని బోర్డు నివేదికలో స్పష్టం చేసింది. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలూ లేవని కూడా తేల్చి చెప్పింది. చదవండి: చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రఘురామ డ్రామాలు: అంబటి రఘురామకృష్ణరాజు తీరుపై మండిపడ్డ క్షత్రియ నేతలు -
హైదరాబాద్‌కు రఘురామకృష్ణరాజు
సాక్షి, గుంటూరు : ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన్ని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. కాగా, రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగానే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. జ్యుడీషియల్ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. జ్యుడీషియల్ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు తెలిపింది. వైద్య ఖర్చులను మొత్తం రఘురామకృష్ణరాజే భరించాలని పేర్కొంది. వైద్య పరీక్షలను వీడియోతో చిత్రీకరించాలని సూచించింది. సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. -
ఆర్మీ ఆసుపత్రికి రఘురామకృష్ణరాజు
సాక్షి, ఢిల్లీ: రఘురామకృష్ణరాజు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగానే రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. జ్యుడీషియల్ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. జ్యుడీషియల్ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు తెలిపింది. వైద్య ఖర్చులను మొత్తం రఘురామకృష్ణరాజే భరించాలని పేర్కొంది. వైద్య పరీక్షలను వీడియోతో చిత్రీకరించాలని సూచించింది. సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని సుప్రీంకోర్టుకు సీఐడీ లాయర్ దుష్యంత్ దవే తెలిపారు. సీనియర్ జ్యుడీషియల్ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలకు సిద్ధమని పేర్కొన్నారు. సమీపంలో ఆర్మీ ఆస్పత్రులున్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, 300 కి.మీ. దూరంలో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి ఉందని, విశాఖలో నేవీ ఆస్పత్రి కూడా 300 కి.మీ దూరంలో ఉందని లాయర్ రావు తెలిపారు. విశాఖలో తుఫాను పరిస్థితులున్నాయని.. కేంద్రం ఆధీనంలోని మంగళగిరి ఎయిమ్స్ అన్నింటికంటే దగ్గరగా ఉందని లాయర్ దవే వివరించారు. రఘురామకృష్ణరాజుకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అభ్యంతరం లేదన్నారు. వాదనలు విన్న కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. వాదనలు శుక్రవారం వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. చదవండి: అసలు కుట్ర బయటపడకుండా పక్కదోవ పట్టించేందుకే?! ఒంటిపై గాయాలేవీ లేవు -
చంద్రబాబు డైరెక్షన్లోనే ఇదంతా: మిథున్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: రఘురామకృష్ణంరాజు చర్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. బాబు డైరెక్షన్లోనే రఘురామ పని చేస్తున్నారని, బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ..‘‘రఘురామకృష్ణంరాజు అకారణంగా ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. కుటుంబసభ్యులను కూడా పావులుగా వాడుకుంటున్నారు. ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్డ్ చేసేందుకు యత్నిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ నేతలు అరెస్టైనప్పుడు కూడా ఇంత హడావిడి చేయని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం హైరానా పడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు కొట్టలేదని వైద్య బృందమే కోర్టుకు నివేదిక ఇచ్చిందన్న మిథున్‌రెడ్డి.. కేవలం రమేష్ ఆస్పత్రిలోనే ట్రీట్మెంట్ జరగాలనడం సరికాదని పేర్కొన్నారు. అసత్య ఆరోపణలు చేశారు: బాలశౌరి ఎంపీ కాకముందే రఘురామకృష్ణరాజు ఐదుసార్లు పార్టీ మారారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి అన్నారు. పార్టీలో రఘురామకృష్ణరాజుకు సముచితస్థానం ఇచ్చామని, అయినప్పటికీ సీఎం, మంత్రులపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని, పోలీసులు కొట్టారంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. టీడీపీ స్క్రిప్టు ప్రకారమే: శ్రీకృష్ణ దేవరాయలు రఘురామకృష్ణరాజు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. టీడీపీ స్క్రిప్ట్‌ను రఘురామకృష్ణరాజుతో చదివిస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పిందే రఘురామకృష్ణరాజు చేస్తున్నారన్న ఎంపీ.. . ట్రీట్మెంట్ కోసం రమేష్ ఆస్పత్రికే ఎందుకు తీసుకెళ్లాలని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. చదవండి: రఘురామకృష్ణంరాజు ఒంటిపై గాయాలేవీ లేవు -
చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రఘురామ డ్రామాలు: అంబటి
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్క్రిప్ట్ ప్రకారమే ఎంపీ రఘురామకృష్ణరాజు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రఘురామకృష్ణరాజు విమర్శలే పనిగా పెట్టుకున్నారు. TV5, ఏబీఎన్‌తో కలిసి రఘురామకృష్ణరాజు కుట్ర పన్నారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని రఘురామకృష్ణరాజు కుట్ర చేశారు. ఆయన అరెస్ట్‌పై ఎల్లో మీడియా బాధపడిపోతుంది. ఒక ఎంపీని పోలీసులు ఎక్కడైనా కొడతారా?. కులాలను, మతాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యవహరించారు. సామాన్యుడైనా, పార్లమెంట్ సభ్యుడైనా చట్టం ముందు సమానమే’’నని అన్నారు. -
రఘురామ.. ఖైదీ నంబర్ 3468
సాక్షి, గుంటూరు, అమరావతి : నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు ఆదివారం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు 3468 నంబర్‌ను కేటాయించారు. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, ఓ మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడు అయిన ఎంపీకి గుంటూరు సీఐడీ కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను జైలుకు తరలించారు. జైలులోని పాత బ్యారక్‌లో గల ఓ సెల్లో ఆయన్ను ఉంచారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు సీఐడీ పోలీసులు శనివారం రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో హాజరు పరచగా తనపై పోలీసులు దాడి చేశారని జడ్జికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎంపీ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గుంటూరు జీజీహెచ్ వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు శనివారం రాత్రి రఘురామకృష్ణరాజును పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వంలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ డాక్టర్ సుబ్బారావులు సభ్యులుగా ఏర్పాటైన మెడికల్ బోర్డు ఎంపీకి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ స్కానింగ్, కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్, చర్మ వ్యాధులకు సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. అనంతరం నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్ భవనంలోని రెండో అంతస్తులోని గదిలోకి ఆయన్ను తరలించారు. ఆదివారం కూడా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్లో డాక్టర్ ప్రభావతి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మెసెంజర్ ద్వారా మెడికల్ బోర్డు నివేదికను హైకోర్టు ధర్మాసనానికి పంపించారు. అనంతరం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఎంపీని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘురామ కాల్ డేటాపై సీఐడీ కన్ను నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు చెందిన కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్‌లపై సీఐడీ దృష్టి పెట్టింది. ఎంపీకి టీడీపీ పెద్దలు, టీడీపీ అనుకూల మీడియా కీలక వ్యక్తులు ఫోన్ల ద్వారా టచ్‌లో ఉన్నట్టు సీఐడీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. వారు పలు కీలక విషయాలపై డైరెక్షన్ ఇచ్చినట్టు గుర్తించింది. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్ఐర్లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. రఘురామకృష్ణరాజును అధికారులు సీబీసీఐడీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు. కోర్టు ఈ నెల 28 వరకు రఘురామకృష్ణరాజు రిమాండ్‌కు అనుమతి ఇచ్చింది. -
రఘురామకృష్ణరాజు తీరుపై మండిపడ్డ క్షత్రియ నేతలు
సాక్షి, పశ్చిమ గోదావరి: ఎంపీ రఘురామకృష్ణరాజు తీరును క్షత్రియ నాయకులు తప్పుపట్టారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆదివారం భీమవరంలో క్షత్రియ సమాఖ్య ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో భీమవరం, పాలకొల్లు, గణపవరం, తణుకు, తాడేపల్లి గూడెం క్షత్రియ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షత్రియ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, క్షత్రియులపై గౌరవంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో 3 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఇచ్చి గౌరవించారన్నారు. రఘురామకృష్ణరాజుకు క్షత్రియ సేవాసమితి ఎలాంటి మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రభుత్వానికి, రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. ఇందులో క్షత్రియ కులాన్ని కలపొద్దని.. తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రఘురామకృష్ణరాజుకు స్థానిక ఎమ్మెల్యేలతో సఖ్యత లేదని.. స్వలాభం, ఆస్తులు కాపాడుకోవడానికే ఆయన మాట్లాడుతున్నారని క్షత్రియ నాయకులు దుయ్యబట్టారు. రఘురామ మాట్లాడే విధానం, పద్ధతి అపహస్యంగా ఉందని మండిపడ్డారు. ‘‘గడిచిన 14 నెలలుగా ఒక్కసారి కూడా సొంత నియోజకవర్గానికి రాలేదు. హైదరాబాద్, ఢిల్లీలో మకాం పెట్టి రోజుకో కులాన్ని దూషిస్తున్నాడు. ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేసే ఎవ్వరికీ సపోర్ట్ చేయమని’’ క్షత్రియ నాయకులు స్పష్టం చేశారు. చదవండి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు? -
ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు
సాక్షి, గుంటూరు: జీజీహెచ్‌లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య వైద్య నిపుణుల కమిటీ నివేదిక సిద్ధం చేస్తున్నారు. నివేదికను హైకోర్టుకు వైద్య నిపుణుల కమిటీ సమర్పించనుంది. నివేదికలో ఏముంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ ముందుకు సాగనుంది. కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ 12/2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్ఐర్లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. ఇది ఇలా ఉండగా, ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీబీసీఐడీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 28 వరకు రిమాండ్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయనను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. రఘురామకృష్ణరాజును అధికారులు సీబీసీఐడీ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. సీఐడీ పోలీసులు ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు రఘురామను హాజరుపర్చారు. సీఐడీ న్యాయమూర్తి ముందు ఏ1గా ఆయన్ని ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తికి అందజేశారు. రఘురామ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. రఘురామ అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. చదవండి: ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు? రఘురామకృష్ణరాజు అనుకున్నదొక్కటి.. అయింది మరొకటి -
రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై కేసు నమోదు: సీఐడీ
సాక్షి, గుంటూరు: పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ 12/2021 నమోదు చేశారు. A1గా రఘురామకృష్ణరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్ ఛానల్‌ను సీఐడీ ఎఫ్ఐర్లో పేర్కొంది. సీఐడీ డీఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. రఘురామపై అభియోగాలను సీఐడీ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. అదేవిధంగా ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా రఘురామ వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన చేష్టలు ఉన్నాయని తెలిపింది. కుల, మత, వర్గాలను టార్గెట్ చేసుకుని, టీవీ5, ABNతో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్టు పేర్కొంది. టీవీ5, ఏబీఎన్ రఘురామకృష్ణరాజు కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించాయని, ఆయనతో కలిసి ప్రభుత్వంపై విషంజిమ్మించాయని సీఐడీ తెలిపింది. పక్కా పథకం ప్రకారమే రఘురామ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని పేర్కొంది. ఎఫ్ఐఆర్ 12/2021లో రఘురామ, TV5, ABN కుట్రను సవివరంగా సీఐడీ పేర్కొంది. రఘురామకృష్ణరాజు, TV5, ABNలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కించపరిచినందుకు CRPC 124 (A) సెక్షన్, కుట్రపూరితమైన నేరానికి పాల్పడినందుకు 120 (B) IPC సెక్షన్, కులాలు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినందుకు 153 (A), బెదిరింపులకు పాల్పడినందుకు CRPC 505 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. చదవండి: ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ -
ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు
-
ఎవరి ప్రోదల్బంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు: సీఐడీ
సాక్షి, గుంటూరు: నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును శుక్రవారం అర్ధరాత్రి వరకు సీఐడీ అధికారులు విచారించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో జరిగిన విచారణలో భాగంగా డీఐజీ సునీల్ పలు కోణాల్లో ప్రశ్నించారు. మొదటగా రఘురామకృష్ణరాజుకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విచారించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎందుకు కుట్రపన్నారని, ఎవరి ప్రోదల్బంతో.. పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించింది. ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా ఎందుకు వ్యాఖ్యలు చేశారంటూ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. విచారణలో కొన్ని కీలక అంశాలను రాబట్టారు. రఘురామకృష్ణరాజు వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. సాంకేతిక సహకారం అందించిన వారి గురించి సీఐడీ అధికారులు కూపీ లాగినట్లు సమాచారం. ఇక అధికారులు కాసేపట్లో సీఐడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. మరోసారి రఘురామకృష్ణరాజును సీఐడీ విచారించనుంది. చదవండి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ -
సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే ఇదంతా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ బాపట్ల లోక్ సభ సభ్యుడు నందిగం సురేష్.. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై విరుచుకుపడ్డారు. పార్టీ అధ్యక్షుడిపైన పిటిషన్ వేయగానే టీడీపీ వాళ్లు నానా హైరానా చేశారని, మరి అదే పిటిషన్ కొట్టి వేస్తే మాత్రం టీడీపీ, పచ్చ మీడియా నోరు మెదపలేదన్నారు. రఘురామకృష్ణంరాజు తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని లోక్ సభ స్పీకర్‌కు చెప్పారని, మరి తన పార్టీ అధ్యక్షునిపై పిటిషన్ వేసిందాన్ని ఏమంటారో ఆయనకే తెలియాలని అన్నారు. ఆయన ఎన్ని ఫిర్యాదులు చేసినా, పిటీషన్లు వేసినా ఉపయోగం ఉండబోదని స్పష్టం చేశారు. సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం కాదా ఇలాంటి పనులు చేస్తున్నావంటూ ప్రశ్నించారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాముడని ప్రజలే తేల్చారన్నారు. అందుకే 151 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. రఘురామకృష్ణంరాజు రాక్షసులతో కలిసి పనిచేస్తున్నారని, వాళ్లకి ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్పారన్నారు. ఇక నైనా ఆ విషయాన్ని ఆయన తెలుసుకుని నడుచుకుంటే మంచిదని హితవు పలికారు. ‘ఢిల్లీలో కూర్చొని వైఎస్సార్సీపీ ఎంపీ అని చెప్పుకుని మాట్లాడటం కాదు. దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలి’ అంటూ సవాల్ విసిరారు. ఎప్పటికైనా ఆయనకు తగిన శాస్తి జరగక తప్పదని జోష్యం చెప్పారు. ( చదవండి: పవన్ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి కూడా ) -
లోపల తాగటం, బయట వాగటం రఘు రామకృష్ణంరాజుకు అలవాటు
-
రఘురామరాజు సెక్యూరిటీ తొలగించండి
-
తొట్లకొండకు ముప్పు: ఖండించిన అవంతి
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న స్టేట్ గెస్ట్ హౌస్‌కు, తొట్లకొండకు ఎటువంటి సంబంధం లేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ నిర్మాణం వల్ల తొట్లకొండకి ఎటువంటి ముప్పు లేదని, చంద్రబాబుతో పాటు కొన్ని పచ్చమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలని ఖండిస్తున్నామన్నారు. చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విశాఖపట్నంలో మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ధనం వృధాగా ఖర్చు కాకూడదనే ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తిరుపతి, విశాఖ, విజయవాడలలో గెస్ట్ హౌస్‌ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, విశాఖపై అడుగడుగునా విషం చిమ్ముతున్న చంద్రబాబు.. ఆయన హయాంలో ఒక్క గెస్ట్ హౌస్ అయినా కట్టారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రొటోకాల్ పేరుతో రూ. 23 కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇకపై కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా..) చంద్రబాబుకు దళితుల గురించి మాడ్లాడే అర్హతే లేదని మంత్రి అవంతి పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చినా, ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కనిపించరని ఎద్దేవా చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయనకు అమరావతిపై ప్రేమ ఉంటే గాజువాక నుంచి ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలి, గానీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకూడదా? అని నిలదీశారు. గాజువాక ప్రజల ఓట్లు వేయించుకుని విశాఖకి పరిపాలనా రాజధానిని పవన్ కళ్యాణ్ ఎలా వ్యతిరేకిస్తారన్నారు. ఇక తొట్లకొండ ఎక్కడుందో తెలియకుండా ఎలా మాట్లాడతారని రఘురామకృష్ణంరాజును ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర గురించి మాడ్లాడేటపుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. ఆయనకు నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాజుకు పలుకుబడుంటే నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్ కోసం ప్రయత్నించాలని సూచించారు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దని రఘురామకృష్ణంరాజుకు అవంతి హితవు పలికారు. (చంద్రబాబుకు సామినేని సవాల్..) -
‘మనసా, వాచా ఆయన వైఎస్సార్సీపీతో లేరు’
-
‘మనసా, వాచా ఆయన వైఎస్సార్సీపీతో లేరు’
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణంరాజు నైతిక విలువలు కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిపారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం మీడియాతో మాట్లాడింది. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీలో ఉంటూనే ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతూ రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. (చదవండి: పరారీలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర!) పార్టీ నేతలను దూషిస్తూ ప్రతిపక్షాలతో లాలూచీపడినట్లుగా ప్రవర్తించారు. ఆయనకు ఏమైనా అనుమానాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించి ఉండాల్సింది. ఇబ్బందులు ఏమైనా ఉంటే పార్టీ అధ్యక్షుడికి తెలియజేయాలి. పార్టీ నియమావళి, క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలున్నాయి. ఊహాజనితమైన విషయాలను ఊహించుకుని దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారో ఆ పార్టీపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఏవో లాభాలను ఆశించే ఇతర పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మనసా, వాచా అతను వైఎస్సార్సీపీతో లేరు. స్వపక్షంలో విపక్షంలా రఘురామకృష్ణంరాజు వ్యవహరించారు’అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి రఘురామకృష్ణంరాజుకు సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. టీటీడీ వివాదంపై చైర్మన్‌తో గానీ, ఈఓతోగానీ రఘురామకృష్ణంరాజు చర్చించనిదే... టీటీడీ భూముల అమ్మకాలు జరిగిపోయినట్లుగా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఆయన ఇచ్చిన వివరణలో నిజాయితీ లేదని ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు కుంటిసాకులు మానుకోవాలని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. రాబోయే ఉపఎన్నికల్లో ఎవరి ఫొటోకు వ్యాల్యూ ఉందో తెలుస్తుందని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. బడగు బలహీనవర్గాల ప్రజలు తెలుగు మీడియంలో చదవాలా?’అని ఎంపీ భరత్ రఘురామకృష్ణంరాజును ప్రశ్నించారు. (రఘురామకృష్ణంరాజుపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు) -
స్పీకర్ ఓం బిర్లాను కలిసిన ఎంపీల బృందం
సాక్షి, న్యూఢిల్లీ: సొంత పార్టీ నేతలపై విమర్శలు, నిరాధార ఆరోపణలు చేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై క్రమశిక్షణా చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రంగం సిద్ధం చేసింది. దీనిలో బాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఆ పార్టీ ఎంపీల బృందం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. ఎంపీల బృందంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి, ఎంపీలు నందిగం సురేష్, లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్ ఉన్నారు. ఇక రఘురామకృష్ణంరాజుకు ఇప్పటికే పార్టీ నుంచి షోకాజు నోటీసు అందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. (చదవండి: ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు) -
‘రఘురామ కృష్ణంరాజుకు అందుకే నోటీసు ఇచ్చాం’
సాక్షి, విశాఖపట్నం: పార్టీ నియమాలను ఎవరు ఉల్లంఘించినా, ఎంత పెద్దవారైనా క్రమశిక్షణా చర్యలు తప్పవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీడియాలో మాట్లాడిన వ్యవహారాలపైనే షోకాజ్ నోటీస్ ఇచ్చామని తెలిపారు. బుధవారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇతర ఎంపీలకంటే ఎక్కువే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రఘురామ కృష్ణంరాజుకి విలువ ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ వల్లే ఆయనకు పదవులు లభించాయని అన్నారు. పార్టీ నియమాలను పాటించకపోవడం వల్లే రఘురామ కృష్ణంరాజుకి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టినా పార్టీకలతీతంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అసభ్యకరంగా మహిళల పట్ల పోస్టులు పెట్టడం వల్లే చర్యలు తీసుకున్నామని, అసభ్యకరంగా కాకుండా విమర్శనాత్మకంగా ఉంటే ఫరవాలేదని అన్నారు. డీజీపీకి లేఖ రాశాం ‘నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి గతంలో ఒక రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్నారు. రాజ్యాంగ బద్ద పదవికి నిమ్మగడ్డ అనర్హుడు. చంద్రబాబు డైరక్షన్లోనే నిమ్మగడ్డ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్ధాయి దర్యాప్తు జరగాలి. విచారణ చేయాలని గతంలోనే డీజీపీకి లేఖ రాశాం. టీడీపీ ఎంపీ రాసిన లేఖనే నిమ్మగడ్డ కేంద్రానికి పంపారని గతంలోనే ఆరోపించా. సుజనాతో నిమ్మగడ్డకి ఏం పని. సుజనా చౌదరికి, నిమ్మగడ్డ మధ్య ఏం వ్యాపార లావాదేవీలు ఉంటాయి’అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. (చదవండి: ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు) -
రఘురామ కృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు
సాక్షి, తాడేపల్లి : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలపై నిరాధార ఆరోపణలు చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వం, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడంపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు.. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి మీరు గెలుపొందారు. అంతేగాక సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో పార్టీ, ప్రభుత్వంపై మీరు చేసిన వ్యాఖ్యలు ప్రకటనలు.. పార్టీ సభ్యుడిగా ఉండటం పట్ల మీ అయిష్టతను తెలియజేస్తున్నాయి. పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండకుండా.. వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్గానం చేసింది. మెజారిటీ ప్రజలు ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. అయితే మీరు మాత్రం ఎన్నికల మేనిఫెస్టోకు విరుద్ధంగా.. ఈ విషయంలో వైస్సార్సీపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారని ఈనాడు, ఆంధ్రజ్యోతి వరుసగా నవంబరు 19, నవంబరు 20, 2019 తేదీల్లో పత్రికల్లో ప్రచురించాయి. ఈ విషయంపై వివిధ స్థాయిల్లో పార్టీ వివరణ కోరింది. ఇక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోచుకుంటున్నారంటూ మీరు చేసిన నిరాధార వ్యాఖ్యలను ఈనాడు జూన్ 16, 2020న ప్రచురించింది. అదే విధంగా ఆంధ్రజ్యోతి సైతం జూన్ 15, 2020న మీ పేరును ఆపాదిస్తూ ఓ కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. ఎంపీగా మీ విజయానికి వైఎస్సార్సీపీ లేదా వైఎస్ జగన్మోహన్రెడ్డి కారణం కాదని మీరు అన్నారు. బతిమిలాడితేనే పార్టీలో చేరానని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘‘ఎవ్వరి నాయకత్వం నాకు కావాలి? బొచ్చులో నాయకత్వం?’’ వంటి పదాలు ఉపయోగించి ప్రాథమిక నిబంధనలు అతిక్రమించారు. ఈ పరిణామాలన్నీ మీరు పార్టీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుపుతున్నాయి. అదే విధంగా అధికార వికేంద్రీకరణ నేపథ్యంలో మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మీరు వివిధ టీవీ షోల్లో విమర్శించారు. అంతేగాక సొంతపార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఓ టీవీ డిబేట్లో మిమ్మల్ని మీరు సింహంగా అభివర్ణించుకోవడమే గాకుండా.. విశ్వసనీయత ప్రదర్శిస్తున్న ప్రజాప్రతినిధులను పందులతో పోల్చారు. సహచర సభ్యులను తక్కువ చేసి మాట్లాడారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మీరు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్చందంగా వదులుకోవడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మీ మాటలు, చేతలను బట్టి ఇలా భావించాల్సి వస్తోంది. కాబట్టి ఈ విషయాలపై స్పందించేందుకు మీకు ఏడు రోజుల గడువు ఇస్తున్నాం. లేనిపక్షంలో పార్లమెంటరీ పార్టీ.. చట్ట ప్రకారం తదుపరి చర్యలకు సిద్ధమవుతుంది’’ అని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నాయకుడు, పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి పేరిట జారీ చేసిన షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఇందుకు వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగులను కూడా జోడించారు. -
రెండేళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి..
సాక్షి, నరసాపురం: జిల్లాలో గోదావరి చెంత నుంచి శుద్ధి చేసిన జలాలను పైపులైన్ ద్వారా సరఫరా చేసేందుకు ప్రణాళిక ఆమోదం పొందిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 3,670 కోట్లతో ఈ పథకం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసిందని చెప్పారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తోన్న పశ్చిమగోదావరి జిల్లా ప్రజల కల నిజం కాబోతుందని.. రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతికి ఇచ్చిన కానుక అని పేర్కొన్నారు. వాటర్ సప్లైకి ప్రతి ఇంటికి మీటర్ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. -
సీఎంపై మతవాది ముద్రవేయడం దారుణం: ఎంపీ
సాక్షి, పశ్చిమ గోదావరి: పవిత్ర క్షేత్రమైన తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిపోతున్నదని రాష్ట్రప్రభుత్వంపై టీడీపీ నేతలు విషప్రచారం చేయడాన్ని నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు తీవ్రంగా ఖండిచారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అన్యమత ప్రచార టికెట్లు ముద్రితమయ్యాయని అన్నారు. గతంలో ప్రింటు చేసిన టికెట్లను కుట్రపూరితంగా తిరుపతి రూట్లో పెట్టారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం అమిరం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ తప్పిదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూపి ఓర్వలేకనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయనపై మతవాది అని ముద్రవేయడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్టీసీ బస్ టిక్కెట్లు జారీ చేసే టిమ్ రోల్స్ వెనుక భాగంలో టీడీపీ సర్కారు పథకాలతో పాటు జెరూసలేం, హజ్ యాత్రలకు సంబంధించిన ప్రచారాంశాలను ముద్రించిన విషయం తెలిసిందే. తాజాగా దానిని సాకుగా చూపి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కుట్రకు పాల్పడుతున్నారు. ఆ టికెట్లను టీడీపీ ప్రభుత్వమే ముద్రించిందన్న విషయం సాక్ష్యాలతో సహా బైటపడడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తిరుమలలో బస్ టికెట్లపై అన్యమత ప్రచార ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. రైల్వే మంత్రికి ధన్యవాదాలు.. విశాఖపట్నం, విజయవాడ ఉదయ్ సూపర్‌పాస్ట్ డబుల్ డెక్కర్ రైలు ఈనెల 26న ప్రారంభవుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తమ వినతి మేరకు తాడేపల్లిగూడెంలో హోల్ట్ ఇచ్చారని, ఈ సందర్భంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
‘గోదావరి జిల్లా వాసుల కల నిజం చేస్తా’
పశ్చిమ గోదావరి: నరసాపురం నుంచి సఖినేటిపల్లి వరకు పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలను కలిపే ‘వశిష్ట వారధి’ నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని నరసాపురం వైఎస్సార్సీపీ ఎంపీ కె.రఘు రామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నో దశాబ్దాలుగా వశిష్ట వారధి.. గోదావరి జిల్లా వాసుల కలగానే మిగిలిపోయిందన్నారు. అయితే గోదావరి జిల్లా వాసుల చిరకాల కోరికను నిజం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే వశిష్ట వారధి నిర్మాణం కోసం తాజా పార్లమెంట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని వెల్లడించారు.ఈ క్రమంలో ఆక్వా సాగు కారణంగా మంచి నీరు కలుషితం జరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలుసుకున్నట్టు పేర్కొన్నారు. విజ్జేశ్వరం నుంచి పైపులైన్ ద్వారా నేరుగా అన్ని గ్రామాలకు తాగు నీరు ఇస్తూ.. మంచినీటి చెరువులకు గోదావరి జలాలను అందిస్తామని వెల్లడించారు. -
‘ఫ్యాన్ అసెంబ్లీలో.. సైకిల్ స్టాండులో.. గ్లాసు క్యాంటీన్లో’
సాక్షి, భీమవరం : చంద్రబాబును తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు ఫిక్స్ అయిపోయారని వైఎస్సార్సీపీ నేత, నటుడు పృథ్వీ అన్నారు. భీమవరంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజుతో కలిసి పృథ్వీ మీడియాతో మాట్లాడారు. రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషం అని ఖండించారు. పవన్ కళ్యాణ్‌ను రీల్ స్టార్‌గా, కేఏ పాల్‌ను టీడీపీ పాల్గా అభివర్ణించారు. నాగబాబు, పవన్‌లు మాట్లాడే భాష సరికాదన్నారు. నటన వేరు రాజకీయం వేరు అన్నారు. రాష్ట్రంలో జగన్ సీఎం కావాలని రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పులి కడుపున పులే పుడుతుంది, కానీ పప్పు పుట్టదని చమత్కరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అనర్హుడని పృథ్వీ మండిపడ్డారు. ఆయన జీవితమంతా కాపీనే అని ఎద్దేవా చేశారు. దానికి ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోనే నిదర్శనమన్నారు. ఇన్ని రోజులుగా చంద్రబాబు మేనిఫెస్టో ప్రవేశ పెట్టకుండా జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన తరువాత దాన్ని మార్పు చేసి ప్రవేశ పెట్టడమే దానికి నిదర్శనమన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్‌గా మారారని నిప్పులు చెరిగారు. 140 కిలోమీటర్ల వేగంతో ఫ్యాన్ తిరుగుతుందని, ఈ మూడు రోజులూ పరీక్షా సమయమన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచనలో మిగిలిన పార్టీలు ఉన్నాయని ధ్వజమెత్తారు. అన్ని కులాల వారు జగన్ మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని తెలిపారు. నలభై సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు చిన్న సినిమాకు భయపడటంతోనే ఆయన దైర్యమేమిటో అర్ధం అయ్యిందన్నారు. ముస్లిం ఓట్ల కోసం ఫరూక్ అబ్దుల్లాని రాష్ట్రానికి తీసుకు వచ్చారు, ఎక్కడో ఉన్న ఏనుగును కడిగి ఆంధ్రా తీసుకు వచ్చారని తూర్పారబట్టారు. ఫ్యాన్ అసెంబ్లీలో, సైకిల్ స్టాండులో, గ్లాసు క్యాంటీన్లో ఉంటుందని చెప్పారు. -
వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిపై జనసేన కార్యకర్తల దాడి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం లోక్‌సభ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు కారుపై రాళ్లతో దాడి చేశారు. సకాలంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది స్పందించి జనసేన కార్యకర్తలను చెదరగొట్టడంతో రఘురామ కృష్ణం రాజుకు ముప్పు తప్పింది. జనసేన కార్యకర్తల దాడిలో ఆయన కారు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడి నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
వైఎస్సార్సీపీ అభ్యర్థిపై జనసేన కార్యకర్తల దాడి
-
ఎంపీ అభ్యర్థిపై తప్పుడు ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, భీమవరం: భీమవరంలో ఈ నెల 29న జరిగిన సినీ అభిమానుల సంఘాల సమావేశంలో తాను మద్యం తాగి తూలుతూ మాట్లాడానని సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురాం కృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. భీమవరం పోలీస్‌స్టేషన్‌తో పాటు నరసాపురం పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్ రెడ్డిలకు రఘురాం కృష్ణంరాజు తరపున ఆయన న్యాయవాది సత్యనారాయణ ఫిర్యాదు లేఖ అందజేశారు. తన ప్రసంగాన్ని మార్ఫింగ్ కూడా చేశారని, స్లో మోషన్లో చూపిస్తూ తనపై ప్రజలకు తప్పుడు అభిప్రాయం కలిగేలా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న లింక్‌ల వివరాలను పోలీసులకు అందజేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ సామాజిక మాధ్యమాలలో కూడా తప్పుడుగా వైరల్ చేసిన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ ఛానల్ ఏబీఎన్ ఆంధ్ర జ్యోతిలో కూడా తప్పుగా ఉద్దేశపూర్వకంగా కథనం ప్రసారం చేసి తన ప్రతిష్టను దెబ్బ తీశారని లేఖలో వివరించారు. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు ప్రచారం చేస్తోన్న బాధ్యులపై సైబర్ క్రైం కింద చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. అలాగే పశ్చిమగోదావరి కలెక్టర్, ఎస్పీ, నర్సాపురం, ఏలూరు డీఎస్పీలకు సైతం రఘురాం కృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. -
వంద కార్లతో.. అదిరిపోయేలా...
ఆకివీడు: తెలుగుదేశంలో ఇమడలేక వైఎస్సార్సీపీలో చేరి మొదటి సారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన కనుమూరు రఘురామకృష్ణంరాజుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఉప్పుటేరు వంతెన వద్దకు చేరుకోగానే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పూలమాలలు, గజమాలలతో ఘనంగా సత్కరించారు. కృష్ణార్జునుల చిత్రపటాన్ని అందజేశారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం కార్ల ర్యాలీలో ఆకివీడు, అయిభీమవరం చేరుకోగానే స్థానిక ప్రజలు బ్రహ్మరధం పట్టారు. అనంతరం చెరుకుమిల్లి, ఏలూరుపాడు, జువ్వలపాలెం, కాళ్లకూరు చేరుకున్నారు. కాళ్లకూరు వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కాళ్ల మీదుగా సీసలి, జక్కరంలో మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. పెదమిరంలోని రఘురామకృష్ణంరాజు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ఉండి నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పార్టీలో చేరారు. రఘురామకృష్ణంరాజుకు స్వాగతం పలికినవారిలో నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర సలహాదారుడు పాతపాటి సర్రాజు, జిల్లా యువజనవిభాగం అధ్యక్షుడు మంతెన యోగేంద్రకుమార్, మండల కన్వీనర్లు కేశిరెడ్డి మురళీ, గులిపల్లి అచ్చారావు, నాయకులు నంద్యాల సీతారామయ్య, జగ్గురోతు విజయ్‌కుమార్, షేక్ హుస్సేన్, అంబటి రమేష్, మోరా జ్యోతి, జి.ధనరాజు, జోగి నాగరాజు, జామి శ్రీనివాస్, పుప్పాల పండు, శిరపు శ్రీనివాస్, కొత్తపల్లి నాగరాజు, కనుమూరు ఆనంద వర్మ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన రఘురామ రాజు
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ సీనియర్ నేత రఘురామ కృష్ణంరాజు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైఎస్ జగన్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలుతో పాటు పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీలో చేరిన విషయం విదితమే. తాజాగా రఘురామ కృష్ణంరాజు.. వైఎస్ జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
కోడి పందేలపై నేడు విచారణ
-
కోడి పందేల నిర్వహణపై నేడు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కోడి పందేల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం విచారించనుంది. పిటిషనర్ కనుమూరు రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది గల్లా సతీష్ ఈ పిటిషన్‌ను గురువారం ప్రస్తావించగా సోమవారం విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే అప్పటికి పండుగ పూర్తవుతుందని న్యాయవాది నివేదించగా శుక్రవారం విచారణ చేపట్టేందుకు అనుమతిచ్చారు. -
'జగన్ ఆదేశాలమేరకే సుప్రీం కోర్టులో పిటిషన్'
-
'జగన్ ఆదేశాలమేరకే సుప్రీం కోర్టులో పిటిషన్'
ఢిల్లీ: తమ నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకే తాను రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్ఆర్ సీపీ నేత రఘురామ కృష్ణంరాజు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుందని రఘురామ కృష్ణంరాజు బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లులో అనేక అంశాలు రాజ్యాంగ విరుద్ధమైనవని తెలిపారు. రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి)లో మార్పులు చేయాలంటే సగం రాష్ట్రాలు ఆమోదించాలని చెప్పారు. పోలవరం డిజైన్‌ను మార్చడం అప్రజాస్వామికం అన్నారు.