velagapudi
-
చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్
-
జనసేన నేత వంశీకృష్ణ, టీడీపీ నేత వెలగపూడిపై ఎంపీ ఎంవీవీ ఆగ్రహం
-
అమరావతిలో పండగ వాతావరణం...
-
అమరావతి నిర్మాణం ఎలా సాధ్యమో మీరే చెప్పండి!
అమరావతి రాజధాని పేరుతో రాజధాని రైతుల ఆందోళనకు 1,000 రోజులు. నేటి నుంచి ‘అమరావతి – అరసవిల్లి పాదయాత్ర’ ప్రారంభిస్తున్నారు. ఈ మధ్యనే ‘అమరావతి వివాదాలు– నిజాలు’ పేరుతో ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. 1,000 రోజుల ఆందోళన, పుస్తకాలు, వేల కొద్దీ ఏకపక్ష మీడియా చర్చలు జరిపారు. కానీ కీలకమైన అనుమానాలకు మాత్రం సమాధానం చెప్పే ప్రయత్నం చేయకపోగా తమపై దాడి చేస్తున్నారంటూ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో మరో కొత్త నగరం సాధ్యమా? నూతన నగర నిర్మాణానికి అవసరమైన నిధులు ఎలా సమకూరుతాయి? విశాఖతో సహా ఐదారు నగరాలు ఉన్న రాష్ట్రంలో మరో నగరానికి అవకాశం ఉన్నదా? కీలకమైన ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలూ లేవు. పంజాబ్ – హరియాణా రెండు ధనిక రాష్టాల ఉమ్మడి రాజధానిగా, కేంద్రపాలిత ప్రాంతంగా 1966లో చండీగఢ్ పేరుతో నూతన నగరంతో కూడిన రాజధాని నిర్మాణం ప్రారంభించారు. రెండు రాష్ట్రాల జనాభా దాదాపు 5 కోట్లు. నూతన నగర నిర్మాణానికి పూనుకున్న నాటికే రెండు రాష్ట్రాలలో లూథియానా, అమృత్సర్, పాటియాలా, జలంధర్, పానిపట్, ఫరీదాబాద్, గురుగావ్ లాంటి పట్ట ణాలు ఉన్నాయి. నేడు అవి నగరాలుగా మారి 90 లక్షల జనాభాకు చేరాయి. మొత్తం రెండు రాష్ట్రాల జనాభాలో 20 శాతం జనాభా నగరాలలోనే ఉన్నది. పట్టణ జనాభా శాతం పంజాబ్‌లో 36 అయితే, హరియాణాది 33 శాతం. దాని ఫలితంగా రెండు ధనిక రాష్టాల రాజధాని చండీగఢ్ నగర జనాభా 56 ఏళ్ల తర్వాత కూడా 11 లక్షలకు చేరుకోలేదు. అలాగే ఛత్తీస్‌గఢ్ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తొలి నాళ్ళ లోనే రాయపూర్ సమీపంలో ‘నవరాయపూర్ అటల్ నగర్’ పేరుతో కొత్త నగర నిర్మాణానికి పూనుకున్నారు. నూతన నగర నిర్మాణం ప్రారంభించడానికి ముందే 3 కోట్ల ప్రస్తుత జనాభా కలిగిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భిలాస్ పూర్, రాయ్‌పూర్ , భిలాయ్ లాంటి నగరాలు ఉన్నాయి. ప్రస్తుతం వాటి జనాభా 25 లక్షలు. రాష్ట్ర జనాభాలో మొత్తం పట్టణ జనాభా దాదాపు 30 శాతం ఉన్నది. 20 సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభించిన రాజధాని నగర జనాభా నేటికీ 5.6 లక్షలే. అలాగే ఢిల్లీ సమీపంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గౌతమ బుద్ధ నగర్ జిల్లాలో నోయిడాను 1976లో ప్రారంభించారు. నేడు అది పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా మారింది. నోయిడా ఢిల్లీకి 40, ఘాజియాబాద్‌కు 27, ఫరీదాబాద్‌కు 30 కిలోమీటర్ల సమీపంలో ఉన్నది. 40 ఏళ్ల తర్వాత కూడా నోయిడా జనాభా 6.4 లక్షలే. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినా కూడా అప్పటికే సమీపంలో అభివృద్ధి చెందిన నగరాలు ఉంటే మరో కొత్త నగర అభివృద్ధి సాధ్యం కాదు అని ఈ ఉదాహరణలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరంగా అమరావతిని నిర్మించడం సాధ్యమేనా అనేది పరిశీలించడం సమంజసం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర జనాభా 5.5 కోట్లు. వెలగపూడి కేంద్రంగా అమరావతిని నూతన రాజధానిగా నిర్మించాలనుకునేనాటికి విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు నగరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాక ప్రతి జిల్లాలో 2 లక్షల జనాభా కలిగిన పట్టణాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న కేవలం 6 నగరాల జనాభా 70 లక్షల పైమాటే. ఇది రాష్ట్ర జనాభాలో 15 శాతం. పదుల సంఖ్యలో ఉన్న పట్టణ జనాభా మొత్తం కోటి దాటింది. స్థూలంగా రాష్ట్ర జనాభాలో పట్టణ జనాభా 34 శాతం. దేశంలో మిగతా చోట్ల నిర్మించిన కొత్త రాజధానుల అభివృద్ధి సరళిని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు... హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ సిటీగా అమరావతి ఎదగాలంటే సాధ్యమయ్యే పనేనా? సమీపంలో నగరాలు ఉంటే కొత్త నగరంలో ఉపాధి అవకాశాలు ఉన్నా ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకోరని నోయిడా నేర్పుతున్న పాఠం! అలాంటిది ప్రతిపాదిత అమరావతికి 35 కిలోమీటర్ల దూరంలో గుంటూరు, 19 కిలోమీటర్ల దూరంలో విజయవాడ, 15 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి అభివృద్ధి చెంది ఉన్నాయి. ఈ పరిస్థి తులలో నూతన మహానగరం ఎలా సాధ్యం? కోటికిపైగా జనాభా కలిగిన హైదరాబాద్ స్థాయిలో అమరావతిని నిర్మించడం ఎలా సాధ్యం అవుతుందో ఆందోళన చేస్తున్న రైతులు చెప్పకపోయినా... ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నేతలూ, మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలూ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. రాష్ట్ర ప్రజలు రాజధాని రైతు ఉద్యమం పేరుతో సెంటిమెంట్ రాజకీయాలకు అతీతంగా వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలి. రాజధాని ఉద్యమ నాయకత్వానికి రాజకీయాలు ఉండవచ్చు. మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు ఉండవచ్చు. కానీ దాదాపు 34 వేల ఎకరాల భూమి ప్రభుత్వానికి ఇచ్చి ఒప్పందం చేసుకున్న రైతులకు రాజకీయాలు ఆపాదించకూడదు. సమాచారం లోపం, నాటి ప్రభుత్వం కల్పించిన ఆశలు, వివేచన లేకుండా రాజకీయ కోణంలో మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీల మాటలు నమ్మి రైతులు మహా నగరం సాధ్యమనే ఆశతోనే నేటికీ ఉన్నారు. ప్రభుత్వం రైతులకు సావధానంగా నిజాలు చెప్పాలి. అంతిమంగా ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సినది నూతన నగరం కాదు. ప్రాంతాల మధ్య సమతుల్యత. రాష్ట్ర వనరులను, శక్తి సామర్థ్యాలను రాజధాని ప్రాజెక్టు కోసం వెచ్చించడం అంటే ఆత్మహత్యా సదృశమే అవుతుంది’’ అన్న విభజన చట్టం ప్రకారం ఏర్పడిన శివరామకృష్ణన్ కమిషన్ చెప్పిన మాటలు బాధ్యత కలిగిన ప్రభుత్వం, విపక్షాలు, అమరావతి రైతులు– ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరిచిపోకూడదు. (క్లిక్ చేయండి: ఆంధ్రకు వరం ఈ కొత్త ‘పార్క్’) - మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి ‘రాయలసీమ మేధావుల ఫోరం’ కన్వీనర్ -
సచివాలయానికి నీడ
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో తాత్కాలిక భవనాల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం.. మొక్కలను సైతం తాత్కాలికంగానే బతికేలా చేసింది. ఆ మొక్కలన్నీ కనుమరుగైపోయి, నీడ కరువైపోయింది. ఆ ప్రాంతమంతా ఎడారిలా మంటెక్కిపోతోంది. దీంతో సచివాలయ సిబ్బంది, పోలీసులు, సందర్శకులు నరకాన్ని చవిచూస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రాంతంలో మళ్లీ పచ్చదనం పరిచి, నీడ కల్పించే చర్యలు చేపట్టింది. సచివాలయ భవనాల పరిసరాల్లో ఇక్కడి మట్టిలో బతికేవి, నీడనిచ్చే 12 వేలకు పైగా మొక్కలను ఈ వర్షాకాలంలో నాటేందుకు సిద్ధం చేస్తోంది. ఇవి కాక అందాన్నిచ్చే మరికొన్ని రకాల మొక్కలూ నాటనున్నారు. భవిష్యత్ అవసరాలను మరిచి నిర్మాణాలు తెలుగుదేశం పార్టీ హయాంలో రాజధాని కోసం 29 గ్రామాలకు చెందిన భూములు తీసుకున్నారు. అప్పటివరకు పచ్చటి తోటలు, పూల వనాలతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం 2016 నాటికి పంటలకు దూరమైపోయింది. వెలగపూడి సమీపంలో అసెంబ్లీ, సచివాయాల భవనాలను దాదాపు 45 ఎకరాల్లో నిర్మించారు. సింగపూర్, మలేసియా, జపాన్ అంటూ అందానికి ప్రాధాన్యం ఇస్తూ ఈ నేలకు సరిపోని మొక్కలను తెచ్చి నాటారు. గత ఆరేళ్లుగా అవి మొక్కలుగానే ఉండిపోగా, చాలావరకు చనిపోయాయి. దాంతో భవనాల పరిసరాల్లో నీడే కరువైపోయింది. వేసవిలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. గడిచిన మే నెలలో విజయవాడ, గుంటూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, సచివాలయ ప్రాంగణంలో 43.5 డిగ్రీలకు పైగా నమోదైంది. అంటే ఉష్ణోగ్రతలు సహజంగానే ఎక్కువగా ఉండే ఈ రెండు నగరాలకంటే సచివాలయం వద్ద 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఉంటోంది. నిత్యం ఇదే పరిస్థితి. నీడనిచ్చే మొక్కలు సిద్ధం గత పాలకుల తప్పులను గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం వెలగపూడి పరిసరాల్లో నీడనిచ్చేవి, ఇక్కడి మట్టిలో బతికే మొక్కలను నాటాలని సీఆర్డీఏను ఆదేశించింది. గతేడాది సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇరువైపులా, రోడ్డు మధ్యన నీడనిచ్చే బాదం జాతి మొక్కలను నాటారు. అవి ఎనిమిది నెలల్లోనే అనుకున్న స్థాయిలో పెరిగాయి. దీంతో అసెంబ్లీ, సచివాలయ భవనాలు ఉన్న ప్రాంతంలోనూ నీడనిచ్చే వేప, రావి, మామిడి, మహాగని వంటి జాతులకు చెందిన మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఉద్దండరాయునిపాలెం, సచివాలయంలో రెండు నర్సరీలు ఏర్పాటు చేసి సుమారు 12 వేలకు పైగా నీడనిచ్చే మొక్కలను, పూల మొక్కలను సిద్ధం చేశారు. జూన్, జూలై నెలల్లో వర్షాకాలంలో వీటిని నాటనున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఉన్న ప్రాంతంలో చల్లదనం పెరగాలంటే భవనాలకు చుట్టూ కనీసం కిలోమీటర్ పరిధిలో పూర్తిస్థాయిలో నీడనిచ్చే చెట్లు పెంచాలని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నల్ల ఎడారి నల్ల సముద్రం, ఎర్ర సముద్రం.. ఇలా కొన్ని సముద్రాలకు రంగుల పేర్లు ఉన్నాయి. ఎడారికి..? ప్రశ్నే లేదు. ఎడారి అంటే ఒకటే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబేయేది కొత్తది. ఇది నల్ల ఎడారి. ఎక్కడుంది అంటారా..? మన దగ్గరే.. అమరావతి ప్రాంతంలో. గత తెలుగుదేశం పార్టీ సృష్టి. దానిపేరే తాత్కాలిక సచివాలయం. గత ప్రభుత్వం ఇక్కడి నేల స్వభావానికి సరిపోని విదేశీ మొక్కలు నాటింది. అవి చనిపోవడంతో ఈ ప్రాంతం ఎడారిలా మారింది. నల్ల రేగడి నేలలో ఆ ప్రభుత్వం సృష్టించిన ఎడారి అయినందున దీనిని నల్ల ఎడారి అని అంటున్నారు. -
దళితుల్లో చిచ్చుకు టీడీపీ కుట్ర
సాక్షి, అమరావతి: ‘విభజించు.. పాలించు’ విధానంతో దుష్ట రాజకీయాలు చేయడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు బ్రిటీష్ పాలకులను మించిపోతున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న ఆయన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాజధానిలో దళితులు, బీసీలు ఉండటానికి వీల్లేదని, అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని కోర్టుకు వెళ్లి మరీ అడ్డుకుంటున్న టీడీపీనే.. ప్రస్తుతం అమరావతిలో దళితుల మధ్య విభేదాలను రాజేస్తూ మరో కుట్రకు తెరతీసింది. వెలగపూడిలో టీడీపీ కుట్రతో జరిగిన ఘర్షణలో ఓ దళిత మహిళ చనిపోయిన ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు పన్నాగం పన్నుతున్నారు. దళితులు ఐక్యంగా ఉంటే టీడీపీకి నష్టమని.. ► దళితులు ఐక్యంగా ఉంటూ రాష్ట్రంలో రాజకీయంగా బలీయ శక్తిగా ఉండటాన్ని ప్రతిపక్షత నేత చంద్రబాబు సహించలేకపోతున్నారు. రాష్ట్రంలో దళితులు సమష్టిగా దాదాపు 18 శాతం ఓట్లు కలిగి ఉన్నారు. ఇంత పెద్ద ఓటు బ్యాంకు వైఎస్సార్సీపీకి సంప్రదాయంగా బలమైన మద్దతుదారుగా ఉంది. ► 2019లో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అఖండ విజయానికి వెన్నుదన్నుగా నిలిచింది. దళితులు ఐక్యంగా ఉంటే మునుముందు తమకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని చంద్రబాబుకు బోధపడింది. అందుకే దళితులను విభజించేందుకు చంద్రబాబు కుట్రకు తెర తీశారు. వెలగపూడిలో టీడీపీ దిగజారుడు రాజకీయం ► గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో దళితుల మధ్య తలెత్తిన చిన్న వివాదాన్ని టీడీపీ కుట్రపూరితంగా రెచ్చగొట్టింది. చంద్రబాబు కనుసన్నల్లో టీడీపీ నేతలు ఆ గ్రామంలో ఇరువర్గాల మధ్య వివాదానికి ఆజ్యం పోశారు. ► ఆ గ్రామంలోని దళితవాడలో సిమెంట్ రోడ్డు.. ఆర్చ్ నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలను క్రిస్మస్ తర్వాత సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీన్ని టీడీపీ సహించలేకపోయింది. ► ఈ అంశాన్ని ఘర్షణలకు దారితీసేంత తీవ్ర వివాదంగా మలచాలని టీడీపీ అధినాయకత్వం తమ పార్టీ నేతలకు స్పష్టం చేసింది. దాంతో టీడీపీకి చెందిన న్యాయవాది జడారి శ్రావణ్ కుమార్, మరికొందరు పార్టీ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగి, ఆజ్యం పోసి రెచ్చగొట్టారు. దీంతో ఆదివారం రాత్రి ఇరువర్గాలు పరస్పరం కర్రలతో దాడులకు పాల్పడ్డాయి. ఎనిమిది మంది గాయపడగా, వారిలో మరియమ్మ అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. శవ రాజకీయాలు చేస్తున్న టీడీపీ ► తాము రాజేసిన చిచ్చుతో ఓ అమాయక దళిత మహిళ ప్రాణాలు కోల్పోయినప్పటికీ చంద్రబాబు శాంతించలేదు. మరియమ్మ మృతదేహాంతో వెలగపూడిలో టీడీపీ నేతలు ధర్నా చేశారు. హోంమంత్రి సుచరిత, తదితరులు గ్రామంలో పర్యటించి సర్ది చెప్పడంతో పోస్టుమార్టంకు మరియమ్మ కుటుంబ సభ్యులు సమ్మతించారు. ► అనంతరం అంత్యక్రియలు చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు సిద్ధపడుతుండగా టీడీపీ నేతలు వారిని ప్రభావితం చేసి ఆమె మృతదేహంతో సోమవారం తుళ్లూరు–వెలగపూడి రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇది టీడీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ► ఈ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ నందిగాం సురేశ్‌ను ఏ–1గా చేర్చాలని, ఎఫ్ఐఆర్ కాపీ తమకు చూపించాలని అసంబద్ధ డిమాండ్‌తో టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుడుతనం ప్రదర్శిస్తోంది. ఈ కేసును విచారించి ఎంపీ నందిగాం సురేశ్ పాత్ర ఉన్నట్టు తేలితే ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు. ► కానీ టీడీపీ నేత జడారి శ్రవణ్ కుమార్, ఆయన అనుచరులు మాత్రం అందుకు సమ్మతించకుండా ధర్నా కొనసాగిస్తుండటం టీడీపీ ఉద్దేశాన్ని తేటతెల్లం చేస్తోంది. ► శవపేటికలో పెట్టిన మరియమ్మ మృతదేహాన్ని వెలగపూడి–తుళ్లూరు రోడ్డులో దించి మరీ టీడీపీ ధర్నా కొనసాగిస్తుండటం బాధాకరమని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం మధ్యలో మృతదేహాన్ని దించరాదని చెబుతున్నారు. తొలి నుంచీ బాబు దళిత వ్యతిరేకి ► చంద్రబాబు ఆది నుంచి దళితుల పట్ల వ్యతిరేకంగానే ఉన్నారు. 1995–2004లో, 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చాక కూడా తీరు మారలేదు. ‘ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా?’ అని వ్యాఖ్యానించడం తెలిసిందే. ► అమరావతిలో దళితుల ఎసైన్ట్ భూములను తన బినామీల పేరిట తక్కువ ధరకు కొల్లగొట్టారు. అక్కడ దళితులను లేకుండా చేయాలని కుట్ర పన్నారు. ఇది గ్రహించే దళితులతో సహా అన్ని వర్గాల వారు అమరావతి పరిధిలోని మంగళగిరి (లోకేశ్ ఓడిపోయారు), తాడికొండ నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించినా బాబు మారలేదు. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతిలో 54 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయిస్తే.. వీరిలో ఎక్కువ మంది దళితులు ఉండటంతో టీడీపీ కోర్టును ఆశ్రయించి అడ్డుకుంది. ‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అమరావతిలో ‘సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది’ అని నిస్సిగ్గుగా వాదించింది. తక్షణం స్పందించిన ప్రభుత్వం ► వెలగపూడిలో ఘర్షణలపై ప్రభుత్వం తక్షణం స్పందించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఘర్షణలను నివారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగాం సురేశ్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు, రాష్ట్ర రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్‌రావు తదితరులు వెలగపూడిలో పర్యటించారు. ► మరియమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. దళితులు అంతా ఒకటే కుటుంబమని చెప్పి అందరం ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరియమ్మ కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.10 లక్షలు ఇచ్చారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ► గాయపడిన వారికి పూర్తి చికిత్స అందిస్తామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. దాడులను నివారించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తుళ్లూరు సీఐ ధర్మేంద్ర బాబును వీఆర్‌కు పంపుతూ గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెలగపూడిలో రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు సాక్షి, గుంటూరు/తాడికొండ: వెలగపూడి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామంలో ఇటీవల సిమెంట్ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డుకు ప్రారంభంలో ఆర్చ్ ఏర్పాటు చేసి, బాబూ జగ్జీవన్‌రామ్ కాలనీగా నామకరణం చేయాలని ఓ వర్గం ప్రయత్నిస్తోంది. అయితే రోడ్డుకు ప్రారంభంలో ఉన్న గృహాల వారు (మరో వర్గం) దీన్ని వ్యతిరేకించడంతో నాలుగు రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి రెండు వర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. ఐదుగురిని తాడేపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఇద్దరిని అమరావతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరియమ్మను తొలుత గుంటూరు జీజీహెచ్‌కు తరలించి, మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. మరియమ్మ మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు సోమవారం తుళ్లూరు – వెలగపూడి ప్రధాన రహదారిపై మృతదేహంతో నిరసన చేపట్టారు. వివాదం ముదరడానికి ఓ కారకుడైన తుళ్లూరు సీఐ ధర్మేంద్రబాబును సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం : హోం మంత్రి సుచరిత గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో అలజడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. మరియమ్మ మృతి విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారని, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తక్షణ సాయం కింద రూ.10 లక్షలు అందించాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. ఎస్సీలను విడగొట్టాలని చూస్తున్న చంద్రబాబు మాయలో పడొద్దని కోరారు. మహానేతలైన అంబేడ్కర్, జగ్జీవన్రామ్లను ఆదర్శంగా తీసుకుందామని చెప్పారు. గ్రామంలో శాంతి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని తెలిపారు. తుళ్లూరు ప్రాంతంలో పోలీస్ అధికారులపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. అర్ధరాత్రి వెలగపూడి బయల్దేరిన హోం మంత్రి తాము పేర్కొన్న వారి పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ప్రతిని అందించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన పోలీస్ అధికారులు ప్రాథమిక సమాచారం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిష్పక్షపాతంగా విచారణ చేసి సాంకేతిక ఆధారాలు సేకరించి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కేసులో చేర్చుతామని ఎస్పీ విశాల్ గున్నీ చెప్పారు. అయినప్పటికీ రాత్రి 11 గంటలైనా ఆందోళన విరమించలేదు. దీంతో హోం మంత్రి 11.30 గంటల ప్రాంతంలో వెలగపూడికి వెళ్లారు. -
వెలగపూడి ఘటన బాధాకరం: హోంమంత్రి సుచరిత
సాక్షి, గుంటూరు: తుళ్లూరు మండలం వెలగపూడిలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణలకు దారి తీసింది. ఆర్చి వ్యవహారంలో మొదలైన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో రెండు వర్గాలవారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారిలో మరియమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా మారి ప్రాణాలు కోల్పోయింది. దాంతో మృతురాలి బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఘర్షణల విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. పరిస్థితిని సమీక్షించేందుకు హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి వెలగపూడికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను, ఘర్షణలో గాయపడినవారిని పరమర్శించారు. మరియమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. వెలగపూడి ఘటన దురదృష్టకరమన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని సూచించారు. మరియమ్మ మృతి బాధాకరమని ఘర్షణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. స్థానికంగా పోలీసులపై వస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. గ్రామంలో పోలీస్ పికెట్, 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే బాధితులను పరామర్శించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. తక్షణ సాయంగా మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హోంమంత్రి ప్రకటించారు. మరియమ్మ కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్తామని అన్నారు. -
భూ తగాదాలు లేకుండా భూ హక్కు
-
20 స్కిల్ కాలేజీలకు భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తి
సాక్షి, అమరావతి: వచ్చే నెల 15వ తేదీకల్లా సమగ్ర పరిశ్రమ సర్వే పూర్తి చేయాలని పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన సర్వే తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలోని 4వ బ్లాక్‌లో ఉన్న తన ఛాంబర్లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై మంత్రి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. స్కిల్ కాలేజీలు, యూనివర్శీటీల ఏర్పాటు పనులపై అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో ఇరవై స్కిల్ కాలేజీలకు భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు వెల్లడించగా.. మరో 5 కాలేజీలకు కేటాయింపులో ప్రస్తుత పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీతో పాటు విశాఖపట్నం, చిత్తూరు, ఏలూరు, నెల్లూరు, కడప జిల్లాలో ముందుగా స్కిల్ కాలేజీల ప్రారంభం విషయంలో సమాలోచనలు చేశారు. డిసెంబరులో నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సమావేశానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ సీఈవో, ఎండీ అర్జా శ్రీకాంత్ ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, తదితరులు హాజరయ్యారు. -
రైతుల ముసుగులో దాడులకు పాల్పడ్డారు
సాక్షి, అమరావతి : వెలగపూడిలో మీడియా ప్రతినిధులపై జరిగిన దాడిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఐజి వినీత్ బ్రిజల్ పేర్కొన్నారు. రైతుల ముసుగులో కొంతమంది బయటి వ్యక్తులు వచ్చి ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. కాగా దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు ఐజి స్పష్టం చేశారు. మీడియా వాహనాన్ని ధ్వంసం చేయడమనేది హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిలో ఒక మహిళా రిపోర్టర్‌తో పాటు పలువురు జర్నలిస్ట్‌లు గాయపడినట్లు వెల్లడించారు. ఉద్దేశ పూర్వకంగానే బయటవ్యక్తులు వచ్చి దాడులకు రెచ్చగొట్టారని , దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే రైతుల ముసుగులో కొన్ని ప్రాంతాల్లో పోలీసులపై కూడా దాడికి దిగారని, ఆ సమయంలో పోలీసులు సంయమనంతో వ్యవహరించారని తెలిపారు. -
సీఎం జగన్‌తో పాక్సికన్ ఇండియ ఎండీ భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం సచివాలయంలో ఫాక్సికన్ ఇండియా ఎండీ జోష్ ఫాల్గర్ కలిశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలను ముఖ్యమంత్రికి వివరించిన ఫాల్గర్, నెల్లూరు జిల్లా శ్రీ సిటీలో ఉన్న కంపెనీ ద్వారా దాదాపు 15 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. వారందరికి వృత్తిపరమైన శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు. అదే విధంగా కంపెనీ ఉత్పాదక సామర్థ్యం కూడా పెంచబోతున్నామన్న జోష్ ఫాల్గర్ , ప్రస్తుతం నెలకు 35 లక్షల సెల్ఫోన్లు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఎలక్ట్రానిక్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ హబ్‌గా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. పెట్టుబడులకు రాష్ట్రం అన్ని విధాల అనుకూల ప్రాంతమన్న ముఖ్యమంత్రి, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఉత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయడానికి అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే దీని ఉద్దేశమన్న సీఎం జగన్, ఆ దిశలో ఫాక్సికన్ కంపెనీ కూడా ముందుడుగు వేయాలని ఆకాంక్షించారు. -
'ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి'
సాక్షి,వెలగపూడి : కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర కార్మిక, కర్మాగారాల శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గురువారం సచివాలయంలోని 3వ బ్లాక్‌లో కర్మాగారాల శాఖ సంచాలకులు బాలకిషోర్ ఆధ్వర్యంలో 13 జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, అక్కడ చేపడుతున్న భద్రతా చర్యలపై మంత్రి సమీక్షించారు. ప్రమాదాలు జరిగే కంటే ముందే రక్షణ చర్యలు చేపట్టడంలో కర్మాగార యజమానులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అనధికార కర్మాగారాలను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులనుద్దేశించి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా క్షేత్ర స్థాయిలో విధులను సమర్థంగా నిర్వహించడంతో పాటు సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా కర్మాగారాల యజమానులు చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. -
తాత్కాలిక హైకోర్టు పనులన్నీ ఎక్కడివక్కడే..
సాక్షి, అమరావతి: డిసెంబర్ నెలాఖరుకల్లా రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని సిద్ధం చేస్తామని ప్రగల్భాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఆఖరి నిమిషంలో చేతులెత్తేసింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఏపీలో హైకోర్టు కార్యకలాపాలు నిర్వహించేలా సుప్రీంకోర్టు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత భవన నిర్మాణం పూర్తి కాలేదని చావుకబురు చల్లగా చెప్పడంతో న్యాయవర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.డిసెంబర్ నెలాఖరుకల్లా హైకోర్టు భవనం నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం సుప్రీంకోర్టుకు తెలిపింది. తర్వాత ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు అమరావతికి వచ్చి భవన నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్లు నిర్మాణం పూర్తవుతుందని మరోసారి చెప్పారు. ఆ తర్వాత కూడా మంత్రితో పాటు సీఎం చంద్రబాబు కూడా గడువులోగా పూర్తవుతుందని ప్రకటనలు చేశారు. నోటిఫికేషన్ వచ్చాక ప్లేటు ఫిరాయించిన బాబు తీరా బుధవారం సుప్రీంకోర్టు నోటిఫికేషన్ ఇచ్చాక చంద్రబాబు ప్లేటు ఫిరాయించేశారు. తాత్కాలిక హైకోర్టు భవనం పూర్తవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని, అప్పటివరకూ విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహించుకోచ్చని చెప్పారు. నాలుగున్నరేళ్లుగా తాత్కాలిక హైకోర్టు భవనాన్ని నిర్మించకుండా కాలక్షేపం చేసి, సుప్రీంకోర్టుకు మాత్రం అంతా సిద్ధమని చెప్పి, ఇప్పుడు తీరిగ్గా అది పూర్తి కాలేదని చెబుతుండడంపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిది నెలలుగా పనులు 2.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+2 (జీ+5 ఫౌండేషన్)గా తాత్కాలిక హైకోర్టు నిర్మాణ పనులను ఈ ఏడాది మార్చి నెలలో చేపట్టారు. భవనానికి సంబంధించిన సివిల్ పనులు ఇంకా పూర్తి కాలేదు. పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఇంటీరియర్, విద్యుత్, ప్రధాన భవనాలకు లిఫ్టులు, అదనపు మౌలిక వసతులు, ప్రహరీగోడ, ప్రవేశ మార్గాలు, అంతర్గత రోడ్లు, పార్కింగ్, మురుగునీటి పారుదల వ్యవస్థ తదితర పనులు పూర్తవడానికి మరో ఆరు నెలలు పడుతుందని అంటున్నారు. కప్పిపుచ్చుకునేందుకు తంటాలు ఈ నేపథ్యంలో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కింది అంతస్తులో కొన్ని కోర్టు హాళ్లను ఆగమేఘాలపై సిద్ధం చేయించే పనిలో పడ్డారు. ఇతర సివిల్, ఇంటీరియర్, వసతులు లేకపోయినా లోపల హాళ్లను అందుబాటులోకి తెచ్చి నిర్మాణం పూర్తయిందని, వాటిలోనే కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని చెప్పేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కానీ జడ్జిలు, న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులకు సంబంధించిన గదులు, హాళ్లు సిద్ధం కావడానికి చాలా సమయం పట్టే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ భవనం వద్దకు వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదు. రాయపూడి సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి లోనికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ భవనం ఉంది. ప్రస్తుతం సీడ్ యాక్సెస్ రోడ్డు ఇంకా నిర్మాణంలోనే ఉంది. హైకోర్టు ఉద్యోగులు, పిటీషన్‌దారులు అక్కడికి రావాలంటే నానా అగచాట్లు పడాల్సిందే. ఇవన్నీ వెంటనే చేసే పరిస్థితి లేదని తెలిసీ డిసెంబర్ నాటికి హైకోర్టు భవనాన్ని అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడు జడ్జిలు, న్యాయాధికారులు, ఇతర ముఖ్యమైన ఉద్యోగులు బస చేసేందుకు హోటళ్లు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు, అద్దె ఇళ్లను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టును రోడ్డున పడేశారని న్యాయవాదులు వాపోతున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణమూ ఇంతే వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ నిర్మాణంలోనూ ప్రభుత్వం ఇలాగే ఆర్భాటానికి పోయి అభాసుపాలైంది. రికార్డు స్థాయిలో మూడు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రకటించి పూర్తివకుండానే కొన్ని గదులను సిద్ధం చేసి ప్రారంభోత్సవాలు చేసింది. ఎలాగోలా నిర్మాణం పూర్తయిందనిపించినా పనులన్నీ నాసిరకమని అనేక సందర్భాల్లో తేలింది. చిన్న వర్షానికే మంత్రుల ఛాంబర్లలో వర్షపు ధారలు కారడం, గోడలు పగుళ్లివ్వడం వంటివి చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్ష నేత ఛాంబర్లో పైకప్పు పెచ్చులూడి వర్షపు నీరు కారడం అప్పట్లో పెద్ద వివాదం మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాత్కాలిక హైకోర్టు నిర్మాణం విషయంలోనూ ఇలాగే హడావుడి చేస్తుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
సచివాలయంలో పాము కలకలం
సాక్షి, అమరావతి: వెలగపూడి తాత్కాలిక సచివాలయం రెండో బ్లాక్‌లోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో మంగళవారం పాము ప్రత్యక్షమైంది. కార్యాలయం పని వేళలకు ముందు సిబ్బంది శుభ్రం చేసే సమయంలో కప్బోర్డు నుంచి పాము బయటకు వచ్చింది. దీంతో సిబ్బంది కంగారు పడి సహచరులను పిలిచారు. తర్వాత దానిని చంపి సచివాలయం బయట పడేశారు. -
సచివాలయం మళ్లీ నీరుగారింది!
-
లీకేజీపై నెటిజన్ల సెటైర్ల హోరు
అమరావతి: తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల లీకేజీపై సోషల్ మీడియాలో సెటైర్లు హోరెత్తుతున్నాయి. రూ.వేయి కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ భవనాలు తేలికపాటి వర్షానికే ధారాళంగా కారుతుండడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘మీరు ఊహిస్తున్నట్లు చెంచా సిమెంటుకు బస్తా ఇసుక కలపలేదు. వెయ్యికోట్ల సచివాలయమే ఇలా కట్టిస్తే ఇక రెండు లక్షల కోట్ల రాజధానిని ఎలా కట్టిస్తామో అనే కదా మీ సందేహం? అప్పుడు పిడుగులు కూడా నేరుగా భవనాల్లోనే పడే టెక్నాలజీ తెచ్చి చూపిస్తాం..’ అంటూ ఒక నెటిజన్ భవిష్యత్తును ఆవిష్కరించాడు. సోషల్ మీడియా సెటైర్లలో కొన్ని.. సచివాలయంలో కాగితపు పడవల పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పన ‘సార్ నాకు రెండు వారాలు లీవ్ కావాలి’ ‘రెండు వారాలా? ఎందుకు?’ ‘‘ఈత నేర్చుకోవడానికి సార్.. ఈ రోజు చూశారుగా, వర్షం వస్తే ఆఫీసు లో కూర్చుని పనిచేయడానికి లేదు.. ఈదుతూ పనిచేయాలి!!’ ‘‘నిజమేనోయ్.. టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి మరి!’ ‘అంతర్జాతీయ స్థాయంటే ఆమాత్రం ఉండొద్దూ!’ నాన్నారూ నాన్నారూ సచివాలయంలో పుష్కరాలు ఏర్పాటుచేస్తే ఎలా ఉంటదంటారు? సహజంగా వాటర్ ఫాల్స్ అడవుల్లోనో, కొండలమీదనో ఉంటాయి. కానీ మన చంద్రన్న ఏకంగా అసెంబ్లీలోనే ఆ సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. అది కూడా బల్బుల నుంచి, ఫ్యాన్ల నుంచి, ఏసీల నుంచి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడమంటే మాటలు కాదు. బహుశా దానికోసం ప్రత్యేకమైన టెక్నాలజీ వాడి ఉండొచ్చు. ఈ వాటర్‌ఫాల్స్ కూడా అతి సహజంగా ఉండేలా చేయడం కోసం ప్రయత్నించిన తీరు నిజంగా ప్రశంసనీయం. అపార్థం చేసుకోకండి. వర్షాన్ని చూస్తూ పనిచేస్తుంటే ఆనందంగా ఉంటుంది అని అలా కట్టించాము. అంతే తప్ప తెలియకకాదు. అది లేటెస్టు టెక్నాలజీ అని తెలుసుకోండి. ఇక జగన్ చాంబర్లో అలా కావాలనే సహజ జలపాతం ఏర్పాటు చేశాం. ఆయనకు మా మీద కోపం ఎక్కువ కదా.. ఆయన మనసు ప్రశాంతంగా ఉండాలని అలా వర్షపు ధారలు పడే వీలు కల్పించాం. అంతేకానీ మీరు ఊహిస్తున్నట్లు చెంచా సిమెంటుకు బస్తా ఇసుక కలపలేదు. వెయ్యికోట్ల సచివాలయమే ఇలా కట్టిస్తే ఇక రెండు లక్షల కోట్ల రాజధానిని ఎలా కట్టిస్తామో అనే కదా మీ సందేహం? అప్పుడు పిడుగులు కూడా నేరుగా భవనాల్లోనే పడే టెక్నాలజీ తెచ్చి చూపిస్తాం. అధ్యక్షా..! ఈ నీళ్ల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ, ప్రతిపక్ష నాయకుడు జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, భారత ప్రధాని మోదీ గార్లు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. చేస్తాం.. చేస్తాం... ఎందుకు చేయం.. ఆయన: ఎవడయ్యా కాంట్రాక్టరు పిలవండి కాంట్రాక్టర్: సార్ ఆయన: ఏమిటయ్యా ఒక్క వర్షానికే కురిసేలా కట్టావు కాంట్రాక్టర్: మేము మోసపోయాం సార్ ఆయన: ఎందుకయ్యా కాంట్రాక్టర్: మీరు ఉన్న చోట వర్షాలు పడవని అధికారులు చెప్పారు సార్ మీకు కుళ్లు. పాపం ఆయన ఎక్కడ ఉన్నా వర్షం పడదు అని ఆడిపోసుకుంటారు. ఇప్పుడు చూడు ఏకంగా అసెంబ్లీలోనే వరద తెప్పించాడు. ఓరి దీంతస్సాదియ్యా, ఈ టెక్నాలజీ ఏదో బాగుందే!! న్యూజిలాండ్ నుంచి ల్యాండ్ లైనుకి మిస్డ్ కాల్ ఇస్తే చాంబరు సీలింగ్ పగిలి లోపలికి నీళ్లొచ్చాయా??! కేకంతే. ముందే చెప్పారు ఇవి తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం అని. మీరే అవి పర్మనెంట్ అని ఆశపడ్డారు. పాపం వాళ్ల తప్పేమీ లేదు. ప్రపంచస్థాయి కట్టడాలు లీక్ అవుతాయా?? పైగా విజనరీ కట్టినవి..!!! -
నేను పప్పా.. అవినీతిపరుడినా!
ఏదో ఒకటి తేల్చండన్న మంత్రి లోకేశ్ సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు తనను పప్పు, అవినీతిపరుడని విమర్శిస్తున్నాయని, ఇందులో తాను ఏదో తేల్చి చెప్పాలని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. మంగళవారం వెలగపూడి సచివాలయం వద్ద ఆయన మీడియాతో ముచ్చటించారు. తనపై ఎంత దుష్ప్రచారం చేసినా తాను మాత్రం పని చేసి చూపిస్తున్నానన్నారు. మంత్రి పదవి చేపట్టిన నెల రోజుల్లో 1650 ఐటీ ఉద్యోగాలు సృష్టించానన్నారు. అమెరికా పర్యటనకు తాను వెళ్లడంలేదని జీఓ ఎందుకిచ్చారో తెలియదన్నారు. చదవండి: అమెరికా పర్యటనకు లోకేశ్ దూరం.. -
ఏపీ సెక్రటేరియట్ లో కలకలం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో ఫైర్ అలారం మోగడంతో ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. వెలగపూడిలోని సెక్రటేరియట్ మూడో బ్లాకులో సోమవారం అకస్మాత్తుగా అలారం మోత వినిపించడంతో కలకలం రేగింది. ఏం జరుగుతుందో తెలియక ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక కారణాలతోనే క్యాంటీన్ లోని ఫైర్ అలారం మోగినట్టు గుర్తించారు. సాంకేతిక సమస్యను సరిచేసి అలారం మోతను ఆపారు. ఏపీ సచివాలయంలో భద్రత డొల్ల అని ఇంతకుముందు జరిగిన ఘటనలు రుజువు చేశాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కొలువుండే సచివాలయంలో ఎలాంటి అనుమతులు లేకుండానే.. ఓ సామాన్య పౌరుడు యథేచ్ఛగా లోపలకు వచ్చి, గుర్రంస్వారీ చేసిన ఘటన గత నెలలో చోటుచేసుకుంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధులు నిర్వర్తించే బ్లాక్ లోకే నీళ్లు రావడం కూడా గత నెలలో చర్చనీయాశంమైంది. ఇలా రోజుకొకటి బయటపడుతుండడంతో సచివాలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. -
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు.
-
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
-
ఏపీ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. గతంలో పలుసార్లు కూల్చివేతలు జరగగా, తాజాగా సీఆర్డీఏ అధికారులు బుధవారం క్యాంటీన్‌ను కూల్చివేశారు. అయితే ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు క్యాంటీన్ కూల్చివేయడాన్ని క్యాంటిన్ నిర్వహకులు తప్పుబట్టారు. మంత్రి నారాయణ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్ నిర్వహించేందుకు మూడేళ్లు లీజుకు ఇచ్చారని, రూ.25 లక్షల పెట్టుబడి పెట్టాక...ఇప్పుడు కూల్చివేతలు ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాల్లో సచివాలయంలో పలు బ్లాక్‌లను కూల్చి అధికారులు మళ్లీ కట్టారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీఆర్డీఏ అధికారులు మాత్రం కూల్చివేతలపై పెదవి విప్పడం లేదు. కాగా వాస్తు లోపాలంటూ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఇప్పటికే పలుసార్లు మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. -
రాజధాని బురద
-
ఏపీ అసెంబ్లీ వద్ద కలకలం
- అసెంబ్లీ గేటు ముందు యువతి ఆత్మహత్యాయత్నం అమరావతి: ఏపీ అసెంబ్లీ వద్ద ఒక యువతి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఏపీ అసెంబ్లీ రెండో గేట్ వద్ద జరిగిన ఈ ఘటన వివరాలివీ.. శ్రీకాకుళానికి చెందిన కళ్యాణి నాలుగో తరగతి ఉద్యోగినిగా పనిచేస్తోంది. తనకు కొన్ని రోజులుగా ఉన్నతాధికారులు వేతనం ఇవ్వటం లేదని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై సీఎంను కలిసేందుకు ఆమె బుధవారం ఉదయం వెలగపూడిలోని అసెంబ్లీ వద్దకు వచ్చింది. అయితే లోపలికి ప్రవేశించేందుకు యత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సిబ్బంది వెంటనే ఆమెను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. గతంలోనూ ఇదే విధంగా ప్రయత్నించగా ముఖ్యమంత్రి ఆమెకు రూ. 25 వేలు అందజేశారని.. అప్పటి నుంచి కల్యాణి ఇలా వ్యవహరిస్తూ హంగామా చేస్తుంటుందని ఆమె స్నేహితులు అంటున్నారు. -
మమ్మల్ని సొంత రాష్ట్రానికి పంపండి
తెలంగాణ ఉద్యోగుల ఆవేదన సాక్షి, అమరావతి: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల ఉద్యోగ జేఏసీలు తమను పట్టించుకోవడం లేదని తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న రాష్ట్ర ఉద్యోగులు సచివాలయ ఉద్యోగ సంఘం నేతలు, అధికారులను కలసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. తమను సొంత రాష్ట్రానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పని చేయలేకపోతున్నామని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడంలేదని ఉద్యోగి శ్రీధర్ తెలిపారు. త్వరలో గవర్నర్‌తో జరిగే సమా వేశంలో తమ సమస్యలపై చర్చించాలని, తమను చేర్చుకునేలా తెలంగాణ ప్రభు త్వాన్ని ఒప్పించాలని కోరారు. ఏపీ సచివాలయంలో 233 మంది, హెచ్‌వోడీ కార్యా లయాల్లో 680 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. -
‘అధికారపక్షం దౌర్జన్యాలను సభలో నిలదీస్తాం’
-
‘అధికారపక్షం దౌర్జన్యాలను సభలో నిలదీస్తాం’
అమరావతి: కొత్త శాసనసభలోనైనా ప్రతిపక్షానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మూడేళ్లుగా శాసనసభ సమావేశాలు సజావుగా నిర్వహించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పార్టీ నాయకులతో కలిసి ఆదివారం ఆయన వెలగపూడిలో అసెంబ్లీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక హోదా అంశంపై చర్చకు పట్టుబడతామని పునరుద్ఘాటించారు. అధికారపక్షం దౌర్జన్యాలను సభలో నిలదీస్తామని చెప్పారు. క రువుతో రాష్ట్రం అల్లాడుతోందని, రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను 14 రోజులకు కుదించాలనుకోవడం సరికాదన్నారు. ఏడాదికి 80 నుంచి 100 పాటు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత కూడా సమావేశాలు నిర్వహించాలని కోరారు. ప్రతిపక్షం చేసే విమర్శలను ప్రభుత్వం సలహాలుగా భావించాలని, ఎదురుదాడి చేస్తే మంచిది కాదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. -
అమరావతిలో అసెంబ్లీ యుద్ధానికి సిద్ధం.
-
అసెంబ్లీ... 5 గేట్లు
గుంటూరు ఈస్ట్ (గుంటూరు వెస్ట్): నూతనంగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవన ప్రాంగణంలోకి ప్రొటోకాల్ ప్రకారం పాస్‌లు పొందిన వారికే అనుమతి ఉంటుందని గుంటూరు రేంజి ఐజీ సంజయ్ చెప్పారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రూరల్ ఎస్పీ నారాయణనాయక్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తాత్కాలిక అసెంబ్లీ ప్రాంగణానికి మొత్తం ఐదు గేట్లు ఉంటాయని చెప్పారు. ప్రాంగణంలోకి ప్రవేశించాక తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉంటాయని తెలిపారు. వీటిని ప్రొటోకాల్ ప్రకారం కేటాయింపులు చేశామన్నారు. సోమవారం ఉదయం 11.06 గంటలకు అసెంబ్లీని గవర్నర్ ప్రారంభిస్తారని చెప్పారు. సెక్యూరిటీ కంట్రోల్ డెస్క్ నాలుగో గేటు సమీపంలో సెక్యూరిటీ కంట్రోల్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఐజీ వెల్లడించారు. సందర్శకులు, మీడియా ప్రతినిధులు సెక్యూరిటీ పరమైన సమస్యలపై ఈ డెస్క్‌లో ఐజీ కార్యాలయం నియమించిన అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు. అసెంబ్లీని సందర్శించే విద్యార్థులు, ఎన్జీవోలు, మీడియా వారికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారని, ముందస్తు అనుమతితో వారు అసెంబ్లీని సందర్శించవచ్చని తెలిపారు. మీడియా ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు వారి అభిప్రాయాలు వెల్లడిస్తారని చెప్పారు. బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖాళీ ప్రదేశంలో కూడా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని వివరించారు. 300 మంది అమరావతి వలంటీర్లు అసెంబ్లీ ప్రాంగణంలో ఉచితంగా మంచి నీరు అందిస్తారని, టీ విక్రయించే ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ప్రస్తుతం నిర్మించిన రోడ్డు మార్గంలోంచి అసెంబ్లీకి చేరుకుంటారన్నారు. ఐదు ఎకరాల్లో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఏ గేట్ల ద్వారా ఎవరు..? మొదటి గేటు – ముఖ్యమంత్రి, స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ రెండో గేటు – మంత్రులు, ప్రతిపక్ష నాయకులు మూడో గేటు – మీడియా ప్రతినిధులు, సందర్శకులు, ఇతర అధికారులు నాలుగో గేటు – ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఐదో గేటు – సీనియర్ అధికారులు, అసెంబ్లీ సిబ్బంది ఏ ప్రవేశ ద్వారం ఎవరికి మొదటి ద్వారం – ముఖ్యమంత్రి, స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ రెండో ద్వారం – డిప్యూటీ సీఎం, అధికారుల వెయిటింగ్, గ్యాలరీకి వేళ్లే వారు మూడో ద్వారం – ఎమ్మెల్సీలు నాలుగో ద్వారం – కౌన్సిల్ చైర్మన్, ఎమ్మెల్సీలు ఐదో ద్వారం – కౌన్సిల్ సిబ్బంది ఆరో ద్వారం – స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ (వీరు మొదటి ద్వారం నుంచి కూడా లోపలికి ప్రవేశించవచ్చు) ఏడో ద్వారం – పాస్ కలిగిన వారు ఎనిమిదో ద్వారం – ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు తొమ్మిదో ద్వారం – మీడియా ప్రతినిధులు, వీఐపీ గ్యాలరీలకు వెళ్లే వారు -
6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
6 నుంచి అసెంబ్లీ
⇒ సోమవారం ఉ. 11.06 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ⇒ 26వ తేదీతో నోటిఫికేషన్ జారీ చేసిన శాసనసభ సచివాలయం సాక్షి, అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రాంగణంలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో శాసన సభ, మండలి సమావేశాలు సోమవారం (6వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 11.06 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సచివాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే, గత నెల 26వ తేదీతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేయడం వివాదంగా మారింది. పాత తేదీతో నోటిఫికేషన్ జారీ చేయడాన్ని అధికార యంత్రాంగం తప్పుపడుతోంది. 13న బడ్జెట్: సోమవారం గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. వాయిదా పడిన తరువాత లేదా మంగళవారం శాసన సభా వ్యవహారాల కమిటీ సమావేశమవుతుంది. సమావేశాలు ఎప్పటివరకు నిర్వహించాలి, ఏ ఏ అంశాలను చర్చకు చేపట్టాలో ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017–18) వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 13వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. -
కాలినడకన పెట్టుబడులకు తిరిగా: చంద్రబాబు
అమరావతి : రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీని తన కోసం కాదని....ప్రజల కోసం నిర్మించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి గురువారం వెలగపూడిలో నూతన అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గతంలో కట్టుబట్టలతో..పెద్ద ఎత్తున అప్పులతో విభజన జరిగినా అభివృద్ధి చేసి చూపించామన్నారు. రాష్ట్ర విభజన చాలా బాధాకరమని, ఎవ్వరినీ అడగకుండా కేవలం అరగంటలో విభజించారని ఆయన అన్నారు. ఫైళ్లు మోసుకుని..కాలినడకన పెట్టుబడుల కోసం తిరిగానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జరిగిన అన్యాయాన్ని అభివృద్ధితో పూడ్చగలం కానీ అవమానాన్ని మరువలేమన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుతో తన జీవితంలో ఎన్నడూ పడని ఆవేదన అనుభవించాను అని తెలిపారు. విభజన నాటి కసి..కోపం తగ్గడానికి వీల్లేదని, దాన్నుంచే అభివృద్ధి చేసి తీరాలన్నారు. ఇకపై ఈ గడ్డ నుంచే చట్టాలు చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ కాలం సీఎంగానూ.. ప్రతిపక్ష నేతగానూ ఉన్నానని, తనకు హైకమాండ్ ప్రజలేనని తెలిపారు. ఢిల్లీ వాళ్లకో.. వేరే పార్టీకో తాను ఏనాడూ తలొగ్గలేదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి తన కోసం చేయలేదని, తెలుగు జాతి కోసం చేశానని అన్నారు. అమరావతిని నెంబర్ వన్ రాజధానిగా తీర్చిదిద్దుతానని, ఎడారిగా మారుతోన్న రాయలసీమను సస్య శ్యామలంగా మార్చి రతనాల సీమగా మారుస్తానని, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథాన నడిపిస్తానని తెలిపారు. ఉత్తరాంధ్ర వలసలను నిరోధిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మంచి పనులు చేసేటప్పుడు తనను విమర్శించినా పట్టించుకోనని, ప్రజల కోసం..రాష్ట్రం కోసం.. భావి తరాల కోసం అన్నీ భరిస్తున్నానని చెప్పారు.అసెంబ్లీలో ప్రజల కోసం అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. బడ్జెట్లో పేదలకు భారీగా నిధులు కేటాయిస్తామని సీఎం తెలిపారు. -
ఏపీ నూతన అసెంబ్లీ భవనం ప్రారంభం
-
ఏపీ నూతన అసెంబ్లీ భవనం ప్రారంభం
వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉదయం 11.25 గంటలకు సీఎం భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబు సమావేశ మందిరాలు, ఛాంబర్లు, లాబీలు పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ సొంతగడ్డపై శాసనసభ సమావేశాలు నిర్వహించాలన్న తన కల నెరవేరిందన్నారు. ప్రజా సమస్యలపై సభలో విస్తృతమైన చర్చ జరగాలన్నారు. కాగా మార్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఈ ప్రాంగణంలోనే జరగబోతున్నాయి. ఒకే సముదాయంలో అసెంబ్లీ, సచివాలయ భవనాలను ఏర్పాటు చేశారు. రికార్డ్ సమయంలో ఈ భవనాలను ఎల్అండ్టీ, సీఆర్డీఏ సంస్థలు నిర్మించాయి. సచివాలయ ప్రాంగణంలో ఆరో భవనంగా అసెంబ్లీ, మండలి నిలవనున్నది. మొత్తం 260 మంది సభ్యులు కూర్చునేలా అసెంబ్లీ భవనాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రాతినిధ్యం 50 మంది అయినా... 90 మంది సభ్యులు కూర్చునేలా శాసనమండలి భవనాన్ని ఏర్పాటు చేశారు. సభాపతి చైర్ అసెంబ్లీకి ప్రత్యేక ఆకర్షణగా కనబడుతోంది. ఏడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన స్పీకర్ చైర్‌కు ఇరువైపులా ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. సభ్యుల కుర్చీల వద్ద సెన్సార్ మైక్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. భాషా అనువాద సదుపాయం కూడా ఉంది. అసెంబ్లీలో ఏర్పాటు చేసిన మొత్తం ఐదు అత్యాధునిక గ్యాలరీల్లో 2 మీడియాకు, ఒకటి అధికారులకు, ఒక్కొక్కటి చొప్పున మరో రెండు వీఐపీలకు కేటాయించారు. మొదటి అంతస్థులో ఐదు పార్టీలకు శాసనసభ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీలో మూడు పార్టీల ప్రాతినిథ్యం మాత్రమే ఉంది. -
నేడు అసెంబ్లీ ప్రారంభోత్సవం
సాక్షి, అమరావతి: వెలగపూడిలోని అసెంబ్లీ భవనం గురువారం ప్రారంభం కానుంది. ఉదయం 11.25 గంటలకు సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవానికి ప్రధాన ప్రతిపక్ష నేత, మంత్రులు, ఎమ్మెల్సీలు, అధికారులు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రులు యనమల, నారాయణ తెలిపారు. 6న∙అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. -
ఏపీ సచివాలయంలో భద్రత డొల్ల!
♦ యథేచ్ఛగా సామాన్యుడి గుర్రం స్వారీ ♦ ఆలస్యంగా గుర్తించిన భద్రతా సిబ్బంది ♦ సచివాలయం ప్రధాన రహదారిపై అప్పాజీ హడావుడి అమరావతి వెలగపూడి సచివాలయంలో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కొలువుండే సచివాలయంలో ఎలాంటి అనుమతులు లేకుండానే.. ఓ సామాన్య పౌరుడు యథేచ్ఛగా లోపలకు వచ్చి, గుర్రంస్వారీ కూడా చేశాడు. సచివాలయంలో ప్రధాన రహదారిపై హడావుడి చేశాడు. దాదాపుగా సీఎం ఛాంబర్ సమీపంలోకి వెలగపూడి గ్రామానికి చెందిన కారుమంచి అప్పాజీ గుర్రంపై వచ్చాడు. సచివాలయంలోకి రావాలంటే ముందుగా మెయిన్ గేటు వద్ద ఉన్న సిబ్బంది చెక్ చేసిన తర్వాతే ఎవరినైనా లోపలికి అనుమతి ఇస్తారు. అలాంటిది ఒక సామాన్య వ్యక్తి స్వేచ్ఛగా వీవీఐపీలు ఉండే ప్రదేశంలో తిరిగాడంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మావోయిస్టుల నుంచి ప్రమాదం పొంచి ఉందని అనేకసార్లు ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు కూడా చేశారు. గతంలో రాజధాని ప్రాంతంలో ఒక మహిళా మావోయిస్టును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన భద్రతా సిబ్బంది మాత్రం సచివాలయంలో పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పాజీ సచివాలయం ప్రాంగణంలో గుర్రంపైన తిరగడాన్ని కాస్తంత ఆలస్యంగా గమనించిన భద్రతా సిబ్బంది.. అతడిని బయటకు పంపేశారు. -
వెలగపూడి నుంచి అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభం
అమరావతి: వెలగపూడి నుంచి ఏపీ అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వెలగపూడి చేరుకున్న అసెంబ్లీ ఉద్యోగులకు స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్వాగతం పలికారు. అసెంబ్లీ భవనంలో సీటింగ్ తదితర సౌకర్యాలను వారిద్దరూ పరిశీలించారు. కాగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సదుపాయాల కోసం వచ్చే నెల అదనంగా రూ. 50 వేలు మంజూరు చేయనున్నట్లు యనమల చెప్పారు. -
డిసెంబర్ 1 న ఏపీ కేబినెట్ భేటీ
-
డిసెంబర్ 1 న ఏపీ కేబినెట్ భేటీ
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం డిసెంబర్ 1 న సమావేశం జరగనుంది. వెలగపూడిలోని నూతన సచివాలయంలో ఒకటో తేదీన మధ్యాహ్నం మంత్రివర్గం భేటీ కానుంది. సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు ఇంకా తెలియరాలేదు. కాగా కొత్త సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరగడం ఇదే తొలిసారి. -
వెలగపూడిలో ఏసీబీ తొలిదాడి
-
వెలగపూడిలో ఏసీబీ తొలిదాడి
సాక్షి, అమరావతి: వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తొలిసారిగా దాడి చేసింది. హోం శాఖ సెక్షన్ అధికారి కె.శ్రీనాథ్ శుక్రవారం రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.గుజరాత్‌తో పాటు సుమారు ఏడు రాష్ట్రాల్లో సెక్యూరిటీ ఏజెన్సీలు నిర్వహిస్తున్న సంస్థ ఏపీలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. అందుకు రాష్ట్ర హోంశాఖ అనుమతి ఇవ్వాలి. ఇందుకు తనకు రూ.50 వేలు లంచం ఇవ్వాలని సెక్షన్ అధికారి శ్రీనాథ్ వేధిస్తున్నాడంటూ శివ ఏజెన్సీస్ ప్రతినిధి ఎస్.గంగూలీ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు, విజయవాడ ఏసీబీ డీఎస్పీలు దేవానంద్ శాంతో, వాసంశెట్టి గోపాలకృష్ణ సిబ్బందితో కలసి శుక్రవారం దాడి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సచివాలయంలో సంచార రైతు బజార్
అమరావతి: వెలగపూడి సచివాలయంలో సంచార రైతు బజార్ ను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. సచివాలయం ఉద్యోగుల కోసం వారానికి మూడు రోజుల పాటు ఈ సంచార రైతు బజార్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సదుపాయం పట్ల మహిళా ఉద్యోగులు సంతృప్తిని వ్యక్తం చేశారు. రూ.2.5 లక్షలతో కూరగాయల వాహనం కొనుగోలుకు వడ్డీ లేని రుణంతో ఐదేళ్ల కాల పరిమితితో చెల్లించే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని పుల్లారావు తెలిపారు. -
సచివాలయంలో సివిల్ డిస్పెన్సరీ
హైదరాబాద్: వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సివిల్ డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రం విడిపోక ముందు హైదరాబాద్ సచివాలయంలో డిస్పెన్సరీ ఉండేది. వెలగపూడిలోని ఏపీ సచివాలయానికి కొత్త డిస్పెన్సరీ అవసరమైంది. అత్యవసర వైద్యంలో భాగంగా ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఇద్దరు అటెండర్లు, ఒక స్వీపర్‌తో మొత్తం తొమ్మిదిమంది ఈ డిస్పెన్సరీలో విధులు నిర్వహిస్తారు. డిస్పెన్సరీలో సచివాలయ సిబ్బందికి వివిధ రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉంటాయి. సామాజిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో వైద్యం పొందే అవకాశం ఉంటుంది. సచివాలయంలో రెండు వేల మంది సిబ్బంది ఉండటంతో పాటు పలువురు అధికారులు కూడా ఇక్కడకు వచ్చివెళ్తుంటారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ డిస్పెన్సరీ పని చేస్తుంది. కాగా ఈ డిస్పెన్సరీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ పరిధిలోకి వస్తుంది. తాజాగా ఏర్పాటు చేయనున్న డిస్పెన్సరీకి సిబ్బందిని కూడా వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న వారినే డెప్యుటేషన్ మీద నియమించనున్నట్టు తెలిసింది. -
వెలగపూడి రహదారులకు మోక్షం
* సీఎం నివాసం నుంచి కరకట్ట, వెంకటపాలెం వరకు విస్తరణ * యుద్ధ ప్రాతిపదికన పనులు * పనుల్లో నిమగ్నమైన సీఆర్డీఏ అధికారులు సాక్షి, అమరావతి బ్యూరో: నవ్యాంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానికి వెళ్లే రహదారుల విస్తరణ, సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల రాజధాని ప్రాంతం వెలగపూడికి చేరుకునేందుకు ఉన్న రహదారులన్నింటినీ సుందరీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి, పెనుమాక, మందడం, వెలగపూడి మార్గాన్ని సుందరీకరించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వారంలో రెండుమూడు రోజులపాటు రాజధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళుతుండటంతో పనిలో పనిగా సీఎం నివాసం నుంచి కరకట్ట, వెంకటపాలెం మీదుగా వెలగపూడి చేరుకునే రహదారినీ విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా కరకట్టతోపాటు వెంకటపాలెం రహదారికి ఇరువైపులా విస్తరణ పనులు చేపట్టారు. మురుగు కాలువలను శుభ్రం చేస్తున్నారు. ఆయా రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు. వాస్తవానికి రాజధాని వెలగపూడి ప్రాంతానికి సీఎం చంద్రబాబు ఉండవల్లి, పెనుమాక, మందడం, వెలగపూడి మార్గంలో వెళ్తారు. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతోపాటు, ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు పలువురు మంత్రులకు చెందిన కార్యాలయాలు ప్రారంభం కావడం.. సచివాలయ సిబ్బంది సైతం పూర్తిస్థాయిలో ఇక్కడకు తరలిరావడంతో ఆయా రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. వాహన రాకపోకలు అధికంగా ఉండటంతో దుమ్మూధూళితో రహదారులన్నీ కాలుష్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రహదారులను విస్తరించించాలని నిర్ణయించడంతో సీఆర్డీఏ అధికారులు శరవేగంగా పనులు నిర్వహిస్తున్నారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ మల్లికార్జున ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. -
వెలగపూడిలో ఉద్యోగుల వెతలు
సీఎస్ కార్యాలయం సిద్ధం చేయని సీఆర్డీఏ సీఎస్, సీఎం కార్యాలయాల పూర్తికి మరో నెల పడుతుంది పనులు జరుగుతుండటంతో దుమ్ము, ధూళితో ఉద్యోగులు సతమతం సాక్షి, హైదరాబాద్: వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగుల పరిస్థితి విచిత్రంగా ఉంది. ఒక పక్క పనులు కొనసాగుతుంటే.. మరోపక్క విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీంతో దుమ్ము, ధూళితో ఉద్యోగులు సతమతం అవుతున్నారు. తాత్కాలిక సచివాలయం పనులు పూర్తి కాకుండానే హడావుడిగా శాఖలను ప్రభుత్వం తరలించడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. సచివాలయంలో కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు సీఎస్ కార్యాలయం పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈ నెల 11వ తేదీ కల్లా తన కార్యాలయం పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి టక్కర్.. సీఆర్డీఏకు అంతకు నెలరోజుల ముందే చెప్పారు. కానీ ఆ సమయానికి పూర్తి కాకపోవడంతో ముహూర్త సమయానికి సీఎస్ తన కార్యాలయానికి వెళ్లలేదు. అలాగే ముఖ్యమంత్రి చాంబర్ మాత్రమే సిద్ధం చేసిన అధికారులు.. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు చాంబర్లు పూర్తి చేయలేదు. సీఎస్‌తో పాటు సీఎం కార్యాలయ అధికారుల చాంబర్లు పూర్తికావడానికి మరో నెల రోజులు పడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పొలాల్లో సచివాలయ భవనాలను నిర్మించడంతో నల్లటి పురుగులు కార్యాలయాల్లోకి వస్తున్నాయి. ఆ పురుగులు విడుదల చేసే ఒకరకమైన కంపును ఉద్యోగస్తులు భరించలేకపోతున్నారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లే సరికి పెద్ద సంఖ్యలో ఈ నల్ల పురుగులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఏ శాఖ కార్యాలయానికి ఒక్క ల్యాండ్ ఫోను కూడా లేదు. ఆ ఫోన్లు రావడానికి మరో నెల పడుతుందంటున్నారు. టాయిలెట్లు సరైన నిర్వహణ లేక దుర్వాసన వస్తున్నాయి. ఇక క్యాంటీన్లో భోజనానికి వెళితే క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. అసలు వెలగపూడి సచివాలయానికి పోస్టల్ పిన్‌కోడ్ కూడా లేదు. దీనికోసం ఎటువంటి చర్యలను చేపట్టలేదు. -
ఆ హామీ ఇచ్చిన మాట వాస్తవమే కానీ ..
అమరావతి: నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మాట వాస్తవమే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కానీ ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నిరుద్యోగ భృతికి బదులు ఉపాధి అవకాశాలు కల్పించాలని భావిస్తున్నామని చెప్పారు. ఆదివారం వెగలపూడిలోని సచివాలయంలో నాలుగో బ్లాక్‌లో అచ్చెన్నాయుడు తన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... స్వరాష్ట్రం నుంచి పరిపాలన సాగించడం సంతోషంగా ఉందన్నారు. కార్మిక శాఖను కార్మిక సంక్షేమ శాఖగా మార్చామని తెలిపారు. చంద్రన్న బీమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. -
‘అసెంబ్లీ’కి మళ్లీ మార్పులు
సాక్షి, అమరావతి: వెలగపూడిలో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనంలో మళ్లీ మార్పులు చేయనున్నారు. స్పీకర్ కోడెల ఆమోదం తెలిపిన అసెంబ్లీ భవనం డిజైన్‌లో బుధవారం సీఎం చంద్రబాబు పలు మార్పులు సూచించారు. ప్రస్తుతం 175 మంది ఎమ్మెల్యేలు కూర్చొనే విధంగా అసెంబ్లీ హాలు నిర్మాణం జరుగుతోంది. హాలును మరింత పెద్దది చేయాలని, మరికొన్ని మార్పులు చేయాలని తాజాగా ఆదేశించారు. కాగా, రాజధానిలోని రోడ్లు సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. -
రేపు సచివాలయంలోకి సీఎం
ఉదయం 8:09 గంటలకు ముహూర్తం ఒకటో బ్లాకు మొదటి అంతస్తులో చాంబర్ సిద్ధం సాక్షి, అమరావతి: వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు ఉదయం 8 గంటల 9 నిమిషాలకు శాస్త్రోక్తంగా అందులోకి అడుగుపెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. సచివాలయ భవన సముదాయంలోని ఒకటో బ్లాకు మొదటి అంతస్తులో ఈ కార్యాలయం ఉంది. సీఎం చాంబర్, సమావేశ మందిరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఒకేచోట ఏర్పాటు చేశారు. విజయదశమి తర్వాత సచివాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తానని ముఖ్యమంత్రి కొద్దిరోజుల క్రితం చెప్పడంతో అప్పటినుంచి ఆగమేఘాల మీద పనులు చేసి ఎట్టకేలకు పూర్తయిందనిపించారు. ఇటీవల సీఎం ఒకసారి చాంబర్‌ను సందర్శించి పలు మార్పులు సూచించడంతో కొన్ని గోడలను పగులగొట్టారు. భద్రతాపరంగా ఉన్నతాధికారులు చేసిన కొన్ని సూచనలకు అనుగుణంగా కూడా మార్పులు చేశారు. చిన్న చిన్న పనులు మినహా దాదాపు పూర్తి కావడంతో ప్రారంభించడానికి రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సచివాలయంలో చాంబర్‌ను ప్రారంభించిన తర్వాత కూడా దాన్ని కొనసాగించనున్నారు. ఇలావుండగా దేవాదాయ శాఖ కార్యాలయాన్ని కూడా ఈ నెల 12వ తేదీనే ఆ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే పలు శాఖలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
వెలగపూడి రియాల్టి షో
-
ఉద్యోగులతో కళకళలాడిన సచివాలయం
-
ఉద్యోగులతో కళకళలాడిన సచివాలయం
- 30 శాఖల ఉద్యోగులు రాక - స్వాగతం పలికిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు - దారివెంట పలు చోట్ల ఉద్యోగులకు స్కూలు పిల్లల స్వాగతం - ప్రెస్ వాహనాలు సచివాలయంలోపలికి అనుమతించని పోలీసులు సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగులతో వెలగపూడిలోని నూతన తాత్కాలిక సచివాలయం సోమవారం కళకళలాడింది. ఉదయం నుంచి ఉద్యోగులు డిపార్టుమెంట్స్ వారీగా సచివాలయానికి వచ్చారు. మొత్తం 33 ప్రభుత్వ శాఖలు ఉండగా అందులో 30 శాఖలు ఈరోజు నూతన సచివాలయంలో అడుగుపెట్టాయి. వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖలు రాలేదు. ఆయా శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు తమ చాంబర్లలో కాలుమోపారు. కొందరు సీట్లలో కూర్చోగా మరికొందరు కార్యాలయాలు పరిశీలించి సరిపెట్టారు. కొన్ని చోట్ల పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సచివాలయ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్న కంప్యూటర్ల బిగింపు ఇంకా పూర్తి కాలేదు. దీంతో చాలా మంది ఉద్యోగులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులకు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వెలగపూడికి వస్తున్న ఉద్యోగులకు దారి మధ్యలో ఉండే స్కూళ్ళ విద్యార్థినీ విద్యార్థులు ప్లేకార్డులు పట్టుకొని వెల్కం చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్‌లు సచివాలయానికి వచ్చారు. యనమల రామకష్ణుడు తమ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఎంతమంది వచ్చారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. మొత్తం సచివాలయ ఉద్యోగులు సుమారు 1500 మంది వరకు సోమవారం సచివాలయానికి చేరుకున్నారు. మంత్రులు ఒకచోట... కార్యదర్శులు మరోచోట... మొత్తం ఐదు బ్లాక్‌లు సచివాలయానికి నిర్మించారు. ఒక్కోబ్లాక్ విడివిడిగా ఉన్నాయి. ఒక బ్లాక్‌లో నుంచి మరో బ్లాక్‌కు నడిచి వెళ్ళాలంటే కనీసం పావుగంట పడుతుంది. ఒక బ్లాక్‌లో మంత్రి పేషీ ఉంటే మరో బ్లాక్‌లో కార్యదర్శి కార్యాలయం ఉంది. ఉద్యోగుల మరోచోట ఉన్నారు. ఇలా ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఉండటంతో వీటిని సరిచేసే కార్యక్రమంలో కన్స్ట్రక్షన్ వింగ్ నిమగ్నమైంది. మంత్రి పేషీ వద్దే సెక్రటరీ చాంబర్ ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో మార్పులకు శ్రీకారం చుట్టారు. పోలీసుల ఆంక్షలు పోలీసులు విజయవాడ నుంచి వెలగపూడి సచివాలయం వరకు రోడ్డు వెంట ఉన్నారు. వెంకటపాలెం, మందడంలో పోలీసుల ఆంక్షలకు స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. మందడంలో కొందరు ప్రజలు పోలీసు చర్యలు నిరసిస్తూ ఆందోళనకు దిగారు. తర్వాత పోలీసులు వారికి సర్థిచెప్పారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు చెందిన జర్నలిస్ట్‌ల వాహనాలు లోపలికి అనుమతించలేదు. హైదరాబాద్‌లోనే వాహనాలు లోపలికి అనుమతిస్తున్నారని అడిగినా వారు పట్టించుకోలేదు. కాంపౌండ్‌వాల్ బయటనే వాహనాలు ఆపి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ప్రధాన ద్వారం వద్ద చెక్‌చేసి పంపించినా లోపల ప్రతి బ్లాక్‌లోనూ పోలీసులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఉద్యోగులు సైతం పోలీసుల బారిన పడక తప్పలేదు. ఐడీ కార్డులు చూపించినా పలు ప్రశ్నలు వేస్తూ కనిపించారు. మంత్రులకు, కొంతమంది ఉన్నతాధికారులకు సెక్యూరిటీ ఉన్న వారు కాస్త హడావుడి చేశారు. భోజన ఏర్పాట్లు సీఆర్డీఏ వారు ఉద్యోగులకు భోజన ఏర్పాట్లు చేశారు. అయితే భోజనం అందరికీ సరిపోదని, అక్కడ ఎక్కువ మంది జనం ఉన్నారని భావించిన కొన్ని శాఖల వారు నేరుగా భోజనం తెప్పించుకున్నారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఈ ఏర్పాట్లు పరిశీలించారు. ఉద్యోగులతో కలివిడిగా తిరిగారు. మీడియాతో మాట్లాడిన పత్తిపాటి వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు కాసేపు మీడియాతో మాట్లాడారు. సచివాలయ విషయం వదిలిపెట్టి రుణమాఫీ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిలు రాజకీయాలు చేస్తున్నారని, తాము రైతు రుణాలు రద్దు చేసినా చేయలేదని రైతులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. -
తాత్కాలిక సచివాలయంలో మళ్లీ కూల్చివేతలు
-
సీటు ఎక్కడో తెలియక ఉద్యోగుల అవస్థలు
అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ఏర్పాట్లు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. కంప్యూటర్లు, కుర్చీలను ఇంకా ఏర్పాటు చేయలేదు. ఎవరి సీటు ఎక్కడో తెలియక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. లగేజీలతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులు సోమవారం విధులకు హాజరయ్యారు. భవనాల్లో పనులు ఇంకాకొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల హడావుడి కనిపిస్తుందే గానీ పాలనకు సంబంధించి పనులేవీ పూర్తి కాలేదు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఛాంబర్ మినహా తాత్కాలిక సచివాలయంలో ఏ ఒక్క ఛాంబర్ కూడా పూర్తి కాలేదు. మొదటి భవన నిర్మాణ పనులను ఇటీవల ప్రారంభించారు. మిగిలిన ఐదు భవనాల్లో లోపల, బయట పనులు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఫైళ్లు, కంప్యూటర్లు ఎక్కడివి అక్కడే కనిపిస్తున్నాయి. లోపల అద్దాలు, వైరింగ్ పనులు నడుస్తున్నాయి. బ్లాక్‌ల ముందు రోడ్లు, డివైడర్ పనులు పూర్తి కాలేదు. అండర్ డ్రెయినేజీ పనులు అసంపూర్తిగా కనిపిస్తున్నాయి. మంచినీటి సరఫరా పనులు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తాత్కాలిక సచివాలయం వద్ద పరిస్థితి గందరగోళంగా కనిపిస్తోంది. ప్రహరీ నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. -
వెలగపూడికి కార్యాలయాల తరలింపు ముమ్మరం
-
వెలగపూడిలో 3 నుంచి పూర్తి స్థాయి విధులు
* భవనాలు, అంతస్తులు, గదుల వారీగా శాఖలకు కేటాయింపు * ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్/అమరావతి: ఏళ్ల తరబడి హైదరాబాద్ సచివాలయంతో పెనవేసుకున్న అనుబంధం వచ్చే నెల 3వ తేదీ నుంచి తెగిపోతోంది. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. ఇన్నేళ్ల నుంచి హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తూ వెలగపూడి సచివాలయంలో పనిచేసేందుకు వెళ్లిపోతున్న ఉద్యోగులు.. ఇందులో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇక్కడే పనిచేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. అక్టోబర్ 3 నుంచి వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో పూర్తి స్థాయి విధులు నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ జీవో జారీ చేశారు. ఈ జీవోతోపాటు వెలగపూడి సచివాలయ భవనాల్లో శాఖల వారీగా గదులను అధికారులకు కేటాయించారు. వివరాలివీ.. ఒకటో భవనం గ్రౌండ్ ఫ్లోర్: సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖ అధికారులు, ఉద్యోగులు రెండో భవనం గ్రౌండ్ ఫ్లోర్: మున్సిపల్, హోం, ఇంధన-మౌలిక వసతులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల శాఖ అధికారులు, ఉద్యోగులు రెండో భవనం తొలి అంతస్తు: ఆర్థిక, ప్రణాళికా శాఖల అధికారులు, ఉద్యోగులు మూడో భవనం గ్రౌండ్ ఫ్లోర్: టెలికం, ప్లే స్కూలు, మీ-సేవ, పోస్టాఫీస్, బ్యాంకు, డిస్పెన్సరీ, అసోసియేషన్స్, ఐటీ డేటా సెంటర్, ఎన్ఐసీ, సెంట్రల్ రికార్డు బ్రాంచ్, ఏపీటీఎస్, లైబ్రరీలు మూడో భవనం తొలి అంతస్తు: బీసీ, మైనార్టీ, సాంఘిక, గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ, యువజన సర్వీసు శాఖల అధికారులు, ఉద్యోగులు నాల్గో భవనం గ్రౌండ్ ఫ్లోర్: వ్యవసాయ, పశుసంవర్థక, అటవీ పర్యావరణ, రెవెన్యూ శాఖల అధికారులు, ఉద్యోగులు నాల్గో భవనం తొలి అంతస్తు: ఉన్నత విద్య, ఐటీ, మాధ్యమిక విద్య, జలవనరులు, ఆర్ఎస్ఏడీ శాఖల అధికారులు, ఉద్యోగులు ఐదో భవనం గ్రౌండ్ ఫ్లోర్: వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, కార్మిక, స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులు, ఉద్యోగులు ఐదో భవనం తొలి అంతస్తు: రహదారులు-భవనాలు, విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, డిప్యూటీ పే అండ్ అకౌంట్ ఆఫీస్ అధికారులు, ఉద్యోగులు -
వెలగపూడికి కార్యాలయాల తరలింపు ముమ్మరం
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని వెలగపూడికి కార్యాలయాల తరలింపు ముమ్మరం చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి గుంటూరు జిల్లాలోని వెలగపూడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాలన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు జీఏడీ (సాధారణ పరిపాలన విభాగం) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆర్థికశాఖ ఫైల్ వెలగపూడికి చేరింది. ప్రభుత్వ ఫైళ్ల తరలింపు ఇదే తొలిసారి. కాగా అయిదు భవనాల్లో ప్రభుత్వ శాఖలకు విభాగాలు కేటాయిస్తూ జీవో జారీ అయింది. మొదటి భవనం గ్రౌండ్ ఫ్లోర్లో జీఏడీకి, మిగిలిన నాలుగు భవనాలు అన్ని శాఖలకు ప్రభుత్వం కేటాయించింది. కాగా ఏపీ పాలన వ్యవహారాలకు సంబంధించి హైదరాబాద్‌లో సెంట్రల్ రికార్డ్ రూమ్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
అక్టోబర్ 3.. వెలగపూడి నుంచే పరిపాలన
* అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు * ఫైళ్లు, కంప్యూటర్ల తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని సూచన సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన సాగించాలని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) మంగళవారం అన్ని శాఖల కు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అక్టోబర్ 3వ తేదీని ముహూర్తంగా ఖరారు చేసిం ది. సచివాలయ ఉద్యోగులంతా అక్టోబర్ 3 నుంచి వెలగపూడిలో పనిచేయాల్సి ఉన్నం దున ఫైళ్లు, కంప్యూటర్లను హైదరాబాద్ నుంచి తరలించేందుకు ప్యాకింగ్ చేయాలని జీఏడీ సూచించింది. ఈ నెల 21వ తేదీ నుంచే తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.. హా ఈ నెల 30వ తేదీకల్లా హైదరాబాద్ సచివాలయంలోని ఫైళ్లు, కంప్యూటర్లను వెలగపూడికి తరలించాలి. హా వచ్చే నెల 1, 2 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలైనందున 3 నుంచి పూర్తిస్థాయిలో వెలగపూడి నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు గడువులోగా ఏర్పాట్లను పూర్తిచేసుకోవాలి. హా హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులకు బదిలీ రవాణా భత్యం(టీటీఏ) వర్తిస్తుంది. హా తాత్కాలిక సచివాలయంలో సెంట్రల్ రికార్డ్ సిస్టమ్ (సీఆర్ఎస్)ను ఏర్పాటు చేసిన తర్వాతే హైదరాబాద్‌లో ఉన్న సీఆర్ఎస్ను వెలగపూడికి తరలిస్తారు. ఇందుకు సంబంధించిన పర్యవేక్షణ కోసం జీఏడీ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటవుతుంది. హా హైకోర్టు, లోకాయుక్త, ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) వంటి చట్టబద్ధ సంస్థల వ్యవహారాలను చూసేందుకు ఒక్కో విభాగం నుంచి అవసరాన్ని బట్టి ఒకరిద్దర్ని ఇక్కడే ఉంచేలా జీఏడీ కార్యదర్శి చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు సచివాలయ తరలింపు షెడ్యూల్, మార్గదర్శకాలతో ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
కార్యాలయాల తరలింపుపై సర్క్యూలర్ జారీ!
గుంటూరు: అక్టోబర్ 1 నుంచి గుంటూరు జిల్లాలోని వెలగపూడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాలన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడికి కార్యాలయాల తరలింపుపై ఏపీ ప్రభుత్వం అన్ని శాఖలకు సర్క్యూలర్ జారీ చేసింది. ఈ నెల 21 నుంచి 30 లోపు వెలగపూడికి కార్యాలయాలు తరలించాలని ఆదేశించింది. ఏపీ పాలన వ్యవహారాలకు సంబంధించి హైదరాబాద్‌లో సెంట్రల్ రికార్డ్ రూమ్ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వెలగపూడికి కార్యాలయాల తరలింపును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఇక వెలగపూడి నుంచే యనమల పాలన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం వెలగపూడి నుంచి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తన శాఖ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. గురువారం ఆర్ధిక శాఖ కార్యాలయాన్ని ప్రారంభించినంతరం ఇక అక్కడి నుంచే వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. పలువురు మంత్రులు వెలగపూడిలో కార్యాలయాలు ప్రారంభించినా అప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించారు తప్ప మళ్లీ తిరిగి సచివాలయానికి వెళ్లిన దాఖలాలు లేవు. గురువారం ఉదయం రాష్ట్ర పట్టణాభివృద్ధి పరిపాలనాపరమైన సంస్కరణలపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశాన్ని యనమల తన ఛాంబర్లో నిర్వహిస్తారు. ఈ సమావేశానికి మంత్రులు యనమల, కె.అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, కిమిడి మృణాళిని హాజరవుతారు. పట్టణాభివృద్ధి శాఖ అధికారులు కూడా పాల్గొంటారు. జీఎస్టీ, రెవెన్యూ సిద్ధంగా ఉన్నామా లేదా, ఆదాయం ఎలా పెంచుకోవాలి అనే అంశాలపై చర్చిస్తారు. అనంతరం ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకూ సమకూరిన ఆదాయం, భవిష్యత్‌లో ఇంకా రావాల్సిన ఆదాయంతో పాటు అందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారు. కేంద్రం జీఎస్టీ బిల్లును ఆమోదించిన అనంతరం రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై కూడా మంత్రి సమీక్షించనున్నారు. ఆడిట్ శాఖతో పాటు రైతు, మహిళా ఆర్థిక సహకార సంస్థలపై కూడా యనమల సమీక్షిస్తారు. శుక్రవారం ఉదయం ఏపీ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్టర్స్, వర్కర్స్, ప్రాజెక్టు డైరెక్టర్లతో సమీక్షిస్తారు. పర్యాటక విధానంపై మంత్రివర్గ ఉప సంఘ సమావేశం, జీఎస్టీపై సమీక్ష, నక్సలైట్ సమస్యపై మంత్రివర్గ ఉప సంఘ సమావేశాన్ని యనమల నిర్వహిస్తారు. సెప్టెంబర్ మూడున మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశంలో పరిపాలన, ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. -
వెలగపూడి ‘గూడు’పుఠాణి!
-
వెలగపూడి ‘గూడు’పుఠాణి!
♦ హడావుడిగా కట్టి.. రహస్యంగా కూల్చేశారు ♦ ఇరుకు గదులు, వాస్తుపై మంత్రుల ఫిర్యాదులు ♦ కట్టిన గదులు రహస్యంగా కూల్చివేత ♦ భారీ సెక్యూరిటీ.. గేట్లకు తాళాలు... ♦ అసలే ‘తాత్కాలికం..’ దానికేబోలెడు వ్యయం ♦ మార్పులతో మరింత వృథా ఖర్చు.. ♦ తాత్కాలిక సచివాలయం నుంచి పాలన ఇప్పట్లో లేనట్లే... సాక్షి, అమరావతి: అది అసలే తాత్కాలిక సచివాలయం... దానికే రూ.700 కోట్ల ఖర్చు. అది కూడా హడావుడిగా నిర్మాణం.. అంతా లోపాల మయం. దాంతో అది ఎవరికీ పనికిరాకుండా పోయింది. గదులు ఇరుకుగా ఉన్నాయని, వాస్తుదోషాలున్నాయని మంత్రులు చేస్తున్న ఫిర్యాదులతో ముఖ్యమంత్రి తలబొప్పికట్టింది. అందుకే భారీ మార్పులకు తెరతీశారు. సచివాలయంలోని 2, 3, 4, 5 భవనాల్లో మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కేటాయించిన గదులను కూలదోస్తున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం కోసం లోనికి ఎవరినీ రానివ్వకుండా బయట తాళాలువేశారు. భారీ సెక్యూరిటీ ఏర్పాటుచేశారు. ఈ మార్పులు చేర్పులకు కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కానున్నది. తాత్కాలిక సచివాలయం కోసం ఇన్ని మార్పులు చేయడం, ఇంత పెద్ద ఎత్తున వృథా చేయడం చూసి అధికారులు విస్తుపోతున్నారు. మంత్రుల అసహనం.. ఫిర్యాదులు.. తమకు కేటాయించిన గదులు ఇరుకుగా ఉన్నాయని మంత్రి నారాయణ వద్ద యనమల అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల తరువాత సచివాలయాన్ని సందర్శించిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన గదులలో మార్పులు చేయాల్సిందిగా మంత్రి నారాయణకు ఫోన్లో సూచించినట్లు తెలిసింది. మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిమిడి మృణాళిని, అచ్చెన్నాయుడు, రావెల కిశోర్‌బాబు, పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాసరావు కూడా తమ పేషీలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో భారీ మార్పులు హడావుడిగా చేపట్టిన నిర్మాణాల్లో లోటుపాట్లు ఉన్నాయని మంత్రులు, అధికారులు అసంతృప్తి వ్యక్తం చేయటంతో మార్పులు చేపట్టాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. కృష్ణా పుష్కరాల్లో అంతా బిజీగా ఉంటారు కనుక కూల్చివేసి తిరిగి నిర్మాణాలు చేపట్టేందుకు ఇదే మంచి సమయమని సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం రెండవ భవనంలో మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. అన్ని భవనాలకంటే ముందుగా ప్రారంభించిన ఐదవ భవనంలో పెద్ద ఎత్తున మార్పులకు తెరతీశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఐదవ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిమిడి మృణాళిని, ప్రిన్సిపల్ సెక్రటరీలకు కేటాయించిన గదులన్నింటినీ పగులగొట్టారు. ప్రతి మంత్రికి 225 అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు ఉండేలా మార్పులు చేపట్టారు. దీంతో రెండు గదులు కలిపి ఒక మంత్రికి కేటాయించేందుకు మధ్యలో ఉన్న గోడను పగులగొడుతున్నారు. తాత్కాలిక సచివాలయంలో ఎక్కడెక్కడ గోడలు పగులగొట్టాలో ఇంజనీర్లు మార్క్చేశారు. ఆ గోడలపై ‘టోటల్ రిమూవ్డ్’ అంటూ పేపర్‌పై రాసి అంటించారు. గోడలు కూల్చిన ప్రాంతంలో డోర్లు, వాష్‌బేషిన్, బాత్ రూంలు ఎక్కడెక్కడ ఉండాలో మార్కర్‌తో రాశారు. ఇంజనీర్లు సూచించిన చోట్ల గోడలను కార్మికులు పగులగొడుతున్నారు. ఇవన్నీ బయటకు తెలియకుండా ఉండేందుకు ఆయా భవనాలకు తాళాలు వేసి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎవరినీ లోనికి పంపొద్దని గట్టిగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. గోడలు కూల్చి తిరిగి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు ఖర్చుచేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. భవనాలకు ఇప్పుడు చేస్తున్న భారీ మార్పులు చూస్తుంటే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి ప్రభుత్వ పాలన ఇప్పుడే ప్రారంభమయ్యే అవకాశమే లేదని తేలిపోయింది. ప్రభుత్వ హడావుడి నిర్ణయాలతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. -
వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో మార్పులు
-
వెలగపూడి సచివాలయంలో మార్పులు
అమరావతి: వాస్తు లోపాలంటూ వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మరోసారి మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సచివాలయంలో రెండో బ్లాక్‌తో పాటు అయిదో బ్లాక్‌లోని మంత్రుల పేషీలను కార్మికులు పగులగొడుతున్నారు. రెండో బ్లాకులో ముగ్గురు మంత్రులు, ఐదో బ్లాకులో ముగ్గురు మంత్రులకు పేషీలను కేటాయించారు. అయితే ఇవి ఇరుకుగా ఉన్నాయంటూ మంత్రులు పేషీలను తిరస్కరించారు. దీంతో గోడలు కూల్చివేసి పేషీల విస్తీరణం పెంచుతున్నారు. దీంతో ఇదివరకే ప్రారంభించిన పేషీల్లో మార్పులు చేస్తున్నారు. గోడలు కూల్చివేసి పేషీల విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. పేషీల్లో వాస్తు లోపాలు ఉన్నాయని, దానికి అనుగుణంగానే పలు పేషీల గోడలను అధికారులు పగులగొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల పేషీల ప్రారంభోత్సవాలు మరింత ఆలస్యం కానున్నాయి. ప్రతి మంత్రికి అదనంగా 200 అడుగుల కార్యాలయాలు కేటాయిస్తున్నారు. దీనివల్ల సచివాలయ నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. -
వాయిదాల వెలగపూడి
-
‘తరలింపు’ ముహూర్తం మళ్లీ వాయిదా
వచ్చే నెల 4 -10వ తేదీ మధ్యలో ముహూర్తం! సాక్షి, హైదరాబాద్ : వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయానికి శాఖల తరలింపు చివరి ముహూర్తం మరోసారి వాయిదా పడింది. ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన మేరకు ఈ నెల 29న సచివాలయ మిగతా శాఖలన్నీ ఉద్యోగులు, అధికారులతో సహా హైదరాబాద్ నుంచి వెలగపూడికి వెళ్లాల్సి ఉంది. అయితే ఆషాడ మాసంలో వెలగపూడి సచివాలయానికి వెళ్లేందుకు మంత్రులు ససేమిరా అన్నారు. దీనికితోడు అక్కడ కూర్చుని పనిచేసే వాతావరణమే లేకుండా వెళ్లి వెనక్కు వచ్చేయడం ప్రహసనంగా మారుతోందని, ఇప్పటికే రెండు ముహూర్తాల్లో అదే పరిస్థితి అయ్యిందనే భావనను అధికారులు వ్యక్తం చేశారు. కొన్ని రోజుల ఆలస్యం అయినా పరవాలేదని, హడావిడిగా వెళ్లి అభాసుపాలవడం మంచిది కాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4 నుంచి 10వ తేదీ మధ్యలో మళ్లీ ముహూర్తాలు నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
R&B కార్యలయం ప్రారంభించిన మంత్రి
-
సచివాలయం నిర్మాణ పనుల్లో ప్రమాదం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో మరోసారి ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భవనం పిట్టగోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో గాయపడిన కార్మికులు రాంగోపాల్, ధర్మేంద్ర, జయరామ్, కిషోర్ చౌదరిలను ఎన్నారై ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే సచివాలయం నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదాల్లో ఒకరు మృతిచెందారు. తాజా ప్రమాదంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సచివాలయ నిర్మాణంలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై సీపీఎం నాయకుడు బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని...వారికి తక్షణమే నష్టపరిహారమివ్వాలన్నారు. కార్మికులకు రక్షణ చర్యలు తీసుకోవాలని బాబురావు ప్రభుత్వాన్ని కోరారు. -
అదంతా మీడియా సృష్టే: నరసింహన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గవర్నర్ నరసింహన్ గురువారం పర్యటించారు. వెలగపూడి వచ్చిన గవర్నర్‌కు సీఎం, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తాత్కాలిక సచివాలయాన్ని చంద్రబాబుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ కొన్ని సమస్యలున్నా ఉద్యోగులు రాజధానికి రావడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు పాత్ర అభినందనీయమన్నారు. తాను కేవలం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మాత్రమే అని, చంద్రబాబే కెప్టెన్ అని ఆయన అ న్నారు. తాను కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం అయ్యానన్నది మీడియా సృష్టేనన్నారు. తాను కూడా ఏపీ సచివాలయానికి వస్తానని, తనకు కార్యాలయం కేటాయించాలని చంద్రబాబును కోరినట్లు చెప్పారు. కొత్త రాజధాని కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయని అన్నారు. కాగా నిన్న చంద్రబాబుతో చర్చలు ఫలప్రదంగా జరిగాయన్నారు. చాలా అంశాలను చంద్రబాబు తన దృష్టికి తీసుకు వచ్చారన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కూర్చుని సమస్యలు పరిష్కరానికి రావాలని గవర్నర్ పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తాత్కాలిక సచివాలయంలో బ్లాక్‌ల నిర్మాణం గురించి గవర్నర్‌కు వివరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా గవర్నర్ ఇచ్చిన సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. -
తాత్కాలిక సచివాలయంలో గవర్నర్, సీఎం
అమరావతి: వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మంత్రులు స్వాగతం పలికారు. సచివాలయ బ్లాక్‌లను గవర్నర్ పరిశీలించారు. చంద్రబాబు నాయుడు బ్లాక్ ల నిర్మాణాలను గవర్నర్ కు వివరించారు. గవర్నర్ ఈ రోజు ఉదయం విజయవాడలో కనకదుర్గ అమ్మవారి, ఆ తర్వాత మంగళగిరిలోని పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పుష్కరాల ప్రారంభం అవుతున్న సందర్భంలో అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. గవర్నర్ ఈ రోజు సాయంత్రం తిరుమల చేరుకుని, వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో గవర్నర్ నరసింహన్‌కు విందు ఇచ్చారు. అంతకు ముందు విజయవాడలోని ఓ హోటల్లో గవర్నర్‌తో చంద్రబాబు 15 నిమిషాలపాటు భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల గవర్నర్‌ను కలిసిన చంద్రబాబు తన నివాసానికి విందుకు రావాల్సిందిగా మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
తాత్కాలిక సచివాలయంలో చంద్రబాబు
అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయ నిర్మాణపు పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం జూన్ 29న లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చైనా పర్యటనలో ఉన్నారు. దాంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఠక్కర్తో పాటు మంత్రి అయ్యన్నపాత్రుడు తాత్కాలిక సచివాలయాన్ని ఆరంభించారు. కాగా మరో రెండు నెలల్లో సెక్రటేరియేట్ పనులు పూర్తి కానున్నాయి. ఆ సమయానికి ఉద్యోగులందరినీ అమరావతికి తరలించనున్నారు. -
వెలగపూడికి శాఖల తరలింపు మళ్లీ వాయిదా
విజయవాడ: వెలగపూడికి రెండో విడత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 5, 15వ తేదీల్లో శాఖలను తరలించాలనుకున్న ముహూర్తం మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. 19న ఐదుగురు మంత్రుల ఛాంబర్లు, 6 శాఖల కార్యాలయాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 19న నాలుగో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌ను ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు అప్పగించనున్నారు. ఇదే తేదీన రెవిన్యూ, పౌరసరఫరాలు, సహకర శాఖ, విపత్తు నిర్వహణ, అటవీ శాఖల కార్యాలయాలను ప్రారంభించనున్నారు. -
'రేపు సాయంత్రం కల్లా డిసైడ్ చేస్తాం'
- హైదరాబాద్‌కు ఏపీ సచివాలయ ఉద్యోగుల తిరుగుప్రయాణం - ఏ శాఖకు ఏ బ్లాక్ అన్నది ఇంకా కేటాయింపు జరగలేదు: మురళీ కృష్ణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమైయ్యారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వెలగపూడికి వెళ్లిన ఉద్యోగులు తాత్కాలిక సచివాలయం భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగులంతా అక్కడి నుంచి తిరుగుప్రయాణమైయ్యారు. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. ఏ శాఖకు ఏ బ్లాక్ అన్నది ఇంకా కేటాయింపు జరగలేదని వెల్లడించారు. రేపు సాయంత్రం కల్లా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పినట్టు తెలిపారు. ఆ తర్వాత ఏపీ సచివాలయ ఉద్యోగులు వారి శాఖలకు వస్తారని మురళీకృష్ణ పేర్కొన్నారు. -
వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం
గుంటూరు : వెలగపూడిలో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి ఠక్కర్, మంత్రి అయ్యన్నపాత్రుడు బుధవారం మధ్యాహ్నం 2.59 గంటలకు తాత్కాలిక సచివాలయాన్నిఆరంభించారు. ఏపీ తాత్కాలిక సచివాలయంలో ఇద్దరు మంత్రుల పేషీలు ప్రారంభమయ్యాయి. సరిగ్గా రెండు గంటల 59 నిమిషాలకు మంత్రులు కిమిడి మృణాళిని, అయ్యన్నపాత్రుడు.....తమ తమ పేషీల్లోకి ప్రవేశించారు. వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ....రిబ్బన్ కట్ చేసి లోపలికి అడుగు పెట్టారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో మంత్రుల కార్యాలయాలను రూపొందించారు. మొత్తం ముగ్గురు మంత్రుల పేషీలు ఇవాళ ప్రారంభమవుతాయని తొలుత ప్రకటించనప్పటికీ మంత్రి కామినేనిశ్రీనివాస్ ఢిల్లీలో ఉన్నందున ఆయన కార్యాలయ ప్రారంభం వాయిదా పడింది. కోలాహలంగా సాగిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమాతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రులతో పాటు ఎస్డీ, హెచ్‌వోడీ కార్యాలయాలు ఆరంభం అయ్యాయి. ఇక గృహ నిర్మాణ, వైద్య, ఆరోగ్య శాఖలకు చెందిన ఉద్యోగులను ఇప్పటికే వెలగపూడికి ఐదు బస్సుల్లో హైదరాబాద్ నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయా శాఖల ఉద్యోగులు కూడా సచివాలయానికి చేరుకున్నారు. కాగా ఉద్యోగుల తరలింపు కొనసాగుతోందని మరో రెండు నెలల్లో సెక్రటేరియేట్ పనులు పూర్తవుతాయని.. అప్పటకి ఉద్యోగులందరినీ అమరావతికి తరలిస్తామని ఏపీ సీస్ ఠక్కర్ స్పష్టం చేశారు. -
వెలగపూడిలో సందడి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం బుధవారం మధ్యాహ్నం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో వెలగపూడిలో సందడి నెలకొంది. నేటి మధ్యాహ్నం 2.59 గంటలకు తాత్కాలిక సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి ఠక్కర్ ప్రారంభించనున్నారు. తొలుత మూడు శాఖల కార్యకలాపాలు ప్రారంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులోభాగంగా పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, వైద్య, ఆరోగ్య శాఖలు తరలించారు. ఆయా శాఖలకు చెందిన ఉద్యోగులను ఇప్పటికే వెలగపూడికి ఐదు బస్సుల్లో హైదరాబాద్ నుంచి వెళ్లిన సంగతి తెలిసిందే. -
అమరావతిలో డీజీపీ కార్యాలయానికి నో బ్లాక్!
తాత్కాలిక సచివాలయంలో ప్రత్యేక బ్లాక్ కోరిన డీజీపీ 2.80 లక్షల చదరపు అడుగులు కావాలని ప్రభుత్వానికి వినతి విజయవాడ: అమరావతిలో డీజీపీ కార్యాలయం ఏర్పాటు సందిగ్ధంలో పడింది. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేకంగా ఒక బ్లాక్ కోరింది. సచివాలయం ఉద్యోగుల తరలింపు, కార్యాలయాల ఏర్పాటుపై పూర్తిగా స్పష్టత రాకపోవడంతో పోలీసుల ప్రతిపాదన పెండింగ్‌లో పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పోలీసు అధికారులు నిమగ్నమయ్యా రు. ఈ క్రమంలో విజయవాడలో డీజీపీ కార్యాలయం ఏర్పాటుచేయడానికి అనువుగా ఉండే భారీ భవన సముదాయాల కోసం అన్వేషిస్తున్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల తరలింపుతోపాటు డీజీపీ కార్యాలయం తరలించాలని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. పోలీసు శాఖ పరంగా విభజన పూర్తికాకపోవడంతో డీజీపీసహా ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోనే కొనసాగుతున్నారు. ఈ పరిణామాల క్రమం లో ముఖ్యమంత్రి విజయవాడలో ఉండడంతో ఉన్నతాధికారులు అందరూ ఎక్కువ రోజులు విజయవాడలోనే కొనసాగుతున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగానే తాత్కాలికంగా డీజీపీ కార్యాలయం విజయవాడలో ఏర్పాటుచేయాలని డీజీపీ జె.వి.రాముడు నిర్ణయిం చా రు. ఈక్రమంలో తాత్కాలిక సచివాల యంలో ఒక బ్లాక్‌ను పూర్తిగా పోలీసులకు కేటాయించాలని నెలకిందట ప్రభుత్వానికి విన్నవించారు. పోలీసుశాఖకు 2.80 లక్షల చదరపు విస్తీర్ణం కేటాయించాలని రాతపూర్వకంగా ప్రభుత్వాన్ని కోరారు. డీజీపీ కార్యాలయంతోపాటు దీనికి అనుబంధంగా ఉండే సుమారు పది విభాగాలను అక్కడ ఏర్పాటుచేయాలని భావించారు. డీజీపీ కార్యాలయంలో అన్ని విభాగాలు కలిపి ఉన్నతాధికారులు, మినిస్టీరియల్ స్టాఫ్ సుమారు 800 మంది వరకు ఉంటారు. డీజీపీ కాకుండా అదనపు డీజీపీలు ఐదుగురు, ఐజీస్థాయి అధికారులు ఆరుగురు, ఎస్సీ, డీఐజీ స్థాయి అధికారులు ఏడుగురు ఉంటారు. కార్యాలయంలో ఏ నుంచి ఈ వరకు సెక్షన్లు, సీఐడీ విభాగం, ఇంటెలిజెన్స్ విభాగం, డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విభాగం, ఏపీఎస్పీ కార్యాలయం, పోలీ సు హౌసింగ్ కార్పొరేషన్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, పోలీసు కమ్యూనికేషన్, కౌంటర్ ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఐఎస్‌డబ్ల్యూ ఇంటెలిజెన్స్, పోలీసు ట్రాన్స్‌పోర్టు, ఫోరెన్సిక్, ప్రింటింగ్, స్టోర్స్ ఇలా పలువిభాగాలు ఉన్నాయి. కార్యాల యా న్ని డీజీపీ కార్యాలయానికి అనుబంధంగా హైదరాబాద్ లో ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. తాత్కాలికంగా డీజీపీ కార్యాలయాన్ని సచివాలయంలో ఏర్పాటుచేస్తే డీజీపీతోపాటు ఈ శాఖలన్నీ తరలివచ్చేలా ఏర్పాటుచేశారు. ప్ర భుత్వం నుంచి స్పష్టత రాకపోవడం, నిర్మిస్తు న్న తాత్కాలిక సచివాలయం పూర్తిగా సచివాల య ఉద్యోగులకు సరిపోనుండటంతో పోలీసులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. ప్రత్యామ్నాయఅన్వేషణలోనిమగ్నమయ్యారు. విజయవాడలో అన్వేషణ విజయవాడలో ఎకరంపైగా విస్తీర్ణంలో ఉన్న అద్దె భవనాన్ని పోలీసు అధికారులు అన్వేషిస్తున్నారు. కొద్దిరోజుల్లో పుష్కరాలు రానుం డటం, విజయవాడలోనే సీఎం కార్యకలాపాలు ఉండటంతో అద్దె భవనంలో అయి నా కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. విజయవాడతోపాటు భవానీపురం, శివారు ప్రాంతాలైన పోరంకి, పెనమలూరు, రామవరప్పాడుల్లో అన్వేషిస్తున్నారు. -
తాత్కాలిక శాసనసభలో అన్ని వసతులు ఉండాల్సిందే
హైదరాబాద్ :సాధారణ పరిపాలనా వ్యవస్ధల అవసరాలు, చట్ట సభలకు సంబంధించిన కార్యకలాపాలు భిన్నంగా ఉంటాయని తదనుగుణంగా తాత్కాలిక శాసనసభ రూపుదిద్దుకోవలసి ఉందని రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేసారు. కేవలం శాసనసభ నిర్మాణం మాత్రమే కాకుండా దాదాపు 200 మంది ఉద్యోగులు సభ అవసరాలకు అనుగుణంగా పనిచేయగలిగే వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మంగళవారం స్పీకర్‌తో సీఆర్డీఏ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వెలగపూడిలో ఇప్పటికే రూపొందించిన శాసనసభ నిర్మాణ నమూనాను పరిశీలించిన సభాపతి సభ నిర్వహణకు కావలసిన వసతుల గురించి చర్చించారు. తాత్కాలికమే అయినా ప్రస్తుతం వెలగపూడిలో చేపట్టే నిర్మాణాలలో అన్ని వసతులు ఉండవవలసిందేనని కోడెల సూచించారు. క్యాంటిన్‌తో పాటు లైబ్రరీ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. చట్టసభలకు ప్రధానంగా గ్రంధాలయ అవశ్యకత ఉందని, తదనుగుణంగా విశాలమైన ఏర్పాటు ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్ అవసరాలకు వినియోగిస్తున్న శాసనసభ భవనాలకు కూలంకషంగా పరిశీలించాలని, తద్వారా మరింత మెరుగైన వసతులతో తాత్కాలిక సచివాలయం ఎలా నిర్మించాలన్న దానిపై అవగాహనకు రావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, సీఆర్డీఏ సీనియర్ ఆర్కిటెక్చర్ రాహుల్ తదితరులు పాల్లొన్నారు. -
గడువు గండం
ఈ నెల 27 నాటికి ఉద్యోగులు తరలిరావాలని సీఎం ఆదేశం మిగిలింది ఆరు రోజులే ఒక్క భవనం కూడా పూర్తికాని తాత్కాలిక సచివాలయం మరో రెండు నెలలు పడుతుందంటున్న ఇంజనీరింగ్ అధికారులు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడి వెలగపూడిలో ప్రభుత్వం రూ.600 కోట్ల వ్యయంతో 45 ఎకరాల్లో నిర్మిస్తున్న తాత్కాలిక సచివా లయ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రధానమైన ఆరు బ్లాకుల నిర్మాణంలో ఒక్కటీ ఇప్పటివరకూ పూర్తికాలేదు. ఆరో బ్లాకు నిర్మాణం ఇంకా పునాదుల్లోనే ఉంది. తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రెయిన్ల పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరో రెండు నెలల వరకు పనులు పూర్తయ్యే అవకాశం లేదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. సీఎం కార్యాలయం, సీఎస్, సాధారణ పరిపాలన విభాగం, న్యాయశాఖ, సీఎం హామీల పరిష్కారం కోసం ఈ బ్లాక్‌ను కేటాయించారు. ప్రస్తుతం ఆరు బ్లాకులు పూర్తిచేయలేమని ఇంజినీర్లు చెప్పడంతో మొదటి బ్లాక్ అయినా పూర్తిచేసి ఈనెల 27 నాటికి కార్యక్రమాలు నిర్వహిం చాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అయితే, మొదటి బ్లాకు కూడా 27 నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం 50శాతం పనే అయ్యింది. లోపల పూర్తిస్థాయిలో గదుల నిర్మాణం జరగలేదు. ఓపక్క ఫ్లోరింగ్, మరోపక్క సీలింగ్, ఇంకోవైపు వైట్‌వాష్, వైరింగ్ పనులు చేస్తున్నారు. అదేవిధంగా.. రెండో అంతస్తులో గోడలు కాకుండా ఫైబర్ ప్లేట్స్‌తో చిన్నచిన్న గదులు ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే గానీ ఫ్యాన్లు, సెంట్రల్ ఏసీ పనులు ప్రారంభించే అవకాశమే లేదు. రహదారులు ఛిద్రం తాత్కాలిక సచివాలయానికి వెళ్లడానికి ఇప్పటివరకు సరైన రహదారి లేదు. ప్రస్తుతం మందడం నుంచి సింగిల్ లైన్ రోడ్డు ఉంది. అది కూడా గుంతలు పడి దర్శనమిస్తోంది. ఒక వాహనం వస్తే.. ఎదురుగా వస్తున్న వాహనం తప్పించుకు వెళ్లడానికి ఇబ్బందికర పరిస్థితి. వర్షం వస్తే రోడ్డుకిరువైపులా వాహనం ఇరుక్కునే అవకాశం ఉంది. ఈ ఒక్క రోడ్డు తప్ప సచివాలయానికి వెళ్లటానికి మరో మార్గం లేదు. మంగళగిరి నుంచి ఐనవోలు మీదుగా సచివాలయానికి రహదారి ఉన్నా ఛిద్రమై కనిపిస్తోంది. ఇటీవల ప్యాచ్ వర్క్ పనులు చేపట్టినా ప్రయోజనం లేదు. సచివాలయ ప్రాంగణంలో గ్రావెల్ రోడ్లు శరవేగంగా చేస్తున్నారు. గ్రావెల్ పనులు తాత్కాలిక సచివాలయ పనులు పూర్తయ్యాక తారురోడ్డు లేదా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఆ పనులు ప్రారంభం కావడానికి మరి కొన్నిరోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం కురిసిన వర్షాలకు సచివాలయ ప్రాంగణమంతా బురదగా మారింది. హోంశాఖ, విద్యుత్, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మిస్ట్రేషన్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వశాఖ కార్యాలయాలు, ఆర్థికశాఖ, ప్రణాళికా విభాగం ఇందులో ఉంటాయి. ఈ బ్లాక్‌లో పిల్లర్లు, శ్లాబ్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనుల్లో ఇప్పుడిప్పుడే గదుల నిర్మాణం ప్రారంభించారు. మిగిలిన ఏ పనీ ప్రారంభం కాలేదు. ఇప్పుడే పనులు ప్రారంభించినా నెలరోజులు పడుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. టెలికం, బీఎస్ఎన్ఎల్ సర్వర్, ఏపీ టీఎస్ సచివాలయ సపోర్ట్ యూనిట్, పే అండ్ అకౌంట్స్, మీసేవ, ఈసేవ, రైల్వే, బస్ రిజర్వేషన్ కౌంటర్లు, పోస్టాఫీసు, బ్యాంక్, రెండు ఏటీఎంలు, షాపులు, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయం, ప్లే స్కూల్, మూడు పడకల డిస్పెన్సరీ, రిక్రియేషన్, లైబ్రరీ, రెస్టారెంట్, సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ, మహిళా శిశు సంక్షేమం, స్కిల్ డెవలప్మెంట్, యువజన సంక్షేమం, టూరిజం, సాంస్కృతిక శాఖలు ఇందులో ఉంటాయి. ఇప్పటివరకు ఈ బ్లాక్‌లో పిల్లర్లు, శ్లాబులు మాత్రమే పూర్తిచేశారు. గోడల నిర్మాణం ప్రారంభించారు. గదుల నిర్మాణం పూర్తిచేయాలి. పూత, ఫ్లోరింగ్, సీలింగ్, వైరింగ్, వైట్‌వాష్, వాష్‌రూమ్‌లు పూర్తి చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తికావాలన్నా నెలరోజులు పడుతుంది. రెవెన్యూ, రెవెన్యూ విపత్తుల శాఖ, ఎన్విరాన్మెంట్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం, సహకార శాఖ, పశుసంవర్థక, డెయిరీ, మత్స్య, పౌరసరఫరాల శాఖతో పాటు ఐదుగురు మంత్రులు, ఇద్దరు సలహాదారు కార్యాలయాలు ఇందులో ఉంటాయి. వాటర్ రిసోర్సెస్, రెయిన్ షాడో ఏరియా డెవలప్మెంట్, పాఠశాల, ఉన్నత విద్య, ఐటీ డేటా సెంటర్ ఏర్పాటుచేస్తారు. ఈ నాల్గో బ్లాక్‌లో గదుల నిర్మాణం జరుగుతోంది. మిగిలిన పనులన్నీ పూర్తికావాలంటే సుమారు నెలరోజులు పట్టే అవకాశం ఉంది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, కార్మిక, ఉపాధి, గృహ నిర్మాణ శాఖలు, ట్రాన్స్పోర్ట్, రోడ్లు భవనాల శాఖ, విజిలెన్స్ కమిషన్, కాన్ఫరెన్స్ హాలు ఉంటాయి. బ్లాక్‌లో గదుల నిర్మాణం 60 శాతం పూర్తయ్యింది. మిగిలిన సగంలో ఓవైపు పనులను రెండురోజుల కిందటే ప్రారంభించారు. ఈ బ్లాక్‌లో మొత్తం పనులన్నీ పూర్తిచేసి జులై చివరినాటికి అందజేయగలమని ఇంజినీర్లు చెబుతున్నారు. అసెంబ్లీ, స్పీకర్ కార్యాలయాలకు వారం కిందటే పునాదులు వేశారు. ఐదు బ్లాకులు పూర్తయితే తప్ప ఆరో బ్లాక్ పనులుచేసే అవకాశం లేదని ఇంజినీర్లు స్పష్టం చేశారు. నత్తనడకన విద్యుత్ ఏర్పాట్లు తాత్కాలిక సచివాలయం పనులు పూర్తయ్యాక రోజుకు 6 ఎంవీఏ విద్యుత్ అవసరం అవుతుందని అంచనా. ఇందుకోసం విద్యుత్‌శాఖ తాడికొండ, తాడేపల్లి నుంచి విద్యుత్ లైన్ పనులు ప్రారంభించింది. మొత్తం 42 కిలోమీటర్ల దూరం పూర్తిచేయాల్సి ఉంది. ఈ పనులు 50 శాతం మాత్రం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. రాత్రింబవళ్లూ కష్టపడుతున్నా 27 నాటికి పనులు పూర్తయ్యేలా లేవు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రతి బ్లాక్‌లో పవర్ స్విచ్చింగ్ యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందుకు అవసరమైన పనులు ఇంకా ప్రారంభం కాలేదు. భూగర్భ డ్రెయినేజీ ఎక్కడ? హైదరాబాద్ నుంచి తాత్కాలిక సచివాలయానికి వచ్చే అధికారులు మొత్తం సుమారు 2వేల మంది వరకు ఉండొచ్చని సమాచారం. వీరందరూ వినియోగించి వదలివేసే వృథానీరు, మురుగు వెళ్లటానికి భూగర్భ డ్రెయినేజీ, సెప్టిక్ ట్యాంక్‌లు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటికి సంబంధించిన పనులేవీ ప్రారంభం కాలేదు. వర్షపు నీరు వచ్చినా వెలుపలకు వెళ్లే అవకాశం లేదు. ఈ పనులు పూర్తి చేయాలంటే సుమారు నెలరోజులకుపైనే పడుతుందని ఇంజినీర్లు చెబుతున్నారు. నీళ్లెప్పుడొస్తాయి? ఆంధ్రప్రదేశ్ సచివాలయ సిబ్బంది, కార్యాలయ అవసరాల కోసం రోజుకు 7 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంది. ఈ నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలనే విషయంపై ఇంతవరకు అధికారుల్లో స్పష్టత లేదు. కొందరు అధికారులు తుళ్లూరు ఎత్తిపోతల పథకం నుంచి పైపులైన్ ద్వారా తాత్కాలిక సచివాలయానికి తీసుకొస్తామని చెబుతున్నారు. మరికొందరు అధికారులు శాఖమూరు పెలైట్ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. నీటి విషయంపై అధికారులు ఇప్పటివరకు స్పష్టత లేకపోతే సచివాలయ పనులు పూర్తయినా ప్రయోజనం శూన్యమే. -
వెలగపూడిలో ఎన్టీఆర్ క్యాంటీన్
విజయవాడ : నూతన రాజధాని వెలగపూడిలోఈ నెలాఖరున ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ క్యాంటీన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో క్యాంటీన్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎన్టీఆర్ క్యాంటీన్లపై మంత్రులు నారాయణ, పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే నెలలో మరో రెండు ప్రాంతాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. సీఆర్డీఏ పరిధిలో వీటి నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర సంస్థకు అప్పగించామని తెలిపారు. క్యాంటీన్ల కోసం ఇప్పటికే స్థలసేకరణ పూర్తయిందని, ఒకచోట వంటశాల ఏర్పాటుచేసి అక్కడి నుంచి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన క్యాంటీన్లకు పంపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందిస్తామన్నారు. అల్పాహారంలో ఇడ్లీ-సాంబార్, పొంగల్ మధ్యాహ్నం భోజనంగా లెమన్ రైస్, సాంబార్ రైస్, పెరుగన్నం ఇస్తామన్నారు. మంత్రుల కమిటీ చేసిన ఈ నిర్ణయాలను ముఖ్యమంత్రికి వివరిస్తామని చెప్పారు. -
హైదరాబాద్‌లో ఉంటే కుదరదు: చంద్రబాబు
గుంటూరు : సౌకర్యాల లేవని ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉంటే కుదరదని, అమరావతికి రావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన సోమవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ నిర్మాణపు పనులను పరిశీలించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వీలు అయినంత త్వరలో సచివాలయ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 27కల్లా చాలావరకు నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. ఏ విభాగానికి ఎక్కడ కేటాయిస్తామో ఆయా శాఖలకు సమాచారం ఇస్తామన్నారు. ఉద్యోగులకు అన్ని వసతులు కల్పిస్తామని, ఇంకా ఏం కావాలని చంద్రబాబు ప్రశ్నించారు. ముందుగా కొందరు ఉద్యోగులు వస్తారని, ఆ తర్వాత మరికొందరు వస్తారని ఆయన అన్నారు. తాను బస్సులో పడుకుని పని చేయడం లేదా అని అన్నారు. ప్రభుత్వంతో పాటు, ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటేనే పరిపాలన సజావుగా సాగుతుందన్నారు. మరోవైపు ఉద్యోగుల తరలింపుపై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడుతూ స్థానికత, హెచ్ఆర్ఏపై స్పష్టత రాకపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. రోడ్ మ్యాప్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్లే ఉద్యోగాల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. సమస్యలు పరిష్కరిస్తే తాత్కాలిక రాజధానికి వెళ్లేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని మురళీకృష్ణ తెలిపారు. కొంతమంది ఉద్యోగులు తమ స్వలాభం కోసం ఉద్యోగుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. -
చంద్రబాబు వైఖరి దారుణం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల పట్ల పగబట్టినట్లు వ్యహరిస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్ అన్నారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులు అసంపూర్తిగా ఉన్నాయని, అవిపూర్తి కావాలంటే కనీసం మూడు నెలలు పడుతుందని చెప్పారు. అయినా ఉద్యోగులు ఇక్కడకు రావాల్సిందేనని సిఎం అనడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు వైఖరి శాడిజాన్ని తలపిస్తోందని ఎంఎ గఫూర్ అన్నారు. తన కింద పనిచేస్తున్నారని, తాను ఏం చెప్పినా ఉద్యోగులు చేయాలనుకోవడం దుర్మార్గమని విమర్శించారు. కనీస వసతులు లేని చోట ఉద్యోగులు పనిచేయాలనడం దారుణమని అన్నారు. -
ఉద్యోగులు హైదరాబాద్ వదిలి రావాల్సిందే: బాబు
విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్ వదిలి రావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ జూన్ 27కల్లా మొత్తం వెలగపూడి తరలి రావాల్సిందేనని తెలిపారు. ఉద్యోగులు త్యాగాలు చేయాలని, ప్రజల పరిపాలన కోసం తాను హైదరాబాద్ వదిలి విజయవాడ వచ్చానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం తాము నవ నిర్మాణ దీక్ష చేస్తుంటే వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ ఎన్ని రోజులు అనంతపురం జిల్లాలో తిరిగినా ప్రజలంతా తమవైపూ ఉంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పంచాయతీ నుంచి ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీకే మద్దతిస్తారంటూ ఆయన చెప్పుకొచ్చారు. కష్టకాలంలో అందరూ కలిసి రావాలని చంద్రబాబు కోరారు. రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.