
విజయవాడ: సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగులు చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఆమరణ దీక్ష చేస్తుంటే ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదని సీపీఎస్ ఉద్యోగులు మండిపడ్డారు. దీనిని బట్టి ప్రభుత్వానికి ఉద్యోగులంటే ఎంత నిర్లక్ష్యమో అర్థమౌతోందన్నారు. ఉద్యోగుల్ని మభ్యపెట్టేందుకే కమిటీని తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. కమిటీతో కాలయాపన తప్ప సమస్య పరిష్కారం కాదన్నారు. సమస్యను సీఎం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేసే వారితోనే ఉద్యోగులంతా కలిసి నడుస్తామని చెప్పారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని, సీపీఎస్ రద్దు చేసేంతవరకు దీక్ష కొనసాగిస్తామని ఉద్యోగులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment