వెలగపూడి నుంచి ఏపీ అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
వెలగపూడి నుంచి అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభం
Feb 27 2017 12:23 PM | Updated on Aug 18 2018 5:15 PM
అమరావతి: వెలగపూడి నుంచి ఏపీ అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి వెలగపూడి చేరుకున్న అసెంబ్లీ ఉద్యోగులకు స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు స్వాగతం పలికారు. అసెంబ్లీ భవనంలో సీటింగ్ తదితర సౌకర్యాలను వారిద్దరూ పరిశీలించారు. కాగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సదుపాయాల కోసం వచ్చే నెల అదనంగా రూ. 50 వేలు మంజూరు చేయనున్నట్లు యనమల చెప్పారు.
Advertisement
Advertisement