‘అధికారపక్షం దౌర్జన్యాలను సభలో నిలదీస్తాం’
అమరావతి: కొత్త శాసనసభలోనైనా ప్రతిపక్షానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మూడేళ్లుగా శాసనసభ సమావేశాలు సజావుగా నిర్వహించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పార్టీ నాయకులతో కలిసి ఆదివారం ఆయన వెలగపూడిలో అసెంబ్లీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక హోదా అంశంపై చర్చకు పట్టుబడతామని పునరుద్ఘాటించారు. అధికారపక్షం దౌర్జన్యాలను సభలో నిలదీస్తామని చెప్పారు. క
రువుతో రాష్ట్రం అల్లాడుతోందని, రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను 14 రోజులకు కుదించాలనుకోవడం సరికాదన్నారు. ఏడాదికి 80 నుంచి 100 పాటు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత కూడా సమావేశాలు నిర్వహించాలని కోరారు. ప్రతిపక్షం చేసే విమర్శలను ప్రభుత్వం సలహాలుగా భావించాలని, ఎదురుదాడి చేస్తే మంచిది కాదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.