
ఢిల్లీ: చంద్రబాబు , లోకేష్ నిజమైన సైకోలని ఎంపీ నందిగామ సురేష్ అన్నారు. చంద్రబాబుపై సానుభూతి కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఎవరికీ భయపడనని చెప్పే చంద్రబాబు, జైళ్లో దోమలకు భయపడతారా ? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం టీడీపీ నేతల నుంచే ఉందని ఎంపీ సురేష్ చురకలు అంటించారు.
చంద్రబాబు లాగే వెన్నుపోటు విద్య లోకేష్ కు అబ్బినట్టుందని ఎంపీ సురేష్ దుయ్యబట్టారు. చంద్రబాబు పదవి కోసం లోకేష్ ఇలా వ్యవహరించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారి ఫోన్లు చెక్ చేయాలని సూచించారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేష్టలు దారుణమన్న ఎంపీ సురేష్.. వీళ్ళు ప్రజా నాయకులా ? అని ప్రశ్నించారు.
'బాలకృష్ణ మెంటల్ అని సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. పిచ్చోళ్లకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదు. మెంటల్ బాలకృష్ణ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీకి ఎందుకు పోవడం లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి పదవులు అనుభవించిన లోకేష్ దోపిడీకి పాల్పడ్డారు' అని ఎంపీ సురేష్ అన్నారు.
ఇదీ చదవండి: టీడీపీ మూడు ప్రయత్నాలు.. చంద్రబాబు లూటీకి పాన్ ఇండియా ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment