
సాక్షి, గుంటూరు: ఉద్ధండరాయునిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ సురేష్ ఇంటి ఎదుట రైతుల ముసుగులో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణ, 52వేల మందికి ఇళ్ల పట్టాలివ్వాలని ఎంపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన బహుజన పరిరక్షణ సమితి నేతలు రాగా.. వారికి, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్ధండరాయునిపాలెంలో మానవహారం చేపట్టిన బహుజన పరిరక్షణ సమితి నేతలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దాడికి నిరసనగా బహుజన పరిరక్షణ సమితి ఆందోళన నిర్వహించింది. అమరావతి దీక్షా శిబిరం వైపు వెళ్లడానికి బహుజన పరిరక్షణ సమితి నేతలు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. (చదవండి: ఏలూరు ఘటన: 292కి చేరిన బాధితులు)