
తాడేపల్లి: సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో రాజధానిని నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేననే విషయం స్పష్టమైందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాజధానుల విషయంలో హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీం వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని, ఇప్పటికైనా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలన్నారు. ‘ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. రాజధానుల విషయంలో హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీం వ్యాఖ్యలన బట్టి తెలుస్తోంది.
రాజధానిని నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని స్పష్టమైంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలి. న్యాయ స్థానాల పని న్యాయస్థానాలు, ప్రభుత్వం పని ప్రభుత్వం చేయాలి. ఇప్పటికైనా చంద్రబాబు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలి. అమరావతి రాజధాని పెద్ద స్కామ్..నిజమైన రైతులకు ఆందోళన అవసరం లేదు. పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో. ఆయనది జనసేన కాదు.. రౌడీసేన.. అమ్ముడిపోయిన సేన.పాతికన్నా ఎక్కవ సీట్లలో పోటీ చేస్తారా, ఎవరితో కలిసి పోటీ చేస్తారు?’ అని ప్రశ్నించారు అంబటి.
చదవండి: హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment