సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. అలాగే, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి అంబటి హితబోధ చేశారు. చంద్రబాబు నైజం అదే అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, తాజాగా మంత్రి అంబటి ట్విట్టర్ వేదికగా..
పొత్తు ధర్మమే కాదు..
ఏ ధర్మమూ పాటించని వ్యక్తే చంద్రబాబు
ఇది తెలుసుకో తమ్ముడు పవన్ కల్యాణ్!
అంటూ కామెంట్స్ చేశారు.
పొత్తు ధర్మమే కాదు
— Ambati Rambabu (@AmbatiRambabu) January 26, 2024
ఏ ధర్మము పాటించని వాడే "బాబు"
తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్!@PawanKalyan
అంతకుముందు.. టీడీపీ-జనసేనల పొత్తు ధర్మంపై పవన్ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోవడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. పోటీగా.. రెండు స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని ఆయన ప్రకటించారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తోంది. చంద్రబాబుకు ఉన్నట్లే.. నాకూ మా పార్టీలో ఒత్తిడి ఉంది. అందుకే ప్రత్యేక పరిస్థితుల్లోనే మేమూ రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాం. అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా అని పవన్ పేర్కొన్నారు.
“పొత్తుల విషయంలో చంద్రబాబు తీరుని తప్పుబట్టిన పవన్ కళ్యాణ్”
— YSR Congress Party (@YSRCParty) January 26, 2024
తెలంగాణలో చిత్తుగా ఓడి పరువు పోగొట్టుకున్న జనసేనని పొమ్మనలేక @JaiTDP ఇప్పుడు పొగ పెడుతోంది.
పొత్తు ధర్మాన్ని బ్రేక్ చేసిన చంద్రబాబు.. కనీసం @PawanKalyanతో సంప్రదింపులు చేయకుండానే మండపేటలో టీడీపీ అభ్యర్థిని… pic.twitter.com/vsOLVD4X7I
ఇది కూడా చదవండి: జనసేన పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన.. టీడీపీలో టెన్షన్!
Comments
Please login to add a commentAdd a comment