సచివాలయంలో సివిల్ డిస్పెన్సరీ
Published Tue, Oct 25 2016 6:05 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
హైదరాబాద్: వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సివిల్ డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రం విడిపోక ముందు హైదరాబాద్ సచివాలయంలో డిస్పెన్సరీ ఉండేది. వెలగపూడిలోని ఏపీ సచివాలయానికి కొత్త డిస్పెన్సరీ అవసరమైంది. అత్యవసర వైద్యంలో భాగంగా ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఇద్దరు అటెండర్లు, ఒక స్వీపర్‌తో మొత్తం తొమ్మిదిమంది ఈ డిస్పెన్సరీలో విధులు నిర్వహిస్తారు.
డిస్పెన్సరీలో సచివాలయ సిబ్బందికి వివిధ రకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉంటాయి. సామాజిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో వైద్యం పొందే అవకాశం ఉంటుంది. సచివాలయంలో రెండు వేల మంది సిబ్బంది ఉండటంతో పాటు పలువురు అధికారులు కూడా ఇక్కడకు వచ్చివెళ్తుంటారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ డిస్పెన్సరీ పని చేస్తుంది. కాగా ఈ డిస్పెన్సరీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ పరిధిలోకి వస్తుంది. తాజాగా ఏర్పాటు చేయనున్న డిస్పెన్సరీకి సిబ్బందిని కూడా వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న వారినే డెప్యుటేషన్ మీద నియమించనున్నట్టు తెలిసింది.
Advertisement
Advertisement