
'వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం'
విజయవాడ : వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ బుధవారం విజయవాడలో వెల్లడించారు. 26 ఎకరాల్లో సచివాలయం నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు. ఆరునెలల్లో ఈ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
వచ్చే జూన్ నుంచి శాశ్వత రాజధాని నిర్మాణాలు ప్రారంభిస్తామని నారాయణ స్పష్టం చేశారు. సీడ్ క్యాపిటల్ పరిధిలోని రైతులకు అక్కడ భూములు ఇవ్వలేమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన భూములతో కూడిన మాస్టర్ ప్లాన్ విడుదల చేస్తామని నారాయణ చెప్పారు.