Nandigam Suresh
-
నందిగం సురేష్ కేసు.. పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.మాజీ ఎంపీ సురేష్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నందిగం సురేష్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ..‘ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఘటన జరిగిన ప్రాంతంలో సురేష్ లేరు. దర్యాప్తు అధికారి ఫేవర్ చేశారని స్థానిక జడ్జి ఎలా చెబుతారు. 2020లో రాయి తగిలి మృతిచెందిన మరియమ్మ కేసులో 78వ నిందితుడుగా చేర్చి సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును అక్రమంగా ఈ కేసులో చేర్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా టీడీపీ ప్రభుత్వం సురేష్‌పై కేసులు బనాయిస్తోంది. ఇతర కేసులు పెట్టి మాజీ ఎంపీని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వాదనల అనంతరం, ధర్మాసనం పోలీసులకు నోటీసులు ఇచ్చింది.మరోవైపు.. సురేష్ బార్య బీబీ లత మాట్లాడుతూ..‘టీడీపీ ప్రభుత్వం మాపైన అక్రమ కేసులు బనాయిస్తోంది. దళితుడు ఎదగడాన్ని ఓర్చలేక అసూయతో కేసులు పెడుతున్నారు. నాలుగేళ్ల నాటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయపోరాటంలో మేము గెలుస్తాం. దేవుడు, మా అధ్యక్షుడు వైఎస్ జగన్ మాకు అండగా ఉన్నారని అన్నారు. -
నేడు సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ పై విచారణ
-
నందిగం సురేష్ పై మరో అక్రమ కేసు..
-
ఒకే ఘటన.. రెండు కేసులు.. ఇది బాబు నీతి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురి చేయడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం న్యాయ సూత్రాలను, చట్టాలను కూడా ఉల్లంఘిస్తోంది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప మరేదీ పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కేసులు పెడుతోంది. ఈ క్రమంలోనే ఆయనపై ఒకే కేసుకు సంబంధించి, ఒకే వ్యక్తి ఇచ్చిన రెండు ఫిర్యాదుల ఆధారంగా రెండు కేసులు నమోదు చేసి చట్టాలను సైతం బేఖాతరు చేసింది. 2023లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై అప్పట్లోనే సురేష్‌పై తుళ్లూరు పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. అదే ఘటనపై అదే వ్యక్తి మళ్లీ ఫిర్యాదు చేస్తే.. ఏడాదిన్నర తర్వాత శుక్రవారం మరో కేసు నమోదు చేయడం కూటమి సర్కారు కక్ష సాధింపులకు పరాకాష్టే. ఇక్కడే చట్టాలను, రెజ్యూడికాటాను సర్కారు ఉల్లంఘించింది.2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని రైతులు, పేదలను, వారికి అండగా నిలిచిన సురేష్‌ను అక్రమ కేసులతో వేధించింది. ఆ తర్వాత బాపట్ల వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న నందిగం సురేష్ తమపై దాడి చేశాడంటూ 2023 మార్చి 31న విజయవాడకు చెందిన పనతల సురేష్ అనే వ్యక్తి తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరోజు అమరావతి రాజధాని పర్యటనకు వచ్చిన తమపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన చేసిన ఫిర్యాదుపై అదే రోజున తుళ్లూరు పోలీసులు ఐపీసీ 294, 323, 427 రెడ్ విత్ 34 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. మళ్లీ అదే పనతల సురేష్ అదే ఘటనపై ఏడాదిన్నర తర్వాత ఈ నెల 25న ఫిర్యాదు చేయగా.., నందిగం సురేష్‌పై ఐపీసీ 341, 143, 147, 307, 427 రెడ్‌విత్ 149 సెక్షన్లతో మరోసారి కేసు నమోదు చేశారు. ఇలా ఒకే ఘటనపై రెండు కేసులు (ఎఫ్ఐఆర్లు) నమోదు చేయడం ఒక తప్పు అయితే.. ఏకంగా హత్యా నేరం సెక్షన్లు పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపులకు నిదర్శనం. ఇప్పటికే తనకు ఏ మాత్రం సంబంధం లేని రెండు కేసుల్లో నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఓ పాత ఘటనలో మరోసారి కేసు పెట్టడమే కాకుండా, హత్యాయత్నం కేసు పెట్టడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల బలమైన ఆదేశాలే కారణమన్నది జగమెరిగిన సత్యం.రెజ్యూడికాటాను ఉల్లంఘించడమా..!వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపులకు ప్రభుత్వం, పోలీసులు రెజ్యూడికాటాను ఉల్లంఘించడంపై న్యాయ నిపుణులు సైతం విస్తుపోతున్నారు. సహజ న్యాయ సూత్రాల్లో రెజ్యూడికాటా (లాటిన్ పదం) గురించి స్పష్టంగా విశదీకరిస్తున్నారు. ఒకే ఘటన, ఒకే వ్యక్తి ఫిర్యాదుపై ఒకటికి మించి కేసులు నమోదు చేయకుండా నిలువరించడమే రెజ్యూడికాటా. ఇలాంటి కేసులు సహజన్యాయానికి కూడా విరుద్ధమని ఇది స్పష్టం చేస్తుంది. ఒకే వివాదం లేదా ఒకే ఘటనలో అదే పార్టీల మధ్య వ్యాజ్యాలను పదే పదే విచారించడం వల్ల న్యాయ వ్యవస్థ సమయం కూడా వృథా అవుతుందనే దీనిని పరిగణనలోకి తెచ్చారు. ఏదైనా కేసులో తుది తీర్పు వెలువడకుండా అదే కోర్టులో అదే కేసుపై మరో వివాదాన్ని లేవనెత్తితే దాని పునఃపరిశీలనను తిరస్కరించేందుకు న్యాయస్థానం సైతం దీన్ని ఉపయోగిస్తుంది. ఈ రెజ్యూడికాటా క్రిమినల్ చట్టంలో డబుల్ జియోపార్డీ, నాన్ బిస్ అనే భావనను పోలి ఉంటుంది. క్రిమినల్ ప్రాసిక్యూషన్‌లో ఒకే నేరానికి ఒకే విధమైన ప్రాసిక్యూషన్‌ను మాత్రమే ఉండేలా చేయడంతోపాటు రెండో విచారణకు సంబంధించిన చర్యలను నిరోధిస్తుందని న్యాయ నిపుణులు విశదీకరిస్తున్నారు. -
నందిగం సురేష్‌కు వైద్య పరీక్షలు
సాక్షి, గుంటూరు : వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. జిల్లా జైలులో ఉన్న ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జైలు అధికారులు గురువారం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు నందిగం సురేష్..లో-బీపీతో పాటు భుజం నొప్పితో బాధపడుతున్నట్లు గుర్తించారు. -
నందిగం సురేష్ అరెస్ట్ప ఏపీ ప్రభుత్వానికి SC కమిషన్ నోటీసులు
-
నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, విజయవాడ: బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరైంది. ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేష్‌పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే. -
విషపు కోరల్లో ఏపీ.. చంద్రబాబు కపట నాటకం అంబటి రాంబాబు ఫైర్
-
వంగలపూడి అనితకు గూబ పగిలే కౌంటర్
-
మా సునామీని తట్టుకోలేవు వైఎస్ జగన్ వార్నింగ్
-
వంగలపూడి అనితకు నందిగం సురేష్ భార్య వార్నింగ్
-
హోంమంత్రి అనితకు మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య సవాల్
సాక్షి, గుంటూరు: తన భర్తపై తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపారని మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్య బేబిలత మండిపడ్డారు. ‘‘టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ఒక్క ఆధారం చూపాలి. హోంమంత్రి అనిత తన పదవి కాపాడుకోవడం కోసం నా భర్తపై ఆరోపణలు చేస్తోంది’’ అని బేబిలత ధ్వజమెత్తారు.‘‘కృష్ణా నదికి వరద నా భర్తే తెచ్చాడా?. కృష్ణా నదిలొ కొట్టుకొచ్చిన బోట్లపై నా భర్త పేరు ఉందా?. అనిత తన బిడ్డలతో వస్తే.. నేను నా ఇద్దరు బిడ్డలతో వస్తా. తన బిడ్డల పై ప్రమాణం చేసి హోం మంత్రి అనిత నా భర్త పై చేసిన ఆరోపణలు నిరూపించాలి’’ అంటూ బేబీ లత సవాల్ విసిరారు. ఈ సవాల్ కి హోంమంత్రి అనిత సిద్ధమేనా?. మాజీ ఎంపీని వాడు వీడు అంటూ అనిత దిగజారి మాట్లాడుతుందంటూ బేబిలత ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: వైఫల్యం జంకుతోనే 'బోట్లపై బొంకు'! చంద్రబాబు సర్కార్ కుతంత్రం..కాగా, ఓ వైపు విజయవాడలో 7 లక్షల మందికిపైగా వరదలో చిక్కుకుని అల్లాడుతుంటే చంద్రబాబు సర్కార్ మాత్రం వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ‘బోట్ల’ కుట్రకు తెరలేపింది. వాస్తవానికి బోట్లు వరద ధాటికి తాళ్లు తెగి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు నీటిపారుదల శాఖ, పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని వెల్లడించకుండా వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది. బ్యారేజీని దెబ్బతీసేందుకే బోట్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టేలా చేశారని కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. వైఎస్సార్సీపీ నేతలు నందిగం సురేశ్, తలశిల రఘురాంను ఈ అక్రమ కేసులో ఇరికించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. -
రేపు నందిగం సురేష్ ను పరామర్శించనున్న YS జగన్
-
11న గుంటూరుకు వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి(సెప్టెంబర్ 11న) గుంటూరు వెళ్లనున్నారు. గుంటూరు జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను జగన్ పరామర్శించనున్నారు. టీడీపీ కార్యాలయం దాడి కేసు తిరగదోడి మరీ.. చంద్రబాబు ప్రభుత్వం సురేష్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ.. ఇష్టానుసారం కేసులను బనాయిస్తోంది. ఈ క్రమంలో చట్టాన్ని, న్యాయస్థానాలను కూడా ఉల్లంఘిస్తోంది. రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగానే.. నందిగం సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ కేడరే కూటమి టార్గెట్మూడేళ్ల క్రితం(2021) నాటి సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషణలు చేశారు. దీంతో మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ఘర్షణలకు సంబంధించిన కేసును అధికారంలోకి రాగానే.. చంద్రబాబు ప్రభుత్వం తిరిగి తెరిచింది. ఉద్దేశపూర్వకంగా.. కొంతమంది దగ్గరి నుంచి సాక్ష్యం పేరుతో స్టేట్మెంట్లు తీసుకుంది. ఆపై కొందరు వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టింది. నేరం జరిగిన తర్వాత 60 –70 రోజులు దాటాక సాక్షిని విచారిస్తే చెల్లదు.. అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దాన్ని ఉల్లంఘించి మరీ నిందితుల జాబితాను పోలీసులు ఈ కేసులో సిద్ధం చేయడం గమనార్హం. ఈ కేసులో సురేష్ పేరును 80వ నిందితుడిగా చేర్చింది. -
వైఎస్సార్సీపీ కేడరే కూటమి టార్గెట్
నగరంపాలెం(గుంటూరు): టీడీపీ కార్యాలయంపై దాడి కేసు అంటూ గుంటూరు, కృష్ణా జిల్లాలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో అక్రమంగా అరెస్టయి, గుంటూరుజిల్లా కారాగారంలో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని పేర్ని నాని, ఎమ్మెల్సీ బొమ్మి ఇశ్రాయేల్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, గుంటూరు ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్‌కుమార్, నందిగం సురేష్ కుటుంబ సభ్యులు శుక్రవారం ములాఖత్‌లో విడివిడిగా కలిశారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకి పంపిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలతో దొంగ సాక్ష్యాలు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయం బాత్రూంలు, పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీటీవీల ఫుటేజీ పోలీసుల వద్ద ఉందని టీడీపీ నాయకులు చెబుతున్నారని, ఆ పుటేజీల్లో ఎక్కడా లేని మాజీ ఎంపీ నందిగం సురే‹Ù, శ్రీనివాసరెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. ఈ కేసులో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్రియాశీలకంగా ఉన్న 171 మందిని తీసుకువచ్చారని, వారెవరూ సీసీ టీవీ ఫుటేజీల్లో లేరని తెలిపారు. తప్పుడు కేసులతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను కుంగదీయాలనే కూటమి పెద్దలు ఇలా చేస్తున్నారని, వారి ఆశలు నెరవేరవని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ జైళ్లలో వేసినా తమ పార్టీకి ఏమీ కాదని, వారంతా తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. ఓవైపు వరదలతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నా, అనేక మంది మృత్యువాత పడుతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడంలేదని అన్నారు. కేవలం వైఎస్సార్సీపీ వారిపై కక్ష సాధించాలన్న తపనే ప్రభుత్వంలో కనపడుతోందన్నారు. ప్రభుత్వ పెద్దల తప్పుడు చర్యలే వరదలకు, భారీ నష్టానికి కారణమన్నారు. వరద బాధితులను కాపాడేందుకు, వారికి ఆహారాన్ని అందించేందుకు పోలీసులను పంపడంలేదని, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమే‹Ùను పట్టుకునేందుకు ఓ వంద మంది, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆచూకీ కోసం మరో 200 మంది పోలీసులను పంపించడం కూటమి ప్రభుత్వ నీచత్వానికి పరాకాష్ట అని అన్నారు. -
నందిగం సురేష్ అరెస్ట్ పై పేర్నినాని రియాక్షన్
-
YSRCP నేతల అరెస్ట్.. వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్
-
మాజీ ఎంపీ సురేష్ కు 14రోజుల రిమాండ్
సాక్షి, అమరావతి/మంగళగిరి : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను బుధవారం అర్థరాత్రి దాటాక హైదరాబాద్‌లో అరెస్టుచేసిన పోలీసులు ఆయనను గురువారం ఉ.8.30 గంటలకు మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుచేసిన పోలీసులు స్టేషన్లో ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈయనతోపాటు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసులరెడ్డిని కూడా అరెస్టుచేసిన మంగళగిరి రూరల్ పోలీసులు వీరిద్దరినీ మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం వీరిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. అక్రమ కేసులతో తమను అడ్డుకోలేరని, 2029లో చంద్రబాబుకు బుద్ధిచెప్పి తీరుతామన్నారు. కక్షతోనే తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందిపెడుతున్నారని.. ప్రజలు, దేవుడు చూస్తున్నారని చెబుతూ జై జగన్ అంటూ నినదించారు. అంతకుముందు.. స్టేషన్ వద్ద సురేష్ సతీమణి బేబీలత మాట్లాడుతూ.. తన భర్తపై చంద్రబాబు అక్రమంగా కేసులు పెట్టారన్నారు. కేసులతో తమను భయపెట్టలేరని, 2019కు ముందు పొలాల దగ్థం కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని అప్పట్లో తన భర్తపై టీడీపీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా లొంగలేదని.. ఇలాంటి అక్రమ కేసులకు తాము భయపడేదిలేదని స్పష్టంచేశారు. ఇక సురే‹Ùను అరెస్టుచేశారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్‌బాబు, వైఎస్సార్సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, నవరత్నాల అమలు కమిటీ మాజీ చైర్మన్ నారాయణమూర్తి, గుంటూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాలవజ్ర బాబు, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కమ్మూరి కనకారావు తదితరులతో పాటు కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకుని ఆయనకు మద్దతు పలికారు. -
బాబుకు ఇంతకన్నా దారుణమైన పరిస్థితి వస్తుంది..
-
నందిగం సురేష్ అరెస్ట్ పై సుదాకర్ బాబు స్ట్రాంగ్ రియాక్షన్
-
‘నా భర్తకు ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత’
గుంటూరు, సాక్షి: బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్‌పై నందిగం సురేష్ భార్య బేబీ లలిత మీడియాతో మాట్లాడారు.‘నా భర్త మీద అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబుదే బాధ్యత. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నా భర్తకు అభిమానం. అదే చంద్రబాబుకు నచ్చలేదు. ఈ రాష్ట్రంలో అరెస్ట్ చేసేంత తప్పులు చేశారంటే అందులో మొదట ఉండేది చంద్ర బాబే. సింగ్ నగర్ సాక్షిగా చంద్ర బాబుని అరెస్ట్ చెయ్యాలి’ అని అన్నారు.అర్ధరాత్రి అక్రమ అరెస్ట్ అంతకు ముందు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు హైదరబాద్‌లో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేశారు. డీఎస్పీ మల్లికార్జున రావు నేతృత్వంలోని పోలీసుల బృందం.. సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరుల వద్ద ఉన్న ఫోన్లను స్వాధీనం చేసుకుని గుంటూరు మంగళగిరి రోడ్డు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.స్టేషన్ గేట్లు మూసేసినందింగం సురేష్ తరలింపుపై సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ నేతలు మంగళగిరి రోడ్డు పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. సురేష్‌ని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ సురేష్‌ను కలవనీయంగా పోలీసులు స్టేషన్గేట్లను మూసివేశారు. గేటువద్దే వారిని అడ్డుకున్నారు. -
చంద్రబాబుకి నందిగం సురేష్ భార్య వార్నింగ్
-
మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ అరెస్ట్
-
వరద విపత్తులో బాబు బురద రాజకీయం..
-
టీడీపీ అక్రమ కేసు.. మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్
సాక్షి, అమరావతి: బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్‌ను ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. డీఎస్పీ మల్లికార్జునరావు నేతృత్వంలోని పోలీసుల బృందం.. నందిగం సురేశ్ మియాపూర్‌లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరుల వద్ద ఉన్న ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. వారిని ఏపీకి తరలిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై గతంలో జరిగిన దాడి ఘటనలో నందిగం సురేశ్‌పై టీడీపీ అక్రమ కేసు మోపిన సంగతి తెలిసిందే. ఓవైపు భారీ వర్షాలు, వరదలతో ఏపీ ప్రజలు అల్లాడుతుంటే.. వారిని గాలికొదిలేసి రాజకీయ కక్ష సాధింపులకు టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని వినియోగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.