సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు ఆర్థిక బలంతో చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబుకి మద్దతుగా.. ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తోందని ధ్వజమెత్తారు. దొరకని దొంగలా ఇన్నాళ్లు చెలామణి అయిన చంద్రబాబు.. స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. రూ. 371 కోట్లు లూటీ చేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపినట్లు చెప్పారు.
సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్ర నిరాశకు గురిచేసిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. హైకోర్టులో కూడా 17 ఏ ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పని వాదించారని ప్రస్తావించారు. ఈ కేసును కొట్టివేయాలని కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారని అన్నారు. వంద కారణాలు చెప్పి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారని దుయ్యబట్టారు.
చదవండి: రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని కోర్టు చెప్పింది: పొన్నవోలు
‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాగా దిట్ట. దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. జైల్లో ఉంటేనే చంద్రబాబు ఆరోగ్యం బాలేదా? ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డులోనూ వందల కోట్లు కాజేశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో కూడా అడ్డంగా బుక్కయ్యారు.
చంద్రబాబు, లోకేష్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్స్. వైఎస్సార్‌సీపీని ఓడించే సత్తాలేక.. ప్రతి ఒక్కరితో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు అవినీతి ప్రజలకు అర్ధమైంది. చట్టం నుంచి ఆయన తప్పించుకోలేరు. పవన్ క్యలాణ్ కుడా అవినీతి పరుడే. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి అనుకూలంగా పవన్ మద్దతు ఇస్తుంటాడు’ అని అంబటి మండిపడ్డారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment