Lokesh Babu
-
Lella Appi Reddy: యువత పోరు విజయవంతం
-
ఆదోని త్రీ టౌన్ పీఎస్ లో పోసానిపై అక్రమ కేసు నమోదు
-
Gudivada Amarnath: ఎన్నికలకు ముందు మావోడు.. ఓడిపోయాక పరాయివాడా..?
-
YSRCP ఎమ్మెల్సీల ఆందోళనతో దిగొచ్చిన లోకేష్
-
లోకేష్ కన్నా వంశీ, నాని గ్లామర్ గా ఉన్నారని బాబుకి కుళ్లు!
-
ఆంధ్రప్రదేశ్ అప్పు లపై కూటమి సర్కారు తప్పుడు ప్రచారం
-
గుడివాడ టీడీపీ నేత తులసి బాబుపై టీడీపీ డ్రామాలు
-
దావోస్ వైఫల్యంపై సీఎం చంద్రబాబు బుకాయింపు
-
రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం
-
నారా లోకేష్ కు మద్దతు ప్రకటించని హోంమంత్రి అనిత
-
క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే గౌతు శిరీష
-
ఉల్లాసం... ఉత్సాహం
దాసరి లోకేశ్‌బాబు, శిరీష నులు జంటగా నటిస్తున్న సినిమా ‘ఉల్లాసంగానే ఉత్సాహంగానే.’. కేవీజీ రాజు దర్శకత్వంలో మైత్రీ క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ ఉమా మహేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో లోకేశ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక మంచి లవ్‌స్టోరీ. ఫీల్‌గుడ్ అంశాలతోపాటు అన్ని కమర్షియల్ హంగులు ఉన్న ఈ సినిమా మా టీమ్ అందరికీ సక్సెస్ ఇస్తుందని నమ్మతున్నాను’’ అన్నారు.‘‘లోకేశ్ ఎనర్జిటిక్‌గా నటించాడు. ఈ సినిమా విషయంలో మా నిర్మాతల సాయం మర్చిపోలేనిది’’ అని తెలిపారు కేవీజీ రాజు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు ఉమా మహేశ్వరరావు. ఈ సినిమా సహ నిర్మాతలు ఎండీ కలామ్, ఖదీర్, నటుడు జబర్దస్త్ ప్రవీణ్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడారు. -
ఇవాళ మరో కార్యకర్త పోలీసులు అరెస్ట్ చేశారు : అంబటి
-
జనసేన, టిడిపి ట్రోలర్సిన్ని ఇరికించిన ఈనాడు..
-
Ambati Rambabu: ఇది కదా ఉన్మాదుల కర్మాగారం అంటే..
-
కూటమిలో పవన్ స్థాయి అది: ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖపట్నం, సాక్షి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వం మండిపడ్డారు. రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వం 100 మందిని అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ సీఎం చంద్రబాబు చేసే పాపాలు నాగుపాములై లోకేష్‌ను కాటేస్తాయి. చంద్రబాబు చేసే పాపానికి పదింతలు శిక్ష లోకేష్ అనుభవిస్తారు. అధికారం శాశ్వతం కాదనే అంశాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంగించి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. పవన్ కళ్యాణ్‌ను కూటమిలో ద్వితీయ శ్రేణి పౌరునిగా చూస్తున్నారు. అధికారంలోకి రాక ముందు పవన్ కళ్యాణ్ కాళ్లు లోకేష్ పట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పిన మాట వినోద్దు అంటూ అధికారులకు లోకేష్ చెబుతున్నారు. లోకేష్ కోసం పవన్ కళ్యాణ్‌ను, కాపు జాతిని చంద్రబాబు తొక్కి పెడుతున్నారు. పవన్‌పై మందకృష్ణ మాదిగ విమర్శలు చంద్రబాబు మార్కు రాజకీయానికి నిదర్శనం. లోకేష్ రాజకీయ ఎదుగుదల కోసం పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు తొక్కిపెడుతున్నారు. లోకేష్‌ను సీఎం చేయడం కోసం 25 శాతం ఉన్న కాపులను పవన్ కళ్యాణ్‌ను ప్రణాళిక బద్ధంగా పక్కకుపెడుతున్నారు. ఋషికొండ అద్భుతమైన కట్టడం.. ఆ భవనం రాష్ట్రానికి తలమానికం. రుషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియని మూర్ఖుడు, అసమర్ధుడు చంద్రబాబు. ఋషికొండ భవనాలపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు కచ్చితంగా వస్తాయి. పార్లమెంటు, ఎమ్మెల్యే స్థానాలు కచ్చితంగా పెరుగుతాయి. 2027 తర్వాత మేమే మళ్లీ అధికారంలోకి వస్తాం’’ అని అన్నారు.చదవండి: తస్సుమనిపించిన పవన్ ఢిల్లీ పర్యటన! -
లోకేష్ ఇంటికి టీడీపీ మంత్రులు..
-
మంత్రిగా అనిత డమ్మీ.. లోకేష్ ఫెయిల్: రోజా
తిరుపతి, సాక్షి: పోలీసు శాఖపై నేరస్తుల్లో భయం పోయిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆస్పత్రిలో ఉన్న బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన రోజాను పోలీసులు లోపలికి అనుమతించలేదు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ చంద్రగిరి ఎమ్మెల్యే నాని భార్యను ఆస్పత్రి లోపలికి అనుమతిస్తారు. మాకు ఎందుకు ఇవ్వరు? బిహార్‌లో ఇలాంటి దారుణ సంఘటనలు జరిగేవి, ఈరోజు ఏపీలో రోజు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు పోలీసులుపై ఒత్తిడి చేశారు. అమ్మాయి తల్లిదండ్రులుపై ఒత్తిడి తీసుకువచ్చి.. ఉదయానికి మాట మార్చారు. పోలీసు ఉన్నతాధికారులుపై ఎంత ఒత్తిడి చేస్తున్నారో అర్థం చేసుకోగలం. ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది... మహిళలపై దాడులు చూస్తుంటే బాధేస్తోందని తెలిపారు. 120 రోజుల్లో 110కిపైగా దాడులు, అఘాయిత్యాలు జరిగాయి. సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి ఏం చేస్తున్నారు?. అధికారులతో పని చేయించుకోవటం రాకపోతే రాజీనామా చేయండి. మంచి అధికారులపై వైఎస్సార్సీపీ ముద్ర వేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అనిత డమ్మీ హోం మంత్రి.. వైఎస్ జగన్‌ను తిట్టడానికే పదవి ఇచ్చారు. పవన్ కల్యాణ్ అధికార పక్షంలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నారా? సమాధానం చెప్పకుండా పవన్ తప్పించుకుంటున్నారు. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని హోం మంత్రే చెబుతున్నారు. బెల్ట్ షాపుల వల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. సరస్వతి భూముల పరిశీలనకు ఎప్పుడైనా వెళ్లొచ్చు.. ముందు బలైపోయిన ఆడబిడ్డల కుటుంబాలకు న్యాయం చేయండి.మంత్రి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేస్తున్నారు. ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశ్నించటం లేదు. చంద్రబాబు, లోకేష్‌లు ఇద్దరు కలిసి పోలీసులను బదిలీలు చేయించారు. వాళ్లు చెప్పినట్లు నడుచుకునే వాళ్లకు మాత్రమే పోస్టింగ్ ఇచ్చారు. పని చేయడానికి శాఖతో పనిలేదు. గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినుల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారు. వాళ్లను ప్రైవేటు వెహికిల్స్‌లో ఇంటికి పంపించారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ఫెయిల్ అయ్యారు. సరస్వతి భూములు ఎక్కడికి పోవు, ఋషికొండకు ఎందుకు వెళ్లాలి? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు...ప్రధాని మోదీకి చేతులు జోడించి చెప్తున్నాం. ఏపిలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వంలో మీరు(బీజేపీ) కూడా భాగస్వామ్యంగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ షూటింగ్‌లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. పిఠాపురంలో టీడీపీ కార్యకర్త అత్యాచారం చేసిన ఘటనపై కనీసం ఇప్పటి వరకు ఎవ్వరూ పరామర్శించలేదు’’ అని అన్నారు. -
పవన్... నువ్వు చెలరేగిపోవచ్చా?.. మరి ఆ నాయకుడి కీళ్లు ఎందుకు విరగొట్టలేదో?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , మంత్రి లోకేష్‌లు ప్రజలను భయపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ప్రజాస్వామ్యయుతంగా లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో తాము కక్షరాజకీయాలు చేయబోమని, అదే టైమ్ లో తప్పు చేస్తే వదలబోమని తన అనుభవాన్ని రంగరించి తెలివిగా మాట్లాడుతున్నారు.పవన్ కల్యాణ్ తనే కొత్త రాజ్యాంగం రాసినట్లు వైఎస్సార్సీపీ నేతలు నోరెత్తితే ఊరుకోరట. టివీలలో మాట్లాడితే వాళ్ల సంగతి చూస్తారట. వాటిని రికార్డ్ కూడా చేస్తున్నారట. మహిళల జోలికి వస్తే కాళ్లు కీళ్లు విరగ్గొడతారట. ఇలా పవన్ కల్యాణ్ ఏదేదో ప్రసంగం చేస్తూ సినిమా డైలాగులు చెబుతున్నారు.ఒకపక్క రాష్ట్రంలో మహిళలపై ఘోరమైన అత్యాచారాలు, అఘాయిత్యాలు, హింసాకాండ జరుగుతుంటే నిన్నటివరకు నోరు విప్పకుండా కళ్లు మూసుకు కూర్చున్న మూడు రోజుల క్రితం ఒక సభలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్, వైకాపా నాయకులు వాళ్ల మద్దతుదార్లు మహిళల జోలికి వస్తే కాళ్లు కీళ్లు విరగ్గొడతామనడంలోని ఆంతర్యం అర్థమవుతోంది. కేవలం టీవీల్లోగానీ ఇతరత్రాగానీ ,తన అసలు రూపాన్ని రంగును బయటపెడుతున్నవారిని భయపెట్టడానికే పవన్ కల్యాణ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మహిళలజోలికి ఎవరు వెళ్లినా చర్య తీసుకోవాల్సిందే. ఆయనకు నిజంగానే అంత దమ్ముంటే పిఠాపురంలో అత్యాచారానికి పాల్పడిన టీడీపీ నాయకుడి కాళ్లు కీళ్లు ఎందుకు విరగ్గొట్టలేదో చెప్పాలి.తూర్పు గోదావరి జిల్లాలో మహిళలపై కొందరు వ్యక్తులు అరాచకాలు చేస్తే వాళ్ల జోలికి ఎందుకు వెళ్లలేదో తెలియదు.కాకినాడ రూరల్ లో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పై జనసేన కార్యకర్తలే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ముందుగా వాళ్ల కాళ్లు విరగ్గొట్టే పని పవన్ చేయాలి కదా. జనసేన ఎమ్మెల్యే నానాజి ఒక దళిత ఫ్రొఫెసర్ పై దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఏమి చేశారు? అంటే ఇలాంటి దారుణమైన పనులు టీడీపీ, జనసేనవారు ఎవరైనా చేస్తే పట్టించుకోరా? వైఎస్సార్సీపీకి 11 సీట్లే వచ్చినా నాయకుల నోళ్లు మాత్రం మూత పడలేదట.భవిష్యత్తులో నోటినుండి మాట రాకుండా పవన్ చేస్తారట. 2019లో ఈయన రెండు చోట్ల ఓడిపోయినా ఐదేళ్లపాటు ఇష్టారీతిన చెలరేగిపోయారు కదా. ఇప్పటం వద్ద కారుమీద కూర్చొని అల్లరి చేశారు కదా. మంత్రులను పట్టుకొని చెప్పుతో కొడతా అన్నారు కదా. చంద్రబాబు అరెస్టయితే రోడ్డు మీద పడుకొని నానా యాగీ చేశారు కదా. అంటే జగన్ ప్రభుత్వంలో అంత స్వేచ్ఛ ఆయనకు వచ్చినట్టే కదా. ఇప్పుడు మాత్రం వైఎస్సార్సీపీ వారు నోరు విప్పకూడదట.జగన్ టైమ్‌లో సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనలు ఎంత దారుణమైన పోస్టులను పెట్టారో అందరికీ తెలుసు. వారికి చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లు ఎంతగానో అండగా నిలబడ్డారు. నిజానికి సోషల్ మీడియాలో ఏ రాజకీయపార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా అభ్యంతరకర పోస్ట్ పెట్టకూడదు. అంతెందుకు తాజాగా టీడీపీ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి చూడండి 2022లో వైఎస్ విజయమ్మ వాహనం టైర్ ఫంక్చర్ అయిన ఘటనను ఇటీవలే జరిగినట్టు పేర్కొంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో టీడీపీ సోషల్ మీడియా అప్ లోడ్ చేసింది.మరి దీన్ని పవన్ కల్యాణ్ సమర్థిస్తారా? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. తమది మంచి ప్రభుత్వమని ఆయన సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చు. అనేక హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నా తమది మంచి ప్రభుత్వమని పవన్ కల్యాణ్ బాజా వాయించుకోవడాన్ని తప్పుపట్టలేం. వైసీపీ ఇంకా వేషాలు వేస్తే తొక్కి నార తీస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించడమంటే ఆయనేదో సొంత రాజ్యాంగం రాసుకున్నట్టుంది. ముందుగా ఆయన రాష్ట్రంలో పలు చోట్ల జనసేన నేతలు,కార్యకర్తలు టీడీపీవారి చేతిలో అవమానాలకు గురవ్వుతున్నారు. దెబ్బలు తింటున్నారు.అలా జనసేనపై దాడులు చేస్తున్న టీడీపీవారిని తొక్కి నారతీస్తే ఆ తర్వాత వైసీపీ గురించి మాట్లాడవచ్చు. చంద్రబాబును పొగడడానికే తెగ ఆరాటపడుతున్న పవన్ కల్యాణ్ పోలీసు ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? పవన్ కల్యాణ్ గ్యాస్ బండ్ల కార్యక్రమంలో పాల్గొని వెళుతున్నప్పుడు కొందరు మహిళలు తమకు అన్యాయం జరిగిందని రోదిస్తూ ఆయన్ని కలవడానికి ప్రయత్నిస్తే ఆగి కనీసం పలకరించకుండా వెళ్లిపోయిన పవన్ కల్యాణ్ డైలాగులకు ఏ పాటి విలువ వుంటుంది. గతంలో 35 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని కథలు చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పటివరకు ఎంతమంది నిందితులను పట్టుకొని తాటతీశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక సనాతన ధర్మ పరిరక్షణ అనేది ఆయన పేటెంట్గా మార్చుకున్నట్టున్నారు. ఆ ధర్మమంటే ఏమిటో తెలియకపోయినా మతాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారు.ఇదే టీడీపీ, జనసేన, బీజేపీ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది కదా.ఇక రెడ్ బుక్ రాజ్యాంగ కర్త అయిన లోకేష్ అమెరికా వెళ్లి మరీ రెడ్ బుక్ ఛాప్టర్ 3 తెరుస్తామని అంటున్నారు. ఒక పక్క పెట్టుబడులు ఆహ్వానిస్తామంటున్నారు.. ఇంకొక పక్క రెడ్ బుక్ ఛాప్టర్ 3 పేరుతో తమ ఇష్టారాజ్యంగా అరాచకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన హింసాకాండ, దౌర్జన్యాలు, విధ్వంసాలతో లోకేష్ కు సంతృప్తి కలిగినట్టు లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలను రెడ్ బుక్ అంటూ భయపెడుతు తిరుగుతున్న లోకేష్ ను, ఆయన్ని మంత్రిగా పెట్టుకొని నిస్సహాయుడిగా మిగిలిపోయిన చంద్రబాబును చూసి జనం విస్తుపోతున్నారు. వీరిద్దరికి భిన్నంగా చంద్రబాబు మాత్రం కక్షలకు దూరమని చెబుతూనే తాము పగ తీర్చుకోబోతున్నామని పరోక్ష సంకేతాలు ఇస్తుంటారు. చంద్రబాబేమో తెలివిగా కక్ష రాజకీయాల గురించి మాట్లాడుతుంటే పవన్, లోకేష్‌లు మాత్రం పచ్చిగా దారుణంగా మాట్లాడి ప్రత్యర్థి రాజకీయ నాయకులను, తమకు గిట్టనివారిని భయాందోళనలకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు.కాకపోతే దీనికి చట్టాన్ని ఉల్లంఘించినవారు అని ఒక ముసుగు వేస్తున్నారు. టీడీపీ , జనసేనలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలుగానీ, సుమారు రెండువందల వాగ్ధానాలనుగానీ అమలు చేయలేక, చేతులు ఎత్తేస్తున్నామని చెప్పలేక వాటి గురించి ప్రశ్నించేవారిని వేధించాలని నోళ్లు మూయించాలని అనుకుంటే అది సాధ్యమయ్యేది కాదని చరిత్ర చెబుతోంది. తమ నియంతృత్వంతో ఎల్లకాలం అధికారంలో ఉంటామని వారు భావిస్తుంటే అది భ్రమే అవుతుంది. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవడం మాని అబద్ధాలతో మోసం చేస్తూ, రెడ్ బుక్కులతో భయపెడుతూ పాలన సాగిస్తే ప్రజలు ఎంతకాలం సహించగలుగుతారు?::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రెడ్ బుక్ VS గుడ్ బుక్
-
దేవుడిని అడ్డు పెట్టుకుని.
-
దీక్ష ముసుగులో సినిమా షూటింగ్‌లు
-
విశాఖలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బడిబాట
-
చెప్పేది సుద్దపూస కబుర్లు
-
నేనే వస్తున్నా కాస్కోండి..
-
ఏపీలో లోకేష్ రెడ్ బుక్ హోర్డింగ్స్ నచ్చని వారిపై కక్ష సాధింపు
-
పరిపాలన మరీ ఇంత అధ్వానమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలలో అదృష్టవంతుడైన నేత అని చెప్పాలి. ఆయన ఎమ్మెల్యే అవడం నుంచి ముఖ్యమంత్రి కావడం వరకు, అందులోను నాలుగుసార్లు సీఎంగా పగ్గాలు చేపట్టడం వరకు ఆయన అదృష్టం చెప్పలేనిది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రజలకు మేలు చేస్తే మంచిదే. అందుకు భిన్నంగా పాలన సాగిస్తే అపకీర్తిని మూటకట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన ఆ దశలోనే ఉన్నారన్న అనుమానం కలుగుతోంది.గత మూడు టరమ్‌లలో కన్నా ఈ విడత ఆయన పాలన తీరు మరీ నాసిరకంగా మారుతోందని చెప్పడానికి బాధ కలుగుతోంది. గతంలో కూడా అలవికాని వాగ్దానాలు చేసి, వాటిని అమలు చేయకుండా ఉన్నప్పటికీ, పాలన మరీ ఇంత అద్వాన్నంగా లేదని చెప్పాలి. ప్రత్యేకించి గత నెల రోజుల పాలనలో జరిగినన్ని అరాచకాలు ఇంతకు ముందెన్నడూ చూడనివి. ఆ రోజుల్లో ప్రజలు ఏమైనా అనుకుంటారేమోనని వెరచేవారు. ఇప్పుడు చంద్రబాబులో ఆ వెరపు పోయినట్లయింది.జనాన్ని మాయచేయగలిగాం కాబట్టి ఎవరేం చేయలేరు అన్న అహంభావ ధోరణిలోకి వెళ్లి ఉండాలి. లేదా ఆయనకు సంబంధం లేకుండా పాలన సాగుతుండాలి. పూర్వం కూడా పోలీసులను ఆయన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నా, మరీ ఇంతలా ప్రత్యర్దులను వేధించడానికి వినియోగించుకున్నారని చెప్పజాలం.2024లో ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యారో కాని, అసలు రాష్ట్రంలో పాలన ఉందా? లేక టీడీపీ అరాచక శక్తుల పాలన సాగుతోందా? అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బహుశా పాలనలో తనకన్నా ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పెత్తనం బాగా పెరిగి ఉండాలి. లోకేష్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్రలో కాని, ఇతరత్రా కాని ఒక మాట అంటుండేవారు. తాను మూర్ఖుడనని, తన తండ్రి మాదిరి ఉదారంగా ఉండనని, రెడ్ బుక్‌లో అధికారుల పేర్లు రాసుకుంటున్నానని హెచ్చరిస్తుండేవారు. అలాగే తనకు నచ్చని, లేదా తనను విమర్శించేవారి పేర్లను ఆ బుక్‌లో రాస్తున్నట్లు చెబుతుండేవారు.అప్పట్లో టీడీపీ కార్యకర్తలు ఎంత పెద్ద కేసు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని ఊరించేవారు. చంద్రబాబును మించి అరాచకంగా ఉపన్యాసాలు చేశారు. సరిగ్గా ప్రస్తుతం పాలన అలాగే నడుస్తోంది. కాలం కలిసి వచ్చి చంద్రబాబు, లోకేష్ లు పాలన పగ్గాలు చేపట్టారు. వారికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. పవన్‌ను వారు తమదారిలో పెట్టుకుని నోరు విప్పకుండా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి లోబరుచుకోగలిగారు.దాడులు, విధ్వంసాలకు టీడీపీ నేతలు పాల్పడుతుంంటే, వారిపై కేసులు పెట్టడం లేదు కాని, వైఎస్సార్సీపీ వారిపై అక్రమ కేసులు పెట్టడం సర్వసాధారణం అయింది. కేంద్రంలో కూడా టీడీపీ, బీజేపీ కూటమే అధికారంలో ఉంది కనుక ఇక్కడ నెలకొన్న అశాంతిపై బీజేపీ పెద్దలు ఎవరూ కిమ్మనడం లేదు. ఈ పరిస్థితిలో ప్రజలు ముఖ్యంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు తమను తాము రక్షించుకోవలసి వస్తోంది. ఇది ఎటువైపు దారితీస్తోందోనన్న భయం కలుగుతోంది.ఇవి చాలవన్నాట్లు ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన, మరికొందరు సీనియర్ ఐపిఎస్ అధికారులపైన తప్పుడు కేసులు బనాయించడం. చివరికి ప్రభుత్వ వైద్యశాల అధికారులను కూడా వదలిపెట్ట లేదు. ఈ సదర్భంగా వైఎస్సార్సీపీ నేతలు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు నిర్వాకం వల్ల తొక్కిసలాట జరిగి ఇరవైతొమ్మిది మంది మరణించడం, చంద్రబాబు ప్రభుత్వం తిరుమలలో ఇరవైమంది కూలీలను ఎన్ కౌంటర్ చేయడం వంటి ఘటనలు తీవ్ర సంచలనం కలిగించాయి. వాటిని చంద్రబాబు తానే ముఖ్యమంత్రిగా ఉన్నందున మేనేజ్ చేసుకుని అవి తనకు చుట్టుకోకుండా జాగ్రత్తపడ్డారు.జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని తిరగదోడి ఉంటే చంద్రబాబు పరిస్థితి ఎలా ఉండేదని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాని జగన్ ఆ పని చేయలేదు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుతో ఒక ఫిర్యాదు చేయించి, జగన్ పైన కేసు పెట్టిన తీరు చంద్రబాబు లేదా లోకేష్‌లు ఎంత కక్షపూరితంగా మారారో తెలియచేస్తున్నదని అంటున్నారు. ఆ కేసు పరిణామాలు ఏమి అవుతున్నాయన్నది ఇక్కడ చర్చకాదు.చంద్రబాబు పాలన అధ్వాన్నంగా మారిందని చెప్పడానికి దీనిని ఒక ఉదాహరగా తీసుకుంటున్నారు. రఘురామకృష్ణంరాజు వైఎస్సార్సీపీ అసమ్మతి ఎంపీగా ఉన్నప్పుడు కులాలు, మతాల మద్య దారుణమైన విద్వేషాలు రెచ్చగొట్టే విదంగా ఉపన్యాసాలు చేస్తుంటే, సీఐడీ అన్ని ఆదారాలతో కేసు పెట్టి అరెస్టు చేసింది. ఆ సమయంలో తనను హింసించారన్నది రాజు ఆరోపణ. నిజంగా అలా జరిగి ఉంటే ఎవరం అంగీకరించం. కాని ఆయన అప్పుడు వీరెవ్వరిపైన ఆరోపణ చేయలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తనను కొట్టారని ఆరోపించారు. బహుశా బెయిల్ కోసం ఇలా అంటుండవచ్చులే అనుకున్నారు.న్యాయస్థానం ఆదేశాల ప్రకారం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వారు ఆయనను మొత్తం పరీక్షించి గాయలేవీ లేవని నిర్దారించారు. అందుకుగాను వారిపై కూడా రాజు ఇప్పుడు కేసు పెడుతున్నారు. తెలుగుదేశంకు న్యాయ వ్యవస్థలో ఉన్నపట్టు ఈయనకు బాగా ఉపయోగపడిందని అంతా అనుకునేవారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఈయనను మిలటరీ ఆస్పత్రిలో చేర్పించింది. వారి నివేదికలో సైతం ఆయనపై ఎవరో కొట్టిన గాయాలు ఉన్నట్లు తేల్చలేదు. పైగా ఈయన చెప్పాపెట్టకుండా ఆ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి.సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి సిబిఐ దర్యాప్తు అవసరం లేదని భావించింది. అయినా ఇప్పుడు రాజుతో చంద్రబాబో, లేక లోకేషో గుంటూరులో పోలీసు కేసు పెట్టించారు. ఇది కేవలం వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టడానికి, అధికారులను లొంగదీసుకోవడానికే అన్న అభిప్రాయం కలుగుతోంది. గత ప్రభుత్వ టైమ్‌లో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతల స్కామ్‌లకు సంబంధించి సీఐడీ విచారణ చేసింది. ఆ సమయంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఇప్పటికీ కోర్టులలో పెండింగులో ఉన్నాయి. ఆ కేసులలో ఈ అధికారులు తమకు అనుకూలంగా వ్యవహరించడానికి గాను.. బెదిరించడానికి ఇలా ఏమైనా వారిపై బనాయించారా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే సుప్రింకోర్టే తోసిపుచ్చిన కేసును ఇక్కడ తిరగతోడతారా? అన్న ప్రశ్న వస్తోంది.అదే టైమ్‌లో రఘురాజు ఎంత అరాచకంగా కుల విద్వేషం పెంచడానికి ప్రయత్నించింది అన్నదానిపై కూడా కేసు పెట్టి ఉంటే, పోనీలే రెండు విషయాలలోను ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుందేమోలే అనుకునేవారు. అలా చేయకపోవడంతో ఇది ప్రతీకారేఛ్చతో రగులుతూ పెట్టిన కేసు అని అర్ధం అవుతుంది. లేదా ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అయి ఉండాలి. ఒక్క వృద్దాప్య పెన్షన్లను మాత్రం చెప్పినట్లు చేశారు. ఇక మిగిలినవి వేటిపైన నిర్దిష్టంగా చేయడం లేదు.పెన్షన్ దారులలో అనర్హుల పేరిట ఇకపై కోతపెట్టవచ్చన్న వార్తలు వస్తున్నాయి. కాగా పలు అంశాలలో జగన్ ప్రభుత్వ విదానాలనే ఏదో రకంగా పాలో కావల్సి వస్తోంది. ఉదాహరణకు తాజాగా వచ్చిన జీపీఎస్ నోటిఫికేషన్. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ ఇవ్వడం ద్వారా జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు, ఇప్పుడు దానినే పాటిస్తున్నారు. బ్రేక్ వేశామని చెప్పారే తప్ప రద్దు చేయకపోవడం గమనార్హం. అంటే మోసం చేసింది జగన్ కాదు.. చంద్రబాబు, పవన్ లేనని ఉద్యోగులు అనుకునే పరిస్థితి వచ్చింది.ఇసుక ఉచితం అంటే జనం అంతా నమ్మారు. తీరా చూస్తే జగన్ ప్రభుత్వం పెట్టిన ఇసుక గుట్టలలో సగభాగం టీడీపీ, జనసేన నేతల పరం అయిపోయింది. మిగిలిన ఇసుకకు పెద్ద ఎత్తున చార్జీల పేరుతో రేట్లు పెట్టి వసూళ్లు చేస్తున్నారు. తల్లికి వందనం స్కీమ్ జిఓ ఇవ్వడం, ఆ తర్వాత అది ఏదో వేరే పనికి జిఓ ఇచ్చామని చెప్పడం.. అంటే ప్రభుత్వ పనితీరు తెలియచేస్తుంది. వలంటీర్ల గురించి ఎన్నికల ముందు ఏమి చెప్పారు? ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారు. కొత్త ఉద్యోగాల సంగతేమో కాని వలంటీర్లకు వచ్చే గౌరవవేతనం కూడా అందేలా లేదు. ఆ రకంగా లక్షన్నర మందిని ఈ ప్రభుత్వం రోడ్డున పడవేసే సూచన కనిపిస్తోంది.ఉచిత గ్యాస్ బండలు వస్తాయో, రావోకాని మహిళలంతా గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కట్టాల్సివచ్చింది. జగన్ టైమ్‌లో మహిళలు మహరాణుల మాదిరి ఇళ్ల వద్ద కూర్చుని ఉంటే వలంటీర్ల ద్వారా దరఖాస్తులను తీసుకునేవారు. ఇప్పుడేమో రోడ్డుమీద క్యూలలో గంటల తరబడి వేచి ఉండవలసి వస్తోంది. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నమ్మినందుకు ప్రజలకు ఈ ప్రతిఫలం దక్కిందన్నమాట. శ్వేతపత్రాల పేరుతో జగన్ ప్రభుత్వంపై ఎంత దుష్ప్రచారం చేస్తున్నా, జనం వాటిని పట్టించుకోవడంలేదు. టీడీపీ నేతల దాష్టికాలవల్ల కొన్ని చోట్ల వైఎస్సార్సీపీ అభిమానులు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘట్టాలు జరిగాయి. అలాగే బాలికలపై అఘాయిత్యాలు సాగుతున్నాయి.నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో జరిగిన బాధాకర ఘటన వీటికి నిదర్శనం. పలు ఇతర చోట్ల కూడా నేరాలు పెరిగాయి. నేరాలు ఏ ప్రభుత్వ టైమ్‌లో అయినా జరుగుతుండవచ్చు. కాని అప్పట్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు గోరంతల్ని కొండంతలు చేసి ప్రచారం చేశారు. పవన్ కల్యాణ్ అయితే 2017లో టీడీపీ హయాంలో జరిగిన సుగాలి ప్రీతి కేసును జగన్ ప్రభుత్వానికి అంటగట్టి దుష్ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏ ఒక్క ఘటన జరగదని బీరాలు పలికారు.ఇప్పుడు ఇన్ని దుర్మార్గపు ఘటనలు, దారుణమైన నేరాలు జరుగుతున్నా పవన్ నోరు విప్పడం లేదు. ఎందుకంటే ఆయన కోరుకున్న పదవి ఆయనకు వచ్చేసింది కాబట్టి అంతా బ్రహ్మాండంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన సుద్దులు చెబుతున్నారు తప్ప, ప్రభుత్వ వైఫల్యాలపై జవాబు ఇవ్వడం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ కారణంతో ఘర్షణలు జరిగినా, చంద్రబాబు నాయుడు నిందితులకు అనుకూలంగా మాట్లాడడానికి కొంత భయపడేవారు. జనంలో దెబ్బతింటామేమో అన్న వెరపు ఉండేది. ఘర్షణలకు టీడీపీ వారు కారణమైతే కనీసం కోప్పడినట్లు నటించేవారు. కాని ఈసారి ఏకంగా నిందితులను ఆయనే కాపాడుతున్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న విమర్శలకు గురి అవుతున్నారు.ఉదాహరణకు డెక్కన్ క్రానికల్ ఆఫీస్‌పై దాడిచేసిన టీడీపీ కార్యకర్తలను ఆయన మందలించకుండా పత్రికల ఆఫీస్‌ల వద్ద నిరసనలు చెప్పొద్దులే అని సలహా ఇచ్చి ఊరుకున్నారు. వైఎస్సార్సీపీ వారిపై వందల కొద్ది దాడులు జరిగినా, టీడీపీ వారు విధ్వంసాలకు పాల్పడుతున్నా, వాటిని అదుపు చేయకపోగా, వైఎస్సార్సీపీ వారే దాడులు చేస్తున్నారన్న భావన కలిగేలా మాట్లాడడం శోచనీయం. ఇవన్ని చూశాక ఏమనిపిస్తున్నందంటే చంద్రబాబే ఇలా విద్వేషపూరితంగా తయారయ్యారా? లేక ఆయన కుమారుడు లోకేష్ తాను అనుకున్నట్లు పోలీస్ రాజ్యాన్ని నడుపుతుంటే ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అన్న సందేహం సహజంగానే వస్తుంది. ఏది ఏమైనా చంద్రబాబుకు అదృష్టం వచ్చి మళ్లీ సీఏం పదవిలోకి రావడం, తమ దురదృష్టమని ప్రజలు అనుకునేలా పరిస్థితి రాకూడదని కోరుకోవడం తప్పుకాదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
రెడ్ బుక్ కీలు బొమ్మలుగా ఏపీ పోలీసులు
-
ఏపీలో చంద్రన్న రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్లేనా?
నేను ఫలానా వాళ్లను కొట్టబోతున్నాను.. లేదా చంపబోతున్నాను అని ఎవరైనా పెద్ద హోర్డింగ్ పెడితే ఏమవుతుంది. వెంటనే పోలీసులు చర్య తీసుకుని అలాంటి హోర్డింగ్ ను తొలగించడమే కాకుండా, అలా చేసినవారిని అదుపులోకి తీసుకుంటారు. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరిగే ప్రక్రియ. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. బహిరంగంగా హోర్డింగ్ లు పెట్టి రెడ్ బుక్ సిద్ధం అంటూ తమ నేత బొమ్మ వేసుకుని మరీ ప్రచారం చేసుకోవచ్చు. అయినా పోలీసులు స్పందించరు. రాష్ట్ర ప్రభుత్వం ఆనందంగా చూస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం పట్టి, పట్టనట్లు వ్యవహరిస్తుంది. వారికి ఇష్టమైన మీడియా ఆహో, ఓహో అని భజన చేస్తాయి. ఇదో చిత్రమైన పరిస్థితి అని చెప్పాలి.⇒ ఏపీలో తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోనే ఇలాంటి దారుణమైన పోకడలు సాగుతున్నాయి. దీనిని అదుపు చేసే పరిస్థితి ఇప్పట్లో ఉండదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయాలలో వైరుధ్యాలు, వైషమ్యాలు ఉండవచ్చు. కోప, తాపాలు ఉండవచ్చు. లేదా ఎదుటివారు ఎదైనా తప్పు చేశారనుకుంటే చట్టపరంగా కేసులు పెట్టవచ్చు. ఇవేవి కాకుండా మీ అంతు చూస్తామంటూ బహిరంగంగా బోర్డులు పెడుతున్నారు. అదేదో గొప్ప పనిగా వారు చెప్పుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైన చర్యేనా అనే ప్రశ్న వస్తే, మైట్ ఈజ్ రైట్ అన్నట్లుగా, రౌడీలు, గూండాలు చెలరేగిపోయినా పట్టని కాలంలో మాత్రమే ఇలాంటివాటిని సమర్థించగలం.⇒ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటివి జరగకూడదు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నలభైఆరేళ్లుగా రాజకీయాలలో అత్యంత క్రియాశీలకంగా ఉన్నారు. దేశంలోనే ఆయన అంత అదృష్టవంతుడైన నేత లేరంటే అతిశయోక్తి కాదు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగాను, అంతకన్నా ఎక్కువకాలం ప్రతిపక్ష నేతగాను వ్యవహరించారు. ఆయనకు నిబంధనలు, చట్టం, రాజ్యాంగం గురించి తెలియవని అనుకుంటే పొరపాటు. అయినా ఆయన ఏలుబడిలో ఇలాంటి దుశ్చర్యలు ఎలా కొనసాగుతున్నాయంటే ఏమి చెబుదాం. ఆయనలో ఇంకా కక్షపూరిత రాజకీయాలు పోలేదన్న అభిప్రాయానికి తావిస్తున్నారు.⇒ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే తీవ్రంగా స్పందించి, రాజారెడ్డి రాజ్యాంగం అని, ఇంకొకటని అరిచి ఘీ పెట్టిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు తాము అధికారంలోకి రాగానే కొత్త రాజ్యాంగం సృష్టించుకున్నారని అనుకోవాలా? చంద్రన్న రాజ్యాంగం అమలులోకి వచ్చినట్లా? దీని ప్రకారం ఎవరినైనా తాము కొట్టవచ్చని, తిట్టవచ్చని, చంపవచ్చని, ఎవరూ మాట్లాడడానికి వీలు లేదని కొత్త నిబంధనలు తయారు చేశారా! పైగా వాటిని బహిరంగంగా హోర్డింగ్ ల ద్వారా ప్రజలందరికి తెలియచేసే కొత్త సంస్కృతికి తెరదీశారా? ఇదేనా చట్టబద్దమైన, రాజ్యాంగ పాలన అంటే!⇒ ప్రతిపక్షంలో ఉండగా, ఎవరు సలహా ఇచ్చారో కానీ లోకేష్ తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ అంటూ పట్టుకు తిరిగారు. తమ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న భావన కలిగితేనో, అధికారుల శైలి తమకు నచ్చకపోతేనో, లేక తాము చేసే అల్లర్లకు అడ్డుపడితేనో, కేసులు పెడితేనో, వారి పేర్లను రెడ్ బుక్ లో రాసుకుంటున్నామని, అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామని బెదిరిస్తుండేవారు. తొలుత ఎవరూ దీనిని సీరియస్ గా తీసుకోలేదు.⇒ కొందరు సరదాగా తీసుకుంటే, పోలీసు అధికారులు సైతం పెద్దగా స్పందించలేదు. అయితే చంద్రబాబు, లోకేష్ లపై ఆయా స్కాములకు సంబంధించి కేసులు పెట్టిన సందర్భంలో అప్పటి సీఐడీ అధికారులు ఈ రెడ్ బుక్ వ్యవహారంపై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని కోర్టు ఇంకా తేల్చలేదు. ఈలోగానే వైఎస్సార్సీపీ అధికారం కోల్పోయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో రెడ్ బుక్ కేసు ఏమవుతుందో కానీ, అధికారులు ఎవరూ దానిని పర్స్యూ చేసేపరిస్థితి ఉండదు. రెడ్ బుక్ అంటూ తిరిగిన వ్యక్తి లోకేష్ మంత్రి అయ్యారు. ఆ రెడ్ బుక్ ను విశాఖ సభలో ఆయన తన తండ్రి చంద్రబాబుకు అందచేశారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.⇒ ఆ రెడ్ బుక్ లో పలువురు అధికారుల పేర్లు, వైఎస్సార్సీపీ నేతల పేర్లు.. లేదా ఇంకొందరు తమను వ్యతిరేకించేవారి పేర్లు రాసుకుని ఉండవచ్చు. ఆయా సభలలో కొందరి పేర్లను లోకేష్ ప్రకటిస్తూ వచ్చారు కూడా. చిత్తూరులో ఒక ఎస్పీ పేరును ఇలానే అప్పట్లో ప్రకటించారు. అలా అధికారులను బెదిరించవచ్చా! నిజంగానే అధికారంలోకి వచ్చారు కనుక వారిపై చర్య తీసుకుంటామని బహిరంగంగా బోర్డులు పెట్టవచ్చా! గతంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి ఘట్టాలు చోటు చేసుకున్నాయా! అసలే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హింసాకాండతో రాష్ట్రం అట్టుడుకుతుంటే, అది చాలదన్నట్లు రెడ్ బుక్ సిద్దం అంటూ ప్రజలను భయభ్రాంతులను చేసే ప్రకటనలు ఏమిటో తెలియదు.⇒ టీడీపీ నేత బుద్దా వెంకన్న వంటివారు వారిని అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని రాజకీయ ప్రకటనలు చేస్తుంటే అదేదో మామూలేనని అనుకుంటాం. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు, మరొక టీడీపీ నేత కూర్చుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ, చావలేదు.. అని అంటుంటే వీరి మనసులో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయా? అన్న విషయం బహిర్గతం అయిపోతుంది. దానికి తగినట్లుగానే రెడ్ బుక్ హోర్డింగ్ లు పెడుతున్నారన్న అనుమానం ప్రజలలో ప్రబలుతుంది.⇒ పూర్వకాలంలో తమ అధికారానికి అడ్డు పడుతారనుకునే వారిని రాజులు, నియంతలు చంపించేసేవారట. ఉత్తర కొరియా వంటి దేశాలలో ఇప్పటికీ అలాంటి రాక్షస సంస్కృతి ఉంది. చైనాలో ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది కమ్యూనిజం ముసుగులో ఉన్న నియంత రాజ్యం కనుక. చైనాలో సాంస్కృతిక విప్లవం పేరుతో ఎన్ని ఘోరాలు జరిగాయో చరిత్ర చెబుతుంది. రష్యాలో పుతిన్ కు ఎదురుతిరిగినవారిని బతకనివ్వడం లేదని వార్తలు వచ్చాయి. కానీ ప్రజాస్వామ్యదేశంగా ఉన్న భారత్ లో అలాంటివి సాధ్యమేనా? అందులోను ఒక రాష్ట్రంలో ఇలా జరుగుతుందా? అది ఎల్లకాలం అయ్యే పనేనా? అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఉండేది ఐదేళ్ల కాలపరిమితే అన్న సంగతి మర్చిపోయి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతే తర్వాత ప్రజలు వాటిని గుర్తుంచుకోరా?⇒ గొప్ప నేతగా పేరుపొందిన ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి పెట్టి ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నేతలను జైళ్లపాలు చేసిన తర్వాత కొంతకాలం అధికారంలో ఉండగలిగారు కానీ, ఆ తర్వాత ఎన్నికలలో ఘోర పరాజయం చెందారు. కొన్ని రాష్ట్రాలలో ఇలాంటి అనుభవాలు ఎదురుకాకపోలేదు. అయినా రాజకీయ నేతలు గుణపాఠాలు నేర్చుకోరు. పోలీసులు తమ చేతిలో ఉంటారు కనుక ఏమైనా చేయవచ్చని, ఇతర వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చన్న విశ్వాసంతో అరాచకాలకు పాల్పడుంటారు. కానీ ఆ తర్వాత వారు కూడా ఏదో నాడు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవలసి వస్తుందని మర్చిపోతారు.⇒ ఎంత పిల్లి అయినా గదిలో పెట్టి కొడితే తిరగబడుతుందని సామెత. ఒకపక్క రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటిస్తున్న సమయంలోనే ఈ రెడ్ బుక్ ప్రకటనలు ఇంత బహిరంగంగా హోర్డింగ్ ల రూపంలో జనంలోకి వస్తే, గూండాలను, మాఫియాలను ఎంకరేజ్ చేసినట్లా? కాదా? అన్నది వారే ఆలోచించుకోవాలి.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీలో కలకలం రేపుతున్న రెడ్ బుక్ హోర్డింగ్స్
-
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
‘‘మేము ఏకగ్రీవంగా చెబుతున్నాము. మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో.. దానికి సరిగ్గా ఆపోజిట్‌గా మరొక వేదిక ఏర్పాటు చేసి, అదే రోజు నారా లోకేశ్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఇది మా డిమాండ్.’’ఈ డిమాండ్ చేసింది ఎవరో తెలుగుదేశం పార్టీ సాధారణ కార్యకర్త కాదు! ఇటీవల చంద్రబాబు కటౌట్‌ను రక్తంతో కడిగిన ఆ పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న!! నాయకుడు అధినాయకుడిని డిమాండ్ చేయటం ఏంటి? పైగా లోకేష్‌ను పార్టీ అధ్యక్షుడిగా చేయమని డిమాండ్ చేయటం ఏంటి? అందునా.. ఏక కాలంలో ఎదురెదురుగా రెండు వేదికలను ఏర్పాటు చేసి – ఈ వేదికపై చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఎదురు వేదికపై చినబాబు పార్టీ అధ్యక్ష ప్రమాణ స్వీకారం జరగాలని కోరటం ఏమిటి? ఎందుకు ‘బుద్ధన్న’ అలా అన్నారు. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది?లోకేశ్ ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన్నిప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని బుద్ధా వెంకన్న డిమాండ్. అంటే.. ఇండైరెక్టుగా లోకేశ్‌ను సీఎంను చేయాలని సూచించటమా? లేక చినబాబుకు దగ్గర కావాలన్న వ్యూహమా? లేదంటే, చంద్రబాబు సూచన మేరకే అలా డిమాండ్ చేసి ఉంటారా? ఇవేవీ కాదంటే.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ఆయన అలా ఏమైనా అన్నారా? ఏదేమైనా టీడీపీలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఆసక్తికరమైన పరిణామం... బుద్ధా వెంకన్న డిమాండ్.టీడీపీ అధికారంలోకి వస్తుందా, రాదా అన్నది అటుంచి.. అసలు బుద్ధన్న ఇలాంటి ప్రకటన ఎందుకు చేసినట్లు అని ఆ పార్టీలోని నాయకులే అయోమయంగా ముఖాలు చూసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఏదైనా గందరగోళం మొదలైందా అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.నిజానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ఆలోచిస్తున్నది లోకేశ్ బాబు అధ్యక్షుడు అవుతాడా కాడా అని కాదు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అని. ఓటమి అంటే చంద్రబాబుకు భయం. అందుకే ఆయన ఒంటరిగా పోటీ చేయరు. పొత్తు కోసం చూస్తారు. పొత్తు కుదరకపోతే కొత్త ఎత్తులు ఏవైనా వేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కూటమిని కట్టారు కనుక... ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఎలా ముందుకు వెళ్లాలా అని ఆయన ఇప్పుడు ఆలోచిస్తుండవచ్చు. కొత్తగా ఏర్పడే జగన్ ప్రభుత్వంలో తొలి 100 రోజుల్లో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించటానికి రామోజీ తో కలసి ఏదైనా వ్యూహాన్ని ఆలోచిస్తూ కూడా ఉండొచ్చు. చెప్పలేం. గెలుపు కోసం చంద్రబాబు ఏమైనా చేయగలరు. ఓడిపోయినా కూడా... ఏమైనా చేయించగలరు!ఈ నేపథ్యంలో గత 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో ఆయన్ని ఓడించిన స్వయంకృతాపరాధాలు, ఆయన్ని గెలిపించిన ఎత్తులు, పొత్తులు; గెలుపు వంటి ఓటములు, ఓటమి వంటి గెలుపుల గురించి చూడటం అవసరం.చంద్రబాబుకు మొదటి అతి పెద్ద ఓటమి 2004లో ఎదురైంది. అంతకు ముందు 1999లో జరిగిన ఎన్నికలు ఆయన్ని పార్టీలో తిరుగులేని నేతగా నిలబెట్టాయి. అక్కడి ఉంచి నేరుగా, మళ్లీ లేవలేనంతగా 2004లో కిందికి పడేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనంలో సైకిల్ కొట్టుకుపోయింది. స్కూల్ టీచర్లు, ప్రభుత్వోద్యోగులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయటం మాత్రమే కాదు, చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా పనిచేశారు. జన్మభూమి కార్యక్రమాలకు తమను ఉపయోగించుకోవటం వారికి ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వోద్యోగుల పని విధి విధానాలలో కొత్తగా తెచ్చిన మార్పులు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభావం చూపెట్టాయి.ఇంతకన్నా ముఖ్యం.. విద్యుత్ చార్జీలు, నీటి చార్జీల పెంపు. దీనిపై రైతులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తే... హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో జరిగిన ధర్నాలో నిరసనకారులైన రైతులపై చంద్రబాబు పోలీసుల చేత కాల్పులు జరిపించారు. పోలీస్ కాల్పులలో రామకృష్ణ, విష్ణువర్థన్ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు రైతులు దుర్మరణం చెందారు. బాబు పాలనలో మాయని మచ్చగా మిగిలిన ఉదంతం అది. ఇక 1995–2004 మధ్య రాష్ట్రంలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు. అప్పుడే తెలంగాణ ఉద్యమం, అప్పుడే వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్ర! 2004 ఎన్నికల్లో ఆ రెండూ తమదైన ప్రభావం చూపి, బాబు ఓటమికి కారణం అయ్యాయి.ఇవికాక, మరికొన్ని కారణాలు కూడా ఆనాటి చంద్రబాబు ఘోర పరాజయానికి ఆజ్యం పోశాయి. తూర్పు ఆసియా దేశాల పద్ధతులను ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు కనిన స్వర్ణాంధ్ర ప్రదేశ్, విజన్ –2020 కలలు బెడిసికొట్టాయి. కేవలం సమాచార సాంకేతిక విజ్ఞానం మీద, బయో టెక్నాలజీ మీదా ఆధారపడి ఆయన ఆ కలలు కన్నారు. అవి సమాచార సాధనాలను, విదేశీ అధినేతలను, విదేశీ వాణిజ్యవేత్తలను ఆకట్టుకుని ఉంటే ఉండొచ్చు. కానీ కేవలం వాటి ద్వారానే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు భ్రమ పడ్డారు. గెలుపై ధీమాగా ఉన్నారు. చివరికి బోర్లా పడ్డారు. వ్యవసాయ రంగం అభివృద్ధి మీద, పేదరికం నిర్మూలనపైనా ఆయన దృష్టి సారించకపోవటం కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.అంతకు ముందు 1999 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన మాట నిజమే అయినా అది ఏమాత్రం చంద్రబాబు ఘనత కాదు. కార్గిల్ యుద్ధ ప్రభావం గెలుపునకు దోహదపడింది. పాకిస్థాన్‌తో కార్గిల్ యుద్ధంలో గెలిచిన అనంతరం.. సాధారణ సమయానికి భిన్నంగా, కొన్ని నెలల ఆలస్యంగా సార్వత్రిక ఎన్నికలు ఆ ఏడాది సెప్టెంబరులో జరిగాయి. వాటితో పాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా. ఆ ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో టై–అప్ అయ్యారు. తాము గెలిస్తే, కేంద్రంలో బీజేపీకి బయటి నుండి మద్ధతు ఇస్తామన్న హామీతో ఆయన ఆ ఎన్నికలకు వెళ్లారు.కార్గిల్ యుద్ధంలో గెలుపు వాజ్‌పేయిని గొప్ప నాయకుడిగా నిలబడితే ఆ నాయకుడితో చేయి కలపడం చంద్రబాబుకు గొప్పగా కలిసొచ్చింది. మొత్తం 294 సీట్లలో తెలుగుదేశం 269 సీట్లకు, బీజేపీ 24 సీట్లకు పోటీ చేస్తే తెలుగు దేశం 180 సీట్లలో గెలిచింది. అయినప్పటికి మునుపటి కన్నా 36 సీట్లు తగ్గాయి. బీజేపీకి మాత్రం అంతకుముందు కన్నా 9 సీట్లు పెరిగాయి. అంటే.. వాజ్‌పేయి ఆధ్వర్యంలోని జాతీయ పార్టీ బీజేపీ ప్రభావంతోనే చంద్రబాబు నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఎక్కువ సీట్లు సాధించింది తప్ప అది చంద్రబాబు చరిష్మా కాదు. ఇంకా చెప్పాలంటే కేవలం కార్గిల్ ప్రభావం.2004 ఎన్నికల తర్వాత వరుసగా 2009లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అందుకు కారణంగా చంద్రబాబు ఎలాంటి సాకులు చెప్పినా.. అసలు కారణం మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుడు, స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమ నాయుడు విశ్లేషణలో కనిపిస్తుంది.‘‘2009లో మా పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం పీఆర్పీ పార్టీ, లోక్‌సత్తా పార్టీలు కొత్తగా రావటం. దాంతో యాంటీ కాంగ్రెస్ ఓటు చీలటం జరిగింది. రెండవది – టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నందు వల్ల ఈ హైదరాబాద్‌లో గానీ, రంగారెడ్డి జిల్లాలో గానీ మాకు ఏం సీట్లు కూడా రాలేదు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డిలో వాళ్లు, రాష్ట్రం సపరేట్ కాకూడదని ఎక్కువమంది జనం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మాకు ఒకే ఒక్క సీటు రావటం జరిగింది. అందువల్ల మేము ఘోరంగా ఓడిపోవటం జరిగింది. యాంటీ కాంగ్రెస్ ఓటు చిరంజీవి, జయప్రకాష్ నారాయణ్ చీల్చుకోవటం కూడా మా ఓటమి కారణం. అప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఓట్ బ్యాంకు దాదాపు 13 శాతం తగ్గింది. 2004లో 51 శాతం ఉన్న ఓట్ బ్యాంకు వాళ్లకు 38 శాతం అయింది. మేము 37 శాతంతో ఓడిపోయాం. ఒక్క పర్సెంట్ ఓట్ల తేడాతోనే మేము 2009 ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. గెలుపు అంచుకు వచ్చి ఓడిపోయాం. 92 సీట్లు గెలిచాం మేము. కాంగ్రెస్ 155 మాత్రమే గెలిచింది. వాళ్లకు 35 సీట్లు తగ్గినయ్. మాకు దాదాపు 45 సీట్లు పెరిగాయి. రాజశేఖర రెడ్డి విజృంభించి ప్రచారం చేయటం కూడా జనంలో కొంత భయం కల్పించింది’’ అన్నారు ముద్దు కృష్ణమ నాయుడు.2014లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ఎన్నికల్లోనూ చంద్రబాబు బీజేపీతో చేతులు కలిపారు. వారి పొత్తు ఫలించి తెలుగుదేశానికి 25 సీట్లు, బీజేపీకి 7 సీట్లు పెరిగినప్పటికీ, వైఎస్సార్సీపీ ప్రభావంతో తెలుగు దేశం పార్టీ 117 సీట్లుకు మించి సాధించలేకపోయింది. ఆ మాత్రమైనా మోదీ హవాతో కొట్టకొచ్చిన సీట్లు, ఓట్లు మాత్రమే అవి.2019 గురించి ఇక చెప్పేదేముంది? వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 175కి 151 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లు మాత్రమే సాధించగలిగింది. అందుకు అనేక కారణాలున్నాయి. పార్టీలో అంతర్గత కలహాలు, స్పెషల్ స్టేటస్‌పై యు–టర్న్, అమరావతి నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా మెల్లిగా నడిపించటం, కాపు ఓట్లు చీలుస్తాడని అనుకున్న పవన్ కల్యాణ్ హీరో ఫ్యాక్టర్ పని చేయకపోవటం, అవినీతి.. వీటన్నిటితో పాటు రాష్ట్రానికి అందవలసిన నిధుల విషయంలో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంబించి ఎన్.డి.ఎ. నుంచి బయటికి రావటం కూడా టీడీపీని దెబ్బకొట్టేసింది. దానికి మించి పార్టీలో చంద్రబాబు ‘వన్ మ్యాన్ షో’ పార్టీని ఒంటరిని చేసింది.ఈ అనుభవం రీత్యా మళ్లీ ఈ తాజా ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఆ పొత్తు ఫలిస్తుందా, మొదటికే మోసం తెస్తుందా అని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతలో, ఆయన్ని బలపరుస్తుండే మీడియాలో కలవరం రేకెత్తిస్తోంది. అందుకే ఎన్నికలు ముగిసి, ఫలితాలు ఇంకా రాకముందే తెలుగు దేశం నాయకులు, రామోజీ రావు.. ‘గెలుపు కూటమిదే’ అని నినదిస్తున్నాయి. ఒకటి గమనించారా? ‘గెలుపు తెలుగుదేశానిదే’ వారు అనటం లేదు. – మాధవ్ శింగరాజు -
ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర
విమానాశ్రయం (గన్నవరం): విదేశీ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కుట్ర పన్నడం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి సీఎం జగన్ విదేశీ పర్యటనకు బయల్దేరేముందు ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కుట్ర విఫలమైంది. టీడీపీ సానుభూతిపరుడైన ఆయన్ని అమెరికా పౌరసత్వం కలిగిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్బాబుగా పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆ సమయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పార్కింగ్ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న డాక్టర్ ఉయ్యూరు లోకేష్‌బాబును గుర్తించారు. ఆయన సెల్‌ఫోన్ నుంచి సీఎం పర్యటనకు సంబంధించిన మేసెజ్‌లను పంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై ఆయన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. విదేశాలకు వెళ్తున్న సీఎంను విమానాశ్రయంలో అడ్డుకునేందుకు అతను వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల ఎల్లో మీడియాకు చెందిన పలు ఛానళ్లలో జరిగిన చర్చల్లో కూడా లోకేశ్‌బాబు పాల్గొని సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వరప్రసాద్ తెలిపారు. ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.టీడీపీ నేతలు, ఎల్లో మీడియాకు ముందస్తు సమాచారంఎయిర్పోర్ట్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుంటున్నట్లుగా డాక్టర్ లోకేశ్‌బాబు ముందుగానే టీడీపీ నేతలకు, ఎల్లో మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సీఎం లండన్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కూడా ఎయిర్‌పోర్ట్‌కు రావాలని వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపించారు. ఈ సంఘటనను ఎల్లో మీడియా ప్రసారం చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ బాబు ఎన్నికలకు ముందు స్వదేశానికి వచ్చినట్లు తెలిసింది. నిత్యం సోషల్ మీడియా, ఎల్లో మీడియా వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన విషం కక్కుతున్నారు. ఇదిలా ఉండగా విజయవాడలో లోకేశ్‌బాబును టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు కలిశారు. -
లోకేష్ కు బొత్స స్ట్రాంగ్ కౌంటర్
-
పింఛన్లపై లోకేశ్ మాట్లాడొద్దన్నాడు
సాక్షి, అమరావతి : ఇంటి వద్ద పింఛన్ల పంపిణీని అడ్డుకుని వృద్ధులను 45 డిగ్రీల ఎండలో నడిరోడ్డున పడేసిన టీడీపీ ఇప్పుడు దానిపై ఏంచేయాలో తెలీక లబోదిబోమంటోంది. టీడీపీ అభ్యర్థులు, నేతలను పింఛనుదారులు ఎక్కడికక్కడ నిలదీస్తుండడం, తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో వారు బెంబేలెత్తిపోతున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ దొంగ రాజకీయం బయటపడిపోవడంతో ఏం మాట్లాడొద్దని చంద్రబాబు తనయుడు లోకేశ్‌బాబు పార్టీ కేడర్‌కు సూచించారు. దీనిపై ఏదో ఒకటి చేయాలని పార్టీ అభ్యర్థులు టీడీపీ కార్యాలయంలో పనిచేసే వారికి ఫోన్లుచేసి బతిమలాడుతున్నారు. కానీ, వారు తామేం చేయలేమని, తప్పు టీడీపీదేనని, దీనిపై ఏం మాట్లాడకుండా ఉండాలని చెబుతూ చేతులెత్తేశారు. దీంతో ఎల్లో మీడియా, సోషల్ మీడియా వృద్ధుల ఏడుపులపై దొంగ ప్రచారానికి దిగింది. చంద్రబాబును, టీడీపీని అడ్డగోలుగా వృద్ధులు తిడుతుంటే దాన్ని వక్రీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు చిత్రీకరించి తాము దిగజారుడులో మాస్టర్స్మని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో.. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధాన అనుచరుడు ఒకరు టీడీపీ కార్యాలయ ముఖ్య ఉద్యోగితో మాట్లాడుతున్న సంభాషణ వింటే (ఆడియో లీకైంది) పింఛన్లపై టీడీపీ ఏడుపు ఏమిటో అర్థమవుతుంది.ఇదీ సంభాషణ..పెమ్మసాని అనుచరుడు : హలో.. ఏమ్మా రఘు ఎక్కడున్నావ్?టీడీపీ కార్యాలయ ఉద్యోగి : అన్నా ఇక్కడే అన్నా.. ఆఫీసులోఅనుచరుడు : ఏమ్మా ఎట్లా ఉన్నావు?ఉద్యోగి : బానే ఉన్నా.. మీరెట్లా ఉన్నారన్నా..అనుచరుడు : బావున్నా.. ఏంలేదు పెన్షన్ ఇష్యూ బాగా వైరల్ అయిపోతోందంట. బ్యాడ్ నేమ్ వస్తోంది. మార్నింగ్ కూడా మన పెమ్మసాని గారు క్యాంపెయిన్‌కి వెళ్లినప్పుడు ఎక్కడపడితే అక్కడ ముసలోళ్లు గోలచేస్తూ సార్ దగ్గరికి వచ్చి నిలదీస్తున్నారు. ఆయన ఫుల్ హార్‡్ష మీద ఉన్నాడు. ఏంటసలు.. వీళ్లు ఏం చేస్తున్నారో కనుక్కోమన్నాడు. అందుకే కాల్చేశా..ఉద్యోగి : అన్నా నాకర్థమైంది. నాకూ ఉదయం నుంచి ఇదే విషయం మీద 40–50 కాల్స్ వచ్చాయి. అనుచరుడు : ఎందుకని మీరేం చేయలేకపోతున్నారు? అసలు ఏంటిది?ఉద్యోగి : చెప్పి చెప్పి విసిగిపోయామన్నా..అనుచరుడు : ఏంది విసిగిపోయేది.. వాళ్లేమో మన మీద అంత అగ్రెసివ్‌గా ఉంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ మనోడే అంటున్నారు. దాని మీద మనం ఏమీ కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకని?ఉద్యోగి : కౌంటర్ కాదన్నా.. అసలు విషయం ఏంటంటే.. యాక్చువల్‌గా మిస్టేక్ మనదే ఉంది. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే.. నిమ్మగడ్డ రమేష్‌తో పెద్దాయనే (చంద్రబాబు) ఇదంతా చేయించారు. పిటిషన్ వేయించి ఎన్నికల కమిషన్‌తో ఇట్లా చేయించారని బాగా స్ప్రెడ్ అయిపోయింది. అనుచరుడు : దానిపై కౌంటర్ ఇవ్వలేమా?ఉద్యోగి : దీని గురించి లోకేశ్ అన్నకు చెప్పాం. మీరెవ్వరూ దీనిపై ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వొద్దు అని చెప్పారు. 60–70 నియోజకవర్గాల నుంచి దీనిపై కాల్స్ వచ్చాయి. అనుచరుడు : కాదమ్మా రఘు.. ఇప్పటికే మన పరిస్థితి వరస్ట్‌గా ఉంది. పెమ్మసాని గారు ఇంత ఖర్చుపెట్టి కష్టపడుతున్నారు.. ఆయనే అన్నాడు.. దీనిపై ఇంతమంది ఇలా అడుగుతున్నారు.. మనవాళ్లు ఏం చేస్తున్నారో కనుక్కోమన్నారు. ఉద్యోగి : కాదన్నా.. ఇది ఒక పెమ్మసాని గారి విషయం కాదు. స్టేట్ మొత్తం ఇది ఉంది. లోకేశ్ గారు దీనిపై మాట్లాడవద్దన్నారు. ఒకవేళ దీనిపై రెస్పాండ్ అయితే మళ్లీ మన మీదకే మిస్‌ఫైర్ అవుతుంది, ఏ యాక్షన్ వద్దు అని చెప్పారు. అనుచరుడు : డ్యామేజి కంట్రోల్ ఎట్లా మరి? ఏం చేస్తారో ప్లాన్ ఏమీ చెప్పలేదా?ఉద్యోగి : లోకేశ్ అన్న చెప్పింది ఏమిటంటే అవసరమైతే పార్టీ వాళ్లతో ప్రెస్మీట్లు పెట్టిద్దాం. ఇప్పుడు మాత్రం ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్పారు. అందుకే మన వాళ్ల నుంచి దీనిపై ఒక్క పోస్టు కూడా రాలేదు. అనుచరుడు : ఏదో ఒకటి చేయండయ్యా.. ఇప్పటికే మనవాళ్లు చాలా డీమోరలైజ్ అయిపోయారు. లక్ష మంది అట్లా ఉంటే పోనీలే అనుకోవచ్చు. 72–73 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అందులో మనకి ఇంకో 10 రోజులే ఉంది. మనకి ఏదైనా తేడాపడితే..ఉద్యోగి : చూసుకుంటారన్నా మనవాళ్లు..అనుచరుడు : కొంచెం యాక్టివ్‌గా ఉండండి..ఉద్యోగి : కేడర్ డీమోరలైజ్ అవకుండా చూడాలన్నా.. అది మీరే చేయాలి.అనుచరుడు : నీకూ తెలుసు. పెమ్మసాని గారు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారని.. మాకు మీరు కొంచెం సపోర్ట్ చేయండి.ఉద్యోగి : ముసలోళ్లతో ఏముంది గానీ.. రెండు, మూడ్రోజులైతే అయిపోతుంది.. పెమ్మసాని అనుచరుడు : 2, 3 రోజులు కాదు. ఇంకా పది రోజులే టైముంది. ఏం చేయాలో? ఉద్యోగి : లోకేశ్ అన్న ప్రెస్మీట్లు పెట్టిద్దామన్నారు. మాట్లాడిస్తారు. -
మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
-
రాయి వేసిన దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్న బోండా ఉమా
-
"మంగళగిరిలో మూసీనది.."
-
టీడీపీలో ఓటమి భయం.. వాసిరెడ్డి పద్మ స్ట్రాంగ్ కౌంటర్
-
లోకేష్ ఓటమికి మంగళగిరి సిద్ధం
-
మండుటెండలో కూడా అంతులేని అభిమానం: రవి చంద్ర కిషోర్
-
బ్లాక్ మెయిల్ చేసేవారికే TDP టికెట్లా..?
-
విశాఖ డ్రగ్ లింకులు.. లోకేష్ తోడల్లుడు, పురందేశ్వరి కుమారుడు
-
ప్రధాని మోదీని వ్యక్తిగతంగా విమర్శించింది చంద్రబాబే
-
టీడీపీకి మాజీ మంత్రి గుడ్‌బై
-
ఓటమి భయం.. మరో మాస్టర్ ప్లాన్!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు నిజంగానే రెస్ట్ అవ్వాలని ఆయన భార్య భువనేశ్వరి భావిస్తున్నారా? ఆయనది పెద్ద వయసు కనుక, ముప్పై ఐదేళ్ల పాటు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఆమెకు ఆ ఆలోచన వచ్చింది. చంద్రబాబు ఆరోగ్య రీత్యానే ఆమె ఆ ప్రకటన చేసి ఉంటే అది అభినందించదగిందే. చంద్రబాబు కూడా నిజంగానే ఆమె కుప్పంలో పోటీచేయాలని అభిప్రాయపడుతుంటే కొంత అప్రతిష్ట వచ్చినా, కాస్త తెలివైన నిర్ణయమే అనిపించవచ్చు. ఎందుకంటే తాను ఓడిపోతానేమో అన్న అనుమానం ఉన్నప్పుడు రిస్క్ తీసుకోకుండా ఈ ప్లాన్ అమలు చేయవచ్చు. అదే తరుణంలో భువనేశ్వరి కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఆమె ఏదో సరదాగా చెప్పినట్లు కనిపించాలని అనుకున్నా, అసలు ఉద్దేశం బయటపెట్టినట్లయింది. కుప్పంలో చంద్రబాబు విజయావకాశాల మీద సందేహాలు రావడం వల్లే ఈ ప్లాన్ వేసినట్లు అనిపిస్తుంది. చంద్రబాబు ఈ సారి ఇక్కడ నుంచి పోటీచేయరు అని నేరుగా చెబితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకోసం టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్‌ను మానసికంగా సిద్దం చేయడానికి ఆమెతో ఈ మాటలు చెప్పించి ఉండాలి. లేదా కుప్పం టీడీపీ క్యాడర్ పల్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అయినా అనుకోవచ్చు. లేదా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని భువనేశ్వరి ఆశిస్తుండవచ్చు! ఎందుకంటే ఆమె తండ్రి ఎన్.టీ రామారావు, ఇద్దరు సోదరులు హరికృష్ణ, బాలకృష్ణ, సోదరి పురందేశ్వరిలు రాజకీయాలలో చేరి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. ఆ ప్రభావం కూడా పనిచేస్తుండవచ్చు. ఈ మధ్యకాలంలో భువనేశ్వరి కూడా న్యాయం గెలవాలి.. అంటూ ఒక కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. తన భర్త చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో చిక్కి జైలుకు వెళ్లినప్పుడు భువనేశ్వరి ప్రజలలోకి వచ్చారు. దాంతో ఆమె రాజకీయాల మజా రుచి చూసి ఉంటారు. ఇలా ఆమెకు ఈ కోరిక వచ్చి ఉండవచ్చు. పైగా కుప్పం నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో జరిగిన అనేక పరిణామాలలో తెలుగుదేశం బాగా బలహీనపడింది. మున్సిపల్ ఎన్నికలలో ఎంత వ్యయం చేసినా, టీడీపీ గెలవలేకపోయింది. మండల, జడ్పీలలోను అదే పరిస్థితి. సర్పంచ్‌లు తొంభై శాతం మంది వైఎస్సార్సీపీవారే ఎన్నికయ్యారు. తత్ఫలితంగా టీడీపీ ఈసారి కుప్పంలో గెలుస్తుందా? లేదా? అనే చర్చ వచ్చింది. కుప్పం నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టడం, కుప్పంను మున్సిపాల్టీ చేయడం, ఆర్డిఓ కేంద్రంగా మార్చడం, కుప్పంకు కృష్ణా జలాలను తీసుకురావడం వంటివాటివల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రాఫ్ బాగా పెరిగింది. దాంతో చంద్రబాబు అక్కడ పోటీ చేయడానికి భయపడుతున్నారు. కాకపోతే ఆ విషయం చెప్పకుండా చంద్రబాబు దాటవేస్తున్నారు. ఎన్నికలు దగ్గరబడుతుండడంతో ఆయన తన భార్య ద్వారా ఈ విషయం చెప్పినట్లు అనుకోవాలి. కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు గురించి ఆయన భార్య భువనేశ్వరి స్వయంగా విశ్రాంతి అవసరం అని చెప్పారంటే అందులో ఏదో మతలబు ఉండి తీరాలి. మరో రెండు ఎన్నికలు జరగనున్న తరుణం, ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ఒకవైపు ప్రచారం చేస్తూ, మరో వైపు ఆయన భార్యే రెస్ట్ ఇవ్వాలని అనడం అంటే కచ్చితంగా డౌట్లు వస్తాయి. ఒకటి.. రాష్ట్రంలో, కుప్పంలో టీడీపీ గెలవలేదన్న భావన రావడం, రెండు.. కుప్పంలో చంద్రబాబును పోటీనుంచి తప్పించడం, మూడు.. ఆయనతో పోటీచేయించినా మరో సురక్షిత సీటునుంచి పోటీచేయించాలని అలోచించడం, నాలుగు.. నిజంగానే చంద్రబాబుకు రెస్టు ఇచ్చి, కుమారుడు లోకేష్‌ను ఫోకస్ చేయడం. వీటిలో ఏదైనా కావచ్చు. గతంలో లోకేష్ ఎమ్మెల్యే కాకపోయినా, ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇప్పించడం, భువనేశ్వరి, బ్రాహ్మణిల ఒత్తిడి ఉందని అప్పట్లో టీడీపీ వర్గాలలో ప్రచారం జరిగింది. అలాగే ఇప్పుడు ఏమైనా చంద్రబాబు సీరియస్ పోటీలో ఉంటే, లోకేష్‌కు అవకాశాలు తగ్గుతున్నాయన్న భావన ఏమైనా ఉందేమో తెలియదు. మరోవైపు చంద్రబాబు కుప్పం బదులు పెనమలూరు లేదా మరో సేఫ్ నియోజకవర్గం నుంచి పోటీచేయవచ్చన్న ప్రచారమూ ఉంది. ఇది కాకుండా బీజేపీ వారి పొత్తు కండిషన్లలో చంద్రబాబును ఏమైనా పార్లమెంటుకు పోటీచేయాలని కోరుతున్నారా? అనే ఊహాగానాలు ఉన్నాయి. పెనమలూరులో చంద్రబాబు పోటీచేసే అవకాశం ఉందని ఐదారు నెలల క్రితం నుంచే టీడీపీ వర్గాలు అంతర్గంగా చెప్పుకుంటున్నాయి. కుప్పంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాగా ఫోకస్ పెట్టి అభివృద్ది పనులు చేయించడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గట్టిగా పనిచేసి చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకున్న పరిస్థితిలో చంద్రబాబులో ఆందోళన ఉంటుంది. అంతేకాక ఆయన గతంలో ఎక్కువగా ఆధారపడ్డ దొంగ ఓట్లను చాలావరకు తొలగించారట. ఈ కారణాల రీత్యా తాను పోటీచేయకపోయినా, తన భార్యను పోటీలో దించితే ఏమైనా సానుభూతి వస్తుందా? లేక ఓడిపోయినా అంత నష్టం ఉండదులే అనుకునైనా ఉండాలి. ఏది ఏమైనా భువనేశ్వరి ప్రకటన టీడీపీ క్యాడర్‌ను ఆలోచించుకునేలా చేస్తుంది. టీడీపీ గ్రాఫ్ పడిపోయిందనుకుంటున్న తరుణంలో ఈమె ప్రకటన పెద్ద దెబ్బగా భావించాలి. గతంలో కొందరు నేతలు తమ బదులు తమ భార్యలను పోటీలో ఉంచిన సందర్భాలు లేకపోలేదు. ఉదాహరణకు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి తాను ఎంపీగా పోటీచేసి, వెంకటగిరి సీటును తన భార్య రాజ్యలక్ష్మికి ఇచ్చారు. ఆమె రెండుసార్లు గెలిచి, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. మరో మాజీ సీఎం దామోదరం సంజీవయ్య భార్య ఎమ్మల్యే కాలేదు కానీ, ఎమ్మెల్సీ అయి కొద్దికాలం మంత్రిగా కూడా ఉన్నారు. ఇలా ఇంకో మాజీ ముఖ్యమంత్రి ఎన్.టీ రామారావు రెండో భార్య లక్ష్మీపార్వతి ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఒక దశలో ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేయాలని ఎన్.టీ రామారావు అనుకున్నారని ప్రచారం జరిగింది. అతని మరణం తర్వాత ఆమె పాతపట్పం నుంచి పోటీచేసి ఉప ఎన్నికలో గెలిచారు. మరో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత ఆయన భార్య విజయమ్మ పులివెందుల నుంచి ఒకసారి ఏకగ్రీవంగాను, మరోసారి పోటీలోను నిలబడి గెలిచారు. బీహారులో ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణంలో జైలుకు వెళ్లవలసి వచ్చినప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేసి బార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత కాలంలో ఆమె ప్రతిపక్షనేతగా కూడా ఉన్నారు. ఇలా రకరకాల ఉదాహరణలు ఉన్నాయి. ఏది ఏమైనా భువనేశ్వరి ప్రకటన మొత్తం రాజకీయవర్గాలలో ఆశ్చర్యం కలిగిస్తే, తెలుగుదేశం వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. అసలే పార్టీ గెలుస్తుందో, లేదో అని భయపడుతున్న తరుణంలో భువనేశ్వరి ఒక రకంగా రాజకీయ బాంబును పేల్చారని చెప్పవచ్చు. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చంద్రబాబుకు మంత్రి మేరుగ నాగార్జున సవాల్
సాక్షి, విజయవాడ: ప్రతిపక్షనేత చంద్రబాబుకు మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు తాము సిద్దమని వెల్లడించారు. తమతో చర్చకు చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్దకు బాబు రావాలని చాలెంజ్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ఎవరైనా చర్చకు రావాలని అన్నారు. సైకిల్‌ను జనం తొక్కేశారని, మడతపెట్టి పక్కన పడేశారని విమర్శించారు. త్వరలోనే మళ్ళీ అదే జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని మండిపడ్డారు. కళ్యాణమస్తు, షాదీతోఫా కింద రూ. 78.53 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారని మంత్రి పేర్కొన్నారు. పెళ్లికానుక కింద చంద్రబాబు 70 కోట్లు ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆ మొత్తాన్ని కూడా సీఎం జగన్ ఇచ్చారన్నారు. వైఎస్ జగన్ నిబద్ధత కలిగిన నాయకుడు అని, ఆయన్ని నమ్ముకుని నడుస్తున్నామన్నారు. ఎవరైనా పక్కకు వెళ్లినా తిరిగి పార్టీలోకి వస్తారని చెప్పారు. -
దిగజారుడుతనానికి కేరాఫ్ చంద్రబాబే
'తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిజంగానే తన వయసుకు తగ్గట్లు మాట్లాడడం లేదు. ఏదేదో, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి తీసుకు వెళుతున్నారు. రా.. కదలిరా..! అంటూ జరుపుతున్న సభలలో ఎందుకు ప్రజలు కదలి రావాలో చెప్పకుండా, ఎంత సేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను దూషించే పనిలో ఉంటున్నారు దీంతో టీడీపీ క్యాడర్ ఇంతకీ చంద్రబాబు ఏమి చెప్పారన్న సంశయంలో పడిపోతున్నారు.' కొద్ది రోజుల క్రితం ఇంకొల్లులో జరిగిన సభలో ఆయన తన వయసు, తాను గతంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించానన్న సంగతిని విస్మరించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను నోటికి వచ్చినట్లు తిట్టడం శోచనీయం అని చెప్పాలి. ఈ దిగజారుడు మాటల్లో హైలైట్ ఏమిటంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి అవసరానికి కాళ్లు పట్టుకుంటాడు.. తర్వాత కాళ్లు లాగేస్తాడు.. అని చంద్రబాబు అనడం. ఇది తన గురించి తాను చెప్పుకోబోయి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నింద మోపినట్లుగా ఉంది. ప్రస్తుతం ఆయన ఎవరి కాళ్లు పట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో ఒక్కశాతం కూడా ఓట్లు లేని బీజేపీతో పొత్తుకోసం ఎవరు కాళ్లా, వేళ్ల పడుతున్నది ఏపీ ప్రజలందరికీ తెలుసు. జనసేన సీట్లు, టీడీపీ సీట్లు, అభ్యర్దులను ఖరారు చేయకుండా దేవుడా, దేవుడా అంటూ ప్రార్ధన చేస్తూ కూర్చున్న చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. తాను చేసే పనులను ఎదుటివారిపై నెట్టడంలో సిద్దహస్తుడైన చంద్రబాబు గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లు ప్రధాని మోదికి దత్తపుత్రులు అని, మోది అంటే భయపడుతున్నారని రంకెలు వేస్తూ స్పీచ్‌లు ఇచ్చేవారు. చంద్రబాబు ఇప్పుడు ఎందుకు బీజేపీకి సరెండర్ అవుతున్నారు? మరి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నడైనా తనకు బీజేపీతో పొత్తు కావాలని మోదిని కాని, అమిత్‌షాను కాని బతిమలాడారా? లేదే! అయినా చంద్రబాబు ఇలాంటి పిచ్చి మాటలు చెప్పడం ద్వారా పరువు పోగొట్టుకుంటున్నారు. ప్రధాని మోదీ ఎప్పుడు పిలుస్తారా.. అన్నట్లుగా, ఆయన కంటి చూపు పడితే చాలు.. అన్నట్లుగా చకోర పక్షిలా వేచి ఉన్న చంద్రబాబు ఎదుటివారిపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. చంద్రబాబు బీజేపీని అవసరమైనప్పుడు కాళ్లావేళ్లపడి బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత వారిని చీ కొట్టి, అవమానించి విడిపోయారు. దానిని కదా అనాల్సింది. అవసరమైతే జుట్టు.. లేకుంటే కాళ్లు అని.. అయినా ఆయన దబాయించి ఎదుటివారిపై నోరుపారేసుకుంటున్నారు.తాను స్కిల్ స్కామ్ కేసులో జైలులో ఉన్నప్పుడు తన కుమారుడు లోకేష్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వద్దకు ఎందుకు చంద్రబాబు పంపించారు. కాళ్లు పట్టుకోవడానికా? లేక అమిత్‌షా చొక్కా పట్టుకోవడానికా? ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం స్వయంగా చంద్రబాబే ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో సరదా కబుర్లు చెప్పి వచ్చారా? లేక ఆయన వద్ద చేతులు కట్టుకుని కూర్చుని కాళ్లా, వేళ్లాపడి పొత్తు ప్లీజ్ అని బతిమలాడారా? ఏదో తన బినామీ పత్రికలు ఉన్నాయి కదా అని అమిత్‌షానే రమ్మంటే వెళ్లానని ప్రచారం చేసుకున్నారు. అదే మాట 'షా' తో ఎందుకు చెప్పించలేకపోయారు! తనను కలిసిన పదిరోజులు దాటినా, పొత్తు గురించి చంద్రబాబు ఎదురుచూసేలా అమిత్‌షా చేశారంటే ఏమిటి దాని అర్ధం!. 1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ మసీదులు కూల్చేపార్టీ అని ప్రచారం చేశారు. 1998 ఎన్నికల తర్వాత వారి గూట్లో చేరిపోయారు. 2004లో ఓటమి తర్వాత ముస్లీంలకు ద్రోహం చేసే బీజేపీతో కలిసి తప్పు చేశానని, జీవితంలో ఎప్పుడూ కలవబోనని బీరాలు పలికారు. గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదిని నరహంతకుడు అనే వరకు వెళ్లారు. ఆ తర్వాత పార్లమెంటులో దీనికి సంబంధించి ఓటింగ్ జరిగినప్పుడు తన ఎంపీలు జారుకునేలా చేశారు. దీనిని కాళ్లబేరం అని కదా అనాల్సింది. 2009లో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో కలిసిపొత్తు పెట్టుకుని ఓడిపోయిన తర్వాత వాళ్లను గాలికి వదలివేసి మళ్లీ బీజేపీ వైపు పరుగులు తీశారు. ఏ మోదినైతే తిట్టారో తిరిగి ఆయన దేశంలో ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి బాబ్బాబు.. ప్లీజ్.. ఈ ఒక్కసారి మన్నించండని కోరింది చంద్రబాబు కాదా! మళ్లీ 2018 నాటికి మోదిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, చివరికి మోదిని ఉగ్రవాది అని కూడా దూషించిన చరిత్ర చంద్రబాబుది. దానిని కాళ్లులాగడమంటే అనేది. అవన్ని ఎందుకు! చంద్రబాబుకు పిల్లను ఇచ్చిన మామ ఎన్టీ రామారావుకు నిత్యం పాద నమస్కారాలు చేస్తున్నట్లు నటించి, లటక్కున ఆయనను కుర్చీ నుంచి లాగిపారేసింది చంద్రబాబే కదా! దానిని కదా కాళ్లు లాగేడయమనేది. ఆ దెబ్బకే కదా ఎన్టీఆర్ గుండె ఆగి మరణించింది! అయినా చంద్రబాబు అవేమీ జరగనట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిందలు వేస్తుంటారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడైనా ఎవరి కాళ్లమీదైనా పడ్డారా? కాళ్లు పట్టుకుని లాగారా? లేదే! ఆయన శంషేర్‌గా దేశంలోనే అత్యంత శక్తిమంతురాలిగా ఉన్న సోనియాగాంధీని, కాంగ్రెస్‌తో రహస్య బంధం పెట్టుకున్న చంద్రబాబును ఎదుర్కుని, వారు పెట్టిన అక్రమ కేసులను భరించి జైలుకు వెళ్లి, తదుపరి ఎన్నికలలో నిలబడి గెలిచిన ధీశాలి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్న సంగతి అందరికి తెలిసిందే. అందువల్ల చంద్రబాబు తన చరిత్ర ఎవరికి తెలయదనుకుని భ్రమపడి ఏదిపడితే అది మాట్లాడితే , ప్రజలకు పాత చరిత్ర గుర్తుకు వస్తుందని మర్చిపోకూడదు. చంద్రబాబు దెబ్బకు వైఎస్ రాజశేఖరరెడ్డి భయపడ్డాడట. ఇదొక వండర్! ఇలాంటి మాటలు చెప్పడం అంటే వినేవాడు వెర్రివాడులే అన్న ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. డెబ్బై నాలుగేళ్ల వయసులో ప్రజలను మద్యం తాగవద్దు అని చెప్పకుండా, మంచి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాను.. నాకే ఓటేయండని ఆయన పిలుపు ఇస్తున్నారంటే ఇంతకంటే అద్వాన పరిస్థితి ఉంటుందా! ఎవరు అడ్డువచ్చిన తొక్కివేస్తారట! ఇదేమి గోలో అర్థం కాదు. ఎవరిని తొక్కుతారు! అసలు చంద్రబాబును ఎవరైనా ఎందుకు అడ్డుకుంటారు? తెలుగుదేశంకు అంత సీన్ ఉందా! అని చర్చించుకుంటున్న తరుణంలో ఆయనకు ఆయనే బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. దానివల్ల రాజకీయంగా ఆయనకు జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ముఖ్యమంత్రి తన ముందు బచ్చా అని చంద్రబాబు అనడం మరో పిచ్చి వ్యాఖ్య. రాజకీయాలలో బచ్చా, బడా అని ఉండరు. ఎన్టీ రామారావు ముందు ఈయన బచ్చానే కదా! ఆయనను ఎందుకు కుర్చీనుంచి లాగి పారేశారు. 2019లో చంద్రబాబును ఎన్నికలలో ఓడించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బచ్చా ఎలా అవుతారు! హీరో అవుతారు కాని. ఒంటరిగా పోటీచేయడానికి సిద్ధం అవుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి బచ్చా అవుతారా? లేక తాను వాళ్ల మద్దతు, వీళ్ల మద్దతు లేకపోతే ఎన్నికలలో నిలబడలేనని భయపడుతున్న చంద్రబాబు బచ్చా అవుతారా! ఇలాగే ఆయన స్పీచ్‌లు కొనసాగిస్తే.., మతి స్థిమితం లేని మాటలు చంద్రబాబు నోట పదే, పదే వస్తున్నాయని జనం, ముఖ్యంగా తెలుగుదేశం క్యాడర్ అనుకుంటారు. ఆ విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. మరో వైపు ఆయనకు రాజగురువునని భావించే రామోజీరావు అంతకన్నా మతిలేని వార్తలు రాస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం కక్కుతున్నారు. నిజానికి ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కాదు విషం చిమ్ముతున్నది. ఏపీ ప్రజలపైన అని చెప్పాలి. ఉన్నవి, లేనివి కల్పించి అబద్దాలు సృష్టించి నానా చెత్త అంతా పోగు చేసి ప్రజలను మోసం చేయాలని రామోజీ చేస్తున్న వికృతచర్యలు కచ్చితంగా ప్రజలందరు అసహ్యించుకునే దశకు చేరుకున్నాయి. చివరికి తెలుగుదేశం క్యాడర్ కూడా చీదరించుకునే పరిస్థితిని రామోజీ తెచ్చుకున్నారు. రామోజీనేమో తన పిచ్చి రాతలతో, చంద్రబాబేమో తన పిచ్చి మాటలతో ఏపీ ప్రజలను విసిగిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలిస్తే కానీ, వారి పిచ్చి కుదరదేమో! -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
షర్మిల పై అసభ్య పోస్టులు పెట్టి అడ్డంగా దొరికిపోయిన టీడీపీ కార్యకర్త
-
చంద్రబాబు, లోకేష్ కుర్చీలను ఎప్పుడో మడతపెట్టేశాం: పేర్ని నాని
-
చంద్రబాబు, లోకేష్ కుర్చీలను ఎప్పుడో మడతపెట్టేశాం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: 2019లో చంద్రబాబు, లోకేష్ కుర్చీలను మడతపెట్టేశామని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2024లో కూడా మళ్లీ వాళ్ల కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఊరూరా షామియానా కంపెనీలో కుర్చీలు అద్దెకు తెచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదని..మీ సమావేశాల్లొ ఖాళీగా ఉన్న కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టాలో చూసుకోండని చురకలంటించారు. గురివింద గింజకు ఒక్కచోటే మచ్చ.. కానీ బాబుకు నిలువెళ్లా మచ్చలేనని విమర్శించారు. చంద్రబాబు పేరు చెప్తే.. ఒక్క పథక కూడా గుర్తుకు రాదని అన్నారు. చంద్రబాబు సవాల్‌కుపేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పిట్టల దొరలా ఊరూరా తిరిగి హామీలిచ్చాడని మండిపడ్డారు. బందరులో ఓట్లు అడుక్కోవడానికి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. బందరు పోర్టును పూర్తిచేశావా?. మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నావ్.. మూడు గజాలైనా ఇచ్చావా అని ప్రశ్నించారు. ఆక్వా హబ్‌ను చేస్తానన్నావ్ చేశావా?. హైదరాబాద్ నుంచి బందరుకు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానని మోసం చేశాడన్నారు. ఎన్నికల ముందు మాటిచ్చి ఓటేసిన తర్వాత మోసం చేసే గుణం ఉన్నోడే చంద్రబాబు అని పేర్ని నాని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. 99 శాతం హామీలు నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. సీఎం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్కపథకమైనా ఉందా అని ప్రశ్నించారు. చదవండి: బాబుకన్నా దుర్మార్గులు ఎవరుంటారు? -
షర్మిలపై ఐటీడీపీ అసభ్య పోస్టింగ్ లు
-
హ్యాపీ బర్త్‌డే లోకేష్ బ్రో అంటూ లోకేష్ ని ఏకిపారేసిన YSRCP మహిళా నేత
-
లోకేష్ బ్రాహ్మణి పెళ్ళికి ముందు చంద్రబాబు చేసిన కామెంట్స్
-
చంద్రబాబు, లోకేష్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్స్: అంబటి
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు ఆర్థిక బలంతో చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబుకి మద్దతుగా.. ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తోందని ధ్వజమెత్తారు. దొరకని దొంగలా ఇన్నాళ్లు చెలామణి అయిన చంద్రబాబు.. స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. రూ. 371 కోట్లు లూటీ చేసినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్ర నిరాశకు గురిచేసిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. హైకోర్టులో కూడా 17 ఏ ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పని వాదించారని ప్రస్తావించారు. ఈ కేసును కొట్టివేయాలని కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారని అన్నారు. వంద కారణాలు చెప్పి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. చదవండి: రాజకీయ కక్షతో పెట్టిన కేసు కాదని కోర్టు చెప్పింది: పొన్నవోలు ‘చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాగా దిట్ట. దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు. జైల్లో ఉంటేనే చంద్రబాబు ఆరోగ్యం బాలేదా? ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డులోనూ వందల కోట్లు కాజేశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో కూడా అడ్డంగా బుక్కయ్యారు. చంద్రబాబు, లోకేష్, రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్స్. వైఎస్సార్సీపీని ఓడించే సత్తాలేక.. ప్రతి ఒక్కరితో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు అవినీతి ప్రజలకు అర్ధమైంది. చట్టం నుంచి ఆయన తప్పించుకోలేరు. పవన్ క్యలాణ్ కుడా అవినీతి పరుడే. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి అనుకూలంగా పవన్ మద్దతు ఇస్తుంటాడు’ అని అంబటి మండిపడ్డారు. చదవండి: -
నారా లోకేశ్ కోసం ఇద్దరు యాంకర్లు రెడీ అయ్యారు: అంబటి సెటైర్లు
అమరావతి: లోకేష్ పాదయాత్ర వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎవరూ గుర్తించని యాత్ర అది అని ఎద్దేవా చేశారు. కనీసం లోకేష్ కైనా, పార్టీకైనా ఈ యాత్ర ఉపయోగపడిందా? అని ఎద్దేవా చేశారు. లోకేష్ కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మృతి చెందారు. లోకేష్‌ది అశుభయాత్ర అని అంటూ విమర్శించారు. 'ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా తెల్లగ మారదనే వేమన శతకంలాగ లోకేష్ యాత్ర కొనసాగింది. యాత్ర వలన ఒళ్లు తగ్గిందే తప్ప, మైండు మెచ్యూరిటీ లేదు. కుప్పంలో అడుగు వేయగానే తారకరత్న మృతి చెందారు. అశుభయాత్ర చేశాడు లోకేష్. పాదం పెట్టగానే నందమూరి వంశస్తుడు చనిపోయాడు. జనంలేక వెలవెలబోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎల్లోమీడియా నైతే విపరీతంగా జనం వచ్చారని చెప్పటానికి తెగ ప్రయత్నం చేసింది. చివరికి యాంకర్ ఉదయభానుని తెచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది' అని అంబటి అన్నారు. 'బీసీ, ఎస్సీ, ఎస్టీ చౌదర్లులారా.. అంటూ లోకేష్ మాట్లాడారు. మూడు పదిహేను వేలు తొంభై వేలు అని చెప్పిన అజ్ఞాని లోకేష్. బాలకృష్ణ రేపు యాంకరింగ్ చేయబోతున్నారు. ఇంకో యాంకర్ పవన్ కళ్యాణ్ కూడా రేపు యాంకరింగ్ చేయబోతున్నారు. వృద్ధ తండ్రి తన అసమర్ధ కొడుకుని హైలెట్ చేయటానికి చేస్తున్న ప్రయత్నమే కనిపిస్తుంది. లోకేష్ యాత్ర అంత విజయవంతమైతే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌ల యాంకరింగ్ ఎందుకు? సీట్లు, నోట్లు మాట్లాడుకుని పవన్ కళ్యాణ్‌తో యాంకరింగ్‌కి ఒప్పించుకున్నారు. కిరాయి తీసుకుని పవన్ కళ్యాణ్ లోకేష్ సభకి యాంకరింగ్ చేస్తున్నారు. స్పెషల్ ఫైట్లు, స్పెషల్ రైళ్లలో రేపు జనాన్ని తరలిస్తున్నారు.' అని అంబటి చెప్పారు. 'స్కాంలో సంపాదించిన సొమ్ము రేపు ఖర్చు పెట్టబోతున్నారు. సోదరుడికి, చౌదరికి తేడా తెలీని వ్యక్తి లోకేష్. సూట్ కేసులు మోసేది నాదెండ్ల మనోహర్. ప్రజల్లో గెలవకుండా మంత్రి ఐన వ్యక్తి లోకేష్. అలాంటి వారికి ప్రజల కష్టాలేం తెలుసు? 175 సీట్లు గెలవటమే లక్ష్యంగా ఇన్ఛార్జుల ప్రకటన జరుగుతోంది. అంతర్గత బదిలీలు సహజంగా జరుగుతుంటాయి. చంద్రబాబు చంద్రగిరి నుండి కుప్పం ఎందుకు బదిలీ అయ్యారు?' అని అంబటి మండిపడ్డారు. ఇదీ చదవండి: చంద్రబాబు ప్లాన్.. పవన్, నాగాబాబుకు కొత్త కష్టం! -
చంద్రబాబు దళితులను ఎంత అవమానించాడో: తానేటి వనిత
-
మధ్యంతర బెయిల్ రాగానే నిజం గెలిచినట్టా?
-
టీడీపీ కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్
అమరావతి: టీడీపీ నిర్వహించిన కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబుకు సంఘీభావంగా కళ్ళుకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టాలని లోకేష్ పిలుపు నిచ్చినప్పటికీ.. ప్రజలు, టీడీపీ క్యాడర్ పట్టించుకోలేదు. ఇళ్లల్లో నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు బయటికి కూడా రాలేదు. చంద్రబాబు సంఘీభావ కార్యక్రమాలు వరుసగా అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాలు ఇప్పటికే అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఫోటోలకు పోజులు కోసం కొంతమంది టీడీపీ సంఘీభావం పేరుతో డ్రామాలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘లోకేష్ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది’ -
పురందేశ్వరిది నిలకడలేని రాజకీయం.. విజయ సాయి రెడ్డి కౌంటర్
-
లోకేష్-అమిత్‌షా భేటీపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ఇటీవల అమిత్‌షాను కలిసిన సంగతి తెలిసిందే. అయితే నారా లోకేష్ కేంద్రమంత్రిని కలవడంలో తన పాత్ర ఏమి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అమిత్‌షాను పదేపదే అపాయింట్మెంట్ అడిగింది లోకేషేనని తెలిపారు. ఢిల్లీలో ఉన్న పది రోజుల్లో లోకేష్ పలుమార్లు అమిత్‌షా అపాయింట్మెంట్ కోసం విజ్ఞప్తి చేశారని చెప్పారు. తొలుత హోంమంత్రి బిజీ షెడ్యూల్ కారణంగా లోకేష్‌ను కలవలేదన్నారు. తెలుగురాష్ట్రాల్లో ఉన్న ఏకైక కేంద్రమంత్రిగా తాను ఆ సమావేశానికి హాజరయ్యానని వివరించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే తనను అమిత్‌షా దగ్గరకు తీసుకెళ్లారని లోకేష్ గతంలో చెప్పడంతో ఆయన ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్‌షా చాలామందిని కలుస్తారని, ప్రత్యర్థులు అపాయింట్మెంట్ అడిగినా ఇస్తారని స్పష్టం చేశారు కిషన్‌రెడ్డి. -
బండారు కామెంట్స్ పై నా పిల్లల రియాక్షన్: ఆర్కే రోజా
-
ప్రొద్దుటూరు టీడీపీలో వర్గపోరు
-
ఏపీకి చంద్రబాబు ఎప్పుడు నాయకుడు కాలేడు: పోసాని
-
బాలకృష్ణ,లోకేష్ పై అంబటి రాంబాబు సెటైరికల్ పంచ్ లు
-
లోకేష్ కు సీఐడీ ప్రశ్నలు
-
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు లోకేష్
-
లోకేష్ కు పప్పు అని పేరు ఎందుకు వచ్చిందంటే..?
-
తండ్రి కొడుకు పిచ్చోళ్ళు అంటున్న ఆర్కే రోజా
-
లోకేష్ కు నోటీసులు ఇచ్చాం: సీఐడీ అధికారులు
-
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా లోకేష్
-
'చంద్రబాబుపై సానుభూతి కోసం టీడీపీ ప్రయత్నాలు'
ఢిల్లీ: చంద్రబాబు , లోకేష్ నిజమైన సైకోలని ఎంపీ నందిగామ సురేష్ అన్నారు. చంద్రబాబుపై సానుభూతి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఎవరికీ భయపడనని చెప్పే చంద్రబాబు, జైళ్లో దోమలకు భయపడతారా ? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం టీడీపీ నేతల నుంచే ఉందని ఎంపీ సురేష్ చురకలు అంటించారు. చంద్రబాబు లాగే వెన్నుపోటు విద్య లోకేష్ కు అబ్బినట్టుందని ఎంపీ సురేష్ దుయ్యబట్టారు. చంద్రబాబు పదవి కోసం లోకేష్ ఇలా వ్యవహరించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారి ఫోన్లు చెక్ చేయాలని సూచించారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేష్టలు దారుణమన్న ఎంపీ సురేష్.. వీళ్ళు ప్రజా నాయకులా ? అని ప్రశ్నించారు. 'బాలకృష్ణ మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. పిచ్చోళ్లకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదు. మెంటల్ బాలకృష్ణ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీకి ఎందుకు పోవడం లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి పదవులు అనుభవించిన లోకేష్ దోపిడీకి పాల్పడ్డారు' అని ఎంపీ సురేష్ అన్నారు. ఇదీ చదవండి: టీడీపీ మూడు ప్రయత్నాలు.. చంద్రబాబు లూటీకి పాన్ ఇండియా ప్రచారం -
‘స్కిల్’లో చంద్రబాబు దోపిడీ
నెల్లూరు(దర్గామిట్ట): మాజీ సీఎం చంద్రబాబు తన నైపుణ్యాన్ని ప్రదర్శించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.371 కోట్లు దోచుకున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిర్మాతల వద్ద రెమ్యూనరేషన్ తీసుకుని కెమెరాల ముందు మాట్లాడిన విధంగానే చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని ప్రజల ముందు మాట్లాడడం అలవాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు, లోకేశ్‌లపై నమ్మకం లేక బాలకృష్ణను మధ్యవర్తిగా పెట్టుకుని జైల్లో డీల్ కుదుర్చుకున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని నాయకుల కాళ్లమీద పడి తన తండ్రిని బయటకు తెచ్చుకునేందుకు లోకేశ్ ఢిల్లీలో గడప గడపకు తిరుగుతున్నాడని అన్నారు. గతంలో అనేక కేసుల్లో చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసి, కోర్టులకు వెళ్లి సాంకేతిక కారణాలు చూపించి స్టేలు తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు అక్రమాలపై కోర్టులకు కూడా స్పష్టత వచ్చిందన్నారు. చంద్రబాబు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా.. అని టీడీపీ శ్రేణులే అనుకుంటున్నాయని, చివరకు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా బాబు పనైపోయిందని మాట్లాడుతున్నారని చెప్పారు. వీటన్నింటినీ పరిశీలిస్తే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని టీడీపీ క్యాడర్‌కు కూడా అర్థమైందని తెలుస్తోందన్నారు. తన భార్య ఆస్పత్రిలో ఉన్నారని రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్ సెలవు పెడితే పచ్చ మీడియా ప్రజలను రెచ్చగొట్టేలా అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబాలకు మేలు జరిగితేనే తమకు ఓటు వెయ్యాలని సీఎం జగన్ ధైర్యంగా చెబుతున్నారని, కానీ చంద్రబాబు మాత్రం ఎవరో ఒకరితో పొత్తులు పెట్టుకుని ప్రజలను బలి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. -
చంద్రబాబూ.. అలా చెప్పే ధైర్యంగా ఉందా?: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్: కొన్ని వేల హామీలు ఇచ్చి అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పథకం అమలు చేశాను అని ధైర్యంగా బాబు చెప్పగలరా.. 14 సంవత్సరాల సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమని మండిపడ్డారు. చదుకునే రోజుల్లో ఆయన ఆస్తులు ఎంత, ఈనాడు ఆయన ఆస్తి ఎంతో ప్రజలకు తెలుసు.. బాబు హయాంలో అవినీతి రాష్ట్రంగా పేరు గాంచిందన్నారు. లోకేష్ రాష్ట్రానికి చేసింది ఏమి లేదని, మంగళగిరిలో ఓడిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసినా ఫలితం శూన్యమన్నారు. గత ప్రభుత్వంలో ఆఖరికి దేవాలయాల్లో స్వీపర్ పోస్టుల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. బాబు హయాంలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి శూన్యం కాగా.. సీఎం జగన్ పాలనలో రెవెన్యూ డివిజనల్, కుప్పం నగర అభివృద్ధి జరిగిందని తెలిపారు. తండ్రి కొడుకులు ఉండేది హైదరాబాద్‌లో పోటీ చేసేది కుప్పం, మంగళగిరిలో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీళ్లు సీఎంపై ఆరోపణలు చేయడం తప్ప.. రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా 51 శాతంతో అధికారంలోకి వచ్చిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కిందన్నారు. అధికార వికేంద్రీకరణ చేయడం వల్ల సీఎం జగన్ అభివృద్ధికి నాంది పలికారన్నారు. గాలిని ఆపింది, తుఫాన్ ఆపింది నేనె అని గాలి కబుర్లు చెప్పే వ్యక్తి జగన్ కాదని.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించే వ్యక్తి అని అన్నారు. ఐదు సంవత్సరాలు పాలన చేసిన దివంగత వైఎస్సార్‌ను నేడు ప్రజలు దేవుడిలా పూజిస్తున్నారు... మరి 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న బాబును ఏ ఒక్కరైనా పూజిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. చదవండి: చట్టానికి లోబడే దర్యాప్తు.. ఈనాడు, ఈటీవీ ఆరోపణలు అవాస్తవం: ఏపీ సీఐడీ -
ఎన్నేళ్లకు చిక్కి'నారా'? లోపలేస్తారా?
-
కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు.. లోకేశ్ మెదడు ఎక్కడుంది?
ఏ రోజు అయినా చంద్రబాబు వ్యవసాయం గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వర్షం, నీరు అవిరి అయిపోతుందని, ఎక్కడా పచ్చదనం కనిపించదని ఎద్దేవా చేశారకు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు కరువుతో అల్లాడిపోవాల్సిందేనని పేర్కొన్నారు. రైతులు పనులు లేక వలసలు వెళ్లిపోయే పరిస్థితి ఉండేదని, రైతులు రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఒకడు నిష్టదరిద్రుడు. కొడుకు పరిమదరిద్రుడని ఏకి పారేశారు. లోకేశ్ ఒక బచ్చా.. అతను కూడా వ్యవసాయం గురించి మాట్లాడతారా అని సెటర్లు వేశారు. ఈమేరకు కాకాణి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.. ఇంకా ఆయన ఏమన్నారంటే.. వ్యవసాయం తెలియకుండా వ్యక్తిగత దూషణలా? వ్యవసాయం, పంటలు, వ్యవసాయ విధానాల గురించి మాట్లాడటం చేతగాక వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. నువ్వు, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్లి ఎందుకు చదివావు. ఇక్కడ సరైన వసతులు లేకనా? ఎవరైనా వలస వెళ్తే.. కూలి పని చేసే కుటుంబం వేరే ప్రాంతానికి వ్యాపారానికో, ఇంకా అభివృద్ధి చెందడానికో ఆ ప్రాంతం నుంచి వలస వెళ్తారు. అది అర్థం చేసుకోలేక చంద్రబాబు హయాంలో నీరు లేక పంటలు లేక రైతులు బజారున పడ్డారు. అటువంటి పరిస్థితి నుంచి నేడు ప్రతి సంవత్సరం పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. చంద్రబాబు హయాంలో లా, ఇప్పుడు క్రాప్ హాలిడేలు లేవు. ఇప్పుడు రాష్ట్రంలో సగటున సంవత్సరానికి 14 లక్షల టన్నుల ఉత్పత్తి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. లోకేశ్ నీకు మెదడు మోకాలిలో ఉందా? అరికాలిలో ఉందా? మాట్లాడటానికి నోరు తిరగదు. పది పంటలు చూపిస్తే.. అందులో ఐదు పంటల పేర్లు చెప్పగలవా? నీ సార్థక నామధేయం కంది పంట పేరు చెప్పగలవా? పప్పూగాడు అని నీ పేరు కదా. ఆ పప్పు పంటలను గుర్తు పట్టగలవా లోకేశ్. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నీ తండ్రికి అధికార పిచ్చి. తండ్రీకొడుకులకు తినటానికి, పంచుకోవటానికి, దోపిడీకీ అవకాశం లేకపోవటంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏం పనిలేక.. అబ్బాకొడుకులు ఉన్మాదంతో తిరుగుతున్నారు. అన్ని వర్గాలు సంతోషంతో ఉండటంతో నిద్రపట్టడం లేదు. రైతులపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు ఏదైనా మాట్లాడేటప్పుడు నీతిగా నిజాయితీగా మాట్లాడటం నేర్చుకుంటే మంచిది. నీకు, ఈప్రభుత్వానికి నక్కకు - నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది. లోకేశ్ నోరు తెరిస్తే గబ్బు నోరు. విద్యుత్ ఛార్జీల పై ప్రశ్నించిన రైతులపై కాల్పులు జరిపించిన నీచుడు చంద్రబాబు. రైతులకు వ్యతిరేకంగా ఎన్నో విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నది చంద్రబాబు. ఈ జన్మ కాదు కదా.. వచ్చే జన్మలోనూ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి దరిద్రం ఉండకూడదు. రాష్ట్రం చేసుకున్న పాపం ఏమైనా ఉందంటే.. చంద్రబాబు లాంటి దరిద్రుడుకి లోకేశ్ లాంటి దరిద్రుడుకు జన్మ ఇవ్వటం ఒక్కటే. ఆ రెండు పొరపాట్లే రాష్ట్రానికి జరిగిన అరిష్టం. అని మంత్రి ఫైర్ అయ్యారు. చదవండి: చంద్రబాబు దళిత ద్రోహి.. వారి కోసం ఒక్క పనైనా చేశారా?.. -
లోకేష్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్టిమేటం
సాక్షి, అనంతపురం: నారా లోకేష్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్టిమేటం జారీచేశారు. తనపై లోకేష్ లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నిరాధార ఆరోపణలు చేస్తే లోకేష్ వద్దే నేరుగా తేల్చుకుంటానని పేర్కొన్నారు.. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జేసీ బ్రదర్స్ అరాచకాలపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయిని, తాడిపత్రి టీడీపీ కార్యకర్తలను చంపింది జేసీ బ్రదర్స్ కాదా అని ప్రశ్నించారు ‘టీడీపీ కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేసిన జేసీకి లోకేష్ ఎందుకు మద్దతు ఇస్తున్నారు?. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను జేసీ ట్రావెల్స్ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించింది. ప్రబోధానందస్వామి ఆశ్రమంపై జేసీ దివాకర్ రెడ్డి దాడి చేయించారు. జేసీ బ్రదర్స్ అక్రమాలపై టీడీపీ నేతలు పోరాడిన సంగతి గుర్తు లేదా’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అని పేర్కొన్నారు. చదవండి: టీడీపీ సీనియర్ నేతకు షాక్.. బాబు వద్దకు పంచాయితీ! -
లోకేష్ ఆ మాటలు ఆపకపోతే నిన్ను ఉరికించి...
-
'జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు?'
సాక్షి, విజయవాడ: జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్ ని ఆహ్వానించడం ఏంటి? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ తప్పుకుని టీడీపీని ఎన్టీఆర్‌కు అప్పగించాలన్నారు. మార్పు రాష్ట్రంలో కాదు టీడీపీలో రావాలని చురకలు అంటించారు. 'ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణని చంద్రబాబు ఘోరంగా అవమానించలేదా? హరికృష్ణపై తాగుబోతు, తిరుగుబోతు అని ఈనాడులో ప్రచారం చేయించాడు. హరికృష్ణకి పదవులు ఇవ్వకుండా దూరం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని వాడుకుని వదిలేశారు. 2014లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాడు గ్యాలరీలో కూర్చోబెట్టి అవమానించారు. చంద్రబాబు, లోకేష్ బొమ్మతో ఓట్లు అడిగే ధైర్యం లేదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ని రమ్మంటున్నాడు’’ అని కొడాలి నాని దుయ్యబట్టారు. ‘‘వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్ జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించడం ఏంటి?. టీడీపీలో మహానాడు పెట్టి ఎన్టీఆర్, లోకేష్‌లకు వారసుడు కోసం ఓటింగ్ పెట్టండి. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుంది.' అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. చదవండి: చంద్రబాబు భయపడుతున్నారా?.. ఎందుకంత ఫ్రస్ట్రేషన్? -
టీడీపీ పెత్తందారీ వ్యవస్థను బద్దలుకొట్టిన వ్యక్తి సీఎం జగన్: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. సామాజిక న్యాయం అంటే ఏంటో సీఎం జగన్ నిరూపించారని తెలిపారు. టీడీపీ పెత్తందారీ వ్యవస్థను బద్దలుకొట్టిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. సామాజిక విప్లవం వైపు ఆయన అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. ‘సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యం. 75 ఏళ్ల చరిత్రలో ఏపీలో మాత్రమే సామాజిక న్యాయం జరిగింది. సీఎం బీసీలను తల ఎత్తుకునేలా చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి వెల్లివిరిస్తోంది. ఆయన పాలనలో బలహీన వర్గాలవారు ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషంగా ఉన్నారు. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రభుత్వం. రిజర్వేషన్లు లేకపోయినా ఎక్కువ పదవులు ఇచ్చిన ఘనత జగన్ ది. డీబీటీ ద్వారా సుమారు రూ.2లక్షల కోట్లు అందజేశారు. లోకేష్ తన స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానాలను బేరానికి పెట్టిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ రాజ్యసభ స్థానాలను సూట్‌కేసుల కోసం అమ్ముకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై చంద్రబాబు, లోకేష్ విషం కక్కుతున్నారు. పొత్తులు పెట్టుకుని పొర్లాడినా టీడీపీని జనం పట్టించుకోరు. టీడీపీని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం అందరిపై ఉంది. అసెంబ్లీ నుంచి పారిపోయిన చంద్రబాబు రోడ్లమీద ఏదేదో మాట్లాడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి ఎవరి హయాంలో సామాజిక న్యాయం జరిగిందో చర్చకు చంద్రబాబు సిద్ధమా’ అని సవాల్ విసిరారు. చర్చకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. బీసీలపై చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే చర్చకు రావాలని మంత్రి జోగి రమేష్ ఛాలెంజ్ చేశారు. చదవండి: టికెట్టా.. వద్దే వద్దు! ఇంటర్నల్ సర్వేలతో బెంబేలెత్తుతున్న టీడీపీ నేతలు -
సబ్‌ప్లాన్ అంటే లోకేష్‌కు తెలుసా?: మంత్రి మేరుగ నాగార్జున
సాక్షి, విజయవాడ: దళితుల గురించి మాట్లాడే అర్హత నారా లోకేష్‌కు లేదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సబ్‌ప్లాన్ అంటే లోకేష్‌కు అసలు తెలుసా? అని ప్రశ్నించారు. పాదయాత్రలో జనం లేక లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. దళితులను మోసం చేసిన చరిత్ర.. దళితుల నిధులను పక్కదారి పట్టించిన ఘనత చంద్రబాబుదేననని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు సబ్ ప్లాన్‌ను నాశనం చేశాడని.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సబ్‌ప్లాన్‌ను అమలు చేశారని గుర్తు చేశారు. దళితుల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ కింద నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి లేకుండా పరిపాలన అందిస్తున్నామన్నారు. ‘దళితుల మీద దాడి చేస్తే నీపైన ఏంటి.. మీ నాన్న పైన కూడా కేసు పెడతాం. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పొలంబడి, రైతు క్షేత్రాలు, నేప్కీన్లు, పెళ్లి కానుక, ఎన్టీఆర్ సుజల స్రవంతికి ఖర్చు పెట్టామని చంద్రబాబు చూపించాడు. ఎస్సీ, ఎస్టీ, పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య, ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్నది మీ బాబు, నువ్వు కాదా?. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం పెడుతుంటే టీడీపీ ఓర్వలేకపోతోంది. గతంలో ఎస్సీలకు రుణాలు పేరుతో అవినీతికి పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులపై చర్చించడానికి నేను సిద్ధం’ అంటూ లోకేష్‌కు మంత్రి సవాల్ విసిరారు. -
పవన్.. నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా?: మంత్రి రోజా
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీకి తప్ప రాజకీయాలకు పనిచేయడని మంత్రి రోజా విమర్శించారు. పవన్ .. నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా అని ధ్వజమెత్తారు. బాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నా పవన్‌కు కనిపించడం లేదా? కందుకూరు, గుంటూరు ఘటనలపై పవన్ ఎందుకు స్పందించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఇరుకు రోడ్డుల్లో సభలు పెట్టి జనాన్ని చంపేస్తున్నారని రోజా మండిపడ్డారు. పేదవాడి ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా అంటూ విమర్శించారు. గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని మంత్రి గుర్తు చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు 40 మందిని చంపాడని అన్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పనైనా చేశారా? లోకేష్ పాదయాత్ర ఆపాల్సిన పని మాకులేదు. లోకేష్ సన్నబడ్డం కోసమే పాదయాత్ర చేపట్టారు. ఆయన పాదయాత్ర చేస్తే ఆ పార్టీకే నష్టం. లోకేష్ పాదయాత్రకు టీడీపీనే భయపడుతోంది’ అని మంత్రి రోజా సెటైర్లు వేశారు. చదవండి: పేద మహిళలంటే చంద్రబాబుకు చులకన.. వాసిరెడ్డి పద్మ ఫైర్ -
ఏమనాలో తెలియక.. వారి ఖాతాలో వేసుకునే యత్నం!
ఆంధ్రప్రదేశ్ లో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు జరిగాయి. అవే కనుక ఏ తెలంగాణలోనో, లేక మరే రాష్ట్రంలోనో జరిగి ఉన్నట్లయితే , మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగేది. కాని అది ఏపీ కనుక, అక్కడ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు కనుక దానికి ఒక వర్గం మీడియా అంత ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపించదు. అయినా ఫర్వాలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తీర్చిదిద్దే కార్యక్రమాలవి. ఒకటి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చడం, మరొకటి మైక్రోసాప్ట్ సంస్త ఆద్వర్యంలో వేలాది మంది నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు అందచేయడం. గతంలో తన వల్లే ఇంజీనిరింగ్ చదివారని మైక్రోసాప్ట్ సిఈఓ సత్య నాదెండ్ల గురించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకునేవారు. నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వకముందే ఆయన ఇంజనీరింగ్ పూర్తిచేశారు. అది వేరే సంగతి. కాని సత్య నాదెండ్లతో మాట్లాడి ఇప్పుడు జగన్ సంకల్పించిన నైపుణ్య శిక్షణను చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు?బిల్ గేట్స్ మీటింగ్ లే రద్దు చేసుకుని తనతో విందు సమావేశం జరిపారని ప్రచారం చేసుకున్నవారు, ఆయనతో మాట్లాడి లక్షలాది మంది పిల్లలకు ఎందుకు శిక్షణ ఇప్పించలేకపోయారు? ఎందుకంటే చంద్రబాబుకు విషయం కన్నా, విపరీత ప్రచారం అంటే ఎక్కువ ఇష్టం కనుక. మరి అదే జగన్ ప్రచారార్భాటం లేకుండా 36 వేల మంది విద్యార్దులకు సాప్ట్ స్కిల్స్ లో మైక్రోసాప్ట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించారు.దీనిని పిల్లలు సొంతంగా ఖర్చు చేసి నేర్చుకోవాలంటే ఒక్కక్కరు 25 వేల నుంచి ముప్పైవేల వరకు అవుతుందట. అలాంటిదానిని మైక్రోసాప్ట్ వారిని ఒప్పించి అతి తక్కువ వ్యయానికి 32 కోట్లకు ఈ ట్రైనింగ్ ఇప్పించారు. ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఎపిలో నైపుణ్యాభివృద్ది సంస్థ చంద్రబాబు టైమ్ లోనే ఆరంభం అయింది. అక్కడ శిక్షణ ఇచ్చింది తక్కువ.. స్కామ్ చేసింది ఎక్కువ. శిక్షణ ఇవ్వకుండానే బిల్లులు రాసేసుకున్నారన్న అబియోగాలు వచ్చాయి. సుమారు 250 కోట్ల మేర స్కామ్ జరిగిందన్న కేసు విచారణ జరుగుతోంది. మరి జగన్ ప్రాక్టికల్ గా వేలాది మంది పిల్లలకు శిక్షణ ఇప్పించారు. చంద్రబాబు టైమ్ లో సింగపూర్ నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీలను తీసుకు వచ్చి, వారికి కారుచౌకగా భూములు ఇవ్వడానికి చూపిన శ్రద్ద ఇలాంటివాటిపై పెట్టి ఉంటే ఎంతో ప్రయోజనం జరిగి ఉండేది. ఈ కార్యక్రమంలో జగన్ సుత్తి కొట్టకుండా, సూటిగా విద్యార్దుల కోసం ఎలాంటి స్కీములు తెచ్చింది తెలిపి ,వారికి నైపుణ్యం అబ్బడానికిగాను చేపట్టిన చర్యలను వివరించారు. ఏపీలో భవిష్యత్తు లో విద్యార్ధులను నిజమైన సంపదగా చేయాలన్న తన లక్ష్యాన్ని రుజువు చేసుకున్నారు. మరో అంశం ఏమిటంటే విశాఖ సముద్ర తీరంలో ప్లాస్టిక్ వ్యర్దాలను తొలగించడంతోపాటు , వాటిని రీసైకిలింగ్ చేసే పార్లే ఫర్ ద ఓషన్స్ అనే సంస్థతో ఒప్పందం చేసుకోవడం . ఇది కూడా భారీ ప్రాజెక్టే. వచ్చే కొద్ది సంవత్సరాలలో ఈ సంస్థ పదహారువేల కోట్ల వ్యయం చేస్తుంది. దీని ద్వారా ఇరవైవేల మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని జగన్ వివరించారు. చంద్రబాబు టైమ్ లో విశాఖ బీచ్ లో బికినీ ఉత్సవాలు పెట్టాలని భావించారు.దానిపై ప్రజలలో గగ్గోలు పుడితే వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు జగన్ ప్లాస్టిక్ లేని పర్యావరణ హిత బీచ్ లను తయారు చేసి,టూరిజంను ప్రమోట్ చేయడానికి చొరవ తీసుకున్నారు. ఏపీలో ప్లాస్టిక్ ను క్రమేపి తొలగించి, దాని స్థానంలో క్లాత్‌ను వాడాలని తాజాగా నిర్ణయించారు.ముందుగా ప్లాస్టిక్ ప్లెక్సీలను బాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరు తెలివైనవారు, ఎవరు రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారన్నదానికి ఈ పోలిక సరిపోతుంది. గత ప్రభుత్వంలో అనంతపురంలో ఒక కార్ల పరిశ్రమ ద్వారా అంతా కలిపి వెయ్యి మందికి ఉపాధి వచ్చిందేమో తెలియదు కాని, అది అసలు ప్రపంచంలోనే పెద్ద విషయంగా టీడీపీ నేతలు ప్రచారం చేసుకునేవారు. వారు అతిగా ప్రచారం చేసుకోకపోతే దానిని కూడా ఒప్పుకోవచ్చు. మరి జగన్ ఈ మద్యకాలంలో తీసుకువస్తున్న ప్రాజెక్టులన్నీ వేల కోట్ల రూపాయలవి. వేలాది మందికి ఉపాధి కల్పించేవి అన్న సంగతిని ఒప్పుకోవడానికి వారి మనసు సిద్దపడడం లేదు. అందుకే టిడిపి నేత లోకేష్ ఇటీవలికాలంలో జగన్ ప్రారంభించిన పరిశ్రమలన్నీ తమ తండ్రి తెచ్చినవేనని ఒక ప్రకటన చేసి ఆత్మ సంతృప్తి చెందారు. ఇంతకాలం చంద్రబాబు, లోకేష్ లు చెప్పిందేమిటి? ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని కదా? అసలు ఒక్క పెట్టుబడి అయినా వచ్చిందా అని ప్రశ్నించేవారు కదా. తీరా పరిశ్రమలు వస్తుంటే ఏమి అనాలో తోచక ,వాటిని తమ ఖాతాలో వేసుకోవడానికి యత్నిస్తున్నారు. 800 కోట్ల రూపాయల ప్రాజెక్టు కూడా ఒక ప్రాజెక్టేనా అని లోకేష్ అంటున్నారంటే ఆయన పరిజ్ఞానం గురించి ఏమని అనుకోవాలి? విశాఖలో కోట్ల రూపాయలు వ్యయం చేసి సదస్సులు నిర్వహించిన ఆనాటి టీడీపీ ప్రభుత్వం తెచ్చిన ప్రాజెక్టుల వివరాలను లోకేష్ ఇవ్వగలిగితే అసలు వాస్తవాలు బయటపడతాయి. రానివన్ని పరాయి ఖాతాలో, వచ్చినవన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి అలవాటు పడితే ఇలాగే మాట్లాడతారని అనుకోవాలి. కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిసిటి స్టంట్ లేకుండా వేల కోట్ల రూపాయల పెట్టుబడి తేవడమే కాకుండా విశాఖకు విశేష ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఏపీలో కూడా పెద్ద నగరం ఉందని ప్రపంచానికి తెలియచెప్పే యత్నాన్ని జగన్ చేస్తుండడం ముదావహం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలి. ఆయనను ఏదో రకంగా విమర్శించాలని అనుకునేవారికి ,ఇదంతా అభివృద్దే అన్న సంగతి అర్ధం అయ్యేలా తన క్రియ ద్వారా చేయగలుగుతున్నారు. తను ప్రకటించిన పెట్టుబడులన్నీ వాస్తవరూపం దాల్చేవరకు ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని ఆశిద్దాం. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
జూమ్‌లో నేను కనపడగానే లోకేశ్ పారిపోయాడు: కొడాలి నాని
సాక్షి, అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ పిల్లలతో రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అభం శుభం తెలియని చిన్న పిల్లలను ఆత్మహత్యలకు ప్రేరేపించేందకు లోకేశ్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఫేక్ ఐడీలతో లాగిన్ అవ్వలేదని స్పష్టం చేశారు. తన మేనల్లుడి ఐడీతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. విద్యార్థి మేనమామతో లోకేశ్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. పిల్లలు కొడతారనే భయంతోనే లోకేశ్ జూమ్‌లో మాట్లాడారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. తాను కనపడగానే జూమ్ మీటింగ్ కట్ చేసి పారిపోయారని అన్నారు. విద్యార్థులను పిలిచి మరోసారి చర్చ పెట్టమనండని, తాము వెళ్తామని అన్నారు. తన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెబితే బాగుండేదన్నారు. కరోనా సమయంలో పాఠశాలలు మూసివేశాలని గొడవ చేసింది ఎవరని కొడాలి నాని ప్రశ్నించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలు తెరిస్తే.. కరోనా సమయంలో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతారా అని స్కూల్స్‌ను మూసివేయాలని ఆందోళనలు చేసింది టీడీపీ వాళ్లే కదా అని గుర్తు చేశారు. చదవండి: Nara Lokesh: జూమ్ కాన్ఫరెన్స్‌లో నారా లోకేష్‌కు ఝలక్ -
చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా?: దివ్యవాణి
సాక్షి, విజయవాడ: టీడీపీ మాజీ నాయకురాలు దివ్యవాణి.. తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివ్యవాణి విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయంపై ఉద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్బంగా దివ్యవాణి మాట్లాడుతూ.. టీడీపీలో గతేడాదిగా నాకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. కొందరు మహిళా నేతలు నాకు ఫోన్ చేసి తిట్టారు. కొందరు బుద్ధిలేని వారు బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారు. ప్యాకేజీ అందింది అందుకే రాజీనామా చేయట్లేదని అంటున్నారు. నేను ఎవరికీ ఎప్పుడూ భజన చేయలేదు.. చేయను. పార్టీలో ఏం జరుగుతుందో ఉన్నది ఉన్నట్టు చెప్పాను. నా సమస్యను లోకేశ్ దృష్టికి తీసుకెళితే.. జనార్ధన్‌కు చెప్పమన్నారు. కొందరు ఇడియట్స్ జర్నలిజం పేరుతో నానా మాటలు అన్నారు. చివరి నిమిషం వరకు క్లారిటీ తీసుకునేందుకే ఆగాను. ఇలాంటి రోజు వస్తుందని భావించలేదు. చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా..? ఉంటే గుండెపై చేయి వేసుకుని చెప్పాలి. నేను చెప్పాల్సిన పాయింట్లు వేరే వాళ్లతో చెప్పించారు. మీటింగుల్లో ఎవరితో మాట్లాడించాలో ముందు అనుకుని మాట్లాడిస్తారు. టీడీ జనార్దన్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు నరకం చూపిస్తారా..? పార్టీలో నా స్థానం ఏంటో తెలియని పరిస్థితి ఉంది’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇది కూడా చదవండి: ‘చంద్రబాబుకి బీసీల ఓట్లు కావాలి.. కానీ వాళ్లు ఎదిగితే ఓర్వలేరు’ -
పరామర్శ పేరిట రాజకీయం చేసేందుకు వచ్చారు: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, గుంటూరు: పోలీసులపై టీడీపీ నేతల రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తుమ్మపూడి ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించి, చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే ఆదేశించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితులను అరెస్టు చేశారని తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఇప్పటికే చెప్పామన్నారు. పరామర్శ పేరిట రాజకీయం చేసేందుకు లోకేష్ వచ్చారని ఎమ్మెల్యే విమర్శించారు. శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతున్నారని, పరామర్శకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రాజకీయాల కోసం పోలీసులపై రాళ్లు వేస్తారా అని మండిపడ్డారు. ఆస్పత్రి వద్ద లోకేష్ వచ్చే వరకు మృతదేహాన్ని ఉంచాలని అడ్డుకోవడం దారుణమన్నారు. చదవండి: టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీపై మంత్రి బొత్స క్లారిటీ తుమ్మపూడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా ఖండించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం వేగంగా స్పందించి చర్యలు చేపట్టినప్పటికీ టీడీపీ రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. శవ రాజకీయాలు చేస్తే ప్రజలు ఓట్లు వేయరని చంద్రబాబు తెలుసుకోవాలని హితవు పలికారు. వందలమందితో వచ్చి టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారు. చదవండి: తుమ్మపూడిలో ఉద్రిక్తత.. లోకేష్ రాకతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు -
‘కుప్పంలో విజయానికి లోకేష్ ఐదు వేలు పంచడం సిగ్గుచేటు’
సాక్షి, నెల్లూరు: కుప్పంలో కూడా టీడీపీకి ఓటమి భయంపట్టుకుందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ.. టీడీపీ స్థాయి దిగజారిందని.. కుప్పంలో విజయం సాధించడానికి లోకేష్ ఐదువేలు పంచటం సిగ్గుచేటని విమర్శించారు. సొంత నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేని బాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. కుప్పంని మున్సిపాలిటీ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రభంజనం కొనసాగుతుందని మంత్రి బాలినేని పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్లలలో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగిస్తుందని మంత్రి బాలినేని తెలిపారు. -
పెదబాబు దారిలోనే చినబాబు
-
లోకేష్ తీరుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం
-
‘చంద్రబాబు శవ రాజకీయాలు.. లోకేష్‌కు అప్పగించారు’
-
ఎక్కడైనా మృతదేహం ఉంటే రాబందుల కంటే ముందు లోకేష్ వెళ్తున్నారు.
-
పులిచింతల కాంట్రాక్టర్ టీడీపీ నేత కాదా: అనిల్‌కుమార్
సాక్షి, విజయవాడ: టీడీపీ హయాంలో అన్నమయ్య రిజర్వాయర్ గేట్లు కొట్టుకుపోయాయి.. గోదావరిలో చంద్రబాబు పాదం పెడితే 30 మంది చనిపోయారని మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు. లోకేష్ చేస్తోన్న ట్వీట్లపై అనిల్ తీవ్ర స్థాయిలో మండిప్డడారు. లోకేష్ వాడుతున్న పదాలు ఎలాంటివో ఆయనే చెప్పాలని కోరారు. గతంలో పులిచింతలపై వచ్చిన రిపోర్ట్‌ను చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టిందని మంత్రి అనిల్ గుర్తు చేశారు. పులిచింతల కాంట్రాక్టర్ టీడీపీ నేత కాదా.. ఆయన దగ్గర చంద్రబాబు లాలూచీ పడి 700 రోజులు కోర్టులో కౌంటర్ కూడా వెయ్యలేదని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. ఈ విషయం లోకేష్‌కి తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు పడలేదు.. సీఎం జగన్ పాదం పెట్టాకే వానలు పుష్కలంగా పడుతున్నాయన్నారు అనిల్ కుమార్. -
నిజాలు తెలుసుకుని మాట్లాడాలి : ఆర్కే
-
పరీక్షలంటే లోకేశ్ కు అర్థం తెలుసా : పండుల రవీంద్రబాబు
-
లోకేష్ బాబు సింహం కాదు చింతకాయ్ : రోజా
-
లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలి : మంత్రి అనిల్
-
లోకేష్ శవరాజకీయాలకు పాల్పడుతున్నారు : హోం మంత్రి సుచరిత
-
బాబు.. అఖిలప్రియని పరామర్శించరా?: అంబటి
సాక్షి, తాడేపల్లి: ‘పేద కార్మికుల డబ్బును కొట్టేసిన అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడిని చంద్రబాబు, లోకేష్ పరామర్శించారు. కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి అఖిలప్రియను పరామర్శించరా బాబు’ అంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘పేద కార్మికులకు సంబంధించిన నిధులను కాజేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును, చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పరామర్శించారు. ఈ కేసును రాజకీయ ప్రతీకార కేసుగా వక్రీకరించి ప్రచారం చేశారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బంధువులుగా పేర్కొంటున్నవారిని కిడ్నాప్ చేసి అరెస్టయిన మరో మాజీ మంత్రి అఖిల ప్రియను పరామర్శించరా? చంద్రబాబుగారి కేబినెట్లో మంత్రి అయిన అఖిలప్రియ కిడ్నాప్ కేసులో ఏ–1 ముద్దాయిగా అరెస్టయితే చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు నోరుమెదపడంలేదు. అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఒకలా, అఖిలప్రియ అరెస్టు విషయంలో మరోలా ఎందుకు వ్యవహరిస్తున్నారు. అఖిలప్రియ అరెస్టుపై తేలుకుట్టిన దొంగల్లా తండ్రీ, కొడుకులిద్దరూ ఎందుకు వ్యవహరిస్తున్నారు’ అంటూ అంబటి ప్రశ్నించారు. (చదవండి: చంద్రబాబు మతం మనిషి ఎప్పుడయ్యాడు?) ‘అచ్చెన్నాయుడు అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయినా, దాన్ని రాజకీయ వేధింపులు కేసుగా చిత్రీకరించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు ఆరాటపడ్డారు. దీనికోసం ఎన్నిడ్రామాలు చేయాలో, అన్ని డ్రామాలు చేశారు. అఖిలప్రియ అరెస్టు విషయంలో మరెందుకు మౌనంగా ఉన్నారో...? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. అఖిలప్రియ అరెస్టు వ్యవహారంపై చంద్రబాబుగారి ట్వీట్లు, ఘీంకారాలు, లోకేష్ కూతలు.. ఏమీ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదే కిడ్నాప్ కేసు ఏపీలో జరిగి ఉంటే ఇదే చంద్రబాబుగారు, లోకేష్, వారి అనుకూల మీడియా ఎలా రచ్చ చేసేవారో మనం ఊహించుకోవచ్చు. తండ్రిలేని పిల్లను వేధిస్తున్నారని, పార్టీ మారినందుకు కక్షకట్టారని.. ఇలా నాటకాలను ఆడుతూ ప్రచారాన్ని రక్తికట్టించేవారు. టీడీపీ నాయకుల నైజానికి, వారి అధినేత చంద్రబాబు డొంకతిరుగుడు వ్యవహారానికి, టీడీపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు వ్యవహారం ఒక పక్కా ఉదాహరణ’ అంటూ అంబటి మండిపడ్డారు. -
ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నాం
-
‘వరి చేనుకు చేపల చెరువుకు తేడా తెలియని మేధావి’
సాక్షి, కృష్ణా : ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేరుస్తున్నారని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. రైతు భరోసా రూపంలో పెట్టుబడి సాయంగా 13,500 ఇస్తున్నారని తెలిపారు. సీజన్ ముగియక మునుపే వర్షాల కారణంగా ఏర్పడిన పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారని వెల్లడించారు. ఈ మేరకు జిల్లాలో మంత్రి మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాలో రైతులకు పంట నష్టనికి 7 కోట్ల 20 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాట్లు చేయగా దానికి అదనంగా 600 కోట్లు ఇచ్చి గిట్టుబాటు ధర కల్పించినట్లు పేర్కొన్నారు. కేంద్రం ఇస్తున్న దానిని దాచుకునే ఉద్దేశం సీఎం జగన్‌కు లేదని, ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నారని కొనియాడారు. చదవండి: స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు రైతాంగం కోసం పని చేసే ప్రభుత్వం తమదని, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిబాటలో జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. రైతుల ఆశీస్సులు సీఎం జగన్‌కు ఉన్నాయని, సంక్షేమ పథకాలు పేదలకు చేరాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు.. వైఎస్ జగన్ నిర్ణయంతో 2 లక్షల మంది గిరిజనులకు లబ్ధి చేకూరుంది. పథకాల పబ్లిసిటీ పిచ్బిలో చంద్రబాబు ఉండేవాడని విమర్శించారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మోరిగిన తంతుగా లోకేష్ తీరు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. వరదలు వానలు తగ్గాక కొంప కొల్లేరు అయిందంటూ పర్యటనలు చేస్తున్నాడని మండిపడ్డారు. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కొత్త కమీటీ వేసి లోకేష్‌ను జనంలోకి వదిలి పార్టీని పైకి తీసుకు రావాలని చంద్రబాబు ఆరాటపడుతున్నాడని కొడాలి నాని అన్నారు. చదవండి: ఆ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి నాని ‘లోకేష్ ట్రాక్టర్ తీసుకెళ్లి బోదులో పడేసే వాడు. ట్రాక్టర్ తోలటం రాని పప్పుకు తెలుగు దేశం పార్టీ అప్ప చెబితే పార్టీని కూడా తీసుకెళ్లి కొల్లేరులో ముంచుతాడు. తెలివి గలవారు ఉంటే ముందు ఎక్కవద్దు. ఆ పార్టీ నుంచి దిగిపోండి. కొల్లేరులో నీరు ఉందని తెలియని అజ్ఞాని లోకేష్. వరి చేనుకు చేపల చెరువు తేడా తెలియని మేధావి లోకేష్. 2016 సెప్టెంబర్‌లో చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకున్న వ్యక్తి చంద్రబాబు. విభజన హోదా, పోలవరం నిధులు,విభజన హామీలు అన్నింటిని తాకట్టు పెట్టిన చంద్రబాబును ప్రజలు 23 సీట్లు పరిమితం చేశారు. చంద్రబాబు చచ్చిన శవంతో సమానం. బుద్ది, జ్ఞానం లేదు. పిల్లనిచ్చిన మామనే వెన్ను పోటు పొడిచాడు. చంద్రబాబుకు డబ్బా కొట్టేందుకు రాధాకృష్ణ, రామోజీ రావు, బీఆర్ నాయుడు ఉన్నారు. 2024లో టీడీపీని లోకేష్ కొల్లేరులో కలపడం ఖాయం.’ అంటూ టీడీపీ నిప్పులు చెరిగారు. -
హర్షకుమార్కు సవాల్ విసిరిన నందిగం సురేష్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు తొత్తులుగామారి దళిత జాతికి అన్యాయం చేస్తున్న కొందరు నాయకుల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు జై భీమ్ అంటూ నినాదాలు చేస్తున్నారని, వారంతా జై చంద్రబాబు అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. హర్ష కుమార్ ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశం దళిత జాతి కోసం కాదు చంద్రబాబు భజన కోసమని విమర్శించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన దారుణాలపై హర్ష కుమార్, శ్రవణ్ కుమార్‌ను ఎందుకు స్పందించలేదని చెప్పారు. అప్పుడు ఎక్కడ దాక్కున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి హోదాలో ఆదినారాయణరెడ్డి దళితులను అవమానిస్తే మీరు ఎక్కడున్నారు. నీకెందుకురా రాజకీయాలు అని చింతమనేని దళితుల్ని దూషించినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు దళితుల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా... అన్నప్పుడు మీరు ఎందుకు నోరు మెదపలేదు. కులాలు, మతాలు మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏదోరకంగా అల్లర్లు గొడవలు సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబూ లాంటి నీచులు 100 మంది వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏమీ చేయలేరు. (చదవండి: చిత్తూరులో అడ్డంగా బుక్కైన టీడీపీ) హర్షకుమార్ టీడీపీలో చేరడానికి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నాడు. చంద్రబాబు రాసిన స్క్రిప్టు కాకుండా మీకంటూ సొంతగా స్క్రిప్టు రాసుకునే దమ్ముందా. నిజంగా మీకు దళితుల పట్ల ప్రేముంటే చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం ఎందుకు అడ్డుకున్నాడో అడగండి. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు అడ్డుకుంటున్నారు అని నిలదీయండి. దళిత జాతిని మీరు బాగుపడనివ్వరా? చంద్రబాబుకు, లోకేష్‌కు ధైర్యం ఉంటే హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడటం కాదు, ఏపీకి రమ్మనండి. మంగళగిరి దెబ్బకి లోకేష్ హైదరాబాద్ పారిపోయాడు. వెన్నుపోటు అని గూగుల్‌లో కొడితే చంద్రబాబు పేరు వస్తుంది. 14 ఏళ్ల చంద్రబాబు హయాంలో దళితులు ఎంత మేలు జరిగిందో, ఏడాదిన్నర జగన్మోహన్రెడ్డి పాలనలో ఎంత మేలు జరిగిందో చర్చించుకుందాం రండి. దమ్ముంటే డేటు, టైం ఫిక్స్ చేయండి. మీతో పాటు చంద్రబాబు నాయుడు, లోకేష్‌ను కూడా తీసుకురండి. ఎప్పుడైనా, ఎక్కడైనా మేము చర్చకు సిద్ధం’అని ఎంపీ నందిగం సురేష్ సవాల్ విసిరారు. (చదవండి: పోలీసు సంస్కరణల్లో ‘ఆంధ్ర’ భేష్) -
‘అవినీతిపై ఆధారాలతోనే అరెస్ట్‌లు’
సాక్షి, తాడేపల్లి : అవినీతికి తావు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అవినీతిపై పోరులో తొలి అడుగే అచ్చెన్నాయుడు, ప్రభాకర్ రెడ్డి అరెస్టులు అని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ఆధారాలతోనే అచ్చెన్నాయుడు, ప్రభాకర్రెడ్డిలను అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. టీడీపీపై కక్ష సాధించాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలాగానే టీడీపీ పరిస్థితి దిగజారిందని విమర్శించారు.(చదవండి : ‘స్కీములను స్కాములుగా మార్చారు’) చంద్రబాబు కుమారుడు కాబట్టి దొడ్డిదారిన కౌన్సిల్లోకి లోకేష్‌ను తీసుకువచ్చారన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో లోకేష్ తుక్కు తుక్కుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. 151 సీట్లు గెలుచుకున్న సీఎం వైఎస్ జగన్‌ను దగ్గర్నుంచి కూడా చూసే పరిస్థితి లేదన్నారు. వడ్డీతో సహా చెల్లించడానికి ఇదేమన్నా హెరిటేజ్ సంస్థా అని ప్రశ్నించారు. లోకేష్ నాయకుడిగా తయారయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. జేసీ బ్రదర్స్ అక్రమాలు చంద్రబాబు, లోకేష్‌లకు కనిపించడం లేదా అని అంబటి ప్రశ్నించారు. అక్రమ కట్టడంలో నివసిస్తున్న చంద్రబాబు, లోకేష్‌లకు ఇతరులను విమర్శించే హక్కు లేదన్నారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అంబటి రాంబాబు విమర్శించారు. -
‘పందికొక్కుల్లా చంద్రబాబు, లోకేష్ దోచుకున్నారు’
-
అలా అని చంద్రబాబు రాజ్యాంగంలో ఉందా?
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు సందర్భంగా శుక్రవారం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. 70 ఏళ్ల వయస్సు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఏసీబీ ఒక ఎమ్మెల్యేను అరెస్టు చేసేటప్పుడు ఎలా వెళ్తారో తెలియదా అని ప్రశ్నించారు. ఈఎస్ఐలో రూ.150 కోట్ల స్కాం జరిగిందని, కొనాల్సినవి, కొనకూడనివి అన్ని కొని జేబులు నింపుకున్నారని దుయ్యబట్టారు. (మరో రెండు గంటల్లో బెజవాడకు అచ్చెన్నాయుడు) ఎవరెవర్ని అరెస్టు చేయకూడదో చంద్రబాబు ఒక లిస్ట్ ఇవ్వాలని, తప్పు చేసిన వారిని విచారించొద్దని చంద్రబాబు రాజ్యాంగంలో ఉందా అని కొడాలి నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పందికొక్కుల్లా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఎద్దేవా చేశారు. దీంట్లో అచ్చెన్నాయుడికి ఓ అయిదు కోట్లు ఇచ్చి ఉంటారని, మిగతాది పందికొక్కులా లోకేష్ తినేసి ఉంటాడని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు అప్రువర్‌గా మారి ఈఎస్ఐ కుంభకోణం వెనుక ఉన్న వారి పేరు చెబితే తనను వదిలి పందికొక్కులను పట్టుకుంటామని హితవు పలికారు. తమ ప్రభుత్వంలో ఏ అవినీతి జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహించరని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను తాము విచారిస్తున్నామని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (‘భయంతోనే బట్టలు చించుకుంటున్నారు’) -
‘అచ్చెన్నాయుడిని బంట్రోతుగా మార్చారు’
సాక్షి, తాడేపల్లి: ముందస్తు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయడానికి అచ్చెన్నాయుడు ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు రూ.150 కోట్ల అవినీతికి పాల్పడినట్లు అధికారులు చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం ఆయనను కిడ్నాప్ చేశారంటూ తప్పుడు లేఖలు రాయడం విడ్డూరంగా ఉంది అన్నారు. అచ్చెన్నాయుడు పాల్పడిన స్కామ్‌కు ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో కార్మికుల సొమ్ము నిలువ దోపిడీ చేసి.. వారి పొట్ట కొట్టిన ఘనుడు అచ్చెన్నాయుడు అని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే తప్పా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు వెనుక ఉన్నవాళ్లనందరిని అరెస్ట్ చేస్తారని హెచ్చరించారు. ఈ పాపంలో చంద్రబాబుకు భాగస్వామ్యం ఉందని రమేష్ ఆరోపించారు. రమేష్ మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు తప్పు చేస్తే బీసీలు నిరసనలు తెలపాలా అని ప్రశ్నించారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్లు బతికి ఉంటే చంద్రబాబుకు చీవాట్లు పెట్టేవారని అన్నారు. బీసీ నేత అయిన అచ్చెన్నాయుడిని చంద్రబాబు బంట్రోతుగా మార్చారని ఆరోపించారు. దీని వెనుక చంద్రబాబు, లోకేష్‌లు కూడా ఉన్నారని.. వారి పాత్రపైన విచారణ జరపాలని కోరారు. అచ్చెన్నాయుడు రూ.150 కోట్ల ప్రజాధనాన్ని దోచేస్తే.. బీసీలు ధర్నా చేయాలా.. వారు మీకు అంత అమాయకుల్లాగా కనిపిస్తున్నారా చంద్రబాబు అని రమేష్ ప్రశ్నించారు. (అచ్చెన్నాయుడు అరెస్టు; చింతమనేని హైడ్రామా) బడుగుబలహీన వర్గాల వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, మంత్రి వర్గంలో 60 శాతం పదవులు కేటాయించారని తెలిపారు. అచ్చెన్నాయుడు బీసీల్లో ఎందుకు పుట్టారని బీసీలు భాదపడుతున్నారన్నారు. అచ్చెన్నాయుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. పేదల పొట్ట కొట్టిన పాపం ఊరికే పోదన్నారు. హైదరాబాద్ నుంచి లోకేష్ వచ్చి ఏమి చేస్తాడని ప్రశ్నించారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూస్తే.. సీఎం జగన్మోహన్ రెడ్డి వారికి పెద్దపీట వేశారని తెలిపారు. బలహీన వర్గాల్లో పుడితే ప్రజా ధనం దోచేస్తారా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడుతో పాటు చంద్రబాబు, లోకేష్‌లు కూడా ఊచలు లెక్కపెడతారని రమేష్ హెచ్చరించారు. (‘రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు’) -
‘అమాయకుడిని బలిపీఠం ఎక్కిస్తున్నాడు’
సాక్షి, హైదరాబాద్: టీడీపీ పార్టీపై, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘కొడుకేమో తిండికి తిమ్మరాజు పనికిపోతురాజు. సీనియర్లందరూ చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్‌కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలపీఠం ఎక్కిస్తున్నాడు’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (‘లోకేశ్ ఆవేదన తాలూకు ఉద్రేకం’) ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన దక్షతపై ప్రశంసల వర్షం కురిపిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘పాలన ఎప్పుడు ‘సిటిజెన్ సెంట్రిక్‘ గా ఉండాలని పొలిటికల్ సైన్స్ గ్రంథాలు చెబ్తాయి. దీనిపై ఇప్పటికీ అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రజా సంక్షేమం, పారదర్శకత, బాధ్యత, తక్షణ స్పందన ఉండాలనేదే వీటి సారాంశం. జగన్ గారు సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇవన్నీ హర్షణీయ స్థాయిలో అమలవుతున్నాయి’ అని పేర్కొన్నారు. (‘ఆ బాధ నీలో స్పష్టంగా కనిపిస్తోంది కిట్టన్నా’) ‘కరోనా నియంత్రణతో పాటు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానంలో నిల్చింది. 108,104 అంబులెన్సులు ప్రాణం పోసుకున్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్లు కార్పోరేట్ సంస్థలతో పోటీ పడేలా జగన్ గారు దిశా నిర్దేశం చేశారు. రెండేళ్లలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది’ అంటూ మరో ట్వీట్లో ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. #SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/bXQOz2BBco — Vijayasai Reddy V (@VSReddy_MP) June 10, 2020 కొడుకేమో ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’. సీనియర్లంతా చేతులెత్తేసారు. ఎవరైతే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వుల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు. — Vijayasai Reddy V (@VSReddy_MP) June 10, 2020 పాలన ఎప్పుడు ‘సిటిజెన్ సెంట్రిక్‘ గా ఉండాలని పొలిటికల్ సైన్స్ గ్రంథాలు చెబ్తాయి. దీనిపై ఇప్పటికీ అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రజా సంక్షేమం, పారదర్శకత, బాధ్యత, తక్షణ స్పందన ఉండాలనేదే వీటి సారాంశం. జగన్ గారు సిఎంగా బాధ్యతలు చేపట్టాక ఇవన్నీహర్షణీయ స్థాయిలో అమలవుతున్నాయి. — Vijayasai Reddy V (@VSReddy_MP) June 10, 2020 -
‘లోకేశ్ ఆవేదన తాలూకు ఉద్రేకం’
సాక్షి, అమరావతి : లోకేశ్ బాబు ఆవేశం చూస్తుంటే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా తనను కాదని తండ్రి చంద్రబాబు నాయుడు మరొకరిని ఎంపిక చేయడం వల్ల తన్నుకొచ్చిన ‘ఆవేదన తాలూకు ఉద్రేకం’ బయటపడినట్టు అనిపిస్తోందని ట్విటర్లో పేర్కొన్నారు. పనికిరాడని సొంత తండ్రే సర్టిఫై చేస్తే తన ఫ్యూచర్ ఏమిటని కుంగిపోతున్నాడు పాపం అని ఎద్దేవా చేశారు.(టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యం) హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు మనసంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల కాళ్లు పట్టుకోవడం ఎలా అనే దానిపై వర్కవుట్ చేస్తున్నాడని తెలిపారు. బీజేపీకి దగ్గర కావాలని తన మనుషులతో ఇప్పటికే అనిపించారని తెలిపారు. ఎల్లో మీడియా ఎంటరై అదొక చారిత్రక అవసరమన్నట్టు వరుస కథనాలు వడ్డిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.(కొత్త ఒరవడికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం) ‘రౌడీ షీటర్లకు ఎమ్మెల్యే టికెట్లిచ్చాడు. ఎక్కడ గ్యాంగ్ వార్ జరిగినా రక్తపాతం సృష్టించేది బాబు గారి అనుంగు శిష్యులే. వైఎస్ జగన్‌పైనే హత్యాయత్నం చేయించిన చరిత్ర. 60 ఏళ్ల వృద్ధురాలిపై కేసేమిటని వెనకేసుకొచ్చాడు. రికార్డులు తీస్తే ఆయన హయాంలోనే ఆమె పైన 13 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తేలింది’ అని మరో ట్వీట్లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.(విజయవాడ చేరుకున్న సినీ ప్రముఖుల బృందం) -
చంద్రబాబూ నిబంధనలు పట్టవా?
-
లాక్డౌన్ నిబంధనలు చంద్రబాబు బేఖాతర్
సాక్షి, అమరావతి/విజయవాడ/జగ్గయ్యపేట/తాడేపల్లి: రెండు నెలల తర్వాత హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. రాష్ట్ర పోలీసు శాఖ ఇచ్చిన ప్రత్యేక అనుమతితో సోమవారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉండవల్లి లోని తమ నివాసానికి చేరుకున్నారు. ఈ మార్గమధ్యంలో పలుచోట్ల టీడీపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికేందుకు జనసమీకరణ చేశారు. ఎక్కడా నేతలు, కార్యకర్తలు మాస్క్‌లు పెట్టుకోకుండా, భౌతికదూరం పాటించకుండా హడావుడి చేయడంతో పోలీసులు వారిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. అయినా టీడీపీ కేడర్ లెక్కచేయలేదు. తెలంగాణ స రిహద్దు దాటి ఏపీలోకి ప్రవేశించే గరిక పాడు చెక్‌పోస్టు వద్దకు మాజీ ఎమ్మెల్యే శ్రీ రాం తాతయ్య కార్యకర్తల్ని తరలించారు. నందిగామ, కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, గొల్లపూడి సెంటర్లో దేవినేని ఉమ జనాలను సమీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయా ప్రాంతాల్లో టీడీపీ జెండాలు పట్టుకుని మూకుమ్మడిగా అనేక మంది చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన కూడా కార్యకర్తల్ని వారించే ప్రయత్నం చేయలేదు. హైకోర్టు జడ్జి కారుకు అడ్డంగా.. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆయన నివాసం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకుని ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించారు. ఈ సమయంలో హైకోర్టు జడ్జి కాన్వాయ్కి కరకట్టపై బాబు కాన్వాయ్ అడ్డువచ్చింది. జడ్జి భద్రతా సిబ్బంది దారి క్లియర్ చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యారు. న్యాయమూర్తి కారును పెనుమాక మీదుగా ఉండవల్లి మార్గంలోకి మళ్లించారు. -
పప్పూ.. నాన్న మీద అలిగావా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'బిల్‌గేట్స్‌ని తీసుకొచ్చానన్నావ్.. బిల్ క్లింటన్‌ని తీసుకొచ్చానన్నావ్.. టోని బ్లెయిర్‌ని తీసుకొచ్చానన్నావ్.. ఇంతకీ పప్పుని తీసుకొచ్చావా, లేదా' అంటూ ట్వీట్ చేశారు. కాగా మరో ట్వీట్లో 'పప్పూ...తప్పు..! నాన్న మీద అలిగేవా? పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే తప్ప మందలగిరి రానన్నావా? పప్పూ... తప్పు తప్పు..! అంటూ' విజయసాయి రెడ్డి మరో ట్వీట్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: 'ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు' ‘యూటర్న్ అంకుల్.. ఏమిటి చెప్పండి’ -
తుప్పు, పప్పు.. 150 మంది సెక్యూరిటీ అవసరమా?
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఏపీ ప్రతిపక్ష నాయకుడు, ఆయన కుమారుడు హైదరాబాద్‌లో కూర్చొని విమర్శలు చేయడంపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. తుప్పు, పప్పు హైదరాబాద్ పారిపోయి ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ అవసరమా అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. చదవండి: జాగ్రత్తలు పాటిస్తూ తిరిగి కార్యకలాపాలు: సీఎం జగన్ 'అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరిస్తే జీతాలెలా తీసుకుంటారని ఎద్దేవా చేశారు. తుప్పు, పప్పు రెండు నెలలుగా పొరుగు రాష్ట్రంలో ఉంటూ ప్రభుత్వ సదుపాయాలెలా ఉపయోగించుకుంటున్నారో చెప్పాలి. ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరమా?' అంటూ మండిపడ్డారు. కాగా మరో ట్వీట్లో 'ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన వసతులు కల్పించడంలో దేశంలోనే రాష్ట్రం ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది. రూ.16 వేల కోట్లతో పదివేల వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల ఏర్పాటుకు సీఎం జగన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజల ముంగిటకు వైద్య సదుపాయలు తీసుకెళ్లే అసాధారణ కార్యక్రమం ఇది' అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: కరోనా కల్లోలం: ఇద్దరు ఏఎస్ఐలు మృతి -
‘మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి’
సాక్షి, అమరావతి : టీడీపీ నేత నారా లోకేశ్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేశ్‌కు నోటి దూల ఎక్కువైందని, అతన్ని కరోనా క్వారంటైన్లో పెట్టాలని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. 'మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి. వ్యాధి లక్షణాలేవీ బయటకు కనిపించకున్నా అతని నోటి దూల సమాజంలో అశాంతిని ప్రేరేపించేలా ఉంది. అత్యంత నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న 4.5 లక్షల మంది వాలంటీర్లను రేపిస్టులు, దండుపాళ్యం క్రిమినల్స్ అని తిట్టి పోస్తున్నాడు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (చదవండి : ‘అంగిట బెల్లం ఆత్మలో విషం’ ఇది బాబు నైజం) -
చంద్రబాబు,లోకేష్ జైల్లుకు వెళ్లడం ఖాయం
-
లోకేష్ హడావుడిగా ఆస్తులెందుకు ప్రకటించారు?
-
‘టీడీపీ పాలనలో ప్రజాధనం లూటీ’
సాక్షి, అనంతపురం: అవినీతికి చిరునామా చంద్రబాబు నాయుడని వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం అహ్మద్‌అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రెండు ఎకరాల భూమి నుంచి రూ.రెండు లక్షల కోట్లు అక్రమంగా సంపాధించిన ఘనుడని ఆయన మండిపడ్డారు. ఐటీ దాడుల్లో చంద్రబాబుకు చెందిన రూ.రెండు వేల కోట్ల బినామీ లావాదేవీలు వెలుగు చూశాయని ఆయన తెలిపారు. (మౌనంగా ఉంటే నేరాన్ని అంగీకరించినట్లేగా) చంద్రబాబు పీఏ ఇంట్లో విలువైన డైరీ, కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని నదీం అహ్మద్ పేర్కొన్నారు. అదేవిధంగా 2.63 లక్షల పంచనామా పత్రాన్ని చూపి తప్పించుకోవాలని టీడీపీ నేతలు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ప్రజాధనం లూటీ అయిందనన్నారు. వేల కోట్ల సోమ్మును టీడీపీ నేతలు జేబుల్లో నింపుకున్నారని నదీం మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ, ఈడీ విచారణ చేపట్టాలన్నారు. చంద్రబాబును వెంటనే అరెస్టు చేయాలని నదీం అహ్మద్ డిమాండ్ చేశారు. (చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ విచారణ చేపట్టాలి) -
‘చంద్రబాబు, లోకేష్ పాస్‌పోర్టులను సీజ్ చేయాలి’
సాక్షి, రాజమండ్రి: టీడీపీ సీఆర్డీఏను చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపుడి రాజా మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అర్హులందరికి సంక్షేమ పథకాలను అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లే అర్థిక పరిస్థితి కుంటుపడిందని ఆయన విమర్శించారు. కృతిమ ఉద్యమంతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారని జక్కంపుడి రాజా ఆగ్రహించారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్దే రూ. రెండు వేల కోట్ల అక్రమ సంపాదన బయటపడిందంటే.. చంద్రబాబు, లోకేష్ వద్ద ఎన్ని కోట్ల అవినీతి సోమ్ము ఉందో అని రాజా ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ పాస్‌పోర్టులను సీజ్ చేయాలని రాజా తెలిపారు. (ఇంత బతుకు బతికి ఇంటెనక... అన్నట్లు) -
చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు
-
ఆర్కే ఇన్ఫ్రా అక్రమాలెన్నో..?
సాక్షి, కడప : ఐటీ దాడుల నేపథ్యంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రా అక్రమాలు పెద్దఎత్తున బయటపడుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లతో ఆర్కే ఇన్ఫ్రా అధినేత మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు రోడ్డున పడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా వీరి సంబంధాలు కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీ విచారణలోనూ ఈ విషయాలు బయటపడినట్లు సమాచారం. రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీల్లో మూడు ఇన్ఫ్రా కంపెనీల భాగస్వామ్యం ఉండగా ఆర్కే ఇన్ఫ్రా సైతం కీలకపాత్ర పోషించినట్లు ఐటీ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లకు ఆర్కే ఇన్ఫ్రా అధినేత ద్వారా పెద్ద ఎత్తున నిధులు సమకూరినట్లు సొంత పార్టీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేతకు ఇతర రాష్ట్రాల నుంచే గాక ఇతర దేశాల నుంచి సైతం మూడు ఇన్ఫ్రా కంపెనీల ద్వారా నిధులు సమకూరినట్లు ఐటీ సోదాల్లో వెల్లడైంది. ఇందులో కడపజిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన ఆర్కే ఇన్ఫ్రా పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. 2000 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఇప్పటికే ఐటీ ప్రాథమికంగా ప్రకటించింది. లోతైన విచారణ పూర్తి చేస్తే మరిన్న అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కాంట్రాక్టర్, ఆర్థికంగా బలోపేతుడైన శ్రీనివాసులురెడ్డిని చంద్రబాబు, లోకేష్‌బాబులు దగ్గరకు చేర్చుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న అతన్ని 2014 పార్లమెంటు ఎన్నికల్లో కడప నుంచి టీడీపీ అభ్యరి్థగా పోటీ చేయించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. కోట్లు కొల్లగొట్టేందుకు టీడీపీ అధినేత ఆర్కే ఇన్ఫ్రాను నిధులు సమకూర్చే సాధనంగా వాడుకున్నారు. పెద్ద ఎత్తున కాంట్రాక్టులు కట్టబెట్టారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా రూ. 200 కోట్లతో పూర్తయ్యే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సింగిల్ టెండర్ దాఖలు చేసి ఆర్కే ఇన్ఫ్రాకు రూ. 450.85 కోట్లకు కట్టబెట్టారు. అంతేకాకుండా డిజైన్లు మారడం వల్ల పనుల పరిణామం పెరిగిందని అదనంగా రూ. 129 కోట్లను దోచిపెట్టారు. హంద్రీ–నీవా రెండోదశ పనులను ఆర్కే ఇన్ఫ్రాకు అప్పగించారు. చేయని సొరంగం పనులకు రూ. 35 కోట్లు దోచిపెట్టారు. ఇది కాకుండా ప్రకాశం జిల్లాలో పాత కాంట్రాక్టర్లను నిబంధనలను విరుద్ధంగా పక్కన పెట్టి వెలిగొండ పనులను ఆర్కే ఇన్ఫ్రాకు అప్పగించారు. ఇందులో భాగంగా రూ. 91.15 కోట్ల కొల్లంవాగు హెడ్ రెగ్యులేటర్ పనులను కట్టబెట్టారు.హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండానే రూ. 17 కోట్లు దోచిపెట్టారు. వీటితోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్కే ఇన్ఫ్రాకు టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు అప్పగించింది. నిబంధనలకు విరుద్ధంగా అంచనాలు పెంచుకుని పోటీ లేకుండా ఏకపక్షంగా టెండర్లు నిర్వహించి బాబు అండ్ కో ఆర్కే ఇన్ఫ్రాకు పనులు కట్టబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తక్కువ కాలంలోనే చంద్రబాబుకు దగ్గరకైన ఆర్కే ఇన్ఫ్రా అధినేతకు ఊహించని రీతిలో కాంట్రాక్టు పనులు అప్పగించడంపై అప్పట్లో టీడీపీలోని ఓ వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయల నిధులు ఇన్ఫ్రా కంపెనీల ద్వారానే పార్టీ అధినేత చంద్రబాబుకు చేరినట్లు ఐటీ శాఖ గుర్తించినట్లు సమాచారం. ఇందులో ఆర్కే ఇన్ఫ్రాకు భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది.ఐటీ విచారణ పూర్తయితే ఏ కంపెనీలకు ఎన్ని వందల కోట్ల నిధులు అక్రమంగా తరలివచ్చాయో బహిర్గతమవుతుంది. ఆర్కే ఇన్ఫ్రా అక్రమాలు టీవీలు, పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా రావడంతో జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలు, టీడీపీ వర్గాల వారు విమర్శలు గుప్పిస్తున్నారు. -
బాబు,లోకేష్‌లను అదుపులోకి తీసుకొని విచారించాలి
-
'పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని'
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు, లోకేష్ ఇచ్చే ప్యాకేజీలకు పవన్ లొంగిపోయారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఘాటుగా విమర్శించారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీని మాత్రమే ప్రశ్నిస్తున్నారని, పేద రైతుల భూములు కాజేసిన చంద్రబాబును మాత్రం ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటనను ఆళ్ల తప్పుపట్టారు. గుంటూరు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటించే ముందు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌కు ఉన్న పరిజ్ఞానం కూడా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: ‘ఆయన వేషం మార్చి నటుడయ్యారు..!’ గత ఐదేళ్లు పవన్ చంద్రబాబుతో లోపాయికారిగా స్నేహం చేసి, ఆయన ఇచ్చిన ప్యాకేజీలు తీసుకున్నారు. రైతులకు చంద్రబాబు మోసం చేసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటించలేదు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఏ రోజు కూడా పవన్ చంద్రబాబును ప్రశ్నించలేదు. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ నుంచి ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. గత ఐదేళ్లు చంద్రబాబు ప్యాకేజీలకు లొంగి.. ఈ రోజు రాజధాని ప్రాంతానికి వచ్చి రైతుల సమస్యలను తెలుసుకోకుండా వారిని రెచ్చగొట్టడం ఎంతవరకు వరకు సమంజసం. మేం రాజధాని ప్రాంత రైతులం. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి రిజర్వ్ జోన్లను తొలగించాలని కోరాం. సమస్య ఏంటో తెలుసుకోకుండా పవన్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అసలు రాజధాని అమరావతి నుంచి తరలించడం లేదు. ఇక్కడే శాసన సభ ఉంటుంది. అధికార వికేంద్రీకరణ కావాలి. ఎగ్జిక్యూటీవ్ రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలును చేయబోతున్నాం. చంద్రబాబు వదిలిపెట్టిన పనులు పూర్తి చేయాలంటే లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది. రాజధాని రైతులకు సీఎం న్యాయం చేస్తుంటే రైతులను రెచ్చగొట్టడం సరికాదు. రాజధాని అంశం రాష్ట్రం పరిధిలో ఉంటుందని తెలిసి కూడా రైతులను రెచ్చగొట్టడం సరికాదు. చంద్రబాబు ఏం చెబితే.. అదే పవన్ మాట్లాడుతున్నారు. పవన్‌కు లోక పరిజ్ఞానం లేదు. ఇది తప్పు అయితే చంద్రబాబు, లోకేష్ ఇస్తున్న ప్యాకేజీలు తీసుకొని మాట్లాడుతున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించే ముందు ఇక్కడ ఎన్ని గ్రామాలు ఉన్నాయి..రైతులు, రైతు కూలీలు, పేదలు ఎంత మంది ఉన్నారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సీఎం వైఎస్ జగన్ అడగకుండానే రైతులకు కౌలు 15 ఏళ్లు పెంచారు. కూలీలకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు పరిహారం పెంచారు. సీఎం నిర్ణయానికి హర్షించాల్సింది పోయి చంద్రబాబు, లోకేష్‌లు చెప్పినట్లు పవన్ మాట్లాడటం సరికాదు. చదవండి: నా జీవితం ఏ మగాడి సాయం లేకుండా సాగుతోంది: రేణు సుమారు 4500 ఎకరాల భూములు బినామీల పేరుతో, తెల్ల రేషన్‌కార్డు దారులతో కొనుగోలు చేయించారు. ఇవాళ కేసులు కూడా నమోదు అయ్యాయి. వీటిపై పవన్ నోరు మెదపడం లేదు. దళితుల భూములను చంద్రబాబు కాజేస్తే..ఆ భూములు తిరిగి దళితులకు సీఎం వైఎస్ జగన్ ఇప్పించారు. ఈ విషయాలపై పవన్ మాట్లాడటం లేదు. చంద్రబాబు, లోకేష్ చెప్పిన మాటలు వళ్లెవేయడంలో పవన్ ఉన్నారు. చంద్రబాబు బినామీ కంపెనీలతో వేల కోట్లు డబ్బులు దోచేశాడు. దీనిపై పవన్ మాట్లాడటం లేదు. తాత్కాలిక భవనాలకు వేల కోట్లు ఖర్చు చేసి దోచుకున్నా మాట్లాడటం లేదు. రాజధాని పేరుతో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టకపోయినా పవన్ ప్రశ్నించడం లేదు. ఇన్ని బొక్కలు పెట్టుకొని ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్.. పేదలకు, దళితులకు, సామాన్యులకు అండగా ఉన్న వైఎస్సార్ సీపీని ప్రశ్నిస్తానని పవన్ అంటున్నారు. ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు తెలిపారు. పవన్ ఎందుకు ఈ విషయాలపై మాట్లాడటం లేదు. పవన్ రైతులను, జనసేన కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నారు. రాజధాని పర్యటనకు తన పార్టీ ఎమ్మెల్యేను ఎందుకు పిలువలేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చదవండి: రేణుదేశాయ్ ఇబ్బందులు అందరికీ తెలుసు -
'పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని'
-
నిప్పో.. తుప్పో ఐటీ దాడుల్లో తెలుతుంది
-
ఐదో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
సాక్షి, అమరావతి/హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ సన్నిహితుల ఇళ్లు, కంపెనీ కార్యాలయాల్లో సోమవారం కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో టీడీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ ప్రత్యేక అధికారుల బృందం గత ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్ ఇళ్లల్లో, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ ఇళ్లల్లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలకు మద్దతుగా హవాలా రూపంలో నగదు పంపిణీ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఆదాయ పన్ను అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉంటున్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్లో ఆదాయపు పన్ను అధికారుల తనిఖీలు సోమవారం ముగిశాయి. -
ఢిల్లీ ఐటీ బృందాల దాడులు.. వారి గుండెల్లో దడ..!
సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాల తనిఖీలు టీడీపీ నేతల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. గురువారం మొదలైన సోదాలు శనివా రం రాత్రి అయినా ఆగకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో భయాలు మొదలవుతున్నాయి. నాలుగో రోజూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అతనికి చెందిన విజయవాడ గాయత్రీ నగర్‌లోని కంచుకోట ప్లాజాలో సోదాలు కొనసాగుతున్నాయి. రహస్య లాకర్ నుంచి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీనివాస్ సన్నిహితులు, బంధువుల వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. (చదవండి : ఐటీ సోదాలు; టీడీపీ నేతల టెన్షన్) ముంబై కేంద్రంగా ఉన్న బడా కంపెనీ నుంచి ఏపీకి చెందిన ముఖ్యనేతకు రూ.150 కోట్ల ముడుపులు అందినట్టు ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు. టీడీపీకి చెందిన ఓ ముఖ్యనేత బినామీ సంస్థల నుంచి జరిగిన నకిలీ లావాదేవీలను అధికారులు గుర్తించారు. లోకేశ్ సన్నిహితులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌కు చెందిన అవెక్సా కార్పొరేషన్, కిలారు రాజేష్ ఇళ్లల్లో ఐటీ అధికారుల సోదాలు జరిగాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఇద్దరూ రూ.కోట్లలో లబ్ధి పొందినట్టు గుర్తించారు. లోకేష్ బినామీ కిలారు రాజేశ్ వందల కోట్ల ఐటీ రిటర్న్స్‌లో అవకతవకలకు పాల్పడినట్టు సమాచారం. ఇద్దరు అరెస్ట్! ఇదిలా ఉండగా, నారా లోకేష్‌కు అత్యంత సన్నిహి తులుగా పేరొందిన కిలారు రాజేష్, నరేన్ చౌదరిల కు చెందిన కంపెనీలపై జరిపిన సోదాల్లో నకిలీ ఇన్వాయిస్లు బయటపడినట్టు తెలుస్తోంది. వీటి ని సృష్టించడంలో కీలకపాత్ర పోషించిన ఆ కంపె నీకి చెందిన ఇద్దరి ఉద్యోగులను జీఎస్టీ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీన్ని అధికార వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు. (చదవండి : టీడీపీ నేత ఇంటిలో 30గంటల పాటు సోదాలు) -
వరుసగా నాలుగో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
‘లోకేష్ బాబును జైలుకు పంపుతారా..?’
సాక్షి, గుంటూరు : చంద్రబాబు రెచ్చగొట్టే మాటలు నమ్మితే యువత జీవితాలు నాశనమవుతాయని వైఎస్సార్సీపీ నేత, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక వర్గం ఉన్న ప్రాంతాల్లోనే బాబు మీటింగులు పెడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ‘ఒక్కరోజు జైలుకెళ్లినా పరవాలేదని చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. తన కుమారుడు లోకేష్ బాబును జైలుకు పంపుమంటే పంపుతారా..? కమ్మ సామాజిక ప్రజాప్రతినిధిగా మన మేలు కోసం చెప్తున్నా.. చంద్రబాబు మాటలు నమ్మి జీవితాలు పాడుచేసుకోవద్దు’ అని శివకుమార్ పేర్కొన్నారు. -
‘అంటరానితనం చంద్రబాబు ఒంట్లో ఉంది’
సాక్షి, తాడేపల్లి: ఎంపీ నందిగం సురేష్‌పై పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ దాడి చేయించిందని.. దాడికి చంద్రబాబునాయుడు, లోకేష్ బాధ్యత వహించాలని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ దిశగా సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలన చేస్తుంటే చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళిత ప్రజా ప్రతినిధులపై దాడులకు ప్రేరేపిస్తున్న చంద్రబాబు, లోకేష్‌పై కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపీ సురేష్‌పై వ్యూహం ప్రకారం దాడి చేయించారని నాగార్జున ధ్వజమెత్తారు. ఎంపీ నందిగం సురేష్‌పై దాడి వెనుక పెద్ద కుట్ర ఉందని.. దాడులతో రాజధానిలో దళితులను మభ్యపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలనలో దళితులు అస్పృశ్యత, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ఎంపీ సురేష్‌పై దాడి చంద్రబాబు అకృత్యాలకు నిదర్శనమని నాగార్జున దుయ్యబట్టారు. దళిత ఎమ్మెల్యేలుపై వరుసుగా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బాపట్ల ఎంపీ సురేశ్‌పై టీడీపీ నేతల దాడి పామర్రు ఎమ్మెల్యే అనిల్, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు రాజధానిలో రైతులకు ఒక ప్యాకేజీ, దళితులకు ఒక ప్యాకేజీ ఇచ్చి వివక్ష చూపించారని నాగార్జున విరుచుకపడ్డారు. దళితులు కోసం చంద్రబాబు ఒక మంచి పథకమైన పెట్టావా అని ఆయన ప్రశ్నించారు. తన చెంచా మీడియా ద్వారా సీఎం జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని తెలిపారు. అంటరానితనం అనేది చంద్రబాబు ఒంట్లో ఉందని.. దళితులను భయపెట్టడం చంద్రబాబు తరం కాదని ఆయన అన్నారు. మేము ఉద్యమం చేస్తే చంద్రబాబు, టీడీపీ నేతలు పారిపోతారని ఎమ్మెల్యే మెరుగు నాగార్జున ఎద్దేవా చేశారు. -
‘అంటరానితనం చంద్రబాబు ఒంట్లో ఉంది’
-
ఆయన అంటెండర్‌గా కూడా పనికిరాడు..!
సాక్షి, కాకినాడ: లోకేష్.. చంద్రబాబు కుమారుడు కాకపోతే శాసనమండలిలో అంటెండర్ ఉద్యోగానికి కూడా పనికిరాడని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. శుక్రవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. మండలి జరుగుతున్నప్పుడు లోకేష్ ఒక పప్పులా వ్యవహరించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక యువ నాయకుడు ఎలా వ్యవహరించాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి నేర్చుకోవాలని లోకేష్‌కు దాడిశెట్టి రాజా హితవు పలికారు. యనమల టెర్రరిజం గురించి ప్రజలకు తెలుసు.. యనమల రామకృష్ణుడు టెర్రరిస్టు కన్నా దారుణంగా వ్యవహరించారని.. యనమల టెర్రరిజం గురించి తుని నియోజకవర్గంలో ప్రతిఒక్కరికి తెలుసునన్నారు. కాపు ఉద్యమ సమయంలో అప్పటి జిల్లా ఎస్పీ, ఎఎస్పీని వెంటేసుకుని జిల్లాను ఏవిధంగా భయబ్రాంతులకు గురిచేశారో జిల్లా అంతా తెలుసునన్నారు. గత ఎన్నికల్లో యనమల, ఆయన సోదరుడిని జిల్లా ప్రజలు తరిమికొట్టిన విషయాన్ని వారు గుర్తించుకోవాలన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దేశ ద్రోహి యనమల అని తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రలోభాల గేట్లు తెరిస్తే.. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజలు పన్నులు కడుతున్నారు తప్ప.. చంద్రబాబు బినామీలు కోసం కాదన్నారు. చంద్రబాబు బినామీల కోసం.. తమ కష్టాలను త్యాగం చేసే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. అమరావతిని రాజధానిగా అంగీకరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని స్పష్టం చేశారు. తాము ప్రలోభాల గేట్లు తెరిస్తే..నీ పక్కన కొడుకు, బావమరిది తప్ప మరెవ్వరు ఉండరన్న సంగతి చంద్రబాబు గుర్తించుకోవాలని దాడిశెట్టి రాజా నిప్పులు చెరిగారు. -
బాబు నక్క అంటే నక్క, కుక్క అంటే కుక్క
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. అమరావతి భారీ నిర్మాణాలకు అనుకూలమేనని ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోందని ఎద్దేవా చేశారు. (చదవండి : మండలిలో గందరగోళం సృష్టిస్తున్న టీడీపీ) ‘అమరావతికి వరద ముప్పు లేదంట. రేగడి నేలలైనా భారీ నిర్మాణాలకు అనుకూలమే అని చెప్పడానికి ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోంది. చివరకు కోల్‌కత, ముంబై నగరాలు ప్రమాదకరమైనవని తీర్పు చేప్పే సాహసానికి తెగబడింది. చంద్రబాబు నక్క అంటే నక్క, కుక్క అంటే కుక్క’అని విజయసాయిరెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. మరో ట్వీట్లో.. ‘అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రమోషన్ కోసం ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్ సదస్సుకు వెళ్లేవాడు చంద్రబాబు. చిట్టినాయుడు కూడా ప్రత్యేక విమానాల్లో తిరిగొచ్చేవాడు. జపాన్, సింగపూర్, చైనా, కజాకిస్థాన్, మలేసియా, థాయిలాండ్ లకు లెక్కలేనన్ని సార్లు పర్యటనలు చేశారు’అని విజయసాయిరెడ్డి విమర్శించారు. (చదవండి : టీడీపీది హీనమైన చరిత్ర : సీఎం జగన్) -
లోకేష్‌కు వెల్లంపల్లి సవాల్
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తో రాజకీయం చేయడం టీడీపీకి అంత మంచిది కాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల కొండపైన శిలువ ఉందని టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. టీటీడీలో అన్యమత ప్రచారం జరిగిందనేది అవాస్తవమని ఆయన తేల్చి చెప్పారు. తెలుగుదేశం, ఆ పార్టీ సోషల్ మీడియా నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. కొండపై శిలువ ఉందని నిరూపిస్తే తను రాజీనామా చేస్తానని, లేనిపక్షంలో లోకేష్ రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. తిరుమల వెంకటేశ్వరస్వామితో రాజకీయాలు చేయొద్దని టీడీపీకి హితవు పలికారు. ఇప్పటికే నాశనమయ్యారు.. తిరుమల వెంకన్న జోలికి వస్తే ఇంకా నాశనమైపోతారని వెల్లంపల్లి శ్రీనివాసరావు టీడీపీని దుయ్యబట్టారు. ‘తెలుగుదేశం హయాంలో కొండపై దళారీ వ్యవస్థ బలపడింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 మంది దళారీలు అరెస్ట్ అయ్యారు. టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్‌పై ప్రశ్నలు అడిగి అన్యమతం గురించి సభలో ఎలా మాట్లాడతారు? శ్రీవాణి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిందే టీడీపీ. ఈ ట్రస్ట్ ద్వారా రూ.10 వేలు విరాళం ఇచ్చిన భక్తుడికి ఏడాదిలో ఒకసారి స్వామివారి దర్శనం కలుగజేస్తున్నాం. సాధారణ రోజుల్లో ప్రతిదినం 200 మందికి ఈ అవకాశం కల్పిస్తున్నాం. టీటీడీలో ఉన్న తొమ్మిది ట్రస్ట్‌ల్లో శ్రీవాణి ట్రస్టు ఒకటి. దీనికి వచ్చే విరాళాలతో ధర్మప్రచారం, ఆలయాల పునరుద్ధరణ, ధూపదీప నైవేద్యాలు, హిందూ ఆలయ పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’ అని వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
నీ సంగతి తేలుస్తా..
‘యూజ్లెస్ ఫెలో.. నువ్వు చీఫ్ మార్షల్ పోస్ట్‌కి అన్‌ఫిట్... నీ సంగతి తేలుస్తా..’ – అసెంబ్లీ గేటు వద్ద చీఫ్ మార్షల్ థియోఫిలస్‌పై ప్రతిపక్ష చంద్రబాబు తిట్ల దండకం. ‘మమ్మల్ని ఆపుతావా..! ఏం చేస్తున్నార్రా మీరు..?’ – చీఫ్ మార్షల్, మార్షల్స్‌పై నారా లోకేష్ అనుచిత వ్యాఖ్యలు. ‘ప్రతిపక్ష నేతను ఆపుతారా? ఎవడిచ్చాడ్రా మీకు ఉద్యోగం..? ఎవరు చెప్పాడ్రా ఆపమని..? చెప్పిన వాణ్ణి రమ్మను.. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా..? మనుషులా జంతువులా..?’ – టీడీపీ సభ్యుల దూషణ. సాక్షి, అమరావతి: ప్లకార్డులు లేకుండా లోపలకు రావాలని కోరిన భద్రతా సిబ్బందిని బెదిరిస్తూ, దూషిస్తూ టీడీపీ శాసనసభ్యులు గురువారం అసెంబ్లీ సాక్షిగా దౌర్జన్యానికి దిగారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు నారా లోకేష్, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, ఏఎస్ రామకృష్ణ తదితరులు అసెంబ్లీ నాలుగో నంబర్ గేటు వద్ద మార్షల్స్, పోలీసులను తీవ్ర పదజాలంతో దూషించారు. మార్షల్స్‌ను గెంటేసి.. గేట్లు తెరచి... ప్రతిపక్ష నేత చంద్రబాబు తన స్థాయిని మరచిపోయి చీఫ్ మార్షల్, మార్షల్స్‌పై గల్లీలో గొడవకు దిగినట్లుగా దుర్భాషలాడారు. మూడు టీవీ చానళ్లపై నిషేధం ఎత్తివేయాలంటూ ఉదయం చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నాలుగో గేటు వరకు ఫ్లకార్డులతో ప్రదర్శనగా చేరుకున్నారు. ఫ్లకార్డులతో లోపలకు వెళ్లకూడదని, వాటిని తీసేసి రావాలని కోరిన మార్షల్స్‌తో టీడీపీ సభ్యులు ఘర్షణకు దిగారు. చీఫ్ మార్షల్ థియోఫిలస్ అక్కడకు చేరుకుని వారికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా టీడీపీ సభ్యులు వినలేదు. ‘యూజ్లెస్ ఫెలో.. అన్నం తింటున్నారా.. గడ్డి తింటున్నారా.. జంతువుల్లా ప్రవర్తిస్తారా..?’ అంటూ మార్షల్స్‌పై తిట్లతో విరుచుకుపడ్డారు. మరోవైపు చంద్రబాబు ముందుకెళ్లి గేటు తీయాలని తమ ఎమ్మెల్యేలకు సూచిస్తూ మార్షల్స్, పోలీసులను దుర్భాషలాడారు. మార్షల్స్‌ను నెట్టేసి బలవంతంగా గేటు తెరిచిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తదితరులు లోపలకు ప్రవేశించి కొద్దిసేపు హల్చల్ చేశారు. మార్షల్స్‌పైనే ఫిర్యాదు అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లిన అనంతరం కూడా లోకేష్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు తదితరులు ‘ఏయ్.. నువ్వు కొత్తగా వచ్చావ్. ఏం చేయాలో తెలుసుకుని పని చెయ్..’ అంటూ చీఫ్ మార్షల్‌ని బెదిరిస్తూ తోపులాటకు దిగారు. టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయంలోకి వెళ్లే వరకూ చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నేతలు మార్షల్స్‌ని దూషిస్తూనే ఉన్నారు. అయితే మార్షల్సే తమను అడ్డుకుని దాడి చేసినట్లు చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితరులు సభలోకి చేరుకుని ఫిర్యాదు చేయడం కొసమెరుపు. గవర్నర్‌కు వినతిపత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెంటబెట్టుకుని రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని వినతిపత్రం ఇచ్చారు. అసెంబ్లీలో మూడు చానళ్లపై నిషేధం విధించారన్నారు. ‘ఉన్మాది’ అన్‌పార్లమెంటరీ పదం కాదు: చంద్రబాబు తాను ముఖ్యమంత్రిని ఉన్మాది అన్నానని గొడవ చేస్తున్నారని, అయితే అది అన్‌పార్లమెంటరీ పదం కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సభా గౌరవం కాపాడాలని తాను కోరుతుంటే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కొవ్వెక్కితే ఎలా ఉంటారో వైఎస్సార్సీపీ నాయకుల్లో కనబడుతోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోకి కాగితాలు తీసుకెళ్లవద్దని తమను ఇప్పుడు ఆపుతున్నారని, గతంలో ఆ పార్టీ నాయకులు లిక్కర్ బాటిల్స్ కూడా తెచ్చారని ఆరోపించారు. అసెంబ్లీ మార్షల్స్‌పై లోకేష్ దౌర్జన్యం మార్షల్స్‌ను దూషిస్తున్న టీడీపీ నేతలు -
'సీఎం జగన్ దమ్మేంటో ప్రజలకు తెలుసు'
సాక్షి, నరసరావుపేట: ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి దమ్మూధైర్యం ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసని, చంద్రబాబు పుత్రుడు, దత్తపుత్రులకు తెలియకపోవటం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్‌కు దమ్మూధైర్యం లేవంటూ ట్విట్టర్లో లోకేష్, పవన్‌కల్యాణ్ ఒకేరోజు పోస్ట్ చేశారు. నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా ఎదుట లోకేష్, పవన్‌కల్యాణ్ పోస్టులపై స్పందించారు. అప్పటి ప్రధానమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాందీని ఎదిరించి సొంతగా పార్టీ పెట్టుకున్న ధైర్యం వైఎస్ జగన్మోహన్రెడ్డిదని గుర్తుచేశారు. ఇటీవలి ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 సీట్లు గెల్చుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత వైఎస్ జగన్ సొంతమని పేర్కొన్నారు. తాను పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం మంగళగిరి పేరును కూడా స్పష్టంగా పలకలేని లోకేష్‌కు, పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయిన పవన్ కల్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దమ్మూ ధైర్యం గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవాచేశారు. టీడీపీ నేతలతో పాటు పవన్ కల్యాణ్ మంతం పేరిట ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ప్రజల మధ్య మతం, కులాల ప్రస్థావన తెస్తున్నారని, మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమ ర్శించారు. రాష్ట్రంలో డబ్బులు ఉన్నాయోలేదో అని కాకుండా మంచి పనులు చేస్తున్నామా లేదా అనే ధోరణితోనే సీఎం వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఆరు నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే దానికి కూడా మతం రంగు పులిమే సంస్కృతిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. అమలుచేసే పథకాల్లో తప్పులు, పొరపాట్లు ఉంటే చెబితే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. వ్యక్తిగతంగా సీఎంను దూషిస్తూ, ప్రజల మధ్య మతం, కులం పేరిట విభేదాలు తెచ్చే చర్యలకు ఇకనైనా ప్రతిపక్ష నాయకులు విడనాడాలని హితవుపలికారు. -
పవన్, లోకేష్ శవ రాజకీయాలు మానండి
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు తనయుడు లోకేష్ శవ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలు ఛీ కొట్టినా వీరి ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదని విమర్శించారు. ప్రతీ అంశాన్నీ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పవన్, లోకేష్ ఉన్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి తమ నివాసంలో మంగళవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. కాకినాడలో మూడు అంతస్తుల భవనంపై నుంచి పడి వీరబాబు అనే వ్యక్తి మృతి చెందితే ఆ అంశాన్ని కూడా స్వార్థ రాజకీయాల కోసం వాడుకునేందుకు లోకేష్ ప్రయతి్నంచారంటూ ధ్వజమెత్తారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగిన వెంటనే టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి అతని కుటుంబ సభ్యులను మభ్యపెట్టి ఇసుక కొరత కారణంగా పని దొరక్క ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. పార్టీ తరఫున కొంత సొమ్ము ఇస్తామంటూ చెప్పినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ వెంటనే రాత్రికి రాత్రే బయలుదేరి ఉదయాన్నే కాకినాడ చేరుకుని చేసిన హడావుడి చూస్తుంటే టీడీపీ నేతలు ఎంతగా దిగజారారో అర్థం అవుతుందన్నారు. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి కలిగే బాధ వర్ణనాతీతమని, చేతనైతే వారికి సహాయం చేసి ఆదుకోవాలే తప్ప శవరాజకీయాలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిం చారు. పెదపూడి మండలం చింతపల్లి లాకులకు చెందిన మృతుడు వీరబాబు కొంతకాలంగా పనులకు వెళ్లడం లేదని, అతని భార్య రోజువారీ వేతనంపై ఓ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆమె కూడా ఆరోగ్యం బాగోలేక కొద్దిరోజులుగా పనికి వెళ్లడం లేదన్నారు. వాస్తవాలను వక్రీకరించి భవన నిర్మాణ కార్మికుడు చనిపోయాడంటూ తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ద్వారంపూడి ప్రశ్నించారు. ఓ వైపు ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు, కొద్దిరోజులకే వర్షాలు, వరదలతో ఇసుక కొరత ఏర్పడడం వాస్తవమేనన్నారు. అయితే సమస్యకు ముఖ్యమంత్రి జగన్ శాశ్వత పరిష్కారాన్ని చూశారని, పది, పదిహేను రోజుల తరువాత ఇసుక కొరత కనిపించదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక పేరుతో ఎంత దోపిడీ చేసిందో ప్రజలందరికీ తెలుసన్నారు. ఐదేళ్లూ ఏమయ్యావు పవన్? ప్యాకేజీలు తీసుకుని రాజకీయాలు చేసే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చంద్రబాబు పాలనలో ఎందుకు అడ్రస్ లేకుండా పోయారని ఎమ్మెల్యే ద్వారంపూడి నిలదీశారు. 2014లో చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకుని టీడీపీ విజయానికి సహకరించిన పవన్... చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయినప్పటికీ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మంత్రులు బొత్స, కన్నబాబులను విమర్శిస్తున్న పవన్ కల్యాణ్ తీరుపై ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపడ్డారు. రాజకీయ విమర్శలు మాని వ్యక్తిగత విమర్శలకు దిగితే తాము కూడా అదే స్థాయిలో పవన్‌కు సమాధానం చెబుతామన్నారు. ఆయనకు ఉన్నన్ని లొసుగులు వేరెవ్వరికి లేవని, సినీ రంగంలో ఏ మహిళను అడిగినా పవన్‌కల్యాణ్ చరిత్రను బాహాటంగానే చెబుతారన్నారు. అన్న చిరంజీవి లేకపోతే నీ అడ్రస్ ఎక్కడ? అని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. పవన్కల్యాణ్మాట తీరు, వ్యవహారశైలి, ప్రవర్తన రాజకీయాలకు పనికి రావన్నారు. తాము ప్రజల్లో నుంచి ఎదిగి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని, ఆయనలా రెండు చోట్ల పోటీ చేసి ఘోరపరాజయాన్ని చవి చూడలేదన్నారు. రాజకీయాల్లో హుందాగా, సంస్కారవంతంగా వ్యవహరించాలని తమ నాయకుడు జగన్ సూచించినందున తాము వ్యక్తిగత విమర్శలకు వెళ్లడం లేదన్నారు. జనసేనలో అస్పష్టత విశాఖలో చేసిన మార్చ్‌పాస్ట్‌లో పవన్‌కల్యాణ్ ఇసుక కొరత కారణంగా 30 మంది చనిపోయారని చెప్పారని, ఆ తరువాత ఆ పార్టీకే చెందిన మరో నేత నాదెండ్ల మనోహర్ ఐదుగురు మృతి చెందారని చెప్పారన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆ పార్టీలో అస్పష్టత నెలకొందన్న విషయం తేటతెల్లమవుతోందన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఆర్. చంద్రకళాదీప్తి, కాకినాడ పార్లమెంట్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. -
లోకేశ్ దీక్షలా.. జనం నవ్వుకుంటున్నారు!
-
అజ్ఞాతవాసి... లోకేష్ బాబు!
సాక్షి, అమరావతి : మాజీ సీఎం చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కనిపించడం లేదు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుక్షణం నుంచి ఆయన పత్తా లేకుండా పోయారు. కృష్ణా నదికి వరద పోటెత్తి ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే కరకట్ట వద్దనున్న అక్రమ నివాసంపై స్పందిస్తున్న లోకేష్.. వరద ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేయాలని కనీసం టీడీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. గెలిచినా, ఓడినా అంటూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసిన నారా లోకేష్ తాను గెలిచినా, ఓడినా స్థానికంగా, ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి ఆయన ముఖం చాటేశారు. దీంతో అప్పట్లో తీవ్ర విమర్శలు రావడంతో తూతూమంత్రంగా వారం రోజులు హడావుడి చేసి అనంతరం మళ్లీ తెరవెనుకకు వెళ్లిపోయారు. సమావేశాలు ముగియగానే.. బడ్జెట్ సమావేశాలు జూలై ఆఖరున ముగిశాయి. ఆ తర్వాత నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడ ఉంటున్నారో.. ఏం చేస్తున్నారో కూడా ఎవరికి సమాచారం లేదు. ఇటు మంగళగిరి, అటు ఉండవల్లిలోని ఆయన నివాసంలోనూ ఆచూకీ లభించడం లేదు. ట్విట్టర్లోనే స్పందన కృష్ణా నదికి వరద పోటెత్తడంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి.. ట్విట్టర్లో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తుండడంపై మాజీ మంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే సాయం చేయాల్సిన విషయం మరిచి, తన ఇంటిపైనే ధ్యాసనంతా ఉంచారని పలువురు ఆరోపిస్తున్నారు. భారీ ఎత్తున వచ్చిన వరదతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే ఉండవల్లిలోని అక్రమ నివాసం మునకపైనే దృష్టి సారించారని అంతా మండిపడుతున్నారు. సినిమా చూడాలంటూ ట్వీట్..! కృష్ణమ్మ శాంతించడంతో లంక గ్రామాల ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వరదల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూసుకుంది. ఇదేమీ పట్టన్నట్లు సాహో సినిమాను టీడీపీ శ్రేణులు చూడాలని లోకేష్ ట్వీట్ చేయడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి సమయాల్లో ఎలా స్పందించాలో తెలియకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తన అజ్ఞాతాన్ని వీడి జనంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారు. సైనిక్’ సభ్యుడిగా నివృతరావు మైలవరం: మైలవరం జమీందారీ వంశీకులు, ద్వారకా తిరుమల దేవస్థానాల చైర్మన్ ఎస్వీ సుధాకరరావు తనయుడు, మాజీ లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎస్.వి.నివృతరావు సైనిక్ వెల్ఫేర్ బోర్డు సభ్యుడుగా నియమితులైనట్లు ఆయన కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆయన ఆ పదవిలో మూడు సంవత్సరాలు కొనసాగుతారు. -
‘ఎవరిని అడిగినా చెప్తారు.. తుగ్లక్ ఎవరో’
సాక్షి, అమరావతి : రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గిందని గగ్గోలు పెడుతున్న టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ విమర్శలు కురిపించారు. తుగ్లక్ పాలన అంటూ పిచ్చి కూతలు కూస్తున్న లోకేష్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్ పాలనకు అసలైన నిదర్శనం చంద్రబాబు పాలనే అని చురకలంటిచారు. పాలనా పగ్గాలు చేపట్టిన 45 రోజుల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల మనసులు చూరగొన్నారని కొనియాడారు. ఐదేళ్ల తుగ్లక్ పాలన అనంతరం ఇప్పుడు రాజన్న పరిపాలన సాగుతోందని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో అవినీతి.. ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తానని చెప్పిన బాబు అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని జోగిరమేష్ ఆరోపించారు. మొదట నూజివీడు ప్రాంతంలో రాజధాని నిర్మిస్తామని చెప్పి తర్వాత అమరావతిని ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. అనుయాయులు, పచ్చ పత్రికలతో విస్తృత ప్రచారం చేయించిన బాబు నూజివీడుల భూములు కొనేలా చేసి చాలామందిని మోసం చేశారని అన్నారు. ఇళ్లకు భూములు ఇవ్వని రైతుల ఇళ్లకు అధికారులు, మంత్రులను పంపి భయభ్రాంతులకు గురిచేశాడని ధ్వజమెత్తారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో 33 వేల ఎకరాల భూమిని సేకరించిన చంద్రబాబు రైతులకు ఏం లబ్ది చేకూర్చారని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణమే భ్రాంతి అన్నట్టుగా మార్చి భ్రమరావతిగా చూపెట్టారని ఎద్దేవా చేశారు. విఠలాచార్య సినిమాల్లో సెట్టింగుల్లా.. బాహుబలి గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియా ప్రచార ఆర్భాటాలే తప్ప ఐదేళ్ల పాలనలో కనీసం రాజధానికి సరైన రహదారి సౌకర్యం కూడా కల్పించలేదని దుయ్యబట్టారు. రుణం ఇస్తామని వాళ్లు చెప్పలేదు.. ‘అమరావతి నిర్మాణ విషయంలో తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయని, సామాజిక న్యాయం జరగలేదని ప్రపంచబ్యాంకు జూన్ 12న ఓ లెటర్‌ను వారి వెబ్సైట్లో పెట్టింది. రాజధాని నిర్మాణం నుంచి తప్పుకుంటున్నామని జూలై 17 స్పష్టం చేసింది. అప్పటికీ మా ప్రభుత్వం వచ్చి 12 రోజులే అవుతోంది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్లే ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వడం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంతటి దారుణం ఉంటుందా. మమ్మల్ని విమర్శించే ముందు లోకేష్ ఒకటి గుర్తుంచుకోవాలి. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజధాని నడిబొడ్డున ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. మా పార్టీ కార్యాలయం కూడా రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేసుకున్నాం. చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇల్లు ఉందా. కనీసం పార్టీ కార్యాలయమైనా ఉందా. మీ దరిద్రంతోనే ప్రపంచ బ్యాంకు వెనకడుగు వేసింది’అని చురకలంటించారు. -
అవి 'తానాసభలు' కాదు.. వారి ‘భజనసభలు’
సాక్షి, అమరావతి : అమెరికాలో జరుగుతున్న తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభలను టీడీపీ నేతలు భ్రష్టుపట్టిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తానా సభల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ జాతీయవాద ప్రసంగానికి అడ్డుతగిలి అవమానించిన లోకేష్ గ్యాంగ్ మరోసారి తమ నీచబుద్ది బయటపెట్టారని అన్నారు. ఈ సభలను పచ్చతమ్ముళ్లు టీడీపీ భజన సభలుగా మార్చి అమెరికాలో కూడా తెలుగువాళ్ల ప్రతిష్ట దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ఈమేరకు ఆయన ట్విటర్లో స్పందించారు. ‘ఏపీలో మీ బురద రాజకీయాల్లో నుండే కమలవికాసం జరుగుతుంది’అని కన్నా వ్యాఖ్యానించారు. -
లోకేష్ వ్యాఖ్యలను తప్పుబట్టిన హోంమంత్రి సుచరిత
-
ఖజానాలో డేంజర్ ‘బిల్స్’
సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో పెదబాబు, చినబాబు నిమగ్నమయ్యారు. అధికారాంతమున ఖజానాను దోచేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలింగ్ ముందు వరకూ తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించుకున్నాడు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులన్నీ చెల్లించాల్సిందేనంటూ ఆర్థిక శాఖపై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో(సీఎంవో) సాగునీటి వ్యవహారాలను పర్యవేక్షించే సాయిప్రసాద్ ద్వారా ఆర్థిక శాఖపై ఒత్తిడి పెంచుతున్నారు. పోలింగ్ ముందు రోజు దాకా ప్రభుత్వ నిధులను రాజకీయ అవసరాలు, స్వీయ లబ్ధి కోసం యథేచ్ఛగా వాడుకున్న చంద్రబాబుకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం రావడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. పోలింగ్ ముందు వరకూ ఉద్యోగుల వేతనాలు, వివిధ సంక్షేమ రంగాలకు ఇవ్వాల్సిన బిల్లులను చెల్లించకుండా పెండింగ్ పెట్టారు. చంద్రబాబు చెప్పిన బిల్లులకే నిధులను చెల్లించారు. ఉద్యోగుల వేతనాలు, గ్రామీణ మంచినీటి సరఫరా, కుటుంబ సంక్షేమం తదితర రంగాలకు చెందిన బిల్లులు పెద్ద ఎత్తున పెడింగ్‌లోనే ఉండిపోయాయి. ఈ బిల్లుల కోసం లబ్ధిదారులు ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. ప్రాధాన్యతా రంగాల వారీగా చెల్లించాలి వేతనాలు చెల్లింపులు జరగలేదనే విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లారు. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా బిల్లుల చెల్లింపులు ప్రాధాన్యతా క్రమంలో జరగడం లేదని, ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికే చెల్లింపులు చేస్తున్నారనే ఫిర్యాదులు సీఎస్‌కు అందాయి. దీంతో సీఎస్ పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు తక్షణమే అందజేయాలని, ప్రాధాన్యతా రంగాల ప్రకారం బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపును ఆఖరి ప్రాధాన్యతగా సీఎస్ నిర్ధారించారు. ఇక్కడే చంద్రబాబు అహం దెబ్బతింది. అందుకే సీఎస్ తీరుపై ఆయన గుర్రుగా ఉన్నారు. బిల్లుల చెల్లింపులో చంద్రబాబు ప్రాధాన్యతలకు, ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రాధాన్యతలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. కమీషన్లు ముట్టజెప్పిన వారికే బిల్లులు ఎన్నికల ముందు కమీషన్లు కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై ఒత్తిడి తెచ్చి నీరు–చెట్టు కింద రూ.2,104 కోట్ల బిల్లులు చెల్లింపజేశారు. ఆ నిధులన్నీ అధికార టీడీపీ నేతల జేబుల్లోకే వెళ్లాయి. అలాగే ఎన్నికల ముందు హడావిడిగా గోదావరి–పెన్నా ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానించి మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్టర్‌కు రూ.491 కోట్లు ఇప్పించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్, హంద్రీ–నీవా, గాలేరు–నగరి పనులకు సంబంధించి కాంట్రాక్టర్, టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.419 కోట్లు ఇప్పించారు. నీరు–చెట్టుతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన రూ.వేల కోట్ల బిల్లులను చెల్లించి, కమీషన్లు కాజేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తగినట్లుగా మార్చి నెలాఖరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి చెందిన నీరు–చెట్టుతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులకు చెందిన రూ.9,804.27 కోట్ల బిల్లులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోకి సీఎఫ్ఎంఎస్ పరిధిలోకి తెచ్చారు. మిగతా రంగాలకు చెందిన బిల్లులను ఆర్థిక సంవత్సరం మారిందని తిరస్కరించినప్పటికీ అస్మదీయ కాంట్రాక్టర్లకు చెందిన బిల్లులను మాత్రం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి పెండింగ్ బిల్లులుగా తీసుకొచ్చారు. పెదబాబుతో చినబాబు పోటీ కమీషన్లు కాజేసే విషయంలో చంద్రబాబుతో ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ పోటీపడుతున్నారు. పంచాయతీల్లో ఎల్ఈడీ బల్బుల బిల్లులను వెంటనే చెల్లించాలంటూ పంచాయతీరాజ్ శాఖపై ఒత్తిడి పెంచేశారు. గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి లైట్ల ఏర్పాటును ఈఈఎస్ఎల్, ఎన్ఆర్ఈడీసీఏపీ అనే ఏజెన్సీలకు అప్పగించారు. ఆ ఏజెన్సీల నుంచి లోకేశ్ మనుషులు సబ్ కాంట్రాక్టులు తీసుకున్నారు. సంబంధిత బిల్లులను వచ్చే నెల 5వ తేదీలోగా చెల్లించేయాలని పంచాయతీరాజ్ శాఖను లోకేశ్ ఆదేశించారు. అయితే, నిధుల్లేక పంచాయతీలు ఇప్పటికే సతమతం అవుతున్నాయి. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి చెందిన రూ.768 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వేసవిలో మంచినీటి ఎద్దడి ఉన్నప్పటికీ గ్రామీణ మంచినీటి సరఫరాకు చెందిన రూ.206.97 కోట్ల బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. మహిళా సంక్షేమానికి చెందిన రూ.132.93 కోట్లు, సాంఘిక సంక్షేమానికి చెందిన రూ.260.90 కోట్లు, గిరిజన సంక్షేమానికి చెందిన రూ.161 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. -
ఆంధ్రజ్యోతి పేరు మారిస్తే బాగుంటుందేమో..
సాక్షి, గుంటూరు : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారమిక్కడ ఎన్నికల ప్రచారంలో ఆయన ... జయదేవ్ మీద భూకబ్జా కేసులున్నాయని ఆరోపించారు. ఓట్లు గుంటూరువి.. నోట్లు మాత్రం చిత్తూరుకా అని మండిపడ్డారు. ఇక మంగళగిరి అని స్పష్టంగా పలకలేని నారా లోకేష్.. మంగళగిరి టీడీపీ అభ్యర్థా అని ప్రశ్నించారు. చంద్రబాబు మీడియా సాక్షిగా ఎన్టీఆర్‌ను వాడు అన్నాడంటే.. రూమ్‌లో ఇంకేం మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చని మోదుగుల అన్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికకు జ్యోతి లక్ష్మీగా పేరు మారిస్తే బాగుంటుందని మోదుగుల ఎద్దేవా చేశారు. రాధాకృష్ణ.. జ్యోతి లక్ష్మీ భంగిమలా ఎన్ని మాటలైన మాట్లాడతాడని ఆయన మండిపడ్డారు. టీడీపీకి చంద్రబాబు, లోకేష్‌లు నాయకులుగా పనికిరారన్నారు. మీ పార్టీకి నాయకులను మార్చుకోండి అంటూ టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు అభివృద్ధి కోసం ఏమేమి పనులు చేపట్టాలో తెలిపేలా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిందని మోదుగుల తెలిపారు. -
‘బాబు ఇంటికి హెలికాప్టర్లో డబ్బులొస్తున్నాయి’
సాక్షి, విజయవాడ : ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వర రావు అధ్వర్యంలో చంద్రబాబు నివాసానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్లో డబ్బులు వస్తున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య ఆరోపించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోకేష్ విశాఖపట్నంలో పారిశ్రామిక వేత్తలను కలిసింది డబ్బు మూటల కోసమేనా అని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంస్థలను గౌరవించని చంద్రబాబు తిరిగి తనపై అవి పెత్తనం చేస్తున్నాయని ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. తనను కాపాడాలంటూ చంద్రబాబు ప్రజలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సినీ తారలను రాజకీయాల్లోకి తెచ్చి ప్రచారం చేసుకున్న చరిత్ర చంద్రబాబుదేనని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి అద్దె తారాలను తెచ్చుకుంటోందని వైసీపీని ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. -
మాకు లోకేష్ ప్రచారమా.. వద్దు బాబోయ్!
‘అభివృద్ధికి నేనే బ్రాండ్ అంబాసిడర్. ఐటీ రంగానికీ ఆద్యుడు నేనే. తెలంగాణ అంత అభివృద్ధి సాధించిందంటే అది నా ఘనతే. పెట్టుబడులు వచ్చాయన్నా.. పారిశ్రామిక వేత్తలు వేలాదిగా తరలి వస్తున్నారన్నా అది నన్ను చూసే’ అంటూ ఉదయం లేచిన దగ్గర్నుంచీ భజంత్రీలు వాయించుకునే చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రచారం చేయడానికి మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి నేతలను దిగుమతి చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ఇప్పటివరకూ పలు ప్రచార సభలు నిర్వహించారు. వాటికి జనం సరిగా రావడం లేదు. ఆ వచ్చిన కొద్దిపాటి జనం నుంచీ ఆయన ప్రసంగాలకు స్పందన కనిపించడం లేదు. పైగా ఆయన చేపట్టిన అభివృద్ధి పనులేంటో చెప్పకుండా ఎంతసేపూ ఇతరులను విమర్శిస్తూనే ప్రచారం సాగిస్తూ వచ్చారు. మరోవైపు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సభలకు అశేష జనవాహిని రావడం, ప్రతి ప్రచార సభ ఓ జనకెరటంలా మారడం చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. చెప్పుకోవడానికి అభివృద్ధి పనులు లేవు, ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తూంటే జనం నుంచి సరైన స్పందన లేదు. పోనీ.. సినిమా తారలను తెచ్చుకుందామంటే.. సినిమా ఇండస్ట్రీ టీడీపీకి అంత సానుకూలత చూపించడం లేదు. సినిమా నటులు ఎవరూ తనను నమ్మడం లేదనే అంచనాకు వచ్చిన చంద్రబాబు.. ఇలా కాదులే అనుకుని ఇతర రాష్ట్రాల నేతలకు ఫోన్లు చేసి, ప్రచారం చేసిపెట్టాలని కోరుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశ నాయకులతో పాటు ఇరుగు, పొరుగు రాష్ట్రాల నేతలతో కనీసం రెండు మూడు సభలైనా పెట్టిస్తే, జనం నమ్మే పరిస్థితి ఉంటుందని ఆశ పడుతున్నారు. ఎట్టకేలకు కొందరు ఒప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ ఎన్నికలు కావడంతో కొంతమంది ఉత్తరాది నేతలు చంద్రబాబుకు ప్రచారం చేసిపెట్టడానికి ఒప్పుకున్నారు. ఇప్పటికే జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మంగళవారం కడప, ఆళ్లగడ్డ వంటి కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఉత్తరాది నేతలను కూడా కులాలు, వర్గాల వారీగా విడగొట్టి ఆయా ప్రాంతాల్లో తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పంథాలోనే ఫరూక్ అబ్దుల్లాను మైనార్టీలు ఉన్న ప్రాంతంలో తిప్పినా.. స్పందన నామమాత్రంగానే కనిపించింది. రానున్న ప్రచార సభలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ తదితరులను ఏపీలో ప్రచారానికి తెప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై గానీ.. సంస్కృతీ సంప్రదాయాలపై గానీ ఏ మాత్రం అవగాహన లేని ఉత్తరాది నేతలు ఇక్కడ ప్రభావం చూపించగలరా అంటూ సగటు ఓటర్లలో చర్చనీయాంశంగా మారింది. ‘మనం చేసింది మనమే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నేతలొచ్చి ఏం చెబుతారు’ అన్న విమర్శలూ వస్తున్నాయి. ఏ ఒక్క సభలోనూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఒక్క మాట కూడా చెప్పుకోలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని, ఫరూక్ అబ్దుల్లా వచ్చి దీనిపై ఏం మాట్లాడతారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఎన్నికలు ఆరు మాసాలున్నాయనగా బీజేపీతో విభేదించి అక్కడ్నుంచీ దేశవ్యాప్తంగా విభిన్న రాజకీయ పార్టీలతో జట్టుకట్టి, తనకు ప్రత్యర్థిగా ఉన్న పార్టీలను విమర్శించడమే అజెండాగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. వచ్చే పది రోజుల ప్రచారంలో దిగుమతి నేతల ప్రభావం ఏమాత్రం ఉంటుంది అన్న భయంలో చంద్రబాబు ఉన్నారు. లోకేష్ వద్దు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఎన్నికల ప్రచారానికి వెళుతూంటే ముఖ్యమంత్రే బెంబేలెత్తుతున్నారు. ఏం మాట్లాడితే ఎలాంటి నష్టం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ తప్పుల తడక ప్రసంగాలు, తడబాట్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతుండటంతో వీలైనంత వరకూ లోకేష్‌తో ప్రచార కార్యక్రమాలు తగ్గించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో పప్పులో కాలేస్తే అసలుకే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. పైగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లోకేష్‌ను ప్రచారానికి రావాలని కోరుకుంటున్న నేతలే లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోకేష్‌ను తాను పోటీచేస్తున్న మంగళగిరికి మాత్రమే పరిమితం చేస్తే బావుంటుందని పలువురు సీనియర్లు చంద్రబాబుకు సూచిస్తున్నట్టు తెలియవచ్చింది.- గుండం రామచంద్రారెడ్డి సాక్షి, అమరావతి -
లోకేష్‌కు ప్రజాక్షేత్రంలో తిరస్కరణ తప్పదు
సాక్షి, మంగళగిరి : అధికార బలంతో అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి తాజా మాజీ మంత్రి నారా లోకేష్ నామినేషన్‌ను ఆమోదింపజేసుకున్నా ప్రజాక్షేత్రంలో మాత్రం తిరస్కరణ తప్పదని మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) స్పష్టం చేశారు. మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం నామినేషన్ల పరిశీలన జరగ్గా టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్ పత్రాల్లో చేసిన నోటరీపై ఎమ్మెల్యే ఆర్కే న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీంతో నామినేషన్ ఐదు గంటల పాటు పెండింగ్‌లో పెట్టిన అధికారులకు ఉన్నతస్థాయిలో ఒత్తిడి రావడంతో ఆమోదించక తప్పలేదు. అనంతరం ఆర్కే విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తీవ్రస్థాయిలో స్థానిక ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెచ్చి లోకేష్ నామినేషన్ ఆమోదింపజేశారని విమర్శించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ఏం మాట్లాడతాడో తెలియని లోకేష్ చివరకు నామినేషన్ పత్రాలను సమర్పించడంలోనూ తప్పటడుగులు వేసి మరోసారి తన అసమర్థతను చాటుకున్నారని ఎద్దేవాచేశారు. తమ అభ్యంతరాలపై సమాధానం చెప్పలేని లోకేష్ న్యాయవాదులు 24 గంటలు సమయం కోరారని, 24 గంటల సమయం గడవకముందే అధికారులు ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. ఆక్రమించుకుని నివాసం ఉంటున్న లోకేష్, చంద్రబాబు అదే ఇంట్లో కూర్చుని కృష్ణాజిల్లా న్యాయవాదులతో నోటరీ చేయించుకున్నారని విమర్శించారు. వాస్తవానికి ఉండవల్లిలో నివాసం ఉంటున్నప్పుడు గుంటూరు జిల్లా న్యాయవాదులతో నోటరీ చేయించుకోవాలని స్పష్టంచేశారు. అప్పుడు కూడా ఇక్కడ ఎవరు నోటరీ చేసేవారు లేకపోతే ప్రత్యేకంగా అనుమతులు తీసుకుని కృష్ణాజిల్లా వారితో నోటరీ చేయించుకోవాలనే నిబంధనలను తుంగలో తొక్కి కృష్ణాజిల్లా న్యాయవాదులతో నోటరీ చేయించారన్నారు. వాస్తవానికి ఎన్నికల అధికారులు నిబంధనలను అమలు చేస్తే నామినేషన్ తిరస్కరించాలని, కానీ ఒత్తిడితోనే ఆమోదించారని పేర్కొన్నారు. ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా ప్రజాక్షేత్రంలో మంగళగిరి ప్రజల నుంచి తిరస్కరణ తప్పదని స్పష్టం చేశారు. -
స్టార్.. స్టార్.. ‘ట్రోలింగ్ స్టార్’..
సాక్షి, అమరావతి : స్టార్.. స్టార్.. ‘ట్రోలింగ్ స్టార్’.. ఇంతకీ ఈ ట్రోలింగ్ స్టార్ ఎవరంటే? .. ఇంకెవరు.. చినబాబు లోకేశే..! ఎందుకంటే అందరికంటే ఎక్కువుగా సోషల్ మీడియాలో లోకేశ్ మీదే ఎక్కువ జోక్స్, సెటైర్లు పేలుతున్నాయి మరి. సోషల్ మీడియా అన్నది రెండువైపులా పదునున్న కత్తివంటిది. ట్విట్టర్లో ఎక్కువమంది ఫాలోయర్స్ ఉండటం ఓ రాజకీయ నేతకున్న జనాదరణకు నిదర్శనం. ప్రధాని నరేంద్రమోదీకి ఎక్కువమంది ఫాలోయర్స్ ఉండటం ఇప్పటికే పలుసార్లు మీడియాలో వచ్చింది. ఇక తెలివితక్కువుగా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే నేతలను సోషల్ మీడియా ఆటపట్టించి నవ్వులు పూయిస్తోంది. ఆ మాటలను ఎద్దేవా చేస్తూ కామెంట్లతోపాటు గ్రాఫిక్స్, కార్టూన్లు కూడా జోడిస్తూ హాస్యాన్ని పండిస్తున్నారు. దీన్నే ట్రోలింగ్ అంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో సోషల్ మీడియా లోకేశ్‌ను ‘ట్రోలింగ్ స్టార్’గా ఆటపట్టిస్తోంది. ఎందుకంటే తాజాగా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌పై విమర్శలు చేసే క్రమంలో మరోసారి తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. ‘వైఎస్ జగన్ సీఎం అయితే బందరు పోర్టును కేసీఆర్ తెలంగాణాకు తీసుకుపోతారు’అని అనడంతో అందరూ అవాక్కయ్యారు. అసలు పోర్టును ఎవరైనా మరో చోటకు ఎలా తీసుకువెళ్తారని అంతా నవ్వుకున్నారు. పోనీ తెలంగాణలో కూడా సముద్రం ఉంటే.. బందరు వద్ద ఏర్పాటు చేయాల్సిన పోర్టును అక్కడ కాకుండా తెలంగాణా రాష్ట్రంలో ఏర్పాటుకు అక్కడ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాజకీయ ఆరోపణ చేయొచ్చు. కానీ అసలు తెలంగాణాలో సముద్రమే లేదు. మరి బందరు పోర్టును కేసీఆర్ తెలంగాణాకు ఎలా తీసుకువెళ్తారు..!? అది అసాధ్యం.. కానీ ఆ మాత్రం కనీస అవగాహన లేకుండా లోకేశ్ విమర్శించి అడ్డంగా దొరికిపోయారు. నిజానిజాలతో నిమిత్తం లేకుండా.. అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హవాను అడ్డుకునేందుకు ఆయనపై దుష్ప్రచారం చేయాలని చంద్రబాబు పన్నాగం. వైఎస్ జగన్, కేసీఆర్ ఒకటేననే అసత్య ప్రచారాన్ని పెద్దఎత్తున తీసుకువెళ్లాలని కుతంత్రం రచించారు. తన తండ్రి ఓ అసత్య ప్రచారాన్ని జోరుగా వినిపిస్తున్నారు కదా.. తాను అదే విధంగా చేయాలని భావించారు. అందుకే నిజానిజాలతో నిమిత్తం లేకుండా ‘వైఎస్జగన్ గెలిస్తే బందరు పోర్టును కేసీఆర్ తెలంగాణకు తీసుకుపోతారు’అని విమర్శించి తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. అదే తడువుగా సోషల్ మీడియా లోకేశ్‌ను ఓ ఆట ఆడుకుంది. దాంతో టీడీపీ శిబిరం ఒక్కసారిగా మౌనం వహించాల్సి వచ్చింది. ఈ విషయంలోనే కాదు గతంలో కూడా చాలాసార్లు లోకేశ్ ఇదే విధంగా అవగాహనలేమితో మాట్లాడి సోషల్ మీడియాకు దొరికిపోయారు. గతంలో అజ్ఞానాన్ని బయటపెట్టుకున్న సందర్భాలు. అంబేడ్కర్ జయంతిని వర్థంతి అని అనడంతో అందరూ అవాక్కయ్యారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే తాము పరవశించామని ఆయన అనడంతో అంతా బిత్తరపోయారు. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా అని విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా మంగళగిరిలో ప్రచారం నిర్వహిస్తూ ఏప్రిల్ 9న జరిగే పోలింగ్‌లో తనకు ఓటేయాలని అనడంతో అందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వారు. ఎందుకంటే పోలింగ్ ఏప్రిల్ 11న జరగనుంది. కనీసం పోలింగ్ తేదీ ఎప్పుడో కూడా తెలీకుండా లోకేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని సోషల్ మీడియాలో లోకేశ్ మీద పెద్ద ఎత్తున జోకులు పేలాయి. మంగళగిరి నియోజకవర్గంలో తాను 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని లోకేశ్ చెప్పడంతో కూడా సెటైర్ల వర్షం కురిసింది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఓట్లే 2.32 లక్షలు. ఆ నియోజకవర్గంలో కనీసం ఎందరు ఓటర్లున్నారో కూడా తెలుసుకోకుండానే ప్రచారం చేస్తున్నారా అని సెటైర్లు వేశారు. దీంతో లోకేశ్‌కు ‘ట్రోలింగ్ స్టార్’ అని నెటిజర్లు నిక్‌నేమ్ పెట్టారు. లోకేశ్‌తో పాటు ట్రోలింగ్ స్టార్ బిరుదు కోసం పోటీపడుతున్న నేత మరొకరు ఉన్నారు... ఆయనే కేఏ పాల్... మరి ఎన్నికలు ముగిసేనాటికి లోకేశ్, కేఏ పాల్లలో ఎవరు ఎక్కువుగా తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకుని ట్రోలింగ్ స్టార్ బిరుదును దక్కించుకుంటారో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ‘ట్రోలింగ్ స్టార్ ’ మాత్రం నిస్సందేహంగా లోకేశే.. అని నెటిజర్లు చెప్తున్నారు. – వడ్దాది శ్రీనివాస్ -
అక్కడ ఓటమి తథ్యం..! అందుకే వలసలు..?
ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెబుతారు.. రాజకీయాలకూ ఈ మాట వర్తిస్తుంది.. సొంత నియోజకవర్గంలో గెలవడం ద్వారా తామేమిటో నిరూపించుకోవాలని భావిస్తారు.. కానీ, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తీరే వేరు.. ఇంట గెలవలేరు కానీ ‘జన్మభూమి’ అంటూ ప్రచారాలు చేసుకుంటారు. బాలయ్య తీరూ అలానే ఉంది.. నాడు ‘అన్నయ్య’ చిరంజీవి.. నేడు ‘తమ్ముడు’ పవన్ కూడా సొంత ఊరంటే ఆమడ దూరం జరుగుతున్నారు.. సాక్షి, అమరావతి: 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు రాజకీయంగా సొంత నియోజకవర్గం చంద్రగిరి పేరెత్తితేనే వణుకు పుడుతుంది. 1983లో ఓటమి అనంతరం అటువైపు కన్నెత్తి చూడనే లేదు. నాలుగు దశాబ్ధాలుగా కుప్పంలో పోటీచేస్తున్నారు. చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లె.. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఉంది. కాంగ్రెస్ నుంచి 1978లో చంద్రగిరి నుంచే పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి పరాజయం పాలయ్యారు. సొంత మామపైనే పోటీ చేస్తానంటూ బీరాలు పలికి నెల రోజులకే టీడీపీలో చేరిపోయారు. 1989లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎన్టీరామారావు సూచించగా.. చంద్రబాబు ససేమిరా అన్నారు. కుప్పంకు వలసెళ్లి అక్కడే పోటీచేస్తున్నారు. ఎన్టీ రామారావును కుట్రతో గద్దె దింపి తాను సీఎం అయిన తర్వాత కూడా చంద్రబాబు చంద్రగిరి వైపు చూడలేకపోయారు. ఆయన 1995లో సీఎం అయ్యాక ఇంతవరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్కసారి కూడా టీడీపీ గెలవనేలేదు. నాన్నారూ.. చంద్రగిరి వద్దు.. సొంత నియోజకవర్గం నుంచి పోటీకి లోకేశ్‌కూ హడలే. చంద్రబాబు తరం కాలేదు. కానీ నారా కుటుంబ నవతరం నాయకుడు అని చెబుతున్న లోకేశ్ అయినా తమ సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పోటీ చేయకపోతారా అని టీడీపీ శ్రేణులు ఊహించాయి. కానీ లోకేశ్ కూడా చంద్రగిరి అంటే ససేమిరా అన్నారు. అసలు ప్రత్యక్ష ఎన్నికలు అంటేనే లోకేశ్‌కు భయం. అందుకే దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి.. మంత్రి పదవి చేపట్టారు. ఇక 2019లో కూడా పోటీ చేయకపోతే విలువుండదని గ్రహించి తప్పనిసరి పరిస్థితుల్లో లోకేశ్ ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధపడ్డారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాలను పరిశీలించి సర్వేలు నిర్వహించి ఎట్టకేలకు మంగళగిరిని ఎంపిక చేశారు. గుడివాడలో తొడగొట్టని బాలయ్య ..! సందర్భం ఏదైనా.. విషయం ఏదైనా సరే నందమూరి వంశం పేరు చెప్పి గొప్పలు చెప్పడం.. సినిమాల్లో వీరావేశంతో తొడలు కొట్టడం బాలకృష్ణకు బాగా అలవాటు. కానీ బాలయ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసరికి తమ సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో తొడకొట్టేందుకు మాత్రం సాహసించడంలేదు. నందమూరి కుటుంబం సొంత ఊరు నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు అంటే 2009 వరకు నిమ్మకూరు గుడివాడ నియోజకవర్గంలో ఉండేది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత జరిగిన 1983, 1985 ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో అత్యధిక భాగం అందులోనే కొనసాగింది. నిమ్మకూరు మాత్రం పామర్రు(ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గ పరిధిలోకి చేరింది. కాగా దశాబ్ధాలుగా ఉన్న బంధుత్వాలు, అనుబంధంతో పాటు ఎన్టీ రామారావుకు ఉన్న రాజకీయ బంధం దృష్ట్యా గుడివాడే నందమూరి కుటుంబానికి సొంత నియోజకవర్గంగా అంతా గుర్తిస్తారు. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బాలయ్య గుడివాడ నుంచి కాకుండా హిందూపురంకి వలస వెళ్లారు. తమ్ముడుదీ అన్నయ్య దారే మెగా ఫ్యామిలీ సొంత ఊరు మొగల్తూరు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఉంది. కానీ నాడు అన్నయ్య చిరంజీవి గానీ నేడు తమ్ముడు పవన్ కల్యాణ్ గానీ నరసాపురం నుంచి పోటీ అంటేనే ప్యాకప్ అంటున్నారు. మార్పు తీసుకువస్తానని ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి 2009 ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసాపురం నుంచి పోటీచేసేందుకు సాహసించలేదు. ఎందుకంటే సినిమాల్లోకి వెళ్లిన సొంత ఊరికి పిసరంత ప్రయోజనం చేకూర్చలేదు. అందుకే నరసాపురం నుంచి కాకుండా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి పోటీ చేశారు. పాలకొల్లులో ఓడిపోయారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ స్థాపించిన తమ్ముడు పవన్‌కల్యాణ్ 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. దాంతో ఆయనైనా నరసాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదా అన్న ఆసక్తి వ్యక్తమైంది. కానీ సినీ పవర్ స్టార్ కూడా అన్నయ్య చిరంజీవి దారిలోనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి పోటీచేయాలని నిర్ణయించారు. సొంత ఊరు నుంచి అసెంబ్లీకి పోటీ అంటే మెగా బ్రదర్స్ కూడా భయపడుతున్నారు. -
దేవుడి సాక్షిగా మాట మార్చిన లోకేశ్..!
సాక్షి, తాడేపల్లిరూరల్: ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని సీఎం చంద్రబాబు.. మేం తక్కువ తిన్నామా అంటూ ఎస్సీలు శుభ్రంగా ఉండరు అని మంత్రి ఆది.. మాదిగలు చదువుకోరంటూ వర్ల రామయ్య.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు అంటూ చింతమనేని చేసిన వ్యాఖ్యలు ప్రజల మదిలో తిరుగుతుండగానే.. సీఎం కుమారుడు, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ మరోసారి దళితులను ఘోరంగా అవమానించారు. మంగళవారం మండలంలోని నవులూరులో లోకేశ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని బాప్టిస్ట్‌పేట చర్చిలోకి రావాల్సిందిగా సంఘపెద్దలు, పాస్టర్ ఆహ్వానించగా తాను రానని, చర్చిలోని వారే బయటకు రావాలంటూ లోకేశ్ హుకుం జారీ చేశారు. కంగుతిన్న సంఘ పెద్దలు, పాస్టర్, మరికొందరు దళితులు ‘దేవుడి దగ్గరకు మీరు రారా.. దేవుడే మీ దగ్గరకు రావాల్నా’ అంటూ ప్రశ్నలు కురిపించడంతో అవాక్కయిన లోకేశ్ మాట మార్చి ఎన్నికల కోడ్ ఉన్నందున చర్చిలోకి రాలేనని చెప్పి వెనుతిరిగారు. అయితే అక్కడి నుంచి బేతపూడి వెళ్లిన లోకేశ్ కారు దిగి రామాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పక్కనే ఉన్న అనుచరుడు అక్కడ చర్చిలోకి వెళ్లలేదు కాబట్టి ఇక్కడ వెళ్లవద్దంటూ ఆపివేశాడు. అయితే ఇదే కోడ్ కొనసాగుతుండగా ఈ నెల 16వ తేదీన తాడేపల్లి మండలం గుండిమెడలోని వేణుగోపాలస్వామి ఆలయంలోపలికి ఎవరినీ అనుమతించకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని మరీ లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయాన్ని దళితులు గుర్తు చేసుకున్నారు. గుడిలోకి వెళ్లి పూజలు చేసినప్పుడు ఎన్నికల కోడ్ గుర్తుకు రాలేదా, చర్చిలోకి రమ్మంటే మాత్రం ఎన్నికల కోడ్ గుర్తు వచ్చిందా అంటూ దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను టీడీపీ నాయకులు చిన్నచూపు చూడడం, అవమానించడం అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులు తమ మనసులో ఉన్న ద్వేషాన్నే దళితులపై చూపిస్తున్నారన్నారు. అది వారి తప్పు కాదని, తమను ఇంతగా అవమానిస్తున్నా ఇంకా టీడీపీలో ఉన్న దళితులే సిగ్గుపడాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'చంద్రబాబు, లోకేశ్‌లే కుట్రకు బాధ్యులు'
సాక్షి, అమరావతి : కడప జిల్లాలో అధికార టీడీపీ పార్టీకి హిమాలయ శిఖరంలా అడ్డుగా ఉన్నారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, వైఎస్సార్ జిల్లాలో అజాతశత్రువుగా పేరుగాంచిన మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హతమార్చారని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఒంటరి వాడిని చేయడం, మానసికంగా దెబ్బతీయడం కోసమే వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా నరికి చంపారని ట్విటర్లో ధ్వజమెత్తారు. వైఎస్ వివేకానందరెడ్డిని భౌతికంగా అంతం చేస్తే తప్ప కడపలో పట్టు దొరకదని అమానవీయంగా హతమార్చారని నిప్పులు చెరిగారు. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కుట్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లే బాధ్యులని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చినబాబు ఫ్రెండ్‌కి 50 ఎకరాలు
ఇదీ స్కామ్ : ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలనా సంస్థ ఎకరాకు రూ.7.26 కోట్లుగా ధర నిర్ణయించింది. దానిని బుట్టదాఖలు చేసి ఎకరా రూ.50 లక్షల చొప్పున 50 ఎకరాలు ఇచ్చేశారు. కేబినెట్‌ను ఒత్తిడి చేసి ఒప్పించారు రాష్ట్ర భూ పరిపాలనా సంస్థ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలనా సంస్థ రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి అత్యున్నత నిర్ణాయక సంస్థ. ఆ సంస్థ సిఫార్సులను పట్టించుకోకుండా తమకు నచ్చిన ధరకు తాము మెచ్చిన వారికి భూములు కట్టబెట్టేశారు. చినబాబు మిత్రుడి సంస్థ ఇసెంట్రిక్ సొల్యూషన్స్‌కు లబ్ధి చేకూర్చడం కోసం ముఖ్యమంత్రి, ఆయన తనయుడు కేబినెట్‌పైనా ఒత్తిడి తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
చిన్నల్లుడిదే పైచేయి
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలో టికెట్ల యుద్ధం మొదలైంది. ఈ జాబితాలో బాలకృష్ణ అల్లుళ్లు నారా లోకేష్, శ్రీభరత్ కూడా చేరిపోయారు. ఈ హైడ్రామాలో చిన్నల్లుడిదే పైచేయి అయింది. విశాఖ జిల్లా నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు బాలకృష్ణ పెద్దల్లుడు, సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్, చిన్నల్లుడు, గీతం వర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంవీవీఎస్ మూర్తి మనుమడు శ్రీభరత్ పోటీ పడుతూ వచ్చారు. లోకేష్‌ను తొలుత భీమిలి నుంచి పోటీచేయించాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీకి దింపాలని చంద్రబాబు భావించారు. ఆ మేరకు టికెట్ ఆశిస్తున్న ఉత్తర నియోజకవర్గ టీడీపీ నేత, ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేతతో చంద్రబాబు.. మీరెవరూ ఆశలు పెట్టుకోకండి. లోకేష్‌ను పంపిస్తున్నాను.. గెలిపించి పంపండి అని సూచించారు. దీంతో అక్కడ లోకేష్ పోటీ చేయడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో విశాఖ లోక్‌సభ టికెట్ ఆశిస్తున్న లోకేష్ తోడల్లుడు ఎం.శ్రీభరత్ తన మద్దతుదారులతో కలిసి కొద్దిరోజులుగా అమరావతిలో మకాం వేశారు. రెండురోజుల కిందట చంద్రబాబును కలిసి తన టికెట్ గురించి ఏం చేశారని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు... లోకేష్ వస్తున్నప్పుడు నువ్వు ఎలా పోటీలో ఉంటావు? ఈసారికి వద్దు.. గంటా శ్రీనివాసరావును ఎంపీగా పోటీ చేయిస్తానని స్పష్టం చేశారు. దీనిపై భరత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతి చెందిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామన్నా వద్దని నిరాకరించి ఎంపీగా పోటీ చేసేందుకే తాను సిద్ధమని చంద్రబాబుకు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు లోకేష్ కోసం తనను పక్కనపెట్టడాన్ని భరత్ జీర్ణించుకోలేక పోయారు. దీంతో బాలకృష్ణ రంగంలోకి దిగి బావ చంద్రబాబుతో చర్చలు జరిపారు. తొలుత చంద్రబాబు ఏ మాత్రం అంగీకరించలేదని తెలుస్తోంది. అవసరమైతే భరత్‌ను రాజమండ్రి ఎంపీగా పంపిస్తానని చెప్పగా ఈ ప్రతిపాదనను భరత్ వ్యతిరేకించినట్టు చెబుతున్నారు. ఎలాగైనా తాను విశాఖ ఎంపీగానే పోటీ చేస్తానని, అవసరమైతే లోకేష్‌ను కూడా భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి పోటీ చేయించుకోవచ్చని సూచించారు. అయితే ఇందుకు బాబు అంగీకరించలేదు. విశాఖ లోక్‌సభ, నార్త్, ఈస్ట్ (సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు) ఈ మూడూ ఒకే సామాజిక వర్గానికి కేటాయించలేమని బాబు వాదించినప్పటికీ భరత్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదని తెలిసింది. దీంతో బాలకృష్ణ మరోసారి చంద్రబాబుతో మాట్లాడి లోకేష్‌ను ఎక్కడికైనా పంపించొచ్చు.. భరత్‌కు విశాఖనే ఇవ్వాలని పట్టుబడినట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు చివరికి లోకేష్‌ను మంగళగిరికి పంపడంతోపాటు శ్రీభరత్‌కే విశాఖ లోక్‌సభ టికెట్ ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఎంపీ టికెట్ నాదే : భరత్ ‘‘లోకేష్ విశాఖ నార్త్ నుంచి పోటీ చేసినా నేను ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నా. ఇద్దరమూ అక్కడి నుంచి పోటీ చేసినా తప్పు లేదు. టికెట్ నాకే వస్తుందని అనుకుంటున్నా’’ అని భరత్ సాక్షి ప్రతినిధితో స్పష్టం చేశారు. -
టీడీపీలో సిగపట్లు
సాక్షి, విశాఖపట్నం: అధికార టీడీపీలో స్థానికంగానే కాదు.. అమరావతిలో కూడా సీట్ల కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున నిరసనలు హోరెత్తాయి. అవినీతి ఎమ్మెల్యే అనితకు టికెట్ ఇవ్వొద్దంటూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులంతా బాహాటంగానే గత నెలరోజులుగా వివిధ రూపాల్లో నియోజకవర్గంలో ఆందోళనలు కొనసాగాయి. అభ్యర్థుల ఎంపిక కోసం అమరావతిలో రెండ్రోజులపాటు పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన కీలక సమావేశాల్లో సైతం అనిత వ్యతిరేక వర్గీయులు గళమెత్తారు. గత నాలుగు రోజులుగా అమరావతిలోనే మకాం వేసి ఎదుట ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సోమవారం చంద్రబాబు ఇంటి వద్దే అనితకు వ్యతిరేకంగా బ్యానర్లు, ప్లకార్డులు చేతబూని నిరసనలు వ్యక్తం చేశారు. అనితకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని, ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. అలాగే నియోజకవర్గంలో కూడా ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక విశాఖ అర్బన్ జిల్లా అధ్యక్షుడు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు వ్యతిరేకంగా రాజుకున్న అసమ్మతి రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది. నిన్నటి వరకు సీటు విషయంలోనే కాదు.. పార్టీలో కూడా ఎడముఖం పెడముఖంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్ఎ రెహ్మాన్, అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు జహీర్ అహ్మద్‌లు వాసుపల్లికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఇరు నేతలు ఒకే వేదికపై కూర్చొని వాసుపల్లి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. మళ్లీ వాసుపల్లికి టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో కనీసం 10 స్థానాలైనా ముస్లింలకు కేటాయించకుంటే ఆ వర్గం నుంచి ఈసారి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుగోకతప్పదని హెచ్చరించారు. ఇంకో వైపు పాడేరు టికెట్ తనదేనంటూ ఫిరాయిం పు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సోమవారం క్యాంపు కార్యాలయంలోనే పార్టీ కీలకనేతలతో భేటీ నిర్వహించారు. ఈ భేటీకి పార్టీ సమన్వయ కమిటీ సభ్యులైన మాజీ మంత్రి మత్య్సరాస మణికుమారి, మాజీ ఎమ్మెల్యే ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు, జీసీసీ చైర్మన్ ఎంవీ వీ ప్రసాద్, జిలా ఎస్టీ సెల్ అధ్యక్షుడు బొర్రా నాగరాజు హాజరుకాలేదు. గిడ్డి ఈశ్వరి అభ్యర్థిత్వాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని వారు తెగేసి చెబుతున్నారు. ఈశ్వరి టికెట్ ఇస్తే ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని అనుచరుల వద్ద అన్నట్టు సమాచారం. విశాఖ ఉత్తరం నుంచి లోకేష్? భీమిలి నుంచి తన పుత్రరత్నం లోకేష్‌బాబును బరి లోకి దింపాలని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు పునరాలోచనలో పడినట్టుగా చెబుతున్నారు. లోకేష్‌ను భీమిలి నుంచి కాకుండా విశాఖ ఉత్తరం నుంచి బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. భీమిలి నుంచి చినబాబును బరిలోకి దింపితే అవంతి శ్రీనివాస్‌పై గెలుపొందడం కష్టమని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు నియోజకవర్గ మార్పు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి చినబాబు ను బరిలోకి దింపాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చారు. ఈ సీటును ఆశిస్తున్న ఆశావాహులతో సోమవారం సాయంత్రం భేటీ అయిన చంద్రబాబు పార్టీ యువనేత లోకేష్‌ను పంపిస్తున్నా.. గెలిపించి పంపండి, మీకు న్యాయం చేస్తానని తేల్చి చెప్పారు.. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావును విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టుగా చెబుతున్నారు. భీమిలి నుంచి మాత్రం గంటా పోటీ చేసేందుకు భయపడుతున్నాడన్న వార్తలు విన్పిస్తున్నాయి. ఈ కారణంగానే ఈ స్థానం నుంచి ఇటీవలే టీడీపీలోకి వచ్చిన కర్రి సీతారాంను బరిలోకి దింపాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. విశాఖ లోక్‌సభ సీటును ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనుమడు, బాలయ్య చిన్న అల్లుడు ఎం.శ్రీభరత్‌ను పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగానే చెబుతున్నారు. ఒక వేళ ఎంపీగా గంటా బరిలోకి దిగకపోతే ఈ స్థానం నుంచి విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పేరును పార్టీ అధినేత చంద్రబాబు పరిశీలిస్తు న్నట్టుగా చెబుతున్నారు. మరో వైపు అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు కొణతాల ఆసక్తి చూపడంలేదని.. ఈ కారణంగా విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తుల సీరావు కుమారుడు ఆడారి ఆనంద్‌ను బరిలోకి దింపనున్నట్టు చెప్పారు. దీంతో విశాఖ ఉత్తరం సీటును ఆశిస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌కు తిరిగి యలమంచలి నుంచే బరిలోకి దింపనున్నట్టు చెబుతున్నారు. చోడవరం నుంచి మళ్లీ కేఎస్ఎన్ రాజు వైపే చంద్రబాబు మొగ్గు చూపుతుండగా, మాడుగుల సీటు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.