చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారమే రఘురామ డ్రామాలు: అంబటి | Raghu Rama Krishnam Raju Action Script By Chandrababu Says Ambati Rambabu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు స్క్రిప్ట్‌ ప్రకారమే రఘురామ డ్రామాలు: అంబటి

Published Sun, May 16 2021 8:31 PM | Last Updated on Sun, May 16 2021 9:26 PM

Raghu Rama Krishnam Raju Action Script By Chandrababu Says Ambati Rambabu - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్క్రిప్ట్‌ ప్రకారమే ఎంపీ రఘురామకృష్ణరాజు డ్రామాలు ఆడుతున్నారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రఘురామకృష్ణరాజు విమర్శలే పనిగా పెట్టుకున్నారు. TV5, ఏబీఎన్‌తో కలిసి రఘురామకృష్ణరాజు కుట్ర పన్నారు.

రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని రఘురామకృష్ణరాజు కుట్ర చేశారు. ఆయన అరెస్ట్‌పై ఎల్లో మీడియా బాధపడిపోతుంది. ఒక ఎంపీని పోలీసులు ఎక్కడైనా కొడతారా?. కులాలను, మతాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యవహరించారు. సామాన్యుడైనా, పార్లమెంట్‌ సభ్యుడైనా చట్టం ముందు సమానమే’’నని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement