సాక్షి, విజయవాడ: ఏపీ అసెంబ్లీ ముట్టడికి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు బుధవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఉద్యోగులును ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
అదే విధంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులును అరెస్టు చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైన అసెంబ్లీని ముట్టడించి తీరుతామని సీపీఎస్ ఉద్యోగులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment