
సాక్షి, అమరావతి : వెలగపూడిలో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఐజి వినీత్ బ్రిజల్ పేర్కొన్నారు. రైతుల ముసుగులో కొంతమంది బయటి వ్యక్తులు వచ్చి ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. కాగా దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు ఐజి స్పష్టం చేశారు. మీడియా వాహనాన్ని ధ్వంసం చేయడమనేది హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిలో ఒక మహిళా రిపోర్టర్‌తో పాటు పలువురు జర్నలిస్ట్‌లు గాయపడినట్లు వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే బయటవ్యక్తులు వచ్చి దాడులకు రెచ్చగొట్టారని , దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే రైతుల ముసుగులో కొన్ని ప్రాంతాల్లో పోలీసులపై కూడా దాడికి దిగారని, ఆ సమయంలో పోలీసులు సంయమనంతో వ్యవహరించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment