uddandarayunipalem
-
నూతన వధూవరులకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి/తాడికొండ: బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మేనల్లుడు జగదీష్ వివాహ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. గురువారం గుంటూరు జిల్లా ఉద్ధండరాయుని పాలెంలో జరిగిన ఈ వేడుకలో వధూవరులు జగదీష్, జాక్లిన్ రోజ్ దంపతులను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు. (చదవండి: నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్’ నిగ్గుతేల్చండి) రాబడి పెరగాలి: సీఎం జగన్ -
ఉద్ధండరాయునిపాలెంలో ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: ఉద్ధండరాయునిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ సురేష్ ఇంటి ఎదుట రైతుల ముసుగులో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణ, 52వేల మందికి ఇళ్ల పట్టాలివ్వాలని ఎంపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన బహుజన పరిరక్షణ సమితి నేతలు రాగా.. వారికి, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్ధండరాయునిపాలెంలో మానవహారం చేపట్టిన బహుజన పరిరక్షణ సమితి నేతలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దాడికి నిరసనగా బహుజన పరిరక్షణ సమితి ఆందోళన నిర్వహించింది. అమరావతి దీక్షా శిబిరం వైపు వెళ్లడానికి బహుజన పరిరక్షణ సమితి నేతలు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. (చదవండి: ఏలూరు ఘటన: 292కి చేరిన బాధితులు) -
జర్నలిస్టులపై దాడి యాదృచ్ఛికం కాదు
సాక్షి, అమరావతి : రైతుల ముసుగులో అసాంఘిక శక్తులను రంగంలోకి దించి అమరావతిలో హింసాత్మక ఘటనలకు పాల్పడే కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్షను కవర్ చేసేందుకు శుక్రవారం వెళ్లిన మీడియా ప్రతినిధులపై అక్కడకు వచ్చిన బయట వ్యక్తులు కొందరు పరుష పదజాలంతో దూషిస్తూ కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడటం వెనుక రైతుల ముసుగులో వచ్చిన టీడీపీ సానుభూతిపరుల హస్తం ఉందని పోలీసులు విశ్వసిస్తున్నారు. నిరసన కార్యక్రమాలను స్థానికులు పట్టించుకోకపోవడంతో టీడీపీ, దాని మద్దతుదారులు పనిగట్టుకుని కార్లలో జనాన్ని తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారంతా రెచ్చగొట్టే చర్యలకు, ముఖ్యమంత్రి, మంత్రులను దుర్భాషలాడుతున్నా చూసీచూడనట్లు వదిలేశారు. దీనిని అలుసుగా తీసుకున్న కొందరు హింసాత్మక ఘటనలకు కుట్ర పన్నినట్లు జర్నలిస్టులపై దాడి ఘటన స్పష్టం చేస్తోంది. ఈ ఘటనలో బయటి వ్యక్తుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జర్నలిస్టులపై దాడి ఘటనను వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ఖండించారు. దాడికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కె.రాజేశ్వరరావు ఖండించారు. మీడియా ప్రతినిధులపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. రైతుల ముసుగులో బయట వ్యక్తులే ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. దాడుల వెనుక టీడీపీ!? సాక్షి, అమరావతి : రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనలు ప్రశాంతంగానే కొనసాగుతున్నా.. శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేపట్టిన మౌనదీక్షను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడుల వెనుక టీడీపీ కుట్ర ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘కన్నా’ దీక్ష చేసిన రోజే దాడులకు ఎందుకు తెగబడ్డారు.. దీని వెనుక రాజకీయ దురుద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అన్నది ఇప్పుడు కమలం పార్టీ నేతల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీజేపీపై నెపం నెట్టే విధంగా టీడీపీ హింసాత్మక ఘటనలకు ఏమైనా ప్రేరేపించిందా అని వారు చర్చించుకుంటున్నారు. ఉద్దండరాయునిపాలెం వద్ద కన్నా చేపట్టిన దీక్షాస్థలి సమీపంలోనే మీడియాపై మూకదాడికి పాల్పడిన వారు టీడీపీ సానుభూతిపరులే అనే వారు చెబుతున్నారు. టీడీపీ పెద్దలు వ్యూహాత్మకంగానే ఇలాంటి ఘటనలకు ప్రణాళిక రచించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోదీ మాస్కులతో ఎందుకు? దీనికితోడు.. ఆర్నెల్ల క్రితం ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా టీడీపీ నాయకులు, పెద్దలు నల్ల జెండాలు పట్టుకుని తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ సానుభూతిపరులు చంద్రబాబు మాస్కుల్లేకుండా మోదీ మాస్కులు ధరించడం దురుద్దేశంతో కూడుకున్నదేనని కూడా ఆక్షేపిస్తున్నారు. ఇది టీడీపీ పెద్దల పక్కా ప్రణాళికలో భాగమేనని అభిప్రాయపడుతున్నారు. చదవండి: వెంబడించి మరీ దాడి చేశారు : జర్నలిస్టులు రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడి -
రైతుల ముసుగులో దాడులకు పాల్పడ్డారు
సాక్షి, అమరావతి : వెలగపూడిలో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఐజి వినీత్ బ్రిజల్ పేర్కొన్నారు. రైతుల ముసుగులో కొంతమంది బయటి వ్యక్తులు వచ్చి ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. కాగా దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు ఐజి స్పష్టం చేశారు. మీడియా వాహనాన్ని ధ్వంసం చేయడమనేది హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిలో ఒక మహిళా రిపోర్టర్‌తో పాటు పలువురు జర్నలిస్ట్‌లు గాయపడినట్లు వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే బయటవ్యక్తులు వచ్చి దాడులకు రెచ్చగొట్టారని , దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే రైతుల ముసుగులో కొన్ని ప్రాంతాల్లో పోలీసులపై కూడా దాడికి దిగారని, ఆ సమయంలో పోలీసులు సంయమనంతో వ్యవహరించారని తెలిపారు. -
మహిళా జర్నలిస్టులపై దాడి
-
రైతుల ముసుగులో జర్నలిస్టులపై దాడి
సాక్షి, ఉద్దండరాయునిపాలెం : ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దీక్ష కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. ఓ చానల్‌కు చెందిన మహిళా జర్నలిస్ట్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మరో మీడియా ప్రతినిధిపైనా కూడా దాడి చేశారు. మీడియా ప్రతినిధులపైన దాడిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై కూడా కొందరు దాడికి తెగబడినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఓ మీడియా వాహనానం అద్దాలను కర్రలతో ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మీడియా ప్రతినిధుల మీద రైతులు ముసుగులో కొందరు కావాలనే దాడి చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రైతుల ముసుగులో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు కుట్ర చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపడతున్నారు. అమరావతి ప్రాంతంలో ఏదో జరిగిపోతుందనే తప్పుడు సంకేతాలను పంపించే ఉద్దేశంతోనే.. పథకం ప్రకారం మీడియా ప్రతినిధులపైన దాడి జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీడీపీ నాయకులే అమరావతిలో రైతులతో ఉద్యమం చేపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మీడియా ప్రతినిధులపైన దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి. గతంలో తాము చాలా సార్లు ఈ ప్రాంతంలో వార్తలు కవర్ చేశామని.. కానీ రైతులు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదని పలువురు జర్నలిస్టులు తెలిపారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసింది రైతులు కాదని వారు అభిప్రాయపడుతున్నారు. -
ఆ నిబద్ధతే ‘నందిగం’ను ఎంపీని చేసింది..
అతడు చావును చాలా దగ్గరగా చూశాడు. మరికొద్ది నిమిషాల్లో ఇక తన ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం అని కూడా ఫిక్స్ అయిపోయాడు. రాజధాని ప్రాంతంలో అరటి తోటలను తగలబెట్టిన సమయంలో టీడీపీ నేతల ఆదేశాలతో అతడిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. అయినప్పటికీ మనస్సాక్షికి కట్టుబడ్డాడు. ఎన్కౌంటర్ చేస్తామని, రైల్వే పట్టాలపై పడుకోబెడతామని... చంపేసి తన భార్యతో ఊడిగం చేయించుకుంటామని హింసించారు. జగన్ పేరు చెబితే వదిలేస్తామంటూ బేరసారాలకు దిగారు. అయినా అందుకు ఒప్పుకోకపోవడంతో మూడురోజుల పాటు చిత్రహింసలు పెట్టారు. తోటను తగలబెట్టడంలో వైఎస్సార్ సీపీ ప్రమేయం ఉందని పోలీసులు చెప్పించే యత్నం చేసినా సురేష్ మాత్రం భయపడకుండా నిజం చెప్పారు తప్ప, ఎటువంటి భయాలకూ, ప్రలోభాలకూ లొంగలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు ద్వారా లబ్ది పొందిన అతడు ఆ విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు. మహానేత తనయుడికి వ్యతిరేకంగా చెప్పాలంటూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, పోలీస్ అధికారులు బెదిరింపులకు ఏమాత్రం తలొగ్గలేదు. నమ్ముకున్న సిద్ధాంతానికే కట్టుబడ్డాడు. ఆ సామాన్యుడి మొండి ధైర్యమే....కలలో కూడా ఊహించని అవకాశాన్ని తలుపుతట్టింది. అతని నిబద్ధత, నిజాయితీ వైఎస్ జగన్‌ను ఆకట్టుకున్నాయి. చివరకు ఎవరూ ఊహించని విధంగా నందిగం సురేష్‌ను అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా గెలుపు బాధ్యతను ఆయన స్వీకరించమే కాకుండా చేతలలో చూపించారు. ఒకప్పుడు పొలం పనులు చేసుకునే వ్యక్తిని ఎంపీని చేసింది. అతడే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ...ఆయన ప్రెస్మీట్లలో వెనకుండి టీవీలో కనిపిస్తే చాలనుకున్నవ్యక్తి ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన శ్రీరామ్ మాల్యాద్రి అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ సామాన్య కార్యకర్తగా ఉన్న నందిగం సురేష్‌పై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందినప్పటికీ ఎంపీగా సురేష్ విజయం సాధించడం అందరినీ నివ్వెరపరిచింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు చేసిన ప్రయత్నం నందిగం సురేష్‌ను ఎంపీగా గెలుపొందేలా చేసింది. బాపట్ల పార్లమెంట్ స్థానానికి సామాన్య వ్యక్తిని బరిలో నిలిపిన జగన్ నిర్ణయాన్ని ఆమోదించిన ఓటర్లు అతనికి జై కొట్టారు. గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో విజయం సాధించిన నందిగం సురేష్ ...గతంలో రాజధాని భూముల కోసం చేసిన పోరాటం చేశారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంకు చెందిన నందిగం సురేష్ పదో తరగతితో చదువు ఆపేసి, ఆ తర్వాత ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. రాజధాని ప్రాంతంలో రైతులు తమ భూములు ఇవ్వడానికి ఎదురు తిరిగితే...వారిలో నందిగం సురేష్ కూడా ఉన్నారు. తమకున్న రెండెకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేది లేదని తెగేసి చెప్పి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని భూముల కోసం పోరాటం చేశారు. దాంతో కక్ష సాధింపు చర్యగా ఆయనపై కేసులు పెట్టారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గలేదు అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో అరటి తోటలు తగులబెట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అని చెప్పాలంటూ.. అతడిని పోలీసులు గన్ను నోట్లో పెట్టి మరీ బెదిరించారు. మంత్రి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కూడా చంపేస్తానని బెదిరింపులకు దిగారు. ఆఖరికి రూ.50 లక్షలు ఇస్తానని బేరమాడారు. చివరకు ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో పోలీసులు సింపుల్‌గా సారీ చెప్పి పంపించేశారు. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంతటి అవకాశం కల్పించడం ఊహించలేదంటూ ఉండవల్లిలో జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. కూలీ పనులకు వెళ్లే తమ లాంటి వ్యక్తికి ఎంపీగా అవకాశం ఇచ్చారంటూ భావోద్వేగం నియంత్రించుకోలేక కన్నీటి పర్యంతం అయ్యారు. నిన్న, మొన్నటి వరకూ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని టీవీల్లో, పేపర్లలో చూసే ఆయన ఏకంగా ఆయనను కలిసి ఫోటో దిగటం కలలో కూడా ఊహించనిది. అవకాశం ఇచ్చిన జగనన్న తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానం, ఎదురైన అనుభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. -
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గలేదు
-
అమరావతిలో భారీ భూకబ్జా ప్రయత్నం
-
అమరావతిలో భారీ భూకబ్జా ప్రయత్నం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ భూకబ్జాకు ప్రయత్నం జరుగుతోంది. ఉద్ధండరాయునిపాలెంలోని పెద్దలంకలో 75 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు కబ్జాదారులు యత్నిస్తున్నారు. 50 ఎకరాల భూమిలో రాత్రికి రాత్రి కొబ్బరి మొక్కలు నాటారు. మరో 25 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు గుంతులు తవ్వారు. కబ్జాదారులు తమను బెదిరించి ఇక్కడ మొక్కలు నాటారని స్థానికులు తెలిపారు. భూకబ్జాను అడ్డుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే కబ్జాదారులు ఎవరనేది స్పష్టంగా వెల్లడికాలేదు. ఈ వ్యవహారాన్ని మీడియా వెలుగులోకి తేవడంతో అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. -
అమరావతి ఎలా ఉంటుంది?
రెండేళ్లుగా తేలని ప్రభుత్వ కాంప్లెక్స్ డిజైన్ల వ్యవహారం టెండర్లు ఖరారైనా మొదలుకాని సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు హడావుడి నిర్ణయాలు, ప్రణాళికా లోపమే కారణం పూర్తిస్థాయి డిజైన్లు సిద్ధమయ్యేదెన్నడో? సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట రెండున్నరేళ్లుగా హడావుడి కొనసాగుతున్నా ఇంతవరకూ ఒక్క ప్రాజెక్టయినా పురుడు పోసుకోలేదు. శాశ్వత నిర్మాణాలకు ఇంకా డిజైన్లే ఖరారు కాలేదు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవన సముదాయం సైతం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. తొందరపాటు నిర్ణయాలు, ప్రణాళికా లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. 2014 సెప్టెంబర్ 3న రాజధాని ప్రాంతాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత మూడు నెలలకు సీఆర్డీఏ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించింది. 2015 జనవరిలో భూ సమీకరణ తంతును ప్రారంభించింది. 33 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించినట్లు ప్రకటించింది. అదే సంవత్సరం అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీlచేతుల మీదుగా గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరగ్గా డిసెంబర్ 26న రాజధాని మాస్టర్ ప్లాన్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, తాత్కాలిక సచివాలయం మినహా క్షేత్రస్థాయిలో ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ భవనాలుండే అత్యంత కీలకమైన ప్రభుత్వ కాంప్లెక్స్ డిజైన్లు ఖరారు చేయడానికి ప్రభుత్వం సంవత్సరం నుంచి ఆపసోపాలు పడుతోంది. విదేశీ ఆర్కిటెక్ట్లతోపాటు ఇక్కడి విద్యార్థులను కూడా డిజైన్ల రూపకల్పనలో భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. ఈ డిజైన్లు ఖరారైతే వాటిని పూర్తిస్థాయిలో రూపొందించేందుకు కనీసం సంవత్సరం పడుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తిస్థాయి డిజైన్లు ఎప్పటికి సిద్ధమవుతాయి? అసలు ఈ కాంప్లెక్స్ నిర్మాణం మొదలయ్యేది ఎప్పుడో అంతుబట్టడం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు బ్రేక్ అమరావతిని బయటి ప్రపంచానికి అనుసంధానించే కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఖరారైనా ఇంతవరకూ ప్రారంభం కాలేదు. ఐదో నంబరు జాతీయ రహదారిపై కనకదుర్గ వారధి నుంచి సీడ్ రాజధాని వరకూ 22 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన ఈ రోడ్డు మొదటి ప్యాకేజీ పనుల్ని రూ.250 కోట్లకు రెండు నెలల క్రితం ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. త్వరలో పనులు ప్రారంభమవుతాయనగా నాలుగు లైన్ల ఈ రహదారిని ఎనిమిది లైన్లుగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేకు పడింది. ఏడు రోడ్ల డిజైన్లూ అంతే.. కీలకమైన ఏడు రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని ఆరు నెలల నుంచి చెబుతున్నా అది ఆచరణలోకి రాలేదు. ఆ రోడ్ల డిజైన్లను తరచూ మారుస్తుండడంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు సైతం అతీగతీ లేకుండా పోయాయి. కొండవీటి వాగు వరద నియంత్రణ, జల మార్గాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యతను నెదర్లాండ్స్ కన్సల్టెన్సీకి అప్పగించినా అవి ఇంకా రాలేదు. కీలకమైన గ్రామాల్లో లేఔట్ల అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. ప్లాట్ల పంపిణీ పేరుతో రైతులకు పత్రాలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో భూమిని చదును చేసే పనే ఇంకా పూర్తి కాలేదు. -
ఉద్దండరాయునిపాలెంలో ఉద్రిక్తత!
అమరావతి: రాజధాని భూములకు అందుతున్న పరిహారం విషయంలో చర్చించుకునేందుకు రైతులు, రైతు కూలీలు గురువారం తలపెట్టిన సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్దండరాయునిపాలెంలో ఈ రోజు సాయంత్రం స్థానిక రైతులు భూ పరిహారానికి సంబధించిన అంశాలపై చర్చింకునేందుకు రైతు కూలీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 144 వ సెక్షన్ అమలులో ఉందని ఎలాంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేయకూడదని హెచ్చరించారు. దీనిని రైతులు లెక్క చేయకుండా ఒక్కచోట చేరి చర్చించుకునేందుకు యత్నించడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఆ రెండూళ్లు ఇక ఉండవు
సాక్షి, అమరావతి: తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం, లింగాయపాలెం గ్రామాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాజధాని నిర్మాణాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల పరిధిలో 29 గ్రామాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూ సమీకరణ పేరుతో 22వేల మంది రైతుల నుంచి ఇప్పటికే 33వేల ఎకరాలను లాక్కుంది. అమరావతి సీడ్ కేపిటల్లో స్టార్టప్ అభివృద్ధి చేసేందుకు తుళ్లూరు మండల పరిధిలోని 1,691 ఎకరాలను మూడు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందుకు సంబంధించి నమూనాను సీఆర్డీఏ ఇటీవల విడుదలచేసింది. ఈ 1,691 ఎకరాలను పూర్తిగా చదునుచేసి ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలి. అందులో ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలున్నాయి. ఈ రెండు గ్రామాలు 45 ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. రెండు గ్రామాల్లో మొత్తం జనాభా 3,057 కాగా, 792 నివాసాల్లో 850 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇంకా 6 హిందూ దేవాలయాలు, 7 ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ప్రభుత్వం వీటన్నింటినీ కూల్చేసి, చదునుచేసి ఏడీపీ, జీవీసీ,సీసీడీఎంసీఎల్ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో రాజధానిని ప్రకటించటంతో గ్రామస్తులు కొందరు పాత నివాసాలను పడగొట్టి రూ.లక్షల రూపాయలు వెచ్చించి కొత్త భవనాలను నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు తమ రెండు గ్రామాలను స్టార్టప్ ఏరియాలో చేర్చారని తెలుసుకున్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. -
40 అంతస్తుల్లో ఏపీ సచివాలయం!
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే ఏపీ సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, తాళ్లాయపాలెం గ్రామాలకు మధ్యలో తూర్పు అభిముఖంగా ఏపీ సచివాలయాన్ని నిర్మించాలనుకుంటోంది. ఇక్కడ నిర్మించనున్న రెండు ఐకానిక్ భవనాల్లో ఒక భవనంలో సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా చుట్టూ రోడ్లు, గ్రీనరీ, విశాలమైన పార్కింగ్ ప్రదేశం ఉండేలా 40 అంతస్తుల్లో ఈ భవనం ఉండాలని సీఎం ఇప్పటికే అధికారులకు చెప్పారు. ఇదిలాఉండగా ఈ భవనంలో ఒక్కో అంతస్తులో ఐదుగురేసి మంత్రుల చాంబర్లు, ఆయా శాఖల కార్యదర్శుల కార్యాలయాలు, కమిషనరేట్లు ఏర్పాటు చేసి చివరి అంతస్తులో మాత్రం సీఎం పేషీ, భారీ కాన్పరెన్స్ హాల్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులు భావిస్తున్నారు. ఒక్కో అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటే అధిక మొత్తంలో కార్యాలయాలను నిర్వహించుకునే వీలుంటుం దని అధికారులు చెబుతున్నారు.అధికారులు, మంత్రులకు ఒకే ఫ్లోర్ ఉండటం వల్ల పరిపాలనకు సౌలభ్యంగా ఉంటుందని ఆశిస్తున్నారు. కాగా, ఈ 40 అంతస్తుల ఆకాశహార్మ్యం కోసం మొత్తం రూ.3 వేల కోట్లకు పైగానే ఖర్చయ్యే అవకాశముందని, ఈ నిధులను కేంద్రం నుంచి రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జరిగే రాజధాని అమరావతి నిర్మాణ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆమోదం తీసుకున్న తర్వాత స్ట్రక్చరల్ కన్సల్టెన్సీని పిలిచి డి జైన్లు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిధులు చేతికందితే వచ్చే జూన్ నుంచి పనులు మొదలుపెట్టే అవకాశం ఉందంటున్నారు. -
శివమెత్తించిన శివమణి
-
శివమెత్తించిన శివమణి
గుంటూరు : ఉద్దండరాయునిపాలెంలో గురువారం నిర్వహించనున్న అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్దమైంది. మరికాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ రోజు ఉదయం ముందుగా గణపతి హోమంతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు కళాకారులు తమ నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అతిథులను అలరిస్తున్నారు. డ్రమ్మర్ శివమణి తన బృందంతో సభా వేదికను శివమెత్తించారు. సభా ప్రాంగణంలో ప్రజల సౌకర్యార్థం 22 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని అందరూ వీక్షించేలా ఈ ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చారు. ప్రజలు స్క్రీన్లపై ప్రధాని సందేశం, శంకుస్థాపన కార్యక్రమం తిలకించేలా ఏర్పాటు చేశారు. అమరావతి శంకుస్థాపనకు దేశవిదేశాలనుంచి అతిథులు తరలి వస్తున్నారు. ప్రముఖులతో గన్నవరం విమానాశ్రయం కిటకిటలాడుతోంది. గన్నవరం విమానాశ్రయంలో అతిథులకు మంత్రులు స్వాగతం పలికి ప్రత్యేక వాహనాల్లో శంకుస్థాపన ప్రదేశానికి తీసుకువస్తున్నారు. సభా ప్రాంగణానికి అతిథులు, ప్రజలు చేరుకుంటున్నారు.