
పొన్నూరు: రాజధాని రైతులు పాదయాత్ర తిరుపతికి కాకుండా చంద్రబాబు ఇంటికి చేస్తే ఆయనకు బుద్ధొస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పొన్నూరులోని అంబేడ్కర్ కాలనీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాజధాని రైతుల సమస్యలకు చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించాలన్నారు. ఆనాడు పేదలకు ఇచ్చిన పొలాలను, స్థలాలను బలవంతంగా జీవోలు ఇచ్చి మరీ తీసుకుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పేదలకు మేలు జరుగుతుంటే.. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని కోర్టుల్లో కేసులు వేసి నిలుపుతుంది నిజం కాదా అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య తదితరులు పాల్గొన్నారు.