సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో కూటమి అరాచక పాలన చేస్తోందని మండిపడ్డారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూశారు. ఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది? అని ప్రశ్నించారు. ఏదో గొప్పగా సాధించామని ఆయన చెప్పుకుంటున్నారు.. అందుకు సిగ్గుపడాలి అని ఘాటు విమర్శలు చేశారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసింది. ఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది?. వైఎస్సార్‌సీపీ వాళ్లను బెదిరించి.. పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేశారు. చివరకు.. వాళ్లకు వాళ్లే గెలిచినట్లు ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.
గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో తాడిపత్రిలో ఎన్నికల పారదర్శకంగా జరిపాం. టీడీపీ 2 స్థానాల్లో ఎక్కువగా ఉన్న జగన్ ఏం రాజకీయం చేశారో చూడాలి. హ్యాట్సాఫ్ జగన్ అని అక్కడి టీడీపీ ఇంఛార్జి చెప్పారు. అధికార బలం ఉందని దోచేయడం దుర్మార్గం అవుతుంది. హిందూపురంలో జరిగింది చూశాం. చంద్రబాబు బావమరిది(బాలకృష్ణను ఉద్దేశించి..) కన్నుసన్నల్లోనే ఎన్నిక జరిగింది. ఏదో గొప్పగా సాధించామని ఆయన చెప్పుకుంటున్నారు.. అందుకు సిగ్గుపడాలి. నందిగామలో ఓ మంత్రి కార్పొరేట్ల ఇంటికి వెళ్లి బెదిరించారు. అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు? నేరుగా డిక్లేర్ చేసుకోవచ్చు కదా?. రెడ్‌బుక్ రాజ్యాంగంతో గవర్నరెన్స్.. విధ్వంసం కాదా?. ప్రశ్నిస్తే దాడులు చేయడం విధ్వంసం కాదా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment