‘రాజధాని’పై చర్చకు రండి.. టీడీపీ నేతలకు ఎంపీ సురేష్‌ సవాల్‌ | Ysrcp Mp Nandigam Suresh Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘రాజధాని’పై చర్చకు రండి.. టీడీపీ నేతలకు ఎంపీ సురేష్‌ సవాల్‌

Published Sat, Feb 17 2024 9:11 PM | Last Updated on Sun, Feb 18 2024 7:54 AM

Ysrcp Mp Nandigam Suresh Fires On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: వయసు పెరిగేకొద్దీ చంద్రబాబుకు అసహనం పెరుగుతోందని, రాజధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు వీరుడు, శూరుడైతే పవన్ చంక ఎందుకు ఎక్కారంటూ ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడావో ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నావ్? అంటూ సురేష్‌ నిలదీశారు.

‘‘రాజధానిలో పచ్చటి పొలాలను సర్వనాశనం చేసింది చంద్రబాబే. బలవంతంగా భూ సేకరణ చేయలేదని మనవడిపై ఒట్టేసి చెప్పాలి. హైదరాబాద్‌ని అభివృద్ధి చేసిన మగోడివైతే మరి ఏపీని ఎందుకు అభివృద్ధి చేయలేదు?. అబద్దాల బతుకు ఇంకెంతకాలం?. కుప్పంలో దొంగ ఓట్లతో గెలిచే చంద్రబాబు పర్చూరు గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఉన్న చెత్త చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా అధినేతలే’’ అంటూ ఎంపీ సురేష్‌ దుయ్యబట్టారు.

‘‘తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు గెలిచినట్టు చంకలు కొట్టుకుంటున్నారు. రాజధాని ఫైల్స్ పేరుతో సినిమా తీసి ఆత్మవంచన చేసుకున్నారు. రాజధానిని కుల రాజధానిగా మార్చారు. జగన్‌ని చూసి చంద్రబాబు భయపడుతున్నారు. పంటపొలాలను ఎవరు కాల్చారో నార్కో టెస్టులతో తేల్చుకుందామా?. నాలుగు వందలు చొప్పున జనానికి ఇచ్చి సభకు తెచ్చుకునే దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఎస్సీలను దొంగల్లాగా చిత్రీకరించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎస్సీలు, బీసీలతో పెట్టుకునే 2019లో ఓడిపోయాడు. ఒళ్లంతా రోగాలని చెప్పుకుని బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ ఎంపీ ధ్వజమెత్తారు.

చంద్రబాబు ప్రజలకు భవిష్యత్తు ఇవ్వటమేంటి?. రాజధానిపై చర్చకు 24 గంటల సమయం ఇస్తున్నా. దమ్ముంటే ఎవరైనా సరే చర్చకు‌ రావాలంటూ ఎంపీ నందిగం సురేష్‌ సవాల్‌ విసిరారు.

ఇదీ చదవండి: రాజధాని ‘ఫెయిల్స్‌’.. బాబు ‘భ్రమరావతి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement